ఆ రోజు కారును నేను నడపలేదు: సల్మాన్‌ | Salman khan reveals in hit and run case | Sakshi
Sakshi News home page

ఆ రోజు కారును నేను నడపలేదు: సల్మాన్‌

Published Wed, Apr 6 2016 5:21 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

ఆ రోజు కారును నేను నడపలేదు: సల్మాన్‌ - Sakshi

ఆ రోజు కారును నేను నడపలేదు: సల్మాన్‌

ఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశాడు. ఈ  కేసు విషయంలో సల్మాన్‌ వివరణ ఇచ్చుకున్నాడు. తాను ఆ రోజు రాత్రి కారును నడపలేదని, డ్రైవరే కారును నడపినట్టు తెలిపాడు. కారు డ్రైవర్‌ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్‌ చేయలేదని చెప్పాడు.

కాగా, 2002లో ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్నవారిపై నుంచి సల్మాన్ కారు నడపడంతో ఒ వ్యక్తి మరణించగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఆ సమయంలో సల్మాన్ మోతాదుకు మించి మద్యం సేవించాడని రుజువైన కారణంగా ముంబై సెషన్స్ కోర్టు అతడికి  ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement