investing
-
రిటైర్మెంట్ ప్లాన్ స్టార్ట్ చేయనివారు ఎంతమందో తెలుసా?
మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (మ్యాక్స్ లైఫ్) తన రిటైర్మెంట్ సర్వే నాల్గవ ఎడిషన్ & ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ స్టడీ (IRIS) ఫలితాలను.. ప్రముఖ మార్కెటింగ్ డేటా అండ్ అనలిటిక్స్ కంపెనీ కాంతర్ భాగస్వామ్యంతో వెల్లడించింది. ఫలితాల ప్రకారం సౌత్ ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ 48 వద్ద ఉందని తెలుస్తోంది. ఈ స్కోర్ నార్త్ ఇండియాతో సమానంగా ఉంది.మ్యాక్స్ లైఫ్ స్థిరత్వాన్ని కొనసాగించినప్పటికీ.. పదవీ విరమణ సంసిద్ధతలో దక్షిణ భారతదేశం ప్రత్యేకమైన సవాళ్లను & అవకాశాలను ఎదుర్కొంటుంది. దాని ఫైనాన్సియల్ ఇండెక్స్ 49 వద్ద, హెల్త్ ఇండెక్స్ 45 వద్ద & ఎమోషనల్ ఇండెక్స్ 60 వద్ద ఉన్నాయి.దక్షిణ భారతదేశంలో ఆర్థిక సవాళ్లు పెరుగుతున్నాయి. దీంతో ఆర్థిక సంసిద్ధత అన్ని ప్రాంతాలలో అత్యల్పంగా ఉంది. ఇది గణనీయమైన ఆర్థిక అభద్రతను సూచిస్తుంది. చాలా ఫైనాన్షియల్ ఉత్పత్తుల స్థిరంగా ఉన్నప్పటికీ.. దక్షిణ భారతదేశంలోని 42 శాతం మంది ప్రజలు పదవీ విరమణ కోసం పెట్టుబడి పెట్టడం ఇంకా ప్రారంభించలేదు. పదవీ విరమణ సంబంధిత ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.81 శాతం మంది వైద్య ఖర్చుల ద్వారా పొదుపును కోల్పోతున్నట్లు, మరో 80 శాతం మంది ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల గురించి ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, జీవిత బీమా అనేది పదవీ విరమణ పెట్టుబడికి అనుకూలమైన ఎంపికగా మిగిలిపోయింది. 62 శాతం మంది తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి దీనిని ఎంచుకున్నారు.ఇదీ చదవండి: డిజిటల్ అరెస్ట్ స్కామ్: రూ.13 లక్షలు కాపాడిన ఎస్బీఐదక్షిణ భారతదేశంలో.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) గురించి అవగాహన చాలా ఎక్కువగా ఉంది. 10 మందిలో 7 మందికి దీని గురించి బాగా తెలుసు. ఈ అవగాహన ప్రధానంగా టీవీ, వార్తా కథనాలు, సోషల్ మీడియా ప్రకటనలు, సహోద్యోగులు, స్నేహితులు ద్వారానే పెరుగుతోంది. అయినప్పటికీ 14 శాతం దక్షిణ భారతీయులు మాత్రమే ఎన్పీఎస్ కలిగి ఉన్నారు. ఈ సంఖ్య పశ్చిమ భారతదేశంలో చాలా తక్కువగా ఉంది.ఆరోగ్య అవగాహన మిశ్రమంగా ఉంది. దక్షిణ భారతీయులలో కేవలం 32 శాతం మంది మాత్రమే వార్షిక పరీక్షలు చేయించుకుంటున్నారు. 48 శాతం మంది ఆరోగ్య పరీక్షలను పెడచెవిన పెడుతున్నారు. 45 శాతం స్వంత ఆరోగ్య భీమా కలిగి ఉన్నారు. -
జొమాటో డెలివరీ సిబ్బందికి ఇన్వెస్టింగ్ పాఠాలు
న్యూఢిల్లీ: గిగ్ ఎకానమీ వర్కర్లలో మదుపు, ఆర్థికాంశాలపైన అవగాహన పెంచే దిశగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) వెల్లడించింది. దీని ప్రకారం ప్రత్యేకంగా జొమాటో డెలివరీ పార్ట్నర్స్ కోసం రూపొందించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.ఇందులో పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఇన్వెస్టింగ్‌కి సంబంధించి ప్రాథమిక అంశాలు ఉంటాయని ఎన్ఎస్ఈ తెలిపింది. పలు ప్రాంతీయ భాషల్లో బడ్జెటింగ్, పొదుపు, పెట్టుబడులు, బీమా మొదలైనవాటి గురించి వివరించనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 2,000 మంది డెలివరీ పార్ట్నర్స్ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగమైనట్లు వివరించింది. దేశవ్యాప్తంగా 50,000 మంది తాత్కాలిక వర్కర్లకు ఇది ప్రయోజనం చేకూర్చగలదని ఎన్ఎస్ఈ పేర్కొంది. -
బంగారాన్ని మించి.. ‘స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తాం’
న్యూఢిల్లీ: ఒకవైపు మ్యూచువల్ ఫండ్స్ ప్రతి నెలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షిస్తున్నప్పటికీ.. మరోవైపు మెజారిటీ ఇన్వెస్టర్లు ఇప్పటికీ నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులకే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయం ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ఏంజెల్ వన్‌కు చెందిన ‘ఫిన్‌వన్’ అధ్యయనంలో వెల్లడైంది.58 శాతం మంది స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే, 39 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్‌ను అనుసరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 13 పట్టణాలకు చెందిన 1,600 మంది యువతీ, యువకుల పెట్టుబడుల ప్రాధాన్యతలు, ఆర్థిక అక్షరాస్యత, టెక్నాలజీ, ఫైనాన్షియల్ టూల్స్ వినియోగాన్ని విశ్లేషించిన అనంతరం ఫిన్‌వన్ నివేదికను విడుదల చేసింది. » పొదుపునకు చాలా మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. 93 శాతం మంది తమ ఆదాయంలో ఎంతో కొంత ఆదా చేస్తుండగా, కొంత మంది 20–30 శాతం వరకు పొదుపు చేస్తున్నారు. » ఫిక్స్డ్ డిపాజిట్ లేదా బంగారం కంటే స్టాక్స్‌లో పెట్టుబడులకే 45 శాతం మంది ప్రాధాన్యం చూపుతున్నారు. » పెట్టుబడికి అధిక భద్రత ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు 22 శాతం మంది, రికరింగ్ డిపాజిట్ల వైపు 26 శాతం మంది మొగ్గు చూపిస్తున్నారు. » అధిక రాబడులతోపాటు స్థిరమైన రాబడులకూ యువత ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఇది తెలియజేస్తోందని ఈ నివేదిక పేర్కొంది. » యువతరం టెక్ సాయాన్ని తీసుకుంటోంది. 68 శాతం మంది ఆటోమేటెడ్ సేవింగ్ టూల్స్ వాడుతున్నారు. » 85 శాతం మంది పెరిగిపోయిన జీవన వ్యయం.. ముఖ్యంగా ఆహారం, యుటిలిటీలు, రవాణా వ్యయాలను ప్రస్తావించారు. -
మెరుగైన రాబడులకు.. ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్..
గడిచిన దశాబ్దకాలంగా దేశీయంగా మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్లలో ఒకటిగా మారింది. ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ విస్తృతి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లకు (సిప్) ఆదరణ పెరుగుతుండటం మొదలైన సానుకూలాంశాలు ఇందుకు దోహదపడుతున్నాయి. గత పదేళ్లుగా ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. 2014లో మొత్తం ఏయూఎంలో (నిర్వహణలోని ఆస్తులు) వీటి పరిమాణం 2 శాతమే ఉండగా 2024 జూన్ నాటికి ఏకంగా 17 శాతానికి (మొత్తం ఏయూఎం రూ. 10,00,000 కోట్లకు పైగా ఉంటుంది) ఎగిసింది. ఇంత వేగంగా పరిశ్రమ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు మారిపోతున్న ఇన్వెస్టర్ల అవసరాలకు అనుగుణంగా వినూత్నమైన ఉత్పత్తులు, కొత్త వ్యూహాలను ప్రవేశపెట్టడంపై అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీ) కసరత్తు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ వ్యూహం తెరపైకి వచ్చింది. అధిక రాబడులనిస్తూ, రిస్కులను తగ్గిస్తూ, మెరుగైన డైవర్సిఫికేషన్ ప్రయోజనాలను అందించే విధంగా ఇది ఉంటుంది.సెక్యూరిటీస్‌లో అంతర్గతంగా మెరుగైన రాబడులు అందించే నిర్దిష్ట లక్షణాలను లక్ష్యంగా చేసుకుని ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ పని చేస్తుంది. ఫ్యాక్టర్ ఫండ్స్ అనేవి భారత్‌లో ఇండెక్స్ ఫండ్, ఈటీఎఫ్ ఫార్మాట్లో తక్కువ వ్యయాలతో అందుబాటులో ఉంటున్నాయి. నాణ్యత (క్వాలిటీ), విలువ (వేల్యూ), పరిమాణం (సైజ్), గతి (మూమెంటమ్), తక్కువ ఒడిదుడుకులు వంటి నిర్దిష్ట గుణాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం ద్వారా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా తమ పోర్ట్‌ఫోలియోలను తీర్చిదిద్దుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు, వేల్యూ ఇన్వెస్టింగ్ అనేది ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్లో ఒక భాగం. ఇది తక్కువ వేల్యుయేషన్లతో ఉన్న సెక్యూరిటీలను టార్గెట్ చేయడం ద్వారా ప్రయోజనాలను అందించేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే, మూమెంటమ్ ఇ న్వెస్టింగ్ అనే విధానం, ధర పెరుగుతున్న ట్రెండ్ ఆధారితమైనదిగా ఉంటుంది.సంపద సృష్టి: చారిత్రకంగా మార్కెట్‌ను మించి రాబడులు పొందడానికి తోడ్పడే నిర్దిష్ట గుణాలను లక్ష్యంగా పెట్టుకుని ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ పని చేస్తుంది. వివిధ మార్కెట్లు, అసెట్ క్లాస్‌లు, కాలవ్యవధులవ్యాప్తంగా ఇది పనిచేస్తుంది. ఒక పద్ధతి ప్రకారం ఈ ఫ్యాక్టర్లను ఉపయోగించడం ద్వారా ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను ఎలాంటి ఆరి్థక పరిస్థితుల్లోనైనా, మార్కెట్లో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా నిలదొక్కుకోగలిగేలా మరింత పటిష్టంగా తీర్చిదిద్దుకోవచ్చు. పరిశోధనల ప్రకారం చారిత్రకంగా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది మార్కెట్ బెంచ్‌మార్క్‌లను మించిన పనితీరు కనపర్చింది. సరిగ్గా ఉపయోగించుకుంటే ఇది ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో సంపద సృష్టించి ఇవ్వగలదు.రిస్క్ మేనేజ్మెంట్: వివిధ మార్కెట్ పరిస్థితుల్లో మెరుగ్గా రాణించే ఫ్యాక్టర్లను లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా రిసు్కలను సమర్ధవంతంగా అదుపులో ఉంచుకునేందుకు ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ సహాయపడుతుంది. ఉదాహరణకు మార్కెట్లు పతనమవుతున్న తరుణంలో, తక్కువ హెచ్చుతగ్గులకు లోనయ్యే స్టాక్స్ మెరుగ్గా ఉంటాయి. నష్టభారాన్ని తగ్గిస్తాయి. తీవ్ర ఒడిదుడుకులు ఉన్న పరిస్థితుల్లో పోర్ట్‌ఫోలియోను స్థిరపర్చుకునేందుకు ఈ విధానం సహాయపడుతుంది.పారదర్శకత: మిగతా పాసివ్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్, ఈటీఎఫ్) తరహాలోనే ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ వ్యూహాలు కూడా సాధారణంగా రూల్స్ ఆధారితమైనవిగా ఉంటాయి. అంటే, పెట్టుబడులను పెట్టేందుకు నిర్దిష్ట నిబంధనలను పాటిస్తాయి. పెట్టుబడి నిర్ణయాల వెనుక గల హేతుబద్ధతను అర్థం చేసుకునేందుకు, తమ పోర్ట్‌ఫోలియోలను సులభతరంగా పర్యవేక్షించుకునేందుకు, నిర్వహించుకునేందుకు ఇన్వెస్టర్లకి ఈ పారదర్శకత ఉపయోగకరంగా ఉంటుంది.డైవర్సిఫికేషన్: ఒకదానితో మరొక దానికి మరీ అధిక స్థాయిలో పరస్పర సంబంధం ఉండని వివిధ ఫ్యాక్టర్లవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది వైవిధ్యానికి సంబంధించిన ప్రయోజనాలను కల్పిస్తుంది. ఏదైనా ఒక ఫ్యాక్టర్ పనితీరు బాగా లేకపోతే పోర్ట్‌ఫోలియోలో దాని ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది. రిస్కులకు తగ్గ మెరుగైన రాబడులను అందుకోవడానికి వివిధ ఫ్యాక్టర్లను కలిపి వాడే వ్యూహాన్ని అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు ఉపయోగిస్తుంటారు.సౌలభ్యం: టెక్నాలజీ, డేటా వంటి అంశాల్లో పురోగతి కారణంగా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ ప్రస్తుతం ఇన్వెస్టర్లకు మరింతగా అందుబాటులోకి వచ్చింది. ఫ్యాక్టర్ ఆధారిత వ్యూహాలను సులభతరంగా అమలు చేయడానికి సాధనాలు, ప్లాట్‌ఫాంలు వీలు కల్పిస్తున్నాయి. ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది మెరుగైన రాబడులు అందించేలా, రిస్కులను నియంత్రించుకునేలా, తక్కువ వ్యయాలతో కూడుకున్న పెట్టుబడి సాధనాలను వినియోగించుకునేలా పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోవాల్సిన అంశాలు.. ఫ్యాక్టర్స్ కొన్నాళ్ల పాటు అండర్పెర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు వేల్యూ స్టాక్స్ అనేవి నిర్దిష్ట మార్కెట్ పరిస్థితుల్లో గ్రోత్ స్టాక్స్‌తో పోలిస్తే వెనుకబడొచ్చు. ఒకే ఫ్యాక్టర్‌లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఒకవేళ ఆ ఫ్యాక్టర్ పనితీరు సరిగ్గా లేకపోతే గణనీయంగా నష్టాలు రావచ్చు. తప్పిదాల వల్ల పనితీరు దెబ్బతినే అవకాశం ఉన్నందున, ఫ్యాక్టర్ ప్రీమియంలను కచ్చితంగా గుర్తించి, అందిపుచ్చుకోవాలంటే అధునాతన మోడల్స్, విస్తృతమైన డేటా విశ్లేషణ అవసరమవుతుంది. మార్కెట్ పరిస్థితులు గానీ ఇన్వెస్టర్ ధోరణి గానీ మారితే ఫ్యాక్టర్ వ్యూహాల సామర్థ్యాలపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు ఒకవేళ పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు అదే ఫ్యాక్టర్ వ్యూహాన్ని అమలు చేయడం మొదలుపెట్టారంటే, ఫ్యాక్టర్ ప్రయోజనం తగ్గిపోవచ్చు. ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ వ్యూహాలు అమలు చేయాలనుకునే ఇన్వెస్టర్లు ఈ రిస్కులను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. రిసు్కలను తగ్గించుకునేందుకు వివిధ ఫ్యాక్టర్లవ్యాప్తంగా డైవర్సిఫికేషన్ పాటించాలి. మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటే సహాయకరంగా ఉంటుంది. చదవండి: మిడ్‌క్యాప్ విభాగంలో మెరుగైన రాబడులు ఇలా!రిస్కు సామర్థ్యాలను బట్టి.. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి లక్ష్యాలు, రిస్కు సామర్థ్యాలకు అనుగుణంగా నిర్దిష్ట ఫ్యాక్టర్స్‌ను టార్గెట్‌గా పెట్టుకుని తమ పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకోవచ్చు. ఉదాహరణకు అధిక రిస్కు సామర్థ్యాలున్న ఇన్వెస్టర్లు, మూమెంటమ్ లేదా సైజ్ వంటి ఫ్యాక్టర్లకు మరింత ఎక్కువగా కేటాయించవచ్చు. ఇవి మరింత ఎక్కువ ఒడిదుడుకులకు లోనైనా అధిక రాబడులనిచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారు నాణ్యమైన, తక్కువ ఒడిదుడుకులుండే ఫ్యాక్టర్లను ఎంచుకోవచ్చు. ఇక, గ్రోత్ కోరుకునే ఇన్వెస్టర్లు, వేల్యూ అలాగే మూమెంటమ్కి ప్రాధాన్యతనివ్వొచ్చు. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు కూడా దాదాపు ఇలాంటి ఫ్యాక్టర్ మేళవింపులనే ఎంచుకుంటూ ఉంటారు. చివరగా చెప్పాలంటే, ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది అధిక రాబడులను అందించే నిర్దిష్ట చోదకాలను అందిపుచ్చుకునేందుకు ఉపయోగపడే ఒక విధానం. రిసు్కలను తగ్గించుకుని, అధిక రాబడులను అందుకునే అవకాశాలను ఇది కల్పిస్తుంది. అదే సమయంలో దీనిలో కూడా ఉండే కొన్ని రిస్కులను దృష్టిలో ఉంచుకుని, తమ వ్యక్తిగత ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్‌ను బట్టి ఇన్వెస్టర్లు వ్యూహాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యాక్టర్లను అర్థం చేసుకుని, జాగ్రత్తగా ఎంచుకోగలిగితే ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యాలను మరింత సమర్ధమంతంగా సాధించుకోగలుగుతారు. -
‘సాక్షి’ పెట్టుబడులు సక్రమమే..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులన్నీ సక్రమమేనని, చట్టబద్ధమేనని 2022 డిసెంబర్లో ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది. జగతి పబ్లికేషన్‌లో ఇన్వెస్టర్లంతా చట్టానికి లోబడే పెట్టుబడులు పెట్టారని, ఇన్వెస్ట్మెంట్లు స్వీకరించడంలో కంపెనీలు చట్టప్రకారం పాటించాల్సిన నిబంధనలన్నిటినీ జగతి పబ్లికేషన్స్ పాటించిందని ఐటీ శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ కంపెనీలోకి పెట్టుబడులన్నీ క్విడ్–ప్రో–కో రూపంలో వచ్చాయి కనుక వాటిని ఆదాయంగా పరిగణించి, ఆ మొత్తం పై పన్ను చెల్లించాలంటూ 2011లో నాటి ఐటీ అధికారి ఇచ్చిన నోటీసులను ట్రిబ్యునల్ కొట్టివేసింది. ఐటీ విభాగం తమ వాదనకు మద్దతుగా సమర్పించిన సీబీఐ ఛార్జిషీట్లను... అసలు సాక్ష్యంగానే పరిగణించలేమని తెగేసి చెప్పింది. సాక్ష్యానికి ఉండాల్సిన కనీస లక్షణాలేవీ ఆ ఛార్జిïÙట్లకు లేవని కూడా బెంచ్ వ్యాఖ్యానించింది. ‘ఆ ఛార్జిషిట్లలో ఉన్నవన్నీ సీబీఐ చేసిన ఆరోపణలే తప్ప నిరూపితమైనవేమీ కావు. అయినా మీరు నోటీసులిచ్చిన అసెస్మెంట్ ఇయర్ దాటి ఇప్పటికి పదేళ్లు గడిచింది. మీరేమైనా దర్యాప్తు చేశారా? క్విడ్ ప్రోకో ఆరోపణలు నిరూపించే ఆధారాలేమైనా సంపాదించారా? సీబీఐ ఆరోపణలనే సాక్ష్యంగా సమర్పిస్తే ఎలా? సీబీఐ ఛార్జిషీట్లకు ఎలాంటి హేతుబద్దతా లేదు. ఈ కేసులో అవి అనవసరం, అప్రస్తుతం కూడా‘ అని జ్యుడిషియల్, అకౌంటింగ్ సభ్యులతో కూడిన ట్రిబ్యునల్ బెంచ్ తేల్చిచెప్పింది. తద్వారా... సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులపై రామోజీరావు, టీడీపీ అధిపతి చంద్రబాబునాయుడు, మిగిలిన ఎల్లో గ్యాంగ్ పనిగట్టుకుని చేస్తున్న దు్రష్పచారానికి విలువ లేదని, అదంతా బూటకమని స్పష్టమయింది. సుదీర్ఘకాలం విచారించి, ఇరుపక్షాల వాదనలూ సమగ్రంగా విన్న అనంతరం 2022 డిసెంబరు 23న బెంచ్ 153 పేజీల ఉత్తర్వులను వెలువరించింది. ఒక్కొక్కరికీ ఒక్కో’లా’ ఎలా? ‘‘కొందరు ఇన్వెస్టర్ల విషయంలో ఇదే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. వారి విషయంలో ఎలాంటి క్విడ్ ప్రో కో లావాదేవీలూ జరగలేదని స్పష్టంగా చెప్పింది. పోనీ... మిగతా ఇన్వెస్టర్ల విషయంలో క్విడ్ ప్రోకో జరిగిందని కూడా ఆ మెమోలో చెప్పలేదు. మరి క్విడ్ ప్రో కో అని మీరెలా అంటారు?‘ అని బెంచ్ తన ఉత్తర్వుల్లో ఐటీ విభాగాన్ని ప్రశ్నించింది. ప్రయివేటు లిమిటెడ్‌లో షేరు ప్రీమియం అనేది ఇన్వెస్టర్లతో జరిగే చర్చలు, వారి అంచనాల వల్లే నిర్ణయమవుతుందని పేర్కొంది. ఇన్వెస్టర్ల వాదనను గమనించారా? సాక్ష్యాలుగా సమరి్పంచిన పలు వాదనల్లో నిమ్మగడ్డ గ్రూపు సంస్థల డైరెక్టరు నిమ్మగడ్డ ప్రకాశ్ చేసిన వాదనను బెంచ్ ప్రస్తావించింది. ‘‘ఈనాడులో పెట్టుబడులకోసం బ్లాక్‌స్టోన్ అనుకున్న విలువలో 20 శాతం డిస్కౌంట్‌కే సాక్షిలో వాటా దొరికింది. ఐదు ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు పెడదామని అనుకున్నాం. అందులో మీడియా ఒకటి. అందుకే సాక్షిలో పెట్టాం’’ అనే ప్రకాశ్ వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకోవాలని బెంచ్ వ్యాఖ్యానించింది. వచి్చన పెట్టుబడులను ఆదాయంగా పరిగణించలేమని విస్పష్టంగా తేల్చిచెప్పింది. తెలియని మార్గాలంటే ఎలా? కోల్‌కతాలోని కొన్ని కంపెనీల నుంచి వచ్చిన రూ.15 కోట్లను తెలియని మార్గాల నుంచి వచ్చిన మొత్తంగా ఐటీ విభాగం పేర్కొంది. దాన్ని బెంచ్ తప్పుబడుతూ... కోల్‌కతా కంపెనీలతో సహా పెట్టుబడి ప్రతి కంపెనీ పాన్, రిజిస్ట్రేషన్ నెంబరు, అడ్రసు వంటి వివరాలన్నీ జగతి సంస్థ సమర్పించిందని, అన్నీ చట్టబద్ధంగానే ఉన్నప్పుడు ’గుర్తు తెలియని ఆదాయం’ ఎలా అవుతుందని ప్రశ్నించింది. వాల్యుయేషన్ నివేదిక నిజమేగా? ‘‘వాల్యుయేషన్ రిపోర్టును అస్సలు తప్పు బట్టడానికి లేదు. అందులో పేర్కొన్న అంశాలన్నీ సాక్షి పత్రిక విషయంలో నిజమయ్యాయి. అనుకున్నట్లుగానే సర్క్యులేషన్ పెరిగింది. పోటీపత్రిక ఈనాడు గుత్తాధిపత్యం తగ్గింది. పోటీపత్రిక 30 ఏళ్లలో సాధించిన సర్క్యులేషన్‌ను సాక్షి ఏడాదిన్నరలోనే సాధించింది. కనుక వాల్యుయేషన్ నివేదికను తప్పుబట్టలేం. సాక్షి యాజమాన్యానికి అనుభవం లేకున్నా అంత ప్రీమియం తీసుకున్నారనే వాదన అర్థరహితం. వారి లీడర్‌షిప్‌లో ఆ పత్రిక అంచనాలన్నిటినీ అందుకుంది. కాబట్టి క్విడ్ ప్రో కో వాదనకు అర్థమే లేదు’’ అని బెంచ్ పేర్కొంది. ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇంత విస్పష్టంగా తీర్పునిచ్చినా... రామోజీ, చంద్రబాబు గ్యాంగ్ మాత్రం ఇప్పటికీ పాత పాటే పాడుతూ... పాచి కథనాలనే మళ్లీ మళ్లీ ప్రచురిస్తూ ఏదో చేసేయాలని ఆరాటపడుతుండటమే విచిత్రం. -
ఇండెక్స్ ఫండ్ ఎంపిక ఎలా?
ఇండెక్స్ ఫండ్ ఎంపిక ఎలా? మల్టీక్యాప్ పేరుతో కొత్తగా వస్తున్న మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? – ఆశిష్ ఈ తరహా పథకాల నుంచి సరైన రాబడులు అందుకోగలమా? అన్నది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. మల్టీక్యాప్, ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం ఉంది. నేడు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ అనుసరిస్తున్న పెట్టుబడుల విధానాన్ని గతంలో మల్టీక్యాప్ ఫండ్స్ పాటించాయి. వాటిపై ఎటువంటి నియంత్రణలు లేవు. కనుక మార్కెట్ క్యాప్ పరిమితితో సంబంధం లేకుండా ఫండ్ మేనేజర్లు తమ స్వేచ్ఛ కొద్దీ అన్ని రకాల మార్కెట్ క్యాప్ ఆధారిత స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునేవారు. దీంతో వాటి విధానం మార్చే దిశగా సెబీ మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఇప్పుడు మల్టీక్యాప్ ఫండ్స్ కచ్చితంగా కనీసం 25 శాతం లార్జ్‌క్యాప్, 25% మిడ్‌క్యాప్, 25% స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. చాలా వరకు మల్టీక్యాప్ ఫండ్స్ నిర్వహణ ఆస్తుల పెరంగా పెద్ద గా మారిపోయాయి. దీంతో 25% చొప్పున ప్రతీ విభాగంలో పెట్టుబడులు కచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలన్నది వాటికి ప్రతిబంధకంగా మారింది. ఎందుకంటే భారీ పెట్టుబడులకు తగ్గ అవకాశాలు స్మాల్ క్యాప్, మిడ్‌క్యాప్ విభాగంలో అన్ని వేళలా ఉండాలని లేదు. పరిశ్రమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సెబీ మార్కెట్‌కు ఇది ప్రతికూలంగా మారుతుందని గుర్తించి.. ఫ్లెక్సీక్యాప్ పేరుతో కొత్త విభాగాన్ని ప్రవేశపెట్టింది. 25 శాతం చొప్పున కచ్ఛితంగా ప్రతీ విభాగంలో ఇన్వెస్ట్ చేయడం వీలు కాకపోతే మల్టీక్యాప్ పథకాలు ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి మారిపోవచ్చంటూ వెసులుబాటునిచ్చింది. దీంతో చాలా మల్టీక్యాప్ పథకాలు ఫ్లెక్సీక్యాప్ కిందకు మారిపోయాయి. కొత్త పథకం ఆవిష్కరించడం ద్వారా మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించొచ్చని మ్యూచువల్ ఫండ్ సంస్థలు భావించాయి. ఒక్కో విభాగంలో ఒక్క పథకమే ఉండాలన్నది సెబీ నిబంధన. దీంతో మల్టీక్యాప్ నుంచి ఫ్లెక్సీక్యాప్ కిందకు మారిపోయిన ఫండ్స్ సంస్థలు.. మల్టీక్యాప్ విభాగంలో కొత్త పథకాలను (ఎన్‌ఎఫ్‌వోలు) తీసుకొస్తున్నాయి. కనుక అవి తమకు అనుకూలమా? కాదా? అన్నది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల కాల వ్యవధి, రాబడుల అంచనాల ఆధారంగా నిర్ణయించుకోవాలి. మంచి ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకునేందుకు ఎటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? – శశాంక్ ముందుగా పథకం ఎక్స్పెన్స్ రేషియో చూడాలి. ఇండెక్స్‌తో పోలిస్తే పథకం రాబడుల తీరు ఎలా ఉందన్నది పరిశీలించాలి. వ్యాల్యూ రీసెర్చ్ పోర్టల్‌లో అన్ని పథకాలకు సంబంధించి పనితీరు ప్యారా మీటర్లను పరిశీలించుకోవచ్చు. ఇండెక్స్‌తో పోలిస్తే పథకం పనితీరు ఎలా ఉందన్న సమాచారం కూడా లభిస్తుంది. కొంత ట్రాకింగ్ లోపం ఉండే అవకాశం లేకపోలేదు. అంటే ఇండెక్స్ 2 శాతం పెరిగితే.. ఫండ్ పెట్టుబడుల విలువ అదే కాలంలో 2.01%, 1.99%గా చూపించొచ్చు. ముఖ్యంగా ఎక్స్పెన్స్ రేషియో ఇక్కడ కీలకం అవుతుంది. రెండు ఇండెక్స్ పథకాల్లో ఒకటి 10 బేసిస్ పాయింట్లు చార్జ్ చేస్తుంటే, మరో పథకం 25 బేసిస్ పాయింట్లు చార్జ్ తీసుకుంటుంటే.. అప్పుడు 10 బేసిస్ పాయింట్ల పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడమే సరైనది. -
ఏపీలో హెచ్‌సీఎల్ రూ.750 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న రెండు ఫెసిలిటీలకు రూ.750 కోట్లు వెచ్చిస్తున్నట్టు వెల్లడించింది. తద్వారా వచ్చే 10 ఏళ్లలో 7,500 ఉద్యోగావకాశాలు ఉంటాయని పేర్కొంది. రెండు దశల్లో విస్తరణ ఉంటుందని కంపెనీ వివరించింది. గన్నవరం సమీపంలో కేసరపల్లి వద్ద రూ.400 కోట్లతో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు నేడు (సోమవారం) భూమి పూజ జరుగనుంది. ఏడేళ్లలో పూర్తి కానున్న తొలి దశ ప్రాజెక్టులో 4,000పైగా ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఉపాధి లభించనుంది. రెండో దశలో అమరావతిలో రూ.350 కోట్ల పెట్టుబడితో 20 ఎకరాల్లో క్యాంపస్ రానుంది. అయిదేళ్లలో ఇక్కడ 3,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని హెచ్‌సీఎల్ తెలిపింది. -
వేల్యూ ఇన్వెస్టింగ్ ప్రాధాన్యం అయితే...
ఇటీవలి మార్కెట్ కరెక్షన్లో పేరొందిన పలు ఫండ్స్ కూడా రాబడుల విషయంలో సమస్యలను ఎదుర్కొన్నాయి. కానీ, కొన్ని ఫండ్స్ మాత్రం ప్రతికూలతలను గట్టిగా ఎదుర్కొని నిలబడ్డాయి. వాటిలో పరాగ్ పారిఖ్ లాంగ్ టర్మ్ వేల్యూ ఫండ్ కూడా ఒకటి. ఈ పథకం ఏడాది రాబడులను పరిశీలిస్తే బెంచ్ మార్క్ (నిఫ్టీ 500) కంటే రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. మల్టీ క్యాప్ కేటగిరీ రాబడులతో పోలిస్తే సగటున ఐదు శాతం అధికం కావడం ఈ పథకం పనితీరుకు నిదర్శనాలు. ఈ పథకం ప్రారంభించి ఐదేళ్లు పూర్తయింది. అప్పటి నుంచి చూసుకుంటే వార్షికంగా సగటున 19.5 శాతం రాబడులు ఉన్నాయి. దీంతో ఈ విభాగంలో ఈ పథకం అగ్ర స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో ఈ పథకాన్ని కూడా చేర్చే అంశాన్ని పరిశీలించొచ్చు. పెట్టుబడుల విధానం పరాగ్ పారిఖ్ లాంగ్ టర్మ్ వేల్యూ ఫండ్ పేరులో ఉన్నట్టు వేల్యూ ఇన్వెస్టింగ్ సూత్రాన్ని పాటిస్తుంది. బుల్ మార్కెట్లో పెద్దగా ప్రభావం చూపని స్టాక్స్, విలువ పరంగా ఆకర్షణీయ స్థాయిల్లో ఉన్న వాటిని ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తుంది. బుల్స్ పరుగు నిదానించాక, ఈ స్టాక్స్ సత్తా చూపించే విధంగా ఉంటాయి. నాణ్యమైన స్టాక్స్‌ను, అది కూడా అధిక ధరల వద్ద కాకుండా సరసమైన ధరల వద్ద లభించే వాటిని దీర్ఘకాలిక దృష్టితో ఈ పథకం మేనేజర్లు పోర్ట్‌ఫోలియో కోసం ఎంపిక చేసుకుంటారు. బాటమ్ అప్, కొనుగోలు చేసిన తర్వాత వేచి ఉండే విధానాన్ని అనుసరిస్తారు. గత ఏడాదిన్నర కాలంలో ఈ పథకం నగదు నిల్వలను, ఆర్బిట్రేజ్ పొజిషన్లను పెంచుకుంది. 2016 డిసెంబర్ నాటికి 9 శాతంగా ఉంటే, 2018 జూన్ నాటికి 24 శాతానికి పెంచుకోవడం జరిగింది. దేశీయ స్మాల్ స్టాక్స్‌లోనూ ఎక్స్పోజర్ను 20 శాతానికి తగ్గించుకుంది. ఏడాదిన్నర క్రితం ఇది 30 శాతం స్థాయిలో ఉంది. దీంతో మిడ్, స్మాల్ క్యాప్స్ భారీ నష్టాలను చవిచూసిన తాజా మార్కెట్ కరెక్షన్లో ఈ పథకం మెరుగ్గా ఉండేందుకు తోడ్పడింది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలోని ఎంఫసిస్, మహారాష్ట్ర స్కూటర్స్ బాగా పెరిగాయి. ఈ పథకం తన పెట్టుబడుల్లో మూడింట ఒక వంతు అంతర్జాతీయ బ్లూచిప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ పెట్టుబడులు 28 శాతంగా ఉన్నాయి. రాబడులు ఏడాది కాలంలో ఈ పథకం 16.5 శాతం రాబడులను అందించింది. మరి ఇదే కాలంలో బెంచ్ మార్క్ రాబడులు 7.9 శాతమే కావడం గమనార్హం. మూడేళ్ల కాలంలో సగటు వార్షిక రాబడులు 12.7 శాతంగా ఉండగా, బెంచ్ మార్క్ రాబడులు 10.2 శాతం. ఐదేళ్ల రాబడులు 19.5 శాతం అయితే, బెంచ్ మార్క్ రాబడులు 16.1 శాతంగా ఉన్నాయి. వైవిధ్యం: అంతర్జాతీయంగా బ్లూచిప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఈ పథకంలో ప్రత్యేకత. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్లో ఈ పథకం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. మొత్తం పథకం నిధుల్లో 10% ఆల్ఫాబెట్‌లోనే ఉన్నాయి. తర్వాత ఫేస్బుక్లో 5% ఇన్వెస్ట్ చేసింది. విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసినప్పటికీ ఈ పథకం కనీసం 65% పెట్టుబడులను దేశీయ ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటుంది. -
ఆటుపోట్లలో పెట్టుబడికి అనువైనదే!!
ప్రస్తుతం మార్కెట్లు తీవ్ర హెచ్చు, తగ్గులతో ట్రేడవుతున్నాయి. ఇలాంటపుడు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు నష్టభయం తక్కువగా ఉండాలనే అనుకుంటారు. అలాంటి పథకాల కోసం అన్వేషించే వారు ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. మొన్నటి వరకు ఎస్బీఐ మాగ్నం బ్యాలన్స్డ్ ఫండ్‌గా చెలామణి అయిన ఈ పథకం పేరు సెబీ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్‌గా మారింది. అయితే, పెట్టుబడుల పరంగా పథకం విధానాల్లో పెద్దగా మార్పులేమీ చేసుకోలేదు. ఈక్విటీల్లో కనీసం 65శాతం పెట్టుబడి పెడుతుంది. అంటే ఇంతకుమించి కూడా సందర్భానుసారంగా ఇన్వెస్ట్ చేస్తుంటుంది. మిగిలిన పెట్టుబడులను డెట్ విభాగంలో ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల్లో పెడుతుంది. మార్కెట్ అస్థిరతల సమయాల్లో ఈ పథకం పనితీరు చెప్పుకోతగిన విధంగా ఉండటం గమనార్హం. నేర్పుతో కూడిన విధానం ఈక్విటీ, డెట్ మార్కెట్లలో అననుకూల సమయాల్లో నగదు నిల్వలను పెంచుకోవడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. ఈక్విటీల్లో తక్కువ ఎక్స్పోజర్ కారణంగా 2011, 2015 అస్థిరతల మార్కెట్లలో నష్టాలు పరిమితమయ్యాయి. 2014లో బాండ్ మార్కెట్ ర్యాలీలో అధిక లాభాలను ఒడిసి పట్టుకుంది. ఆ ఏడాది 23 శాతం వరకు పెట్టుబడులను దీర్ఘకాలిక ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టింది. అంతకుముందు ఏడాది ఇది 10 శాతంగానే ఉంది. ఇక 2017 ఈక్విటీ మార్కెట్లలో భారీ ర్యాలీ అనంతరం కరెక్షన్ నేపథ్యంలో గడిచిన కొన్ని నెలల కాలంలో ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించుకుంది. మిడ్‌క్యాప్స్‌కు 30–35 శాతం వరకు కేటాయింపులు చేయడం ద్వారా 2014 బుల్ ర్యాలీలో మంచి పనితీరు కనబరిచింది. అయితే, వీటిలో వాల్యుయేషన్లు గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో 2017 నుంచి ఎక్స్పోజర్ తగ్గించుకుంది. డెట్ వైపు గతేడాది కాలంలో 10 ఏళ్ల కాల పరిమితి గల ప్రభుత్వ సెక్యూరిటీలపై ఈల్డ్స్ 7.7 శాతానికి చేరిన నేపథ్యంలో దీర్ఘకాలిక బాండ్లలో పెట్టుబడులను తగ్గించుకుని షార్ట్‌టర్మ్ మనీమార్కెట్ ఇన్స్ట్రుమెంట్లలో ఎక్స్పోజర్ తీసుకుంది. రాబడులు ఇలా ఉన్నాయ్... పెట్టుబడుల పరంగా ఈ విధమైన వ్యూహాల కారణంగా ఈ పథకం సదరు కేటగిరీలో మెరుగైన పనితీరు చూపించగలుగుతోంది. ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు కేటగిరీతో పోలిస్తే సగటున 1–5 శాతం అధికంగా ఉన్నాయి. ఏడాది కాలంలో 13.8 శాతం, మూడేళ్లలో 9.9 శాతం, ఐదేళ్లలో 16.8 శాతం చొప్పున వార్షిక రాబడులను ఈ పథకం అందించింది. పోర్ట్‌ఫోలియో:ప్రస్తుతం ఈ పథకం ఈక్విటీలో 65 శాతం, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లలో 13 శాతం, కార్పొరేట్ డిబెంచర్లలో 8 శాతం, 11 శాతం ప్రభుత్వ సెక్యూరిటీల్లో కలిగి ఉంది. కాలానుగుణంగా ఈక్విటీ హోల్డింగ్స్‌లో మార్పులు చేస్తుంటుంది. -
భారీ పెట్టుబడులతో దూసుకొస్తున్న అమెజాన్
న్యూఢిల్లీ: అమెరికా ఆన్లైన్ రీటైల్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో మరిన్న పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉంది. భారత్‌లో తమ మార్కెట్‌ను విస్తరించుకోవడానికి పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. 5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు, తద్వారా వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ఉత్సాహంగా ఉన్నామని ఆ సంస్థ సీఈవో జెఫ్ బెజోస్ ట్విటర్లో పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీతో టెక్ దిగ్గజాల సమావేశం అనంతరం బెజోస్ ఈ విషయాన్ని ట్విట్టర్‌ద్వారా వెల్లడించారు. భారత్‌లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, వచ్చే నెల నుంచి అమలు కానున్న జీఎస్టీ విధానంతో వ్యాపారం మరింత సులభతరమవుతుందని ప్రధాని ఆయనకు వివరించారు. ఈ భేటీ జరిగిన తరువాత అమెజాన్ సీఈవో ట్విటర్ ద్వారా భారత్‌లో తమ సంస్థ పెట్టుబడుల విషయాన్ని వెల్లడించారు. 20 అమెరికా వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. వీరిలో అమెజాన్ సీఈవో బెజోస్, ఆపిల్ సిఈఓ టిమ్ కుక్, గూగుల్ సుందర్ పిచాయ్, సిస్కో నుంచి జాన్ చాంబర్స్, శాంతాను నారాయణ్ అడోబ్ నుంచి, మాస్టర్ కార్డ్ నుంచి అజయ్ భట్నాగర్ తదితరులు ఉన్నారు. కాగా ఇటీవల భారతదేశంలో నాలుగు సంవత్సరాల కార్యకలాపాలను పూర్తి చేసుకున్న అమెజాన్, ఇంటిగ్రేటెడ్ ఇ-రీటైలర్ ఫ్లిప్‌కార్ట్ తో నాయకత్వం కోసం తీవ్ర పోరాడుతోంది. 13 రాష్ట్రాల్లో 41 గిడ్డంగులను కలిగి ఉంది. 2013లో 100 మంది అమ్మకందారులతో ప్రారంభమైన ఈ సంస్థ నేడు 2లక్షల మందికి చేరుకున్నసంగతి తెలిసిందే. -
రోజూ రూ.8 కోట్లు జేబులోకి...
ముంబై: బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా రోజూ రూ.8.40 కోట్లు ఆర్జిస్తున్నారు. ఏడాదికిపైగా ఆయన అలా సంపాదిస్తూనే ఉన్నారు. షేర్ మార్కెట్లో బుల్ రన్‌తో ఆయన ఆదాయం కూడా పెరిగిపోతూ ఉంది. ఆయన కుటుంబ సభ్యుల పోర్ట్‌ఫోలియో విలువ ఏడువేల కోట్ల రూపాయలు మించిపోయిందని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక రాసింది. 2008లో ముగిసిన బుల్ రన్లో ఝున్‌ఝున్‌వాలా బిలియనీర్ (బిలియన్ = 100 కోట్లు) అయ్యారు. తర్వాత మార్కెట్ల పతనం ప్రభావం అందరితోపాటే ఝున్ఝున్వాలాపైనా పడింది. 2009 మార్చి నాటికి ఝున్‌ఝున్‌వాలా వద్ద ఉన్న మొత్తం షేర్ల విలువ రూ.1,130 కోట్లకు క్షీణించింది. 2007 డిసెంబర్ నాటి విలువ రూ.3,461 కోట్లతో పోలిస్తే ఇది మూడోవంతే. అయితేనేం, ప్రస్తుత బుల్ రన్‌తో ఆయన ఆస్తులు దినదిన ప్రవర్థమానం అవుతున్నాయి. గతేడాదిలో పరిశీలిస్తే... ఆయన నెట్‌వర్త్ వారానికి రూ.59 కోట్లు, నెలకు రూ.256 కోట్ల చొప్పున పెరిగింది. జూన్ చివరి నాటికి ఝున్‌ఝున్‌వాలా, ఆయన కుటుంబ సభ్యుల మొత్తం నెట్‌వర్త్ రూ.7,261 కోట్లు. ఏడాది క్రితం ఇది కేవలం రూ.4,192 కోట్లు మాత్రమే. దేశీయ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన 5,463 కంపెనీల్లో దాదాపు 96% కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ఝున్‌ఝున్‌వాలా కుటుంబ నెట్‌వర్తే అధికం. (ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి ఒక శాతం కంటే ఎక్కువ వాటా ఉన్న కంపెనీల్లోని హోల్డింగ్స్ ఆధారంగా ఈ గణాంకాలు రూపొందించాం.) ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలోని టైటాన్, ల్యుపిన్, క్రిసిల్, ర్యాలీస్ ఇండియా, అరబిందో ఫార్మా, దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఫెడరల్ బ్యాంక్ వంటి కంపెనీల ఈక్విటీల ధర గత నెలలో ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి. ఈ కంపెనీలన్నిటిలోనూ ఒక్కోదాంట్లో రూ.100 కోట్లకు మించిన విలువైన షేర్లు ఈ కుటుంబం వద్ద ఉన్నాయి. ఝున్‌ఝున్‌వాలా కుటుంబ నెట్‌వర్త్ కంటే తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న ప్రముఖ కంపెనీల్లో ఇండియన్ హోటల్స్ (మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,041 కోట్లు), ముత్తూట్ ఫైనాన్స్ (రూ.7,028 కోట్లు), యూనిటెక్ (రూ.6,837 కోట్లు), సుజ్లాన్ ఎనర్జీ (రూ.6,254 కోట్లు), డిష్ టీవీ ఇండియా (రూ.6,171 కోట్లు) ఉన్నాయి. ఏప్రిల్ - జూన్ క్వార్టర్లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, ఫెడరల్ బ్యాంక్, ఈడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రకాశ్ ఇండస్ట్రీస్, పొలారిస్ ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఓరియంట్ సిమెంట్, మెక్నల్లీ భారత్ ఇంజినీరింగ్ వంటి కంపెనీలు ఆయన పోర్ట్‌ఫోలియోలో చేరాయి. జూన్ క్వార్టర్‌లోనే ఆయన ఎంసీఎక్స్‌లో 1.45 వాటాను ఓపెన్ మార్కెట్లో కొన్నారు. తర్వాత ఒక్కో ఈక్విటీ రూ.664 ధరకు ఎంసీఎక్స్‌లో 1.96 శాతం వాటాను కొనుగోలు చేశారు. సోమవారం ఈ స్టాకు రూ.824 వద్ద క్లోజైంది. టైటాన్, ల్యుపిన్, క్రిసిల్, కరూర్ వైశ్యాబ్యాంక్, ఎ టూ జడ్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ సర్వీసెస్ కంపెనీల్లో హోల్డింగ్‌ను ఝున్‌ఝున్‌వాలా ఇటీవల తగ్గించుకున్నారు. కంపెనీల షేర్లే కాదు, ముంబైలో రూ.100 కోట్ల విలువైన ఆస్తులను ఆయన కొన్నారని సమాచారం. అంతేనా, కోట్ల విలువైన అనేక రేసు గుర్రాలు కూడా ఆయన వద్ద ఉన్నాయి. -
మళ్లీ కిసాన్ వికాస్ పత్రాలు
సురక్షితమైన రాబడులను కోరుకునే చిన్న ఇన్వెస్టర్ల కోసం ప్రభుత్వం మళ్లీ కిసాన్ వికాస్ పత్రాలను (కేవీపీ) పునరుద్ధరించాలని నిర్ణయించింది. తాజా బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. ఇది దుర్వినియోగం అవుతోందనే ఉద్దేశంతో 2011 నవంబర్‌లో దీన్ని ప్రభుత్వం రద్దు చేసింది. పెట్టిన పెట్టుబడి దాదాపు ఎనిమిదేళ్ల ఏడు నెలల్లో రెట్టింపు చేసే కిసాన్ వికాస్ పత్రాలు అత్యంత ఆదరణ పొందాయి. పేరులో కిసాన్ అని ఉన్నప్పటికీ ఇది కేవలం రైతులకు మాత్రమే ఉద్దేశించినది కాదు. ఎవరైనా వీటిలో ఇన్వెస్ట్ చేసేలా గతంలో నిబంధనలు ఉండేవి. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం.. అత్యంత తక్కువగా రూ. 100లైనా పెట్టుబడి పెట్టొచ్చు. ప్రభుత్వ హామీ ఉండే ఈ సేవింగ్ బాండ్స్‌ను పోస్టాఫీసుల్లో తీసుకోవచ్చు. ఇందుకోసం ఉద్దేశించిన ఫారంతో పాటు ఫొటోగ్రాఫ్‌లు, డిపాజిట్ చేయదల్చుకున్న మొత్తాన్ని ఇస్తే పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికెట్‌ను అందజేస్తుంది. ఇందులో మీ పేరు, డిపాజిట్ మొత్తం, మెచ్యూరిటీ తేదీ, మెచ్యూరిటీ తీరాక చేతికి ఎంత వస్తుంది వంటి వివరాలు ఉంటాయి. సాధారణంగా జారీ చేసిన తేదీ నుంచి రెండున్నరేళ్ల తర్వాత కావాలనుకుంటే వీటిని నగదు కింద మార్చుకోవచ్చు. ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు కిసాన్ వికాస్ పత్రాలను.. హామీగా కూడా ఉంచుకుని వివిధ రకాల రుణాలు ఇస్తుంటాయి. అయితే, వీటిపై వచ్చే వడ్డీ ఆదాయం మీద పన్ను మాత్రం కట్టాల్సి ఉంటుంది. ఇదంతా రద్దు చేయడానికి ముందు కిసాన్ వికాస్ పత్రాల స్వరూపం. తాజా స్వరూపం ఎలా ఉంటుందనేది ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
పెట్టుబడికి పండంటి సూత్రాలు..
చిన్న మొక్క రేప్పొద్దున మహా వృక్షంగా ఎదిగి తియ్యని ఫలాలు ఇవ్వాలన్నా.. చల్లని నీడనివ్వాలన్నా.. ముందుగా నేడు విత్తు నాటడం ముఖ్యం. అది ఎంత ఆలస్యం చేస్తే.. ఫలాలు అందుకోవడానికి అంతే ప్రయాసపడాల్సి వస్తుంది. ఇదే సూత్రం పెట్టుబడులకూ వర్తిస్తుంది.భవిష్యత్‌లో ఆర్థిక కష్టాలు లేకుండా నిశ్చింతగా ఉండాలంటే ఎంతో కష్టించి సంపాదించిన డబ్బును.. ఇన్వెస్ట్ చేసేందుకుకొన్ని సూత్రాలు పాటించాల్సి ఉంటుంది. వాటిలో కొన్నింటిని గురించి వివరించేదే ఈ వారం ధనం కథనం.. యుక్తవయసులోనే తొలి అడుగు సంపాదన మొదలుపెట్టిన తొలినాళ్ల నుంచే ఇన్వెస్టింగ్ మొదలుపెట్టడం కూడా మంచిది. వచ్చే ఆదాయంలో గోరంతే దాచగలిగినా సరే.. క్రమం తప్పకుండా కొనసాగించాలి. కాంపౌండింగ్ ప్రభావంతో అది కొండంత అవుతుంది. అలాగే, ఆర్థిక క్రమశిక్షణ కూడా ఇది అలవరుస్తుంది. చేసిన పెట్టుబడులపై వచ్చిన రాబడులను మళ్లీ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లండి. మన గురించి తెలుసుకోవాలి .. ఇన్వెస్ట్ చేయాలంటే ముందుగా అసలు మీరు ఏ తరహా ఇన్వెస్టరో మిమ్మల్ని గురించి మీరు ప్రశ్నించుకుని, తెలుసుకోవాలి. ఇన్వెస్టింగ్ అనేది ఒక కళలాంటిదే. దీనికోసం మీరు ఎంత సమయం కేటాయించగలరు, ఎంత మేర పరిశోధించగలరు అన్న విషయాలపై అంచనా వేసుకోవాలి. లక్ష్యాలు మనకంటూ కొన్ని ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. వాహనం కొనుక్కోవడమో లేదా ఇల్లు కొనుక్కోవడమో, పిల్లల చదువు, పెళ్లిళ్ల ఖర్చులు, రిటైర్మెంట్ అవసరాలు.. ఇలాంటివెన్నో ఉంటాయి. వీటిలో కొన్ని స్వల్పకాలికమైన, మధ్యకాలికమైన, దీర్ఘకాలికమైన అవసరాలు ఉంటాయి. ఇలా వేటి కోసం ఇన్వెస్ట్ చేయదల్చుకున్నారో నిర్ణయించుకోవాలి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోవాలి. నెలవారీ కావొచ్చు..మూణ్నెల్లకోసారి, ఆర్నెల్లకోసారి కావొచ్చు ఎంత డబ్బును ఇన్వెస్ట్ చేయగలరన్నది లెక్క వేసుకోవాలి. ఎలాంటి రాబడులను ఆశిస్తున్నారో చూసుకోవాలి. ఇన్వెస్ట్ చేసే సాధనంపై అధ్యయనం ఏయే సాధనాల్లో, ఏయే ప్లాన్లలో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నారో వాటిని గురించి సాధ్యమైనంత సమాచారాన్ని సేకరించండి. ఒకే సాధనం గురించి వేర్వేరు సంస్థలు కల్పించే ప్రయోజనాలు, రాబడులు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. సాధనం గురించి, వాటిని అందించే వారి గురించి అవగాహన ఉండాలి. వైవిధ్యం.. ప్రతి ఇన్వెస్ట్మెంట్ సాధనమూ ఏదో ఒక సమయంలో హెచ్చుతగ్గులకు లోను కావచ్చు. కాబట్టి, ఎప్పుడూ కూడా ఒక దాంట్లో మాత్రమే మొత్తం డబ్బును ఇన్వెస్ట్ చేయకూడదు. రెండు మూడు సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్కులను కొంత తగ్గించుకోవడానికి వీలుంటుంది. గత వైభవం కాదు.. ఇన్వెస్ట్మెంట్ సాధనం ఏదైనా సరే.. కేవలం గతకాలపు పనితీరుని బట్టే ఎంచుకోకూడదు. మన మిత్రులో లేక సన్నిహితులకో దాని ద్వారా బోలెడంత లాభాలొచ్చాయన్న కారణంతో ఆ సాధనం వైపు మొగ్గుచూపడం సరికాదు. మన ఫ్రెండ్‌కి లాభాలొచ్చినంత మాత్రాన మనకూ అలాగే లాభాలొచ్చేస్తాయనుకుంటే కష్టం. గతకాలపు పనితీరును దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్‌లో అవకాశాలను కొద్దో గొప్పో అంచనా వేసుకోగలిగితే మేలు. టైమింగ్ .. దేనికైనా టైమింగ్ ముఖ్యం. ఏ సాధనంలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం.. ఎంత కాలం కొనసాగించగలం, ఎప్పుడు వైదొలగాలనుకుంటున్నాం.. ఇవన్నీ కూడా కీలకమే. కాబట్టి ఈ విషయాల గురించి ముందుగానే కచ్చితంగా ఒక అవగాహన ఉండాలి. దీర్ఘకాలికం.. మనం పెట్టుబడులను ఎంత కాలం కొనసాగించగలమన్న దానిపైనే రిస్కులు, రాబడులు ఆధారపడి ఉంటాయి. మీరు ఎంత రాబడి కోసం ఎంత రిస్కు తీసుకోదల్చుకున్నారన్నదీ కీలకమే. ముందుగానే చెప్పినట్లు.. మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి కాబట్టి.. దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేయగలిగినట్లయితే రిస్కులను కాస్త యావరేజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఊహించొద్దు.. ఎంత ఆశావహంగా ఉన్నా లాభాల విషయంలో వచ్చే దానికన్నా ఎక్కువగా ఊహించుకుని లెక్క వేసుకోవద్దు. సాధ్యమైనంత వరకూ తక్కువే రావొచ్చని ఆచితూచి అంచనాలు వేసుకుంటే తప్పులు చేసే అవకాశాలు తగ్గుతాయి. సహనం.. సమీక్ష ఒకోసారి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు నిస్పృహ ఆవరించి.. సహనం నశించవచ్చు. కానీ, ఇక్కడ మీరు అసహనంతో ఏ నిర్ణయం తీసుకున్నా మీ కష్టార్జితాన్ని కోల్పోవాల్సి వస్తుందని గుర్తుంచుకుని, సాధ్యమైనంత మేర నిబ్బరంగా ఉండే ప్రయత్నం చేయక తప్పదు. అప్పుడప్పుడు మార్కెట్ పరిస్థితులను బట్టి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో మార్పులు, చేర్పులు చేసుకుంటూ ఉండాలి. గతం గతః తప్పులు చేయడం మానవ సహజం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గతంలో చేసిన తప్పుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే.. చేతికి వచ్చిన అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. ఉదాహరణకు.. మీరు తీసుకున్న షేరును ఏదో ఒక రేటుకు అమ్మేసిన తర్వాత.. అది మరింత పెరిగిందనుకోండి. అరెరే మరింత కాలం వేచి ఉండాల్సిందంటూ దాని గురించే ఆలోచిస్తూ సమయం వృథా చేయడం కన్నా ఇతర అవకాశాలను అన్వేషించి అంది పుచ్చుకోవడం ఉత్తమం. తప్పిదాల నుంచి నేర్చుకుని, ఆ అనుభవంతో ముందుకెళ్లాలి. -
ఐఎస్బీలో ఎన్ఎస్ఈ ట్రేడింగ్ ల్యాబ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సంపన్న, వర్ధమాన దేశాల్లో ఇన్వెస్టింగ్ తీరుతెన్నుల గురించి అవగాహన పెంచే దిశగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) చేతులు కలిపింది. హైదరాబాద్‌లోని ఐఎస్బీ క్యాంపస్‌లో ట్రేడింగ్ లేబొరేటరీని ఏర్పాటు చేసింది. ఎన్ఎస్ఈ ఎండీ చిత్రా రామకృష్ణ బుధవారం ఇక్కడ దీన్ని ప్రారంభించారు. అంతర్జాతీయంగా మారుతున్న ట్రేడింగ్ తీరుతెన్నులు, సంపన్న దేశాల్లో పాటిస్తున్న విధానాలు, వర్ధమాన దేశాల్లో విధానాలు మొదలైన వాటిని అధ్యయనం చేసేందుకు ఈ ల్యాబ్ ఉపయోగపడగలదని ఈ సందర్భంగా చిత్రా తెలిపారు. బిజినెస్ స్కూల్స్‌తో ఎన్ఎస్ఈ ఈ తరహా ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే ప్రథమం అని ఆమె చెప్పారు. కేవలం పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా విద్యార్థులు ఎప్పటికప్పుడు ప్రపంచ మార్కెట్ల పరిస్థితులను తెలుసుకునేందుకు ఈ ల్యాబ్‌లో 34 ట్రేడింగ్ టెర్మినల్స్ ఉన్నాయని ఐఎస్బీ డీన్ అజిత్ రంగ్నేకర్ తెలిపారు. బ్లూమ్‌బర్గ్, థామ్సన్ రాయిటర్స్ వంటి ప్రీమియం బిజినెస్ సంస్థల డేటాబేస్లు కూడా వారికి అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమను తాము తీర్చిదిద్దుకునేందుకు ఈ ల్యాబ్ తోడ్పడగలదని రంగ్నేకర్ వివరించారు. -
సిప్ టైమ్... అయితే ఓకే!
స్టాక్ మార్కెట్లో తలపండిన వారు సైతం మార్కెట్ ఒడిదుడుకులను కచ్చితంగా అంచనా వేయడం కష్టమే. ఇక సామాన్యులెంత? సహజంగానే స్టాక్ మార్కెట్‌తో పెద్దగా పరిచయం లేని వారు ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తుంటారు. సరైన సమయం అనుకున్నపుడు ఎంత రిస్కయినా వెనకాడరు. మరికొంతమంది స్టాక్ మార్కెట్లు కొత్త గరిష్ట స్థాయిలకు చేరినప్పుడు ఇంకా పెరిగి లాభాలు అందిస్తాయని ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొందరైతే పడిపోతున్నప్పుడు అమ్ముకొని బయటపడాలని చూస్తారు. నిజానికి ఈ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి క్రమానుగత పెట్టుబడి(సిప్) చక్కటి మార్గం. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలతో ఇన్వెస్ట్ చేసేవారికి ఇది చాలా మంచిది. కొత్త వారిక్కూడా సిప్ బాగుంటుంది. నెలనెలా కొంత మొత్తం క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడాన్నే ‘సిప్’ విధానం అంటున్నాం. దీంతో మార్కెట్లో టైమింగ్‌తో సంబంధం లేకుండా ఆర్థిక క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగించొచ్చు. క్రమశిక్షణ: సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవాటవుతుంది. మార్కెట్ పెరుగుతోందా లేక పడుతోందా అన్న భయాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు జూలై, 2008న నెలకు రూ.5,000 చొప్పున జూన్, 2013 వరకు అంటే ఐదేళ్లలో రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఈ ఐదేళ్లలో మార్కెట్ నికరంగా 8 శాతం రాబడినిచ్చింది. దీంతో ఈ విలువ రూ.3.67 లక్షలయింది. ఇది పూర్తిగా పన్ను రహిత లాభం. ముఖ్యంగా ఈ మధ్యలో మార్కెట్ భారీ ఒడిదుడుకులకు లోనయింది. కానీ సిప్ ఇన్వెస్టరు దానికి భయపడాల్సిన అవసరం లేకపోయింది. రిస్క్ తగ్గుతుంది: ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత మార్కెట్లు పతనమైతే భారీ నష్టాలొస్తాయి. సిప్‌లో అయితే ఇలాంటి భయాలుండవు. ఉదాహరణకు ఈ నెల యూనిట్ ధర రూ.10 ఉన్నప్పుడు రూ.1,000 ఇన్వెస్ట్ చేస్తే చేతికి 100 యూనిట్లొస్తాయి. మరుసటి నెల మార్కెట్లు పడటం వలన యూనిట్ విలువ రూ.9 వచ్చిందనుకుందా. అప్పుడు రూ.1,000 ఇన్వెస్ట్ చేస్తే చేతికి 111 యూనిట్లు వస్తాయి. ధర పెరిగితే చేతి కొచ్చే యూనిట్లు తగ్గుతాయి. అదే ఒకేసారి రూ.10 వద్ద ఇన్వెస్ట్ చేస్తే 300 యూనిట్లు మాత్రమే వస్తాయి. నష్టం కూడా అధికంగా ఉంటుంది. తర్వాత కాలంలో మార్కెట్లు కోలుకుంటే అధిక ప్రయోజనం లభిస్తుంది. చక్ర లాభం: పెట్టుబడులను ఎంత తొందరగా ప్రారంభిస్తే చక్రగతిన అంత ఎక్కువ లాభాలు పొందుతారు. ఉదాహరణకు రాము 20 ఏళ్ల వయసులో నెలకు రూ.5,000 చొప్పున ఐదేళ్లు ఇన్వెస్ట్ చేశాడనుకుందాం. ఈ ఐదేళ్లలో ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ.3 లక్షలు. రాము స్నేహితుడు శ్యామ్ మాత్రం ఐదేళ్లు ఆలస్యంగా అంటే 25 ఏళ్లు వచ్చిన తర్వాత ఒకేసారి రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఇద్దరూ కూడా 50 ఏళ్లు పూర్తయితే కాని ఈ మొత్తం వెనక్కి తీసుకోకూడదనుకున్నారు. ఈ సమయంలో సగటున 10% రాబడిని లెక్కిస్తే రాము ఇన్వెస్ట్మెంట్ విలువ రూ.46.7 లక్షలు అయితే, శ్యామ్ విలువ రూ.36.2 లక్షలే. ఇద్దరూ ఇన్వెస్ట్ చేసింది రూ.3 లక్షలే అయినా రాబడిలో ఎంత తేడా!! సిప్ విధానంలో ఎంత తొందరగా ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు.