Retirement
-
ఆంతా వాళ్లే చేశారంట..! క్రికెటర్ల తండ్రుల ఆవేదన
-
కుదుపు రేపే నిర్ణయం
భారత క్రికెట్ రంగంలో బుధవారం ఉరుము లేని పిడుగు పడింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు అయిదు టెస్ట్‌లు ఆడుతుండగా సిరీస్ మధ్యలోనే అగ్రశ్రేణి భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించడం అనేకమందిని ఆశ్చర్యపరిచింది. ఆస్ట్రేలియాలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని మూడో టెస్ట్‌తో పాటు అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ సైతం ముగిసింది. సంచలనం రేపిన ఈ వార్త పలు అనుమానాలు, ఊహాగానాలకు కూడా తెర తీసింది. తాజాగా పెర్త్, బ్రిస్బేన్ మ్యాచ్‌లలో తుది జట్టులో స్థానం దక్కకపోవడంతో అశ్విన్ స్వచ్ఛందంగా ఆట నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. ‘సిరీస్‌లో ఇప్పుడు నా అవసరం లేనట్టయితే, ఆటకు గుడ్‌బై చెప్పేస్తాను’ అంటూ రిటైర్మెంట్కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ఆయన తేల్చిచెప్పేశారు. ‘ఆడే సత్తా నాలో ఇంకా మిగిలే ఉంది. బహుశా, (ఐపీఎల్ లాంటి) క్లబ్–స్థాయి క్రికెట్లో దాన్ని చూపుతాను. భారత జట్టు తరఫున ఆడడం మాత్రం ఇదే ఆఖరి రోజు’ అన్న అశ్విన్ ప్రకటన క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేని విషయమే. మొత్తం 106 టెస్టుల్లో 537 వికెట్లు సాధించిన అశ్విన్ అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత క్రికెటర్. 132 మ్యాచ్‌లలో 619 వికెట్లు సాధించిన నిన్నటి తరం అగ్రశ్రేణి స్పిన్నర్ అనిల్ కుంబ్లే తరువాత అలా ద్వితీయ స్థానంలో నిలిచారు అశ్విన్. బంతితోనే కాదు... బ్యాట్‌తోనూ అరడజను శతకాలు, 14 అర్ధ శతకాలతో 3,503 పరుగులు సాధించిన ఘనత ఆయనది. ఇంకా చెప్పాలంటే, గత 14 ఏళ్ళ పైచిలుకు కాలంలో స్వదేశంలో భారత జట్టు తిరుగులేని శక్తిగా ఎదగడం వెనుక ఈ తమిళ తంబి కీలక పాత్రధారి. ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆయన ఏకంగా 11వ సారి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికై, ప్రపంచ రికార్డును సమం చేశారు. బరిలో ఓర్పు, బంతి విసరడంలో నేర్పు, ప్రత్యర్థిని బోల్తా కొట్టించడంలో నైపుణ్యం ఉన్న తెలివైన ఆటగాడాయన.అందుకే, ఆటలో ఈ అగ్రశ్రేణి ఆఫ్ స్పిన్నర్ చూపే ప్రతిభకు ప్రేక్షకులు జేజేలు పలికారు. ప్రస్తుత భారత జట్టు బౌలర్లలో ప్రత్యేకంగా నిలిచారు. ఏ క్రికెటరైనా విదేశాల్లో కాకుండా సొంతగడ్డపై ఆటకు స్వస్తి పలకాలనుకుంటారు. అది సర్వసాధారణం. ఎందుకంటే, స్వదేశంలో సొంత క్రీడాభిమానుల జయజయ ధ్వానాల మధ్య ఘనంగా వీడ్కోలు పలకవచ్చని భావిస్తారు. కానీ, అశ్విన్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. దానికి కారణాలు లేకపోలేదు. ఆడే సత్తా ఉన్న ఏ క్రీడాకారుడైనా బరిలో ఉండాలనుకుంటాడే తప్ప, అవకాశం కోసం నిరీక్షిస్తూ బెంచ్ మీద కూర్చొనే జాబితాలో చేరాలనుకోడు. అది ఎవరికైనా బాధాకరమే. అలాంటిది... టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆరు టెస్ట్ సెంచరీలు, 500కు పైగా వికెట్లు తీసుకొన్న ఏకైక క్రికెటర్‌కు తరచూ అలాంటి అనుభవం ఎదురైతే? అది మరింత బాధ కలిగిస్తుంది. 38 ఏళ్ళ వయస్సులో, కెరీర్లో కాలం కరిగిపోతున్న వేళ... అశ్విన్‌కు అది అవమానమూ అనిపించింది. భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా సిరీస్‌లో మధ్యలో ఆయన హఠాత్తుగా తన రిటైర్మెంట్ ప్రకటించారనుకోవాలి. సరిగ్గా పదేళ్ళ క్రితం 2014 డిసెంబర్లో మరో అగ్రశ్రేణి భారత క్రికెటర్ ధోనీ సైతం ఇలాగే ఆటకు అల్విదా చెప్పారు. ఈ వాస్తవ పరిణామాలన్నీ గమనిస్తూ, క్షేత్రస్థాయి అంశాలను గమనంలోకి తీసుకున్న వారికి మాత్రం అశ్విన్ నిర్ణయం మరీ దిగ్భ్రాంతికరంగా తోచదు. అదే సమయంలో జీవితంలో, ఆటలో అత్యంత కఠినమైన ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కూడా విమర్శల జోలికి పోకుండా, పక్కా జెంటిల్మన్గానే వ్యవహరిస్తూ అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించడం చెప్పుకోదగ్గ విషయం. ఆస్ట్రేలియా సిరీస్‌లోని తొలి మూడు టెస్టుల్లో అడిలైడ్‌లోని రెండో టెస్ట్‌లో మాత్రమే అశ్విన్‌కు జట్టులో స్థానం దక్కింది. ప్రతిభావంతుడైన పాతికేళ్ళ వాషింగ్టన్ సుందర్ అంతకంతకూ ముందు కొస్తూ, అశ్విన్‌ను పక్కకు జరిపి జట్టులో చోటు సంపాదించుకుంటూ పోతున్నారు. ఫలితంగా అశ్విన్ హుందాగానే పక్కకు తప్పుకున్నారు. వికెట్లు పడగొట్టడంలో పేరున్న ఈ స్పిన్నర్ నిర్ణయం ‘వ్యక్తిగతం’ అని రోహిత్ శర్మ చెప్పారు కానీ రిటైర్మెంట్ ప్రకటన అనంతరం విలేఖరుల ప్రశ్నలు వద్దని అశ్విన్ సున్నితంగానే తప్పుకోవడంతో కంటికి కనిపించని కథలున్నాయనే వాదనకు బలం చేకూరింది. అయితే, అశ్విన్ ఆది నుంచి జట్టు సమష్టి ప్రయోజనాలకై ఆడినవారే. అనేక సందర్భాల్లో సెలెక్టర్ల బంతాటలో వైట్ బాల్ గేమ్స్‌లో స్థానం దక్కించుకోకున్నా, పట్టుదలతో ఆడుతూ తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికీ కనీసం మరో రెండేళ్ళ పాటు అంతర్జాతీయ స్థాయిలో ఆడగల సత్తా ఆయనకుంది. అయినా పక్కకు తప్పుకున్నారు. గతంలో ధోనీ ఆస్ట్రేలియాతోనే మెల్ బోర్న్ టెస్ట్‌లో హుందాగా టెస్ట్ క్రికెట్ నుంచి పక్కకు తప్పుకొని, యువకులకు దోవ ఇచ్చారు. కార ణాలేమైనా, అశ్విన్ ప్రస్తుతానికి పెదవి విప్పి పెద్దగా చెప్పకుండానే పదవీ విరమణ ప్రకటించారు. పేరు ప్రతిష్ఠలు, డబ్బు అన్నీ కెరీర్లో భాగమైన ఆటగాళ్ళు వాటన్నిటినీ వదులుకొని, రిటైరవుతున్నట్టు చెప్పడం నిజానికి ఎప్పుడూ కష్టమే. అశ్విన్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. కాకుంటే, పైకి గంభీరంగా కనిపిస్తూ భావోద్వేగాల్ని ప్రదర్శించకపోవడం విశేషం. అశ్విన్ వ్యక్తిగతం మాటెలా ఉన్నా, ఆయన నిష్క్రమణతో భారత క్రికెట్ ఇప్పుడో చిత్రమైన సంధి దశలో నిలిచింది. బహుశా, ఈ ప్రతిభావంతుడి తాజా నిర్ణయంతో ఒకప్పటి ఫామ్ కోల్పోయి, తడబడుతున్న రోహిత్ శర్మ, కోహ్లీలు సైతం ఆత్మపరిశీలనలో పడాల్సి రావచ్చు. ఎంతైనా ఆర్ట్ ఆఫ్ ‘లీవింగ్’ కూడా ఆర్ట్ ఆఫ్ ‘లివింగ్’లో భాగమే కదా! వెరసి, అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం అన్వేషణతో పాటు ఆయన నిష్క్రమణకు దారి తీసిన పరిస్థితులపై చర్చ చాలాకాలం కొనసాగడం ఖాయం. -
కృష్ణభక్తురాలిగా ఐపీఎస్ అధికారిణి .. పదేళ్ల సర్వీస్ ఉండగానే..
మనం పురాణాల్లో భక్త కబీర్, రామదాసులాంటి వాళ్లు భక్తులుగా ఎలా మారారో కథల్లో చదివాం. వారి భక్తి పారవశ్యంతో దైవానుగ్రహాన్ని ఎలా పొందారో కథలు కథలుగా చదివాం. అయితే అలాంటి సఘటనే రియల్‌గా చోటు చేసుకుంది. అచ్చం ఆ భక్తాగ్రేసుల మాదిరిగా మారిపోయి సాధు జీవితాన్ని గడిపోతుంది. అంతటి అత్యున్నత సివిల్ సర్వీస్‌లో ఉన్న ఆమె అన్నింటిని పరిత్యజించి ఆధ్యాత్మికత వైపుకి అడుగులు వేసింది. ఆమె చెబితే గానీ తెలియనంతగా ఆహార్యం, జీవన విధానం మారిపోయింది. ఇంతకీ ఎవరామె..? ఆధ్యాత్మికత వైపుకి ఎలా ఆకర్షితురాలైంది అంటే..ప్రతిష్టాత్మకమైన సివిల్స్ పరీక్షలో విజయం సాధించడమంటే మామాలు మాటలు కాదు. మంచి ర్యాంకుతో ఐఏఏస్ లేదా ఐపీఎస్లాంటివి దక్కితే ఆ రేంజ్, హోదానే వేరెలెవెల్. ఎంతటి వారైనా వారి ముందు నిల్చొక తప్పదు. అంతటి ఐపీఎస్ అత్యున్నత పదవిని అలంకరించింది భారతి అరోరా. 1998 బ్యాచ్‌కి చెందిన ఈ మాజీ అధికారిణి హర్యానాలోని పలు జిల్లాల్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా సేవలందించింది. అలాగే కర్నాల్‌లో ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ)గా పనిచేశారు. ఆమె కెరీర్ మొత్తం బాబు పేలుళ్లకు సంబంధించిన కేసులను చాకచక్యంగా చేధించింది. అంతేగాదు ఎస్పీగా ముక్కుసూటి వైఖరితో.. ప్రముఖ రాజకీయ నాయకుడుని అరెస్టు చేసి వార్తల్లో నిలిచారు. సాహసోపేతమైన నిర్ణయాలతో నాయకులకే చెమటలు పట్టించిన చరిత్ర ఆమెది. నేరాలను అదుపు చేసేందుకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికైనా.. వెనుకడుగు వేయని ధీర వనిత భారతి అరోరా. అలాంటి ఆమె అనూహ్యంగా ఆధ్యాత్మికత వైపుకి ఆకర్షితురాలైంది. భక్తురాలిగా మార్పు ఎలా అంటే..2004లో బృందావనాన్ని దర్శించుకోవడానికి వెళ్లారు భారతి. అక్కడే ఆమెకు కృష్ణ భక్తిపై అమితమైన మోహం ఏర్పడింది. అలా ఆ పరంధామునిపై అమితమైన భక్తిని పెంచుకుంది. అదే ఏ స్థాయికి చేరుకుందంటే..సర్వం పరిత్యజించి కృష్ణునికి అంకితమైపోవాలన్న భక్తిపారవశ్యానికి లోనైంది. ఆ నేపథ్యంలోనే ఇంకా పదేళ్ల సివిల్ సర్వీస్ ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి కృష్ణ భక్తురాలిగా మారిపోయింది. చెప్పాలంటే అచ్చం మీరాభాయిలా కృష్ణుడుని ఆరాధిస్తూ..సాధువులా జీవితం గడుపుతోంది మాజీ ఐపీఎస్ అధికారిణి భారతి అరోరా. (చదవండి: 75 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా నటుడు నానా పటేకర్...ఇప్పటికీ ఆ అలవాటు..!) -
స్నేహితుడే కారణమా..? అశ్విన్ రిటైర్మెంట్ వెనుక సంచలన నిజాలు
-
నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలు
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటనపై అతని తండ్రి రవిచంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కొడుకు చాలా కాలంగా అవమానానికి గురవుతున్నాడని, అందుకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చిందని వివాదాస్పద కామెంట్స్ చేశాడు. అద్భుతమైన కెరీర్ రికార్డు కలిగి ఉన్నప్పటికీ ప్లేయింగ్ XIలో రెగ్యులర్‌గా స్థానం పొందలేకపోవడాన్ని యాష్ అవమానంగా భావించవచ్చని అభిప్రాయడపడ్డాడు.CNN న్యూస్ 18కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రవిచంద్రన్ మాట్లాడుతూ.. తన కొడుకు చాలాకాలంగా అవమానాలకు గురవుతున్నాడని ఆరోపించాడు. యాష్ ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే కారణం అయ్యుండవచ్చని అభిప్రాయపడ్డాడు. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన విన్నప్పుడు అందరి లాగే తాను కూడా ఆశ్చర్యపోయానని అన్నాడు. అశ్విన్ రిటైర్మెంట్ గురించి తనకు కూడా చివరి నిమిషంలో తెలిసిందని తెలిపాడు. అశ్విన్ మనస్సులో ఏముందో తెలియదు కానీ, అతని నిర్ణయాన్ని మనస్పూర్తిగా అంగీకరిస్తున్నానని అన్నాడు. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన విధానం చూస్తే ఓ పక్క సంతోషం, మరో పక్క బాధగా ఉందని పేర్కొన్నాడు. రిటైర్మెంట్ అన్నది అశ్విన్ వ్యక్తిగతం. అందులో నేను జోక్యం చేసుకోలేను. కానీ అతని ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటన వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. అవి అశ్విన్‌కి మాత్రమే తెలుసు. బహుశా తనుకు రెగ్యులర్‌గా జట్టులో చోటు దక్కకపోవడాన్ని అశ్విన్ అవమానంగా భావించి ఉండవచ్చని రవిచంద్రన్ చెప్పుకోచ్చాడు. కాగా, రిటైర్మెంట్పై అశ్విన్ గత కొంతకాలంగా మదన పడుతున్న విషయాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్రస్తావించాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ వరకు రిటైర్మెంట్ను పోస్ట్‌పోన్ చేసుకోవాలని అశ్విన్‌ను కోరినట్లు హిట్‌మ్యాన్ స్వయంగా చెప్పాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ అనంతరం అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. -
స్వదేశానికి చేరుకున్న అశ్విన్.. కుటుంబ సభ్యుల ఘన స్వాగతం
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ అనంతరం స్వదేశానికి చేరుకున్నాడు. అశ్విన్ చెన్నైలోని తన స్వగృహానికి చేరుకోగానే కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బ్యాండ్ వాయిద్యాలతో అశ్విన్ ఇంటివద్ద కోలాహలం నెలకొంది. WELCOME BACK TO INDIA, RAVI ASHWIN. 🇮🇳❤️- Ash reaches Chennai after announcing his retirement. 🥹 pic.twitter.com/kIQ1gxzHIA— Mufaddal Vohra (@mufaddal_vohra) December 19, 2024వాయిద్యాల నడుమ అశ్విన్ తన భార్య, పిల్లలతో కలిసి ఇంట్లోకి ప్రవేశించాడు. అశ్విన్‌కు మొదటిగా తన తండ్రి ఎదురుపడి అభినందించాడు. అనంతరం కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా యాష్‌ను విష్ చేశారు. అభిమానులు యాష్‌ను పూల మాలలతో సత్కరించారు. ఫ్యాన్స్ అశ్విన్‌తో ఫోటోల కోసం, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు.HOME TOWN HERO IS BACK. 🇮🇳- A Grand welcome for Ravichandran Ashwin at his home. 🤍 pic.twitter.com/WNGywMr4Sj— Johns. (@CricCrazyJohns) December 19, 2024కాగా, అశ్విన్ ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్పై అశ్విన్ బీజీటీ ప్రారంభానికి ముందు నుంచే క్లారిటీ కలిగి ఉన్నాడు. అశ్విన్ తాను రిటైర్ కావాలనుకుంటున్న విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మతో తొలి టెస్ట్ సందర్భంగా చెప్పాడు. అయితే రోహిత్ అప్పుడు అశ్విన్‌ను వారించి రెండో టెస్ట్ వరకు ఎదురుచూడాలని కోరాడు. రెండో టెస్ట్ అయిన పింక్ బాల్ టెస్ట్‌లో అశ్విన్ చివరిసారి టీమిండియా జెర్సీలో కనిపించాడు. జట్టు సమీకరణల దృష్ట్యా ఆశ్విన్కు మూడో టెస్ట్‌లో ఆడే అవకాశం రాలేదు. దీంతో ఇదే రిటైర్మెంట్కు సరైన సమయమని భావించిన యాష్.. బ్రిస్బేన్ టెస్ట్ అనంతరం మీడియా సమావేశంలో తన మనోగతాన్ని వెల్లడించాడు.38 ఏళ్ల అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆస్ట్రేలియాను వీడి భారత్‌కు పయనమయ్యాడు. అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా దేశవాలీ క్రికెట్, ఐపీఎల్లో ఆడతాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అశ్విన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. అశ్విన్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 765 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల తరఫున 180 వికెట్లు తీశాడు. అశ్విన్ రిటైర్మెంట్ అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో భావోద్వేగంతో కూడిన సందేశాన్ని ఇచ్చాడు. -
అశ్విన్.. రిటైర్మెంట్ ప్రకటించడానికి సమయమా ఇది..?
ఆసీస్‌తో మూడో టెస్ట్ (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అశ్విన్ సడెన్‌గా ఆటకు వీడ్కోలు పలికినందుకు భారత అభిమానులంతా బాధపడుతుంటే.. క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ మాత్రం అశ్విన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాడు. సిరీస్ మధ్యలో ఈ ఆకస్మిక నిర్ణయమేంటని ప్రశ్నిస్తున్నాడు. అశ్విన్ రిటైర్ కావాలనుకుంటే సిరీస్ అయిపోయే దాకా వేచి ఉండాల్సిందని అన్నాడు. అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటన టీమిండియా ప్రణాళికలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇలాంటి దశలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన సిరీస్ ఫలితాన్ని తారుమారు చేయగలదని అంచనా వేశాడు. అశ్విన్ సిరీస్ మధ్యలో రిటైర్ కావడం వల్ల భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌లకు ఒక ఆటగాడి సేవలు కోల్పోతుందని అన్నాడు. గతంలో ఎంఎస్ ధోని కూడా ఇలాగే సిరీస్ మధ్యలో రిటైరైన విషయాన్ని ప్రస్తావించాడు. సిరీస్‌లో చివరిదైన సిడ్నీ టెస్ట్‌లో అశ్విన్ తన ప్రభావాన్ని చూపేందుకు ఆస్కారముండేదని అభిప్రాయపడ్డాడు. సిడ్నీ పిచ్‌కు స్పిన్నర్లకు సహకరించిన చరిత్ర ఉందని గుర్తు చేశాడు. అశ్విన్ నిర్ణయాన్ని తప్పుబడుతూనే గవాస్కర్ మరో కీలక వ్యాఖ్య చేశాడు. మిగిలిన సిరీస్ కోసం అశ్విన్‌తో పోలిస్తే వాషింగ్టన్ సుందర్ ముందున్నాడని అన్నాడు.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా ప్రారంభం కానుంది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే ఆసీస్‌తో తదుపరి జరుగబోయే రెండు టెస్ట్‌ల్లో గెలవాల్సి ఉంది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.మ్యాచ్ ఐదు రోజులు వర్షం అంతరాయాలు కలిగించడంతో మూడో టెస్ట్‌లో ఫలితం తేలలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో తడబడగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆకాశ్‌దీప్, బుమ్రా ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించారు. రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చేసే క్రమంలో ఆసీస్ త్వరితగతిన వికెట్లు కోల్పోయింది. అయినా భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివరి రోజు మరోసారి వరుణుడు విజృంభించడంతో కొద్ది సేపటికే మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. -
‘మిస్టర్ మేధావి’
సాక్షి క్రీడా విభాగం : భారత్, ఆ్రస్టేలియా మధ్య అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టుకు రెండు రోజుల ముందు అశ్విన్ మైదానానికి వెళ్లాడు. తనకు తెలిసిన ఒక మీడియా మిత్రుడిని పిలిచి అంతకుముందు అక్కడ జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ వీడియోలు ఎక్కడైనా దొరుకుతాయా అని అడిగాడు. స్పిన్నర్ లాయిడ్ పోప్ ఆ మ్యాచ్‌లో చెలరేగడాన్ని గుర్తు చేస్తూ పిచ్ ఎలా స్పందిస్తుందనే విషయాన్ని తెలుసుకునేందుకు అతను ప్రయత్నించాడు. ఒక టెస్టు మ్యాచ్ కోసం అశ్విన్ చేసే సన్నద్ధత ఇది. ఇలా సిద్ధం కావడం అశ్విన్ కెరీర్లో ఇది మొదటిసారేమీ కాదు. తాను ఆటలో అడుగు పెట్టిన నాటినుంచి ప్రతీ సిరీస్‌కు, ప్రతీ మ్యాచ్‌కు, ప్రతీ ఓవర్‌కు, ప్రతీ బంతికి కొత్త తరహాలో వ్యూహరచన చేయడం అతనికే చెల్లింది. ఆటపై అసాధారణ పరిజ్ఞానం, చురుకైన బుర్ర, భిన్నంగా ఆలోచించే తత్వం అతడిని అగ్ర స్థానానికి చేర్చాయి. సాంప్రదాయ ఆఫ్‌స్పిన్‌లో అత్యుత్తమ నైపుణ్యం మాత్రమే కాకుండా క్యారమ్ బాల్, ఆర్మ్ బాల్ అతని ఆయుధాలుగా ప్రత్యర్థి బ్యాటర్లను పడగొట్టాయి.స్పిన్ బౌలింగ్‌కు సైన్స్‌ను జోడిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది ఇంజినీరింగ్ చదివిన అశ్విన్ నిరూపించాడు. అశ్విన్ చేతికి బంతి ఇస్తే చాలు... భారత కెపె్టన్‌కు ఒక ధైర్యం వచ్చేస్తుంది. అతడికి నమ్మి బౌలింగ్ అప్పగిస్తే ఇక గుండెల మీద చేయి వేసుకొని ప్రశాంతంగా ఉండవచ్చనేది వారి భావన. ఆరంభంలోనే బ్యాటర్లను కట్టడి చేయాలన్నా, భారీ భాగస్వామ్యాలను విడదీయాలన్నా, ఓటమి దిశగా వెళుతున్న సమయంలో కూడా రక్షించాలన్నా అశ్విన్ ఆపన్నహస్తం సిద్ధంగా ఉండేది! అశ్విన్ తెలివితేటలు టీమిండియాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. తన బౌలింగ్ విషయంలోనే కాదు నాయకుడికి ఒక మంత్రిలా అండగా నిలవడంలో అతనికి అతనే సాటి. ఎన్నో ప్రణాళికల్లో, వ్యూహాల్లో అశ్విన్ భాగస్వామి. ఆటపై అతని సునిశిత పరిశీలన, వైవిధ్యమైన ఆలోచనాశైలితో ఎన్నోసార్లు అతను మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు పతనానికి కారకుడయ్యాడు. దురదృష్టవశాత్తూ సుదీర్ఘ కెరీర్లో ఒక్కసారి కూడా భారత్‌కు సారథిగా వ్యవహరించే అవకాశం రాకపోవడం మాత్రం ఒక లోటుగా ఉండిపోయింది. పైగా ఇంత గొప్ప కెరీర్ తర్వాత ఎలాంటి వీడ్కోలు మ్యాచ్ లేకుండా, ఘనమైన ముగింపు లేకుండా అతను తన ఆఖరి ఆట ఆడేయడం కూడా కాస్త చివుక్కుమనిపించేదే. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రిటైర్ అయిపోగా, కెరీర్ చివర్లో వరుస వైఫల్యాలతో హర్భజన్ సింగ్ ఇబ్బంది పడుతున్న దశలో అశ్విన్ కెరీర్ మొదలైంది. ముందుగా ఐపీఎల్, ఆపై వన్డే, టి20ల్లో ప్రదర్శనతో అందరి దృష్టిలో పడినా... తర్వాతి రోజుల్లో టెస్టు బౌలర్‌గా తన ముద్ర వేయగలిగి∙అరుదైన ఆటగాళ్లలో ఒకడిగా అతను నిలిచాడు. 2011లో ఆడిన తొలి టెస్టులోనే 9 వికెట్లతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా మొదలైన అతని ఆట అద్భుత కెరీర్‌కు నాంది పలికింది. తొలి 16 టెస్టుల్లోనే 9సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం అశ్విన్ స్థానాన్ని సుస్థిరం చేసింది. 2016–17 సీజన్లో నాలుగు సిరీస్‌లలో కలిపి 13 టెస్టుల్లో ఏకంగా 82 వికెట్లు పడగొట్టడం అశ్విన్ కెరీర్లో ఉచ్ఛదశ. ఒకటా, రెండా... ఎన్నో గుర్తుంచుకోదగ్గ గొప్ప ప్రదర్శనలు అతని స్థాయిని పెంచాయి. అశ్విన్ బంతులను ఎదుర్కోలేక ఉత్తమ బ్యాటర్లు కూడా పూర్తిగా తడబడి చేతులెత్తేసిన రోజులు ఎన్నో! స్టీవ్ స్మిత్, విలియమ్సన్, రూట్, డివిలియర్స్, అలిస్టర్ కుక్, డీన్ ఎల్గర్, డేవిడ్ వార్నర్, మైకేల్ క్లార్క్, కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే, బెన్ స్టోక్స్...అశ్విన్ ముందు తలవంచిన ఇలాంటి బ్యాటర్ల జాబితా చాలా పెద్దది. స్వదేశంలో అసాధారణ ఘనతల మధ్య అతడిని విమర్శించేందుకు కొందరు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ( ఉNఅ) దేశాల్లో అతని ప్రదర్శనను చూపిస్తుంటారు. ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన లేకపో యినా అతని బౌలింగ్ మరీ పేలవంగా ఏమీ లేదు. ఆయా పరిస్థితులను బట్టి తనకు తక్కువ అవకాశాలు వచ్చాయని (26 టెస్టులే ఆడాడు)... తన రికార్డును సవరించే అవకాశం కూడా ఎక్కువగా దక్కలేదని దీనిపై అశ్విన్ చెప్పుకున్నాడు. »ౌలింగ్కు తోడు అశ్విన్ బ్యాటింగ్ నైపుణ్యం అతడిని ఆల్‌రౌండర్ స్థాయికి చేర్చింది. ‘అండర్–17 స్థాయినుంచి నేను అశ్విన్‌తో కలిసి ఆడాను. అప్పట్లో అతను ఓపెనర్. కొన్నాళ్ల విరామం తర్వాత మేం తమిళనాడు జట్టు నుంచి అశ్విన్ అనే బౌలర్ అద్భుత గణాంకాలు చూసి అతను ఇతను వేరు అనుకున్నాం. ఎందుకంటే మాకు తెలిసిన అశ్విన్ బ్యాటర్ మాత్రమే. టెస్టు ఆటగాడిగా మనం ఎన్నో మంచి బ్యాటింగ్ ప్రదర్శనలు చూశాం. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు’ అని రోహిత్ బుధవారం గుర్తు చేసుకున్నాడు. ఆఫ్‌స్పిన్నర్‌గా ఎదగక ముందు ఉన్న ఆ అనుభవం భారత జట్టుకు కూడా కీలకంగా పనికొచి్చంది. టెస్టుల్లో ఎందరో బౌలర్లకు సాధ్యం కాని రీతిలో నమోదు చేసిన 6 సెంచరీలు అసాధారణ ప్రదర్శన. ఇటీవల బంగ్లాదేశ్‌తో చెన్నైతో జరిగిన టెస్టులో భారత్ 144/6 వద్ద ఉన్నప్పుడు చేసిన శతకం అతని బ్యాటింగ్ విలువను చూపించింది.2019 సిడ్నీ టెస్టులో తనను కాదని కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వడంతో పాటు విదేశాల్లో ఇతనే మా ప్రధాన స్పిన్నర్ అంటూ కోచ్ రవిశాస్త్రి చెప్పిన మాట అశ్విన్‌ను అప్పట్లో తీవ్రంగా బాధించింది. దానిని అతను ఆ తర్వాత చాలాసార్లు గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత దాదాపు అదే తరహా అనుభవాన్ని ఎదుర్కొంటూ మరొకరికి అవకాశం ఇవ్వకుండా తనంతట తానే రిటైర్మెంట్ను ప్రకటించాడు. -
ఈ ఏడాది రిటైరైన స్టార్ క్రికెటర్లు వీరే..!
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్తో అంతర్జాతీయ క్రికెట్లో ఒక శకం ముగిసినట్లనిపిస్తుంది. ఈ ఏడాది భారత్ సహా చాలా దేశాలకు చెందిన స్టార్ ఆటగాళ్లు రిటైరయ్యారు. వీరిలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా లాంటి స్టార్లు పొట్టి ఫార్మాట్‌కు మాత్రమే వీడ్కోలు పలుకగా.. డేవిడ్ వార్నర్, శిఖర్ ధవన్ లాంటి దిగ్గజ ప్లేయర్లు అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పారు. 2024లో ఇప్పటివరకు (డిసెంబర్ 18) 32 మంది అంతర్జాతీయ క్రికెటర్లు తమ కెరీర్లకు వీడ్కోలు పలికారు.ఈ ఏడాది తొలి వారంలోనే సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్, ఆసీస్ దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20 వరల్డ్ వరల్డ్‌కప్ అనంతరం టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు బై బై చెప్పారు. మధ్యలో శిఖర్ ధవన్.. జేమ్స్ ఆండర్సన్.. తాజాగా అశ్విన్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పారు.ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్లు..1. సౌరభ్ తివారి (అన్ని ఫార్మాట్లు)2. వరుణ్ ఆరోన్ (అన్ని ఫార్మాట్లు)3. దినేశ్ కార్తీక్ (అన్ని ఫార్మాట్లు)4. కేదార్ జాదవ్ (అన్ని ఫార్మాట్లు)5. విరాట్ కోహ్లి (టీ20లు)6. రోహిత్ శర్మ (టీ20లు)7. రవీంద్ర జడేజా (టీ20లు)8. శిఖర్ ధవన్ (అన్ని ఫార్మాట్లు)9. బరిందర్ స్రాన్ (అన్ని ఫార్మాట్లు)10. వృద్దిమాన్ సాహా (అన్ని ఫార్మాట్లు)11. సిద్దార్థ్ కౌల్ (భారత క్రికెట్)12. రవిచంద్రన్ అశ్విన్ (అంతర్జాతీయ క్రికెట్)ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన అంతర్జాతీయ క్రికెటర్లు..1. డీన్ ఎల్గర్ (సౌతాఫ్రికా, అన్ని ఫార్మాట్లు)2. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా, అన్ని ఫార్మాట్లు)3. హెన్రిచ్ క్లాసెన్ (సౌతాఫ్రికా, టెస్ట్‌లు)4. నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్, అన్ని ఫార్మాట్లు)5. కొలిన్ మున్రో (న్యూజిలాండ్, అన్ని ఫార్మాట్లు)6. డేవిడ్ వీస్ (నమీబియా, అన్ని ఫార్మాట్లు)7. సైబ్రాండ్ ఎంజెల్‌బ్రెచ్ (నెదర్లాండ్స్, అన్ని ఫార్మాట్లు)8. బ్రియాస్ మసాబా (ఉగాండ, టీ20లు)9. జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లండ్, అన్ని ఫార్మాట్లు)10. డేవిడ్ మలాన్ (ఇంగ్లండ్, అన్ని ఫార్మాట్లు)11. షాన్నోన్ గాబ్రియెల్ (వెస్టిండీస్, అన్ని ఫార్మాట్లు)12. విల్ పుకోవ్స్కీ (ఆస్ట్రేలియా, అన్ని ఫార్మాట్లు)13. మొయిన్ అలీ (ఇంగ్లండ్, అన్ని ఫార్మాట్లు)14. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్, టెస్ట్‌లు, టీ20లు)15. మహ్మదుల్లా (బంగ్లాదేశ్, టీ20లు)16. మాథ్యూ వేడ్ (ఆస్ట్రేలియా, అన్ని ఫార్మాట్లు)17. టిమ్ సౌథీ (న్యూజిలాండ్, టెస్ట్ క్రికెట్)18. మహ్మద్ అమీర్ (పాకిస్తాన్, అంతర్జాతీయ క్రికెట్)19. ఇమాద్ వసీం (పాకిస్తాన్, అంతర్జాతీయ క్రికెట్)20. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్, అన్ని ఫార్మాట్లు) -
అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటన వెనుక కారణాలు..?
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎవ్వరూ ఊహించని విధంగా గబ్బా టెస్ట్ (భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్ట్) అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాడు. అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటన వెనుక కారణాలు ఏమని ఆరా తీస్తే మూడు విషయాలు వెలుగులోకి వచ్చాయి.1. విదేశాల్లో జరిగే టెస్ట్‌ల్లో అవకాశాలు కరువువిదేశాల్లో జరిగే టెస్ట్‌ల్లో అశ్విన్‌కు అవకాశాలు కరువయ్యాయి. ముఖ్యంగా SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో జరిగే టెస్ట్‌ల్లో అశ్విన్‌ను పట్టించుకోవడమే లేదు. ఇక్కడ అశ్విన్ తప్పేమీ లేదు. SENA దేశాల్లో పిచ్‌లు స్పిన్నర్లకు పెద్దగా సహకరించవు. అందుకే అశ్విన్ తుది జట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు. విదేశాల్లో జరిగే టెస్ట్‌ల్లో అవకాశాలు కరువు కావడమే అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం వెనుక ప్రధాన కారణం కావచ్చు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో అశ్విన్‌కు ఒకే ఒక అవకాశం వచ్చింది. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో అశ్విన్‌కు అవకాశం వచ్చినా సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. బీజీటీలో తదుపరి జరుగబోయే రెండు టెస్ట్‌ల్లో కూడా అశ్విన్ అవకాశాలు దక్కడం అనుమానమే. దీంతో గబ్బా టెస్ట్ అనంతరమే ఆటకు వీడ్కోలు పలికితే బాగుంటుందని అశ్విన్ భావించాడు. 2. హోం సిరీస్‌కు ఇంకా 10 నెలల సమయం ఉందిటీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై అయితే ఆ మ్యాచ్ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్తుంది. ఆతర్వాత టెస్ట్‌ల్లో భారత అసైన్మెంట్ ఇంగ్లండ్‌లోనే ఉంది. భారత్ తదుపరి హోం సిరీస్ వచ్చే ఏడాది అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో ఉంటుంది. అంటే భారత్ స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడాలంటే ఇంకా 10 నెలల సమయం ఉంది. ఒకవేళ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించకపోయినా అవకాశాల కోసం విండీస్ సిరీస్ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఇంత సమయం ఖాళీగా ఉండటం ఇష్టం లేకే అశ్విన్ ఆకస్మికంగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించి ఉండవచ్చు. ఆస్ట్రేలియాలో రిటైర్ కావడం కంటే ఉత్తమమైనది ఏదీ ఉండదని యాష్ భావించి ఉండవచ్చు.3. వయసుఅశ్విన్ ఆకస్మికంగా రిటైర్ కావడానికి మరో ప్రధాన కారణం వయసు. ప్రస్తుతం అశ్విన్ వయసు 38 ఏళ్లు. అశ్విన్ ఇప్పుడు రిటైర్ కాకపోయినా మహా అయితే మరో రెండేళ్లు ఆడగలడు. కేవలం స్వదేశంలో జరిగే టెస్ట్‌ల్లోనే అవకాశాలు వస్తుండటంతో అశ్విన్ మహా అయితే మరో 10-12 టెస్ట్‌లు ఆడగలడు. ఈ మధ్యలో ఫామ్ కోల్పోయి లేదా జట్టుకు భారంగా మారడం కంటే అంతా బాగున్నప్పుడే రిటైర్ కావడం మంచిదని అశ్విన్ భావించి ఉండచ్చు. -
అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వీడ్కోలు (ఫొటోలు)
-
ధోని శిష్యుడి సంచలన నిర్ణయం.. భారత క్రికెట్‌కు విడ్కోలు
ఉత్తరప్రదేశ్ స్టార్ పేసర్ అంకిత్ రాజ్‌పూత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 31 ఏళ్ల రాజ్‌పూత్ భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా అంకిత్ వెల్లడించాడు. "భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయిచుకున్నాను. 2009-2024 మధ్య కాలంలో నా క్రికెట్ ప్రయాణం అత్యద్భుతం. నాకు అవకాశాలు ఇచ్చిన బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ 11 పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలకు ధన్యవాదాలు. క్రికెట్ ప్రపంచంలో కొత్త అవకాశాలను అన్వేషించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ ఏదేమైనప్పటికీ నాకు ఇష్టమైన క్రీడను మాత్రం ఇప్పటిలో విడిచిపెట్టను" అని తన రిటైర్మెంట్ నోట్లో అంకిత్ రాజ్‌పూత్ పేర్కొన్నాడు.ఇండియన్ క్రికెట్‌తో పూర్తి సంబంధాలు తెంచుకున్న రాజ్‌పూత్.. ఐపీఎల్ మినహా ఇతర ప్రాంఛైజీ క్రికెట్ లీగ్‌లలో ఆడే అవకాశముంది. ఇక 2012-13 రంజీ సీజన్లోఉత్తరప్రదేశ్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసిన రాజ్‌పూత్.. మొత్తం తన రెడ్ బాల్ కెరీర్లో 248 వికెట్లు సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మెరుగైన రికార్డు ఉన్నప్పటికి అతడికి భారత జట్టు తరపున అంతర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశం లభించలేదు. రాజ్‌పూత్ ఐపీఎల్లో కూడా ఆడాడు. 2013 ఐపీఎల్ సీజన్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది.అప్పటి సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని సారథ్యంలో ఆడాడు. ధోని శిష్యుడిగా అతడు పేరొందాడు. ఆ తర్వాత సీజన్లలో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ వంటి ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో 29 మ్యాచ్‌లు ఆడిన రాజ్‌పూత్ 24 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో ఓ ఫైవ్ వికెట్ హాల్‌కూడా ఉంది.చదవండి: IND vs AUS: భారత్‌తో మూడో టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్ -
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాకింగ్ నిర్ణయం
పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. ఇమాద్ సోషల్‌మీడియా వేదికగా తన రిటైర్మెంట్ సందేశాన్ని పంపాడు.దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని అందులో పేర్కొన్నాడు. పాకిస్తాన్‌కు ఆడుతున్న ప్రతి క్షణం మరచిపోలేనిదని అన్నాడు. అభిమానుల ప్రేమ మరియు వారి తిరుగులేని మద్దతుకు ధన్యవాదాలు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా దేశవాలీ మరియు ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడటం కొనసాగిస్తానని వెల్లడించాడు.35 ఏళ్ల ఇమాద్ 2015లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇమాద్‌కు టీ20 స్పెషలిస్ట్‌గా పేరుంది. ఇమాద్ పాక్ తరఫున 55 వన్డేలు, 75 టీ20లు ఆడాడు. వన్డేల్లో 986 పరుగులు, 44 వికెట్లు.. టీ20ల్లో 554 పరుగులు, 73 వికెట్లు తీశాడు. ఇమాద్ ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫ్రాంచైజీలకు అడుతున్నాడు. ఇమాద్ 2019లో పాక్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇమాద్ 2023లోనే అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే 2024 టీ20 వరల్డ్‌కప్ కోసం అతను తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. -
సినిమాలకు రిటైర్మెంట్.. క్లారిటీ ఇచ్చిన సబర్మతి రిపోర్ట్ నటుడు!
12th ఫెయిల్ మూవీతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్న నటుడు విక్రాంత్ మాస్సే. ఇటీవల సబర్మతి రిపోర్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో రన్ అవుతోంది. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా విక్రాంత్ మాస్సే చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాను 2025వరకు మాత్రమే సినిమాలు చేస్తానని పోస్ట్ చేశారు. తన ఫ్యామిలీ కోసం సమయం కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఆయన నిర్ణయంపై ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.అయితే తాజాగా తన పోస్ట్‌పై విక్రాంత్ మాస్సే క్లారిటీ ఇచ్చాడు. అది తన రిటైర్మెంట్ ప్రకటన కాదని మరో పోస్ట్ చేశాడు. తన కుటుంబం, ఆరోగ్యం కోసమే కొద్ది రోజుల పాటు విరామం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తన పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. సరైన సమయం వచ్చినప్పుడు రీ ఎంట్రీ ఇస్తానని అభిమానులకు భరోసా ఇచ్చాడు.ఈ ప్రకటనతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.విక్రాంత్ మాస్సే తన స్టేట్మెంట్లో రాస్తూ.. "నాకు నటించడం మాత్రమే తెలుసు. నటన నాకు అన్నీ ఇచ్చింది. ప్రస్తుతం నా శారీరక, మానసికంగా అలసిపోయా. నేను కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు. సరైన సమయంలో మళ్లీ సినిమాల్లోకి వస్తా. నా కుటుంబం, ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి కొంత సమయం విరామం ప్రకటిస్తున్నా' అని ప్రకటన విడుదల చేశారు. -
రిటైర్మెంట్ ప్లాన్ స్టార్ట్ చేయనివారు ఎంతమందో తెలుసా?
మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (మ్యాక్స్ లైఫ్) తన రిటైర్మెంట్ సర్వే నాల్గవ ఎడిషన్ & ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ స్టడీ (IRIS) ఫలితాలను.. ప్రముఖ మార్కెటింగ్ డేటా అండ్ అనలిటిక్స్ కంపెనీ కాంతర్ భాగస్వామ్యంతో వెల్లడించింది. ఫలితాల ప్రకారం సౌత్ ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ 48 వద్ద ఉందని తెలుస్తోంది. ఈ స్కోర్ నార్త్ ఇండియాతో సమానంగా ఉంది.మ్యాక్స్ లైఫ్ స్థిరత్వాన్ని కొనసాగించినప్పటికీ.. పదవీ విరమణ సంసిద్ధతలో దక్షిణ భారతదేశం ప్రత్యేకమైన సవాళ్లను & అవకాశాలను ఎదుర్కొంటుంది. దాని ఫైనాన్సియల్ ఇండెక్స్ 49 వద్ద, హెల్త్ ఇండెక్స్ 45 వద్ద & ఎమోషనల్ ఇండెక్స్ 60 వద్ద ఉన్నాయి.దక్షిణ భారతదేశంలో ఆర్థిక సవాళ్లు పెరుగుతున్నాయి. దీంతో ఆర్థిక సంసిద్ధత అన్ని ప్రాంతాలలో అత్యల్పంగా ఉంది. ఇది గణనీయమైన ఆర్థిక అభద్రతను సూచిస్తుంది. చాలా ఫైనాన్షియల్ ఉత్పత్తుల స్థిరంగా ఉన్నప్పటికీ.. దక్షిణ భారతదేశంలోని 42 శాతం మంది ప్రజలు పదవీ విరమణ కోసం పెట్టుబడి పెట్టడం ఇంకా ప్రారంభించలేదు. పదవీ విరమణ సంబంధిత ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.81 శాతం మంది వైద్య ఖర్చుల ద్వారా పొదుపును కోల్పోతున్నట్లు, మరో 80 శాతం మంది ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల గురించి ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, జీవిత బీమా అనేది పదవీ విరమణ పెట్టుబడికి అనుకూలమైన ఎంపికగా మిగిలిపోయింది. 62 శాతం మంది తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి దీనిని ఎంచుకున్నారు.ఇదీ చదవండి: డిజిటల్ అరెస్ట్ స్కామ్: రూ.13 లక్షలు కాపాడిన ఎస్బీఐదక్షిణ భారతదేశంలో.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) గురించి అవగాహన చాలా ఎక్కువగా ఉంది. 10 మందిలో 7 మందికి దీని గురించి బాగా తెలుసు. ఈ అవగాహన ప్రధానంగా టీవీ, వార్తా కథనాలు, సోషల్ మీడియా ప్రకటనలు, సహోద్యోగులు, స్నేహితులు ద్వారానే పెరుగుతోంది. అయినప్పటికీ 14 శాతం దక్షిణ భారతీయులు మాత్రమే ఎన్పీఎస్ కలిగి ఉన్నారు. ఈ సంఖ్య పశ్చిమ భారతదేశంలో చాలా తక్కువగా ఉంది.ఆరోగ్య అవగాహన మిశ్రమంగా ఉంది. దక్షిణ భారతీయులలో కేవలం 32 శాతం మంది మాత్రమే వార్షిక పరీక్షలు చేయించుకుంటున్నారు. 48 శాతం మంది ఆరోగ్య పరీక్షలను పెడచెవిన పెడుతున్నారు. 45 శాతం స్వంత ఆరోగ్య భీమా కలిగి ఉన్నారు. -
నెలవారీ సంపాదనలో పొదుపు.. ఏదైనా ఆర్థిక సూత్రం ఉందా?
నెలవారీ సంపాదనలో పొదుపు చేసిన మొత్తాన్ని.. రిటైర్మెంట్, పిల్లల విద్య, ఇల్లు కొనుగోలు తదితర లక్ష్యాలకు ఎలా కేటాయించుకోవాలి? ఇందుకు ఏదైనా ఆర్థిక సూత్రం ఉందా? – వికాస్ సింగ్మీ ఆదాయం, ప్రాధాన్యతలు, కాలవ్యవధికి అనుగుణంగా వివిధ లక్ష్యాల కోసం పొదుపు, పెట్టుబడులు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఒకరు తమ ఆదాయంలో కనీసం 20 శాతాన్ని పొదుపు చేసి, ఇన్వెస్ట్ చేయాలన్నది సాధారణ సూత్రం. ఈ పొదుపు మొత్తాన్ని వివిధ లక్ష్యాలకు ఎలా విభజించాలనే దానికి సార్వత్రిక సూత్రం అంటూ లేదు. వ్యక్తుల ఆదాయ పరిస్థితులు, రాబడుల ఆకాంక్షలు, లక్ష్యాలకు అనుగుణంగానే నిర్ణయించుకోవాలి.మీ ప్రాధాన్యతలు, కాలవ్యవధికి అనుగుణంగా లక్ష్యాలను స్వల్పకాలం, మధ్యకాలం, దీర్ఘకాలం అంటూ వేరు చేయండి. దీర్ఘకాలం అంటే కనీసం ఏడేళ్లు అంతకుమించిన లక్ష్యాల కోసం ఈక్విటీ సాధనాలపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఇవి అద్భుతమైన రాబడులతోపాటు, కాంపౌండింగ్ ప్రయోజనాన్నిస్తాయి. 5–7 ఏళ్ల మధ్యకాల లక్ష్యాల కోసం ఈక్విటీ, డెట్ ఫండ్స్‌లో లేదా బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. వీటిల్లో వృద్ధి, స్థిరత్వం ఉంటుంది. 3–5 ఏళ్ల స్వల్ప కాలానికి సంబంధించిన లక్ష్యాల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.ఇక క్రమం తప్పకుండా అంటే ఆరు నెలలు లేదా ఏడాదికోసారి అయినా మీ పెట్టుబడులు మీ లక్ష్యాలకు అనుగుణంగానే ఉన్నాయా? అన్నది సమీక్షించుకోవాలి. లక్ష్యాలకు చేరువ అవుతున్న క్రమంలో ఈక్విటీ పెట్టుబడులను డెట్ సాధనాల వైపు మళ్లించుకోవాలి. క్రమం తప్పకుండా పొదుపు, వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునే చురుకైన ప్రణాళికను ఆచరణలో పెట్టండి. నా వద్ద 2020లో కొనుగోలు చేసిన డెట్ ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని విక్రయిస్తే పన్ను భారం ఎలా పడుతుంది? – పి.కె గుప్తాస్థిరమైన రాబడులకు డెట్ ఫండ్స్ మంచి ఎంపిక. మీరు 2020లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేసి, ఇప్పుడు విక్రయిస్తే వచ్చిన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి. పైగా లాభంలో ద్రవ్యోల్బణం ప్రభావం తీసివేసేందుకు (ఇండెక్సేషన్) అవకాశం లేదు. డెట్ ఫండ్స్ కొనుగోలు చేసిన తేదీ, ఎంత కాలం పాటు కొనసాగించారు, ఎప్పుడు విక్రయించారనే ఆధారంగా పన్ను భారం మారిపోతుంది.2023 ఏప్రిల్ 1కి ముందు డెట్ ఫండ్స్ కొనుగోలు చేసిన వారికి ఇండెక్సేషన్ ప్రయోజనం లభిస్తుంది. కాకపోతే 36 నెలల పాటు వాటిని కొనసాగించి, 2024 జూలై 23లోపు విక్రయించిన వారికే ఈ ప్రయోజనం పరిమితం. మీ కొనుగోలు ధరలో ఇండెక్సేషన్ సర్దుబాటు జరుగుతుంది. దీంతో లాభంపై చెల్లించాల్సిన పన్ను కూడా తగ్గిపోతుంది. కాకపోతే 2023 ఏప్రిల్ 1కి ముందు కొనుగోలు చేసినప్పటికీ, 2024 జూలై 23లోపు విక్రయించని వారికి ఇండెక్సేషన్ ప్రయోజనం కోల్పోయినట్టే.దీంతో గతంతో పోల్చితే డెట్ ఫండ్స్ లాభాలపై ప్రస్తుత పన్ను ఆకర్షణీయంగా లేదు. కాకపోతే మరింత కాలం పాటు డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు కొనసాగించడం ద్వారా సంప్రదాయ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే అధిక రాబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఎఫ్డీలపై వడ్డీ ఏటా పన్ను పరిధిలోకి వస్తుంది. డెట్ ఫండ్స్‌లో విక్రయించినప్పుడే లాభంపై పన్ను అమల్లోకి వస్తుంది. -
భావోద్వేగంతో‘బుల్’ గుడ్‌బై
22 గ్రాండ్‌స్లామ్‌లు... 36 మాస్టర్ సిరీస్–1000 ట్రోఫీలు... 25 ఏటీపీ–500 టైటిల్స్... 10 ఏటీపీ–250 టైటిల్స్... 2 ఒలింపిక్ స్వర్ణాలు... 209 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్...1250 రాకెట్లు...300 కిలోమీటర్ల స్ట్రింగ్...16500 మీటర్ల ఓవర్గ్రిప్... ఇదీ కోర్టులో రాఫెల్ నాదల్ టెన్నిస్ ప్రయాణం! సుదీర్ఘంగా సాగిన ఈ అద్భుత ప్రస్థానం ముగిసింది. స్వదేశంలో, సొంత అభిమానుల సమక్షంలో ‘స్పెయిన్ బుల్’ నాదల్ కెరీర్ చివరి మ్యాచ్ ఆడేశాడు. ఆఖరి పోరులో పరాజయం పలకరించినా... ఈ మ్యాచ్ తుది ఫలితంకంటే అతని నిష్క్రమణే టెన్నిస్ ప్రపంచాన్ని భావోద్వేగంలో ముంచింది... కన్నీళ్లపర్యంతమవుతూ నాదల్ అభిమాన ఆటకు గుడ్‌బై చెప్పాడు.మలాగా (స్పెయిన్): ప్రపంచ టెన్నిస్‌ను శాసించిన దిగ్గజాలలో ఒకడైన రాఫెల్ నాదల్ రెండు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. గతంలోనే ప్రకటించినట్లుగా డేవిస్‌కప్ టోర్నీలో జాతీయ జట్టుకు చివరిసారి ప్రాతినిధ్యం వహించిన తర్వాత అతను రిటైరయ్యాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 1–2తో నెదర్లాండ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. స్పెయిన్ తరఫున తొలి సింగిల్స్‌లో బరిలోకి దిగిన నాదల్‌పై 6–4, 6–4 స్కోరుతో బొటిక్ వాన్ డి జాండ్‌షుల్ప్ విజయం సాధించాడు. ఆ తర్వాత రెండో సింగిల్స్‌లో అల్కరాజ్ 7–6 (7/0), 6–3తో గ్రీక్స్పూర్ను ఓడించి 1–1తో సమం చేశాడు. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో నెదర్లాండ్ జోడీ వాన్ డి జాండ్‌షుల్ప్–వెస్లీ కూల్‌హాఫ్ 7–6 (7/4), 7–6 (7/3) స్కోరుతో స్పెయిన్ ద్వయం అల్కరాజ్–మార్సెల్ గ్రానోలర్స్‌ను ఓడించింది. స్పెయిన్ నిష్క్ర మణతో నాదల్కు ఇదే చివరి పోరుగా మారింది. నాదల్ మ్యాచ్‌ను తిలకించేందుకు కుటుంబసభ్యులందరూ వచ్చారు. అంతా అతనే... మ్యాచ్ ఆరంభానికి ముందు స్పెయిన్ జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో 38 ఏళ్ల నాదల్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. సుమారు 10 వేల మంది ప్రేక్షకులతో స్టేడియం అంతా ఎరుపు వర్ణం పులుముకున్న తర్వాత అతను ఆటలోకి అడుగు పెట్టాడు. కోర్టులో ప్రతి షాట్‌కు అభిమానులు ‘రా...ఫా...రా...ఫా....’ అంటూ జేజేలు పలుకుతూ ప్రోత్సహిస్తుండగా అతను పోటీ పడ్డాడు. అయితే ఊహించినట్లుగానే గతంలోలా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయిన అతను వరుస సెట్లలో ఓడిపోయాడు. నాదల్ కొట్టిన ఫోర్‌హ్యాండ్ నెట్‌ను తాకడంతో అతని ఓటమి ఖాయమైంది. స్పెయిన్ ఓటమి తర్వాత నాదల్ స్టేడియం అంతా కలియతిరిగాడు. ఆటగాళ్లు, కోచ్‌లను కౌగిలించుకొని భావోద్వేగభరితమైన అతను అభిమానుల చప్పట్ల హోరు మధ్య ప్రసంగం పూర్తి చేసుకొని వీడాడు.వరుసగా 19 ఏళ్ల పాటు...2024: 02023: 02022: 4 2021: 2 2020: 2 2019: 4 2018: 52017: 62016: 2 2015: 3 2014: 4 2013: 10 2012: 4 2011: 3 2010: 7 2009: 52008: 8 2007: 6 2006: 5 2005: 11 2004: 1 మొత్తం 92రాఫెల్ నాదల్ 2004లో తొలిసారి ఏటీపీ సింగిల్స్ టైటిల్ గెలిచాడు. పోలాండ్లోని సొపోట్ నగరంలో జరిగిన ఐడియా ప్రొకామ్ ఓపెన్ టోర్నీలో నాదల్ విజేతగా నిలిచాడు. ఆ ఏడాది నుంచి వరుసగా 19 ఏళ్లపాటు (2022 వరకు) నాదల్ కనీసం ఒక్క టైటిల్ అయినా సాధిస్తూ వచ్చాడు. గాయాల కారణంగా 2023లో, ఈ ఏడాది నాదల్ టైటిల్ గెలవలేకపోయాడు.అంకెల్లో నాదల్ కెరీర్1080 సింగిల్స్ విభాగంలో గెలిచిన మ్యాచ్‌లు 227 సింగిల్స్ విభాగంలో ఓడిన మ్యాచ్‌లు 910 ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్–10లో కొనసాగిన వారాలు 209 ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగిన వారాలు 92 కెరీర్ మొత్తంలో నెగ్గిన సింగిల్స్ టైటిల్స్ 63 క్లే కోర్టులపై గెలిచిన సింగిల్స్ టైటిల్స్ 22 మొత్తం నెగ్గిన గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ (ఫ్రెంచ్ ఓపెన్: 14, ఆ్రస్టేలియన్ ఓపెన్: 2; వింబుల్డన్: 2, యూఎస్ ఓపెన్: 4) 2 గెలిచిన ఒలింపిక్స్ స్వర్ణాలు (2008 బీజింగ్ ఒలింపిక్స్ సింగిల్స్; 2016 రియో ఒలింపిక్స్‌లో డబుల్స్) 4 డేవిస్‌కప్ టీమ్ టైటిల్స్(2004, 2009, 2011, 2019)కెరీర్లో సంపాదించిన మొత్తం ప్రైజ్‌మనీ13,49,46,100 డాలర్లు (రూ. 1138 కోట్లు)భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టంగా ఉంది. అయితే ప్రశాంతమైన మనసుతో వీడ్కోలు పలుకుతున్నా. నా విజయాల సంఖ్య, టైటిల్స్, రికార్డుల గురించి అందరికీ తెలుసు. అయితే ఒక చిన్న ఊరు మలొర్కా నుంచి వచ్చిన ఒక మంచి వ్యక్తిగా, తన కలలు నేర్చుకునేందుకు ఎంతో కష్టపడిన ఒక చిన్న కుర్రాడిగా నేను గుర్తుండిపోవాలని కోరుకుంటాను. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. నా కెరీర్లో ఎంతో మంది మిత్రులను సంపాదించుకోగలిగాను. డేవిస్ కప్‌లో తొలి మ్యాచ్‌ను ఓటమితో మొదలు పెట్టిన నేను ఇప్పుడూ ఓడి ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే వచ్చాను. నా చివరి మ్యాచ్ చాలా కఠినంగా అనిపించింది. నిజానికి ఎవరూ ఇలాంటి క్షణం రావాలని కోరుకోరు. నేను టెన్నిస్ ఆడే విషయంలో అలసిపోలేదు. కానీ నా శరీరం అలసిపోయింది. ఇక ఆడటం సాధ్యం కాదని చెప్పేసింది. కాబట్టి నేను వాస్తవాన్ని అంగీకరించాలి. నిజాయితీగా చెప్పాలంటే ఒక హాబీగా మొదలు పెట్టిన ఆటలో ఇంత గొప్ప కెరీర్ నిర్మించుకోగలగడాన్ని నేను గొప్పగా భావిస్తున్నా. పైగా నేను ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ కాలం ఆడగలిగాను. – వీడ్కోలు ప్రసంగంలో రాఫెల్ నాదల్ -
‘ఆ జ్ఞాపకాలన్నీ పదిలం’
మలాగా (స్పెయిన్): ‘ఒకటి మాత్రం నిజం...నేను నీపై గెలిచిన మ్యాచ్లకంటే నువ్వు నన్ను ఎక్కువ సార్లు ఓడించావు. నీలా నాకు ఎవరూ సవాల్ విసరలేదు. మట్టి కోర్టుపైన అయితే నీ ఇంటి ఆవరణలోకి వచ్చి ఆడినట్లే అనిపించేది. అక్కడ నీ ముందు నిలబడితే చాలు అనిపించేందుకు కూడా ఎంతో కష్టపడాల్సి వచ్చేది. నా ఆటలో లోపాలు ఉన్నాయేమో అని చూసుకునేలా నువ్వే చేశావు. నీపై పైచేయి సాధించే క్రమంలో రాకెట్ మార్చి కూడా నా అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి వచ్చింది’ ... టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్న రాఫెల్ నాదల్‌ను ఉద్దేశించి మరో దిగ్గజం రోజర్ ఫెడరర్ చేసిన ప్రశంసాపూర్వక వ్యాఖ్య ఇది. సుదీర్ఘ కాలం ఆటను శాసించిన వీరిద్దరిలో ఫెడరర్ రెండేళ్ల క్రితం రిటైర్ కాగా... ఇప్పుడు నాదల్ వంతు వచ్చింది. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఫెడరర్ కెరీర్ ముగిస్తే... 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో నాదల్ గుడ్‌బై చెప్పాడు. కోర్టులో ప్రత్యర్థులే అయినా మైదానం బయట వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ప్రపంచ టెన్నిస్ సర్క్యూట్లో తమ పరస్పర గౌరవాన్ని, అభిమానాన్ని వీరిద్దరు చాలాసార్లు ప్రదర్శించారు. నాదల్ రిటైర్మెంట్ నేపథ్యంలో నాటి జ్ఞాపకాలతో ఫెడరర్ ఒక లేఖ రాశాడు. ఆటను ఇష్టపడేలా చేశావు... ‘నువ్వు రిటైర్ అవుతున్న సందర్భంగా కొన్ని విషయాలు పంచుకోవాలని భావించాను. మ్యాచ్ సమయంలో బొమ్మల కొలువులా వాటర్ బాటిల్స్‌ను పేర్చడం, జుట్టు సవరించుకోవడం, అండర్‌వేర్‌ను సరిచేసుకోవడం... అన్నీ ఒక పద్ధతిలో ఉండటం అంతా కొత్తగా అనిపించేది. నేను ఆ ప్రక్రియను కూడా ఇష్టపడేవాడిని. నాకు మూఢనమ్మకాలు లేవు కానీ నువ్వు ఇలా కూడా ఆకర్షించావు. టెన్నిస్‌పై నా ఇష్టం మరింత పెరిగేలా చేశావు. దాదాపు ఒకే సమయంలో కెరీర్ ప్రారంభించాం. 20 ఏళ్ల తర్వాత చూస్తే నువ్వు అద్భుతాలు చేసి చూపించావు. 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌తో స్పెయిన్, యావత్ టెన్నిస్ ప్రపంచం గర్వపడేలా చేశావు’ అని ఫెడరర్ అన్నాడు. ఆ రోజు మర్చిపోలేను... 2004 మయామి ఓపెన్‌తో మొదలు పెట్టి వీరిద్దరు 40 సార్లు తలపడ్డారు. ఇందులో నాదల్ 24 సార్లు, ఫెడరర్ 16 సార్లు గెలిచారు. ‘నేను తొలిసారి వరల్డ్ నంబర్‌వన్‌గా మారి సగర్వంగా నిలిచినప్పుడు నీతో మయామిలో తలపడి ఓడాను. అరుదైన ప్రతిభ గలవాడివని, ఎన్నో ఘనతలు సాధిస్తావని అప్పటి వరకు నీ గురించి గొప్పగా విన్నదంతా వాస్తవమేనని అర్థమైంది. 50 వేల మంది సమక్షంలో ఆడిన రికార్డు మ్యాచ్‌తో సహా మనం కలిసి ఆడిన రోజులన్నీ గుర్తున్నాయి. కొన్నిసార్లు ఎంతగా పోరాడే వాళ్లమంటే ఆట ముగిశాక వేదికపై ఒకరిని పట్టుకొని మరొకరు నడవాల్సి వచ్చేది’ అని ఫెడరర్ గుర్తు చేసుకున్నాడు. నీతో స్నేహం వల్లే... మలార్కాలో 2016లో నాదల్ అకాడమీ ప్రారంభోత్సవానికి ఫెడరర్ హాజరు కాగా... రెండేళ్ల క్రితం ఫెడరర్ చివరి టోర్నీ లేవర్ కప్‌లో అతని కోసం భాగస్వామిగా నాదల్ ఆడాడు. ‘అకాడమీ ప్రారంభోత్సవానికి నాకు నేనే ఆహా్వనం ఇచ్చుకున్నాను. ఎందుకంటే నన్ను బలవంతం చేయలేని మంచితనం నీది. కానీ నేను రాకుండా ఎలా ఉంటాను. ఆ తర్వాత నీ అకాడమీలో నా పిల్లలు శిక్షణ తీసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. వాళ్లు ఎడంచేతి వాటం ఆటగాళ్లుగా తిరిగి రాకుండా చాలని మాత్రం కోరుకున్నాను. లేవర్ కప్‌లో చివరిసారి నీతో కలిసి ఆడినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. నా కెరీర్లో అవి ఎంతో ప్రత్యేక క్షణాలు’ అని ఫెడెక్స్ భావోద్వేగం ప్రదర్శించాడు. కమాన్ రఫా... కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న వేళ నాదల్కు ఫెడరర్ ప్రత్యేక అభినందనలు తెలియజేశాడు. ‘భావోద్వేగంతో మాటలు రాని పరిస్థితి రాక ముందే నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. నీ ఆఖరి మ్యాచ్ ఆడిన తర్వాత మాట్లాడు కోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఈ సమయంలో నీకు నా అభినందనలు. ఇప్పుడు, ఇకపై కూడా నీ పాత మిత్రుడు చప్పట్లతో గట్టిగా నిన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాడనే విషయం మరచిపోవద్దు’ అని ఫెడరర్ ముగించాడు. -
భారత హాకీలో మహరాణి
దేశ రాజధానికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని హరియాణా రాష్ట్రంలో.. చారిత్రక గ్రాండ్‌ట్రంక్ రోడ్‌పై శాహాబాద్ పేరుతో ఒక చిన్న పట్టణం ఉంటుంది. దాదాపు 50 వేల జనాభా గల అలాంటి పట్టణాన్ని మామూలుగా అయితే ఎవరూ పట్టించుకోరు. కానీ అక్కడి ఆడబిడ్డలు దానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. అక్కడి అమ్మాయి ఆటలోకి అడుగు పెడితే హాకీ స్టిక్ అందుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఒక్క శాహాబాద్ నుంచే భారత జూనియర్, సీనియర్ మహిళల హాకీ జట్లకు 45 మంది ప్రాతినిధ్యం వహించారు. ఒక దశలో భారత సీనియర్ టీమ్‌లో 12 మంది ఇక్కడివారే కావడం విశేషం. అలాంటి చరిత్ర ఉన్న ఊరు నుంచి వచ్చిన అమ్మాయే రాణి రామ్‌పాల్. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా అరుదైన విజయాలు సాధించి భారత హాకీకి రాణిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తనకంటూ కొత్త చరిత్రను లిఖించుకుంది. రాణి.. జట్టులోకి వచ్చే సమయానికి పలువురు సీనియర్లు ఆట నుంచి తప్పుకుంటు న్నారు. అలాంటి సందర్భంలో తన ఆటతో టీమ్ బెస్ట్ ప్లేయర్‌గా ఎదిగి, తర్వాత 15 ఏళ్ల పాటు జట్టు భారాన్ని మోసింది. ఒంటి చేత్తో పలు కీలక విజయాలు అందించింది. అంతర్జాతీయ హాకీలో అరంగేట్రం చేసిన ఏడాది తర్వాత రష్యాలో జరిగిన చాంపియన్స్ చాలెంజ్ టోర్నమెంట్లో అత్యధిక గోల్స్ సాధించడంతో పాటు యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలవడంతో ఆమె విజయప్రస్థానం మొదలైంది. మరుసటి ఏడాదే అర్జెంటీనాలో జరిగిన వరల్డ్ కప్‌లో 5 గోల్స్ కొట్టిన రాణి ఇక్కడా బెస్ట్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ద వరల్డ్ కప్‌గా నిలవడం విశేషం. 19 ఏళ్ల వయసులో జూనియర్ వరల్డ్ కప్‌లో భారత జట్టు తొలిసారి పతకం సాధించడం (కాంస్యం)లో కీలక పాత్ర పోషించిన ఆమె ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా శిఖరాన నిలబడింది. అతి పిన్న వయస్కురాలిగా..కులాధిపత్యం, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఖాప్ పంచాయత్‌ల నియమ నిబంధనలు అన్నింటినీ బద్దలు కొట్టి.. షార్ట్ స్కర్ట్స్‌తో అమ్మాయిలు హాకీ ఆడగలగడమే శాహాబాద్లో పెద్ద ఘనత. అలాంటి వారిలో రాణి రామ్‌పాల్ తన అద్భుత ఆటతో మరెన్నో మెట్లు పైకెక్కి తన స్థాయిని పెంచుకుంది. ఆరేళ్ల వయసులోనే హాకీకి ఆకర్షితురాలైన ఆమె స్టిక్ చేతపట్టింది. మరో మూడేళ్ళ తర్వాత స్థానిక హాకీ అకాడమీలో చేరిన అనంతరం రాణి ఒక్కసారిగా దూసుకుపోయింది. హరియణా జట్టు తరఫున స్కూల్ నేషనల్స్, ఆపై జూనియర్ నేషనల్స్‌లో ఆమె అసాధారణ ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం భారత సీనియర్ జట్టు ఎంపిక జరుగుతున్న సమయంలో ఆమె పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇంత చిన్న అమ్మాయా.. అంటూ తీవ్రంగా చర్చ సాగినా ఆటలో మేటిగా గుర్తించి సెలక్టర్లు ఎంపిక చేయక తప్పలేదు. ఫలితంగా 14 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జట్టు తరఫున రాణి అంతర్జాతీయ హాకీలోకి అడుగు పెట్టింది. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించింది. అసాధారణ కెరీర్..మైదానంలో రాణి చూపించిన పదునైన ఆట, చురుకుదనం ఆమెను ఇతర ప్లేయర్లకంటే భిన్నంగా అగ్రస్థానాన నిలబెట్టాయి. ఫార్వర్డ్‌గా కీలక గోల్స్ చేయడంతో పాటు మిడ్‌ఫీల్డర్‌గా కూడా రెట్టింపు బాధ్యతతో ఆడింది. 254 అంతర్జాతీయ మ్యాచ్‌లలో సాధించిన 120 గోల్స్ రాణిని ప్రపంచ అత్యుత్తమ హాకీ క్రీడాకారిణులలో ఒకరిగా నిలబెట్టాయి. 2009లో జరిగిన ఆసియా కప్‌లో రజతం సాధించిన భారత జట్టులో రాణి సభ్యురాలిగా ఉంది. ఆ తర్వాత 2017లో ఇదే టోర్నీలో జట్టు టైటిల్ సాధించడంలో కూడా ఆమెదే ప్రధాన పాత్ర. ప్రతిష్ఠాత్మక ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఆరేళ్ల వ్యవధిలో భారత జట్టు కాంస్య, రజత, స్వర్ణ పతకాలు గెలుచుకుంది. ఆ సమయంలో ప్లేయర్‌గా కెరీర్లో ఉచ్ఛ స్థితిలో ఉన్న రాణి ప్రదర్శనే ఈ విజయాలకు కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2014 ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన జట్టులో కూడా రాణి సభ్యురాలు. విజయసారథిగా..ప్రతి ప్లేయర్‌కి కెరీర్లో చెప్పుకోదగ్గ, అత్యుత్తమ క్షణాలు కొన్ని ఉంటాయి. రాణి రామ్‌పాల్ సుదీర్ఘ కెరీర్లోనూ అలాంటివి చాలా ఉన్నాయి. 2018 ఆసియా క్రీడల్లో రాణి సారథ్యంలో జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. అదే ఏడాది జరిగిన వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్‌కి చేరిన జట్టు కామన్వెల్త్ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం కోల్పోయింది. 1980 తర్వాత 36 ఏళ్లకు 2016 రియో ఒలింపిక్స్‌కు భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించడంలో ప్లేయర్‌గా రాణిదే కీలక పాత్ర. ఆ ఈవెంట్లో టీమ్ విఫలమైనా.. జట్టుపై ఆమె ప్రభావం కొనసాగింది. ఈ క్రమంలో నాయకురాలిగా సమర్థంగా జట్టును నడిపించిన ఆమె 2020 టోక్యో ఒలింపిక్స్‌కు టీమ్ అర్హత సాధించేలా చేయగలిగింది. ఈ ఒలింపిక్స్‌లో ప్లేయర్‌గా, కెప్టెన్‌గా రాణి ప్రదర్శన ఎప్పటికీ మర్చిపోలేనిది. లీగ్ దశను దాటి హాట్ ఫేవరిట్ ఆస్ట్రేలియాపై క్వార్టర్ ఫైనల్లో సాధించిన సంచలన విజయంతో భారత్ సెమీస్‌కి చేరింది. కాంస్యపతక పోరులో చివరి వరకు పోరాడి 3–4తో బ్రిటన్ చేతిలో మన అమ్మాయిలు ఓడారు. అయితే ఈ నాలుగో స్థానం భారత మహిళల హాకీ చరిత్రలోనే అత్యుత్తమమైంది.ప్రతిభకు పట్టం..టోక్యో ఒలింపిక్స్ తర్వాత వరుస గాయాలు ఆమెను వరల్డ్ కప్‌కు, కామన్వెల్త్ క్రీడలకు దూరం చేశాయి. కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చినా ఫిట్నెస్ సమస్యలు వెంటాడాయి. దాంతో 15 ఏళ్ల అసాధారణ కెరీర్‌కు గుడ్‌బై చెబుతూ రాణి ఇటీవల 29 ఏళ్లకే రిటైర్మెంట్ను ప్రకటించింది. తన ప్రదర్శనకుగాను అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకుంది. భారతీయ రైల్వే రాయ్‌బరేలీలోని కొత్త హాకీ స్టేడియానికి రాణి పేరు పెట్టి ఆమెపై గౌరవాన్ని ప్రదర్శించింది. రాణి ఘనకీర్తిని గుర్తిస్తూ ఆమె ధరించిన 28 నంబర్ జెర్సీని ఇకపై ఎవరూ వాడకుండా హాకీ ఇండియా దానికీ రిటైర్మెంట్ను ఇవ్వడం విశేషం. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 18 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై!
న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 35 ఏళ్ల సౌథీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్దమయ్యాడు. ఈ ఏడాది డిసెంబర్లో తన హోం గ్రౌండ్( హామిల్టన్‌లోని సెడాన్ పార్క్)లో ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్ అనంతరం టెస్టులకు విడ్కోలు పలకనున్నట్లు సౌథీ వెల్లడించాడు.ఒకవేళ కివీస్ ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే మాత్రం అతడు తన దేశం తరపున ఆడేందుకు అందుబాటులో ఉండనున్నాడు. అదే విధంగా దేశీవాళీ టోర్నీల్లో, ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగనున్నట్లు ఈ కివీ స్టార్ పేసర్ చెప్పుకొచ్చాడు. "న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. 18 సంవత్సరాలుగా బ్లాక్‌క్యాప్స్ కోసం ఆడటం నాకు చాలా స్పెషల్. టెస్టు క్రికెట్‌కు నా హృదయంలో ప్రత్యేక స్ధానం ఉంది. ఏ జట్టుపై అయితే నేను టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశానో, ఇప్పుడు అదే జట్టుపై నా కెరీర్‌ను ముగించనున్నాను. నాకు బాగా ఇష్టమైన మూడు మైదానాల్లో సెడాన్ పార్క్ ఒకటి.అందుకే అక్కడే టెస్టులకు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను"అని సౌథీ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. కాగా 2008లో ఇంగ్లండ్‌పై సౌథీ టెస్టు క్రికెట్లో అడుగుపెట్టాడు. తన 18 ఏళ్ల కెరీర్లో కివీస్ తరపున ఇప్పటివరకు 104 టెస్టులు ఆడిన సౌథీ.. 385 వికెట్లతో పాటు 2185 పరుగులు సాధించాడు. మరోవైపు 161 వన్డేల్లో 742 పరుగులు, 221 వికెట్లు తీశాడు. 125 టీ20లు ఆడిన సౌథీ 303 పరుగులు, 164 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: సూర్యకుమార్ వల్లే సాధ్యమైంది -
రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ ఓపెనర్
బంగ్లాదేశ్ ఓపెనింగ్ బ్యాటర్ ఇమ్రుల్ కయేస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల కయేస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు టెస్ట్‌లకు కూడా వీడ్కోలు పలికాడు. కయేస్ నవంబర్ 16న తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడనున్నట్లు వెల్లడించాడు. కయేస్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వీడియో మెసేజ్ ద్వారా షేర్ చేశాడు. కయేస్ రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా వైట్ బాల్ క్రికెట్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. కయేస్ తన చివరి మ్యాచ్‌ను బంగ్లాదేశ్ నేషనల్ క్రికెట్ లీగ్‌లో ఆడనున్నాడు. ఈ టోర్నీలో ఖుల్నా డివిజన్‌కు ప్రాతినిథ్యం వహించే కయేస్.. ఢాకా డివిజన్‌తో తన ఆఖరి మ్యాచ్ ఆడతాడు. నేషనల్ క్రికెట్ లీగ్ అనేది బంగ్లాదేశ్‌లో సంప్రదాయ దేశవాలీ టోర్నీ. కయేస్ 2019లో తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను ఆడాడు. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారత్‌తో తలపడింది. కయేస్ తన టెస్ట్ కెరీర్లో 39 మ్యాచ్‌లు ఆడి 24.28 సగటున 1797 పరుగులు చేశాడు. కయేస్.. తమీమ్ ఇక్బాల్‌తో కలిసి తొలి వికెట్‌ను నాలుగు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేశాడు. కయేస్-తమీమ్ జోడీ తొలి వికెట్‌కు 53 ఇన్నింగ్స్‌ల్లో 2336 పరుగులు జోడించింది. బంగ్లాదేశ్ తరఫున తొలి వికెట్‌కు ఇవి అత్యుత్తమ గణాంకాలు. కయేస్ తన చివరి మ్యాచ్‌లో కనీసం 70 పరుగులు చేస్తే తన కెరీర్లో 8000 పరుగుల మార్కును దాటతాడు. కయేస్కు వన్డే క్రికెట్లో ఓ మోస్తరు రికార్డు ఉంది. ఈ ఫార్మాట్లో అతను 78 మ్యాచ్‌లు ఆడి 32 సగటున 2434 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..
అఫ్గానిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు విడ్కోలు పలకనున్నట్లు నబీ వెల్లడించాడు.ఈ విషయాన్ని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నసీబ్ ఖాన్ ధ్రువీ కరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత వన్డేల నుంచి తప్పుకుంటానని నబీ తనకు తనకు తెలియజేసినట్లు నసీబ్ ఖాన్ వెల్లడించాడు. అతడిని నిర్ణయాన్ని బోర్డు కూడా గౌరవించినట్లు నసీబ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.కాగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన నబీ టీ20ల్లో మాత్రం అఫ్గాన్‌కు తన సేవలను కొనసాగించనున్నాడు. కాగా ఈ అఫ్గాన్ మాజీ కెప్టెన్ ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు సైతం విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2026 వరకు నబీ పొట్టి ఫార్మాట్లో కొనసాగే అవకాశముంది.ఒకే ఒక్కడు.. అఫ్గానిస్తాన్ క్రికెట్‌కు సుదీర్ఘ కాలం సేవలందించిన క్రికెటర్లలో మహ్మద్ నబీ అగ్రస్ధానంలో ఉంటాడు. 2009లో అఫ్గాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన నబీ తన కెరీర్లో 165 వన్డేలు ఆడాడు. వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, పాకిస్తాన్‌లపై అఫ్గాన్ చారిత్రత్మక విజయాలు సాధించడంలో నబీది కీలక పాత్ర.ఇప్పుడు యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు తన 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలకాలని నబీ నిర్ణయించుకున్నాడు. 165 వన్డేల్లో 3,549 పరుగులతో పాటు 171 వికెట్లు నబీ సాధించాడు.చదవండి: WI vs ENG: కెప్టెన్‌తో గొడవ.. జోషఫ్‌కు బిగ్ షాకిచ్చిన విండీస్ క్రికెట్ -
రాజకీయాల నుంచి తప్పుకోబోతున్న శరద్ పవార్?
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(శరద్చంద్ర) అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి వైదొలగడంపై ఆయన స్పందించారు. ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. రాజ్యసభలో తమ పదవీకాలం ఇంకా ఏడాది కాలం మిగిలి ఉందని, అది పూర్తైన తర్వాత మళ్లీ ఎన్నికల్లో పోటీచేయనని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం బారామతిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను అధికారంలో లేనని చెప్పారు. రాజ్యసభలో తన పదవీకాలం ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఆ తర్వాత భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని వెల్లడించారు. ఎక్కడో ఒకచోట ఆగిపోవాల్సిందేనన్న శరద్ పవార్.. ఇప్పటి వరకు 14 సార్లు తనను ఎంపీగా, ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు బారామతి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈనెల 20న జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నుంచి ఎన్సీపీ(అజిత్) అధ్యక్షుడు అజిత్ పవార్ బరిలోకి దిగుతున్నారు. ఆయనపై శరద్‌పవార్ మనవడు యుగేంద్ర పవార్ పోటీ చేస్తున్నారు. దీంతో శరద్ పవార్ తన మనవడు యుగేంద్ర తరఫున ప్రచారం చేస్తు్న్నారు. కాగా అజిత్ పవార్ బారామతి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గత విజయాల్లో అతనికి తన మామ పార్టీ మద్దతు ఉంది. కానీ పార్టీ నుంచి చీలిపోయిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే.దీనిపై శరద్ పవార్ మాట్లాడుతూ.. తనకు అజిత్ పవార్‌పై ఎలాంటి పగ లేదని చెప్పారు. రాష్ట్రంలో అజిత్ పవార్ 30 ఏళ్లకు పైగా పనిచేశారని, ఆయన సేవలపై ఎలాంటి సందేహం లేదని అన్నారు. అయితే ఇప్పుడు భవిష్యత్తు కోసం సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కొత్త నాయకుడు అవసరమని ఆయన అన్నారు. రాబోయే 30 ఏళ్లు పనిచేసే నాయకత్వాన్ని మనం తయారుచేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.కాగా శరద్‌పవార్ వయసు ప్రస్తుతం 83 ఏళ్లు. ఆయన దాదాపు 60 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన నేతగా అవతరించారు. 1999లో ఆయన ఎన్సీపీని స్థాపించి ప్రముఖ రాజకీయ నాయకుడిగా సేవలందించారు. -
‘ఇకపై నీ పేరును పరిశీలించం’ అని ద్రవిడ్ డైరెక్ట్‌గానే చెప్పేశాడు!
‘సంతోషకరమైన నా క్రికెట్ ప్రయాణంలో ఇది నా చివరి సీజన్. రిటైర్మెంట్‌లోగా రంజీ ట్రోఫీలో మాత్రమే ఆడతాను. బెంగాల్‌కు చివరిసారి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా భావిస్తున్నా. ఈ సీజన్‌ను మర్చిపోలేనిదిగా మార్చుకుంటాం’ అంటూ టీమిండియా వెటరన్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యలు. భారత అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా చెప్పుకోదగ్గ సాహాకు రావాల్సినన్ని అవకాశాలు రాలేదనే చెప్పవచ్చు.ధోని నీడలో..నిజానికి వికెట్ కీపర్‌గా సాహా అద్భుత ప్రతిభావంతుడు. గత కాలపు భారత కీపర్లు సయ్యద్ కిర్మాణీ, కిరణ్ మోరె, నయన్ మోంగియా తరహాలో అత్యుత్తమ కీపింగ్ నైపుణ్యంతో పాటు అవసరమైతే కొంత బ్యాటింగ్ చేయగల సమర్థుడిగానే ఎక్కువగా గుర్తింపు పొందాడు. దేశవాళీ క్రికెట్లో బెస్ట్ కీపర్‌గా పేరు వచ్చినా... టీమిండియాను శాసిస్తున్న ధోని ఉండటంతో అతను తన చాన్స్ కోసం చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది.2010లో నాగపూర్ టెస్టుకు ముందు రోహిత్ శర్మ అనూహ్యంగా గాయపడటంతో సాహాకు బ్యాటర్‌గా తొలి టెస్టు ఆడే అవకాశం దక్కింది. మరో రెండేళ్ల తర్వాత స్లో ఓవర్‌రేట్ కారణంగా ధోనిపై నిషేధం పడటంతో రెండో టెస్టు దక్కింది. ఎట్టకేలకు 2014–15 ఆసీస్ పర్యటనలో తొలి టెస్టు తర్వాత ధోని అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో సాహా అసలు కెరీర్ మొదలైంది. అక్కడి నుంచి దాదాపు ఐదేళ్ల పాటు ప్రధాన కీపర్‌గా సాహా తన సత్తాను ప్రదర్శిస్తూ ప్రపంచ అత్యుత్తమ కీపర్లలో ఒకడిగా నిలిచాడు.పంత్ రాకతో పాత కథ మళ్లీ మొదలుస్వదేశంలో గిర్రున తిరిగే అతి కష్టమైన స్పిన్ బంతులనైనా, విదేశీ గడ్డపై సీమ్ బంతులనైనా స్టంప్‌ల వెనక చురుగ్గా, సమర్థంగా అందుకోవడంలో అతనికి అతనే సాటిగా నిలిచాడు. బ్యాటింగ్‌లో కూడా కొన్ని చక్కటి ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. అయితే రిషభ్ పంత్ దూసుకొచ్చిన తర్వాత సాహా వెనుకబడిపోయాడు. పంత్ ఉన్నప్పుడు కూడా కొంత కాలం రెండో కీపర్‌గా జట్టులో అవకాశం దక్కినా అది ఎంతో కాలం సాగలేదు. కోచ్ ద్రవిడ్ ‘ఇకపై నీ పేరును పరిశీలించం’ అంటూ సాహాకు నేరుగా చెప్పేయడంతో అతని టెస్టు కెరీర్ ముగిసింది. ఐపీఎల్లో అదే హైలైట్2008 నుంచి 2024 వరకు ఐపీఎల్ ఆడిన కొద్ది మంది ఆటగాళ్ల జాబితాలో సాహా కూడా ఉన్నాడు. కోల్‌కతా, చెన్నై, పంజాబ్, హైదరాబాద్, గుజరాత్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన అతను 170 మ్యాచ్‌లలో 127.57 స్ట్రయిక్‌రేట్‌తో 2934 పరుగులు సాధించాడు.ఇక 2014లో ఫైనల్లో పంజాబ్ తరఫున 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో అజేయంగా 115 పరుగులు సాధించిన ప్రదర్శన అతని ఐపీఎల్ కెరీర్లో హైలైట్. 2022లో టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు.అతడిని తన వారసుడిగా తీర్చిదిద్దిబెంగాల్ యువ కీపర్ అభిషేక్ పొరేల్కు మెంటార్‌గా వ్యవహరించి తన వారసుడిగా అతడిని సాహా తీర్చిదిద్దాడు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)తో విభేదాల కారణంగా రెండేళ్లు త్రిపుర తరఫున ఆడిన సాహా ఈ సీజన్లో మళ్లీ తిరిగొచ్చాడు.అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాహా... ఈ టోర్నీనే తనకు చివరిదని వెల్లడించాడు. మూడేళ్ల క్రితమే చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన 40 ఏళ్ల సాహా రంజీ తర్వాత దేశవాళీ క్రికెట్లోనూ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ కానున్నట్లు స్పష్టం చేశాడు. ఇక ఈ సీజన్ రంజీలో బెంగాల్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా...లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆడిన ఒకే ఒక ఇన్నింగ్స్‌లో అతను డకౌటయ్యాడు.కాగా టీమిండియా తరఫున 40 టెస్టులు ఆడిన సాహా 29.41 సగటుతో సాహా 1353 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. కీపర్‌గా 92 క్యాచ్‌లు అందుకున్న అతను 12 స్టంపింగ్‌లు చేశాడు. టీమిండియా తరఫున 9 వన్డేలు కూడా ఆడిన సాహాకు అంతర్జాతీయ టీ20లు ఆడే అవకాశం మాత్రం రాలేదు. 17 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో అతను 138 మ్యాచ్‌లు ఆడటం విశేషం.చదవండి: Rachin Ravindra: నేను వంద శాతం న్యూజిలాండ్‌వాడినే.. కానీ -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ క్రికెటర్
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు సాహా రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్ తర్వాత తను క్రికెట్ నుంచి వైదొలగనున్నట్లు సాహా సోషల్ మీడియాలో వెల్లడించాడు.క్రికెట్లో నా సుదీర్ఘ ప్రయాణానికి విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. నా కెరీర్లో ఈ రంజీ సీజనే నా చివరిది. ఆఖరిసారిగా బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ఎక్స్‌లో సాహా రాసుకొచ్చాడు. కాగా 40 ఏళ్ల సాహా వయసు రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ బెంగాల్ స్టార్ ప్లేయర్ గత మూడేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నప్పటకి..ఐపీఎల్, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం భాగమవుతూ వస్తున్నాడు. ఐపీఎల్లో గత కొన్నేళ్లగా గుజరాత్ టైటాన్స్‌కు వృద్ధిమాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.అయితే వచ్చే ఏడాది సీజన్‌కు ముందు అతడిని గుజరాత్ విడిచిపెట్టింది. ఈ క్రమంలో అతడు ఐపీఎల్-2025 మెగా వేలంలో తన పేరును కూడా సాహా నమోదు చేసుకోపోయినట్లు తెలుస్తోంది. సాహా తన చివరి టెస్టు 2021లో న్యూజిలాండ్‌పై ఆడాడు.ధోని తర్వాత..అయితే టెస్టు క్రికెట్లో భారత్ చూసిన అత్యుత్తమ వికెట్ కీపర్లలో సహా ఒకడని చెప్పుకోవచ్చు. అతడికి అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ ఉన్నాయి. ధోని రిటైర్మెంట్ తర్వాత సాహా భారత టెస్టు జట్టులో రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా కొనసాగాడు. వృద్ధిమాన్ సాహా భారత్ తరపున 40 టెస్టులు ఆడి 1353 పరుగులు చేశాడు. అతడి టెస్టు కెరీర్లో మూడు సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా .. 9వన్డేలు ఆడి 41 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్, చెన్నై,కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ ,సన్‌రైజర్స్ హైదరాబాద్ లకు ప్రాతినిధ్యం వహించచిన సాహా మొత్తంగా 170 మ్యాచ్‌లు ఆడాడు.చదవండి: IND vs NZ: టీమిండియా వైట్ వాష్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్