
సల్మాన్‌కు సుప్రీం కోర్టు నోటీసు
న్యూఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నిర్దోషిత్వాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన అప్పీలుపై స్పందన తెలపాలని సుప్రీం కోర్టు ఆయనను ఆదేశించింది. ‘సర్వోన్నత న్యాయస్థానంలో నిర్దోషిగా తేలడం ముఖ్యం. అదే చివరి నిరూపణ అవుతుంది’ అని పేర్కొంది.