‘సాక్షి’ పెట్టుబడులు సక్రమమే.. | It Appellate Tribunal Verdict That Investing In Sakshi Media Is Legal | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ పెట్టుబడులు సక్రమమే

Published Tue, Jan 9 2024 11:02 AM | Last Updated on Tue, Jan 9 2024 11:23 AM

It Appellate Tribunal Verdict That Investing In Sakshi Media Is Legal

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులన్నీ సక్రమమేనని, చట్టబద్ధమేనని 2022 డిసెంబర్లో ఐటీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ స్పష్టంగా చెప్పింది. జగతి పబ్లికేషన్‌లో ఇన్వెస్టర్లంతా చట్టానికి లోబడే పెట్టుబడులు పెట్టారని, ఇన్వెస్ట్‌మెంట్లు స్వీకరించడంలో కంపెనీలు చట్టప్రకారం పాటించాల్సిన నిబంధనలన్నిటినీ జగతి పబ్లికేషన్స్‌ పాటించిందని ఐటీ శాఖ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది. ఈ కంపెనీలోకి పెట్టుబడులన్నీ క్విడ్‌–ప్రో–కో రూపంలో వచ్చాయి కనుక వాటిని ఆదాయంగా పరిగణించి, ఆ మొత్తం పై పన్ను చెల్లించాలంటూ 2011లో నాటి ఐటీ అధికారి ఇచ్చిన నోటీసులను ట్రిబ్యునల్‌ కొట్టివేసింది.

ఐటీ విభాగం తమ వాదనకు మద్దతుగా సమర్పించిన సీబీఐ ఛార్జిషీట్లను... అస­లు సాక్ష్యంగానే పరిగణించలేమని తెగేసి చెప్పింది. సాక్ష్యానికి ఉండాల్సిన కనీస లక్షణాలేవీ ఆ ఛార్జిïÙట్లకు లేవని కూడా బెంచ్‌ వ్యాఖ్యానించింది. ‘ఆ ఛార్జిషిట్లలో ఉన్నవన్నీ సీబీఐ చేసిన ఆరోపణలే తప్ప నిరూపితమైనవేమీ కావు. అయినా మీరు నోటీసులిచ్చిన అసెస్‌మెంట్‌ ఇయర్‌ దాటి ఇప్పటికి పదేళ్లు గడిచింది. మీరేమైనా దర్యాప్తు చేశారా? క్విడ్‌ ప్రోకో ఆరోపణలు నిరూపించే ఆధారాలేమై­నా సంపాదించారా? సీబీఐ ఆరోపణలనే సాక్ష్యంగా సమర్పిస్తే ఎలా? సీబీఐ ఛార్జిషీట్లకు ఎలాంటి హేతుబద్దతా లేదు.

ఈ కేసులో అవి అనవసరం, అప్రస్తుతం కూడా‘ అని జ్యుడిషియల్, అకౌంటింగ్‌ సభ్యులతో కూడిన ట్రిబ్యునల్‌ బెంచ్‌ తేల్చిచెప్పింది. తద్వారా... సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులపై రామోజీరావు, టీడీపీ అధిపతి చంద్రబాబునాయుడు, మిగిలిన ఎల్లో గ్యాంగ్‌ పనిగట్టుకుని చేస్తున్న దు్రష్పచారానికి విలువ లేదని, అదంతా బూటకమని స్పష్టమయింది. సుదీర్ఘకాలం విచారించి, ఇరుపక్షాల వాదనలూ సమగ్రంగా విన్న అనంతరం 2022 డిసెంబరు 23న బెంచ్‌ 153 పేజీల ఉత్తర్వులను వెలువరించింది.  

ఒక్కొక్కరికీ ఒక్కో’లా’ ఎలా? 
‘‘కొందరు ఇన్వెస్టర్ల విషయంలో ఇదే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. వారి విషయంలో ఎలాంటి క్విడ్‌ ప్రో కో లావాదేవీలూ జరగలేదని స్పష్టంగా చెప్పింది. పోనీ... మిగతా ఇన్వెస్టర్ల విషయంలో క్విడ్‌ ప్రోకో జరిగిందని కూడా ఆ మెమోలో చెప్పలేదు. మరి క్విడ్‌ ప్రో కో అని మీరెలా అంటారు?‘ అని బెంచ్‌ తన ఉత్తర్వుల్లో ఐటీ విభా­గాన్ని ప్రశ్నించింది. ప్రయివేటు లిమిటెడ్‌లో షేరు ప్రీమియం అనేది ఇన్వెస్టర్లతో జరిగే చర్చలు, వారి అంచనాల వల్లే నిర్ణయమవుతుందని పేర్కొంది. 

ఇన్వెస్టర్ల వాదనను గమనించారా? 
సాక్ష్యాలుగా సమరి్పంచిన పలు వాదనల్లో నిమ్మగడ్డ గ్రూపు సంస్థల డైరెక్టరు నిమ్మగడ్డ ప్రకాశ్‌ చేసిన వాదనను బెంచ్‌ ప్రస్తావించింది. ‘‘ఈనాడులో పెట్టుబడులకోసం బ్లాక్‌స్టోన్‌ అనుకున్న విలువలో 20 శాతం డిస్కౌంట్‌కే సాక్షిలో వాటా దొరికింది. ఐదు ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు పెడదామని అనుకున్నాం. అందులో మీడి­యా ఒకటి. అందుకే సాక్షిలో పెట్టాం’’ అనే ప్రకాశ్‌ వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకో­వాలని బెంచ్‌ వ్యా­ఖ్యానించింది. వచి్చన పెట్టుబడులను ఆదా­యంగా పరిగణించలేమని విస్పష్టంగా 
తేల్చిచెప్పింది.

తెలియని మార్గాలంటే ఎలా? 
కోల్‌కతాలోని కొన్ని కంపెనీల నుంచి వచ్చిన రూ.­15 కోట్లను తెలియని మార్గాల నుంచి వచ్చిన మొ­త్తంగా ఐటీ విభాగం పేర్కొంది. దాన్ని బెంచ్‌ తప్పు­బడుతూ... కోల్‌కతా కంపెనీలతో సహా పెట్టుబడి ప్రతి కంపెనీ పాన్, రిజిస్ట్రేషన్‌ నెంబరు, అడ్రసు వంటి వివరాలన్నీ జగతి సంస్థ సమర్పించిందని, అన్నీ చట్టబద్ధంగానే ఉన్నప్పుడు ’గు­ర్తు తెలియని ఆదాయం’ ఎలా అవుతుందని ప్రశ్నించింది. 

వాల్యుయేషన్‌ నివేదిక నిజమేగా? 
‘‘వాల్యుయేషన్‌ రిపోర్టును అస్సలు తప్పు బట్టడానికి లేదు. అందులో పేర్కొన్న అంశాలన్నీ సాక్షి పత్రిక విషయంలో నిజమయ్యాయి. అనుకున్నట్లు­గానే సర్క్యులేషన్‌ పెరిగింది. పోటీపత్రిక ఈనాడు గుత్తాధిపత్యం తగ్గింది. పోటీపత్రిక 30 ఏళ్లలో సాధించిన సర్క్యులేషన్‌ను సాక్షి ఏడాదిన్నరలోనే సా­ధిం­చింది. కనుక వాల్యుయేషన్‌ నివేదికను తప్పు­బట్టలేం.

సాక్షి యాజమాన్యానికి అనుభవం లేకు­న్నా అంత ప్రీమియం తీసుకున్నారనే వాదన అర్థ­రహితం. వారి లీడర్‌షిప్‌లో ఆ పత్రిక అంచనాలన్ని­టి­నీ అందుకుంది. కాబట్టి క్విడ్‌ ప్రో కో వాదనకు అ­ర్థ­మే లేదు’’ అని బెంచ్‌ పేర్కొంది. ఐటీ అప్పిలేట్‌ ట్రి­బ్యునల్‌ ఇంత విస్పష్టంగా తీర్పునిచ్చినా... రామో­జీ, చంద్రబాబు గ్యాంగ్‌ మాత్రం ఇప్పటికీ పాత పా­టే పాడుతూ... పాచి కథనాలనే మళ్లీ మళ్లీ ప్రచురిస్తూ ఏదో చేసేయాలని ఆరాటపడుతుండటమే విచిత్రం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement