misbehaviour
-
మహిళా అధికారితో దురుసు ప్రవర్తన.. మంత్రి రాజీనామాకు ఆదేశం
కలకత్తా: సొంత పార్టీ నేత, పశ్చిమబెంగాల్ జైళ్ల మంత్రి అఖిల్గిరిపై తృణమూల్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరి ఓ మహిళా అధికారిని బెదిరిస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో పార్టీ సీరియస్ అయింది. ఆ మహిళా అధికారికి క్షమాపణలు చెప్పడంతో పాటు మంత్రిపదవికి వెంటనే రాజీనామా చేయాలని గిరిని పార్టీ ఆదేశించింది. ఈ విషయమై తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ సంతనుసేన్ మాట్లాడుతూ ‘ఒక మహిళా అధికారితో మా మంత్రి అనుచితంగా ప్రవర్తించారు. ఇలాంటి ప్రవర్తనను మేం సమర్థించం. ఆ మంత్రిని మహిళా అధికారికి క్షమాపణ చెప్పడంతోపాటు మంత్రిపదవికి రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించాం.తృణమూల్ కాంగ్రెస్ రాజధర్మాన్ని పాటిస్తుంది. మహిళా వ్యతిరేక పార్టీ బీజేపీ సొంత పార్టీ నేతలపై ఎప్పుడూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో సీపీఎం కూడా ఈ విషయాల్లో రాజధర్మాన్ని పాటించలేదు’అని సంతనుసేన్ తెలిపారు. -
‘నాతో మంచిగా ఉండు.. నీ అవసరాలు తీరుస్తా’
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘నాతో మంచిగా ఉండు.. నీ అవసరాలు తీరుస్తా...’అని ఎస్సై అసభ్యకరంగా మాట్లాడాడంటూ ఓ మహిళ ఎస్సై నల్లగొండ సబ్‌డివిజన్ పరిధిలోని ఓ ఎస్సైపై ఎస్పీకి ఫిర్యాదు చేసింది. సోమవారం జరిగిన ప్రజావాణిలో ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ను కలిసింది. ‘నా భర్త విషయంలో నేను ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టకుండా కాలయాపన చేశారు. మళ్లీ ఫిర్యాదు చేయాలని ఏప్రిల్ 16న స్టేషన్‌కు పిలిపించారు. ఎస్సై క్యాబిన్లో నన్ను రెండు గంటలపాటు ఉంచి అసభ్యకరంగా వ్యవహరించారు. నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటున్నావు.. భర్తకు దూ రంగా ఉంటున్నావు కదా. నీకు పిల్లలు ఎప్పుడు, ఎలా పుట్టారు.. నీకు ఇప్పుడు భర్తతో ఉండాలనే కోరిక కలగడం లేదా? నాతో మంచిగా ఉండు. నీ ఫోన్‌నంబరు నాకు ఇవ్వు. నా పర్సనల్ నంబరు నువ్వు తీసుకో. నేను నీకు అన్నివిధాలా సహకరిస్తాను. నీ ప్రతి అక్కర తీరుస్తాను.. నీకు వంట వచ్చా.. వస్తే నాకు చేపలు వండుకు రా.. మరొక రోజు మేక మాంసం వండుకురా అని వేధించడమే కాకుండా నాతో బలవంతంగా గ్రీన్ టీ పెట్టించుకొని తాగారు. స్టేషన్‌కు ఇలా అప్పుడప్పుడు వచ్చి నేను నడుచుకొమ్మన్నట్లు నడుచుకో. నీకు అన్నివిధాలా మంచిది. ఈ సంభాషణ మన మధ్యనే ఉండాలి. ఎవరికీ చెప్పవద్దు.ఒకవేళ చెబితే మీ కుటుంబ విషయాల్లో తలదూర్చి అక్రమ కేసులు బనాయిస్తా. అంటూనే నీకంటే మీ అమ్మ ఇంకా బాగుంది అని అన్నాడు. నేను భయపడి ఈ విషయాలు రెండు వారాల పాటు ఎవరితో పంచుకోలేదు. మీరే తగిన చర్యలు చేపట్టండి..’. అని ఎస్పీకి ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్కారు. దీనిపై ఎస్పీ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. -
రైలులో యువతిపై అకృత్యం.. బాత్రూమ్లో నిందితుని పట్టివేత!
మధ్యప్రదేశ్‌లో కదులుతున్న రైలులో యువతిపై అత్యాచారం జరిగింది. ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్న బాలికపై రైలులోని బాత్రూమ్లో అత్యాచారం జరిగింది. నిందితుడు బాధితురాలిపై దాడికి పాల్పడ్డాడు. బాధిత యువతి యువతి.. కట్నీ నుంచి ఉచెహ్రాకు రైలులో ప్రయాణిస్తోంది. ఈ సమయంలో ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం నిందితుడు బాత్రూమ్ లోపల దాక్కుని గొళ్లెం పెట్టుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాత్రూం తలుపులు పగులగొట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఒక యువతి కట్నీ నుండి ఉచెహ్రాకు ‘మెము’ రైలులోని ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తోంది. రైలు పకారియా స్టేషన్‌కు చేరుకోగానే ఆ యువతి బాత్రూమ్కి వెళ్లింది. ఈ సమయంలో ఓ యువకుడు బాత్రూంలోకి బలవంతంగా ప్రవేశించాడు. బాత్రూమ్ తలుపును లోపలి నుంచి మూసేశాడు. అనంతరం ఆ యువతిపై దాడిచేసి, అత్యాచారం చేశారు. రైలు సత్నా స్టేషన్‌కు చేరుకోగానే బాధితురాలు కేకలు వేస్తూ బాత్రూమ్ డోరు తెరిచింది. అనంతరం జరిగిన ఘటనపై సత్నా స్టేషన్‌లోని జీఆర్పీకి సమాచారం అందించింది. రైలు తదుపరి స్టేషన్ కీమాలో ఆగింది. జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు కీమా స్టేషన్‌కు చేరుకున్నాయి. వారు రైలులోకి ప్రవేశించగానే, నిందితుడు బాత్రూమ్లోకి వెళ్లి గొళ్లెం పెట్టుకున్నాడు. దీంతో పోలీసులు తలుపులు పగులగొట్టి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రైలులో చిరు వ్యాపారం చేస్తుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం సత్నా రైల్వే పోలీసులు నిందితుడిని కట్నీ జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. ఇది కూడా చదవండి: ‘తండ్రిని చూస్తే వణుకు’... ‘ఆత్మకథ’లో శరద్ పవార్! మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానల్ వీక్షించండి: -
ఎస్ఐపై టీడీపీ నేతల దౌర్జన్యం
ఘంటసాల(అవనిగడ్డ): ఆందోళనలు, రెచ్చగొట్టే ప్రసంగాలు వద్దని చెప్పిన ఘంటసాల ఎస్ఐ శ్రీనివాస్‌పై మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ఊగిపోయారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఆయనకు వంతపాడారు. దీంతో టీడీపీ నేతలు ఎస్ఐపై రెచ్చిపోయారు. వారి తీరుతో కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో చేపట్టిన టీడీపీ ఇసుక సత్యాగ్రహం కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్ఐ కూచిపూడి శ్రీనివాస్ తెలిపిన వివరాలు..చంద్రబాబు పిలుపు మేరకు సోమవారం బుద్ధప్రసాద్ నేతృత్వంలో మాజీ ఎంపీ కొనకళ్లతో మరికొంతమంది టీడీపీ నేతలు శ్రీకాకుళం నుంచి ర్యాలీగా ఇసుక క్వారీ వరకు వెళ్లారు. అక్కడ టీడీపీ జెండాలు ఉంచి నిరసన తెలిపారు. ఎస్ఐ శ్రీనివాస్ ఈ ఆందోళన కార్యక్రమానికి ఒక గంట మాత్రమే అనుమతిచ్చారు. పామర్రు టీడీపీ ఇన్చార్జి వర్ల కుమారరాజా రావడం ఆలస్యం కావడంతో ఇచ్చిన సమయం దాటిపోయింది. అయినప్పటికీ కొంతమంది నేతలు మాట్లాడుతుండటంతో మీకిచ్చిన సమయం అయిపోయింది, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని, ఏదైనా ఉంటే చట్టపరంగా చూసుకోవాలని ఎస్ఐ సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన బుద్ధప్రసాద్.. ‘ఇసుక దోపిడీకి అనుమతిస్తావా, మేము మాట్లాడుతుంటే ఆడ్డుపడతావా’ అంటూ ఎస్ఐపై విరుచుకుపడ్డారు. ఇసుక దోపీడిని అరికట్టకుండా మమ్మల్నే అడ్డుకుంటావా..అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. కొనకళ్ల కలి్పంచుకుని ఇసుక దోపిడీ గురించి మాట్లాడుతుంటే అడ్డుకుంటానికి మీరెవరు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం పార్లమెంటరీ టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు మాచవరపు ఆదినారాయణ ఎస్ఐకి వేలు చూపిస్తూ.. నువ్వు దొంగవి అంటూ దురుసుగా ప్రవర్తించారు. అనంతరం జేపీ సిబ్బందిని తీసుకొచ్చిన ఎస్ఐ శ్రీనివాస్.. ఇసుక ధరలు, క్వారీ అనుమతుల గురించి బుద్ధప్రసాద్‌తో మాట్లాడించారు. ఇక్కడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, పామర్రు నియోజకవర్గ పరిధిలో జగనన్న కాలనీలకు సంబంధించిన స్టాక్ పాయింట్లకు ఇసుక రవాణా చేయడం వల్ల వాటికి రేటు వేయరని చెప్పారు. మైనింగ్ అనుమతి గురించి ప్రశ్నించగా.. మా ఉన్నతాధికారుల వద్ద వివరాలున్నాయని సిబ్బంది చెప్పారు. ఇసుక క్వారీకి సంబంధించి అనుమతులు చూపించాలని లేదంటే రేపు పోలీస్ స్టేషన్ ఎదుట నిరాహార దీక్ష చేస్తామంటూ ఎస్ఐని బుద్ధప్రసాద్ హెచ్చరించారు. -
ఎస్సైతో దురుసు ప్రవర్తన!.. రేణుకా చౌదరిపై కేసు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గురువారం చలో రాజ్‌భవన్ సందర్భంగా.. పోలీసులతో ఆమె దురుసుగా ప్రవర్తించిన ఫుటేజ్‌లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఎస్సై కాలర్ పట్టుకున్నారు ఆమె. దీంతో ఎస్ఐ ఉపేంద్ర బాబు ఫిర్యాదు మేరకు సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. చలో రాజ్‌భవన్‌లో పోలీసులతో దురుసు ప్రవర్తనపై. రేణుకా చౌదరిపై కేసు నమోదు అయ్యింది. ఘటన తర్వాత బలవంతంగా ఆమెను అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రేణుకా చౌదరిని రిమాండ్‌కు తరలించే యోచనలో ఉన్నారు పోలీసులు. అయితే దురుసు ప్రవర్తన ఆరోపణలపై రేణుకా చౌదరి స్పందించారు. వెనకాల నుంచి తోసేయడంతో.. ఎస్ఐ భుజం పట్టుకున్నానని, అవమానపరిచే ఉద్దేశం లేదని ఆమె తెలిపారు. యూనిఫాంను ఎలా గౌరవించాలో తెలుసని, పోలీసుల పట్ల గౌరవం ఉందని ఆమె అన్నారు. #WATCH | Telangana: Congress leader Renuka Chowdhury holds a Policeman by his collar while being taken away by other Police personnel during the party's protest in Hyderabad over ED summons to Rahul Gandhi. pic.twitter.com/PBqU7769LE — ANI (@ANI) June 16, 2022 -
పాక్ కోచ్‌గా చచ్చినా చేయను: వసీం అక్రమ్
వసీం అక్రమ్.. క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు. 1992 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన అక్రమ్.. 1999 వన్డే వరల్డ్‌కప్‌లో కెప్టెన్‌గా పాకిస్తాన్‌ను ఫైనల్ చేర్చాడు. దిగ్గజ బౌలర్‌గా పేరు పొందిన అక్రమ్.. గతంలో వ్యాఖ్యాతగానూ పని చేశాడు. అయితే ఇంత అనుభవం ఉన్న అక్రమ్ ఏనాడు పాకిస్తాన్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించేందుకు ముందుకు రాలేదు. దీనిపై చాలా మందికి సందేహం ఉండగా.. తాజాగా ఈ యార్కర్ దిగ్గజం క్లారిటీ ఇచ్చాడు. పాకిస్తాన్ కోచ్ పదవి చేపట్టకపోవడంపై అక్రమ్ ఒక ఇంటర్య్వూలో పెదవి విప్పాడు. క్రికెట్ కార్నర్ పేరుతో నిర్వహించిన ఇంటరాక్షన్‌లో తన అనుభవాలను పంచుకున్నాడు. ''పాకిస్తాన్‌కు కోచ్‌గా ఎంపికైతే ఫ్యామిలీకీ దూరంగా ఉండాల్సి వస్తుంది. అంతేగాక సంవత్సరంలో 200 నుంచి 250 రోజులు పాకిస్తాన్ క్రికెట్‌కు కేటాయించాల్సి ఉంటుంది. ఇక పాక్ జట్టు ఓడిపోతే అభిమానులు చేసే అల్లరి నాకు అస్సలు ఇష్టం ఉండదు. వారి ప్రవర్తన నన్ను పాకిస్తాన్ క్రికెట్ కోచ్ పదవికి దూరంగా ఉండేలా చేసింది. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. అఫ్కోర్స్.. ఈ వ్యాఖ్యలు చేయడానికి నేనేం ఫూల్‌ను కాదు. పాకిస్తాన్ ఏ సిరీస్‌లో ఓడిపోయినా సోషల్ మీడియా వేదికగా కోచ్‌ను, సీనియర్ ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ వాళ్లు పెట్టే కామెంట్స్ చిరాకు కలిగిస్తాయి. చదవండి: IPL 2021: ఇలా గెలిస్తే ముంబై ఇండియన్స్ లేదంటే కేకేఆర్ మ్యాచ్‌లో కోచ్ ఆడడు.. ప్లేయర్స్ మాత్రమే ఆడుతారు. కోచ్ అనేవాడు ఆటగాళ్లకు సలహాలు మాత్రమే ఇస్తాడు. ఈ విషయం తెలుసుకోకుండా అనవసరంగా కోచ్‌ల మీద అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తారు. మా దేశంలో జట్టు ఓడిపోవడం కంటే కోచ్‌లపై కక్షసాధింపు చర్యలే ఎక్కువ ఉంటాయి. అందుకే పాకిస్తాన్ జట్టుకు కోచ్ పదవిలో ఎక్కువకాలం ఎవరూ ఉండరు. ఇలాంటివి బయటిదేశాలలో ఎక్కువగా కనిపించవు. నా దృష్టిలో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే నేను తట్టుకోలేను. క్రికెట్‌ను ఎంజాయ్ చేసేవాళ్లను.. ఇష్టంతో చూసేవాళ్లను ఎంత ప్రేమిస్తానో.. నాతో తప్పుగా ప్రవర్తించేవారిపై అంత కోపంతో ఉంటాను. అందుకే పాకిస్తాన్ క్రికెట్లో కోచ్ పదవిని ఎప్పుడు ఆశించలేదు.. ఆశించబోను కూడా'' అని చెప్పుకొచ్చారు. చదవండి: T20 World Cup: కచ్చితంగా వార్నరే ఓపెనింగ్ చేస్తాడు: ఫించ్ వసీం అక్రమ్ తన 19 సంవత్సరాల క్రికెట్ కెరీర్లో పాక్ తరపున 104 టెస్టుల్లో 414 వికెట్లు, 356 వన్డేల్లో 502 వికెట్లు తీశాడు. ఇక క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అంతేకాదు ఐపీఎల్‌లోనూ కేకేఆర్ జట్టుకు సహాయక కోచ్‌గా పనిచేశాడు. ఇక ఇటీవలే పాకిస్తాన్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి మిస్బాఉల్ హక్ పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే. అతనితో పాటు బౌలింగ్ కోచ్ బాధ్యతల నుంచి వకార్ యూనిస్ కూడా వైదొలిగాడు. టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని పాక్ మాజీ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్.. మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్‌లను తాత్కాలిక కోచ్‌లుగా పీసీబీ ఎంపిక చేసింది. ఇక టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 24న టీమిండియాతో ఆడనుంది. చదవండి: అసలైన టీ20 క్రికెటర్ అతడే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
పోలీసులపై బొండా ఉమా దౌర్జన్యం
సాక్షి, విజయవాడ : టీడీపీ నేత బొండా ఉమా పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. పోలీసులను అరే, ఒరే అంటూ తీవ్ర పదజాలంతో దూపించారు. నువ్వు ఎవడ్రా చెప్పడానికి అంటూ నోరు పారేసుకున్నారు. అంతటితో ఆగకుండా.. నోరు మూసుకో అంటూ వేలు చూపించారు. చొక్కాలు విప్పదీయడం కూడా తనకు తెలుసునని హెచ్చరించారు. అయితే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి పోలీసులతో ఈ విధంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
విమానం నుంచి బయటికి పంపాలని నానా రభస..
విమానం హఠాత్తుగా నిలిపివేయడంతో వెంటనే మమ్మల్ని బయటికి పంపాలంటూ సిబ్బందిపై ప్రయాణికులు దౌర్జన్యం చేసిన వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఢిల్లీ నుంచి ముంబయికి గురువారం సాయంత్రం ప్రయాణికులతో బయలుదేరింది. కానీ కొద్ది సేపటికే ఇంజిన్‌లో సాంకేతికత లోపించడంతో విమానంలోని పైలట్ తిరిగి రన్‌వే మీదకు తీసుకువచ్చాడు. ఈ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులు అసలేం జరిగిందో తెలుసుకోకుండా క్యాబిన్ క్రూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఊరుకోకుండా కాక్‌పిట్ డోర్‌ను పగలగొట్టడానికి ప్రయత్నించారు. 'ఒక ప్రయాణికుడు మేము ఎంత చెప్పినా వినకుండా ఇప్పుడు పైలట్ బయటికి రాకుంటే కాక్‌పిట్ డోరును బద్దలు కొడాతానంటూ నానా రభస చేశాడు. మరో మహిళ ఏకంగా మా సిబ్బందిలో ఒకరి చేయి పట్టుకొని వెంటనే మెయిన్ ఎగ్జిట్ గేట్‌ను తొందరగా ఓపెన్ చేయాలంటూ దురుసుగా ప్రవర్తించారు. అసలేం జరిగిందో తెలుసుకోకుండా ప్రయాణికులు ఇలా దౌర్జన్యం చేయడం మాకు చాలా బాధగా అనిపించిందంటూ' సిబ్బంది వాపోయారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎయిర్‌లైన్స్ అధికారులు ప్రయాణికుల దురుసు ప్రవర్తనపై ఒక రిపోర్టును అందజేయాలంటూ విమాన సిబ్బందిని కోరింది.(వైరల్: అమ్మాయిల వేషధారణలో అబ్బాయిలు) 'ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ విమానాన్ని నిలిపివేశాడు. అంతమాత్రానికే ప్రయాణికులు ఇలా దౌర్జన్యం చేయడం ఏం బాలేదు. దీనిపై సిబ్బంది రిపోర్టు అందజేయగానే విచారణ నిర్వహిస్తాము.దురుసుగా ప్రవర్తించిన ప్రయాణికులపై చర్యలు తీసుకుంటామని' అధికారి పేర్కొన్నారు. అయితే ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. విమానం నిలిపివేయడానికి కారణం ఏంటో తెలుసుకోకుండా ప్రయాణికులు ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. -
నారాయణ స్కూల్లో టీచర్ నిర్వాకం
సాక్షి, అనంతపురం : విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు గాడి తప్పాడు. విచక్షణ మరిచి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన అయ్యవారికి దేహశుద్ధి జరిగింది. వివరాల్లోకి వెళితే.. నారాయణ స్కూల్లో సైన్స్ టీచర్‌గా పని చేస్తున్న కార్తీక్ ...వాట్సప్ ద్వారా ఎనిమిదో తరగతి విద్యార్థినికి అశ్లీల పోస్టింగ్స్, మెసేజ్‌లు పంపించాడు. ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థిని తల్లిదండ్రులు...రెండు రోజుల క్రితం కీచక టీచర్‌ను నిలదీశారు. అయితే అతగాడు బుకాయించడంతో ఆగ్రహించిన విద్యార్థిని బంధువులు దేహశుద్ధి చేశారు. ఇంత జరిగినా ఈ విషయాన్ని నారాయణ స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించకుండా గోప్యంగా ఉంచింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వికృత చర్య: విద్యార్థిని గిల్లిన కానిస్టేబుల్
-
విద్యార్థినిపై పోలీసు వికృత చర్య..
సాక్షి, హైదరాబాద్ : చార్మినార్ ఆయుర్వేద హాస్పిటల్ తరలింపుకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. యునానీ వారే కావాలని హాస్పిటల్‌ను అక్కడి నుంచి ఎర్రగడ్డకు తరలిస్తున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అందుకు నిరసనగా చార్మినార్ ఎదుట విద్యార్థులు, టీచర్లు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను, లెక్చరర్లను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు మాత్రం వర్షం పడుతున్నా లెక్కచేయకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రెచ్చిపోయిన మానవమృగం.. ధర్నా చేస్తున్న విద్యార్థినిలను మహిళ పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో తోపులాట చోటుచేసుకుంది. ఇదే అదనుగా భావించిన ఒక వ్యక్తి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను తాకరాని చోట తాకడమే కాకుండా.. గట్టిగా గిల్లాడు. దీంతో సదురు విద్యార్థిని నొప్పి భరించలేక గట్టిగా అరిచారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని ఓ పోలీసు కానిస్టేబుల్‌గా గుర్తించారు. ఈ ఘటనపై మహిళ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
క్రికెటర్ అసభ్య ప్రవర్తన.. ఏడాది సస్పెన్షన్
కాబూల్: ప్రపంచకప్ టోర్నీకి అనూహ్యంగా దూరమైన అఫ్గాన్ పేసర్ అఫ్తాబ్ ఆలమ్‌పై ఏడాదిపాటు నిషేధం విధించారు. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు, దేశవాళీ టోర్నీలకూ దూరంగా ఉండాలంటూ అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు అతన్ని హెచ్చరించినట్లు ఆలస్యంగా తెలిసింది. ప్రపంచకప్‌లో జూన్ 22న సౌతాంప్టన్‌లో భారత్‌తో ఆడిన మ్యాచే అతనికి చివరిది. ఈ మ్యాచ్ అనంతరం సౌతాంప్టన్ హోటల్లో ఒక మహిళతో అఫ్తాబ్ తప్పుగా ప్రవర్తించినట్లు తేలింది. దీంతో జూన్ 23న ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్ సమావేశానికి హాజరై వివరణ ఇవ్వాలని కోరగా... అతను కావాలని సమావేశానికి గైర్హాజరవ్వడంతో కోచ్ ఫిల్ సిమన్స్ తర్వాతి రెండు మ్యాచ్‌ల నుంచి అఫ్తాబ్‌ను తప్పించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అఫ్తాబ్ ప్రపంచకప్‌నకు దూరమవుతున్నాడని ఆయన ప్రకటించారు. తదుపరి ఈ ఘటనపై అఫ్గాన్ క్రికెట్ బోర్డు క్రమశిక్షణా కమిటీ విచారించి గత వారం జరిగిన సర్వసభ్య సమావేశంలో 26 ఏళ్ల అఫ్తాబ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. -
దివాకర్ ట్రావెల్స్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన
సాక్షి, అమరావతి బ్యూరో : హైదరాబాద్ నుంచి విజయవాడకు టికెట్ బుక్ చేసుకున్న ఓ మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్ చేయి చేసుకున్న ఘటన మంగళవారం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఆపై దారి పొడవునా తిడుతూ.. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు గురిచేసిన వైనంపై ఆ ప్రయాణికురాలు ‘సాక్షి’కి వెల్లడించిన వివరాలు మేరకు.. విజయవాడకు చెందిన ఉప్పలపాడు లత తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె మంగళవారం విజయవాడకు వచ్చేందుకు అభీబస్ యాప్ ద్వారా దివాకర్ ట్రావెల్స్ బస్సులో టికెట్ బుక్ చేశారు. ఆ బస్సు కొండాపూర్ నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే ఆ సమయానికి బస్సు అక్కడికి చేరుకోకపోవడంతో ఆమె మరో స్టేజ్ అయిన గచ్చిబౌలికి తన మిత్రుడి సాయంతో కారులో చేరుకున్నారు. అక్కడికి కూడా బస్సు సమయానికి రాకపోవడంతో అభీబస్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో వారు బస్సు డ్రైవర్‌తో మాట్లాడించే ప్రయత్నం చేయగా.. టోలిచౌక్ దాటిందని.. లక్డీకపూల్ రావాలని డ్రైవర్ సమాధానం చెప్పి ఫోన్ పెట్టేశాడు. లక్డీకపూల్‌కు చేరుకున్న లత అక్కడ బస్సు ఆపకపోవడంతో మెహదీపట్నం వరకు కారులో ఛేజ్ చేసి బస్సుకు అడ్డంగా నిలవగా.. బస్సు డ్రైవర్ ఆమెను పత్రికలో రాయలేని భాషలో తిట్టడం ప్రారంభించాడు. ఈ మాటలు బయట ఉన్న ఆమెకు వినిపించలేదు. బస్సు ఎక్కాక ఆమెతో పాటు అతని స్నేహితుడిని సైతం ఇదే పద్ధతిన తిడుతుండటంతో ఆమె డ్రైవర్‌పై చేయి చేసుకుంది. దీంతో డ్రైవర్ సైతం ఆమెపై చేయి చేసుకుని.. బూతులు తిట్టాడు. ఇదంతా బస్సులో ప్రయాణిస్తున్న కొందరు వీడియో కూడా తీశారు. ఇదే విషయంపై ఆమె 100కు ఫోన్ చేయగా వారు సూర్యరావుపేట పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఆమెతో ఫోన్ మాట్లాడి.. ఇక్కడ బస్సు ఆపితే అందరూ ఇబ్బంది పడతారని.. కాబట్టి మీరు విజయవాడకు వెళ్లాక అక్కడే కేసు నమోదు చేయాలని సూచించారు. ఆ తర్వాత ఆమె వీడియోను.. జరిగిన విషయాన్ని లత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పగా ఆమె బంధువులంతా గవర్నరుపేటలోని మమతా హోటల్ సమీపంలో బస్సు ఆగగానే డ్రైవర్, అతని సహాయకుడిపై విరుచుకుడి దేహశుద్ధి చేశారు. అనంతరం వారిద్దరితో ఆమె కాళ్లు పట్టించి క్షమాపణలు చెప్పించారు. ఇలాగే ఎవరితోనూ వ్యవహరించకూడదని డ్రైవర్‌కు బుద్ధి చెప్పినట్లు లత తండ్రి మీడియాకు వివరించారు. -
రెచ్చిపోయిన అధికార పార్టీ వైస్ చైర్మన్
సాక్షి, నంద్యాల: అధికార పార్టీకి చెందిన నంద్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ రెచ్చిపోయారు. సోమవారం జరిగిన మున్సిపల్ సమావేశంలో విజయ్ కుమార్ చాలా దురుసుగా ప్రవర్తించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ దేశం సులోచనమ్మపై ఆరోపణలు చేయడమే కాకుండా.. ఆమెను ఏకవచనంతో సంభోదిస్తూ ఇబ్బందికరంగా ప్రవర్తించారు. సమావేశం జరుగుతున్న సమయంలో పదే పదే అడ్డు తగులుతూ గందరగోళం సృష్టించారు. తన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటూ వితండ వాదనకు దిగారు. విజయ్ కుమార్ ప్రవర్తనతో సభ సజావుగా సాగకపోవడంతో సులోచనమ్మ సభను వాయిదా వేశారు. అనంతరం బయటకు వెళ్తున్న సులోచనమ్మపై సమాధానం చెప్పకుండా ఎలా వెళ్తారని విజయ్ కుమార్ గట్టిగా కేకలు వేశారు. అడ్డు చెప్పిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్‌పై ఆయన తన చేతిలో మైకును విసిరివేశారు. -
మైక్ లాక్కునే క్రమంలోనే అనుకోకుండా జరిగింది
-
మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన మాజీ సీఎం
-
మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన మాజీ సీఎం
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం సిద్ద రామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ సమావేశంలో పాల్గొన్న సిద్ద రామయ్య తన సమస్యలు చెప్పుకుంటున్న మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఆ మహిళ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సిద్ద రామయ్య ఆమె చేతిలోని మైక్‌ను లాగేయగా.. చున్నీ కూడా జారిపోయింది. వివరాల్లోకి వెళితే.. సిద్దరామయ్య తన కొడుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ద రామయ్య ఎదుట ఓ మహిళ సమస్యలను ఏకరువు పెట్టింది. పదే పదే ఓ విషయంపై ప్రశ్నిస్తున్న ఆమెపై సిద్ద రామయ్య తెగ చిరాకుపడ్డారు. ఆ సమయంలో సహనాన్ని కోల్పోయిన సిద్ద రామయ్య ఆమె లేచిన ప్రతిసారి కూర్చో, కూర్చో అంటూ కసురుకున్నారు. అయినా ఆ మహిళ ఏదో చెబుతుండగా.. ఆమె మైక్ లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె చున్నీ కూడా జారీపోయింది. నిండు సభలో ఈ ఘటన జరిగిన కూడా సిద్ద రామయ్య శాంతించలేదు. ఆ తర్వాత కూడా మహిళపై ఆగ్రహంతో ఊగిపోయారు. సిద్దరామయ్య ఓ మహిళతో ఇలా ప్రవర్తించడాన్ని చూసిన అక్కడున్న అధికారులు, ప్రజానీకంతోపాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా నివ్వెరపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. సిద్ద రామయ్య ప్రవర్తనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా సిద్ద రామయ్య పలు వివాదాలకు కేంద్రంగా నిలిచారు. మైక్ లాక్కునే క్రమంలోనే అనుకోకుండా జరిగింది: దినేశ్ గుండురావు ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండురావు.. కొన్ని సందర్భాల్లో ప్రజలు చాలా కఠినంగా ప్రశ్నలు అడుగుతారని.. వాటిని నేతలు విన్నప్పటికీ.. వారు మళ్లీ అదే అడుగుతూ ఉంటారని.. ఆ సమయంలో మైక్ లాక్కోవాల్సి వస్తుందని చెప్పారు. సిద్ద రామయ్య మహిళ చేతిలో నుంచి మైకును లాక్కునే క్రమంలో అనుకోకుండా ఆమె దుప్పట్ట జారీపోయిందని.. ఇది కావాలని చేసింది కాదని అన్నారు. రాహుల్ ఏం సమాధానం చెప్తారు: ప్రకాశ్ జవడేకర్ సిద్ద రామయ్య మహిళతో అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దీనిపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. మహిళతో సిద్ద రామయ్య ప్రవర్తన చూస్తుంటే.. వారు మహిళలను ఏ రకంగా గౌరవిస్తారో తెలుస్తుందన్నారు. ఇది తీవ్రమైన నేరం అని తెలిపారు. వారు ఒక కుటుంబానికి చెందిన మహిళలను మాత్రమే గౌరవిస్తారని జవడేకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
వైరల్ వీడియో.. అనూహ్య సాయం
వాషింగ్టన్ : సోషల్ మీడియా వల్ల కీడు మాత్రమే కాదు అప్పుడప్పుడు మేలు కూడా జరుగుతుంటుంది. ఇందుకు అద్దం పట్టే సంఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో వల్ల ఓ వ్యక్తికి ఊహించని సాయం లభించింది. వివరాల ప్రకారం.. వీడియోలో ఉన్న వ్యక్తి పేరు జెరెమీ డుఫ్రెస్ని. ఇతనికి కుటుంబం ఉన్నా ఇల్లు లేదు. చిన్నా చితకా పనులు చేసుకుంటూ ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్నాడు. తన హై స్కూల్ రోజుల నుంచే అతనికి ఈ కష్టాలు మొదలైనట్లు సమాచారం. ఈ క్రమంలో అతను ప్రతి రోజు సాయంత్రం సిరాక్యూస్‌లో ఉన్న డంకిన్ డోనట్స్ రెస్టారెంట్‌కి వెళ్లి తన ఫోన్ చార్జింగ్ పెట్టుకునే వాడు. ఈ క్రమంలో గత ఆదివారం కూడా రోజులానే సదరు రెస్టారెంట్‌కు వెళ్లి తన ఫోన్ చార్జింగ్ పెట్టుకున్నాడు. ఆ సమయంలో కాస్తా నిద్ర మత్తుగా అనిపించడంతో టెబుల్ మీద తల వాల్చాడు. అంతే ఈ లోపు అక్కడ పనిచేసే ఓ ఉద్యోగి వచ్చి జెరెమీ మీద మగ్గుతో నీళ్లు కుమ్మరించాడు. అంతటితో ఊరుకోక ‘నీకు ఎన్ని సార్లు చెప్పాలి.. ఇక్కడ నిద్ర పోకూడదంటూ’ తిట్టడం ప్రారంభించాడు. కానీ జెరెమీ మాత్రం ఏం మాట్లాడకుండా తన ఫోన్ తీసుకుని బయటకు వెళ్లి పోయాడు. ఈ తతంగమంతా అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు కేవలం రెండు రోజుల్లోనే 5 మిలియన్ల(50 లక్షలు) వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు డంకిన్ డోనట్స్ ఉద్యోగుల ప్రవర్తన అమానవీయంగా ఉందంటూ విమర్శిస్తున్నారు. న్యూయార్కలో ఇలాంటి సంఘటనలను క్రిమినల్ నేరాలుగా పరిగణిస్తారని హెచ్చరించడమే కాకా సదరు ఫుడ్ సెంటర్ ముందు నిరసన ప్రదర్శన కూడా చేపట్టారు. Dunkin Donuts in #Syracuse is new flashpoint on homelessness after video apparently shows store worker dump water on sleeping homeless man to get him to leave. Photo: Cheryl Neri pic.twitter.com/EQUwJSY71h — Michael Benny (@MichaelBenny) October 1, 2018 ఫలితంగా డంకిన్ డోనట్స్ యాజమాన్యం జెరెమీ పట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఈ వీడియో చూసిన వారు జెరెమీ పేదరికానికి జాలీ పడి అతనికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 21 వేల అమెరికన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో 15,50,325 రూపాయలు) సేకరించి అతనికి అందజేశారు. -
పోలీస్ స్టేషన్లో మద్యం సేవించి..అసభ్యంగా ప్రవర్తించి..
-
చిత్ర దర్శకుడికి దేహశుద్ధి
టీ.నగర్: సినిమా అవకాశాలు ఇప్పిస్తానని యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిని చిత్ర దర్శకుడికి ప్రజలు సోమవారం దేహశుద్ధి జరిపారు. ఈరోడ్ సమీపానగల మామరత్తుపాళయం ప్రాంతానికి చెందిన కవిత (21), కైకాట్టివలసు ప్రాంతానికి చెందిన ఓవియ (20). ఇరువురూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. చెన్నైకు చెందిన సెల్వకుమార్ అనే వ్యక్తి తాను చిత్ర దర్శకుడనని, వారికి అవకాశాలు ఇప్పిస్తానని చెప్పాడు. అసిస్టెంట్ డైరెక్టర్ జ్ఞానవేల్, బ్రోకర్ ముత్తుకుమార్తో కరుప్పు పూనై (నల్లని పిల్లి) పేరుతో సినిమా తీస్తున్నట్లు నమ్మబలికాడు. అంతేకాకుండా వారి వద్ద నగదు వసూలు చేసినట్లు తెలిసింది. తర్వాత వీరిని చెన్నైలోని ఒక లాడ్జిలో ట్రెయినింగ్ ఇప్పిస్తామని చెప్పి తీసుకువచ్చారు. అక్కడ వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. అక్కడి నుంచి వారు తప్పించుకున్నారు. ఈ స్థితిలో సెల్వకుమార్ పెరుందురై సమీపానగల కాంచి కొండయమ్మన్ కాట్టువలసు ప్రాంతానికి వస్తున్నట్లు తెలుసుకున్న కవితా, ఓవియా తమ బంధువులతో అక్కడికి చేరుకుని సెల్వకుమార్, అతని స్నేహితులు ముగ్గురిపై చెప్పులతో దాడి జరిపారు. అనంతరం కాంచికోవిల్ పోలీసు స్టేషన్లో అప్పగించారు. -
అర్చకుడిపై ఇద్దరు మహిళల ఆరోపణలు
పనాజి : ఓ అర్చకుడు తమతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఇద్దరు మహిళలు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గోవాలోని మంగూషి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ అర్చకుడు తమను కౌగిలించుకోవడంతో పాటు, ముద్దు పెట్టుకున్నాడని ఇద్దరు మహిళలు వేర్వేరుగా ఆలయ కమిటీకి లేఖలు రాశారు. గత నెలలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 14న ఆ అర్చకుడిపై తొలి ఫిర్యాదు రాగా, రెండోది జూన్ 22న వచ్చింది. ఈ విషయాన్ని ఆలయ సెక్రటరీ అనిల్ కేన్ర్క్ ధ్రువీకరించారు. సదరు మహిళల ఆరోపణల్లో నిజం లేదని తమ ప్రాథమిక విచారణలో తెలిందన్నారు. ఒకవేళ ఆ లేఖల్లో ప్రస్తావించిన అంశాలు నిజమని తెలితే అర్చకుడిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కానీ ఇప్పుడే అతన్ని తన విధుల నుంచి సస్పెండ్ చేయలేమన్నారు. ‘నేను కుటుంబంతో పాటు గుడికి వచ్చినప్పుడు, అర్చకుడి పాదాలకు నమస్కరించే సమయంలో తను నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో నేను భయపడి అక్కడి నుంచి వచ్చేశాను. ఆ సమయంలో తన తల్లిదండ్రులు ఆలయంలో వేరేచోట ఉన్నారు. మీకు అంతగా అనుమానం ఉంటే ఆ రోజు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించాల’ని మొదట ఫిర్యాదు చేసిన మహిళ తన లేఖలో పేర్కొంది. మరో మహిళ తన లేఖలో ఆ అర్చకుడు లాకర్ ఏరియాలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, ముద్దు కూడా పెట్టాడాని ఆరోపించారు. అకస్మాత్తుగా అతను అలా చేయడంతో తాను ఆశ్చర్యపోయానని తెలిపారు. ఆధారాల కోసం సీసీటీవీ దృశ్యాలను పరిశీలించాలని కోరారు. అతడు నాతో అసభ్యకరంగా ప్రవర్తించిన చోట సీసీ కెమెరాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. కాగా రెండో మహిళ లేఖకు అనిల్ స్పందించారు. ఆమె ఫిర్యాదుపై జూలై 4వ తేదీన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టగా.. అందులో నిజం లేదని తెలిందన్నారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేపట్టడానికి ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. కావాంటే ఆమె సంబంధిత అధికారులను సంప్రదించాల్సిందిగా సూచించారు. -
మా అమ్మను వేధిస్తారా: వేదికపై సింగర్ల గలాట
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన తాజ్ మహోత్సవ్‌లో ఇద్దరు సింగర్లు వేదికపై రభస చేశారు. ఈ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. తాజ్ మహోత్సవ్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమ్లాల్లో భాగంగా గాయకులు పలక్ ముచ్చల్, ఆమె సోదరుడు పలాష్ ముచ్చల్ సంగీత విభావరి ఇచ్చారు. అయితే, ఈ సమయంలో ఒక నిర్వాహకుడు తమ తల్లితో దురుసుగా ప్రవర్తించాడంటూ.. వారు వేదికపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై రచ్చ చేస్తూ.. నిర్వాహకుడి తీరుపై పలక్ మండిపడింది. అతను తన తల్లికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వేదిక మీద మైక్‌లో ఆమె పేర్కొనడం వీడియోలో వినిపిస్తోంది. సాంస్కృతిక కార్యక్రమం మధ్యలోనే గాయకులు ఇలా గొడవకు దిగడంతో నిర్వాహకులు జోక్యం చేసుకొని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. తాజ్‌మహల్‌ను, మొఘల్ సంస్కృతిని గుర్తుచేసుకునేందుకు ప్రతి ఏడాది యూపీ సర్కారు తాజ్ మహోత్సవ్ నిర్వహించే సంగతి తెలిసిందే. -
బిల్డింగ్‌పై నుంచి మహిళలను అసభ్యంగా వీడియో తీసి..
సాక్షి, కరీంనగర్: ఉన్నత విద్యను అభ్యసించి సర్కారు కొలువులో ఉన్న ఓ ఉద్యోగి బుద్ధి గడ్డితింది. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి.. నడిబజారులో చెప్పుదెబ్బలు తిన్నాడు. బిల్డింగ్‌పై నుంచి చూస్తూ.. బాత్రూమ్కు వెళ్ళే మహిళలను సెల్ఫోన్లో చిత్రీకరించడంతో స్థానికులు సదరు ఉద్యోగిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. కరీంనగర్‌లోని జ్యోతి నగర్లో ఈ ఘటన జరిగింది. ఇక్కడే నివాసం ఉండే ఓదేలు ఎస్సారెస్పీలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. తన ఇంటి చుట్టుపక్కల మహిళలను తన సెల్ఫోన్లో వీడియోలు తీస్తూ అతను అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని.. స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ అతన్ని పట్టుకున్నారు. ఇంట్లో నుంచి అతన్ని రోడ్డుపైకి లాక్కొచ్చి మహిళలు చెప్పులతో చితక్కొట్టారు. మహిళలతోపాటు స్థానిక యువకులు సైతం ఉద్యోగిపై చితకబాదారు. మహిళల కాళ్లు మొక్కించారు. ఉద్యోగి తల్లి అడ్డుకోగా ఆమెను సైతం స్థానికులు నెట్టేసి ఉద్యోగికి బుద్ది చెప్పారు. మరోసారి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే సీరియస్ గా ఉంటుందని హెచ్చరించి వదిలేశారు. బాధితుడికి పెళ్లి అయినప్పటికీ ఆయన చేష్టలతో వేగలేక భార్య దూరంగా ఉంటుందని స్థానికులు తెలిపారు. -
కుమార్తెతో అసభ్య ప్రవర్తన.. తండ్రిపై కేసు
ఇరగవరం : కుమారైతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ తండ్రిపై కేసు నమోదు చేసినట్టు ఇరగవరం ఎస్సై కేవీవీ శ్రీనివాస్ తెలి పారు. వివరాలిలా ఉన్నాయి.. ఇరగవరం శివారు అనుమాజిపాలెంకు చెందిన ఉందుర్తి రఫాయేలు అనే వ్యక్తి రెండో వివాహం చేసుకుని కొంతకాలం నుంచి మొదటి భార్యతో విడిగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో మొదటి భార్య కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. గిరిజన యువతిపై అత్యాచారం బుట్టాయగూడెం: గిరిజన యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు అం దిందని ఎస్సై డి.కాళీచరణ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. కామయ్యకుంటకు చెం దిన టి.గంగరాజు తనను అత్యాచారం చేసినట్టు మొద్దప్పగూడెంకు చెందిన ఓ గిరిజన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. -
విమానంలో అసభ్య ప్రవర్తన.. వ్యక్తి అరెస్టు
విమానంలో ఉండగా ఓ మహిళా స్టివార్డుతో అసభ్యంగా ప్రవర్తించి, ఆమెను తిట్టినందుకు పాకిస్తానీ సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడిని యూకే పోలీసులు అరెస్టు చేశారు. ఇస్లామాబాద్ నుంచి బర్మింగ్‌హామ్ వెళ్తున్న పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ విమానం పీకే-791లో పాకిస్తానీయులైన ఐదుగురు కలిసి ప్రయాణిస్తున్నారు. ప్రయాణ సమయంలో ఉండగా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి లావెటరీలో సిగరెట్లు కాలుస్తుండటాన్ని సిబ్బంది గమనించారు. విమాన ప్రయాణ నిబంధనలకు అది బద్ధ వ్యతిరేకం. ఇలా చేయకూడదని ఒక మహిళా స్టివార్డు వాళ్లకు చెప్పగా, వాళ్లు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి. అందులోనూ వాళ్లలో ఒక వ్యక్తి ఆమెను దారుణంగా తిట్టాడని ఆరోపించారు. దాంతో ఈ విషయాన్ని ఆమె పైలట్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో బర్మింగ్‌హామ్‌లో విమానం దిగడానికి ముందే ఆయన అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురు ప్రయాణికులను విమానం నుంచి దించేసి, వారిలో బాగా అతి చేసిన ఒక వ్యక్తిని మాత్రం పోలీసులు అరెస్టు చేశారు.