verdict
-
దళిత యువకుడి హత్య కేసులో సంచలన తీర్పు
-
పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
షారన్ రాజ్ హత్య కేసులో గర్ల్ ఫ్రెండ్ గ్రీష్మకు ఉరిశిక్ష
-
కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో దోషికి - శిక్ష ఖరారు
-
నాంపల్లి కోర్టు తీర్పుపై ఉత్కంఠ
-
భార్యకు మత్తిచ్చి.. ఏకంగా పదేళ్లపాటు పలువురితో సామూహిక అత్యాచారం
ఒక సామూహిక అత్యాచార కేసు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఆమె కథలోని భయంకర నిజాలు కన్నీళ్లు పెట్టిస్తాయి. ఆమెను జీవచ్ఛంగా మార్చి, స్వయంగా భర్తే పలువురితో (72మందికిపైగా) దాదాపు పదేళ్ల పాటు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సభ్య సమాజాన్ని నివ్వెర పర్చింది. ఈ కేసును విచారించిన కోర్టు జెసిల్ మాజీ భర్తకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దోషులుగా తేలిన మరో 51 మందికి కూడా శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసులోని షాకింగ్ విషయాలు ఇలా ఉన్నాయిజెసిల్ పెలికో కేసు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేయడం మాత్రమే కాదు, ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అత్యాచార కేసు కావడంతో తీవ్ర చర్చకు దారి తీసింది. జెసిల్ ఫెలికో భర్త డొమినిక్ పెలికో. జిసిల్కు ముగ్గురు పిల్లలు, మనవలు మనవరాళ్లు కూడా ఉన్నారు. 57 ఏళ్ల వయసులో ఉండగా భర్త ఎవ్వరూ ఊహించని విధంగా ఆమెపై భయంకరమైన అఘాయిత్యాలకు పాల్పడ్డాడు.తన భార్యపై అత్యాచారానికి రావాల్సిందిగా ఆన్లైన్ చాట్ రూమ్స్ ద్వారా ఆహ్వానం పలికాడు. ఇలా వచ్చిన వాళ్లు 20-72 వయస్సున్నవారున్నారు. ఇలా ఒకటి రెండూ కాదు ఏకంగా పదేళ్ల పాటు, భార్యకు మత్తుమందు ఇచ్చి తన అకృత్యాన్ని కొనసాగించాడు. ఈ విషయాలను చిత్రీకరించి, భద్రపరిచాడు కూడా. ఈ నేరానికి పాల్పడిన వారిలో కొందరు ఒక్కసారి, మరికొందరు ఆరుసార్లు అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే బాధితురాలు పూర్తి అచేతనంగా, దాదాపు కోమాలాంటి పరిస్థితిలో ఉండగా జరిగినట్టు పోలీసులు ధృవీకరించుకున్నారు.అయితే ఇంత జరుగుతున్నా, అనేక సార్లు తీవ్ర అనారోగ్యానికి గురైనా ఆమెకు ఏమాత్రం తెలియలేదు. ఆమెకు తనపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి 2020లో పోలీసుల ద్వారా మాత్రమే తెలిసింది.వెలుగులోకి ఎలా వచ్చింది2020లో ఒక షాపింగ్ మాల్లో యువతులపై అభ్యంతరంగా వీడియో చూస్తున్న క్రమంలో పోలీసులు అతగాణ్న అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా పోలీసులు విచారణలో తాను చేసిన మొత్తం దురాగతాల్ని బహిర్గతం చేశాడు. దీంతో విచారణాధికారులే నివ్వెరపోయారు. అతని ల్యాప్‌టాప్‌లో వేల వీడియోలను కనుగొన్నారు, దాదాపు 200 అత్యాచారాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఈ సమాచారాన్ని అంతటినీ ‘అబ్యూజ్’అనే ఫోల్డర్లో స్టోర్ చేసి పెట్టాడు. ఈ వీడియోలను పోలీసులు జెసికా(ఆమె అనుమతి మేరకు) చూపించారు. దీంతో ఆమె కదిలిపోయింది. తనపై అత్యాచారం చేసిన వాళ్లలో తన మనవడు వయస్సున్న వాడు ఉన్నాడంటూ తీరని ఆవేదనకు గురైంది జెసికా. దాదాపు ఇదే తరహాలో కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. అయితే వీటిని డొమినిక్ ఖండించాడు.ఈ కేసు విచారణ సందర్బంగా వందలాదిమంది ఆమెకు మద్దతుగా కోర్టుకు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తీర్పుకోసం ఎదురు చూశారు. అనేకమంది స్త్రీవాద గీతాలను ఆలపించారు. అటు జెసికా ముగ్గురు పిల్లలు కూడా కోర్టు ఆవరణలో తీర్పు వెలువరిస్తున్న సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. యుక్తవయస్సులో ఉన్న ఆమె మనవడు తొలిసారి ఆమె పక్కన నిలబడి, ఆమె మీడియాను ఉద్దేశించి ఆమె భుజంపై చేయి భరోసా ఇచ్చాడు. అయితే దోషులకు విధించిన శిక్షలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.71 ఏళ్ల జెసిల్ పెలికా మీడియాతో ఈ విచారణ సందర్భంగా జెసికా మాటలు ఆమెలోని అంతులేని ఆవేదనతోపాటు, తెగువకు నిదర్శంగా నిలిచాయి. నేరస్తులు సిగ్గుపడాలి తప్ప, తానెందుకు కృంగిపోవాలని అంటూ ధైర్యంగా ముందుకొచ్చింది ఇంతటి ఘోరం సమాజానికి తెలియాలి తన గొంతును వినిపించింది. ఇలాంటివి మరో చోట మరొకరికి జరగకూడదని నినదించింది. అంతేకాదు అత్యాచారాలకు ఆడవాళ్ల వేషధారణే, వారి వ్యవహారమే కారణమన్న వాదనను గట్టిగా తోసిపుచ్చింది. స్త్రీల పట్ల చాలా మంది పురుషుకున్న ఇలాంటి అసహ్యకరమైన వైఖరి మారాలని నినదించింది. దీనిపై చర్చ జరగాలని, ఈ కేసుపై నిజా నిజాలు ప్రపంచానికి తెలియజెప్పాలని కూడా మీడియాను కోరింది. తనపై జరిగిన దుర్మార్గంపై బహిరంగ విచారణ జరగాలని కోరుకున్న ధీర ఆమె.2021లో పోలీసులు తమ ప్రాథమిక విచారణను నిర్వహించినప్పుడు అరెస్టయిన దోషుల్లో చాలా మంది ఇప్పటికే జైలు జీవితం గడిపారు. కనుక కొంతమంది త్వరలో విడుదల కానున్నారు. మరోవైపుతాజా తీర్పుపై అప్పీల్లా? వద్దా? అనేది ఆలోచిస్తున్నానని డొమినిక్ న్యాయవాది తెలిపారు. అప్పీల్‌కు వెళ్లేందుకు 10 రోజుల సమయం ఉంది. గత వారం (డిసెంబరు 19)న తీర్పు వెలువడినప్పటి నుండి, పారిస్ ఆసుపత్రి హెల్ప్‌లైన్ నెంబర్లు కాల్స్ సంఖ్య విపరీతంగా పెరిగిందట. -
లగచర్ల కేసులో నేడు తీర్పు
సిటీ కోర్టులు: లగచర్లలో అధికారులపై దాడి కేసులో రైతులు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ఇరుపక్షాల వాదనలు మంగళవారం ముగిశాయి. సొమవారం రైతుల తరఫున సురేందర్‌రావు, జక్కుల లక్ష్మణ్, జి.కిరణ్‌లు వాదనలు వినిపించగా, మంగళవారం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలు చేసి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి అఫ్రోజ్ అక్తర్ తీర్పును రిజర్వ్ చేస్తూ బుధవారానికి వాయిదా వేశారు.మొదటగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ ఎలక్ట్రానిక్ సమాచారంతోపాటు ఘటనకు సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు కోర్టుకు సమర్పించారు. వాటిని పరిశీలించి వెంటనే జోక్యం చేసుకున్న రైతుల తరఫు న్యాయవాదులు పీపీ దాఖలు చేసిన ఫొటోల్లో ఉన్న ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని, ఈ ఘటనకు సంబంధం లేని రైతులు, మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు సమర్పించిన ఆధారాల్లో ఒక్కరూ కూడా అరెస్టై రిమాండ్‌లో లేరని గుర్తు చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే అక్కడ దాడికి పాల్పడిన వ్యక్తితో ఫోన్లో మాట్లాడటం, వాట్సాప్ చాట్లు ఉన్నాయని అవన్నీ కోర్టుకు సమర్పించామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుర్తుచేశారు. మాజీ ఎమ్మెల్యేతోపాటు రైతుల అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని వారి ఆరోగ్యం క్షీణిస్తుందని రైతుల తరఫు న్యాయవాదులు కోర్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. నేడు తీర్పును వెలువరించే అవకాశముంది. -
పర్సనల్ బాండ్ తీసుకుని విడుదల చేయాలని ఆదేశం
-
ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు సంచలన తీర్పు
-
ఈడీ కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
ఎస్సీ వర్గీకరణ: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, సాక్షి: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్‌మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఇక.. 24గంటల్లో కమిషన్‌కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా వన్ మెన్ కమిషన్ రిపోర్టు సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణలో 60 రోజుల వరకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకూడదని, కమిషన్ రిపోర్ట్ ఇచ్చాకే కొత్త ఉద్యోగ నోటీఫికేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులు సూచనలు చేశారు. -
ఆ వీడియోలు చూడటం పోక్సో కింద నేరం..
-
కారు ధర రూ.51 లక్షలు, రిపేరుకు రూ.50 లక్షల అంచనా..
హైదరాబాద్: అది 2020 అక్టోబర్ నెల.. హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలు కురిశాయి. ఓ సర్వీస్ సెంటర్ నిర్లక్ష్యం వల్ల వరదల్లో కారు మునిగిపోయింది. పరిహారం కోసం బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. దీంతో రూ.31 లక్షల పరిహారం చెల్లించాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ సర్వీస్ సెంటర్‌ను ఆదేశిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది. సర్వీస్ కోసం వచ్చిన కారును బయటకు తీయకుండా కారు పూర్తిగా దెబ్బతినడానికి సర్వీస్ సెంటర్ సిబ్బందే కారణమని కమిషన్ తేల్చింది. ఈ పరిహారాన్ని 45 రోజుల్లోపు పిటిషనర్‌కు చెల్లించాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు సీహెచ్ లతాకుమారి, సభ్యులు పారుపల్లి జవహర్‌బాబు, శ్యామలతో కూడిన బెంచ్ తీర్పును ఇచ్చింది. కారు ధర రూ.51 లక్షలు, రిపేరుకు రూ.50 లక్షల అంచనా.. హైదరాబాద్‌లోని బ్లూ ఓషన్ మల్టీ క్టయింట్ ఆఫీస్ వారు 2015లో రూ.51 లక్షలు వెచ్చించి వోల్వో కారును కొనుగోలు చేశారు. 2019లో కారు అకస్మాత్తుగా ఎయిర్ కండీషన్ పనిచేయకుండా ఆగిపోయింది. అంతేగాకుండా ఇంజిన్ వేడెక్కి ప్రమాదకరంగా మారింది. దీంతో వెంటనే పిటిషనర్ తల్వార్ కార్స్ ప్రైవేట్ సర్వీస్ సెంటర్ దగ్గర రూ.83 వేలు వెచ్చించి రిపేరు చేసుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకే కారులో మళ్లీ సమస్యలు వచ్చాయి. కారు ఏసీ పూర్తిగా నీటితో నిండిపోవడంతో పలు రకాల సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో కారు యజమాని 2020లో కృష్ణ ఎక్స్‌క్లూజీవ్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించగా కారు రిపేరు కోసం రూ.2.73 లక్షల ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో కారు రిపేరు కోసం సర్వీస్ సెంటర్లోనే పెట్టుకున్నారు. 2020లో భారీ వర్షాలు కురిసి వరదలు రావడంతో సర్వీస్ సెంటర్లోకి నీరు వచి్చ, కారు మునిగిపోయి పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో కారు రిపేరు కోసం రూ.50.45 లక్షల వరకు ఖర్చు అవుతుందని సర్వీస్ సెంటర్ సిబ్బంది అంచనా వేసి చెప్పారు. సరైన సమయానికి కారు రిపేరు చేయకుండా పెట్టి వరదల్లో మునిగిపోవడానికి కారణం అయిన సర్వీస్ సెంటర్ సిబ్బంది దీనికి పూర్తి బాధ్యత వహించాలని పిటిషనర్ సూచించాడు. దీనికి వారు అంగీకరించకపోవడంతో పిటిషనర్ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను సంప్రదించి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్ కారు పూర్తిగా దెబ్బతినడానికి కృష్ణ ఎక్స్‌క్లూజీవ్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వీస్ సెంటర్ కారణమని తేల్చింది. అందుకు పైన తెలిపిన విధంగా పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచి్చంది. -
రేపే కేజ్రీవాల్ బెయిల్ తీర్పు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై.. తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై సుప్రీం కోర్టు రేపు(శుక్రవారం) తీర్పు వెల్లడించనుంది. సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. రేపు బెయిల్ మంజూరు అయితే అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కానున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన చేపట్టిన విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం బెయిల్ తీర్పును రిజర్వ్ చేసి రేపు (సెప్టెంబర్ 10)న వెల్లడిస్తామని పేర్కొంది.చదవండి: కేజ్రీవాల్ బెయిల్‌పై సుప్రీంలో వాడీవేడి వాదనలు -
ఓటుకు నోటు కేసుపై సుప్రీం కోర్టు తీర్పు.. ఆళ్ల రామకృష్ణారెడ్డి రియాక్షన్
-
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేయవచ్చు : సుప్రీంకోర్టు తీర్పు
-
కోటాలో సబ్ కోటా తప్పు కాదు..
-
ఎస్సీ,ఎస్టీ వర్గీకరణపై సీఎం రేవంత్ రియాక్షన్..
-
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై దామోదర రాజనర్సింహ రియాక్షన్
-
నీట్ ప్రశ్నాపత్రం లీక్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..
-
దిశ ఎఫెక్ట్: విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో 2017వ సంవత్సరంలో సంచలనం రేపిన కిడ్నాప్, లైంగిక దాడి కేసులో సంచలన తీర్పు వెలువరించింది. 5 వ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు గణేష్ కి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలుకి 4 లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని జడ్జి తీర్పు చెప్పారు.న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదవ్వగా, దిశ ఎఫెక్ట్‌తో విచారణ వేగవంతంగా జరిగింది. ముద్దాయికి కఠిన శిక్ష పడేలా వాదించిన స్పెషల్ పోక్సో పీపీ కరణం కృష్ణకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు. -
నటి కుటుంబం దారుణ హత్య.. తీర్పు వెలువరించిన కోర్టు!
బాలీవుడ్ నటి లైలా ఖాన్ ఫ్యామిలీ దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆమె సవతి తండ్రికి ముంబయి సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. దాదాపు 13 ఏళ్ల క్రితం జరిగిన ఈ దారుణ ఘటనపై విచారణ చేపట్టిన ముంబయి సెషన్స్ కోర్టు తుది తీర్పు వెలువరించింది.అసలేం జరిగిందంటే?బాలీవుడ్ నటి లైలా ఖాన్ ఫ్యామిలీ దారుణ హత్యకు గురికావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె సవతి తండ్రి అయిన పర్వేజ్ తక్ వారి ఫ్యామిలీ మొత్తాన్ని హతమార్చాడు. ఈ ఘటన 2011లో మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని ఇగత్‌పురిలో జరిగింది. ఈ ఘటనలో లైలా ఖాన్‌తో పాటు ఆమె తల్లి షెలీనా, తోబుట్టువులైన అజ్మీనా, జారా, ఇమ్రాన్, కజిన్ రేష్మాను అతను కాల్చిచంపాడు. వారి మృతదేహాలను వారి బంగ్లాలోనే పాతిపెట్టి పరారయ్యాడు.అయితే ఈ ఘటన జరిగిన దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఈ దారుణం బయటకొచ్చింది. ఆ తర్వాత కేసు నమోదు చేసుకున్న పోలీసులు పర్వేజ్ తక్‌ను జమ్మూకశ్మీర్‌లో అరెస్ట్ చేశారు. కాగా.. పర్వేజ్ తక్ లైలా తల్లి షెలీనాకి మూడవ భర్తగా పోలీసులు నిర్ధారించారు. ఆస్తి వివాదం కారణంగానే ఆరుగురిని అత్యంత కిరాతకంగా కాల్చి చంపినట్లు విచారణలో వెల్లడైంది.అసలు లైలా ఖాన్ ఎవరు?బాలీవుడ్ నటి లైలా ఖాన్ 2008లో విడుదలైన వాఫా: ఎ డెడ్లీ లవ్ స్టోరీలో నటించింది. ఈ చిత్రానికి రాకేశ్ సావంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాజేష్ ఖన్నా సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 2008లో కూల్ నహీ హాట్ హై హమ్ చిత్రంలో కనిపించింది. కాగా.. అంతకుముందే లైలా ఖాన్ 2002లో కన్నడ చిత్రం మేకప్‌తో సినిమాల్లోకి అడుగుపెట్టింది. -
వేలం వద్దు.. మేమే కేటాయిస్తాం.. మీ తీర్పును సవరించండి
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులపై 2012లో ఇచ్చిన తీర్పును సవరించాలని 12 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తిచేసింది. వేలం విధానంలో కాకుండా తామే కేటాయింపులు జరుపుతామని కోర్టుకు తెలిపింది. వేలం ద్వారా మాత్రమే కేటాయింపులు జరపాలంటూ ఇచ్చిన గత తీర్పును సవరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలాల ధర్మాసనం ఎదుట కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అభ్యర్థించారు. ఈ అంశంపై తక్షణం విచారణ చేపట్టాలని కోరారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్(ముందు వచ్చిన వారికే ప్రాధాన్యత) పద్ధతిలో యూపీఏ హయాంలో ఏ.రాజా టెలికం మంత్రిగా ఉన్నపుడు 2జీ స్పెక్ట్రమ్‌కు సంబంధించి కంపెనీలకు ఇచ్చిన 122 లైసెన్సులను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెల్సిందే. కొన్ని సందర్భాల్లో వేలంలో కాకుండా ప్రభుత్వమే కేటాయింపులు జరపాలని ఆశిస్తోందని, అందుకే పాత తీర్పును సవరించాలని అటార్నీ జనరల్ సోమవారం కోరారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని, వివరాలను ఈ–మెయిల్లో పంపాలని సీజేఐ చంద్రచూడ్ సూచించారు. అయితే తీర్పును సవరించాలంటూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పుబట్టారు. నాటి తీర్పు సమంజసంగానే ఉందని, సవరణ అనవసరమని ఆయన వాదించారు. ఆనాడు యూపీఏ సర్కార్‌కు వ్యతిరేకంగా 2జీ స్పెక్ట్రమ్‌పై ప్రజా ప్రయోజనా వ్యాజ్యం దాఖలుచేసిన ఎన్జీవో సంస్థ తరఫున ఆనాడు ప్రశాంత్భూషణే వాదించారు. కేటాయింపుల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని మన్మోహన్ ప్రభుత్వంలో నాటి కమ్యూనికేషన్స్, ఐటీ సహాయ మంత్రి కపిల్‌సిబల్ 2011లో వాదించారు. అయితే ఈ కేసులో ఎ.రాజా, డీఎంకే నాయకురాలు కనిమొళిలను నిర్దోషులుగా ప్రకటిస్తూ 2017 డిసెంబర్ 21న ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరిచింది. ఈ తీర్పును సవాల్‌చేస్తూ సీబీఐ 2018 మార్చి 20న హైకోర్టును ఆశ్రయించింది. అక్రమ కేటాయింపుల వల్ల కేంద్ర ఖజానాకు రూ.30,984 కోట్ల నష్టం వాటిల్లిందని వాదించింది. వేలం విధానంలో జరగని కేటాయింపుల లైసెన్స్‌లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. -
డిజైన్ టెక్ ఆస్తులను ఈడీ జప్తు చేయడం సబబే
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కీలక పాత్రధారైన డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన రూ.31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను (పీఏవో) హైకోర్టు సమర్థించింది. అలాగే మనీలాండరింగ్ చట్టం కింద డిజైన్ టెక్కు అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులు సైతం సబబేనని పేర్కొంది. ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ డిజైన్ టెక్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందే తేల్చుకోవాలని డిజైన్ టెక్కు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఈడీ తరపు న్యాయవాది జోస్యుల భాస్కరరావు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ కుంభకోణం తీవ్రత, ఇందులో ప్రజాధనం ముడిపడి ఉన్న నేపథ్యంలో ఈడీ ఉత్తర్వులు, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ నోటీసుల విషయంలో డిజైన్ టెక్ వాదనను ఆమోదించలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. ఆధారాలను బట్టి జప్తు చేసే అధికారం ఈడీకి ఉంది ‘మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఈడీ అధికారులు ఏ వ్యక్తి ఆస్తినైనా జప్తు చేయొచ్చు. ఆ ఆస్తిని నేరం ద్వారా సంపాదించారనేందుకు తమ ముందున్న ఆధారాలను బట్టి జప్తు చేసే అధికారం అధికారులకు ఉంది. ఈ అధికారాన్ని ఉపయోగించే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో డిజైన్ టెక్ ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. నేరం ద్వారా సంపాదించిన డబ్బు లేదా ఆస్తి (ప్రొసీడ్స్ ఆఫ్ క్రైం)కి విస్తృత నిర్వచనం ఉంది. సీఐడీ జప్తు చేసే నాటికి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లను మాత్రమే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైంగా భావించవచ్చని, అంతకు మించిన మొత్తాలను జప్తు చేసే అధికారం ఈడీకి లేదన్న డిజైన్ టెక్ తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వాస్తవానికి సీఆర్పీసీ సెక్షన్ 102 కింద సీఐడీ చేపట్టిన చర్యలు, మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ చేపట్టిన చర్యలు పరస్పరం భిన్నమైనవి. సీఐడీ జప్తుపై కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ముందు దాఖలైన వ్యాజ్యాల్లో ఈడీ ప్రతివాది కాదు. ఈ కోర్టులన్నీ కూడా కేవలం సీఐడీ జప్తు అంశానికే పరిమితమయ్యాయి. అందువల్ల ఈడీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులను ‘రెండో జప్తు’ అనడానికి ఏమాత్రం వీల్లేదు’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. డిజైన్ టెక్ వాదనలో ఏమాత్రం పస లేదు.. ‘అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు, ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులపై అభ్యంతరం తెలిపేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలను డిజైన్ టెక్ ఉపయోగించుకోవచ్చు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ నోటీసులకు వివరణ ఇచ్చినట్లు డిజైన్ టెక్ చెబుతోంది. అందువల్ల ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులను కూడా ఆ అథారిటీ ముందే తేల్చుకోవచ్చు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందుకు వెళితే తమకు ఇబ్బంది కలుగుతుందన్న డిజైన్ టెక్ వాదనలో ఏమాత్రం పస లేదు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా, ఇందులో ప్రజాధనం ముడిపడి ఉన్న కారణంతో ఆ వాదనను ఆమోదించలేకున్నాం. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని డిజైన్ టెక్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నాం. ఈ తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రభావానికి లోనవకుండా అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలి’ అని జస్టిస్ రవి తన తీర్పులో పేర్కొన్నారు. స్కిల్ కుంభకోణంపై రంగంలోకి దిగిన ఈడీ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు, అప్పటి మంత్రి అచ్చెన్నాయుడులతో పాటు పలువురు అధికారులను సీమెన్స్, డిజైన్ టెక్ తదితరులను నిందితులుగా చేర్చింది. వందల కోట్ల రూపాయల ప్రజాధనం దారి మళ్లడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా డిజైన్ టెక్ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు స్కిల్ కుంభకోణానికి సంబంధించినవేనని తేల్చింది. ఈ మొత్తాన్ని జప్తు చేస్తూ గతేడాది ఏప్రిల్ 21న ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు ఇచ్చింది. అనంతరం అడ్జ్యుడికేటింగ్ అథారిటీకి ఫిర్యాదు చేసింది. దీంతో అడ్జ్యుడికేటింగ్ అథారిటీ.. డిజైన్ టెక్కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గతేడాది జూలై 13లోపు ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని డిజైన్ టెక్‌ను ఆదేశించింది. ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులను, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ డిజైన్ టెక్ చైర్మన్ కమ్ ఎండీ వికాస్ వినయ్ ఖాన్వీల్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీది రెండో జప్తు అవుతుంది.. డిజైన్ టెక్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, ఈడీ తరఫున సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ జోస్యుల భాస్కరరావు వాదనలు వినిపించారు. డిజైన్ టెక్ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును సీఐడీ జప్తు చేసిందని, దానిపై తాము కింది కోర్టును ఆశ్రయించామని ఆదినారాయణరావు చెప్పారు. బ్యాంకు ఖాతా నిర్వహణకు అనుమతినిచ్చిన కింది కోర్టు.. నగదును ఫిక్స్డ్ డిపాజిట్లుగా మార్చాలని ఆదేశించిందన్నారు. తరువాత ఈడీ ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వాస్తవానికి ఆ డబ్బును వినియోగించుకునేందుకు హైకోర్టు తమకు అనుమతినిచ్చిందని ఆదినారాయణరావు తెలిపారు. సీఐడీ జప్తు చేసిన మొత్తాలను తిరిగి ఈడీ జప్తు చేయడం రెండో జప్తు కిందకు వస్తుందని, ఒకే ఆస్తికి రెండు జప్తు ఉత్తర్వులు చెల్లవన్నారు. అందువల్ల ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నవించారు. బ్యాంకులో ఉన్న నగదు ఖాతాదారులకు చెల్లించాల్సిన మొత్తమన్నారు. తాము అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందుకు వెళితే నిర్దిష్ట గడువు లోపు చేయాల్సిన చెల్లింపులు చేయలేమని, దీంతో ఖాతాదారుల నుంచి సివిల్, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టుకు నివేదించారు. సీఐడీ, ఈడీ జప్తులు వేర్వేరు డిజైన్‌టెక్ వాదనలను ఈడీ తరఫు న్యాయవాది భాస్కరరావు తోసిపుచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై అడ్జ్యుడికేటింగ్ అథారిటీ విచారణ పూర్తి కాకుండా ఈ వ్యాజ్యం దాఖలు చేశారని, అందువల్ల ఇది అపరిపక్వ వ్యాజ్యమని.. దీన్ని కొట్టేయాలని కోరారు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులపై డిజైన్ టెక్కు అభ్యంతరం ఉంటే అప్పిలేట్ అథారిటీ వద్దకు వెళ్లాలని, ఆ తరువాతే హైకోర్టుకు రావాల్సి ఉంటుందన్నారు. ఈడీ జప్తు చేసిన మొత్తాలకు, నేరానికి సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత డిజైన్ టెక్పైనే ఉందన్నారు. షోకాజ్ నోటీసుకు ఆ సంస్థ ఇచ్చిన వివరణను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాల్సింది అడ్జ్యుడికేటింగ్ అథారిటీయేనన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 102 కింద సీఐడీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులకు, మనీలాండరింగ్ కింద ఈడీ జారీ చేసిన ఉత్తర్వులకు ఏ మాత్రం సంబంధం లేదని, అవి రెండూ వేర్వేరని నివేదించారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తాల విషయంలో కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సీఐడీ జప్తునకు సంబంధించినవే తప్ప, ఈడీ జప్తుకు సంబంధించినవి కావన్నారు.అందులో ఈడీ పార్టీ కూడా కాదన్నారు. అందువల్ల తమ జప్తు ఉత్తర్వులు రెండో జప్తు కిందకు రావని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు విని గతేడాది అక్టోబర్ 10న తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్ రవి ఇటీవల తన తీర్పును వెలువరించారు. -
జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇచ్చిన కీలక తీర్పులు ఇవే..
అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు మనదేశంలో రాజ్యాంగపరంగా ఉన్నతమైన గౌరవం ఉంది. సుప్రీం కోర్టు తీర్పులు యావత్ సమాజంతో పాటు పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపెడుతుంటాయి. అటువంటి కీలకమైన తీర్పులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. ఆయన ఇచ్చిన తీర్పులను కొన్నింటిని పరిశీలిస్తే.. గోప్యత హక్కు: డీవై చంద్రచూడ్ జస్టిస్‌గా వ్యవహరించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. గోప్యత హక్కుపై కీలకమైన తీర్పును వెలువరించింది. గోప్యతను ప్రథమిక హక్కుగా గుర్తిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు రాజ్యంగం.. వ్యక్తిగత గోప్యతకు కల్పించే రక్షిణ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. స్వలింగ సంపర్కం నేరం కాదు: చారిత్రక నవ్‌తేజ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆప్ ఇండియా కేసులో భారతీయ శిక్షా స్మృతి( ఐపీసీ)లోని సెక్షన్ 377పై సుప్రీం కోర్టు వెల్లడించిన సంచలన తీర్పులో కీలక పాత్ర పోషించారు. సెక్షన్ 377ను రద్దు చేస్తూ.. సుప్రీం కోర్టు స్వలింగం సంపర్కం నేరం కాదని తీర్పనిచ్చింది. అదే విధంగా స్వలింగ సంపర్కానికి చట్టపబద్దత కల్పించింది. ఈ తీర్పు వెల్లడించిన ఐదుగురు న్యాయముర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా ఉన్నారు. ఆధార్ చట్టబద్దత: కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆధార్ పథకం రాజ్యాంగపరంగా చట్టబద్దమైనది అని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో సైతం జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలకంగా వ్యవహిరించారు. ఈ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఆధార్ పథకం చెల్లుబాటను పరిశీలించింది. సంక్షేమ పథకాలకు ఈ ఆధార్ స్కీమ్‌ను ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టు బెంచ్ సమర్ధించింది. అయితే ప్రభుత్వ పథకాల్లో, ఇతరాత్ర కార్యక్రమాల్లో ప్రజలు సమర్పించిన ఆధార్ డేటా రక్షణ, గోపత్య భద్రత అవసరాన్ని కూడా కోర్టు గుర్తు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్: ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతత్వంలోని ధర్మాసనం 2023 మే 11న ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కీలక తీర్పు ఇచ్చింది. దేశ రాజధానిలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) సేవలపై ఢిల్లీ ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుందని పేర్కొంది. రాజధాని పరిధిలోని భూములు, పోలీసు వ్యవస్థ, శాంతి భద్రత విషయంలో ప్రభుత్వ నియంత్రణ ఉండదని తెలిపింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అధికారులను పంపిణీ చేయటంలో జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించిన తీర్పు కీలకంగా మారింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం: 34 ఎమ్మెల్యేల మద్దతు ఉన్న శివసేన చీలిక వర్గం (ఏక్నాథ్ షిండే) వర్గానికి బల పరీక్షకు అనుమతించిన మాజీ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ భగత్ సింగ్ కోష్యారీ నిర్ణయం సరికాదని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఇటువంటి సందర్భాల్లో సదురు విషయం తీవ్రతను పరిగణలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించిన తీర్పుల్లో రాజ్యాంగ నియమాలు, వ్యక్తిగత హక్కులు, న్యాయం ప్రధానంగా కనిపిస్తాయి. ఆయన తీర్పులు భారత్ న్యాయవ్యవస్థలో చెరిగిపోని ముద్ర వేశాయి. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ భారత దేశ 50వ ప్రధాన న్యాయమూర్తిగా 9 నవంబర్ 2022 ప్రమాణ స్వీకారం విషయం తెలిసిందే. -
సాయిబాబా నిర్దోషి
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాతోపాటు మరో ఐదుగురు నిందితులను బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది. 2017లో సాయిబాబాతో పాటు ఇతరులను దోషులుగా నిర్ధారిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై నాగ్‌పూర్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ వినయ్ జోషీ, జస్టిస్ వాల్మికి మెనెజెస్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. నిందితులపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, అందుకే వారిపై అభియోగాలను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, దేశంపై యుద్ధంపై చేసే కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ 2017 మార్చిలో సాయిబాబా, ఇతరులను మహారాష్ట్రలోని గడ్చిరోలీ సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. దీనిపై సాయిబాబా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2022 అక్టోబరు 14న జస్టిస్ రోహిత్ నేతృత్వంలోని ధర్మాసనం సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి రోజు శనివారమైనప్పటికీ ప్రత్యేకంగా విచారించింది. హైకోర్టు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం జస్టిస్ షా, జస్టిస్ రవికుమార్ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి 2023 ఏప్రిల్ 19న బాంబే హైకోర్టు తీర్పును పక్కనపెట్టింది. ఈ తీర్పును మళ్లీ పరిశీలించాలని బాంబే హైకోర్టుకు పంపించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ జోషీ, జస్టిస్ వాల్మికిల హైకోర్టు ధర్మాసనం విచారించి, సాయిబాబా, ఇతరులను నిర్దోషులుగా ప్రకటించింది. ప్రొఫెసర్ సాయిబాబా 2014లో అరెస్టయ్యారు. ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. పదేళ్ల పోరాటం తర్వాత ఊరట దక్కింది బాంబే హైకోర్టు తీర్పు పట్ల సాయిబాబా భార్య వసంత ఆనందం వ్యక్తం చేశారు. పదేళ్ల తర్వాత ఊరట లభించిందన్నారు. సాయిబాబాకు అండగా నిలిచిన లాయర్లకు, సామాజిక కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. తన భర్త పది సంవత్సరాలు జైలులో ఉన్నారని, ఆర్థికంగా, మానసికంగా తాము ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని చెప్పారు. సాయిబాబా గురించి ప్రజలకు వాస్తవాలు తెలుసని, ఆయన పట్ల వారికి సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో మహారాష్ట్ర సర్కారు పిటిషన్ మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. సాయిబాబాతోపాటు ఇతరులను నిర్దోషులుగా నిర్ధారిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని మహారాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీరేంద్ర షరాఫ్ ఈ సందర్భంగా చెప్పారు. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును కొంతకాలం నిలిపివేయాలని కోరుతూ హైకోర్టు ధర్మాసనం ముందు అప్లికేషన్ దాఖలు చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని పునఃపరిశీలించే అధికారం ఉండదని, ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. అడ్వొకేట్ జనరల్ దాఖలు చేసిన అప్లికేషన్‌ను కొట్టివేసింది. -
ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు
హిమాచల్ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల అనంతరం నెలకొన్న రాజకీయ గందరగోళం మరో మలుపు తిరిగింది. ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యింది. కాంగ్రెస్ పిటిషన్ నేపధ్యంలో స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా ఈ నిర్ణయం తీసుకున్నారు. ధర్మశాల ఎమ్మెల్యే సుధీర్ శర్మ, సుజన్పూర్ ఎమ్మెల్యే రాజేంద్ర రాణా, కుత్లహర్ ఎమ్మెల్యే దేవేంద్ర భుట్టో, గాగ్రెట్ ఎమ్మెల్యే చైతన్య శర్మ, లాహౌల్ స్పితి ఎమ్మెల్యే రవి ఠాకూర్, బాద్సర్ ఎమ్మెల్యే ఇంద్ర దత్ లఖన్‌పాల్ తదితరులు సభ్యత్వం రద్దయిన ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ ఈ నిర్ణయం తీసుకుని వీరందరినీ అనర్హులుగా ప్రకటించారు. ఈ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు అనుకూలంగా ఓటు వేశారు. ఈ ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌ను రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో ఇతర సభ్యులు లేవనెత్తారు. బుధవారం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్‌ను ఆమోదించింది. మరోవైపు భోజన విరామానికి ముందు భారతీయ జనతా పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇది కాకుండా మిగిలిన ఎమ్మెల్యేలు తమ మాట విననందుకు నిరసనగా సభను బహిష్కరించారు. సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేకపోవడంతో అధికార పక్షానికి అనుకూలంగా మూజువాణి ఓటుతో బడ్జెట్ ఆమోదం పొందింది. అనంతరం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కార్యకలాపాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు తలెత్తకపోతే, తదుపరి సమావేశాలు జూలై, ఆగస్టులలో వర్షాకాల సమావేశాలుగా ప్రారంభమయ్యే అవకాశముంది. #WATCH | Himachal Pradesh Assembly Speaker Kuldeep Singh Pathania says, "Six MLAs, who contested on Congress symbol, attracted provisions of anti-defection law against themselves...I declare that the six people cease to be members of the Himachal Pradesh Assembly with immediate… pic.twitter.com/QQt92aM10v — ANI (@ANI) February 29, 2024 -
సీఐడీకి స్వేచ్ఛ !..చంద్రబాబు గుండెల్లో రైళ్లు
-
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు షాక్.. కేసును కొట్టివేసేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరణ..ఇంకా ఇతర అప్డేట్స్
-
‘సాక్షి’ పెట్టుబడులు సక్రమమే..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులన్నీ సక్రమమేనని, చట్టబద్ధమేనని 2022 డిసెంబర్లో ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది. జగతి పబ్లికేషన్‌లో ఇన్వెస్టర్లంతా చట్టానికి లోబడే పెట్టుబడులు పెట్టారని, ఇన్వెస్ట్మెంట్లు స్వీకరించడంలో కంపెనీలు చట్టప్రకారం పాటించాల్సిన నిబంధనలన్నిటినీ జగతి పబ్లికేషన్స్ పాటించిందని ఐటీ శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ కంపెనీలోకి పెట్టుబడులన్నీ క్విడ్–ప్రో–కో రూపంలో వచ్చాయి కనుక వాటిని ఆదాయంగా పరిగణించి, ఆ మొత్తం పై పన్ను చెల్లించాలంటూ 2011లో నాటి ఐటీ అధికారి ఇచ్చిన నోటీసులను ట్రిబ్యునల్ కొట్టివేసింది. ఐటీ విభాగం తమ వాదనకు మద్దతుగా సమర్పించిన సీబీఐ ఛార్జిషీట్లను... అసలు సాక్ష్యంగానే పరిగణించలేమని తెగేసి చెప్పింది. సాక్ష్యానికి ఉండాల్సిన కనీస లక్షణాలేవీ ఆ ఛార్జిïÙట్లకు లేవని కూడా బెంచ్ వ్యాఖ్యానించింది. ‘ఆ ఛార్జిషిట్లలో ఉన్నవన్నీ సీబీఐ చేసిన ఆరోపణలే తప్ప నిరూపితమైనవేమీ కావు. అయినా మీరు నోటీసులిచ్చిన అసెస్మెంట్ ఇయర్ దాటి ఇప్పటికి పదేళ్లు గడిచింది. మీరేమైనా దర్యాప్తు చేశారా? క్విడ్ ప్రోకో ఆరోపణలు నిరూపించే ఆధారాలేమైనా సంపాదించారా? సీబీఐ ఆరోపణలనే సాక్ష్యంగా సమర్పిస్తే ఎలా? సీబీఐ ఛార్జిషీట్లకు ఎలాంటి హేతుబద్దతా లేదు. ఈ కేసులో అవి అనవసరం, అప్రస్తుతం కూడా‘ అని జ్యుడిషియల్, అకౌంటింగ్ సభ్యులతో కూడిన ట్రిబ్యునల్ బెంచ్ తేల్చిచెప్పింది. తద్వారా... సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులపై రామోజీరావు, టీడీపీ అధిపతి చంద్రబాబునాయుడు, మిగిలిన ఎల్లో గ్యాంగ్ పనిగట్టుకుని చేస్తున్న దు్రష్పచారానికి విలువ లేదని, అదంతా బూటకమని స్పష్టమయింది. సుదీర్ఘకాలం విచారించి, ఇరుపక్షాల వాదనలూ సమగ్రంగా విన్న అనంతరం 2022 డిసెంబరు 23న బెంచ్ 153 పేజీల ఉత్తర్వులను వెలువరించింది. ఒక్కొక్కరికీ ఒక్కో’లా’ ఎలా? ‘‘కొందరు ఇన్వెస్టర్ల విషయంలో ఇదే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. వారి విషయంలో ఎలాంటి క్విడ్ ప్రో కో లావాదేవీలూ జరగలేదని స్పష్టంగా చెప్పింది. పోనీ... మిగతా ఇన్వెస్టర్ల విషయంలో క్విడ్ ప్రోకో జరిగిందని కూడా ఆ మెమోలో చెప్పలేదు. మరి క్విడ్ ప్రో కో అని మీరెలా అంటారు?‘ అని బెంచ్ తన ఉత్తర్వుల్లో ఐటీ విభాగాన్ని ప్రశ్నించింది. ప్రయివేటు లిమిటెడ్‌లో షేరు ప్రీమియం అనేది ఇన్వెస్టర్లతో జరిగే చర్చలు, వారి అంచనాల వల్లే నిర్ణయమవుతుందని పేర్కొంది. ఇన్వెస్టర్ల వాదనను గమనించారా? సాక్ష్యాలుగా సమరి్పంచిన పలు వాదనల్లో నిమ్మగడ్డ గ్రూపు సంస్థల డైరెక్టరు నిమ్మగడ్డ ప్రకాశ్ చేసిన వాదనను బెంచ్ ప్రస్తావించింది. ‘‘ఈనాడులో పెట్టుబడులకోసం బ్లాక్‌స్టోన్ అనుకున్న విలువలో 20 శాతం డిస్కౌంట్‌కే సాక్షిలో వాటా దొరికింది. ఐదు ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు పెడదామని అనుకున్నాం. అందులో మీడియా ఒకటి. అందుకే సాక్షిలో పెట్టాం’’ అనే ప్రకాశ్ వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకోవాలని బెంచ్ వ్యాఖ్యానించింది. వచి్చన పెట్టుబడులను ఆదాయంగా పరిగణించలేమని విస్పష్టంగా తేల్చిచెప్పింది. తెలియని మార్గాలంటే ఎలా? కోల్‌కతాలోని కొన్ని కంపెనీల నుంచి వచ్చిన రూ.15 కోట్లను తెలియని మార్గాల నుంచి వచ్చిన మొత్తంగా ఐటీ విభాగం పేర్కొంది. దాన్ని బెంచ్ తప్పుబడుతూ... కోల్‌కతా కంపెనీలతో సహా పెట్టుబడి ప్రతి కంపెనీ పాన్, రిజిస్ట్రేషన్ నెంబరు, అడ్రసు వంటి వివరాలన్నీ జగతి సంస్థ సమర్పించిందని, అన్నీ చట్టబద్ధంగానే ఉన్నప్పుడు ’గుర్తు తెలియని ఆదాయం’ ఎలా అవుతుందని ప్రశ్నించింది. వాల్యుయేషన్ నివేదిక నిజమేగా? ‘‘వాల్యుయేషన్ రిపోర్టును అస్సలు తప్పు బట్టడానికి లేదు. అందులో పేర్కొన్న అంశాలన్నీ సాక్షి పత్రిక విషయంలో నిజమయ్యాయి. అనుకున్నట్లుగానే సర్క్యులేషన్ పెరిగింది. పోటీపత్రిక ఈనాడు గుత్తాధిపత్యం తగ్గింది. పోటీపత్రిక 30 ఏళ్లలో సాధించిన సర్క్యులేషన్‌ను సాక్షి ఏడాదిన్నరలోనే సాధించింది. కనుక వాల్యుయేషన్ నివేదికను తప్పుబట్టలేం. సాక్షి యాజమాన్యానికి అనుభవం లేకున్నా అంత ప్రీమియం తీసుకున్నారనే వాదన అర్థరహితం. వారి లీడర్‌షిప్‌లో ఆ పత్రిక అంచనాలన్నిటినీ అందుకుంది. కాబట్టి క్విడ్ ప్రో కో వాదనకు అర్థమే లేదు’’ అని బెంచ్ పేర్కొంది. ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇంత విస్పష్టంగా తీర్పునిచ్చినా... రామోజీ, చంద్రబాబు గ్యాంగ్ మాత్రం ఇప్పటికీ పాత పాటే పాడుతూ... పాచి కథనాలనే మళ్లీ మళ్లీ ప్రచురిస్తూ ఏదో చేసేయాలని ఆరాటపడుతుండటమే విచిత్రం. -
క్షమాభిక్ష రద్దు..సుప్రీం కోర్టు సంచలన తీర్పు
-
ఊపిరి ఉన్నంత వరకు జైల్లోనే
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని బొటానికల్‌గార్డెన్ వద్ద రెండు గోనె సంచుల్లో ఏడు ముక్కలుగా దొరికిన బింగి దారుణహత్య కేసులో కూకట్పల్లి సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. నలుగురిని దోషులుగా తేలుస్తూ వారు బతికి ఉన్నతంకాలం జైల్లోనే ఉండేలా జీవితఖైదు విధించింది. బిహార్‌లోని బాంకా జిల్లా మోహన్‌మల్టీ గ్రామానికి చెందిన బింగి అలియాస్ పింకి అలియాస్ శాలినిది నిరుపేద కుటుంబం. రాజస్తాన్‌లో ఓ ఇటుకల పరిశ్రమలో పనిచేసే ఈమె తండ్రి దబ్బోలెయ్యా ఏడాదికి ఓసారి మాత్రమే సొంతూరుకు వచ్చి వెళ్లేవాడు. 2005లో ఉత్తరప్రదేశ్‌లోని సన్బల్ జిల్లా చాందూసిటౌన్కు చెందిన దినేష్ తో బింగి వివాహం జరగ్గా, వీరికి ముగ్గురు సంతానం. భర్తతో విభేదాలు ఏర్పడిన తర్వాత బింగికి చాందూసి ప్రాంతానికే చెందిన వికాస్ కశ్యప్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వికాస్‌తోపాటు ఒక కుమారుడిని తీసుకొని బింగి 2017లో సొంతూరుకు వెళ్లింది. ఈ క్రమంలోనే అక్కడ వికాస్‌కు మరో మహిళ మమత ఝాతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. దీంతో బింగిని వికాస్‌ను వదిలిపెట్టాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వికాస్, భర్త అనిల్ ఝాలతో కలిసి మమత హైదరాబాద్‌కు వచ్చింది. అప్పటికే మమత ఝా కుమారుడు అమర్‌కాంత్ ఝా నగరంలోని దలాల్ స్ట్రీట్ బార్లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. వీరంతా కలిసి సిద్ధిఖీనగర్‌లోని ఓ ఇంట్లో దిగారు. వికాస్, మమత సిద్ధిఖీనగర్‌లోనే చాట్‌బండార్ నిర్వహించేవారు. హైదరాబాద్‌కు వచ్చి హతం: అతికష్టం మీద వికాస్ చిరు నామా తెలుసుకొని బింగి వీరి వద్దకు చేరుకుంది. అప్పటి నుంచి వికాస్, మమత మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పటికే బింగి 8 నెలల గర్భిణి. ఆమెను ఆస్పత్రికి తీసు కెళితే ఖర్చు అవుతుందని, బిడ్డ పుడితే వికాస్ డబ్బులన్నీ వారికే ఖర్చుపెట్టాల్సి వస్తుందని భావించిన మమత ఆమె హత్యకు పథకం వేసింది. దీనికి వికాస్ సహా మిగిలిన వారూ సహకరించడానికి అంగీకరించారు. 2018 జనవరి 27 రాత్రి 12 గంటల ప్రాంతంలో మమత, వికాస్‌లు బింగితో గొడవపడ్డారు. ఈ క్రమంలో మమత బింగి మెడ పట్టుకుని బలంగా గోడవైపు తోసింది. దీంతో బింగి కుప్పకూలిపోగా మమత, వికాస్ ఆమె నోరు, కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకున్నారు. మమతతోపాటు ఆమె భర్త అనిల్ ఝా, కుమారుడు అమర్‌కాంత్ ఝా బింగి శరీరంపై ఇష్టమొచి్చనట్టు పిడిగుద్దులు కురిపించారు. దీంతో బింగి చనిపోయింది. మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి.... బింగి మృతదేహాన్ని ఒకరోజంతా బాత్రూమ్లోనే ఉంచారు. మర్నాడు అమర్‌కాంత్ ఎలక్ట్రికల్ కటింగ్ మెషీన్, రెండు గోనె సంచులు తీసుకొచ్చాడు. మెషీన్‌తో బింగి తల, మొండెం, కాళ్లు, చేతులు ముక్కలుగా చేసి రెండు గోనె సంచుల్లో ప్యాక్ చేశారు. అమర్‌కాంత్ తాను పనిచేస్తున్న బార్లో ఫ్లోర్ మేనేజర్, ఒడిశావాసి అయిన సిద్ధార్థ బర్దన్‌కు చెందిన బైక్ తీసుకొచ్చాడు. మమత సాయంతో గోనె సంచుల్నీ తీసుకువెళ్లి బొటానికల్ గార్డెన్ వద్ద పడే శారు. దీనిపై జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల ద్వారా సమాచారం అందుకున్న గచ్చి»ౌలి పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ లో నీలిరంగు చొక్కా ధరించి.. ముఖానికి కళ్లద్దాలు పెట్టుకున్న వ్యక్తి, గోనెసంచులతో మహిళ వెనుక కూర్చు న్న దృశ్యాలు కనబడ్డాయి. నిందితులు వినియోగించిన ఆ బైక్ బౌద్దనగర్‌కు చెందిన విజయ్‌కుమార్ బాద్రే పేరు మీద ఉంది. అతడి నుంచి 2009లో శశికుమార్‌గౌడ్ వద్దకు చివరకు సిద్ధార్థ బర్దన్ చేతికి వచ్చింది. ఇతడు హఫీజ్‌నగర్‌లో రాంగ్రూట్లో వెళుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో విధించిన ‘స్పాట్ పేమెంట్ చలాన్’ద్వారా అతడి ఫోన్ నంబరు తెలిసింది. అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, అమర్‌కాంత్, మమత, వికాస్, అనిల్ పేర్లు వెలుగులోకి వచ్చి కేసు ఓ కొలిక్కి వచ్చింది. 13 రోజుల్లోనే పోలీసులు ఈ కేసులో నిందితులను అరెస్టు చేశారు. ఆ తర్వాతే హతురాలు బింగి అని తేలింది. కేసు దర్యాప్తు చేసిన గచ్చిబౌలి పోలీసులు నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేశారు. కేసు విచారించిన కూకట్‌పల్లిలోని ఆరో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ కోర్టు దోషులుగా తేలిన నలుగురూ బతికి ఉన్నంత కాలం జైల్లోనే ఉండేలా శిక్ష విధించింది. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఇన్స్పెక్టర్ ఎం.గంగాధర్ (ప్రస్తుతం ఏసీపీ) దాఖలు చేసిన చార్జ్‌షీట్ పోలీసు అకాడమీలో ఓ సబ్జెక్ట్‌గా మారింది. -
హిండెన్‌బర్గ్ నివేదిక.. సుప్రీంకోర్టు తీర్పు.. అదానీ ఏమన్నారంటే..
అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంలో అదానీ గ్రూపునకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అదానీ గ్రూప్ కంపెనీలపై సెబీ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను అనుమానించలేమని అత్యన్నత న్యాయ స్థానం తేల్చి చెప్పింది. ప్రముఖ బిలియనీర్ జార్జ్ సోరోస్ ఆధ్వర్యంలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ) నివేదిక ఆధారంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు జరిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు సెబీ చేస్తోన్న దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ కేసు విచారణను సెబీ నుంచి సిట్‌కు బదిలీ చేయడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంది. మిగిలిన దర్యాప్తును మూడు నెలల్లోగా పూర్తి చేయాలని నియంత్రణ సంస్థను ఆదేశించింది. అదానీ గ్రూప్.. షేర్ల అవకతవకలకు పాల్పడిందంటూ వచ్చిన ఆరోపణలపై నియంత్రణ సంస్థల వైఫల్యం లేదంటూ నిపుణుల కమిటీ గతంలో నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నారంటూ పిటిషనర్ పేర్కొనడం గమనార్హం. హిండెన్‌బర్గ్ వివాదానికి సంబంధించి 24 కేసుల్లో 22 కేసుల విచారణను సెబీ పూర్తి చేసింది. మిగతా కేసుల్లో మూడు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించింది. ‘షార్ట్ సెల్లింగ్’ విషయంలో హిండెన్‌బర్గ్ మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా..? లేదా..? అని తనిఖీ చేయాలని ప్రభుత్వాన్ని, సెబీని కోరింది. వార్తా పత్రికలు, థర్డ్ పార్టీ నివేదిక ఆధారంగా సెబీని ప్రశ్నించలేమని కోర్టు తెలిపింది. సెబీ దర్యాప్తును అనుమానించడానికి వాటిని ఆధారాలుగా చేసుకోబోమని కోర్టు చెప్పింది. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన సుప్రీంకోర్టు కొన్ని పిటిషన్లపై తీర్పును వెలువరించింది. తాజాగా విడుదలైన తీర్పును ఉద్దేశించి ఛైర్మన్ గౌతమ్ అదానీ స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తానని ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. ఎప్పటికైనా నిజం బయటకొస్తుందన్నారు. ‘సత్యమేవ జయతే, మాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు. భారతదేశవృద్ధికి అదానీ గ్రూప్ సహకారం కొనసాగుతుంది’ అని అన్నారు. The Hon'ble Supreme Court's judgement shows that: Truth has prevailed. Satyameva Jayate. I am grateful to those who stood by us. Our humble contribution to India's growth story will continue. Jai Hind. — Gautam Adani (@gautam_adani) January 3, 2024 ఇదీ చదవండి: కొత్త ఏడాది మొదలవనున్న పబ్లిక్ ఇష్యూలు.. అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు.. అదానీ ఎంటర్ప్రైజెస్ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ అదానీ పవర్ లిమిటెడ్ అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ అదానీ విల్మర్ లిమిటెడ్ ఎన్డీటీవీ అంబుజా సిమెంట్స్ ఏసీసీ లిమిటెడ్ -
కీచక టీచర్.. విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పవిత్రమైన ఉపాధ్యాయుడి స్థానంలో ఉండి.. పదో తరగతి చదువుతున్న బాలికపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడిన జనకేశ్వరరావుకి 25 ఏళ్లు జైలు శిక్షతో పాటు, 50 వేల రూపాయలు జరిమానాను కోర్టు విధించింది. విశాఖలోని నాలుగోవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 ఏడాదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి ఆధారాలతో కేసును పోలీసులు దర్యాప్తు చేశారు. బాధితురాలికి 4 లక్షల 50 వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు తీర్పు చెప్పింది. బాధితులకు న్యాయం జరిగేలా వాదనలు వినిపించిన స్పెషల్ పోక్సో పీపీ కరణం కృష్ణకి బాధితులు ధన్యవాదాలు తెలిపారు. ఇదీ చదవండి: సినిమా స్టోరీలా.. పరువు హత్య -
10 ‘సుప్రీం’ తీర్పులు.. 2023లో భవితకు దిశానిర్దేశం!
ఏ దేశంలోనైనా వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. భారత అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయాల ద్వారా పలు వివాదాలకు పరిష్కారం చూపింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏడాది పొడవునా సుప్రీంకోర్టు అనేక సమస్యలకు పరిష్కారం చూపింది. వాటిలో 10 తీర్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఆర్టికల్ 370 రద్దు జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీం కోర్టు ఈ ఏడాది కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం వాదనలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమేనని, శాశ్వతం కాదని స్పష్టం చేసింది. 2. విడాకుల విషయంలో.. విడాకులపై ఈ ఏడాది సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది. ఇక విడాకులు ఇచ్చేందుకు న్యాయస్థానాలు ఆరు నెలలు వేచిచూడనక్కరలేదని పేర్కొంది. విడాకులకు దంపతులు ఆసక్తి చూపిన వెంటనే జారీ చేయవచ్చని పేర్కొంది. విడాకుల మంజూరు కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3. ద్వేషపూరిత ప్రసంగాలు.. ద్వేషపూరిత ప్రసంగం అనేది దేశ సెక్యులరిజాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు తెలిపింది. ద్వేషపూరిత ప్రసంగాలపై ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ కేసులు నమోదు చేయాలని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. 2022లో కేవలం మూడు రాష్ట్రాలకు వర్తించే తీర్పు పరిధిని విస్తరించింది. 4. డీమోనిటైజేషన్ నిర్ణయంపై.. మోదీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై 2023లో తీర్పు వెలువరించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఈ అంశానికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. 5. ఎన్నికల కమిషనర్ల నియామకం ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను ప్యానెల్ ద్వారా నియమిస్తామని కోర్టు తెలిపింది. ఈ ప్యానెల్లో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఉంటారు. ఈ ముగ్గురు కలిసి తదుపరి ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని నిర్ణయిస్తారని కోర్టు పేర్కొంది. 6. స్వలింగ జంటల వివాహం 2023లో సుప్రీంకోర్టు స్వలింగ జంటల వివాహానికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. అలాంటి వివాహాలకు చట్టబద్ధత కల్పించడాన్ని కోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. స్వలింగ సంపర్కుల వివాహాలపై చట్టం చేసే హక్కు పార్లమెంటుకు మాత్రమే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 7. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 153ఏ (ఐటీ యాక్ట్ సెక్షన్ 153ఏ) కింద సోదాలు జరిపినప్పుడు నిర్దిష్టమైన ఆధారాలు లభించకపోతే పన్ను చెల్లింపుదారుల ఆదాయాన్ని ఏకపక్షంగా పెంచలేరని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశంతో ఇలాంటి సందర్భాల్లో ఆదాయ పన్ను విభాగం ఇష్టారాజ్యం ఇకపై తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. 8. జల్లికట్టుపై కీలక నిర్ణయం తమిళనాడు, మహారాష్ట్రల సంప్రదాయ క్రీడలైన జల్లికట్టు, ఎడ్ల బళ్ల పందేలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో జల్లికట్టు, మహారాష్ట్రలో ఎద్దుల బండి పందేలను అనుమతించే చట్టం చెల్లుబాటుపై కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ ఆటలు శతాబ్దాలుగా సంస్కృతిలో భాగమని, వాటికి అటంకం కలిగించలేమని కోర్టు పేర్కొంది. 9. అవినీతి అధికారులపై కఠిన చర్యలు అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపేందుకు సుప్రీంకోర్టు ఈ ఏడాది తన నిర్ణయాన్ని వెలువరించింది. అవినీతికి పాల్పడుతున్న అధికారులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2014కు ముందు నమోదైన అవినీతి కేసుల్లో ప్రమేయం ఉన్న అధికారులకు అరెస్టు నుంచి రక్షణ కల్పించబోమని కోర్టు స్పష్టం చేసింది. 10. అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో.. అదానీ-హిండెన్‌బర్గ్ కేసు ఈ ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుప్రీంకోర్టు మార్చి 2న ఈ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్‌బర్గ్ రిసోర్స్ రిపోర్ట్ లేవనెత్తిన ప్రశ్నలపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలోని ఈ కమిటీలో ఆరుగురు సభ్యులను చేర్చాలని కోరింది. ఇది కూడా చదవండి: గోవా విముక్తికి భారత్ ఏం చేసింది? -
ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు..ఇంకా ఇతర అప్డేట్స్
-
ఈ నియోజకవర్గ ఓటర్లు చరిత్ర తిరగరాస్తారా?
ఆ నియోజకవర్గ ఓటర్ల తీర్పు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయం ముఖచిత్రంలో ఆసక్తికర చర్చగా మారింది. ఎంతటి ఉద్దండులైనా సరే, ఒక్కసారికి మించి గెలిచిన చరిత్ర లేదు. ఏదో ఒక కారణంతో వారికి పదవి గండం తప్పడం లేదు. మరి ఈ సారి పోటీ చేసే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ చరిత్ర తిరగ రాస్తారా.. మళ్లీ గెలుపు యోగం ఉందా.. అక్కడి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది. రాజకీయ చైతన్యానికి, ప్రజా పోరాటాలకు కేరాఫ్ అడ్రస్ ఓరుగల్లు. ఎంతోమంది గొప్ప గొప్ప నేతలకు రాజకీయ జన్మనిచ్చిన గడ్డ ఈ అడ్డ. అలాంటి ఓరుగల్లు గడ్డపైన ఓ విచిత్ర తీర్పు ఆసక్తికరంగా మారింది. అదే వరంగల్ నియోజకవర్గం. వరంగల్ తూర్పు నియోజకవర్గంగా రూపాంతరం చెందిన తర్వాత ఎవరైనా ఒక్కసారికి మించి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టిన చరిత్ర లేదు. మంచి మంచి దిగ్గజాలకు కూడా ఇక్కడ రెండోసారి ఓటమి తప్పలేదు.వరంగల్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. 2009లో అప్పటి మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ఇక్కడి నుండి గెలుపొందారు. నియోజకవర్గం పునర్విభజనకు ముందు వరుసగా మూడు పర్యాయాలు గెలిచిన ఆయన, 2014 ఎన్నికల్లో కొండా సురేఖ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బస్వరాజు సారయ్య కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఊహించని పరిణామాలు నేపథ్యంలో 2018 ఎన్నికల్లో కొండా సురేఖకు టిక్కెట్ దక్కలేదు. దీంతో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ లో చేరారు కొండా సురేఖ దంపతలు.. ఏకంగా ఈ నియోకవర్గాన్నే వదిలి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2018 లో పరకాల నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 2009 నుంచి ఇప్పటి వరకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినవారు లేరు. ఇక, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ ఇక్కడి నుండి గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నరేందర్ తిరిగి మళ్లీ అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి టిక్కెట్ సాధించి బరిలోకి దిగారు. ఆయనపై సొంత పార్టీలోనే ఇప్పుడు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవడం ఓరుగల్లు హాట్ టాపిక్ గా మారింది. మళ్ళీ చరిత్ర రిపీట్ అవుతుందా. అనే చర్చ జరుగుతుంది. వరంగల్ తూర్పులో కొనసాగుతున్న చరిత్ర రిపీట్ అవుతుందా. సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్ ఆ చరిత్ర ను తిరగ రాస్తారా. అనే చర్చ ఇప్పుడు ఓరుగల్లు వాసుల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోండి..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న రూ.6,756.92 కోట్ల విద్యుత్ బకాయిల వివాదంలో కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. 30 రోజుల్లోగా ఏపీకి రూ.6,756.92 కోట్లు (అసలు 3,441.78 కోట్లు, వడ్డీ, సర్‌చార్జీలు కలిపి మరో రూ.3,315.14 కోట్లు) చెల్లించాలంటూ 2022, ఆగస్టు 29న కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నోటీసులను కొట్టివేసింది. ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థలు.. అలాగే ఏపీ ప్రభుత్వం, విద్యుదుత్పత్తి సంస్థలు మధ్యవర్తిత్వం ద్వారా సామరస్యపూర్వకంగా ఈ అంశాన్ని పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్లు పేర్కొంది. చట్టప్రకారం అందుబాటులో ఉన్న పరిష్కారాన్ని ఆశ్రయించే స్వే చ్ఛను ఇరు పక్షాలకు ఇస్తున్నామంది. తెలంగాణ వాదన కూడా వినకుండా కేంద్రం నోటీసులు జారీచేయడాన్ని తప్పుబట్టింది. వివాదం ఏంటంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ జెన్కో/ట్రాన్స్‌కో/డిస్కమ్‌లు 2000 నుంచి 2013 వరకు పలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకున్నాయి. ఇవి రాష్ట్ర విభజన తర్వాత 2019 వరకు కొనసాగాయి. విభజన తర్వాత కేంద్రం ఆదేశాల మేరకు 2014 నుంచి 2017 వరకు తెలంగాణకు ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ సరఫరా చేశాయి. దీనికైన మొత్తాన్ని చెల్లించాలని ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు కొన్నేళ్లుగా కోరుతున్నాయి. ఈ వివాదం కేంద్రం వద్దకు చేరడంతో రూ.6,756.92 కోట్ల బకాయిలను ఏపీకి చెల్లించాలని తెలంగాణకు విభజన చట్టం సెక్షన్ 92 కింద నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ డిస్కంలు, తెలంగాణ సర్కార్ 2022 సెప్టెంబర్‌లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అలాగే ఆర్బీఐలోనే తమ రాష్ట్ర ఖాతా నుంచి బకాయి మొత్తాన్ని మినహాయించుకొని ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించే ప్రయత్నం కేంద్రం చేస్తున్నట్లు తెలిసిందని.. దీనిపై నిర్ణయం తీసుకోకుండా ఆదేశాలివ్వాలని తెలంగాణ సర్కార్ కోరింది. దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం రెండు వారాల క్రితం తీర్పును రిజర్వు చేసి.. గురువారం తుది ఉత్తర్వులు వెలువరించింది. కేంద్రం వైఖరి సమంజసం కాదు: తెలంగాణ తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యలపై ముందుగా చర్చించాలని చెప్పారు. దీనిపై పూర్తిగా చర్చించకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు ఏపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో పునర్వ్యవస్థీకరణ చట్టం నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నప్పుడు, కేంద్రం ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని చెప్పారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 92 ప్రకారం ఈ వివాదంలో జోక్యం చేసుకునే అధికారం కేంద్రానికి లేదన్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో డిస్కంలు: ఏపీ తెలంగాణ పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బకాయిలు చెల్లించకపోవడంతో ఏపీ డిస్కంలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏపీ విద్యుదుత్పత్తి సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదించారు. మౌలిక వసతుల కల్పన కోసం ఏపీ డిస్కంలు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్నాయన్నారు. విభజన తర్వాత విద్యుదుత్పత్తి, సరఫరా చేసినందుకు ఈ బకాయిలు చెల్లించాల్సి ఉందని, దీనికీ.. పునర్వ్యవస్థీకరణ చట్టానికీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. కేంద్రం ఆదేశాల మేరకు విభజన తర్వాత 2017 వరకు ఏపీ డిస్కంలు విద్యుత్ సరఫరా చేస్తూనే ఉన్నాయన్నారు. బకాయిలు చెల్లించపోవడంతో బొగ్గు సరఫరా నిలిచిపోయిందని, దీంతో తెలంగాణకు విద్యుత్ నిలిపివేసినట్లు వెల్లడించారు. ఇరు రాష్ట్రాలు అంగీకరించిన తర్వాతే కేంద్రం నోటీసులు జారీ చేసిందన్నారు. బకాయి ఉన్న విషయాన్ని తెలంగాణ కూడా అంగీకరిస్తోందని పేర్కొన్నారు. కేంద్రానికి అధికారం ఉంది: ఏఎస్జీ కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) సుందరేశన్ వాదనలు వినిపిస్తూ.. కేంద్రం జోక్యంతోనే తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరా చేసిందని నివేదించారు. ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపుపై ఉత్తర్వులిచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని వివరించారు. ఇరు రాష్ట్రాల కార్యదర్శులు హాజరై ఒప్పుకున్న తర్వాతే బకాయిలపై కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఏపీ స్పెషల్ జీపీ గోవింద్‌రెడ్డి కూడా వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. నోటీసులు జారీచేసే అధికారం కేంద్రానికి ఉందా? లేదా? అన్నది తేల్చాల్సిన అవసరం లేదంటూ కేంద్రం ఉత్తర్వులను కొట్టివేసింది. -
డబుల్ మర్డర్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. కర్ణంగూడలోని లేక్‌విల్లా ఆర్చిడ్స్‌లో నెలకొన్న భూ వివాదాలపై శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్ రెడ్డిల హత్య కేసులో ప్రధాన నిందితుడు మేరెడ్డి మట్టారెడ్డితో పాటుగా ఖాజా మొయినోద్దీన్ , భిక్షపతిలకు రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. కర్ణంగూడ గ్రామ సమీపంలో ఇద్దరు భాగస్వాములైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి రాఘవేందర్‌రెడ్డిలు 10 ఎకరాల భూమి కొన్నారు. కానీ అప్పటికే ఆ భూమి తనదేనంటూ మట్టారెడ్డి దాన్ని కబ్జా చేశారు. ఈ విషయంలో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీనివాస్ రెడ్డి మరో వ్యక్తితో కలిసి సైట్ వద్దకు వెళ్లగా, అక్కడే ఉన్న మట్టారెడ్డితో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో 2022 మార్చి 1, మంగళవారం ఉదయం మట్టారెడ్డి ఇతరులతో కలిసి శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డిపై కాల్పులు జరిపారు. శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోగా, రాఘవేందర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్య అనంతరం మృతుల రెండు కుటుంబాల వారు కూడా మట్టారెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు విచారణ మరింత సులువు అయ్యింది. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరపగా మట్టారెడ్డే సుపారీ గ్యాంగ్‌తో ఈ హత్యలు చేయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కర్ణంగూడలోని లేక్ విల్లా ఆర్చిడ్స్ లో నెలకొన్న భూ వివాదం ఈ హత్యలకు కారణమైంది. దీంతో శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డిలను హత్య చేయాలని సుఫారీ ఇచ్చి మట్టారెడ్డి ప్లాన్ చేశారు. వివాదంలో ఉన్న భూమి వద్దకు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలపై కాల్పులకు దిగి హత్య చేశారు నిందితులు. ఈ కేసులో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పటి ఇబ్రహీం పట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డిపై పోలీస్ శాఖ విధుల నుండి తప్పించి శాఖపరమైన చర్యలు తీసుకుంది. చదవండి: ‘మణప్పురం’లో బంగారం మాయం -
స్వలింగ జంటల వివాహంపై సుప్రీంకోర్టు తీర్పు
ఢిల్లీ: కొంతకాలంగా ఉత్కంఠ రేపుతోన్న స్వలింగ వివాహాల చట్టబద్దతపై రెడ్ సిగ్నల్ ఇస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కాలపై భిన్నాభిప్రాయాలున్నాయన్న సీజేఐ చంద్రచూడ్.. స్వలింగ వివాహనికి చట్టబద్దత కల్పించలేమని తెలిపారు. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని స్పష్టం చేశారు. వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసుపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని తెలిపిన సీజేఐ.. అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ మేరకు 3:2 మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. 'స్వలింగ వివాహనికి చట్టబద్దత కల్పించలేం. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించం. వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదు. కలిసి జీవించడం గుర్తిస్తున్నాం.. కానీ దాన్ని వివాహంగా పరిగణించలేం. స్వలింగ సంపర్కులను దంపతులుగా గుర్తించలేము. స్వలింగ జంటల అభ్యర్ధనల పట్ల సానుభూతి ఉంది కాని అభ్యర్ధనలకు చట్టబద్ధత లేదు. ప్రత్యేక వివాహ చట్టం లో మార్పు చేయాలా వద్దా అనేది పార్లమెంటు నిర్ణయిస్తుంది. శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోలేం. ప్రత్యేక వివాహ చట్టాన్ని రద్దు చేయలేం. వివాహ వ్యవస్థకు సంబందించిన నిర్ణయాలు పార్లమెంట్ మాత్రమే చేయగలదు.' అని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. 'ప్రేమ అనేది మానవత్వ లక్షణం. వివాహ హక్కుల నిర్ధారణకూ ప్రభుత్వం కమిటీ వేయాలి. ప్రతి ఒక్కరికి తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు ఉంటుంది. అసహజ వ్యక్తుల హక్కులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,కేంద్రపాలిత ప్రాంతాలు వివక్ష చూపకూడదు. అసహజ వ్యక్తుల హక్కులు, అర్హతలను నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని సొలిసిటర్ జనరల్ ప్రకటనను రికార్డు చేస్తున్నాం. రేషన్ కార్డ్‌లలో అసహజ జంటలను కుటుంబంగా చేర్చడం, అసహజ జంటలు ఉమ్మడి బ్యాంకు ఖాతా కోసం నామినేట్ చేయడానికి వీలు కల్పించడం, పెన్షన్, గ్రాట్యుటీ మొదలైన వాటి నుంచి వచ్చే హక్కులను కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ పరిశీలించాలి.' అని సుప్రీంకోర్టు స్పష్టం తీర్పును వెల్లడించింది. స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్‌లోని సెక్షన్ 4 రాజ్యాంగ విరుద్ధం అనొచ్చని సీజేఐ చంద్రచుడ్ అన్నారు. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్కే కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంపై సుప్రీంకోరు తీర్పును మే 11న రిజర్వ్ చేసింది. తీర్పును రిజర్వ్ చేసిన 5 నెలల తర్వాత సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పును వెలువరించింది. స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన 20 పిటిషన్లపై విచారణ పూర్తైన అనంతరం ధర్మాసనం మేలో తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. కాగా, 2018 సెప్టెంబర్‌లోనే భారత సర్వోన్నత న్యాయస్థానం స్వలింగ సంపర్కం శిక్షార్హం కాదని తేల్చింది. పాతకాలపు చట్టాన్ని పక్కనపెట్టి ఇచ్చిన ఈ సంచలన తీర్పుపై అప్పట్లోనే గగ్గోలు పుట్టింది. సాంస్కృతిక విలువలకు తిలోదకాలిచ్చి, పాశ్చాత్య సంస్కృతిని అలవరుచుకుంటున్నామంటూ విమర్శలు రేగాయి. తీరా స్వలింగ సంపర్కం తప్పు కాదని కోర్టు చెప్పినా తమకు సామాజిక అంగీకారం లభించడం లేదనీ, తమపై దుర్విచక్షణ సాగుతూనే ఉందనీ లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ల (ఎల్జీబీటీక్యూ) వర్గం ఫిర్యాదు చేస్తోంది. స్వలింగ సంపర్కం నేరం కాదనే దశ నుంచి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కోరడం దాకా ఇప్పుడు వచ్చింది. హోమో సెక్సువల్ పెళ్ళిళ్ళను చట్టబద్ధమైనవని గుర్తించాలని కోరుతూ, 2020లోనే ఢిల్లీ, కేరళ హైకోర్టుల్లో కొన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తర్వాత సుప్రీమ్‌కు పిటిషన్లు చేరాయి. కోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. మార్చి 13న సుప్రీంకోర్టులో కేంద్రం తన అఫిడవిట్ దాఖలు చేస్తూ, స్వలింగ వివాహాల చట్టబద్ధతకు ససేమిరా అంది. సహజ ప్రకృతికి విరుద్ధంగా జరిపే లైంగిక చర్యలు శిక్షార్హమని భారత శిక్షాస్మృతిలోని 377వ సెక్షన్ మాట. ఆ సెక్షన్ కింద స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదని అయిదేళ్ళ క్రితం తీర్పునిచ్చినంత మాత్రాన ఏకంగా స్వలింగ వివాహాన్ని వివిధ చట్టాల కింద తమ ప్రాథమిక హక్కని పిటిషనర్లు అనుకోరాదని ప్రభుత్వం వెల్లడించింది. స్వలింగ వివాహాలు సమాజంలో కొత్త సమస్యను సృష్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ వివాహాలకు గుర్తింపు కల్పించకపోవడం వివక్ష కాదని ప్రభుత్వం వాదించింది. ఇదీ చదవండి: ఢిల్లీ మద్యం కేసు.. నిందితుల జాబితాలో ఆప్! స్వలింగ సంపర్కుల విషయంలో వివిధ దేశాల్లో ఉన్న శిక్షలు/హక్కులు... వాటి వివరాలు.. 1. మరణ శిక్ష 2. జీవితకాల ఖైదు 3. జైలు శిక్ష 4. హక్కులు లేవు 5. చట్టప్రకారం శిక్షలు 6. యూనియన్లకు కలిగి ఉండే హక్కు 7. చట్టప్రకారం వివాహం చేసుకోవచ్చు 8. ఉమ్మడిగా దత్తత తీసుకునే హక్కు -
చంద్రబాబు కస్టడీపై తీర్పు నేటికి వాయిదా
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున, ఆయన్ని ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తన తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. వాస్తవానికి గురువారమే తీర్పు ఇవ్వాల్సి ఉంది. అయితే, సీఐడీ నమోదు చేసిన కేసులు కొట్టేయాలని, రిమాండ్ సైతం చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. దీంతో ఏసీబీ కోర్టు తన తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరిస్తే పోలీసు కస్టడీపై తన నిర్ణయాన్ని వాయిదా వేస్తామని, ఒకవేళ హైకోర్టు తీర్పు వెలువరించకుంటే శుక్రవారం ఉదయం 10.30 గంటలకే తీర్పునిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. జ్యుడిషియల్ రిమాండ్ ముగింపు గడువు దగ్గర పడుతున్నందున, ఈరోజే కస్టడీ పిటిషన్‌పై ఉత్తర్వులు జారీ చేయాలని సీఐడీ న్యాయవాదులు పట్టుబట్టారు. చంద్రబాబును ఐదు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇవ్వాలని కోరామని చెప్పారు. న్యాయస్థానం మాత్రం చంద్రబాబు పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం తీర్పు ఇస్తుందని తాము భావించడంలేదని సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చెప్పారు. దీనిపై న్యాయస్థానం చంద్రబాబు తరఫు న్యాయవాదుల అభిప్రాయం కోరింది. తీర్పు నేడు ఇవ్వాలా లేక శుక్రవారానికి వాయిదా వేయాలా అన్నది కోర్టు ఇష్టమని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. అనంతరం న్యాయస్థానం స్పందిస్తూ.. శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరిస్తుందేమో చూద్దామని తెలిపింది.ఇదిలా ఉంటే.. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించడంలేదు. శుక్రవారం నాటి హైకోర్టు కేసుల విచారణ జాబితాలో చంద్రబాబు కేసు లిస్ట్ కాలేదు. దీంతో ఏసీబీ కోర్టు శుక్రవారం ఉదయం తన తీర్పును వెలువరించి తీరాల్సి ఉంటుంది. -
సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరికి 20 ఏళ్ల జైలు
సాక్షి, అమరావతి/ గుంటూరు లీగల్/నగరంపాలెం: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన రేపల్లె రైల్వేస్టేషన్లో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరు ముద్దాయిలకు 20 సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.2,500 జరిమానా విధిస్తూ నాలుగో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఆర్.శరత్‌బాబు బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం మండలం, వెంకటాద్రిపురానికి చెందిన కొర్రపోలు రమేష్ వ్యవసాయ, తాపీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య ఏసమ్మ, ముగ్గురు పిల్లలు సంతానం కాగా, భార్య మళ్లీ గర్భంతో ఉంది. కృష్ణాజిల్లా నాగాయలంకలో కూలి పనులు చేసుకునేందుకు రమేష్ తన భార్య, పిల్లలతో 2022 ఏప్రిల్ 30న గుంటూరులో రైలు ఎక్కి రేపల్లె వెళ్లాడు. అప్పటికి సమయం 11.45 కావడంతో రైల్వేస్టేషన్లోనే తన భార్య, పిల్లలతో రమేష్ నిద్రకు ఉపక్రమించాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పాలుబోయిన విజ యకృష్ణ, పలుచూరి నిఖిల్, మరో మైనర్ బాలు డు మద్యం మత్తులో రైల్వేస్టేషన్‌లోకి వచ్చారు. అక్కడ భార్య,పిల్లలతో నిద్రిస్తున్న రమేష్‌ను నిఖిల్ నిద్రలేపి టైం అడిగాడు. టైం చెప్పకపోవడంతో రమేష్‌ను కొట్టడం ప్రారంభించాడు. దీంతో రమేష్ స్టేషన్ బయటకు పరుగెత్తాడు. అక్కడే ఉన్న రమేష్ భార్యపై విజయకృష్ణ లైంగికదాడికి పాల్పడ్డాడు. రమేష్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి పోలీసులను తీసుకొచ్చేసరికి నిందితులు పారిపోయారు. నిందితులు తన భార్యపై సామూహిక అత్యాచారం చేసినట్లు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రేపల్లె డీఎస్పీ టి.మురళీకృష్ణ, దిశ డీఎస్పీ యు.రవిచంద్ర దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పీపీ శారదమణి వాదించారు. ఈ కేసులో మూడో ముద్దాయి మైనర్ కావడంతో తెనాలి పోక్సో కోర్టులో విచారణ జరుగుతుంది. సత్ఫలితాలనిస్తున్న కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ అత్యాచార కేసుల్లో దోషులకు సత్వరం శిక్షలు విధించేలా పోలీసు శాఖ కోర్ట్ ట్రయల్ మానిటరింగ్ విధానాన్ని సమర్థంగా అమలు చేస్తున్నదని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్లో గతేడాది ఓ మహిళపై అత్యాచారం చేసిన కేసులో పాలుబోయిన విజయకృష్ణ, పాలుచురి నిఖిల్‌ను దోషులుగా గుర్తిస్తూ న్యాయస్థానం 20 ఏళ్లు జైలు శిక్ష విధించడం కేసు దర్యాప్తులో పోలీసుల సమర్థతకు నిదర్శనమన్నారు. కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ ద్వారా గతేడాది కాలంగా గుర్తించిన 122 కేసుల్లో 102 కేసుల్లో దోషులకు శిక్షలు పడ్డాయన్నారు. ముగ్గురికి మరణశిక్ష, 37మందికి జీవిత ఖైదు, 62 కేసుల్లో 7 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడిందన్నారు. ఈ తీర్పు ఓ గుణపాఠం.. రేపల్లె రైల్వేస్టేషన్లో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఇచ్చిన తీర్పు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఓ గుణపాఠమని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్ తెలిపారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని స్పందన హాల్లో బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బాధితురాలికి తక్షణ సాయంగా రూ.10 లక్షలు, ఎస్సి, ఎస్టి కేసు కింద రూ.8.50 లక్షలు, ఎంపీ, ఎమ్మెల్యే నుంచి రూ.1.50 లక్షలు అందజేసినట్లు చెప్పారు. కాగా, ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేసి, నిందితులకు శిక్షలు పడే వరకు ప్రతిభ కనబరిచిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శారదామణి, డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ మధుసూదనరావు, తదితర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు, రివార్డులు అందజేశారు. -
సుప్రీం తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీకి లాలూ డిన్నర్ పార్టీ
న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత ఆరోగ్యం మెరుగై రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా మోదీ ఇంటి పేరు వివాదంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చి రాహుల్ గాంధీకి ఊరటనివ్వడంతో లాలూ రాహుల్ గాంధీని తాను ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు ఆహ్యానించారు. విందులో బీహార్ స్పెషల్ చంపారన్ మటన్ తెప్పించి స్వయంగా తానే వండి వడ్డించారు. రాహల్ గాంధీపై నమోదైన పరువు నష్టం కేసులో అమలు కావాల్సిన శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజరైన రాహుల్ గాంధీని లాలూ మొదట పుష్పగుచ్ఛమిచ్చి అభినందించి ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కొద్దిసేపు రాజకేయాలు మాట్లాడుకుని తర్వాత ఇద్దరూ విందులో పాల్గొన్నారు. విందులో రాహుల్ కోసం లాలూ స్వయంగా మటన్ వండటం విశేషం. లాలూ చేసిన ప్రత్యేక వంటకాన్ని రాహుల్ చాలా ఆస్వాదించారు. దీని కోసం లాలూ బీహార్ నుండి ప్రత్యేకంగా చంపారన్ దేశీయ మటన్ తెప్పించి బీహార్ స్టైల్లో దాన్ని తానే స్వయంగా వండారు. రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు భారీ ఉపశమనం ఇవ్వడంతో ఆయన పార్లమెంటులో తిరిగి అడుగు పెట్టడానికి మార్గం సుగమమైంది. అయితే దానికి ఎంత సమయం పడుతుంది, ప్రభుత్వంపై జరగనున్న అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఆయన పాల్గొంటారా లేదా అన్నదే తేలాల్సి ఉంది. మోదీ ఇంటిపేరు వివాదంలో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తూ సూరత్ ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేయగా అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పుపై స్టే విధించింది. आज @RahulGandhi जी ने RJD अध्यक्ष @laluprasadrjd जी से उनके दिल्ली स्थित निवास पर मुलाकात की। pic.twitter.com/NMXa4jP8hi — Congress (@INCIndia) August 4, 2023 ఇది కూడా చదవండి: కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. ముగ్గురు భారత సైనికులు మృతి -
రాహుల్ వ్యాఖ్యలు తప్పే కానీ.. తీర్పులో ఏముందంటే..?
ఢిల్లీ: మోదీ ఇంటిపేరు వ్యాఖ్యల పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఊరట లభించిన విషయం తెలిసిందే. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. అయితే.. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పిందంటే.. 'దొంగలందరికీ మోదీ ఇంటి పేరే ఎందుకుంటుందని' రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బహిరంగంగా మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలని హితువు పలికింది. కానీ పార్లమెంట్ పదవికి రద్దు చేయడం వంటి చర్యలు వ్యక్తి హక్కుకు భంగపరచడమే గాక.. ఎన్నికలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. అయితే పరువు నష్టం కేసులో ట్రయల్ కోర్టు రాహుల్ గాంధీకి గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీని కారణంగా రాహుల్ గాంధీ తన పార్లమెంట్ సభ్యత్వానికి దూరమయ్యారు. దీనిపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంతటి గరిష్ఠ శిక్ష విధించడానికి ట్రయల్ కోర్టు ఎలాంటి సరైన కారణం ఇవ్వలేదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కాగా.. తుది తీర్పు పెండింగ్‌లో ఉన్నందున ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. కర్ణాటకలో జరిగిన ఓ ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ..‘దొంగలందరికీ మోదీ ఇంటి పేరే ఎందుకుంటుందని వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన సూరత్ కోర్టు మార్చి 23న రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష విధించింది. ఫలితంగా ప్రాతినిధ్య చట్టం కింద మార్చి 24న లోక్‌సభలో అనర్హుడిగా ప్రకటించడంతో వయనాడ్ ఎంపీ పదవి కోల్పోయారు. సూరత్ కోర్టు విధించిన శిక్షపై రాహుల్ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఊరట దక్కపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదీ చదవండి: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. రెండేళ్ల జైలు శిక్షపై స్టే -
ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణాలపై న్యాయపోరాటమే!
సాక్షి, గుంటూరు: పేదల ఇళ్ల నిర్మాణంపై న్యాయపోరాటం చేయాలనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఇవాళ ఏపీ హైకోర్టు వెల్లడించిన తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ కుట్రలు, కోర్టు కేసుల ఆటంకాలు దాటుకుని ఇటీవలే అమరావతిలోని ఆర్-5 జోన్లో సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాలు అందజేయించి మరీ ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది ప్రభుత్వం. అయితే ఇళ్ల నిర్మాణాన్ని ఆపేలా కుట్రపూరితంగా కొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. స్టే ద్వారా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీ హైకోర్టు విధించిన స్టేను జగన్ సర్కార్ సవాల్ చేయనుంది. -
అటు వనమా.. ఇటు జలగం..
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చి న తీర్పుతో బీఆర్ఎస్లో వింత పరిస్థితి నెలకొంది. మూడు రోజుల క్రితం ఇ చ్చి న తీర్పుపై వనమా చే సుకున్న అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేయడంతో జల గం వెంకట్రావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని వనమా చెప్తుండగా, హైకో ర్టు తీర్పును అమలు చేయాలని జలగం కోరుతున్నారు. ఈ మేరకు ఆయన హైకోర్టు తీర్పు ప్రతిని బుధవారం అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కూడా అందజేసిన విషయం తెలిసిందే. జలగంకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చి న తీర్పుపై అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం, ఎన్నికల కమిషన్ ఎప్పటిలోగా, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇద్దరు నేతలూ బీఆర్ఎస్లోనే.. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018లో బీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు, కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వర్రావు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన వనమా ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వనమా, జలగం.. ఇద్దరూ ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. జలగం బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నా అధికారిక కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ నేపథ్యంలో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు గుర్తింపు పొందారు. ప్రస్తుతం కోర్టు తీర్పు మేరకు తాను ఎమ్మెల్యేగా పదవి స్వీకరించినా బీఆర్ఎస్లోనే కొనసాగుతానని జలగం ప్రకటించారు. అయితే ఈ అంశంపై బీఆర్ఎస్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు. కోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం జలగం ప్రయతి్నంచినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ పూర్తిగా తమ వెంటే ఉందని వనమా వర్గీయులు ‘సాక్షి’తో అన్నారు. జలగం ప్రమాణ స్వీకారంపై స్పష్టత వ చ్చి న తర్వాతే స్పందించాలని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్లు తెలిసింది. వనమాపై ఐదేళ్ల నిషేధం నేపథ్యంలో.. వనమా ఎన్నిక చెల్లదని తీర్పుని చ్చి న హైకోర్టు ఆయన ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ తనకు బీఆర్ఎస్ టికెట్ లభిస్తుందని జలగం భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్‌రావు కూడా కొత్తగూడెం బీఆర్ఎస్ టికెట్‌ను ఆశిస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కొత్తగూడెం రాజకీయాలతో బీఆర్ఎస్లో వింత స్థితి నెలకొందని పరిశీలకులు అంటున్నారు. -
గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు
సాక్షి, ఢిల్లీ: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురయింది. పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో స్టే ఇవ్వడానికి తగిన కారణాలు కనిపించలేదని హైకోర్టు పేర్కొంది. "దొంగలందరి ఇంటిపేరు మోదీయే" అంటూ వ్యాఖ్యానించిన కేసులో తనకు శిక్ష నిలుపుదల చేయాలని రాహుల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు.. రెండేళ్ల జైలు శిక్ష విధించగా, ఈ తీర్పును రాహుల్.. హైకోర్టులో సవాలు చేశారు. మే 2న విచారణ పూర్తి చేసిన గుజరాత్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగానే ఉందన్న జడ్జి.. రాహుల్ పిటిషన్‌ను కొట్టేశారు. సావర్కర్‌ను కించపరిచారని ఆయన మనవడు వేసిన పిటిషన్‌ను ప్రస్తావించిన న్యాయస్థానం.. రాహుల్‌పై 10 పరువు నష్టం కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ.. ‘దొంగలందరి ఇంటిపేరు మోదీయే’ ఎందుకంటూ.. ప్రశ్నించారు. చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో రెండోసారి కూడా కాంగ్రెస్సేనా?.. ఆ సర్వే రిపోర్ట్ ఏం చెబుతోంది? రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతం వ్యక్తం చేసిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువునష్టం దావావేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ తన వాదనను వినిపించారు. విచారణ అనంతరం కోర్టు.. ఈ ఏడాది మార్చి 23న ఆయనను దోషిగా తేల్చుతూ రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
సెంథిల్ బాలాజీ విడుదలపై మద్రాస్ హైకోర్టు భిన్న తీర్పులు..
సాక్షి, చెన్నై: తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ విడుదలకు సంబంధించి మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పులు ఇచ్చింది. మంత్రిని విడుదల చేయాలని జస్టిస్ నిషా భాను నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పగా.. సెంథిల్‌ను విడుదల చేయకూడదని జస్టిస్ భరత చక్రవర్తి భిన్నంగా మరో తీర్పును వెలువరించారు. దీంతో ఈ కేసును మద్రాసు కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ విచారణ జరపనుంది. 'ఈడీకి అధికారం లేదు..' మనీ లాండరింగ్ కేసులో పోలీసు కస్టడీని కోరే అధికారం ఈడీకి ఉండదని జస్టిస్ నిషా భాను ధర్మాసనం తెలిపింది. కావున సెంథిల్ బాలాజీ భార్య మేఘాలా దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ చెల్లుబాటు అవుతుందని చెప్పారు. అంతేకాకుండా సెంథిల్ ఆస్పత్రిలో ఉన్న వ్యవధిని కస్టోడియల్ గడువు నుంచి మినహాయించాలని ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. భిన్నమైన తీర్పు.. జస్టిస్ నిషా భాను ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు పూర్తి విరుద్ధంగా జస్టిస్ భరత చక్రవర్తి తీర్పును వెలువరించారు. మేఘాలా దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ చెల్లుబాటు కాదని ధర్మాసనం తెలిపింది. కేవలం అరెస్టు, నిర్బంధం చట్టవిరుద్ధమని చూపితే తప్పా హెబియస్ కార్పస్ చెల్లుబాటు కాదని వెల్లడించారు. అంతేకాకుండా కస్టోడియల్ గడువును కూడా పెంచుతున్నట్లు తీర్పును వెలువరించారు. ఆరోగ్యం బాగా లేని కారణంగా ఒక్కరోజు కూడా ఈడీ విచారణలో సెంథిల్ గడపనందున జూన్ 14 నుంచి ఇప్పటివరకు కస్టోడియల్ గడువును మినహాయింపునిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. సెంథిల్ బాలాజీ అరెస్టులో ఈడీ చట్టపరమైన విధివిధానాలు పాటించలేదని మేఘాలా కోర్టుకు విన్నవించారు. సెషన్స్ కోర్టు ఇచ్చిన కస్టడీ గడువు తాత్కాలికమైనదని ధర్మాసనానికి తెలిపారు. దీనిపై స్పందించిన ఈడీ తరుపు న్యాయవాదులు.. అరెస్టుకు సంబంధించిన పంచనామాను సెంథిల్ బాలాజీ స్వీకరించలేదని తెలిపారు. సెషన్ కోర్టు రిమాండ్ ఇచ్చే క్రమంలోనే అరెస్టుకు సంబంధించిన కారణాలను సెంథిల్ బాలాజీకి వివరంగా తెలిపారని వెల్లడించారు. మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టు అక్రమమంటూ ఆయన భార్య మేఘలా జూన్ 14న హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తూ కోర్టు మెట్లెక్కారు. అనారోగ్యం కారణంగా సెంథిల్ బాలాజీని కావేరీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే.. ఈడీ దర్యాప్తు నిమిత్తం సెంథిల్ బాలాజీకి సెషన్స్ కోర్టు 8 రోజుల కస్టడీని విధించింది. ఇదీ చదవండి: పురుషులకు జాతీయ కమిషన్.. పిల్ కొట్టేసిన సుప్రీంకోర్టు -
ఎల్లో మీడియాకు హైకోర్టు దిమ్మదిరిగే గుణపాఠం.. ఆ కుట్రకు గండి పడిందా?
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్ లక్ష్మీణ్ ఇచ్చిన తీర్పు మీడియాకు ఒక గుణపాఠం అని చెప్పాలి. జస్టిస్‌ను ఈ సందర్భంగా అభినందించాలి. అవినాష్‌కు బెయిల్ ఇవ్వడం, ఇవ్వకపోవడం కాదు ఇక్కడ ఇష్యూ. తనను ప్రభావితం చేయాలని ప్రయత్నించిన మీడియాకు ఆయన దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు. తనను భయపెట్టాలని అనుకున్న మీడియాకు ఆయన తనేమిటో తెలియచెప్పారని అనుకోవచ్చు. న్యాయ వ్యవస్థకు సంబంధించి కొంత సంయమనం అవసరం. అలాగనీ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులపై విశ్లేషణ చేయరాదని కాదు. జనాన్ని నమ్మించాలని చూశారు.. కానీ.. అందులో తప్పుఒప్పుల గురించి మాట్లాడుకోరాదని కాదు. కాని గౌరవ న్యాయమూర్తిపై దురుద్దేశాలు ఆపాదించకూడదు. అభియోగాలు చేయరాదు. అవినాష్ రెడ్డిని సీబిఐ అరెస్టు చేయడానికి యత్నించిందన్న సన్నివేశం సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. ఏకంగా అవినాశ్ ను హెలికాప్టర్లో ఈ మీడియా తరలించేసింది. ఈ మీడియా సీఆర్ పిఎఫ్ దళాలను కూడా తెచ్చేసింది. అవినాష్ తల్లి చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో ఏమి జరుగుతుందో శోధించడానికి వీరు చేయని అకృత్యాలు లేవు. ఇంకేముంది అవినాశ్ అరెస్టు ఖాయం అని వారు నమ్మారో లేదో కాని, జనాన్ని నమ్మించాలని చూశారు. కాని వారు అనుకున్నదానికి రివర్స్‌లో కేసు సాగడంతో ఏకంగా న్యాయమూర్తిపై దాడికి దిగారు. అలా చేయకుండా.. అదేదో.. ఒక సస్పెండెడ్ మెజిస్ట్రేట్‌ను కూర్చోబెట్టి చండాలపు ఆరోపణలు చేయించారు. ఆ టివీలో చర్చ చూస్తే అదంతా మాచ్ ఫిక్సింగ్ ప్రకారమే హైకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలు చేయించినట్లు కనిపిస్తుంది. నిజానికి అలాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేస్తే వెంటనే సంబంధిత చానల్ వారు వెంటనే నిలుపుదల చేయడం, క్షమాపణ చెప్పించడం, తాము కూడా క్షమాపణ చెప్పడం చేయాలి. అలా చేయకుండా, అదేదో తమ చానల్‌కు సంబంధం లేని వ్యవహారంగా వదలివేశారు. చట్టం ప్రకారం న్యాయమూర్తులపై సంచులు వెళ్లాయి అంటూ ఆరోపణలు చేయడం ఎంత తప్పో, వాటిని ప్రచారం చేయడం కూడా అంతే తప్పు అవుతుంది. ఎవరూ చట్టానికి అతీతులు కారు.. కాని గత నాలుగేళ్లుగా న్యాయ వ్యవస్థతో తమ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్న ఈ మీడియా సంస్థలు అహంకారానికి ప్రతిరూపంగా మారిపోయాయి. తాము ఏమి చేసినా ఎదురులేదన్న చందంగా మారాయి. తమకు న్యాయ వ్యవస్థలో ఎవరో పెద్ద స్థాయిలో ఉన్నవారితో పరిచయం ఉందన్న అతిశయంతో వారు చెలరేగిపోయారు. నిజానికి ఈ మీడియావారికి పరిచయం ఉన్నంతమాత్రాన గౌరవ జడ్జిలు వారికి అనుకూలంగా ఉంటారని అనుకోజాలం. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండకుండా ఎందుకు ఉంటారు?. మార్గదర్శి కేసు కూడా ఇందుకు ఒక ఉదాహరణే అవుతుంది. ఆ కంపెనీ డిపాజిట్ల వివరాలన్నిటిని సమర్పించాలని గౌరవ న్యాయస్థానం స్పష్టం చేయడం ద్వారా ఎవరూ చట్టానికి అతీతులు కారని తేల్చింది. ఆ టీవీ సైలెంట్ అయిపోయింది.. గతంలో ఒక కేసులో కొందరికి జైలు శిక్ష పడింది. అలా శిక్ష పడినవారి మహిళా బంధువు ఒకరు సంబంధిత న్యాయాధికారిపై ఆరోపణలు చేస్తూ ఒక టీవీ ముందు మాట్లాడారు. ఆ టీవీవారు తెలిసో, తెలియకో ఒకటికి రెండుసార్లు ప్రసారం చేశారు. దాంతో ఆ న్యాయాధికారి ఆ టీవీవారికి, ఆరోపణ చేసిన మహిళకు నోటీసు జారీ చేసి కేసు చేపట్టారు. ఆ తర్వాత ఆ టీవీ సైలెంట్ అయిపోయింది. ఈ నాలుగేళ్లలో ఏపీలో న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రెచ్చిపోయిన మాట నిజమే కావచ్చు. ప్రతిదానికి పిల్ రూపంలో కేసులు వేయించడం, వాటిని తమ మీడియాలో ప్రచారం చేయడం, ఎవరైనా గౌరవ న్యాయమూర్తి ప్రభుత్వంపై ఏదైనా కామెంట్ చేస్తే దానిని బ్యానర్ కథనాలుగా చేసి జనంలో పలచన చేయాలని యత్నించారు. ఇటీవల ఏపీ నుంచి సుప్రీంకోర్టు జ్జడి అయిన ఛీప్ జస్టిస్ పి.కె.మిశ్ర ఈ పరిణామాలపై విసుగు చెందారు. సీబీఐ డొల్లతనం.. ప్రశ్నల రూపంలో అసలు ప్రభుత్వం పనిచేసుకోవాలా? వద్దా? ప్రతిదానికి పిల్ వేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే మీడియా సీబిఐలో ఎవరితోనో రహస్య సంబంధాలు పెట్టుకుని ఉన్నవి, లేనివి రాయడం అలవాటు చేసుకున్నారు. ఆ దర్యాప్తు సంస్థకు చెందిన కొందరు అధికారులు తమ చెప్పుచేతలలో ఉన్నట్లుగా ప్రవర్తించిన ఈ మీడియా న్యాయ వ్యవస్థను కూడా అలాగే లొంగదీసుకోవాలని యత్నించి విఫలం అయింది. గౌరవ న్యాయమూర్తి లక్ష్మణ్ మొత్తం కేసును క్షుణ్ణంగా పరిశీలించి అనేక అబ్జర్వేషన్లు చేశారు. కేసు దర్యాప్తు తీరులో సిబిఐ డొల్లతనాన్ని ఆయన ప్రశ్నల రూపంలో బహిర్గతం చేశారు. అలాగని అవినాశ్‌కు ఏమీ పూర్తి స్థాయి రిలీఫ్ ఇవ్వలేదు. ముందస్తు బెయిల్ ఇచ్చారు తప్ప, ఒకవేళ అవినాశ్‌ను అరెస్టు చేయదలిస్తే ఐదు లక్షల పూచీకత్తు తీసుకుని బెయిల్ ఇవ్వాలని ఆదేశించారు. మరికొన్ని కండిషన్లు పెట్టారు. అదే టైమ్‌లో తనపై ముడుపుల ఆరోపణ చేసిన ఏబిఎన్, మహా టీవీలపై చర్య తీసుకునే విషయాన్ని ఛీఫ్ జస్టిస్‌కు నివేదించారు. ఇంత బేలెన్స్‌డ్‌గా వ్యవహరించడం ఆ న్యాయమూర్తి విశిష్టత అని చెప్పాలి. ఆయన కావాలనుకుంటే ఏబిఎన్, మహా టీవీల వారికి వెంటనే నోటీసు ఇచ్చి చర్య తీసుకోవచ్చు. అయినా ఆ పని చేయలేదు. కాని ఈ సందర్భంగా ఆయన కలత పడిన తీరును వివరించారు. ఒక దశలో కేసు నుంచి తప్పుకుందామని అనుకున్న విషయాన్ని కూడా చెప్పారు. ఒకవేళ అలా చేసి ఉంటే ఈ ఎల్లో మీడియా లక్ష్యం నెరవేరినట్లయ్యేది. ఒక చిన్న లాజిక్.. చాలా పెద్ద విషయం.. అందుకే ఆయన పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ముందస్తు బెయిల్ కేసులలో ఇంతగా పరిశీలించరట. కాని తనపై టీవీలలో చర్చలు ఇష్టారీతిగా జరిపిన కారణంగా ఆయనకు బాధ్యత ఏర్పడింది. కేసుకు సంబంధించి ఆయన లేవనెత్తిన ఒక చిన్న లాజిక్ చాలా పెద్ద విషయాన్నే తెలియచెప్పింది. సీబిఐ దర్యాప్తులో సహేతుకత కొరవడిన విషయం తేటతెల్లమైంది. వైఎస్ వివేకా హత్య జరిగినట్లు నిందితుడు ఒప్పుకున్నాక, ఆయన శరీరంపై గాయాలు స్పష్టంగా కనబడుతున్న తరుణంలో రక్తం తుడిస్తే ఆధారాలు ఏలా మాయమవుతాయని ఆయన ప్రశ్నించారు. అలాగే వైఎస్ వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కొన్ని ఆధారాలను దాచిన వైనం గురించి ప్రశ్నించారు. ఒక జర్నలిస్టు ఆసక్తికర విశ్లేషణ.. వివేకాకు ఇంతర మహిళలతో ఉన్న సంబంధాలపై కూడా అడిగారు. వీటిలో అనేకం అవినాశ్ కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినా సిబిఐ వాటిని పట్టించుకోకుండా దూకుడుగా ఎవరో ఎజెండా ప్రకారం అవినాశ్ ను ఇబ్బంది పెట్టడానికే అన్నట్లు విచారణ సాగించిందన్న విమర్శలు వచ్చాయి. ఎల్లో మీడియాకు ఈ విషయంలో చాలా పవర్ ఉందన్నది వాస్తవమే. ఎందుకంటే సిబిఐలో చీమ చిటుక్కుమన్నా ఈ మీడియాకు ముందుగానే తెలిసిపోతుండడమే ఇందుకు ఉదాహరణ అవుతుంది. గతంలో సీబిఐ నుంచి సమాచారం రాబట్టాలంటే చాలా కష్టంగా ఉండేది. అలాంటిది వీరికి అంత తేలికగా సమాచారం ఎలా వస్తుందా అన్న సంశయం వస్తుంది. ఇంకో విశేషం ఉంది. సోషల్ మీడియాలో ఒక జర్నలిస్టు ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. టీడీపీ తన పుస్తకంలో ఏమి చెప్పిందో.. సీబీఐ కూడా.. టీడీపీ వివేకా హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్‌ను లాగాలన్న దురుద్దేశంతో వేసిన ఒక పుస్తకంలో ఉన్న అంశాలనే సీబిఐ తన దర్యాప్తులో కొన్ని భాగాలుగా చేసిందని ఆయన చెబుతున్నారు. ప్రత్యేకించి గుండెపోటు, రక్తం తుడువడం మొదలైన విషయాలలో టీడీపీ తన పుస్తకంలో ఏమి చెప్పిందో సిబిఐ తన అభియోగాలలో అదే చెప్పిందట. అందులో నిజం ఉండవచ్చు. లేకపోవచ్చు. కాని అలాంటి అనుమానాలకు ఆస్కారం ఇచ్చి ఉండాల్సిందికాదు. వివేకా కుమార్తె చేస్తున్న ఆరోపణలను విచారించడంతో పాటు అవినాశ్ తదితర వ్యక్తులు చెబుతున్న కోణాలపై కూడా దర్యాప్తు చేసి ఉంటే సీబిఐపై ఇంతగా విమర్శలు వచ్చేవి కావు. చదవండి: Fact Check: పోలవరం పూర్తవుతున్నందుకా.. ఈనాడు ‘రంకెలు’ ఇప్పుడు బ్రేక్ పడిందా? ఈ కేసులో తానే వివేకాను చంపానని చెప్పిన వ్యక్తి అప్రూవర్ అవడం, అతనికి బెయిల్ ఇవ్వడానికి సీబీఐతో పాటు వివేకా కుమార్తె సహకరించడం వంటివి చూస్తే ఇందులో ఏదో మతలబు ఉందన్న అభిప్రాయం కలుగుతుంది. అలాగే హత్య జరిగిన తొలి రోజులలో సునీత మాట్లాడిన తీరుకు, ఇప్పుడు చేస్తున్న ఆరోపణలకు సంబంధం లేకపోవడం కూడా గమనించదగ్గ సంగతే. ఈ కేసును రాజకీయ కుట్రగా చేసేసి చేతులు దులుపుకోవాలని సీబిఐ చేసిన యత్నానికి ఇప్పుడు బ్రేక్ పడిందని అనుకోవచ్చు. నేర్చుకోవలసిన పాఠం ఇదే.. ఈ కేసు ద్వారా నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే సీబిఐ తన ఇష్టం వచ్చినట్లు విచారణ చేస్తే అన్నిసార్లు కుదరదన్నది ఒకటైతే, మీడియా తనతోచిన విధంగా, తాము కోరిన విధంగా ట్రయల్ చేసే తీర్పులు ఇచ్చేస్తే ప్రభావం అవడానికి న్యాయ వ్యవస్థ సిద్దంగా ఉండదని తెలుసుకోవాలి. జస్టిస్ లక్ష్మణ్ న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టారని చెప్పవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
36 వేల టీచర్ల నియామకం రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు..
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఏడేళ్ల క్రితం ఉపాధ్యాయ నియా మక ప్రక్రియలో నిబంధనావళి ఉల్లంఘన ద్వారా ఉద్యోగాలు పొందిన 36వేల మంది ఉపాధ్యాయుల నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. 3 నెలల్లోపు ఆ పోస్టులను భర్తీచేయాలని తృణమూల్ కాంగ్రెస్ సర్కార్‌ను జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ‘ఇంతటి అవినీతిని పశ్చిమబెంగాల్ లో ఏనాడూ చూడలేదు. ఉద్యోగాలు కోల్పోయిన ప్రైమరీ టీచర్లు 4 నెలలపాటు విధుల్లో కొనసాగవచ్చు. అప్పటిదాకా పారా టీచర్ల స్థాయిలో తక్కువ జీతమే తీసుకోవాలి’ అని జడ్జి జస్టిస్ అభిజిత్ సూచించారు. ‘నాటి రాష్ట్ర ప్రాథమిక విద్యా బోర్డు అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్య, బోర్డ్ సభ్యులు ఈ నియామకాల ప్రక్రియను ఒక లోకల్ క్లబ్ మాదిరిగా మార్చే శారు’ అని జడ్జి ఆగ్రహం వ్యక్తంచేశారు. 2016 నాటి బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల కుంభకోణాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లు విచారణచేపట్టిన విషయం విదితమే. ‘2016లో రిక్రూట్ అయిన 42,500 మందిలో 36వేల మంది ఆప్టిట్యూట్ పరీక్ష అర్హత లేకుండా, శిక్ష ణ లేకుండా ఉద్యోగాలు పొందారు. అందుకే వీరి నియామకం మాత్రమే రద్ద యింది’ అని ఓ న్యాయవాది చెప్పారు. చదవండి: కేరళలో రూ.12 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత.. సముద్రంలో 134 సంచుల్లో.. -
స్టేల బాబుపై కేఎస్ఆర్ కామెంట్..
-
విధాన పరమైన నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం కలిగిస్తే తప్పే: సజ్జల
-
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ విజయం
-
తుని రైలు దగ్ధం కేసు కొట్టివేత
-
రాహుల్ గాంధీ పిటిషన్ పై నేడు సూరత్ కోర్టు తీర్పు
-
TS: హైకోర్టు తీర్పుపై స్పందించిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో హైకోర్టులో తెలంగాణ సర్కార్‌కు మళ్లీ చుక్కెదురైంది. సీబీఐ విచారణకే మొగ్గు చూపిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సమయం కోరగా.. అందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. దీనిపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పందిస్తూ.. ఎమ్మెల్యేల ఎర కేసులో సీబీఐ విచారణకు సహకరిస్తామని, కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడం అన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను, ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారని గువ్వల ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన అన్నారు. చదవండి: దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. బీఆర్ఎస్కు పొంగులేటి సవాల్.. -
నోట్ల రద్దుపై తీర్పు వెల్లడించిన సుప్రీం కోర్టు
ఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. పెద్ద నోట్ల రద్దులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ.500, రూ.1000 నోట్లు రద్దు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. మొత్తం అయిదుగురు న్యాయమూర్తులు ఈ కేసును విచారించగా.. నోట్ల రద్దు నిర్ణయాన్ని నలుగురు న్యాయమూర్తులు సమర్థించారు. జస్టిస్ నాగరత్నం మాత్రం తన నిర్ణయాన్ని దీనికి వ్యతిరేకంగా వెలువరించారు. అధికారిక ఉత్తర్వుల ద్వారా కాకుండా పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయం అమలు చేస్తే బాగుండేది అని తన తీర్పు ప్రతిలో వెల్లడించారు జస్టిస్ నాగరత్నం. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పార్లమెంటును విస్మరించడం సరైనది కాదని పేర్కొన్నారు జస్టిస్ నాగరత్న. అయితే, మెజార్టీ జడ్జిలు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో నోట్ల రద్దు అంశంలో కేంద్రానికి ఉపశమనం లభించింది. పెద్ద నోట్ల రద్దు అంశంలో కేంద్రం ఉద్దేశమే ముఖ్యమన్న సుప్రీంకోర్టు, ఆ ఉద్దేశాలు నెరవేరలేదన్న కారణంతో నిర్ణయాన్ని కొట్టివేయలేమని తెలిపింది. పూర్తి స్థాయి సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. 2016 నవంబర్ 8వ తేదీన కేంద్రం ఇచ్చిన నోట్ల రద్దు నోటిఫికేషన్ సరైందనేనని బెంచ్ స్పష్టం చేసింది. జస్టిస్ నాగరత్న నోట్ల రద్దుకు వ్యతిరేకంగా మొత్తం 58 పిటిషన్లపై విచారణ జరిగింది. జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలో.. బీఆర్ గవాయ్, ఏఎస్ బొప్పన్నా, వీ రామసుబ్రమణియన్, బీవీ నాగరత్నలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే తీర్పుపై స్పందిస్తూ.. ఆర్థిక విధాన అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. నోట్ల రద్దుపై కేంద్రం, ఆర్బీఐ సంప్రదింపులు జరిగాయి. అటువంటి చర్యను తీసుకురావడానికి సహేతుకమైన కారణం ఉంది. దామాషా సిద్ధాంతం వల్ల పెద్ద నోట్ల రద్దు జరగలేదని మేము భావిస్తున్నాము అని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే జస్టిస్ గవాయి వెల్లడించిన తీర్పుతో బెంచ్‌లోని జస్టిస్ నాగర్నత ఒక్కరే విభేధించడం గమనార్హం. నోట్ల రద్దు విషయంలో కేంద్రం వైఖరిని జస్టిస్ నాగరత్న తప్పుపట్టారు. ‘రహస్యంగా చేసిన ఈ చట్టం ఒక ఆర్డినెన్స్. నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వం కేవలం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కాకుండా ప్లీనరీ చట్టం రూపంలో నిర్ణయం వెలువరించాల్సింది’’ అని పేర్కొన్నారు. ఇక.. 2016లో వెయ్యి, 500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలను గత డిసెంబరు 7న ఆదేశించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఆపై ఇరువర్గాల వాడి వేడి విచారణ పూర్తి కావడంతో.. ఇవాళ్టి తుది తీర్పు మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ధర్మాసనం మాత్రం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్నే సమర్థించింది. -
'నా భర్త గే.. ఎంత ట్రై చేసినా దగ్గరకు రానివ్వట్లేదు..' కోర్టు కీలక తీర్పు
ముంబై: ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్త స్వలింగ సంపర్కుడని, ఈ విషయం దాచి తనను పెళ్లి చేసుకున్నాడని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. పెళ్లయిన తర్వాత ఆయనకు దగ్గరయ్యేందుకు ఎంత ట్రై చేసినా ఫలితం లేకపోయిందని, ఆయనకు పురుషులతో శారీరక సంబంధాలు ఉన్నాయని చెప్పింది. అంతేగాక తనను శారీరకంగా వేధిస్తున్నాడని, దుర్భాషలాడుతూ తన ఆర్థిక పరిస్థితి, కుటుంబాన్ని కించ పరిచేలా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించింది. అయితే వాదనలు విన్న న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. గే అని దాచినందుకు ఆమెకు రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలని, అలాగే ప్రతి నెల రూ.15వేలు ఆర్థిక సాయం అందించాలని ఆదేశించింది. మెజిస్ట్రేట్ కోర్టు ఈమేరకు తీర్పునిచ్చింది. ఈ తీర్పును ముంబై సెషన్స్ కోర్టులో సవాల్ చేశాడు భర్త. ఆధారాలు పరిశీలించిన న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. ఆమెకు రూ.లక్ష, ప్రతి నెల రూ.15 చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ దంపతులకు 2016లో వివాహం జరిగింది. పెళ్లై రోజులు గడుసున్నా ఆమెను అతడు దగ్గరకు రానివ్వలేదు. హింసించడం మొదలుపెట్టాడు. అనుమానంతో అతడ్ని గమనించిన భార్య.. చివరకు గే అని కనిపెట్టింది. ఇతర పురుషులతో అతడు నగ్నంగా దిగిన ఫొటోలోను అతని ఫోన్లో చూసింది. వాటినే కోర్టుకు సాక్ష్యంగా సమర్పించింది. చదవండి: డబ్బు విషయంలో భర్తతో గొడవ.. 8 ఏళ్ల కుమారుడ్ని కాలువలోకి విసిరి.. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు హైకోర్టు తీర్పు
-
Gyanvapi: వాయిదాతో కొనసాగనున్న ఉత్కంఠ!
వారణాసి: ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఉత్తర ప్రదేశ్ వారణాసి జ్ఞానవాపి కేసులో ఇవాళ(నవంబర్ 8, మంగళవారం) కీలక తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే ఈ పిటిషన్లపై తదుపురి విచారణను నవంబర్ 14 తేదీకి వాయిదా వేసింది వారణాసి కోర్టు. మసీదు ప్రాంగణంలో ఉన్న శివలింగాన్ని పూజించేలా అనుమతి ఇవ్వాలని, హిందువులకు ఆ ప్రాంగణం అప్పగించాలని, అలాగే ముస్లింల ప్రవేశాన్ని నిషేధించేలా ఆదేశాలు ఇవ్వాలని.. మొత్తం మూడు డిమాండ్లతో కూడిన హిందువుల పక్షాన దాఖలైన పిటిషన్‌పై తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ మేరకు సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) మహేంద్ర పాండే తీర్పును అక్టోబర్ 27న రిజర్వ్ చేసి ఉంచారు. ముందుగా నవంబర్ 8వ తేదీన తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే జడ్జి అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేకపోవడంతో నవంబర్ 14వ తేదీకి వాయిదా పడింది. ప్రస్తుతానికి ముస్లిం వర్గాలకు అక్కడ నమాజ్‌కు అనుమతి ఇస్తున్నారు. ఇక.. గత విచారణ సందర్భంగా వాజుఖానాలో ఉన్న శివలింగం అంశంపై సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్‌కు అనుమతించాలని, కార్బన్ డేటింగ్ చేయించాలనే అభ్యర్థనను వారణాసి కోర్టు తోసిపుచ్చింది. ఇక ఆ ఆకారం శివలింగం కాదని, ఫౌంటెన్ భాగమని ముస్లిం వర్గాలు వాదిస్తున్నాయి. మసీదు నిర్వహణను చూసుకుంటున్న ఏఐఎంసీ.. హిందు సంఘాల తరపున పిటిషన్ వేసిన వీవీఎస్ఎస్ వాదనను తోసిచ్చుతోంది. ఇదీ చదవండి: కర్మ అంటే ఇదేనేమో.. దెబ్బకు తిక్క కుదిరింది! -
ఇదెక్కడి న్యాయం.. బతకాలని లేదు!
పదేళ్ల కిందటినాటి కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై.. యావత్ దేశం రగిలిపోతోంది. కళ్లలో యాసిడ్‌పోసి.. జనానాంగాల్లో సీసాలు జొప్పించి అతికిరాతంగా హత్య చేశారామెను. అలాంటి కేసులో మరణ శిక్ష పడ్డ ఖైదీలను నిర్దోషులుగా ప్రకటించింది సుప్రీం కోర్టు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ ఆఖరిరోజు ఇచ్చిన తీర్పుల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. 2012 చావ్లా గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో నేరారోపణలను ప్రాసిక్యూషన్ వారు నిరూపించని కారణంగానే.. మరణ శిక్ష పడ్డ ఆ ముగ్గురు ఖైదీలను విడుదల చేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం తీర్పు ఇచ్చింది. వారిని దోషులుగా నిర్ధారించే సమయంలో దిగువ న్యాయస్థానం సైతం పారదర్శకత లేకుండా వ్యవహరించిందని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వాళ్లను నిర్దోషులుగా ప్రకటించినట్లు వెల్లడించింది. ఏడేళ్లుగా సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగగా.. తీర్పుపై బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తీర్పు తమకు దిగ్భ్రాంతి కలిగించిందని ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘‘ఇది మాకు పెద్ద ఎదురు దెబ్బ. న్యాయం జరుగుతుందనే ఇక్కడికి(సుప్రీం కోర్టు) వచ్చాం. న్యాయవ్యవస్థ మీద నమ్మకమే మమ్మల్ని ఇక్కడికి రప్పించింది. కానీ, అది నెరవేరలేదు. చట్టం ఇలాగే ఉంటే.. ఇంక న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఎవరికి ఉంటుంది?.. న్యాయం జరగకపోవడం వల్లే కదా ఇంకా ఇలాంటి నేరాలు పెరిగిపోతాయ్. మా బిడ్డకు న్యాయం జరుతుందని వచ్చాం. కానీ, మా గుండెలు బద్ధలయ్యాయి. ఇదేనా న్యాయమంటే?. పదకొండేళ్లపాటు పోరాడిన మాకు దక్కిన తీర్పు ఇదా? పోరాటంలో మేం ఓడినట్లేనా? అసలు మాకు బతకాలనే లేదు. కానీ, ఇన్నాళ్లు ఒపిక పట్టిన మేం.. వెనక్కి వెళ్లాలని అనుకోవడం లేదు. కచ్చితంగా పోరాడతాం.. ముందుకెళ్తాం అని పేర్కొన్నారు. ఇక కోర్టు తీర్పు కాపీని అందుకున్నాకే.. రివ్యూ పిటిషన్‌కు వెళ్తామని బాధితుల తరపు న్యాయవాది పేర్కొన్నారు. కోర్టు తీర్పు మాకు ఆశ్చర్యం కలిగింది. ఏడేళ్ల తర్వాత.. అదీ నేను గట్టిగా అడిగిన తర్వాతే కోర్టు విచారణ ముందుకు కదిలింది. వారంలోపే.. అదీ సీజేఐ ఆఖరి రోజున ఇలాంటి తీర్పు వచ్చింది. ఈ కేసులో వెనక్కి వెళ్లం.. తీర్పుపై పునసమీక్షకు వెళ్తాం అని ఆమె పేర్కొన్నారు. అంతకు ముందు సీజేఐ నేతృత్వంలోని.. ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. హేతుకమైన సందేహం లేకుండా అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ అభిప్రాయపడింది. అంతేకాదు.. కోర్టు విచారణ సమయంలోనూ లోపాలు స్పష్టంగా గమనించామని, 49 సాక్ష్యుల్లో పది మందిని విచారించలేదని ధర్మాసనం తెలిపింది. అంతేకాదు.. న్యాయస్థానాలు చట్టపరిధిలో ఉండాలే తప్ప.. బయటి నుంచి వచ్చే నైతిక ఒత్తిళ్లకు తలొగ్గకూడదనే అభిప్రాయం వెలుబుచ్చింది. ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం.. గురుగావ్‌లో పని చేసే 19 ఏళ్ల యువతిని.. 2012 ఫిబ్రవరి 9వ తేదీన తనతో శారీరక సంబంధానికి ఒప్పుకోలేదన్న కారణంతో ముగ్గురు నిందితుల్లో ఒకడైన వ్యక్తి.. ఎత్తుకెళ్లి మూడు రోజులపాటు చిత్రహింసలకు గురి చేశాడు. ఆపై మృగచేష్టలతో సామూహికంగా హత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజుల తర్వాత శవాన్ని హర్యానా శివారులో పడేసి వెళ్లిపోయారు. కుళ్లిపోయిన స్థితిలో దొరికిన ఆమె మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి.. షాకింగ్‌కు గురి చేసే విషయాలు బయటపెట్టారు వైద్యులు. ఆపై నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేయగా.. 2014లో ఢిల్లీ కోర్టు, ఆపై హైకోర్టు కూడా ఈ మానవ మృగాలకు సంఘంలో తిరిగే హక్కు లేదంటూ మరణ శిక్ష విధించాయి. చివరికి.. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో ఆ ముగ్గురు నిర్దోషులుగా బయటకు రాబోతున్నారు!. సంబంధిత వార్త: భావోద్వేగాలకు.. సెంటిమెంట్లకు చోటు లేదిక్కడ! -
హిజాబ్ తీర్పుపై సుప్రీం కోర్టులో ఊహించని పరిణామం
-
హిజాబ్ తీర్పు: సుప్రీంలో ఊహించని పరిణామం
న్యూఢిల్లీ: కర్ణాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించటంపై నిషేధం విధించటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై గురువారం తీర్పు సందర్భంలో.. సుప్రీం కోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు వెలువరించారు. దీంతో సరైన దిశానిర్దేశం కోసం ఈ పిటిషన్లను సీజేఐకి సిఫారసు చేస్తున్నట్లు జస్టిస్ హేమంత్ గుప్తా తెలిపారు. సుమారు పదిరోజులపాటు హిజాబ్ పిటిషన్లపై వాదనలు వినింది ద్విసభ్య న్యాయమూర్తుల ధర్మాసనం. చివరికి.. కర్ణాటక హైకోర్టును తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా.. తీర్పును తోసిపుచ్చారు జస్టిస్ సుధాన్షు దులియా. దీంతో ఈ వివాదం సీజేఐకి ముందుకు చేరగా.. మరో బెంచ్ లేదంటే రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యాసంస్థల్లో విద్యార్థుల దుస్తులపై కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. స్కూల్స్, పాఠశాలల్లో హిజాబ్ ధరించకూడదని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేయాటనికి నిరాకరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. 10 రోజుల పాటు వాదనలు విన్న జస్టిస్ హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాల ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఇరువురు జడ్జీలు హిజాబ్ నిషేధంపై ఏకాభిప్రాయానికి రాకపోవటం గమనార్హం. ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్ -
తాజా తీర్పు: పోల్చి తిడితే ఇంతే సంగతులు
భర్తల నోటికి తాళం. భార్యల వేదనకు ఈ తీర్పు ఒక అవసరం. ఇరుగింటామెతోనూ పొరుగింటామెతోనూ సినిమా హీరోయిన్‌తోనూ పోల్చి భార్యను చులకన చేస్తే సూటిపోటి మాటలంటే అది ‘మానసిక క్రూరత్వం’ కిందకే వస్తుందని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అటువంటి భర్తతో కాపురం చేయనవసరం లేదని విడాకులు మంజూరు చేసింది. గతంలో ముంబై ఫ్యామిలీ కోర్టు కూడా ‘ఆ నువ్వు పెద్ద మగాడివని’ లాంటి గుచ్చే మాటలు మాట్లాడే భార్య నుంచి విడాకులు ఇప్పించింది. భార్యాభర్తలు ఇలాంటి మాటలు అనుకోవడం ఎందుకు? భార్యను చులకన చేయడం భర్తకు సమాజం నుంచి కుటుంబం నుంచి అంగీకారం పొందిన విషయంగా అనిపిస్తుంది. సినిమాల్లో పాత్రలు, టీవీల్లో స్కిట్లు భార్యను భర్త నానా విధాలుగా హేళన చేయడం చూపిస్తూనే ఉంటాయి. ‘మసిబొగ్గులా ఉన్నావు’, ‘బోండాంలా ఉన్నావు’, ‘నిన్ను చేసుకునే బదులు అడవిలో మొద్దును చేసుకుని ఉంటే నయం’, ‘ఏదో ఒక మాయలో పడినట్టుగా నిన్ను చేసుకున్నాను. కాని నీలో ఏ ఆకర్షణ లేదు’, ‘ఆ ఎదురింటామెను చూడు ఎంత అందంగా ఉందో’, ‘ఇదంతా నా ఖర్మ’... ఇలాంటి మాటలు భర్త మాట్లాడితే భార్య లోలోపల బాధ పడటమో తిరిగి తగాదా పడటమో చేస్తూ ఉంటుంది. కాని ‘ఇది అవసరమా నాకు’ అని భార్య అనుకుంటే విడాకులు మంజూరు చేయడానికి ఈ కారణం సరిపోతుందని తాజాగా కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కేరళ హైకోర్టు బెంచిలో జస్టిస్ కె.నరేంద్రన్, సి.ఎస్.సుధ ఈమేరకు తీర్పు వెలువరించారు. ఏమిటి కేసు? కేరళలో ఒక జంట 2009లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఆమెకు 26. అతనికి 29. పెళ్లయిన తర్వాత భర్త కొత్త పెళ్లికూతురు అని కూడా చూడక వెంటనే ఇతర స్త్రీలతో పోల్చసాగాడు. ‘నీకన్నా ఆమె బాగుంది’, ‘ఆమెకున్న మంచి జుట్టు నీకు లేదు’ లాంటి కామెంట్లు చేసేవాడు. అతని తమ్ముడు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే పెళ్లిచూపులకు అన్నగా హాజరయ్యి భార్యతో ‘నా తమ్ముడు అదృష్టవంతుడు. మంచి అమ్మాయిలను వెతుకుతున్నాడు’ లాంటి కామెంట్లు చేసేవాడు. దాంతో ఆమె కనీసం ఆరునెలలు కూడా అతనితో కాపురం చేయలేకపోయింది. జనవరిలో పెళ్లయితే నవంబర్‌లో విడాకులకు ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసింది. ఫ్యామిలీ కోర్టు ‘లైంగిక దూరాన్ని’ కారణంగా చూపుతూ విడాకులు మంజూరు చేసింది. దాని మీద భర్త హైకోర్టుకు అప్లయి చేశాడు. కేరళ హైకోర్టు కూడా తాజాగా విడాకులే సబబైనవిగా తీర్పు ఇచ్చింది. మానసిక క్రూరత్వం ఈ కేసులో విడాకులకు కనిపించే సగటు కారణాల కన్నా భర్త తన భార్యను ఇతర స్త్రీలతో పోల్చుతూ చిన్నబుచ్చడాన్నే హైకోర్టు ప్రధాన కారణంగా తీసుకుంది. దానిని ‘మానసిక క్రూరత్వం’గా వ్యాఖ్యానించింది. అలాంటి క్రూరత్వంతో బంధం నిలవదు అని చెప్పింది. ‘వారు మంచి వయసులో ఉన్న జంటే అయినా ఈ కేసు కొనసాగిన ఇన్నేళ్లుగా తిరిగి కలవలేదు. భాగస్వాములలో ఒకరు విడాకులకు దరఖాస్తు చేసి, ఏళ్ల తరబడి ఇద్దరూ విడిగా ఉండగా ఆ పెళ్లి కుటుంబాలకు, సంఘానికి చెప్పుకోవడానికి ఉంటుందిగాని నిజంగా మనలేదు’ అని విడాకులు మంజూరు చేసింది. భర్తను చిన్నబుచ్చినా అంతే! అయితే 2013లో ముంబై ఫ్యామిలీ కోర్టులో భర్త తరఫు నుంచి ఇటువంటి తీర్పే ఇచ్చింది. భార్య భర్తను ‘నువ్వు పెద్ద మగాడివిలే’, ‘నేను సరిగా ఏడ్చి ఉంటే మావాళ్లు నీకంటే తెలివైన, మంచి కుటుంబం నుంచి కుర్రాణ్ణి వెతికి ఉండేవారు’, ‘నాకు నువ్వు ఏమాత్రం సరి తూగవు’ లాంటి మాటలతో బాధించేది. అప్పటికి వారికి పెళ్లయి పదేళ్లు. ఇద్దరు పిల్లలు. కాని భర్త అలసిపోయి ఆఫీసు నుంచి వస్తే ‘ఒక ముద్దు ముచ్చట లేదు. మగాడివైతేగా’ వంటి మాటలతో బాధించేది. ఏమైనా అంటే ‘ఉరేసుకుని చస్తా’ అని బెదిరించేది. ఈ మాటలన్నింటినీ కోర్టు ‘మానసిక క్రూరత్వం’గా పరిగణించి విడాకులు ఇచ్చింది. ముఖ్యంగా ‘ఆత్మహత్య బెదిరింపులు’ భర్తకు నరక ప్రాయం అవుతాయని వ్యాఖ్యానించింది. ఎందుకు ఈ మాటలు? భార్యాభర్తల మధ్య ప్రేమ, స్నేహం, గౌరవం, సర్దుబాటు ధోరణి, అవగాహన, అర్థం చేసుకోవడం, బలహీనతలను గుర్తించడం, ఎదుటివారికి ఏ పని నచ్చదో దానిని వదలిపెట్టడం... ఇవన్నీ ఉంటే తప్ప కాపురం సజావుగా సాగదు. పెళ్లయ్యాక ఒకరికొకరు సరిపడరు అని అనుకుంటే విడిపోవడం లేదా మౌనంగా కొనసాగడం మేలు. కాని మాటలు చాలా గాయం చేస్తాయి. నిజానికి అవి వంటి మీద పడే దెబ్బల కంటే తీవ్రమైనవి. మాటలతో హింసించి సంతృప్తి పడదామంటే కాలక్రమంలో ఆ బంధం మరింత పలుచనవుతుంది తప్ప గట్టి పడదు. కాబట్టి తిడితే ఏమవుతుందిలే అని భార్య/భర్త అనుకోవద్దు. విడాకులకు అవి చాలు. -
Triple Talaq: రాతపూర్వకంగా కూడా తలాక్ చెల్లదు.. తేల్చి చెప్పిన ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: నోటి మాటగా మూడుసార్లు తలాక్ చెప్పడం ఇస్లాం చట్ట నిబంధనలకు విరుద్ధమైనప్పుడు, తలాక్‌నామా రూపంలో లిఖితపూర్వకంగా రాసుకున్నా కూడా చెల్లదని, వివాహం రద్దుకాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏక వాక్యంలో మూడుసార్లు చెప్పే తలాక్‌కు ఎలాంటి గుర్తింపు లేదంది. మూడుసార్లు తలాక్ చెప్పి, దాన్ని రాతపూర్వకంగా పంపడం చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. ఒకవేళ ఇస్లాం చట్ట నిబంధనల ప్రకారం విడాకులు తీసుకోవాలంటే.. భార్య, భర్త ఇద్దరి తరపు మధ్యవర్తులు వారి మధ్య సయోధ్యకు ప్రయత్నించాలంది. అది సాధ్యం కానప్పుడే సహేతుక కారణాలతో తలాక్ చెప్పొచ్చునని, అలా చెప్పే తలాక్‌ల మధ్య తగిన వ్యవధి ఉండి తీరాలని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారీ ఇటీవల తీర్పు వెలువరించారు. ఇదీ వివాదం... తను, తన భర్త వేర్వేరుగా ఉంటున్న నేపథ్యంలో భర్త నుంచి జీవన భృతి ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పి.గౌస్‌బీ 2004లో పొన్నూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనను ఆమె భర్త జాన్ సైదా వ్యతిరేకించారు. తాను తలాక్ చెప్పి, దాన్ని రిజిస్టర్ పోస్టులో భార్యకు పంపానని, అయితే అది తిరస్కరణ కారణంతో తిరిగి వచ్చిందని, కాబట్టి జీవన భృతి చెల్లించాల్సిన అవసరం లేదని సైదా వాదించారు. పొన్నూరు కోర్టు సైదా వాదనలను తోసిపుచ్చుతూ గౌస్‌బీ, ఆమె కుమారుడికి నెలకు రూ.8 వేలు జీవన భృతి కింద చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ జాన్ సైదా అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన గుంటూరు మొదటి అదనపు సెషన్స్ కోర్టు, కుమారుడికి జీవనభృతి చెల్లించాలని, గౌస్‌బీకి అవసరం లేదంటూ తీర్పునిచ్చింది. దీనిని సవాలు చేస్తూ గౌస్‌బీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రవినాథ్ తిల్హారీ విచారణ జరిపి ఇటీవల తీర్పు వెలువరించారు. గౌస్‌బీ, ఆమె కుమారుడికి జీవనభృతి చెల్లించాలంటూ పొన్నూరు కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు. భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పి, దాన్ని రిజిస్టర్ పోస్టులో పంపి వివాహం రద్దయినట్లు పేర్కొనడాన్ని తప్పుపట్టారు. అలా చేయడం ద్వారా వివాహం రద్దు కాదన్నారు. భార్య, భర్త వేర్వేరుగా ఉంటున్నందున భర్త నుంచి భరణం పొందేందుకు ఆ మహిళ అర్హురాలేనని స్పష్టంచేశారు. -
వాన్‌పిక్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌కు ఊరట
-
తెలంగాణ హైకోర్టులో వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఊరట
-
సుప్రీం కోర్టులో తెలంగాణ సర్కార్‌కు భారీ ఊరట
బంజారాహిల్స్ (హైదరాబాద్): సుప్రీం కోర్టులో రాష్ట్ర సర్కారుకు భారీ ఊరట లభించింది. రూ.300 కోట్ల విలువైన స్థలం ప్రభుత్వానిదేనంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో షేక్‌పేట రెవెన్యూ అధికారులు సదరు స్థలాన్ని మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. అది ప్రభుత్వ స్థలమని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. షేక్‌పేట తహసీల్దార్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... షేక్‌పేట మండలం బంజారాహిల్స్ రోడ్ నెం. 14 ప్రధాన రహదారిలోని సర్వే నెంబర్ 403లో ప్రభుత్వానికి రెండెకరాల పది గుంటల స్థలం ఉంది. చదవండి: హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు.. జీహెచ్ఎంసీ అలర్ట్ ఈ స్థలం తనదేనంటూ డి. రంగస్వామి అనే వ్యక్తి రెండు దశాబ్దాలుగా న్యాయస్థానంలో పోరాడుతున్నాడు. దాదాపు రూ.300 కోట్ల విలువ చేసే ఈ స్థలంపై ప్రభుత్వం కూడా సిటీ సివిల్ కోర్టులో విజయం సాధించగా సదరు కబ్జాదారు జాగా తనదేనంటూ హైకోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న తర్వాత 2021 ఏప్రిల్ 1న హైకోర్టు ఈ స్థలం బి. రంగస్వామికి చెందినదని తీర్పునిచ్చింది. ఆ తెల్లవారే సదరు వ్యక్తి హైకోర్టు తీర్పుతో స్థలం చూట్టూ బ్లూషీట్లు ఏర్పాటు చేసుకొని జీపీఏ అగ్రిమెంట్ చేసిన శాంతా శ్రీరాం రియల్టర్‌కు అప్పగించాడు. ఈ నేపథ్యంలో ఖరీదైన స్థలాన్ని కావాలనే అప్పగించేశారంటూ ఆరోపణలు వినిపించాయి. ప్రభుత్వ వాదనలు సరిగా లేవంటూ పలువురు విమర్శించారు. దీంతో స్పందించిన ప్రభుత్వం 2021 జూన్‌లో సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఆ కొద్ది రోజులకే సుప్రీం కోర్టు ఈ స్థలంపై స్టేటస్కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి ఈ స్థలం తమదేనంటూ పక్కాగా ఆధారాలు సమర్పించారు. ఏడాది కాలంలో స్థలానికి సంబంధించిన కీలక పత్రాలను కోర్టులో సమర్పించారు. దీంతో సుప్రీం కోర్టు ఈ స్థలం ప్రభుత్వానిదేనంటూ సోమవారం కీలక తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు స్థలాన్ని స్వాదీనం చేసుకొని తమ అదీనంలోకి తీసుకున్నారు. -
'మాల్యా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు'! రేపే శిక్ష ఖరారు చేయనున్న సుప్రీం కోర్టు!
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా సోమవారం భారత అత్యున్నత న్యాయ స్థానం విచారణ జరపనుంది. జస్టిస్ యూయూ లలిత్, రవీంద్ర ఎస్ భట్, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. 2017లో విజయ్ మాల్యా సుప్రీం కోర్ట్ తీర్పును ఉల్లంఘిస్తూ మాల్యా 40మిలియన్ డాలర్లను తన పిల్లలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ సమాచారాన్ని కోర్ట్‌కు చెప్పే ప్రయత్నం చేయలేదు. పైగా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాడు. దీంతో మాల్యాపై సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణ జరిపింది. ఇప్పటికే కేసు విచారణ నేపథ్యంలో పలు మార్లు మాల్యా కోర్ట్‌కు హాజరు కావాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కానీ మాల్యా సుప్రీం కోర్టు హాజరవ్వలేదు. ఈ తరుణంలో కోర్ట్ ధిక్కారం కేసుకు సంబంధించి ఏప్రిల్11న సుప్రీం కోర్ట్ తుది తీర్పు ఇవ్వనుంది. మాల్యాకు వ్యతిరేకంగా శిక్ష ఖరారు కానుంది. -
కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు..
Comedian Bill Cosby Found Guilty Sexually Assaulting In 1975: ఎంతటి ప్రముఖులైన చేసిన నేరానికి శిక్ష అనుభవించక తప్పదని మరో సంఘటన నిరూపించింది. ఓ ప్రముఖ కమెడియన్ 1975లో చేసిన నేరం సుమారు 50 ఏళ్ల తర్వాత రుజువైంది. 5 దశాబ్దాల క్రితం అమెరికన్ కమెడియన్ బిల్ కాస్బీ ప్లేబాయ్ మాన్షన్‌లో ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. కొన్ని ఏళ్ల తర్వాత ఆమె బిల్‌పై కేసు పెట్టింది. తర్వాత విచారించిన కాలిఫోర్నియాలోని జ్యూరీ తాజాగా మంగళవారం (జూన్ 21, 2022) తీర్పునిచ్చింది. హాస్య నటుడు బిల్ కాస్బీ నేరం చేసినట్లు నిర్ధారించింది. అంతేకాకుండా బాధితురాలు జూడీ హుత్కు 5 లక్షల డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. 1975లో 36 ఏళ్ల వయసున్న బిల్ కాస్బీ 16 సంవత్సరాల జూడీ హుత్ను లైంగికంగా వేధించాడు. ఓ సినిమా సెట్లో జరిగిన ఈ ఘటనలో జూడీతోపాటు ఆమె స్నేహితురాలు డొన్నా శామ్యూల్ సన్ (17) కూడా బాధితురాలైంది. చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ ప్రస్తుతం 84 ఏళ్ల వయసున్న బిల్ కాస్బీపై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలతో కేసులు వేశారు. ఈ క్రమంలోనే బిల్‌కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కాగా 'అమెరికాస్ డాడ్'గా పిలవబడే బిల్ కాస్బీ 2018లో కూడా ఒక క్రిమినల్ కేసులో జైలుపాలయ్యాడు. తర్వాత పలు కారణాల వల్ల నేరం రద్దు కావడంతో గతేడాది విడుదల అయ్యాడు. చదవండి: సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు -
టీసీఎస్కి న్యాయస్థానంలో చుక్కెదురు !
ఉద్యోగికి పట్ల టీసీఎస్ న్యాయస్థానం ప్రవర్తించిన తీరు పట్ల చెన్నై సిటీ కార్మిక న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. అర్థరహితమైన కారణాలు చెప్పి ఉద్యోగులు జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించింది. ఈ మేరకు సదరు ఉద్యోగికి జరిగిన అన్యాయం సరి చేయాలంటూ తీర్పు వెలువరించింది. తిరుమలై సెల్వన్ (48) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో మేనేజర్ హోదాలో పని చేస్తున్న సమయంలో ఊహించిన విధంగా యాజమాన్యం ప్రవర్తించింది. సరైన కారణాలు పేర్కొనకుండా అతన్ని ఫ్రీలాన్సర్‌గా మారమంటూ ఒత్తిడి తెచ్చింది. దీంతో గడిచిన ఏడేళ్లుగా అతను ఫ్రీలాన్సర్‌గా పని చేస్తూ నెలకు కేవలం రూ. 10,000 జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కుటంబం గడిచేందుకు అతని భార్య కూడా పని చేస్తోంది. సరైన కారణాలు పేర్కొనకుండా తనను ఉద్యోగంలోంచి తొలగించారంటూ తిరుమలై సెల్వన్ చెన్నైలోని లేబర్కోర్టును ఆశ్రయించాడు. అతనికి మద్దతుగా ది ఫోరమ్ ఫర్ ఐటీ ఎంప్లాయిస్ కూడా నిలబడింది. ఇలా ఏడేళ్లలో 150 సార్లు కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయి. మొత్తంగా ఉద్యోగంలోకి తీసుకున్న వ్యక్తిని సరైన కారణాలు చూపకుండా తొలగించడం తప్పని చెబుతూ న్యాయస్థానం తాజాగా తీర్పు ఇచ్చింది. సెల్వన్‌కు వ్యతిరేకంగా టీసీఎస్ తరఫున వినిపించిన వాదనలుఅ అర్థరహితమంటూ వ్యాఖ్యానించింది. ఒక ఉద్యోగిగా సెల్వన్ నష్టపోయిన కాలానికి సంబంధించి పూర్తి పరిహారాన్ని జీతం, ఇతర బెనిఫిట్స్‌తో సహా చెల్లించాలని టీసీఎస్‌ను న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాదు అతన్ని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పింది. కోర్టు తీప్పు పట్ల ఐటీ ఎంప్లాయిస్ ఫోరం హర్షం వ్యక్తం చేసింది. చదవండి: రెండు వారాలు ఇంటినుంచే పని -
ఆ కారులోనే నా బిడ్డ ఆత్మ! దోషికి శిక్ష ఖరారు
కొల్లం: కేరళలో వరకట్న వేధింపులకు బలైన ఆయుర్వేద వైద్య విద్యార్థిని విస్మయ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. కొల్లాం అదనపు సెషన్స్ కోర్టు-1 కిరణ్ కుమార్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే 12.5 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ మొత్తాన్ని బాధితురాలి తల్లిదండ్రులకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది.వరకట్న వేధింపులకు గురిచేసిఆత్మహత్యకుప్రేరేపించినట్లు విశ్వసించిన కోర్టు కిరణ్ కుమార్‌ను సోమవారం దోషిగా నిర్ధారించింది. ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధింపుల నేరాలకుగాను ఈ శిక్ష విధించినట్లు అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి-1 సుజిత్ కెఎన్ ,స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి మోహనరాజ్ విలేకరులకు తెలిపారు. ఈకేసులో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కుమార్‌కు గతంలో ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. పెళ్లయిన కొద్ది రోజులకే ఇంట్లో శవమై కనిపించింది విస్మయ.ఈ ఘటనకు ఒక రోజు ముందు, విస్మయ తన బంధువులకు వరకట్న వేధింపుల గురించి వాట్సాప్ సందేశాలను పంపింది, అలాగే ఆమె శరీరంపై గాయాల ఫోటోలు, కొట్టిన గుర్తుల ఫోటోలను పంపించింది. 2020లో పెళ్లి సందర్భంగా కుమార్‌కి 100 కాసుల బంగారం, ఎకరానికి పైగా భూమితో పాటు 10 లక్షల విలువైన కారు కూడా కుమార్‌కి కట్నంగా ఇచ్చారు. కారు, నచ్చలేదని, వద్దన్న కిరణ్ ఆ పది లక్షల నగదు రూపంలో కావాలని వేధించి, చిత్ర హింసలకు గురి చేయడంతో విస్మయ ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఫిర్యాదు నమోదు చేశారు. వరకట్న వేధింపుల కారణంగానే విస్మయ ఆత్మహత్యకు పాల్పడిందని కేరళ పోలీసులు 500 పేజీలకు పైగా ఉన్న చార్జిషీట్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ అనంతరం కోర్టు తాజా తీర్పును వెలువరించింది. అయితే, దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు అయింది. దీంతో పోలీసులు కిరణ్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ పరిణామంపై స్పందించిన విస్మయ తల్లితండ్రులు త్రివిక్రమన్ నాయర్, సజిత సంతోషం వ్యక్తం చేశారు. అయితే కిరణ్‌కు యావజ్జీవ శిక్ష పడాలని కోరుకున్నారు. అంతేకాదు ఏ కారు అయితే విస్మయ మరణానికి కారణమైందో ఆ కారులోనే ఆమె తండ్రి విచారణకు హాజరయ్యారు. ‘‘నా కూతురు ఆత్మ ఈ కారులోనే ఉంది. ఆమె కోసం సీటు ఎపుడూ ఖాళీగా ఉంచుతా’’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు కోర్టు తాజా తీర్పును పైకోర్టులో సవాల్ చేయనున్నామని కిరణ్ తండ్రి సదాశివన్ పిళ్లై వెల్లడించారు. -
జ్ఞానవాపి మసీదు కేసు: వారణాసి కోర్టులో విచారణ పూర్తి, తీర్పు రిజర్వ్
లక్నో: జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై వారణాసి జిల్లా కోర్టులో విచారణ పూర్తి అయ్యింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి (మంగళవారం) రిజర్వ్ చేసింది. హిందూ వర్గం దాఖలుచేసిన రెండు పిటిషన్లతోపాటు ముస్లిం కమిటీ వేసిన ఒక పిటిషన్‌ను జిల్లా జడ్జ్ అజయ్‌కృష్ణ విశ్వేష విచారించారు. విచారణ సందర్భంగా కోర్టు హాలులోకి 23 మందిని మాత్రమే అనుమతించారు. వీరిలో 19 మంది లాయర్లు కాగా, నలుగురు పిటిషనర్లు. జ్ఞాన్వాపి ప్రాంగణంలోని శృంగార గౌరి కాంప్లెక్స్‌లో నిత్యపూజలకు, వజుఖానాలో వెలుగుచూసిన శివలింగాన్ని ఆరాధించేందుకు అనుమతి ఇవ్వడంతోపాటు శివలింగం లోతు ఎత్తు తెలుసుకునేందుకు సర్వే కొనసాగించాలని హిందూవర్గం కోరుతోంది. వజుఖానా మూసేయవద్దని ముస్లిం కమిటీ డిమాండ్ చేస్తోంది. అలాగే 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద జ్ఞానవాపి సర్వేను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతోంది. చదవండి: Vismaya Case: నాన్నా! భయమేస్తోంది.. వచ్చేయాలనుంది -
Rajiv Gandhi Assassination Case: సుప్రీం కోర్టు సంచలన తీర్పు
-
రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో మూడు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న దోషి ఎ.జి.పేరరివాళన్ విడుదల చేయాలని జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవాయి, ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు రాష్ట్ర క్యాబినెట్ అంగీకరించిందని, ఇక ఆర్టికల్ 142 ప్రకారం పేరరివాళన్‌ను విడుదల చేయడం సమంజసమే అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పేరరివాళన్ విడుదలతో ఈ కేసులో జీవితఖైదు అనుభవిస్తోన్న నళిని, ఆమె భర్త మురుగన్ సహా ఇతర దోషుల విడుదలకు కూడా మార్గం సుగమమైనట్లైంది. చదవండి: Who Is VTuber: వీట్యూబర్లు ఎవరో తెలుసా..వీళ్లు సృష్టిస్తున్న హంగామా ఏంటో విన్నారా కాగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ హత్య కేసులో పేరరివాళన్‌తో పాటు దోషులుగా తేలిన మురుగన్, అతని భార్య నలిని, సుతేంతిరా రాజా అలియాస్ సంతన్, రాబర్ట్ పయాస్, జయకుమార్, రవిచంద్రన్‌లకు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే ఈ ఏడుగురిని విడుదల చేయాలనే గతంలో తమిళనాడు మంత్రివర్గం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇటీవల పేరరివాళన్‌ను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసుని విచారించిన ధర్మాసనం రాజీవ్ గాంధీ హత్య కేసులో పెరారివాలన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. జైలు నుంచి విడుదల అనంతరం పెరారివాలన్ కుటుంబ సభ్యులను కలిశాడు. సుమారు 30 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని చేరుకున్న పెరారివాలన్ భావోద్వేగానికి లోనయ్యారు. బుధవారం సుప్రీం కోర్టు తీర్పు అనుసరించి అతను విడుదలైన సంగతి తెలిసిందే. చదవండి: Karti Chidambaram: కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు.. సెటైర్ వేసిన ఎంపీ -
రాజీవ్ గాంధీ హత్య కేసు.. సుప్రీం కోర్టు తుది తీర్పు ఎలా ఉండబోతోంది!
Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ ఖైదీలలో ఒకరైన ఏజీ పెరారివాలన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నుంచి బుధవారం తుది తీర్పు వెలువడనుంది. నళిని శ్రీహరన్, శ్రీలంక జాతీయుడైన ఆమె భర్త మురుగన్‌తో సహా ఈ కేసులో మరో ఆరుగురు దోషుల విడుదలకు అనుకూలమైన తీర్పుకు మార్గం సుగమం కానున్నట్లు సమాచారం. రాజీవ్ గాంధీ హత్యకు సూత్రధారి అయిన ఎల్టీటీఈ వ్యక్తి శివరాసన్ కోసం పెరారివాలన్ రెండు 9-వోల్ట్ బ్యాటరీలను కొనుగోలు చేశాడు. ఆ సమయంలో పెరారివాలన్ వయసు 19 సంవత్సరాలు. రాజీవ్ గాంధీని హత్య చేసేందుకు బాంబులో బ్యాటరీలను ఉపయోగించారు. దీంతో ఈ కేసుకు సంబంధించి 1998లో పేరారివాలన్‌కు టాడా కోర్టు మరణశిక్ష విధించింది. మరుసటి సంవత్సరం, సుప్రీంకోర్టు ఆ శిక్షతో ఏకీభవించింది కానీ 2014లో దానిని జీవిత ఖైదుగా మార్చింది. ఈ ఏడాది మార్చిలో, ఉన్నత న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే కొంతకాలం తర్వాత, పెరారివాలన్ జైలు నుంచి త్వరగా విడుదల చేయాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. పెరారివాలన్ అభ్యర్థనను కేంద్రం వ్యతిరేకించింది, కానీ తమిళనాడు గవర్నర్ ఈ విషయాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు సూచించినప్పటికీ ఇంతవరకు దీనిపై ఎలాంటి కదలిక లేదు. ఈ వ్యవహారంలో జాప్యాన్ని, గవర్నర్ చర్యను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగంలోని సెక్షన్ 161 ప్రకారం క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఏడుగురు దోషులను విడుదల చేయాలన్న క్యాబినెట్ నిర్ణయానికి తమిళనాడు గవర్నర్ కట్టుబడి ఉన్నారని, అందువల్ల రాష్ట్రపతి ప్రతిస్పందన కోసం వేచి ఉండబోమని కోర్టు పేర్కొంది. కాగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ కేసులో ఏడుగురికి శిక్ష పడింది. అందరికీ మరణశిక్ష విధించబడినప్పటికీ, 2014లో, వారి క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్రపతి తీవ్ర జాప్యం చేశారని పేర్కొంటూ సుప్రీంకోర్టు వారిని జీవిత ఖైదీలుగా మార్చింది. చదవండి: జ్ఞానవాపి మసీదు సర్వే: తప్పు చేయలేదు.. నన్ను మోసం చేశారు: అజయ్ మిశ్రా -
Marital Rape: మారిటల్ రేప్‌పై భిన్న తీర్పులిచ్చిన జడ్జిలు
భార్యతో బలవంతంగా శృంగారంలో పాల్గొనడాన్ని (మారిటల్ రేప్).. నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువడింది. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ వేర్వేరు అభిప్రాయాలను వెలువరించడంతో గందరగోళం నెలకొంది. అంతేకాదు ఈ గందరగోళం నడుమ.. తాము ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకునేందుకు పిటిషర్లకు అనుమతి ఇచ్చింది బెంచ్. న్యూఢిల్లీ: దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తీర్పు ఇవాళ రానే వచ్చింది. అయితే మారిటల్ రేప్ (వైవాహిక అత్యాచారం)పై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు ఇవాళ భిన్న తీర్పులు వెలువరించారు. వైవాహిక జీవితంలో భార్యతో బలవంతపు శృంగారం నేరమే అవుతుందని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ రాజీవ్ షక్దేహర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే బెంచ్‌లోని మరో న్యాయమూర్తి జస్టిస్ సీ హరిశంకర్ మాత్రం ఆ ఆదేశాలతో విభేధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21లను సెక్షన్ 375(మినహాయింపు 2) ధిక్కరిస్తుందనడానికి ఎలాంటి మద్ధతు కనిపించడం లేదని, కాబట్టి, భార్యపై బలవంతపు శృంగారం నేరం కిందకు రాదని అన్నారు. ఈమేరకు జస్టిస్ రాజీవ్ ఇచ్చిన ఆదేశాలను అంగీకరించడం లేదంటూ పేర్కొన్నారు. దీంతో భిన్నాభిప్రాయాల తీర్పు వెలువడినట్లయ్యింది. బుధవారం ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు మారిటల్ రేప్‌పై ఈ తరహా తీర్పు వెలువరించింది. ఐపీసీలోని అత్యాచార సెక్షన్-375(మినహాయింపు 2) నుంచి మారిటల్ రేప్‌నకు మినహాయింపు ఇవ్వడంపై అభ్యంతరాలతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఏడేళ్ల కిందట(2015లో) ఈ వ్యవహారంపై మొదటి పిటిషన్ దాఖలుకాగా, ఆ తర్వాత మరికొన్ని దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లకు కౌంటర్‌గా.. పురుష హక్కుల సంఘాలు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేశాయి. మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించకూడదనే ఆ పిటిషన్లో కోరాయి పురుష హక్కుల సంఘాలు. అయితే ఈ పిటిషన్లపై ఈ ఏడాది జనవరి నుంచి రోజూవారీ వాదనలు జరిగాయి. చివరికి.. తీర్పును ఫిబ్రవరి 21వ తేదీన రిజర్వ్‌లో ఉంచింది కోర్టు. గతంలో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించలేమంటూ కేంద్రం పేర్కొనగా.. ఢిల్లీ హైకోర్టు నోటీసుల నేపథ్యంలో తమ ప్రకటనను పరిశీలిస్తామంటూ డబుల్ గేమ్ ఆడింది. మరోవైపు మారిటల్ రేప్ నేరం కాదంటూ సుప్రీం కోర్టు సైతం కొన్ని కేసుల్లో తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తాజా తీర్పుపై.. పిటిషనర్లు సుప్రీంకు వెళ్లేందుకు మార్గం సుగమం కావడం గమనార్హం. చదవండి: సెక్స్ బానిసగా భార్య.. కూతురి ముందే అసహజ శృంగారం! -
ముగ్గురు అధికారులకు జైలుశిక్ష, జరిమానా
సాక్షి, అమరావతి: కోర్టుధిక్కార కేసులో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, ఐఏఎస్ అధికారి జి.వీరపాండియన్‌లకు హైకోర్టు ఒక్కొక్కరికి నెలరోజుల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. అరుణ్‌కుమార్, వీరపాండియన్ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరుకావడంతో అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుగా శిక్ష, జరిమానా అమలును ఆరువారాలు నిలుపుదల చేసింది. తీర్పు వెలువరించే సమయానికి పూనం మాలకొండయ్య హాజరుగాకపోవడంతో ఆమెకు విధించిన శిక్షను నిలుపుదల చేయలేదు. మే 13వ తేదీలోపు రిజిస్ట్రార్ (జ్యుడిషియల్) ముందు లొంగిపోవాలని పూనం మాలకొండయ్యను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం తీర్పు చెప్పారు. ఈ తీర్పుపై పూనం మాలకొండయ్య అత్యవసరంగా సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పు అమలును తదుపరి విచారణ వరకు నిలుపుదల చేసింది. కర్నూలు జిల్లా సెలక్షన్ కమిటీ తనను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్–2గా ఎంపిక చేయకపోవడాన్ని సవాలుచేస్తూ ఎన్.ఎం.ఎస్.గౌడ్ 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు పిటిషనర్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఆ ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ గౌడ్ కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ ధిక్కార పిటిషన్‌ను జస్టిస్ దేవానంద్ విచారించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేసిన తరువాతనే కోర్టు ఆదేశాలను అమలు చేశారని, కోర్టు ఆదేశాల అమలులో ఉద్దేశపూర్వక జాప్యం కనిపిస్తోందని చెప్పారు. కోర్టు ఉత్తర్వులను సకాలంలో అమలుచేసే పరిస్థితి లేకపోతే, గడువు పెంచాలని కోరుతూ అఫిడవిట్ వేయవచ్చని, అధికారులు ఆ పని చేయలేదని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను అమలుచేసే సదుద్దేశం అధికారుల్లో కనిపించడం లేదన్నారు. అధికారులది ఉద్దేశపూర్వక ఉల్లంఘనేనంటూ ముగ్గురు అధికారులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
రమ్య హత్య కేసులో సంచలన తీర్పు.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య హత్య కేసులో గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘దిశ’ స్ఫూర్తితో ఈ కేసు దర్యాప్తులో సమర్థవంతంగా వ్యవహరించిన పోలీసులను, ప్రాసిక్యూషన్ న్యాయవాదిని ఆయన అభినందించారు. మహిళల రక్షణ, భద్రత పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని ఈ కేసు చాటి చెప్పిందన్నారు. చదవండి: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు మహిళలు, యువతులు, బాలికలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ తీర్పు గట్టి సందేశాన్ని పంపిందని వ్యాఖ్యానించారు. నేరాల నిరోధంలో, దురదృష్టవశాత్తూ జరిగే నేరాల దర్యాప్తులో పోలీసులు ఇదే స్ఫూర్తితో పని చేసి మహిళల భద్రత, రక్షణకు పెద్దపీట వేయాలన్నారు. ఈ తరహా కేసుల సత్వర పరిష్కారం కోసం ఇదే చిత్తశుద్ధితో పనిచేసి, దోషులకు కఠినంగా శిక్షలు పడేలా కృషి చేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన వెలువరించింది. కాగా, ఇదే విషయమై పోలీసు శాఖకు అభినందనలు అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు. చదవండి: రమ్య హత్య కేసులో సంచలన తీర్పు: కుటుంబ సభ్యులు ఏమన్నారంటే.. విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నాను. ఈ కేసు విషయంలో వేగంగా దర్యాప్తు పూర్తిచేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ శాఖకు అభినందనలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2022