సల్మాన్ఖాన్కు డ్రైవింగ్ లైసెన్స్ లేదు!
హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఘటన జరిగిన 2002 నాటికి అతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని, 2004లోగానీ ఖాన్ లైసెన్స్ పొదలేదని రవాణాశాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ సోమవారం సెషన్స్ కోర్టులో వాగ్మూలం ఇచ్చారు.
నాడు సల్మాన్ను వైద్యపరీక్షలకు తీసుకెళ్లిన ఎస్ఐ వాంగ్మూలాన్ని కూడా కోర్టు నమోదుచేసుకుంది. అతిగా మద్యం సేవించి వాహనం నడిపి ఓ వ్యక్తి మరణానికి, నలుగురు గాయపడటానికి కారణమయ్యారని సల్మాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 13 ఏళ్లుగా విచారణ సాగుతున్న ఈ కేసులో 20కి పైగా సాక్ష్యాలను ముంబై సెషన్స్ కోర్టు విచారించింది. ఆరోపణలు రుజువైతే సల్మాన్కు గరిష్ఠంగా పదేళ్లు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.