sessions court
-
ముందస్తు బెయిల్ ఇవ్వండి: కోర్టులో రేవణ్ణ పిటిషన్
బెంగళూరు: ఒక మహిళ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి హెచ్డి రేవణ్ణ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. బెయిల్ కోసం బెంగళూరు సెషన్స్‌కోర్టులో శుక్రవారం(మే3) పిటిషన్ వేశారు. తన తల్లిని రేవణ్ణ ఎత్తుకుపోయారని రేవణ్ణ ఫామ్‌హౌజ్‌లో పనిచేసే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని కేఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో రేవణ్ణపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల(సెక్స్ స్కాండల్) వీడియోల కేసులో రేవణ్ణ శుక్రవారం సిట్ ముందుకు రావాల్సి ఉండగా ఆయన గైర్హాజరయ్యారు. -
ఊపిరి ఉన్నంత వరకు జైల్లోనే
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని బొటానికల్‌గార్డెన్ వద్ద రెండు గోనె సంచుల్లో ఏడు ముక్కలుగా దొరికిన బింగి దారుణహత్య కేసులో కూకట్పల్లి సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. నలుగురిని దోషులుగా తేలుస్తూ వారు బతికి ఉన్నతంకాలం జైల్లోనే ఉండేలా జీవితఖైదు విధించింది. బిహార్‌లోని బాంకా జిల్లా మోహన్‌మల్టీ గ్రామానికి చెందిన బింగి అలియాస్ పింకి అలియాస్ శాలినిది నిరుపేద కుటుంబం. రాజస్తాన్‌లో ఓ ఇటుకల పరిశ్రమలో పనిచేసే ఈమె తండ్రి దబ్బోలెయ్యా ఏడాదికి ఓసారి మాత్రమే సొంతూరుకు వచ్చి వెళ్లేవాడు. 2005లో ఉత్తరప్రదేశ్‌లోని సన్బల్ జిల్లా చాందూసిటౌన్కు చెందిన దినేష్ తో బింగి వివాహం జరగ్గా, వీరికి ముగ్గురు సంతానం. భర్తతో విభేదాలు ఏర్పడిన తర్వాత బింగికి చాందూసి ప్రాంతానికే చెందిన వికాస్ కశ్యప్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వికాస్‌తోపాటు ఒక కుమారుడిని తీసుకొని బింగి 2017లో సొంతూరుకు వెళ్లింది. ఈ క్రమంలోనే అక్కడ వికాస్‌కు మరో మహిళ మమత ఝాతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. దీంతో బింగిని వికాస్‌ను వదిలిపెట్టాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వికాస్, భర్త అనిల్ ఝాలతో కలిసి మమత హైదరాబాద్‌కు వచ్చింది. అప్పటికే మమత ఝా కుమారుడు అమర్‌కాంత్ ఝా నగరంలోని దలాల్ స్ట్రీట్ బార్లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. వీరంతా కలిసి సిద్ధిఖీనగర్‌లోని ఓ ఇంట్లో దిగారు. వికాస్, మమత సిద్ధిఖీనగర్‌లోనే చాట్‌బండార్ నిర్వహించేవారు. హైదరాబాద్‌కు వచ్చి హతం: అతికష్టం మీద వికాస్ చిరు నామా తెలుసుకొని బింగి వీరి వద్దకు చేరుకుంది. అప్పటి నుంచి వికాస్, మమత మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పటికే బింగి 8 నెలల గర్భిణి. ఆమెను ఆస్పత్రికి తీసు కెళితే ఖర్చు అవుతుందని, బిడ్డ పుడితే వికాస్ డబ్బులన్నీ వారికే ఖర్చుపెట్టాల్సి వస్తుందని భావించిన మమత ఆమె హత్యకు పథకం వేసింది. దీనికి వికాస్ సహా మిగిలిన వారూ సహకరించడానికి అంగీకరించారు. 2018 జనవరి 27 రాత్రి 12 గంటల ప్రాంతంలో మమత, వికాస్‌లు బింగితో గొడవపడ్డారు. ఈ క్రమంలో మమత బింగి మెడ పట్టుకుని బలంగా గోడవైపు తోసింది. దీంతో బింగి కుప్పకూలిపోగా మమత, వికాస్ ఆమె నోరు, కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకున్నారు. మమతతోపాటు ఆమె భర్త అనిల్ ఝా, కుమారుడు అమర్‌కాంత్ ఝా బింగి శరీరంపై ఇష్టమొచి్చనట్టు పిడిగుద్దులు కురిపించారు. దీంతో బింగి చనిపోయింది. మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి.... బింగి మృతదేహాన్ని ఒకరోజంతా బాత్రూమ్లోనే ఉంచారు. మర్నాడు అమర్‌కాంత్ ఎలక్ట్రికల్ కటింగ్ మెషీన్, రెండు గోనె సంచులు తీసుకొచ్చాడు. మెషీన్‌తో బింగి తల, మొండెం, కాళ్లు, చేతులు ముక్కలుగా చేసి రెండు గోనె సంచుల్లో ప్యాక్ చేశారు. అమర్‌కాంత్ తాను పనిచేస్తున్న బార్లో ఫ్లోర్ మేనేజర్, ఒడిశావాసి అయిన సిద్ధార్థ బర్దన్‌కు చెందిన బైక్ తీసుకొచ్చాడు. మమత సాయంతో గోనె సంచుల్నీ తీసుకువెళ్లి బొటానికల్ గార్డెన్ వద్ద పడే శారు. దీనిపై జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల ద్వారా సమాచారం అందుకున్న గచ్చి»ౌలి పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ లో నీలిరంగు చొక్కా ధరించి.. ముఖానికి కళ్లద్దాలు పెట్టుకున్న వ్యక్తి, గోనెసంచులతో మహిళ వెనుక కూర్చు న్న దృశ్యాలు కనబడ్డాయి. నిందితులు వినియోగించిన ఆ బైక్ బౌద్దనగర్‌కు చెందిన విజయ్‌కుమార్ బాద్రే పేరు మీద ఉంది. అతడి నుంచి 2009లో శశికుమార్‌గౌడ్ వద్దకు చివరకు సిద్ధార్థ బర్దన్ చేతికి వచ్చింది. ఇతడు హఫీజ్‌నగర్‌లో రాంగ్రూట్లో వెళుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో విధించిన ‘స్పాట్ పేమెంట్ చలాన్’ద్వారా అతడి ఫోన్ నంబరు తెలిసింది. అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, అమర్‌కాంత్, మమత, వికాస్, అనిల్ పేర్లు వెలుగులోకి వచ్చి కేసు ఓ కొలిక్కి వచ్చింది. 13 రోజుల్లోనే పోలీసులు ఈ కేసులో నిందితులను అరెస్టు చేశారు. ఆ తర్వాతే హతురాలు బింగి అని తేలింది. కేసు దర్యాప్తు చేసిన గచ్చిబౌలి పోలీసులు నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేశారు. కేసు విచారించిన కూకట్‌పల్లిలోని ఆరో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ కోర్టు దోషులుగా తేలిన నలుగురూ బతికి ఉన్నంత కాలం జైల్లోనే ఉండేలా శిక్ష విధించింది. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఇన్స్పెక్టర్ ఎం.గంగాధర్ (ప్రస్తుతం ఏసీపీ) దాఖలు చేసిన చార్జ్‌షీట్ పోలీసు అకాడమీలో ఓ సబ్జెక్ట్‌గా మారింది. -
ఎర్రచందనం స్మగ్లర్‌కు ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్: తమిళనాడు తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలూకా, ఇరుంజీ గ్రామానికి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ ధనపాల్ రాజా కు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.పది లక్షల జరిమానా విధిస్తూ రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ కోర్టు జడ్జి నాగరాజు సోమవారం తీర్పు చెప్పినట్లు ఆ కోర్టు ఏపీపీ కె.నగేష్ తెలిపారు. కోర్టు కానిస్టేబుళ్లు నందకుమార్, శివకుమార్ తెలిపిన కేసులోని వివరాల మేరకు.. శేషాచలం అటవీ ప్రాంతంలోని ఎర్రచందనం దుంగల రక్షణ కోసం ఎస్వీఎన్పీ శ్యామల రేంజ్ నాగపట్ల సెక్షన్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ హరిబాబు, సిబ్బంది 2016 ఆగస్టు 29వ తేదీ సాయంత్రం కూంబింగ్ నిర్వహించారు. చెట్లు నరుకుతున్న శబ్దం విని పోలీసులు తోళ్లగుంట రిజర్వు ఫారెస్ట్ వద్దకు వెళ్లగా సుమారు 20 నుంచి 30 మంది స్మగ్లర్లు పోలీసులపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు తమ రక్షణ కోసం ఉన్నతాధికారుల ఆదేశాలతో రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు పరారయ్యారు. 2016 ఆగస్టు 30వ తేదీ రాత్రి పోలీసులు అదే ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించి నిందితుడు ధనపాల్ రాజాని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి నిందితుడు ధనపాల్ రాజాకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా సొమ్ము చెల్లించని యెడల మరో రెండేళ్లు అధికంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. -
అత్యాచార కేసులో ఆశారాం బాపునకు జీవిత ఖైదు
అహ్మదాబాద్: దశాబ్దకాలం నాటి అత్యాచారం కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త ఆశారాం బాపూ దోషిగా తేలిన విషయం తెలిసిందే. 2013లో తన ఆశ్రమంలో నివసిస్తున్న మహిళపై లైంగికదాడి కేసులో గాంధీనగర్ సెషన్స్ కోర్టు సోమవారం ఆయన్ను దోషిగా తేల్చింది. ఈ కేసులో తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి.. తాజాగా నేడు (జనవరి31) అతనికి జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్లు వెల్లడించారు. కాగా గుజరాత్ మోతేరాలోని ఆశారాం బాపూ ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో 2001 నుంచి 2006 వరకు తనపై గురువు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్టు ఓ మహిళ 2013లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూరత్‌కు చెందిన మహిళ ఆశారాం బాపూతో సహా ఏడుగురిపై అత్యాచారం, అక్రమ నిర్బంధం కేసు పెట్టారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరిపిన గాంధీనగర్‌లోని సెషన్స్ కోర్టు ఈ కేసులో ఆశారాంను దోషిగా తేల్చింది. ఇదే కేసులో సరైన ఆధారాలు లేనందున ఆశారాం భార్య, కుమార్తె, కుమారుడితో పాటు మరో నలుగురు మహిళలను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆశారాంకు జీవిత ఖైదు విధించింది. కాగా 81 ఏళ్ల ఆశారం బాపూ ప్రస్తుతం మరో అత్యాచారం కేసులో జోధ్‌పూర్ జైలులో శిక్షననుభవిస్తున్నారు. జోధ్‌పూర్ ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదవ్వగా..2018లో జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. అతడిని ఇండోర్‌లో అరెస్టు చేసిన పోలీసులు అనంతరం జోధ్‌పూర్‌కు తరలించారు. 2013 నుంచి జోధ్‌పూర్ జైలులోనే ఉన్నారు. ప్రముఖ అధ్యాత్మిక గురువుగా దేశ విదేశాల్లో శిష్యులను సంపాదించుకున్న ఆశారం చివరకు ఇలా కటకటాలపాలయ్యారు. చదవండి: చైనా సంస్థ నుంచి డబ్బులు తీసుకొనే బీబీసీ తప్పుడు ప్రచారం' -
లఖీంపూర్ ఖేరి కేసు విచారణకు ఐదేళ్లు పడుతుంది
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అమాయకులైన రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్న లఖింపూర్ ఖేరి హింసా కాండ కేసు విచారణ పూర్తి కావడానికి దాదాపు అయిదేళ్లు పడుతుందని సుప్రీంకోర్టుకు సెషన్స్ కోర్టు విన్నవించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నిందితుడిగా ఉన్న ఈ కేసులో 208 మంది సాక్షులు, 171 డాక్యుమెంట్లు, 27 ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరెటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికలు ఉన్నాయని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టుకి తెలిపారు. ఆశిశ్ మిగ్రా బెయిల్ విచారణ సందర్భంగా గత నెలలో ఈ కేసు విచారణ పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుందని సుప్రీం అడిగిన ప్రశ్నకు సెషన్స్ కోర్టు ఈ విధంగా బదులిచ్చింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, వి రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఒక నివేదికను సుప్రీంకు సమర్పించింది. తదుపరి విచారణను జనవరి 19కి ధర్మాసనం వాయిదా వేసింది. కాగా అక్టోబర్ 3, 2021న నూతన వ్యవసాయం చట్టాలకు వ్యతిరేకంగా లఖింపూర్ ఖేరీ జిల్లాలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు చెలరేగిన హింసాకాండలో ఎనిమిది మంది మరణించిని విషయం తెలిసిందే. చదవండి: ఆప్‌కు భారీ షాక్.. పదిరోజుల్లో 160 కోట్లు చెల్లించాల్సిందే, లేకుంటే ఆఫీస్‌కు సీజ్! -
అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు
-
సంచలన తీర్పు: దేశ చరిత్రలో తొలిసారి 38 మందికి మరణశిక్ష
సాక్షి, న్యూఢిల్లీ: అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 49 మంది దోషుల్లో 38 మందికి మరణశిక్ష విధించగా.. 11 మందికి జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు జడ్జి ఏఆర్ పాటిల్ తీర్పు వెలవరించారు. ఒక కేసులో ఇంత మందికి ఉరిశిక్ష విధించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. కాగా, అహ్మదాబాద్‌లో రద్దీ ప్రాంతాలే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు 2008లో 18 చోట్ల వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి, మున్సిపల్ ఎల్జీ ఆస్పత్రి, కార్లు, పార్కింగ్ ప్రదేశాల్లో జరిగిన పేలుళ్లలో 58 మంది మృతి చెందగా, 200 మందికి గాయాలయ్యాయి. కొన్ని బాంబులను ముందే గుర్తించిన భద్రతా దళాలు వాటిని నిర్వీర్యం చేశాయి. దీంతో కొంత ప్రాణనష్టం తప్పింది. చదవండి: (వివక్ష, వివాదం ఉంటేనే జోక్యం) -
వర్షిత కేసు: చిత్తూరు కోర్టు సంచలన తీర్పు
సాక్షి, చిత్తూరు: సంచలనం సృష్టించిన వర్షిత హత్యాచారం కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చిన్నారి వర్షితపై కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన రఫీని దోషిగా తేలుస్తూ ఉరి శిక్ష విధించింది. గతేడాది నవంబర్ 7న చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్లో తన తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చిన చిన్నారిని మదనపల్లి మండలానికి చెందిన లారీ క్లీనర్ మహమ్మద్ రఫీ అత్యాచారం చేసి ఆపై హత మార్చాడు. చిన్నారికి చాక్లెట్ తీసిస్తానని చెప్పి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందుతుడిని లారీ క్లీనర్ రఫీగా గుర్తించారు. అయితే హత్యానంతరం రఫీ ఛత్తీస్‌గఢ్‌కు పారిపోయి పోలీసులు గుర్తుపట్టకుండా గుండు గీయించుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదులో భాగంగా పోలీసులు పకడ్బందీగా నిఘా పెట్టి రఫిని పట్టుకున్నారు. రఫిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు అతనిపై హత్య, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇతడు గతంలోనూ పలువురు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడినట్లు చార్జిషీటులో పేర్కొన్నారు. డిసెంబర్ 30వ తేదీ నుండి ఈ ఏడాది జనవరి మొదటి వారం వరకు 41 మంది సాక్షులను విచారించిన కోర్టు ఈ రోజు తుది తీర్పు వెలువరించింది. తీర్పుపై స్పందించిన హోంమంత్రి సుచరిత: చిత్తూరు సెషన్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై హోంమంత్రి సుచరిత స్పందించారు. చిన్నారి పోస్టు మార్టం రిపోర్టు ఆధారంగా.. పోలీసులు సేకరించిన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించడంతో హత్య జరిగిన 17 రోజుల్లోనే పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. డిసెంబర్ 30వ తేదీ నుండి ఈ ఏడాది జనవరి మొదటి వారం వరకు 41 మంది సాక్షులను విచారించిన కోర్టు ఎట్టకేలకు ఈ రోజు తుది తీర్పు వెల్లడించింది. బాలికపై అత్యాచారం, హత్య కేసులో అరెస్టయిన నిందితుడికి పోస్కో చట్టం కింద మరణశిక్ష విధించడం ఆంధ్రప్రదేశ్‌లో ఇదే మొదటిసారని మంత్రి పేర్కొన్నారు. చదవండి: ఆడుకుంటూనే.. పోయింది! లైంగికదాడి.. హత్య! -
సైనైడ్ పదార్థమిచ్చి అమ్మాయిలను దారుణంగా..
మంగళూరు : 20 మంది యువతులను దారుణంగా రేప్ చేసి ఆపై హత్య చేసిన సీరియల్ కిల్లర్' సైనైడ్' మోహన్‌కు జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్లు మంగళూరు సెషన్స్ కోర్టు మంగళవారం పేర్కొంది. కాగా 2006లో కేరళలోని కస్రాగోడ్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతిని రేప్ చేసి హతమార్చినందుకుగానూ మోహన్‌కు జీవిత ఖైదుతో పాటు రూ. 25వేల జరిమానా విధిస్తున్నట్లు సెషన్స్ కోర్టు జడ్జి సయీదున్నిసా తన తీర్పులో వెల్లడించారు. వివరాలు.. సైనైడ్ మోహన్.. ఒంటరిగా ఉన్న అమ్మాయిలను ట్రాప్ చేసి ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానంటూ మాయ మాటలు చెప్పి మొదట రూంకు తీసుకెళతాడు. ఆ తర్వాత సైనైడ్ పూసిన పదార్థాలను వారికి అందించి రేప్ చేస్తాడు. తర్వాత వారు చనిపోయారని నిర్దారించుకొని మెల్లగా అక్కడినుంచి జారుకుంటాడు. ఇలా ఇప్పటివరకు 20మంది యువతులను ట్రాప్ చేసి హతమార్చాడు. కాగా ఇదే విధంగా 2006 జనవరి 3న మంగళూరులోని క్యాంప్కో యూనిట్‌కు పని నిమ్మిత్తం వచ్చిన 23ఏళ్ల కేరళ యువతితో మోహన్ పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి మైసూరులోని లాడ్జికి తీసుకెళ్లి రాత్రంతా అక్కడే గడిపారు. తెల్లవారుజామున బస్టాండ్‌కు చేరుకొని యువతి ఒంటిపై ఉన్న నగలన్ని తీసుకొని గర్భనిరోధక మాత్ర అని నమ్మించి సైనైడ్ పూసిన పదార్థాన్ని అందించాడు. పదార్థాన్ని మింగిన ఆమె చనిపోయిందని నిర్థారించుకొని అక్కడే వదిలిపెట్టి వెళ్లాడు. కాగా 2009లో బంట్వాల్లో పోలీసులకు పట్టుబడిన మోహన్ 20 మంది యువతుల్ని తానే చంపినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. -
ఆమె ఇష్టప్రకారమే.. అందుకే అతడు నిర్దోషి!
న్యూఢిల్లీ: ‘‘బాధితురాలు చెప్పిన ప్రకారం ఆమెకు నవంబరు 2, 2015లో అతడితో వివాహం జరిగింది. అయితే జూలై 5, 2016 తర్వాత అతడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పింది. అయితే ఆనాటికి వాళ్లిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం ఉంది కాబట్టి... దీనిని అత్యాచారంగా పరిగణించలేం. అందుకే అతడు నిర్దోషి’’ అని ఢిల్లీ అదనపు సెషన్స్ కోర్టు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని విడుదల చేసింది. అత్యాచారం జరిగే నాటికి బాధితురాలు నిందితుడి భార్యగా ఉన్నందున దానిని నేరంగా పరిగణించలేమని పేర్కొంది. వివరాలు... పంజాబ్‌కు చెందిన ఓ మహిళకు 2015లో పెళ్లి జరిగింది. అయితే తనను పెళ్లి చేసుకున్న వ్యక్తి గతంలో దొంగతనం కేసులో దోషిగా తేలి.. జైలు శిక్ష అనుభవించాడని ఆమెకు ఆలస్యంగా తెలిసింది. దీంతో మనోవేదనకు గురైన సదరు మహిళ.. భర్తకు చెప్పకుండా ఢిల్లీకి వెళ్లి.. అక్కడే జీవించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో కొన్నిరోజులకు ఆమె జాడను కనుక్కున్న భర్త.. తనతో కలిసి జీవించాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు వారి కాపురం సజావుగానే సాగింది. అయితే కొన్నాళ్ల తర్వాత.. తాను కష్టపడి సంపాదించుకున్న రూ. 2 లక్షలను అతడు దొంగతనం చేశాడంటూ సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. గతంలో కూడా ఇలాంటి పనులు చేశాడని.. ఎప్పటికైనా మారతాడని ఎదురుచూశానని.. కానీ అతడిలో ఎలాంటి మార్పు రాలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్లీ అతడు భార్య దగ్గరికి తరచుగా వెళ్లేవాడు. ఈ క్రమంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. ఈ కేసును విచారించిన న్యాయస్థానం... వాళ్లిద్దరూ చాలారోజుల పాటు కలిసే ఉన్నారని.. కేవలం డబ్బు విషయంలో భేదాభిప్రాయాలు తలెత్తడంతోనే ఇప్పుడు బాధితురాలు కేసు నమోదు చేసిందని పేర్కొంది. ఆమె ఇష్టప్రకారమే అతడితో శారీరక సంబంధానికి సమ్మతించిందని తన మాటల ద్వారా అర్థమైందని.. కాబట్టి అతడిని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. అప్పుడు అంగీకరించినా.. కేసు పెట్టవచ్చు కదా! కాగా ఈ కేసు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో.. ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం గతంలో పేర్కొన్న అంశాలను విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. దీనిని వైవాహిక అత్యాచారంగా పరిగణించవచ్చు కదా అని అభిప్రాయపడుతున్నారు. ‘‘వివాహం అనగానే భార్య ఎల్లవేళలా సిద్ధంగా ఉండి.. భర్తతో శారీరక సంబంధాలకు సమ్మతి తెలుపుతుందని అర్థం కాదు. భార్య సమ్మతితోనే భర్త ఈ సంబంధాన్ని కొనసాగించాల్సి ఉంటుంది’ అని ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, సీ హరిశంకర్‌తో కూడిన ధర్మాసనం గతంలో పేర్కొంది. ఈ అంశంపై విచారణ సందర్భంగా... లైంగిక హింస విషయంలో భాగస్వామిని బలవంతపెట్టడం, భయపెట్టడం వంటి చర్యలను మాత్రమే నేరంగా పరిగణించాలని, అలాంటివి లేనప్పుడు దీనిని నేరంగా పరిగణించలేమని మారిటల్ రేప్ అంశాన్ని వ్యతిరేకిస్తున్న పురుషుల సంక్షేమ ట్రస్ట్ అనే ఎన్జీవో సంస్థ వాదించగా.. ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు. లైంగిక దాడి కోసం బలవంతపెట్టారా? గాయాలయ్యాయా అని చూడాల్సి అవసరం ఇప్పుడు లేదని, రేప్ నిర్వచనం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని ధర్మాసనం పేర్కొంది. ‘శారీరంగా బలవంతపెట్టడమనేది కచ్చితమైన షరతు ఏమీ కాదు. భార్యను ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి.. శృంగారంలో పాల్గొంటేనే గృహావసరాలు, పిల్లల ఖర్చుల కోసం డబ్బులు ఇస్తానని భర్త ఒత్తిడి చేయవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో భార్య అందుకు ఒప్పుకున్నా.. ఆ తర్వాత ఆమె భర్తకు వ్యతిరేకంగా రేప్ కేసు పెట్టవచ్చు. అది జరిగే అవకాశముంది’ అని ధర్మాసనం పేర్కొంది. గృహహింస నిరోధక చట్టం, వివాహిత మహిళల వేధింపుల నిరోధక చట్టం, వేరుగా ఉంటున్న భార్యతో బలవంతపు శృంగారం నిరోధించే చట్టాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని, ఈ నేపథ్యంలో భార్యతో శృంగారం నేరం కాబోదని పేర్కొంటున్న సెక్షన్ 375ను మార్చాల్సిన అవసరం ఏముందని మారిటల్ రేప్‌ను వ్యతిరేకిస్తున్న ఓ పిటిషనర్ వాదించగా.. ఇన్ని చట్టాల పరిధిలో ఉన్నప్పుడు సెక్షన్ 375లో మాత్రం ఎందుకు మినహాయింపు ఇవ్వాలని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించిన తీరును ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు. -
కోర్టులో కాల్పులు..ఇద్దరు లాయర్ల మృతి
-
కోర్టులో కాల్పులు..ఇద్దరు లాయర్ల మృతి
లాహోర్ : పాకిస్తాన్‌లోని లాహోర్ సెషన్స్ కోర్టులో మంగళవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు లాయర్లు మృతిచెందారు. మృతిచెందిన వారు రాణా ఇష్తియక్, ఓవైస్ తాలిబ్ అనే లాయర్లుగా గుర్తించారు. కాల్పులు జరిపిన కాషిఫ్ రాజ్‌పుత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు రాణా ఇష్తియక్, కాషిఫ్ రాజ్‌పుత్‌కు వరసకు సోదరుడవుడాడు. కాల్పులను అడ్డుకోబోయిన తాలిబ్‌పై కూడా రాజ్‌పుత్ కాల్పులు జరపడంతో తీవ్రగాయాలు అయ్యాయి. తాలిబ్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ కాసేపటికే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి షెబాజ్ షరీఫ్ ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. -
జిషా కేసు.. ఇస్లాంను దోషిగా తేల్చిన కోర్టు
-
జిషా కేసు.. ఇస్లాంను దోషిగా తేల్చిన కోర్టు
సాక్షి, తిరువనంతపురం : ఒక్క కేరళలోనే కాదు.. యావత్ దేశంలో సంచలనం సృష్టించిన జిషా హత్యాచార కేసులో కేరళ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఆరోపణలు ఎదుర్కుంటున్న నిందితుడు అమీర్ ఉల్ ఇస్లాంను దోషిగా కోర్టు నిర్ధారించింది. శిక్ష ఇంకా ఖరారు చెయ్యలేదు. కాగా, మృగ పైశాచిక చేష్టలకు సాక్ష్యంగా నిలిచిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఎర్నాకులం జిల్లా పెరంబవూర్ నుంచి కురుప్పామ్‌పడి లో స్థిరపడింది జిషా కుటుంబం. న్యాయ విద్యార్థి అయిన 30 ఏళ్ల జిషా గతేడాది ఏప్రిల్ 28న కెనాల్ బండ్లో ఉన్న ఆమె ఇంట్లోనే అతి కిరాతకంగా హత్యాచారానికి గురైంది. వాంఛ తీర్చుకోవడానికి ఆమెను అతి కిరాతకంగా హింసించి చంపారు. మర్మాంగాలతోసహా శరీరంపై కత్తితో 30 పొట్లు పొడిచారు. ఆ సమయంలో ఆమె తల్లి, సోదరి ఇంట్లో లేరు. ఇంట్లోంచి అరుపులు వినిపిస్తున్నా స్థానికులు స్పందించలేదు. ఘటన తర్వాత కేరళ అగ్నిగుండగా మారింది. ఇంట్లో ఉన్న మహిళలకు కూడా రక్షణ లేకుండా పోయిందని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వినిపించాయి. ఈ దాషీక్టంపై మహిళా, ప్రజా సంఘాలు రోడెక్కి ఆందోళన చేపట్టాయి. పైగా బాధితురాలు దళిత వర్గానికి చెందటంతో అది మరింత ఉధృతం అయ్యింది. కేసు పురోగతిలో జాప్యం జరగటంతో ప్రభుత్వంపై కేరళ ప్రజానీకం మండిపడింది. చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వ ఓటమికి ప్రత్యక్షంగా ఓ కారణం కూడా అయ్యింది. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా దర్యాప్తు చేయగా.. ఘటన జరిగిన రెండు నెలల తరువాత తమిళనాడు కాంచీపురంలో అస్సాంకు చెందిన అమీర్ ఉల్ ఇస్లాం ను పోలీసులు అరెస్టు చేశారు. కూలీ పనులు చేసుకునే అతను మద్యం మత్తులోనే ఆ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. హత్య అనంతరం అమీర్ కాంచీపురానికి పారిపోయి అక్కడ ఉద్యోగం చేశాడు. అతని గది నుంచి హత్యకు వాడిన మారణాయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1500 పేజీల ఛార్జీ షీట్‌ను గతేడాది సెప్టెంబర్‌లోనే కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో తొలుత సబు అనే వ్యక్తి పేరు తెరపైకి రాగా.. కారణం ఏంటో తెలీదుగానీ అతను ఈ ఏడాది జూలై లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక మరో వ్యక్తి స్కెచ్‌ను పోలీసులు విడుదల చేయగా.. అతను ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఏడీజీపీ సంద్య ఆధ్వర్యంలో మళ్లీ విచారణకు ఆదేశించింది. 290 పేజీల డాక్యుమెంట్లు, 36 మెటీరియల్ సాక్ష్యాలు, ఐదుగురు సాక్ష్యుల విచారణ.. ఫోరెన్సిక్ నివేదిక తదితరాలు ఇస్లాం తప్పు చేసినట్లు తేల్చాయి. ఇక ఏప్రిల్ 4, 2017న ఈ కేసులో విచారణ ప్రారంభమైంది. తన క్లయింట్‌ను కేసులో ఇరికించారని ఇస్లాం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. చివరకు నేరం తనే చేశానని గతంలో ఒప్పుకున్న స్టేట్మెంట్ను పరిగణనలోకి తీసుకున్న ఎర్నాకులం సెషన్స్ కోర్టు అమీర్ ఉల్ ఇస్లాంను దోషిగా తేల్చింది. -
మరో ఆరుగురి పై గురి
సాక్షి, చెన్నై: మరో ఆరుగురిని గురి పెట్టి విచారణకు మద్రాసు హైకోర్టు కసరత్తులు చేపట్టింది. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఆరుగురు జిల్లా, సెషన్స్ కోర్టుల్లో మేజిస్ట్రేట్లుగా పనిచేస్తున్న, చేసిన వాళ్లే. వీరిపై వచ్చిన ఆరోపణల్ని పరిగణలోకి తీసుకుని త్వరితగతిన చర్యలకు విజిలెన్స్ కమిటీ రంగంలోకి దిగినట్టు సమాచారం.రాష్ట్రంలో ఇటీవల కాలంగా న్యాయ వర్గాలపై ఆరోపణలు, విమర్శలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఒకరిద్దరి కారణంగా మొత్తం వ్యవస్థ విమర్శల్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి వారిపై కొరడా ఝుళిపిస్తూ మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గ్రానైట్ స్కాంను దారి మళ్లించే యత్నం చేసిన మేలూరు కోర్టు న్యాయమూర్తి మహేంద్ర భూపతి, కిడ్నిల రాకెట్ నిందితుల్ని తప్పించే యత్నం చేసిన మరో న్యాయమూర్తి అన్భురాజ్లపై చర్యలు తీసుకున్నారు. ఇదే విధంగా మరో ఆరుగురు ఆరోపణల్ని ఎదుర్కొంటున్న వారిలో ఉన్నారు. వీరందరిపై పలు రకాల ఫిర్యాదులు, పలు మార్గాల నుంచి ఆరోపనలు వచ్చి ఉండడంతో, వీరిపై కూడా కొరడా ఝుళిపించేందుకు మద్రాసు హైకోర్టు సిద్ధమవుతోంది. వీరిలో జిల్లా, సెషన్స్ కోర్టుల్లో పనిచేస్తున్న, పనిచేసిన న్యాయమూర్తులు ఎస్. మన్వెలి, గణేషన్, వైద్యనాథన్, నల్లతంబి, పీఎస్ నందకుమార్, భవానీశ్వరి ఉన్నారు. తిరుచ్చి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మన్ వెలి ఫిబ్రవరిలో పదవీ విరమణ పొందాల్సి ఉంది. ఆ గడువుకు ఒక్క రోజు ముందుగా మన్ వెలిని సస్పెండ్ చేసి పక్కన పెట్టారు. ప్రస్తుతం ఆరోపణల్ని ఎదుర్కొంటున్న వారిలో మొదటి వరుసలో మన్వెలి ఉన్నారు. ఇక తిరుచ్చి కోర్టు న్యాయమూర్తి నందకుమార్ తన మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కుటుంబంతో కలసి ఆత్మహత్యాయత్నం సైతం చేసిన పరిస్థితి. ఇక ఈరోడ్ న్యాయమూర్తి నల్లతంబి , కారైక్కాల్ న్యాయయమూర్తి వైద్యనాథన్, కున్నూరు మేజిస్ట్రేట్ తంగరాజు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఉన్నారు. తంగరాజ్ మీద అయితే, ఏకంగా ఒక మహిళా పోలీసు అధికారి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసి ఉండడం గమనార్హం. ఇలాంటి వారి భరతం త్వరితగతిన పట్టేసి, మరొకరు తప్పులు చేయకుండా హెచ్చరించే విధంగా విచారణను త్వరితగతిన చేపట్టేందుకు మద్రాసు హైకోర్టు విజిలెన్స్ కమిటీ పరుగులు తీస్తుండడం విశేషం. కర్ణన్ ఉత్తర్వులు రద్దు: ఇదిలా ఉండగా, ఇటీవల బిన్ని మిల్లు కార్మికుల క్వార్టర్స్ ఖాళీ చేయడం వ్యవహారంలో న్యాయమూర్తి కర్ణన్ జారీ చేసిన ఉత్తర్వుల్ని ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ రద్దు చేశారు. కార్మికుల క్వార్టర్స్‌ను ఖాళీ చేయిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్నుపై తొలుత ఆదేశాలు ఇవ్వడం, తదుపరి ఆ ఆదేశాలను పోలీసులు, జిల్లా కలెక్టరు ధిక్కరించారని కేసులు దాఖలయ్యాయి. దీంతో అప్పటి జిల్లా కలెక్టర్ సుందరవల్లి, పోలీసు కమిషనర్ జార్జ్‌లను బదిలీ చేయాలని కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. తాము చర్యలు తీసుకున్నా, తమ మీద కోర్టు ధిక్కార కేసు దాఖలైందంటూ కమిషనర్, కలెక్టర్ అప్పీలుకు వెళ్లారు. వీరి వాదనల్ని విన్న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ ఇది వరకు కర్ణన్ నేతృత్వంలోని బెంచ్ దాఖలు చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇది వరకు విచారణ పూర్తి లోతుల్లోకి వెళ్లనట్టుందని బెంచ్ వ్యాఖ్యానించింది. ఇక, ఎన్నికల కోడ్ అడ్డుతో సుందర వల్లి తిరువళ్లూరుకు బదిలీ కాగా, అమ్మ జయలలిత కన్నెర్ర చేయడంతో చెన్నై కమిషనర్ జార్జ్ జైళ్ల శాఖకు మారిన విషయం తెలిసిందే. -
ఆధారాలు లేవు...
► రామచంద్రపురం మఠాధిపతి రాఘవేశ్వరస్వామిజీకి ఊరట ► అత్యాచార ఆరోపణలు కొట్టివేత సాక్షి, బెంగళూరు: రామకథ గాయని ప్రేమలతపై అత్యాచారానికి పాల్పడినట్లు సరైన ఆధారాలు లేకపోవడంతో రామచంద్రపురం మఠాధిపతి రాఘవేశ్వరస్వామిజీపై నమోదైన కేసును కొట్టివేస్తూ స్థానిక సెషన్స్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. వివరాలు... రాఘవేశ్వరస్వామీజీ తనను భయపెట్టి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ప్రేమలత దాదాపు ఏడాది క్రితం ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిపిన స్థానిక సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ముదిగౌడ ‘బాధితురాలి ఆరోపణలకు, సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో పాటు డీఎన్ఏ నివేదికకు పొంతన కుదరడం లేదు. అంతేకాకుండా చార్జ్‌షీట్ కూడా ప్రేమలత ఆరోపణలను ప్రతిబింబించడం లేదు. అందువల్ల రాఘవేశ్వరస్వామిజీపై నమోదైన కేసును కొట్టివేస్తున్నాం.’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కోర్టు తీర్పు పట్ల రామచంద్రపుర మఠం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. -
హరియాణా ‘నిర్భయ’ దోషులకు ఉరి
-
హరియాణా ‘నిర్భయ’ దోషులకు ఉరి
♦ ఫిబ్రవరిలో మానసిక వికలాంగురాలిపై హత్యాచారం ♦ పది నెలల్లో దర్యాప్తు,విచారణ పూర్తి ♦ ఏడుగురికి మరణశిక్ష; మైనర్‌పై జేజేబీ విచారణ రోహ్తక్(హరియాణా): నేపాల్‌కు చెందిన 28 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై పాశవిక హత్యాచారానికి పాల్పడిన ఏడుగురికి హరి యాణాలోని రోహ్తక్ అదనపు సెషన్స్ కోర్టు మరణశిక్ష విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. ఈ గ్యాంగ్ రేప్, హత్యలో పాలు పంచుకున్న మైనర్‌పై జువైనల్ జస్టిస్ బోర్డ్ విచారణ జరుపుతోంది. మరో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గద్దిఖేరి గ్రామంలో అక్క, బావల్తో నివసిస్తున్న నేపాల్‌కు చెందిన మానసిక వికలాంగురాలిని అదేగ్రామానికి చెందిన 9 మంది ఈ సంవత్సరం ఫిబ్రవరి 1న అపహరించి, పాశవికంగా అత్యాచారం జరిపి, అనంతరం హత్య చేసి, మృతదేహాన్ని రోహ్తక్-హిస్సార్ హైవే పక్కన ఉన్న పొలాల్లో పడేశారు. మృతదేహంపై, మర్మావయవాలపై దారుణమైన గాయాలున్నట్లు, శరీరంలో రాళ్లు, బ్లేడ్లు ఉన్న ట్లు పోస్ట్‌మార్టంలో తేలింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం లేవడంతో.. హరియాణా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పా టు చేసింది. పది నెలల్లోనే దర్యాప్తును, విచారణను ముగించి, తీర్పు ప్రకటించడం ఈ కేసు లో విశేషం. నిందితులు రాజేశ్, పవన్, ప్రమోద్, బిల్లు, మన్బీర్, మాడా, సునీల్‌లను గతవారం దోషులుగా నిర్ధారించిన జిల్లా అదనపు సెషన్స్‌కోర్టు న్యాయమూర్తి సీమా సింఘాల్ సోమవారం వారికి వివిధ సెక్షన్ల కింద ఉరిశిక్షతో పాటు ఇతర శిక్షలు, జరిమానా విధించారు. ఈ తీర్పును హైకోర్టు ధ్రువీకరించాల్సి ఉంది. తీర్పు ప్రకటిస్తూ న్యాయమూర్తి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇలాంటినేరాలు పాల్పడినవారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి. వీరికి క్షమాభిక్ష, శిక్ష తగ్గింపు, పెరోల్ మొదలైనవేవీ ఇవ్వొద్దు. నేను న్యాయమూర్తినే కాదు మనిషిని కూడా.. పురుషుల చేతిలో చిత్రహింసలకు గురయ్యే మహిళల ఆక్రందనలు వినగలను. మహిళలు బలహీనులు కాదన్న సందేశాన్ని సమాజానికి పంపాల్సిన తక్షణావసరం ఉంది. రేప్ బాధితులకు నిర్భయ, దామిని లాంటి వేరే పేర్లు అవసరం లేదు. ఇంకెన్నిసార్లు నిర్భయ చనిపోవాలి?’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు ‘నిర్భయ’ కేసులోని బాలనేరస్తుడు కేవలం మూడేళ్ల శిక్ష అనుభవించి ఆదివారం విడుదల కావడంపె దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సమయంలోనే ఈ తీర్పు వెలువడటం గమనార్హం. -
కోర్టుకు రండి
సాక్షి, చెన్నై: పరువు నష్టం దావా కేసులో విచారణకు హాజరు కావాలని డీఎంకే అధినేత ఎం.కరుణానిధికి చెన్నై మొదటి సెషన్స్‌కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 18వ తేదీన కోర్టుకు రావాలని సమన్లు జారీ చేశారు. సీఎం జయలలితకు వ్యతిరేకంగా కథనాలు ప్రచూరించినా, ఆరోపణలు గుప్పించినా పరువు నష్టం దావాలు కోర్టుల్లో దాఖలవుతున్న విషయం తెలిసిందే. ఆ మేరకు ఇటీవల సీఎం జయలలితకు వ్యతిరేకంగా ఓ వార పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా డీఎంకే అధినేత ఎం.కరుణానిధి స్పందించారు. ఆ పార్టీకి చెందిన మురసోలి పత్రికలో తనదైన శైలిలో రాసిన కథనాన్ని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తీవ్రంగా పరిగణించారు. సీఎంకు వ్యతిరేకంగా ఆధార రహిత ఆరోపణలు చేశారంటూ ఓ వార పత్రిక మీద, కరుణానిధి మీద, మురసోలి పత్రిక యాజమాన్యం మురసోలి సెల్వం మీద పరువు నష్టం దావాలు వేశారు. చెన్నై మొదటి సెషన్స్ కోర్టులో దాఖలైన ఈ దావాలు గురువారం విచారణకు వచ్చాయి. ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ వాదన విన్పించారు. వాదన అనంతరం డీఎంకే అధినేత ఎం కరుణానిధికి కోర్టుకు విచారణ నిమిత్తం హాజరు కావాలంటూ న్యాయమూర్తి ఆదినాథన్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చేనెల 18న కోర్టుకు రావాలంటూ సమన్లు జారీ చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీన విచారణకు రావాలంటూ ఆ వార పత్రిక యాజమాన్యంకు సమన్లు జారీ అయ్యాయి. -
అత్యాచారం జరిగిన మాట నిజమే
వైద్య, ఫోరెన్సిక్ నివేదికలు రుజువు చేశాయని కోర్టుకు తెలియజేసిన పోలీసులు న్యూఢిల్లీ: ఉబర్ క్యాబ్‌లో బాధిత మహిళ అత్యాచారానికి గురైన మాట నిజమేనని, ఈ విషయాన్ని వైద్య, ఫోరెన్సిక్ నివేదికలు రుజువు చేశాయని పోలీసులు మంగళవారం కోర్టుకు తెలియజేశారు. అంతేకాకుండా బాధితురాలితో అసహజ శృంగారానికి పాల్పడేందుకు నిందితుడు యత్నించాడనే విషయం కూడా నిర్ధారణ అయిందని అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజాకు తెలియజేశారు. -
సాక్షుల్ని మళ్లీ విచారించండి
న్యూఢిల్లీ: ప్రాసిక్యూషన్ తరఫు సాక్షులను మరోసారి విచారించాలని కోరుతూ ఉబర్ క్యాబ్‌లో అత్యాచార కేసు నిందితుడు శివ్‌కుమార్ యాదవ్ స్థానిక న్యాయస్థానాన్ని కోరారు. సోమవారం ఈ మేరకు ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తనతో పనిచేస్తున్న న్యాయవాదికి వాదనను బలంగా వినిపించే శక్తి లేదని యాదవ్ తర ఫు న్యాయవాది ధర్మేంద్ర మిశ్రా ఈ సందర్భంగా అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజాకు తెలియజేశారు. ప్రాసిక్యూషన్ తరఫు సాక్షుల వద్ద మరికొన్ని వివరణలను తీసుకోవాల్సి ఉందని, అందువల్ల మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం ఉందని విన్నవించారు. అయితే ఈ వాదనను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యతిరేకించారు. విచారణను జాప్యం చేసేందుకు జరుగుతున్న యత్నమని ఆరోపించారు. కాగా ఈ పిటిషన్‌పై ఈ నెల 18వ తేదీన కోర్టు ఓ నిర్ణయం తీసుకోనుంది. -
సల్మాన్‌ఖాన్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదు!
హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఘటన జరిగిన 2002 నాటికి అతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని, 2004లోగానీ ఖాన్ లైసెన్స్ పొదలేదని రవాణాశాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ సోమవారం సెషన్స్ కోర్టులో వాగ్మూలం ఇచ్చారు. నాడు సల్మాన్‌ను వైద్యపరీక్షలకు తీసుకెళ్లిన ఎస్ఐ వాంగ్మూలాన్ని కూడా కోర్టు నమోదుచేసుకుంది. అతిగా మద్యం సేవించి వాహనం నడిపి ఓ వ్యక్తి మరణానికి, నలుగురు గాయపడటానికి కారణమయ్యారని సల్మాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 13 ఏళ్లుగా విచారణ సాగుతున్న ఈ కేసులో 20కి పైగా సాక్ష్యాలను ముంబై సెషన్స్ కోర్టు విచారించింది. ఆరోపణలు రుజువైతే సల్మాన్‌కు గరిష్ఠంగా పదేళ్లు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. -
ఉబర్ రేప్ కేసులో...ముగ్గురు సాక్షుల వాంగ్మూలం నమోదు
న్యూఢిల్లీ: గత ఏడాది డిసెంబర్లో ఉబర్ క్యాబ్‌లో జరిగిన అత్యాచార కేసుకు సంబంధించి స్థానిక అదనపు సెషన్స్ కోర్టు మంగళవారం ముగ్గురు సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఇందులో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. నిందితుడు శివ్‌కుమార్ యాదవ్ వాడిన మొబైల్ ఫోన్లో నమోదైన కాల్ రికార్డు వివరాలను వోడాఫోన్ కంపెనీ అధికారి న్యాయమూర్తి కావేరీ బవేజాకు అందజేశారు. అంతకుమందు ఇదే కేసుకు సంబంధించి న్యాయస్థానం ఏడుగురు సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన సంగతి విదితమే. సహఖైదీలు దాడి చేశారు అంతకుముందు నిందితుడు శివ్‌కుమార్ యాదవ్ తర ఫు న్యాయవాది అలోక్ ద్వివేది వాదనలను వినిపిస్తూ తన క్లయింట్‌పై సహఖైదీలు దాడి చేసి కొట్టారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఘటన ఈ నెల 17వ తేదీన జరిగిందన్నారు. ఇందుకు స్పందించిన న్యాయమూర్తి దీనిపై నివేదిక ఇవ్వాలంటూ లాకప్ ఇన్చార్జిని ఆదేశించారు. తనకు తగు భద్రత కల్పించాలని నిందితుడు యాదవ్... న్యాయమూర్తిని కోరారు. యాదవ్‌కు తగు భద్రత కల్పించాలని న్యాయమూర్తి తీహార్ కారాగారం అధికారులను ఆదేశించారు. -
‘సాక్షి భద్రత పోలీసుల బాధ్యతే’
న్యూఢిల్లీ: సాక్షి భద్రత బాధ్యత పూర్తిగా పోలీసులు, రాష్ట్రానికి సంబంధించినదని ఢిల్లీ సెషన్స్ కోర్టు తెలిపింది. సాక్షికి ఇచ్చిన భద్రతను వెనక్కి తీసుకోవాలంటూ మెజిస్టేరియల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అభ్యర్థనపై స్పందించిన సెషన్స్ కోర్టుపై విధంగా తెలిపింది. సాక్షికి లేదా ఫిర్యాదు దారునికి రక్షణనివ్వడంలో కోర్టుల పాత్ర చాలా తక్కువేనని, సాక్షి లేదంటే ఇతర పౌరులెవరికైనా ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేస్తే వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులు, లేదా రాష్ట్రానిదేనని ఉద్ఘాటించింది. ఆ బాధ్యతను కోర్టులు తమ భుజాలకెత్తుకోవని అడిషనల్ సెషన్స్ జడ్జి వినోద్‌కుమార్ తెలిపారు. రక్షణ విషయమై స్థానిక పోలీసుల పట్ల అసంతృప్తి ఉంటే... పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించాలే కానీ... పిటిషనర్ కోర్టులను ఆశ్రయించడం సరికాదని చెప్పింది. 2011 హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన లక్ష్మణ్ ఇండోరియా అనే వ్యక్తి సాక్ష్యం అనంతరం, తనకు ప్రాణహాని ఉందనడంతో పోలీసులు భద్రత కల్పించారు. అయితే ఈ ఏడాది మే 1న పోలీసుల నివేదిక మేరకు భద్రతను ఉపసంహరించుకోవాలని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ లక్ష్మణ్ సెషన్స్ కోర్టుకు వెళ్లారు.