మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (మ్యాక్స్ లైఫ్) తన రిటైర్మెంట్ సర్వే నాల్గవ ఎడిషన్ & ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ స్టడీ (IRIS) ఫలితాలను.. ప్రముఖ మార్కెటింగ్ డేటా అండ్ అనలిటిక్స్ కంపెనీ కాంతర్ భాగస్వామ్యంతో వెల్లడించింది. ఫలితాల ప్రకారం సౌత్ ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ 48 వద్ద ఉందని తెలుస్తోంది. ఈ స్కోర్ నార్త్ ఇండియాతో సమానంగా ఉంది.
మ్యాక్స్ లైఫ్ స్థిరత్వాన్ని కొనసాగించినప్పటికీ.. పదవీ విరమణ సంసిద్ధతలో దక్షిణ భారతదేశం ప్రత్యేకమైన సవాళ్లను & అవకాశాలను ఎదుర్కొంటుంది. దాని ఫైనాన్సియల్ ఇండెక్స్ 49 వద్ద, హెల్త్ ఇండెక్స్ 45 వద్ద & ఎమోషనల్ ఇండెక్స్ 60 వద్ద ఉన్నాయి.
దక్షిణ భారతదేశంలో ఆర్థిక సవాళ్లు పెరుగుతున్నాయి. దీంతో ఆర్థిక సంసిద్ధత అన్ని ప్రాంతాలలో అత్యల్పంగా ఉంది. ఇది గణనీయమైన ఆర్థిక అభద్రతను సూచిస్తుంది. చాలా ఫైనాన్షియల్ ఉత్పత్తుల స్థిరంగా ఉన్నప్పటికీ.. దక్షిణ భారతదేశంలోని 42 శాతం మంది ప్రజలు పదవీ విరమణ కోసం పెట్టుబడి పెట్టడం ఇంకా ప్రారంభించలేదు. పదవీ విరమణ సంబంధిత ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
81 శాతం మంది వైద్య ఖర్చుల ద్వారా పొదుపును కోల్పోతున్నట్లు, మరో 80 శాతం మంది ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల గురించి ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, జీవిత బీమా అనేది పదవీ విరమణ పెట్టుబడికి అనుకూలమైన ఎంపికగా మిగిలిపోయింది. 62 శాతం మంది తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి దీనిని ఎంచుకున్నారు.
ఇదీ చదవండి: డిజిటల్ అరెస్ట్ స్కామ్: రూ.13 లక్షలు కాపాడిన ఎస్‌బీఐ
దక్షిణ భారతదేశంలో.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) గురించి అవగాహన చాలా ఎక్కువగా ఉంది. 10 మందిలో 7 మందికి దీని గురించి బాగా తెలుసు. ఈ అవగాహన ప్రధానంగా టీవీ, వార్తా కథనాలు, సోషల్ మీడియా ప్రకటనలు, సహోద్యోగులు, స్నేహితులు ద్వారానే పెరుగుతోంది. అయినప్పటికీ 14 శాతం దక్షిణ భారతీయులు మాత్రమే ఎన్‌పీఎస్ కలిగి ఉన్నారు. ఈ సంఖ్య పశ్చిమ భారతదేశంలో చాలా తక్కువగా ఉంది.
ఆరోగ్య అవగాహన మిశ్రమంగా ఉంది. దక్షిణ భారతీయులలో కేవలం 32 శాతం మంది మాత్రమే వార్షిక పరీక్షలు చేయించుకుంటున్నారు. 48 శాతం మంది ఆరోగ్య పరీక్షలను పెడచెవిన పెడుతున్నారు. 45 శాతం స్వంత ఆరోగ్య భీమా కలిగి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment