కాబూల్: ప్రపంచకప్ టోర్నీకి అనూహ్యంగా దూరమైన అఫ్గాన్ పేసర్ అఫ్తాబ్ ఆలమ్‌పై ఏడాదిపాటు నిషేధం విధించారు. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు, దేశవాళీ టోర్నీలకూ దూరంగా ఉండాలంటూ అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు అతన్ని హెచ్చరించినట్లు ఆలస్యంగా తెలిసింది. ప్రపంచకప్‌లో జూన్ 22న సౌతాంప్టన్‌లో భారత్‌తో ఆడిన మ్యాచే అతనికి చివరిది. ఈ మ్యాచ్ అనంతరం సౌతాంప్టన్ హోటల్‌లో ఒక మహిళతో అఫ్తాబ్ తప్పుగా ప్రవర్తించినట్లు తేలింది.
దీంతో జూన్ 23న ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్ సమావేశానికి హాజరై వివరణ ఇవ్వాలని కోరగా... అతను కావాలని సమావేశానికి గైర్హాజరవ్వడంతో కోచ్ ఫిల్ సిమన్స్ తర్వాతి రెండు మ్యాచ్‌ల నుంచి అఫ్తాబ్‌ను తప్పించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అఫ్తాబ్ ప్రపంచకప్‌నకు దూరమవుతున్నాడని ఆయన ప్రకటించారు. తదుపరి ఈ ఘటనపై అఫ్గాన్ క్రికెట్ బోర్డు క్రమశిక్షణా కమిటీ విచారించి గత వారం జరిగిన సర్వసభ్య సమావేశంలో 26 ఏళ్ల అఫ్తాబ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.
Comments
Please login to add a commentAdd a comment