
బెంగళూరు: ఒక మహిళ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి హెచ్‌డి రేవణ్ణ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. బెయిల్ కోసం బెంగళూరు సెషన్స్‌కోర్టులో శుక్రవారం(మే3) పిటిషన్ వేశారు.
తన తల్లిని రేవణ్ణ ఎత్తుకుపోయారని రేవణ్ణ ఫామ్‌హౌజ్‌లో పనిచేసే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని కేఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో రేవణ్ణపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల(సెక్స్ స్కాండల్) వీడియోల కేసులో రేవణ్ణ శుక్రవారం సిట్ ముందుకు రావాల్సి ఉండగా ఆయన గైర్హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment