narayana school
-
హైదరాబాద్: నారాయణ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇటీవల విద్యార్థుల బలవన్మరణాల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పలు కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మంగళవారం.. హయత్‌నగర్‌లో నారాయణ స్కూల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడో తరగతి విద్యార్థి లోహిత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హయత్‌నగర్ నారాయణ స్కూల్లో హాస్టల్ ఘటన జరిగింది.విద్యార్థి మృతిపై నారాయణ యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెబుతోంది. ఫిజిక్స్ టీచర్ వేధింపుల వల్లే తమ కుమారుడు ఉరి వేసుకున్నాడని.. ఫిజిక్స్ టీచర్ క్లాస్ లీడర్‌తో మా కుమారుడిని కొట్టించాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ ఎదుట భారీగా పోలీసులు మోహరించారు.కాగా, సాధారణంగా పలు కాలేజీల్లోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండటం.. ఒంటరితనంతో బాధపడుతుండటం.. వేరే వారితో వెంటనే కలవలేకపోవడం వంటి కారణాలతో ఇలాంటి సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.ఇక, హాస్టళ్లలో ఉండే వారికి ఎప్పుడూ చదువు గురించే చెబుతుండటం.. విశ్రాంతి లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు స్టడీ అవర్స్, క్లాసులు, హోంవర్కు.. రాత్రి చాలా ఆలస్యంగా పడుకొని, ఉదయమే నిద్రలేచి మళ్లీ క్లాసులు ఇలా తీవ్ర ఒత్తిడి తెస్తుంటారని, అందుకే విద్యార్థుల్లో తెలియని నైరాశ్యం ఏర్పడుతోందని అంటున్నారు. -
నారాయణ... నారాయణ!
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆయనో మండల విద్యాధికారి. కీలకమైన కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు. పదవీ విరమణ సమయం ఆసన్నమైంది. అదే సాకు చూపెట్టి భారీ వసూళ్లకు తెరలేపారు. అందుకు ఉపాధ్యాయ యూనియన్ నేతలు నడుంబిగించారు. రిటైర్మెంట్ ఫంక్షన్ భారీగా నిర్వహించాలంటూ తెరపైకి వచ్చారు. టీచర్లను వ్యక్తిగతంగా కలుస్తూ రూ.2 వేలు తక్కువ లేకుండా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చందా పుస్తకాలు చేతబట్టుకొని మరీ అయ్యవార్ల వద్దకు వెళ్తున్నారు. ఇదేంటీ ఎంత ఇవ్వాలో కూడా మీరే నిర్ణయిస్తారా? అని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దూషణలకు దిగుతున్నారు. సుధీర్ఘకాలం పనిచేసి రిటైర్డ్ అవుతున్న అధికారిని సన్మానించుకోవడం సముచితమే. పదవీ విరమణ సందర్భంలో అప్పటివరకు అందించిన సేవలకు గుర్తుగా ఆ ఉద్యోగులు వ్యక్తిగతంగా గౌరవించుకోవడం అనవాయితీ. కాగా తద్భిన్నమైన పరిస్థితులను ఉపాధ్యాయ సంఘాల నేతలు తెరపైకి తెచ్చారు. ఎంఈఓగా రిటైర్డ్ అవుతున్న ఓ అధికారికి సన్మానం పేరిట వసూళ్లకు తెరలేపారు. దాదాపు 440 మంది ఉపాధ్యాయులుడగా అందరీతో చందా రాబట్టాలనే దిశగా గుంపుగా వెళ్తూ విడివిడిగా అయ్యవార్లను కలుస్తున్నారు. యూనియన్ నేతల్ని చూసి తలాడించేవారు కొందరైతే, అంతే ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏమిటనీ మరి కొందరు నిలదీస్తున్నారు. అలాంటి వారితో గొడవలకు దిగడం యూనియన్ నేతల వంతైంది. మరోవైపు ప్రవేటు పాఠశాల యాజమాన్యాలను సైతం వదిలిపెట్టడం లేదు. జిల్లా విద్యాధికారి, పాఠశాల విద్యా రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఈవ్యవహారంపై దృష్టి సారించి చందాలు పేరిట టీచర్లను బెదిరిస్తున్న యూనియన్ నేతల్ని కట్టడి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. -
‘నారాయణ’లో విద్యార్థి ఆత్మహత్య
మధురవాడ (విశాఖజిల్లా): నారాయణ క్యాంపస్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం పట్టణంలోని పీఎస్ఎన్ఎం స్కూలు సమీపంలో నివాసం ఉంటున్న నెల్లూరు రవికుమార్, ఆయన భార్య మార్కెటింగ్ శాఖలో పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా, చిన్న కుమారుడు నెల్లూరు అఖిల్ వినాయక్(15)ను విశాఖలోని నారాయణ విద్యాసంస్థలో 6వ తరగతి నుంచి చదివిస్తున్నారు. ప్రస్తుతం పీఎంపాలెంలోని క్యాంపస్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం గణతంత్ర వేడుకలకు సహచర విద్యార్థులు వెళ్లగా, నిఖిల్ మాత్రం హాస్టల్ రూము నంబరు 203లోనే ఒంటరిగా ఉన్నాడు. సుమారు 10.15 గంటల సమయంలో జెండా వందనం కార్యక్రమం పూర్తయి సహచర విద్యార్థులు వచ్చేసరికి నిఖిల్ వినాయక్ గదిలో ప్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని ఉన్నాడు. అతడిని వైద్యం నిమిత్తం గాయత్రి ఆస్పత్రికి యాజమాన్యం తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. నిఖిల్ ప్యాంటు కుడి జేబులో ‘నా చావుకి నేనే కారణం. పదో తరగతి ఫెయిల్ అవుతాననే భయంతో చస్తున్నాను.. ’ అని రాసిన లేఖ ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే నా కుమారుడు మృతి ‘బాగా చదువు చెబుతారని ఏడాదికి రూ.2లక్షలు ఫీజు కట్టి నారాయణ పీఎంపాలెం క్యాంపస్‌లో చేర్పించాను. నా కుమారుడు నిఖిల్‌పై గత ఏడాది ఆగస్టు 7వ తేదీన సహచర విద్యార్థులు దాడి చేయగా, బాగా దెబ్బలు తగిలాయి. ఫిట్స్ కూడా వచ్చాయి. నాలుగు నెలలు ఇంటి వద్దే ఉంచాం. ఆ తర్వాత మళ్లీ ఇక్కడికి తీసుకొచ్చాం. గత ఏడాది గొడవ జరిగినప్పుడు ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అప్పుటి నుంచే నిఖిల్ ఆరోగ్యం పాడైంది. ఈ నెల 21న నిఖిల్ జ్వరంతో బాధపడుతున్నాడని వార్డెన్ శ్రావణ్ ఫోన్ చేసి చెప్పారు. రూ.వెయ్యి ఫోన్ పే ద్వారా పంపించగా, వైద్యం చేయించారు. అనారోగ్యానికి గురైన నిఖిల్‌ను ఒంటరిగా గదిలో మేనేజ్మెంట్ వదిలేసింది. ఉదయం 10.15 గంటలకు ఫ్యాన్‌కు వేలాడుతున్నాడని గుర్తించినా, 10.45 గంటల వరకు ఆస్పత్రికి తీసుకువెళ్లలేదు. కనీసం 108 అంబులెన్స్‌కు కూడా ఫోన్ చెయ్యలేదు. పక్కనే ఆస్పత్రి ఉన్నా, హాస్టల్ వ్యాన్‌లో గాయత్రి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నా కుమారుడి మృతికి నారాయణ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం. మృతిపై కూడా అనుమానాలు ఉన్నాయి. మేనేజ్మెంట్ ఒత్తిడి లేదా ఇంకా ఏమైనా జరిగి ఉండవచ్చు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.– నెల్లూరి రవికుమార్, విద్యార్థి నిఖిల్ వినాయక్ తండ్రి, శ్రీకాకుళం -
Thandur: నారాయణ స్కూల్ బరితెగింపు
‘‘అడిగినంత కట్టకపోతే విద్యార్థుల పేర్లను బ్లాక్ లిస్టులో చేర్చుతాం.. కంప్లయింట్ చేస్తారా?.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి’’.. వికారాబాద్ జిల్లా తాండూరులో నారాయణ స్కూల్ యాజమాన్యం తీరు ఇది. అధిక ఫీజులతో వేధింపులకు పాల్పడుతుండడం తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగు చూసింది. దీంతో విద్యాశాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో సదరు నారాయణ స్కూల్ యాజమాన్యం నిబంధనల్ని తుంగలో తొక్కి వ్యవహరిస్తున్న తీరూ బయటపడింది. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు అమలు చేసినా ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై నిబంధనలు ఉన్నా పాఠశాల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. వికారాబాద్ జిల్లా తాండూరులో నారాయణ పాఠశాల యాజమాన్యం బరితెగింపునకు దిగింది. ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై వేధింపులకు గురిచేస్తుంది. నిబంధనలుకు విరుద్ధంగా ఫీజులు కట్టాలని ఒత్తిడికి పాల్పడుతుంది. ఫీజులు కట్టక పోతే విద్యార్థుల పేర్లను బ్లాక్ లిస్టులో పెడతామని తల్లిదండ్రులపై బెదిరింపులకు పాల్పడుతోంది. తల్లిదండ్రులు ప్రశ్నిస్తే.. ఎవరికి ఫిర్యాదు చేస్తారో చేసుకోండి.. అధికారులు మమల్ని ఏమీ చేయలేరంటూ జులుం ప్రదర్శిస్తోంది. పాఠశాల యాజమాన్యం తీరుపై విసుగెత్తిపోయిన తల్లిదండ్రులు వికారాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసి మరీ.. పిల్లలకు అంగీకరించిన ఫీజుల కంటే ఎక్కువ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు వాళ్లు. తల్లిదండ్రులు కట్టమని చెబితే.. దుర్భాషలాడుతున్నారని, పిల్లల విద్యాసంవత్సరం నష్టపోయేలా చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫీజుల విషయంలో నిబంధనలు పాటించని నారాయణ స్కూల్ పిన్సిపాల్. యాజమాన్యంపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు.. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటికే స్కూల్‌కు అపాలజీ నోటీసు ఇవ్వడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ స్కూల్‌కు ఏడవ తరగతి వరకే అనుమతి ఉండగా.. పదో తరగతి వరకు తరగతులు నిర్వహిస్తోంది. ఈ విషయంపై అధికారులు స్పందన దాటవేయడం గమనార్హం. -
నారాయణ స్కూల్ వాచ్‌మన్ పైశాచికం
విశాఖపట్నం: ఓ ప్రైవేట్ పాఠశాల వాచ్‌మన్ బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... కూర్మన్నపాలెం నారాయణ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న బాలిక శనివారం సాయంత్రం తరగతులు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం తోటి స్నేహితులతో ఆడుకుంటూ వేచి ఉంది. అదే స్కూల్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ఆదిలాబాద్‌కు చెందిన అలకోటి పోచన్న (48) బాలికను మాయమాటలతో స్కూల్లో ఉన్న బాత్రూమ్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాలిక గట్టిగా అరవడంతో వాచ్‌మన్ అక్కడి నుంచి పారిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు వివరించారు. బాలిక శరీరంపై గాయాలు ఉండడంతో కోపోద్రోక్తులైన బాలిక తల్లిదండ్రులు వాచ్‌మన్‌ను పట్టుకునేందుకు ప్రయతి్నంచారు. కానీ అప్పటికే స్కూల్ మూసివేయడం, తరువాతి రోజు ఆదివారం స్కూల్‌కు సెలవు కావడంతో అతడు దొరకలేదు. సోమవారం స్కూల్ తెరిచిన వెంటనే వాచ్‌మన్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుడు స్కూల్ వెనుక ప్రాంతంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నారాయణ స్కూల్ విద్యార్థి అదృశ్యం
తగరపువలస(విశాఖపట్నం జిల్లా): భీమిలి మండలం తాళ్లవలస నారాయణ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో 9వ తరగతి విద్యార్థి అజ్జరపు వెంకట హేమశేఖర్(14) మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో స్కూల్ నుంచి అదృశ్యమయ్యాడు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి నారాయణ విద్యా సంస్థల హాస్టల్లో ఉంటున్నాడు. స్కూల్ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి తిరిగి రాకపోవడంతో తండ్రి వెంకట సాయిరమణ ఆందోళన వ్యక్తం చేస్తూ భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంధువులు, చుట్టుపక్కల స్నేహితుల ఇళ్లలోనూ వెతికారు. దీనిపై స్కూల్ యాజమాన్యం నోరు మెదపడం లేదని కుటుంబ సభ్యులు వాపోయారు. స్కూల్ నుంచి బయటకు వెళ్లిన సమయంలో హేమశేఖర్ బ్లూ జీన్ ఫ్యాంటు, గళ్ల చొక్కా, మాస్క్ ధరించి ఉన్నట్టు స్కూల్ సీసీ కెమెరాల్లో నమోదయింది. భీమిలి హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మహిళతో వివాహేతర సంబంధం.. సెల్‌ఫోన్ చార్జర్ వైర్‌తో ఆమె పిల్లలపై.. -
మారవా.. నారాయణా!
కదిరి: నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుంది.. కదిరిలోని నారాయణ పాఠశాల యాజమాన్యం తీరు. పిల్లల ప్రాణాలు పణంగా పెడుతూ ఓ పెట్రోల్ బంకు పక్కన ఏర్పాటు చేసిన ఈ పాఠశాలను తొలగించాలని ఇప్పటికి అనేక సార్లు అధికారులు, కొందరు ప్రజాప్రతినిధులు స్వయంగా హెచ్చరించినా తీరు మాత్రం మారలేదు. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకూ తరగతులు నిర్వహిస్తున్నారు. సుమారు 3 వేల మందికి పైగా చిన్నారులు చదువుతున్నారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే జరిగే నష్టం ఎవరూ ఊహించలేం. మమ్మల్నేం చేయలేరు..! పెట్రోలు బంక్ పక్కనే నిర్వహిస్తున్న నారాయణ స్కూల్‌ను మూసేయాలంటూ పలు విద్యార్థి సంఘాలతో పాటు కుల సంఘాల నాయకులు ఇప్పటికే అనేక సార్లు ధర్నాలు చేపట్టారు. టీడీపీ హయాంలో ఎన్నో సార్లు నిరసనలకు దిగారు. కానీ అప్పటి ప్రభుత్వంలో అన్నీ తానై చక్రం తిప్పిన నారాయణ అవేమీ పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పట్లో విద్యాశాఖా మంత్రిగా ఉన్న సాకే శైలజానాథ్ స్వయంగా పాఠశాలను సందర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా పెట్రోలు బంక్ పక్కనే నారాయణ స్కూల్ ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. వెంటనే పాఠశాలను మూసివేయాలని కూడా ఆదేశించారు. కానీ ఆ తర్వాత చర్యలు మాత్రం శూన్యం. పాఠశాలను మూసివేయాలంటూ గతంలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు నాగన్నతో పాటు మరికొందరు స్థానిక ఎంఈఓ కార్యాలయం ముందు నెలల తరబడి రిలే నిరాహార దీక్షలు కూడా చేశారు. కానీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. నోటీసులైతే లెక్కలేనన్ని సార్లు అధికారులు పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. అయినా, వారు పాఠశాలను మూసివేయనూ లేదు. వేరే చోటుకు తరలించనూ లేదు. అడ్మిషన్లూ నిబంధనలకు విరుద్ధంగానే.. 2022–23 విద్యాసంవత్సరం మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. అయితే వేసవి సెలవుల్లోనే ఆ పాఠశాలలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇలా అడుగడుగునా నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న నారాయణ పాఠశాల యాజమాన్యంపై కలెక్టర్ బసంత్‌కుమార్ అయినా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దీక్ష చేపడతాం నారాయణ స్కూల్‌ను సీజ్ చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నాం. ఇప్పటి దాకా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మా మాటలు అధికారులకు చెవిటోని ముందు శంఖం ఊదినట్టు ఉన్నాయి. ఈసారి నిర్వహిస్తే పాఠశాల ముందే దీక్ష చేపడతాం. – రాజేంద్ర ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అధికారులే మార్పించాలి గ్యాస్ సిలిండర్ పేలితేనే పెద్ద మొత్తంలో ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగిన సంఘటనలున్నాయి. పెట్రోల్ బంక్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే తీవ్రత ఇంకెంత ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. అందుకే మా బాబును అక్కడ చేర్పించలేదు. అధికారులు ఈసారైనా ఆ బడిని మార్చేసేలా చర్యలు తీసుకోవాలి. – యాదవేంద్ర యాదవ్, కదిరి పాఠశాల నిర్వహిస్తే సీజ్ పెట్రోలు బంక్ పక్కన నారాయణ పాఠశాల నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం. ఆ పాఠశాల నిర్వాహకులకు దీనిపై నోటీసులు కూడా ఇచ్చాం. ఈసారి అక్కడే పాఠశాల నిర్వహిస్తే సీజ్ చేయడం ఖాయం. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అక్కడ అడ్మిషన్ చేసే ముందు ఒకసారి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. – చెన్నకృష్ణ, ఎంఈఓ, కదిరి (చదవండి: యువకుడి దారుణహత్య) -
అరటి పండ్లు అమ్మిన టీచర్; శిష్యుల సాయం
నెల్లూరు (టౌన్): అడ్మిషన్లు చేయలేదన్న కారణంగా ఓ ఉపాధ్యాయుడిని నారాయణ విద్యాసంస్థలు ఉద్యోగం నుంచి తొలగిస్తే.. ఆయన శిష్యులు ఆదుకునేందుకు ముందుకువచ్చారు. ఉద్యోగం పోయిన సదరు ఉపాధ్యాయుడు అరటి పండ్లు అమ్ముకుంటున్న వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. నెల్లూరు వేదాయపాళెంలోని నారాయణ స్కూల్లో వెంకటసుబ్బయ్య ఉపాధ్యాయునిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి తెలుసుకుని పూర్వ విద్యార్థులు తమ గురువుకి రూ. 86,300 ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా వైఎస్సార్ సీపీ యువజన సోషల్ మీడియా ఆధ్వర్యంలో రూ. 20 వేలు అందజేశారు. అమెరికా నుంచి శ్యామ్ అనే వ్యక్తి రూ. 50 వేలు వెంకటసుబ్బయ్య ఖాతాలో జమ చేశారు. (‘నారాయణ’ టీచర్.. అరటి పండ్లు అమ్ముకుంటూ) -
'నారాయణ స్కూల్'కు నోటీసులు
నెల్లూరు (టౌన్): అడ్మిషన్లు చేయనిదే జీతాలు ఇవ్వలేమని చెప్పిన నారాయణ స్కూల్ యాజమాన్యానికి ఆదివారం డీఈ ఓ జనార్దనాచార్యులు నోటీసులు జారీ చేశారు. ఆదివారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన ‘అడ్మిషన్లు చేయలేదా.. మీ సేవలు అక్కర్లేదు’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. నగరంలోని స్టోన్‌హౌస్‌పేట నారాయణ స్కూల్లో ఉపాధ్యాయులకు అడ్మిషన్లు అప్పజెప్పడం, జీతాలు ఎందుకు ఇవ్వలేదో రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. -
నారాయణ ఈ టెక్నో స్కూల్‌పై కేసు
ఒంగోలు: నగరంలోని నారాయణ ఈ టెక్నో స్కూల్‌పై జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్ సుబ్బారావు ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. డీఈవో కథనం ప్రకారం.. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో అన్ని యాజమాన్యాల్లోని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకూ సెలవులు ప్రకటించింది. అంజయ్య రోడ్డులోని నారాయణ ఈ టెక్నో స్కూల్లో ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నారు. సమాచారం అందుకున్న డీఈవో సుబ్బారావు అప్రమత్తమై పోలీసులతో కలిసి గురువారం పాఠశాలకు వెళ్లి తనిఖీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా పాఠశాలను తెరవడం, ఉపాధ్యాయులను బలవంతంగా పాఠశాలకు పిలిపించి ఆన్లైన్లో పాఠాలు బోధించడంతో పాటు వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు డీఈవో గుర్తించారు. ఇందుకు బాధ్యులుగా నారాయణ ఈ టెక్నో స్కూల్, అంజయ్య రోడ్డు ప్రిన్సిపాల్ అల్లం కిరణ్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కంచిబొట్ల బాలాజీ, స్టాఫ్ టీచర్ షేక్ షర్మిల, ఉపాధ్యాయుడు ఎ.ప్రశాంత్‌కుమార్‌లను గుర్తించి వారిపై పోలీసులకు డీఈవో ఫిర్యాదు చేశారు. మార్కాపురంలో కూడా.. మార్కాపురం: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్థానిక నారాయణ స్కూల్ యాజమాన్యం గురువారం పాఠశాలను తెరిచి ఉంచింది. గమనించిన కొందరు జిల్లా విద్యాశాఖాధికారికి ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్థానిక ఎంఈవో రాందాస్ నాయక్‌ను స్కూల్ వద్దకు పంపారు. స్కూల్ తెరిచి ఉండటాన్ని ఎంఈవో గుర్తించారు. వెంటనే పట్టణ పోలీసుస్టేషన్లో ఎంఈవో ఫిర్యాదు చేశారు. ట్రైనీ డీఎస్పీ స్రవంతి రాయ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కరోనా పోరులో ఇదేం కక్కుర్తి ‘నారాయణ’!
కందుకూరు రూరల్: కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రం లాక్ డౌన్లో ఉంది. 144 సెక్షన్ అమలులో ఉంది. విద్యా సంస్థలన్నీ మూతబడ్డాయి. ఇవేమీ పట్టని నారాయణ స్కూల్ యాజమాన్యం పదో తరగతి విద్యార్థినులకు తరగతులు నడుపుతున్నారు. అధిక ర్యాంకుల సాధించాలనే ఉద్దేశంతో ఇలాంటి కక్కుర్తిని ప్రదర్శించింది. పట్టణంలోని తూర్పు వడ్డెపాలెంలో అదే పాఠశాలలో పదో తరగతి చదివే ఓ విద్యార్థినీ ఇంటిని తీసుకొని రహస్యంగా పదో తరగతి విద్యార్థినులకు పాఠాలు బోధిస్తున్నారు. మూడు నాలుగు రోజుల నుంచి ఇలా జరుగుతుందని తెలుసుకున్న వార్డు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు కందుకూరు పట్టణ ఎస్సైకు సమాచారం ఇచ్చారు. ఎస్సై తిరుపతిరావు తనిఖీ చేయగా ఒక చిన్న గదిలో సుమారు 25 మంది బాలికలకు తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో టీచింగ్ స్టాఫ్ ఐదుగురిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణ చేపడతామని ఎస్సై తెలిపారు. దీనిపై నారాయణ పాఠశాలకు ఎంఈఓ జి.పెద్దిరాజు మెమో జారీ చేశారు. -
తనిఖీల కొరడా.. రికార్డులు గల్లంతు
తిరుపతి ఎడ్యుకేషన్ : ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ దిశగా రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం లోపు ఫీజు నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో గురువారం తిరుపతి, శ్రీకాళహస్తిలోని 9ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలను కమిషన్ సభ్యుడైన కడప ఆర్జేడి కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ నాగేశ్వరరావు నేతృత్వంలో 20మంది వైఎస్సార్ జిల్లా ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పలు అక్రమాలు బట్టబయలయ్యాయి. తనిఖీ చేసిన ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలు కమిషన్ ఆధ్వర్యంలో తిరుపతిలో 8, శ్రీకాళహస్తిలో ఒకటి, మొత్తం 9ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో తనిఖీలు చేశారు. తిరుపతిలో జీఎస్ మా డవీధిలోని శ్రీచైతన్య, కరకంబాడిరోడ్డులోని స్ప్రింగ్‌డేల్, భవానీనగర్‌లోని సిల్వర్ ఓక్స్, శివజ్యోతినగర్‌లోని రత్నం, ముత్యాలరెడ్డిపల్లెలోని నారాయణ, కేశవరెడ్డి, హథీరాంజీ కాలనీలోని భాష్యం, రవీంద్రభారతి, శ్రీకాళహస్తిలో నారాయణ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో ఈ తనిఖీలు చేశారు. రికార్డులు గల్లంతు ఒక్కో పాఠశాలకు ఇద్దరు చొప్పున కమిషన్ ప్రతినిధులు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన తనిఖీల్లో పలు అక్రమాలు వెలుగుచూశాయి. కమిషన్ ప్రధానంగా ఫీజులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, సిబ్బంది, తరగతి గదులు, భవనం, క్రీడా మైదానం, విద్యాబోధన, మౌలిక వసతులు తదితర అంశాలపై దృష్టి సారించారు. ప్రభుత్వ గుర్తింపునకు సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించారు. అయితే చాలా పాఠశాలల్లో రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదని గుర్తించారు. అలాగే ఉపాధ్యాయులు, సిబ్బందికి జీతభత్యాలు చెల్లించే రికార్డులు లేనట్లు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అదనపు తరగతులు నిర్వహించడం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగినన్ని టాయ్లెట్లు లేకపోవడం, క్రీడా మైదానం లేకపోవడం వంటి అంశాలు వెలుగుచూశాయి. ఒకే తరగతిలో ఒక్కో విద్యార్థి నుంచి ఒక్కో రకంగా ఫీజులు వసూలు చేసినట్లు గుర్తించారు. అలాగే రికార్డులు కాగితాలకే పరిమితమైనట్లు గుర్తించారు. పలు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించారు. వీటన్నింటినీ కమిషన్ బృందం నోట్ చేసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపనుంది. ఈ నెలాఖరులోపు జూనియర్ కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్టు సమాచారం. క్రీడామైదానం లేని నారాయణ ప్రైవేట్ పాఠశాల భవనం -
శ్రుతిమించిన ‘నారాయణ’ దండన
కర్నూలు (ఓల్డ్‌సిటీ): క్రమశిక్షణ పేరుతో కొన్ని కార్పొరేట్ స్కూళ్లు శ్రుతిమించిన దండనను అమలు చేస్తున్నాయి. హోం వర్క్ రాయలేదని, అల్లరి చేస్తున్నారని చిన్నారులను చితకబాదడం ఇక్కడ పరిపాటిగా మారింది. కర్నూలు గాయత్రి ఎస్టేట్‌లోని నారాయణ స్కూల్లో మంగళవారం సాయంత్రం ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. కర్నూలు లక్ష్మీనగర్‌కు చెందిన శివనాయక్, కవితాబాయి కుమారుడు రిత్విక్ నాయక్ ఈ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం తరగతి గదిలో అల్లరి చేస్తుండడంతో ఓ మహిళా టీచరు ప్యాడ్‌తో విద్యార్థి తలపై కొట్టారు. తీవ్ర గాయం కావడంతో విద్యార్థి తల్లిదండ్రులు, ట్రైబల్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు చంద్రప్ప మూడో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలుడిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయం డీఈఓ దృష్టికి తీసుకెళ్లేందుకు సాయంత్రం నుంచి ప్రయత్నిస్తున్నా స్పందించలేదని తల్లిదండ్రులు, ట్రైబల్ విద్యార్థి సంఘం నేత పేర్కొన్నారు. తక్షణమే అధికారులు స్పందించి విద్యార్థిని గాయపరిచిన టీచర్‌తో పాటు నారాయణ పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
నారాయణ స్కూల్లో టీచర్ నిర్వాకం
సాక్షి, అనంతపురం : విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు గాడి తప్పాడు. విచక్షణ మరిచి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన అయ్యవారికి దేహశుద్ధి జరిగింది. వివరాల్లోకి వెళితే.. నారాయణ స్కూల్లో సైన్స్ టీచర్‌గా పని చేస్తున్న కార్తీక్ ...వాట్సప్ ద్వారా ఎనిమిదో తరగతి విద్యార్థినికి అశ్లీల పోస్టింగ్స్, మెసేజ్‌లు పంపించాడు. ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థిని తల్లిదండ్రులు...రెండు రోజుల క్రితం కీచక టీచర్‌ను నిలదీశారు. అయితే అతగాడు బుకాయించడంతో ఆగ్రహించిన విద్యార్థిని బంధువులు దేహశుద్ధి చేశారు. ఇంత జరిగినా ఈ విషయాన్ని నారాయణ స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించకుండా గోప్యంగా ఉంచింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నారాయణ స్కూల్‌ను సీజ్ చేసిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, విజయవాడ : గుర్తింపులేని స్కూళ్లపై విద్యాశాఖ కొరడా ఝుళిపిస్తోంది. విజయవాడ, సత్యనారాయణపురంలో గుర్తింపు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న నారాయణ స్కూల్‌ను బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఇప్పటికే ఈ విషయమై యాజమాన్యానికి మూడుసార్లు నోటీసులు ఇచ్చినా వైఖరి మారకపోవడంతో సీజ్ చేసి, లక్ష రూపాయల జరిమానా విధించారు. వేసవి సెలవులు ముగించుకుని నేడు (బుధవారం) స్కూళ్లు పునఃప్రారంభం అవుతుండటంతో విద్యాశాఖ గుర్తింపు లేని పాఠశాల ఏరివేతకు చర్యలు చేపట్టింది. ప్రైవేటు కాలేజీలు, స్కూళ్ల ఫీజుల నియంత్రణకు కమిషన్ వేయడంతో పాటు అర్హులైన పేదలందరినీ ‘అమ్మ ఒడి’ ద్వారా ఆదుకుంటామని కొత్తగా కొలువుదీరిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తొలి కేబినేట్ సమావేశంలోనే విద్యాశాఖలో సంస్కరణలపై ‘రెగ్యులేటరీ కమిషన్’ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. చదవండి : ‘ప్రైవేటు’ ఫీజులపై నియంత్రణ -
ఎమ్మెల్యే ఇసుక దందానే విద్యార్థుల మృతికి కారణమా..?
సాక్షి, రేపల్లె(నగరం): గుంటూరు జిల్లా రేపల్లె మండల పెనుమూడి కృష్ణానదీ తీరంలో విషాదం చోటుచేసుకుంది. నదిలోకి ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. పట్టణ సీఐ జి.నారాయణ కథనం ప్రకారం పట్టణానికి చెందిన నారాయణ స్కూల్‌కు చెందిన 12 మంది 9వ తరగతి విద్యార్థులు పెనుమూడి కృష్ణానదీ తీరానికి వెళ్లారు. స్కూల్ వార్షికోత్సవం కోసం శనివారం సాయంత్రం డ్యాన్స్ పోటీలకు ప్రాక్టీస్ పూర్తిచేసుకుని సరదాగా పెనుమూడి రేవుకు ఈతకు వెళ్లారు. ఈత వేస్తున్న సమయంలో ఒక్క సారిగా రేపల్లె మండలం బేతపూడి గ్రామానికి చెందిన కుమ్మరిగుంట ప్రణతమ్(14), నిజాంపట్నం మండలం తోటకూరవారిపాలెం గ్రామానికి చెందిన తోటకూర నరసింహం(14) మునిగిపోయారు. తోటి విద్యార్థులు కేకలు వేయటంతో సమీపంలో ఉన్న మత్స్యకారులు విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేశారు. తొలుత నరసింహాన్ని మత్స్యకారులు కాపాడి ఒడ్డుకు చేర్చారు. వెంటనే 108 ద్వారా రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. నరసింహం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం స్థానిక ప్రవేటు ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్న సమయంలో నరసింహం మృతి చెందాడు. నీట మునిగిన రెండో విద్యార్థి ప్రణితమ్ మత్స్యకారులు వెలికి తీయగా అప్పటికే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ప్రణతమ్ తల్లితండ్రులు రెండు గ్రామాల్లో విషాదం రేపల్లె మండలం బేతపూడి గ్రామానికి చెందిన కుమ్మరిగుంట రత్నశేఖర్, కమలాకుమారి దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు ప్రణతమ్ 9వ తరగతి చదువుతున్నాడు. కొడుకు మృతి చెందటంతో ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంట తడిపెట్టించింది. నిజాంపట్నం మండలం తోటకూరవారిపాలెం గ్రామానికి చెందిన తోటకూర వెంకట్రావ్, రేణుకాదేవి దంపతులకు ఇద్దరు సంతానం. నరసింహం పెద్దకుమారుడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన వెంకట్రావ్ కష్టపడి పిల్లలను చదివించుకుంటున్నాడు. ఇద్దరు విద్యార్థుల దుర్మరణంతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. విద్యార్థుల ఉసురు తీసిన ఎమ్మెల్యే ఇసుక దందా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అక్రమ ఇసుక దందా ఇద్దరి విద్యార్థుల ఉసురుతీసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెనుమూడి రేవులో అక్రమంగా ఇసుకతీతకు భారీ డ్రెజ్జర్లను ఉపయోగించటంతో తీరం వెంబడి భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఈ విషయం తెలియని చిన్నారులు తీరంలో కొంత దూరం వెళ్లగానే భారీ అగాధంలో పడి మృత్యువాత పడ్డారని ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం తెలుస్తున్నది. డ్రెజ్జర్లతో ఇసుకను తోడుతున్న విషయాన్ని ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు వెన్నుకాయటంతో నేటికి ఆయన ఆగడాలకు అడ్డుఆపు లేకుండా పోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
నారాయణ పాఠశాల వద్ద ఆందోళన
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: విద్యార్థినులను దుర్భాషలాడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని స్థానిక నారాయణ పాఠశాలలో విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు బుధవారం ఆందోళనకు దిగారు. ఆందోళన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక నారాయణ పాఠశాలలో లక్ష్మీ ప్రసన్న పదో తరగతి చదువుతుండగా ఆమె చెల్లెలు సుప్రజ 6వ తరగతి చదువుతోంది. ఇటీవల తుపాను కారణంగా వీరిద్దరూ ఒక రోజు పాఠశాలకు రాలేదు. మరునాడు పాఠశాలకు వచ్చిన వీరిని ఉపాధ్యాయులు దుర్భాషలాడుతూ దూషించారు. ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు పాఠశాలలో ప్రిన్సిపాల్‌ను, ఉపాధ్యాయులను అడిగేందుకు రాగా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో విద్యార్థినుల తండ్రి కె.రాంబాబు, తల్లి సీతామహాలక్ష్మి, బంధువులు ఆందోళనకు దిగారు. పాఠశాల ముందు వీరు బైఠాయించి తమకు న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని భీష్మించారు. పాఠశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఉపాధ్యాయులు లేరని, బోధన సరిగా లేదని వీరు ఆరోపించారు. అంతేగాక ఒక తెల్లకాగితంపై తమ పిల్లల 10/10 జీపీఏ రాకపోయినా పర్వాలేదని, తమను రాసిమ్మని ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఇక్కడ చదివే కొంతమంది విద్యార్థులను విజయవాడ నారాయణ పాఠశాలకు పంపుతున్నామని దీనికి అదనంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈ విధంగానే కొంతమంది విద్యార్థులను విజయవాడ పాఠశాలకు తరలించారని, ఇక్కడ పాఠశాలలో చేర్పించుకుని విద్యార్థులను అక్కడకు తరలిస్తున్నారని, దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, బంధువులు బైఠాయించడంతో ఎస్సై ఎ.దుర్గారావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే తనకు న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదంటూ తల్లిదండ్రులు రాంబాబు, సీతా మహాలక్ష్మి కచ్చితంగా చెప్పడంతో విజయవాడ నుంచి నారాయణ విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డీన్ భవానీ శంకర్ వస్తున్నారని, సమస్యను పరిష్కరిస్తారని ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు ఎస్సైకు వివరించారు. దీంతో ఎస్సై తల్లిదండ్రులతో మాట్లాడి భవానీ శంకర్ వచ్చేంత వరకు ఆందోళన విరమించి ఆయన సమక్షంలో సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. సాయంత్రానికి విజయవాడ నుంచి భవానీ శంకర్ వచ్చి విద్యార్థుల ఇంటికి వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు. ఇకపై విద్యార్థినులకు ఎటువంటి ఇబ్బంది కలగనీయమని, భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని, పాఠ్యాంశాల బోధన విషయంలో కూడా పూర్తిస్థాయి సిబ్బందిని ఏర్పాటు చేశామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. విద్యార్థినులు, వారి తల్లితండ్రులతో మాట్లాడి సమస్య పరిష్కరించామని భవానీ శంకర్ విలేకరులకు తెలిపారు. -
నారాయణలో నిబంధనలకు పాతర
నగరంలోని నవాబుపేటలో ఓ వ్యక్తి ఇల్లు నిర్మించుకున్నారు. తన కుమారుడి కుటుంబంతో పాటు ఆయన కుటుంబం నివాసం ఉంటోంది. విద్యుత్ బిల్లు భారీగా వస్తుండటంతో అదనపు విద్యుత్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సరిపడా రుసుమును మీ సేవ ద్వారా చెల్లించారు. ఆ ప్రాంత విద్యుత్ లైన్మెన్కు విషయం తెలపడంతో కొన్ని రోజుల తర్వాత నూతన విద్యుత్ మీటర్‌ను తీసుకొచ్చారు. తీరా ఏర్పాటు చేసే సమయంలో సదరు లైన్మెన్ ఒక భవన సముదాయానికి ఒకే విద్యుత్ మీటర్ ఉండాలనే నిబంధన విద్యుత్ శాఖలో ఉందని, ఈ క్రమంలో రెండో మీటర్‌ను ఏర్పాటు చేయడం కుదరదని తేల్చిచెప్పారు. అయితే నూతన మీటర్‌కు చెల్లించిన నగదు మొత్తాన్ని ఇప్పటికీ ఇంటి యజమానికి ఇవ్వలేదు. నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఒక భవన సముదాయానికి ఒకే విద్యుత్ మీటర్ ఉండాలనే నిబంధన సామాన్యులకే తప్ప, మంత్రి స్థాయిలో ఉన్న వారికి వర్తించడంలేదు. నగరంలోని హరనాథపురంలో గల నారాయణ విద్యాసంస్థల్లో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోంది. వాస్తవానికి హరనాథపురంలో నారాయణ బాలురు, బాలికలకు సంబంధించి వేర్వేరు ఇంటర్ కళాశాలలు ఉన్నాయి. అదే విధంగా ఇదే ప్రాంతంలో నారాయణ భవన్ పేరుతో, నారాయణ మెడికల్ అకాడమీ పేరుతో బాలుర, బాలికల స్కాలర్ మెడికల్ క్యాంపస్‌ను మరో భవనంలో నిర్వహిస్తున్నారు. అయితే ఒకే భవన సముదాయంలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపస్‌కు నాలుగు విద్యుత్ సర్వీసులు కలిగిన మీటర్లు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఒకే భవన సముదాయానికి నాలుగు విద్యుత్ మీటర్లను విద్యుత్ శాఖ సిబ్బంది ఎలా ఏర్పాటు చేశారో అర్థం కావడంలేదు. నిబంధనల మేరకు విద్యాసంస్థలకు సంబంధించిన భవనాలకు విద్యుత్ సర్వీస్ కేటగిరీ – 2 పరిధి కింద విద్యుత్ సర్వీస్‌ను ఇవ్వాలి. అయితే నిబంధనలకు తిలోదకాలివ్వడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేటగిరీ – 2 ప్రకారం ఇదీ లెక్క.. విద్యాసంస్థలకు విద్యుత్ సర్వీస్ ఇచ్చే కేటగిరీ – 2 కింద 0 నుంచి 50 యూనిట్ల వరకు ఒక స్లాబ్‌గా నిర్ణయించి ఒక్కో యూనిట్‌కు రూ.3.60గా లెక్కిస్తారు. 51 యూనిట్ల నుంచి 100 వరకు యూనిట్లకు మరో స్లాబ్‌గా పరిగణించి యూనిట్‌కు రూ.6.60 వంతున, 101 నుంచి 150 యూనిట్లకు మరో స్లాబ్‌గా యూనిట్‌కు రూ.7.70, 150 నుంచి 200 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.9.90 లెక్కన బిల్లు వేస్తారు. ఈ లెక్కన 50 యూనిట్ల వరకు వాడితే రూ.358, 100 యూనిట్లు వాడితే రూ.950 వరకు, 150 యూనిట్లు వాడితే రూ.1,800 వరకు 200 యూనిట్లు వాడితే రూ.2,500 వరకు నెల వారీ విద్యుత్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన హరనాథపురంలోని నారాయణ మెడికల్ క్యాంపస్‌కు నెలకు వందలాది యూనిట్ల వినియోగమవుతోంది. దీనికి సంబంధించి రూ.లక్షల మొత్తాన్ని నెలవారీ విద్యుత్ బిల్లుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా భారీగా విద్యుత్ బిల్లులను చెల్లించకుండా ఉండేందుకు గానూ నిబంధనలకు విరుద్ధంగా అదనపు విద్యుత్ మీటర్లను పొందారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంస్థ ఆదాయానికి భారీగా గండి నారాయణ విద్యాసంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా అదనపు విద్యుత్ సర్వీసులను ఇవ్వడం, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంపై విద్యుత్ శాఖ సిబ్బందిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రలోభాలకు లొంగి ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి నెలా మీటర్ రీడింగ్‌కు వచ్చే సమయంలోనూ ఇలా వ్యవహరిస్తూ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంలేదు. ఈ పరిణామంతో విద్యుత్ సంస్థ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఒకే కాంపౌండ్లోఒకే సర్వీస్ ఉండాలి ఎలాంటి విద్యాసంస్థలైనా ఒకే కాంపౌండ్‌లో ఉంటే ఒకే విద్యుత్ సర్వీస్ మీటర్‌ను కలిగి ఉండాలి. కొన్ని సందర్భాల్లో వివిధ పేర్లతో సర్వీసులు పొందుతారు. ఇలాంటి వాటిపై ఫిర్యాదులు వచ్చినా.. తనిఖీల్లో గుర్తించినా.. ఎక్కువగా ఉన్న మీటర్లను తొలగించి అన్నింటినీ కలిపి ఒకే సర్వీస్‌గా చేస్తాం.: విజయ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఈ -
చిన్నారిని చితకబాదిన ‘నారాయణ’ టీచర్!
సాక్షి, అల్వాల్: హోమ్‌వర్క్ చేయలేదని విద్యార్థిౖపె అధ్యాపకురాలు చేయి చేసుకుంది. దీంతో విద్యార్థి తలకు గాయమై ఆసుపత్రిపాలయ్యాడు. బాలల హక్కుల సంఘం సభ్యులు అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. అల్వాల్‌లో నివసించే శివకుమార్ కుమారుడు ఇషాక్ న్యూటన్(9) ఓల్డ్ అల్వాల్ చౌరస్తాలోని నారాయణ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలకు వెళ్లిన విద్యార్ధిని తరగతి గదిలో టీచర్ మహాలక్ష్మి హోమ్‌వర్క్ చేయలేదని చితకబాదింది. దీంతో విద్యార్ధికి తలకు గాయమై రక్తస్రావం కావడంతో దగ్గరిలోనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అనంతరం తల్లి దండ్రులకు సమాచారం అందడంతో ఆసుపత్రికి వచ్చి పాఠశాల సిబ్బందిని నిలదీశారు. బాలల హక్కుల సంఘం ప్రతినిధి అచ్యుత్‌రావు విద్యార్ధి తండ్రి శివకుమార్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకున్నాడు. అనంతరం అల్వాల్ పోలీసుకులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు టీచర్‌పై 324, జూవైనల్ యాక్ట్ 75 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై ప్రిన్సిపల్ కళ్యాణి మాట్లాడుతూ.. విద్యార్ధిని ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని జరిగిన దానికి తల్లి దండ్రులకు క్షమాపణలు తెలిపామన్నారు. పిల్లాడికి వైద్య ఖర్చులు భరించడంతో పాటు త్వరలో ఇలాంటి సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. విద్యార్థులను చితకబాదడం అమానుషమని, ఇది బాలల హక్కులను హరించడమేనని బాలల హక్కుల సంఘం ప్రతినిధి అచ్యుత్‌రావు అన్నారు. -
సిరిసిల్లలో ‘నారాయణ’ వైస్ ప్రిన్సిపల్ అరెస్ట్
హైదరాబాద్: నారాయణ విద్యాసంస్థల ఆడియో టేపుల వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. టేపుల లీకేజీకి బాధ్యుడని భావిస్తున్న వైస్ ప్రిన్సిపల్ నవీన్‌గౌడ్‌ను పోలీసులు సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకురానున్నారు. నవీన్‌గౌడ్ బెదిరించి వాయిస్ రికార్డ్ చేయించాడని ప్రిన్సిపల్ సరిత అగర్వల్ ఆరోపించారు. హైదరాబాద్ రామాంతపూర్‌లోని నారాయణ స్కూల్‌కు చెందిన వైస్ ప్రిన్సిపల్ నవీన్ .. అదే బ్రాంచ్‌కు చెందిన ప్రిన్సిపాల్ సరితా అగర్వాల్‌తో మాట్లాడిన సంభాషణలు బయటపడిన విషయం తెలిసిందే. డీమానిటైజేషన్ సమయంలో బ్లాక్‌మనీని నారాయణ యాజమాన్యం వైట్‌మనీగా ఎలా మార్చిందో వీరిద్దరూ ఆ వీడియోలో చర్చించుకున్నారు. అలాగే యాజమాన్యంలోని కీలక వ్యక్తికి ...మహిళలతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆ సంభాషణల్లో వెల్లడి అయింది. హయత్‌నగర్ నారాయణ బ్రాంచ్‌కు చెందిన ఉద్యోగి శ్రీలత ఆత్మహత్యకు కారణం ఏంటో కూడా....ఈ ఆడియోలో చెప్పడం సంచలనంగా మారుతోంది. వనస్థలీపురంలో ఉన్న నారాయణ విద్యాసంస్థల గెస్ట్‌హౌస్ అరాచకాలకు అడ్డాగా మారిందని...ఈ ఆడియో ద్వారా తెలుస్తోంది. నారాయణ సంస్థలకు సంబంధించిన కీలకమైన విషయాలపై చర్చ జరిగిన ఈ ఆడియో టేపు.....ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ విషయం పై నవీన్ నోరు తెరిస్తేనే నిజానిజాలు బయటకి రానున్నాయి. -
‘లీకేజీ’ దోషులను తప్పిద్దాం!
-
‘లీకేజీ’ దోషులను తప్పిద్దాం!
- ప్రశ్నపత్రాల లీకేజీని పక్కదారి పట్టించేలా ప్రభుత్వ చర్యలు - ఉన్నతాధికారులతో గంటా భేటీ సాక్షి, అమరావతి/నెల్లూరు: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం నుంచి బయటపడేందుకు ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. నెల్లూరు జిల్లా విద్యాధికారి రామలింగంను కూడా పిలిపించారు. ఈ భేటీ వివరాలు బయటకు రాకుండా స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మంత్రులతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంపై నోరువిప్పేందుకు అధికారులు భయపడుతున్నారు. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో నారాయణ స్కూల్‌ను తప్పించడమే లక్ష్యంగా పోలీసులు దర్యాప్తును పక్కదారిపట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నపత్రం లీకేజీ సమయంలో ఆ కేంద్రంలో ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులతోపాటు నారాయణ స్కూల్ సిబ్బంది, ప్రిన్సిపల్ ఉన్నట్లు ప్రచారం. అయితే, నారాయణ పాఠశాల యాజమాన్యాన్ని తప్పించేందుకు వాటర్‌బాయ్, ఇన్విజిలేటర్ మహేష్‌లను బాధ్యులుగా చేసి కేసును నీరుగార్చే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా లీకేజీపై పోలీసులు బుధవారం పలువురిని విచారించారు. వారంతా నగరంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పీఈటీలని తెలిసింది. వాటర్‌బాయ్ ఉపయోగించిన సెల్‌ఫోన్ వేరే వ్యక్తిదని పోలీసులు గుర్తించారు. సెల్‌ఫోన్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
విషమంగా వాసుదేవరెడ్డి ఆరోగ్యం
చిత్తూరు: పదోతరగతి విద్యార్థి వాసుదేవరెడ్డి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. చిత్తూరు జిల్లా కాలూరు నారాయణ స్కూల్ విద్యార్థి వాసుదేవరెడ్డి సోమవారం ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. పదిరోజుల క్రితం అదే స్కూల్లో పదో తరగతి విద్యార్థి సాయిచరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణ స్కూళ్లలో వరుస సంఘటనలపై విద్యార్థి, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నారాయణ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
నారయణ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
తిరుపతి: నారాయణ విద్యాసంస్థలో మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తిరుపతి నారయణ స్కూల్లో పదో తరగతి చదువుతున్న వాసు మొదటి అంతస్థుపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే పాఠశాల సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి వాసుకి తీవ్ర గాయలయ్యాయి. ఇదే విద్యాసంస్థలో పది రోజుల క్రితమే పదో తరగతి విద్యార్థి సాయిచరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మరవక ముందే మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటంతో తొటి విద్యార్థులకు, తల్లితండ్రులకు ఆందోళన నెలకొంది. అయితే వాసు తల్లితండ్రులు మాత్రం సిబ్బంది వేధింపులే తమ కొడుకు ఆత్మహత్యయత్నానికి కారణమని ఆరోపించారు. -
రాష్ట్రం నుంచి వెళ్తున్నాం.. మాకోసం వెతకొద్దు..
► మాకోసం వెతకవద్దు...నారాయణ స్కూల్ విద్యార్థులు అనంతపురం: అనంతపురం నారాయణ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఇంటి నుంచి పారిపోయారు. మేము ఈ రాష్ట్రం నుంచి వెల్లిపోతున్నాం. మాకోసం వెతకవద్దు. డబ్బులు అనవసరంగా ఖర్చు చేయవద్దు. తొందర్లో తిరిగొస్తాం అని లేఖ రాసి వెళ్ళారు. దీంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు... నగరంలో మూడవరోడ్డులో నివాసముంటున్న సూర్యనారాయణ కుమారుడు కరణం ప్రణవ్‌దీక్షిత్(14), మక్బూల్‌బాషా కుమారుడు మహ్మద్షమీర్(14)లు స్థానికంగా నారాయణ స్కూల్లో తొమ్మిదోతరగతి చదువుతున్నారు. అదే పాఠశాలలో పీఈటీ మాస్టర్ మధుసూదన్‌రావు దగ్గర యోగా నేర్చుకుంటున్నారు. ఏమైందో తెలియదు కాని మంగళవారం రాత్రి ఇంటి నుంచి పారిపోయారు. పొద్దుపోయినా ఇంటికి రాకపోవడంతో కగారుపడ్డ తల్లిదండ్రులు నగరమంతా గాలించారు. చివరకు ఇద్దరి ఇళ్లలో దొరికిన లేఖలను చూసిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సీసీ పుటేజీల ఆధారంగా విద్యార్థుల కదలికలను ఆరా తీసిన పోలీసులు సైకిళ్లలో బస్టాండ్‌కు వచ్చి బస్సెక్కి వెల్లిపోయినట్లు తేల్చారు. అయితే ఇంటి నుంచి పారిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తల్లిదండ్రులు మాత్రం యోగాకు పూర్తిగా అడిక్టు అయ్యారని, నిత్యం ఆన్లైన్లో యోగా గురువుల ఉపన్యాసాలు వింటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో భాగంగా ఎక్కడైనా యోగా గురువు వద్దకు వెళ్ళి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.