నాలుగు వరల్డ్‌కప్‌లు.. ఓ ఆసియాకప్‌​! కట్‌ చేస్తే షాకింగ్‌ రిటైర్మెంట్‌ | Afghanistan Pacer Shapoor Zadran Announces Retirement From International Cricket, Post Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Shapoor Zadran Retirement: నాలుగు వరల్డ్‌కప్‌లు.. ఓ ఆసియాకప్‌​! కట్‌ చేస్తే షాకింగ్‌ రిటైర్మెంట్‌

Published Fri, Jan 31 2025 1:37 PM | Last Updated on Fri, Jan 31 2025 7:18 PM

Afghanistan pacer Shapoor Zadran retires from international cricket

అఫ్గానిస్తాన్ వెట‌ర‌న్ పేస‌ర్ షాపూర్ జ‌ద్రాన్( Shapoor Zadran) కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు ప‌లికాడు. 37 ఏళ్ల జద్రాన్‌ త‌న నిర్ణ‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు. "ఈ రోజు అంత‌ర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పల‌కాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఇది నా జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయాలలో ఒకటి. కానీ ప్ర‌తీ ఒక్క క్రికెట‌ర్ ఏదో ఒక‌రోజు త‌న కెరీర్‌ను ముగించ‌క త‌ప్ప‌దు. 

క్రికెట్‌ను నేను ఎప్పుడూ గేమ్‌గా చూడ‌లేదు, నా జీవితంలో భాగంగానే భావించాను. ఈ గేమే నాకంటూ ఓ గుర్తింపు తీసుకొచ్చింది. అటువంటి గేమ్‌ను వ‌దిలేయ‌డం నిజంగా చాలా బాధకారం. నాకు మ‌ద్ద‌తుగా నిలిచిన అఫ్గానిస్తాన్ క్రికెట్‌కు, నా సహచరులు, అభిమానులంద‌రికి ధ‌న్యవాదాలు" అని షాపూర్ ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు.

కాగా 2009లో అఫ్గానిస్తాన్ త‌ర‌పున అంత‌ర్జాతీయ అర‌గేట్రం చేసిన షాపూర్‌.. దాదాపు పదేళ్ల పాటు త‌న దేశానికి సేవ‌లు అందించాడు. అఫ్గాన్ క్రికెట్ ఎదుగుదలలో ఈ లెఫ్ట్ ఆర్మ్ పేస‌ర్‌ ప్రధాన పాత్ర పోషించాడనే చెప్పాలి. జ‌ద్రాన్ 2020లో గ్రేటర్ నోయిడాలో ఐర్లాండ్‌తో తన చివరి మ్యాచ్‌ ఆడాడు. ఆ తర్వాత అతడికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు.

షాపూర్ జ‌ద్రాన్ త‌న కెరీర్‌లో 44 వ‌న్డేలు, 36 టీ20ల్లో అఫ్గాన్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. రెండు ఫార్మాట్లలో కలిపి మొత్తం 80 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అదేవిధంగా మూడు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ల(2010, 2012, 2016)లో అఫ్గాన్ త‌ర‌పున జ‌ద్రాన్ ఆడాడు. 2014 ఆసియాకప్‌లో కూడా జద్రాన్‌ ఆడాడు. ఈ మూడు వరల్డ్‌కప్‌లలో 9 వికెట్లను జద్రాన్‌ ‍తన ఖాతాలో వేసుకున్నాడు. అదేవిధంగా జద్రాన్‌ 2014, 2016 ఆసియాకప్‌లలో కూడా భాగమయ్యాడు.

 

 

ఇక 2015 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో స్కాట్లాండ్‌పై అఫ్గానిస్తాన్ విజ‌యం సాధించ‌డంలో జ‌ద్రాన్‌ది కీల‌క పాత్ర‌. అఫ్గాన్‌కు వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అదే తొలి విజ‌యం కావ‌డం గ‌మనార్హం.  ఈ మ్యాచ్‌లో జ‌ద్రాన్ త‌న ప‌ది ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం 38 ప‌రుగులిచ్చి 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. జద్రాన్‌ మొత్తంగా తన కెరీర్‌లో నాలుగు వరల్డ్‌కప్‌లలో ఆడాడు.
చదవండి: టీ20 ప్రపంచకప్‌-2025: ఆసీస్‌ను చిత్తు చేసి ఫైనల్లో సౌతాఫ్రికా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement