ఇషాక్ న్యూటన్
సాక్షి, అల్వాల్: హోమ్‌వర్క్ చేయలేదని విద్యార్థిౖపె అధ్యాపకురాలు చేయి చేసుకుంది. దీంతో విద్యార్థి తలకు గాయమై ఆసుపత్రిపాలయ్యాడు. బాలల హక్కుల సంఘం సభ్యులు అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. అల్వాల్‌లో నివసించే శివకుమార్ కుమారుడు ఇషాక్ న్యూటన్(9) ఓల్డ్ అల్వాల్ చౌరస్తాలోని నారాయణ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలకు వెళ్లిన విద్యార్ధిని తరగతి గదిలో టీచర్ మహాలక్ష్మి హోమ్‌వర్క్ చేయలేదని చితకబాదింది. దీంతో విద్యార్ధికి తలకు గాయమై రక్తస్రావం కావడంతో దగ్గరిలోనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అనంతరం తల్లి దండ్రులకు సమాచారం అందడంతో ఆసుపత్రికి వచ్చి పాఠశాల సిబ్బందిని నిలదీశారు.
బాలల హక్కుల సంఘం ప్రతినిధి అచ్యుత్‌రావు విద్యార్ధి తండ్రి శివకుమార్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకున్నాడు. అనంతరం అల్వాల్ పోలీసుకులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు టీచర్‌పై 324, జూవైనల్ యాక్ట్ 75 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై ప్రిన్సిపల్ కళ్యాణి మాట్లాడుతూ.. విద్యార్ధిని ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని జరిగిన దానికి తల్లి దండ్రులకు క్షమాపణలు తెలిపామన్నారు. పిల్లాడికి వైద్య ఖర్చులు భరించడంతో పాటు త్వరలో ఇలాంటి సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. విద్యార్థులను చితకబాదడం అమానుషమని, ఇది బాలల హక్కులను హరించడమేనని బాలల హక్కుల సంఘం ప్రతినిధి అచ్యుత్‌రావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment