సాక్షి, న్యూఢిల్లీ: అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 49 మంది దోషుల్లో 38 మందికి మరణశిక్ష విధించగా.. 11 మందికి జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు జడ్జి ఏఆర్ పాటిల్ తీర్పు వెలవరించారు. ఒక కేసులో ఇంత మందికి ఉరిశిక్ష విధించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.
కాగా, అహ్మదాబాద్‌లో రద్దీ ప్రాంతాలే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు 2008లో 18 చోట్ల వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి, మున్సిపల్ ఎల్జీ ఆస్పత్రి, కార్లు, పార్కింగ్ ప్రదేశాల్లో జరిగిన పేలుళ్లలో 58 మంది మృతి చెందగా, 200 మందికి గాయాలయ్యాయి. కొన్ని బాంబులను ముందే గుర్తించిన భద్రతా దళాలు వాటిని నిర్వీర్యం చేశాయి. దీంతో కొంత ప్రాణనష్టం తప్పింది.
చదవండి: (వివక్ష, వివాదం ఉంటేనే జోక్యం)
Comments
Please login to add a commentAdd a comment