
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా మహిళల జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ క్రికెటర్ లిజెల్ లీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. లిజెల్ లీ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా శుక్రవారం ప్రకటించింది. ఈ విధ్వంసకర ఓపెనర్ 184 అంతర్జాతీయ మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించింది.
లీ తన కెరీర్‌లో నాలుగు నాలుగు సెంచరీలతో సహా 5253 పరుగులు సాధించింది. ఇక ఈ ఏడాది జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ ప్రోటీస్ జట్టులో లీ భాగంగా ఉంది. ఈ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరడంలో లీ కీలక పాత్ర పోషించింది.
"ఈ రోజు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాను. నాకు చిన్నతనం నుంచి క్రికెట్ నా జీవితంలో భాగమైంది. ముఖ్యంగా నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా గర్వంగా ఉంది. గత 8 ఏళ్లుగా దక్షిణాఫ్రికా క్రికెట్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ప్రోటీస్ జట్టు నా వంతు సహకారం అందించాని భావిస్తున్నాను" అని లీ పేర్కొంది.
చదవండి: Bhuvneshwar Kumar Inswinger: భువీ ఇన్‌స్వింగర్.. బట్లర్ బౌల్డ్.. వీడియో వైరల్
— Lizelle Lee (@zella15j) July 8, 2022