నారాయణ స్కూల్‌లో టీచర్‌ నిర్వాకం | Narayana School teacher Misbehaviour On Student | Sakshi
Sakshi News home page

విద్యార్థినులతో టీచర్‌ అసభ్య ప్రవర్తన

Published Sat, Nov 2 2019 9:47 AM | Last Updated on Sat, Nov 2 2019 9:49 AM

Narayana School teacher Misbehaviour On Student - Sakshi

సాక్షి, అనంతపురం : విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు గాడి తప్పాడు. విచక్షణ మరిచి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన అయ్యవారికి దేహశుద్ధి జరిగింది. వివరాల్లోకి వెళితే.. నారాయణ స్కూల్‌లో సైన్స్‌ టీచర్‌గా పని చేస్తున్న కార్తీక్‌ ...వాట్సప్‌ ద్వారా ఎనిమిదో తరగతి విద్యార్థినికి అశ్లీల పోస్టింగ్స్‌, మెసేజ్‌లు పంపించాడు. ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థిని తల్లిదండ్రులు...రెండు రోజుల క్రితం కీచక టీచర్‌ను నిలదీశారు. 

అయితే అతగాడు బుకాయించడంతో ఆగ్రహించిన విద్యార్థిని బంధువులు దేహశుద్ధి చేశారు. ఇంత జరిగినా ఈ విషయాన్ని నారాయణ స్కూల్‌ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించకుండా గోప్యంగా ఉంచింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement