Revanna
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై ఛార్జ్ షీట్
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపలకు పాల్పడినట్లు జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వచ్చిన ఆరోపణలు కర్ణాటకలో సంచలనం సృష్టించాయి. ఈ కేసులో సిట్ అధికారులు శుక్రవారం ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రజ్వల్ రేవణ్ణ ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రజ్వల్‌పై హోలెనరసిపూర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు అధికారి సుమారాణి 137 మంది సాక్షులను విచారించారు. ఆ వివరాలతో 2000పైగా పేజీల చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.2019 నుంచి 2022 మధ్య హోలెనరసిపురలోని తన నివాసంలో పనిచేసిన పనిమనిషిని హెచ్డీ రేవణ్ణ లైంగికంగా వేధించారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితుడు రేవణ్ణ మహిళలను లైంగికంగా వేధించారని చార్జిషీట్లో పేర్కొంది. మహిళలపై లైంగిక వేధింపుల కేసులో హెచ్డీ రేవణ్ణ ఏ1, ప్రజ్వల్ రేవణ్ణగా ఏ2గా ఉన్నారు. -
ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణకు బెయిల్
ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జనతాదళ్ సెక్యులర్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణకు బెయిల్ లభించింది. బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.సూరజ్ రేవణ్ణ ఫామ్‌హౌజ్‌లో తనని లైంగికంగా వేధించాడని 27ఏళ్ల యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూరజ్ రేవణ్ణను అదుపులోకి తీన్నారు. విచారణ చేపట్టిన కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదే కేసులో సూరజ్ రేవణ్ణ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.తనపై వచ్చిన ఆరోపణలపై సూరజ్ రేవణ్ణ స్పందించాడు.ఫిర్యాదు దారుడు తన వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు రాబట్టేందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆరోపించారు. -
దర్శన్‌తో పాటు ఆ ముగ్గురిని ట్యాగ్ చేస్తూ హీరోయిన్ రమ్య కామెంట్
కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల కాలంలో పలు కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. హీరో దర్శన్, మాజీ సినీ నిర్మాత యడ్యూరప్ప, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, సూరజ్ రేవణ్ణ వంటి ప్రముఖులు నేడు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరందరినీ ఉద్దేశించి కన్నడ హీరోయిన్, మాజీ ఎంపీ రమ్య విమర్శలు ఎక్కుపెట్టారు.అనేక సందర్భాల్లో చట్టాన్ని ఉల్లంఘించే ధనవంతులు, సెలబ్రిటీలు, ప్రభావవంతమైన వ్యక్తులు నేటి సమాజంలో ఉన్నారు. వారు చేసిన ఘోర తప్పిదానికి రాష్ట్ర ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. ఈ నేరాలను బయటపెట్టిన పోలీసులకు, మీడియాకు హ్యాట్సాఫ్. కేసులను సక్రమంగా విచారణ జరిగేలా న్యాయస్థానం చూడాలి. ఒక్కోసారి న్యాయం జరగకపోతే సాధారణ ప్రజలకు న్యాయస్థానం ఏం సందేశం ఇచ్చినట్లు చెప్పాల్సి ఉంటుంది.' అని రమ్య సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్, లైంగిక వేధింపుల కేసులో నిందితులుగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ, సూరజ్ రేవణ్ణతో పాటు పోక్సో కేసులో విచారణ ఎదుర్కొంటున్న మాజీ సీఎం యడ్యూరప్ప పేరును తన సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ.. రమ్య పోప్ట్ చేయడం విశేషం.రేణుకాస్వామిని హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న దర్శన్ గురించి గతంలో ఆమె ఒక పోస్ట్ చేశారు. తప్పు చేసిన వారు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే శిక్ష అనుభవించాల్సిందేనని ఆమె కోరింది. దీంతో ఆమెపై ఆయన అభిమానులు విరుచకపడ్డారు. ట్రోల్స్ చేస్తూ రమ్యను బూతులు తిట్టడం ప్రారంభించారు. దానిని కూడా ఆమె తప్పబట్టారు. హత్య కేసులో ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేస్తున్న సమాజంలో జీవించడం సిగ్గుచేటు అని తెలిపారు. ఈ క్రమంలో చట్టం కంటే ఎవరూ గొప్పవారు కాదని ఆమె గుర్తుచేశారు. సెలబ్రిటీ అయితే సాధారణ ప్రజలను కొట్ట చంపేస్తారా..? అంటూ ఆమె స్వరాన్ని పెంచారు. ఇలాంటి కేసుల విషయంలో ఏ రాజకీయ పార్టీ ఒత్తిడికి తలొగ్గకుండా పోలీసులు పనిచేస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. చట్టంపై ప్రజలు విశ్వాసం ఉంచుతారనే నమ్మకం ఉందని రమ్య సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.తెలుగు వారికి కూడా రమ్య పరిచయమే నందమూరి కళ్యాణ్‌రామ్ 'అభిమన్యు' సినిమాతో పాటు సూర్య హీరోగా నటించిన 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమాలో రమ్య మెప్పించారు. 20 సంవత్సరాల పాటు కన్నడ సీమలో టాప్ హీరోయిన్గా చెరగని ముద్ర రమ్య వేశారు.The ones breaking the law who have been in the news are the rich and powerful and the ones at the receiving end of their violent actions are the poor, women & children. The common people of Karnataka. Hats off to the police and media for bringing these crimes out. Justice will…— Ramya/Divya Spandana (@divyaspandana) June 22, 2024 -
పెన్‌డ్రైవ్ దర్యాప్తు పరుగులు
బనశంకరి: అత్యాచార బాధిత మహిళను అపహరించిన కేసులో జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ శనివారం సిట్ అధికారులు విచారణ చేపట్టారు. హాసన్ జిల్లా కేఆర్ నగరలో బాధిత మహిళ అపహరణ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు బెంగళూరులో సిట్ ఆఫీసులో భవాని హాజరయ్యారు. సిట్ అధికారులు భవానీని విచారించారు. హైకోర్టు వారంరోజుల పాటు షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ సముదాయంలో ఉన్న సిట్ ఆఫీసుకు భవాని లాయరుతో కలిసి వచ్చారు. తాను ఏ మహిళ ను అపహరించలేదని, తనపై కుట్ర చేశారని ఆమె చెప్పారు. సుమారు 4 గంటలపాటు విచారణ చేపట్టినప్పటికీ సమాచారం లభించలేదని సమాచారం. బాధిత మహిళ తమ ఇంట్లో పనిచేస్తుందని, నేను ఆమెను అపహరించలేదని భవాని పదేపదే చెప్పారు. షరతుల ప్రకారం భవాని రోజూ మధ్యాహ్నం 1 గంట కు సిట్ విచారణకు హాజరు కావాలి. సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపవచ్చు. ఆపై ఆమెను పంపించి వేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులోనే భర్త రేవణ్ణ అరెస్టయి విడుదలయ్యారు.సిట్ ఆఫీసులో తల్లీ తనయుడుభవాని సిట్ ఆఫీసులో విచారణకు హాజరైనప్పడు అక్కడే పక్కగదిలో విచారణలో కుమారుడు ప్రజ్వల్ ఉన్నారు. ఒకరినొకరు పలకరించుకోలేని పరిస్థితి ఏర్పడింది. గత ఏప్రిల్ 27 నుంచి ప్రజ్వల్‌తో తల్లి భవాని ముఖాముఖి మాట్లాడింది లేదు. ప్రజ్వల్, భవానీని వేర్వేరుగా విచారించారు.హైకోర్టులో రేవణ్ణ అర్జీహాసన్ జిల్లా హొళేనరసిపుర టౌన్ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన లైంగిక దాడికేసు రద్దుచేయాలని జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ.రేవణ్ణ హైకోర్టులో వేసిన పిటిషన్ పై సిట్ కు హైకోర్టు నోటీస్ జారీచేసింది. జడ్జి జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్ ధర్మాసనం పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలను ఆలకించింది. సిట్ వాదన తెలియజేయాలని ఆదేశిస్తూ 21 తేదీకి వాయిదా వేసింది.ప్రజ్వల్ స్నేహితునికి నోటీసులుప్రజ్వల్కు విదేశాల్లో సాయం చేసిన అతని స్నేహితున్ని విచారణకు హాజరుకావాలని సిట్ నోటీస్ జారీచేసింది. 34 రోజుల పాటు ఎవరికీ అందుబాటులోకి రాకుండా ప్రజ్వల్ జర్మనీలో మకాం వేశాడు. ఇందుకు అతని స్నేహితుడు సాయం చేసినట్లు సిట్ గుర్తించింది. దీంతో విచారణకు రావాలని నోటీసులు పంపింది.కార్తీక్ గౌడ అరెస్టుహాసన్లో నగ్నచిత్రాల పెన్‌డ్రైవ్‌లను లీక్ చేసిన కేసులో సిట్ అధికారులు శనివారం కార్తీక్‌గౌడ అనే వ్యక్తిని అరెస్ట్‌చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని నిర్బంధించారు.హాసన్‌లో నివాసాలలో తనిఖీయశవంతపుర: అత్యాచారం, లైంగిక వీడియోల కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్‌కు చెందిన హాసన్ జిల్లా హొళెనరసిపురలోని నివాసంలో సిట్ అధికారులు మహజరు చేశారు. చెన్నాంబిక అనే పేరు గల ఈ ఇంటికి ప్రజ్వల్‌ను తీసుకెళ్లారు. ముందుజాగ్రత్తగా గట్టి పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక వాహనంలో బయటకు కనబడకుండా బెంగళూరు నుంచి ప్రజ్వల్‌ను తీసుకెళ్లారు. మొదట ఆ నివాసంలో విచారణ జరిపి, మళ్లీ హాసన్‌కు తరలించారు. -
ముందస్తు బెయిల్ ఇవ్వండి: కోర్టుకు ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరు: మహిళలపై లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు ప్రజాప్రతినిధుల కోర్టులో బుధవారం(మే29) ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ప్రజ్వల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. గురువారమే బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపాల్సిందిగా ప్రజ్వల్ తరపు న్యాయవాది కోరగా కౌంటర్ దాఖలు చేయడానికి సిట్ సమయం కోరింది. దీంతో జడ్జి సంతోష్ గజానన్ విచారణను మే 31కి వాయిదా వేశారు. లైంగిక దౌర్జన్యం వీడియోలు వెలుగు చూసిన తర్వాత ఏప్రిల్‌లో ప్రజ్వల్ విదేశాలకు పారిపోయారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్న ప్రజ్వల్ మే31న భారత్ వస్తానని ఇప్పటికే ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తాజాగా కోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను 31కే వాయిదా వేయడంతో ఆయన ఆరోజు వస్తారా మళ్లీ ఏదైనా తేదీ ప్రకటిస్తారా అనేదానిపై సందిగ్ధత నెలకొంది.ప్రజ్వల్ ఎన్డీఏ కూటమి తరపున జేడీఎస్ పార్టీ నుంచి హసన్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రెండో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 26న కర్ణాటకలో పోలింగ్ ముగిసింది. -
బెంగళూరుకు ప్రజ్వల్ రేవణ్ణ రాక.. కర్ణాటకలో పరిస్థితేంటి?
బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల కేసు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజల్వ్ రేవణ్ణ మే 31వ తేదీన తెల్లవారుజామున కర్ణాటక చేరుకోనున్నట్టు తెలుస్తోంది. రేపు (మే30న) జర్మనీ నుంచి బెంగళూరు బయలుదేరనున్నారు. అయితే, ఎయిర్‌పోర్టులోనే ప్రజ్వల్‌ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా కర్ణాటక నుంచి పోటీ చేసిన ప్రజ్వల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక, ఎన్నికల నేపథ్యంలో ఆయనకు సంబంధించినవిగా చెబుతున్న కొన్ని అభ్యంతరకర వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. అనంతరం, బాధిత మహిళలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఆయనపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో ఆయనపై అత్యాచారం, కిడ్నాప్ కేసు నమోదైంది. అంతకుముందు.. ఏప్రిల్ 27నే ప్రజ్వల్ దేశం విడిచి జర్మనీకి వెళ్లిపోయారు. Suspended JD(S) leader #PrajwalRevanna, who is facing sexual abuse charges, has booked a return flight ticket to #Bengaluru from #Munich on May 30, official sources said. He is expected to land in Bengaluru in the early hours of Friday. pic.twitter.com/wIzrnFlvNF— Salar News (@EnglishSalar) May 29, 2024 అయితే, ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం రాజకీయంగా విమర్శలకు దారి తీయడంతో రేవణ్ణను భారత్‌కు రావాలని కుటుంబ సభ్యులు కోరారు. అలాగే, ఆయనను భారత్‌కు రప్పించాలని కర్ణాటక రాజకీయ నేతలు కూడా ప్రధాని మోదీని కోరారు. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా తాను.. కేసు విచారణకు సహకరిస్తానని, శుక్రవారం (మే 31న) ‘సిట్’ ముందు వ్యక్తిగతంగా హాజరవుతాను. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నాపై తప్పుడు కేసులు బనాయించారు. ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగమే. ఇప్పటికే కుంగుబాటుకు లోనయ్యాను. అయితే, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది’ అని కామెంట్స్ చేశారు.మరోవైపు.. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోల కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను పత్యేక దర్యాప్తు బృందం(సిట్) అరెస్ట్ చేసింది. వారిని నవీన్ గౌడ, చేతన్‌గా గుర్తించారు. #WATCH | Bengaluru, Karnataka: Special Investigation Team (SIT) officials arrested two prime accused in connection with the JD(S) suspended MP Prajwal Revanna obscene video case. The arrested have been identified as Naveen Gowda and Chetan: SIT pic.twitter.com/ChufYgVYu3— ANI (@ANI) May 29, 2024 -
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపుల కేసులో ఇరుకున్న హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజల్వ్ రేవణ్ణ త్వరలోనే భారత్‌కు తిరిగి రానున్నారు. ఈనెల 31న సిట్ ముందు విచారణకు హాజరు కానున్నట్లు స్వయంగా తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.‘నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మే 31 ఉదయం 10 గంటలకు సిట్ ముందు హాజరవుతాను. విచారణకు సహకరిస్తాను. నాపై నమోదైనవి తప్పుడు కేసులు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది.’ అని సోమవారం పేర్కొన్నారు.అయితే తనపై వచ్చిన ఆరోపణలను రాజకీయ కుట్రగా రేవణ్ణ పేర్కొన్నాడు. తాను మానసిక ఒత్తిడి, ఒంటరిగా ఉన్నట్లు చెప్పాడు. తన ఆచూకీ వివరాలు చెప్పనందుకు జేడీఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు కూడా చెప్పారు.‘విదేశాల్లో నేను ఎక్కడ ఉన్నానో సరైన సమాచారం అందించనందుకు నా కుటుంబ సభ్యులకు, మా కుమారన్న (కుమారస్వామి],పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఏప్రిల్ 26వ తేదీన ఎన్నికలు ముగిసినప్పుడు, నాపై ఎటువంటి కేసు లేదు. సిట్ ఏర్పాటు చేయలేదు. నేను వెళ్లిన రెండు, మూడు రోజుల తర్వాత యూట్యూబ్‌లో నాపై ఈ ఆరోపణలను చూశాను. అలాగే ఏడు రోజుల సమయం కావాలని నా లాయర్ ద్వారా సిట్‌కి లేఖ రాశాను.’ అని పేర్కొన్నారు.కాగా మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడైన ప్రజ్వల్ రేవణ్ణ(36) మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనేక మహిళలను లైంగికంగా వేధించినట్లు వీడియో బయటకు రావడంతో ప్రజ్వల్ ఏప్రిల్ 26న దేశం విడిచి వెళ్లిపోయారు.కాగా తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు హాసన్ జిల్లా హొళె నరసీపుర పోలీస్ స్టేషన్లో ప్రజ్వల్‌తోపాటు ఆయన తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే రేవణ్ణపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. రేవణ్ణ రాసలీలలపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అతనిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. అనంతరం అతనిపై బ్లూ కార్నర్ నోటీసు' కూడా జారీ అయ్యింది.తన మనవడిని భారతదేశానికి తిరిగి రావాలని, పోలీసులకు లొంగిపోవాలని లేదా అతని ఆగ్రహాన్ని ఎదుర్కోవాలని కోరుతూ హెచ్డి దేవెగౌడ తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత అతని ప్రకటన రావడం గమనార్హం. అంతేగాక ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గత వారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. -
ప్రజ్వల్‌కు దేవెగౌడ సూచన... స్పందించిన సిద్ధరామయ్య
బెంగళూరు: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన లైంగిక దాడుల వీడియోల వ్యవహారంలో ప్రధాన నిందితుడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను హెచ్చరిస్తూ ఆయన తాత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ చేసిన ప్రకటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. దేవెగౌడే దగ్గరుండి ప్రజ్వల్‌ను విదేశాలకు పంపించారని ఆరోపించారు. దేవెగౌడ సూచనలతోనే ప్రజ్వల్ జర్మనీ వెళ్లారని మండిపడ్డారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకే దేవెగౌడ ఇలాంటి ప్రకటన చేశారని విమర్శించారు. కాగా, ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తాజాగా వెల్లడించింది. ప్రజ్వల్ పాస్‌పోర్టును రద్దు చేసేందుకు అవసరమైన చర్యలను కేంద్రం ఇప్పటికే మొదలుపెట్టినట్లు సమాచారం. ఒకవేళ పాస్‌పోర్టు రద్దయితే ప్రజ్వల్ విదేశాల్లో ఉండటం చట్టవిరుద్ధమవుతుంది. -
జర్మనీ నుంచి ఇంగ్లండ్‌కు!.. ప్రజ్వల్‌పై అరెస్ట్ వారెంట్ జారీ
బనశంకరి: హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎప్పుడు వస్తాడనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. గత నెల 27వ తేదీన దేశం విడిచి వెళ్లిన ఎంపీ ఆచూకీ కోసం రాష్ట్ర పోలీసులు, సిట్ ముమ్మరంగా గాలిస్తోంది. నగ్న వీడియోలు, లైంగికదాడి కేసులో నిందితుడైన ప్రజ్వల్ జర్మనీ నుంచి ఇప్పుడు ఇంగ్లండ్‌కి మకాం మార్చినట్లు గుర్తించారు. ఈ క్రమంలో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం శనివారం వారెంట్ జారీ చేసింది. ఈ కేసుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు విచారణకు హాజరు కాకపోవటంతో అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే పలుసార్లు భారత్‌కు టికెట్లు బుక్ చేసుకొని రద్దు చేసుకున్నట్లు గుర్తించింది. దీంతో చేసేది లేక కోర్టును ఆశ్రయించి సిట్ అరెస్టు వారెంటును జారీ చేసింది. ఇప్పటికే ప్రజ్వల్‌పై ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ అయిన విషయం తెలిసిందే. ఆయన్ని మరింత కట్టడి చేసేందుకు బ్యాంక్ ఖాతాలపై అధికారులు దృష్టి సారించారు.ఇంగ్లండ్‌లో ఓ భారత పారిశ్రామికవేత్త సహాయంతో ఎంపీ ప్రజ్వల్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి జర్మనీలోని మ్యూనిచ్ నుంచి బ్రిటన్‌కి వెళ్లాడని తెలిసింది. తన జాడ తెలుస్తుందనే భయంతో ప్రజ్వల్ గత 15 రోజులుగా కుటుంబంతో కూడా మాట్లాడలేదని తెలిసింది.జూన్ 4 తరువాతే నిర్ణయంప్రజ్వల్ రేవణ్ణ ఇప్పటికే రెండుసార్లు లుఫ్తాన్సా విమాన టికెట్ రద్దు చేసుకున్నారు. మే 3, 15 తేదీన భారత్ కు రావడానికి టికెట్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేశారు. దీంతో సిట్ అదికారులు ప్రజ్వల్ మళ్లీ ఎప్పుడు టికెట్ బుక్ చేసుకుంటాడా అని నిఘాపెట్టారు. దేశమంతా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడతాయి. ఆ తరువాత పరిణామాలను బట్టి బెంగళూరుకు రావాలా, మరింత ఆలస్యం చేయాలా అనేది ప్రజ్వల్ నిర్ణయించుకుంటారు. మరోపక్క వెంటనే రావాలని కుటుంబసభ్యులు ఆయనను కోరినట్లు తెలిసింది.ఇక.. ప్రజ్వల్ బ్యాంకు ఖాతాలను సిట్ అధికారులు ఫ్రీజ్ చేశారు. ప్ర జ్వల్కు చెందిన అన్ని బ్యాంకు అకౌంట్ల సమాచారం సేకరించి వాటిని స్తంభింపజేశారు. ఆయనకు ఏయే ఖాతాల ద్వారా నగదు జమైందో విచారణ చేపట్టారు. విదేశాల్లో గడపాలంటే చాలా డబ్బులు కావాలి కాబట్టి ఆయనకు డబ్బు ఎలా చేరుతోందో కనిపెట్టే పనిలో ఉన్నారు. -
ప్రజ్వల్ రేవణ్ణ స్కాండల్ కేసులో 2 బిగ్ ట్విస్టులు
బెంగళూరు: కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడుల కేసు కీలక మలుపు తిరుగుతోంది. పోలీసులమని చెప్పుకుంటూ కొందరు తనను బలవంతంగా రేవణ్ణపై కేసు పెట్టించారని ఓ మహిళ ఆరోపించడం సంచలనంగా మారింది. మహిళ ఆరోపణల విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ స్వయంగా గురువారం ప్రకటించింది.ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర ప్రెసిడెంట్ హెచ్ డీ కుమారస్వామి మండిపడ్డారు. కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం బాధితులను బెదిరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలగా ఫిర్యాదులు చేయకపోతే వ్యబిచారం కేసులు పెడతామంటూ సిట్ ఆఫీసర్లు బాధితులపై బెదిరింపులకు దిగుతున్నారని మాజీ సీఎం ఆరోపించారు.‘‘కిడ్నాప్ చెర నుంచి కాపాడిన మహిళల్ని మీరు ఎక్కడ దాచారు. వారిని కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టడం లేదు. బాధితుల ప్రైవేటు వీడియోలను ఇలా అందరికీ పంచడాన్ని మీరు సమర్థిస్తున్నారా? అని రెవెన్యూ మంత్రి కృష్ణ బైరి గౌడను కుమారస్వామి ప్రశ్నించారు. తాను ప్రజ్వల్‌ను సమర్థించట్లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందే. దోషులకు శిక్ష పడాల్సిందే. హెడ్డీ దేవెగౌడకు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మా అందరికీ ఎవరి కుటుంబాలు, వ్యాపారాలు వారికి ఉన్నాయి. నేను అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకసారి మాత్రమే హసన్ జిల్లాకు వెళ్లాను’’ అని ఆయన అన్నారు.మరోవైపు, సిట్ దర్యాప్తును కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర సమర్థించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్థవంతంగా కేసును దర్యాప్తు చేస్తోందని అన్నారు. జేడీఎస్ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ‘‘ప్రతి ఒక్కరికీ నేను సమాధానం చెప్పలేను. సిట్‌పై ఏదైనా అభ్యంతరాలు ఉంటే కేసు ఫైల్ చేయమనండి. దర్యాప్తు జరుగుతోంది. పూర్తి వివరాలు తేలాక వాటిని ప్రజల ముందుంచుతాం. వీడియోల్లోని బాధితులను బ్లాక్ మెయిల్ చేసినట్టు తేలితే దోషులపై చర్యలు ఉంటాయి’’ అని ఆయన అన్నారు.దేవరాజ్ గౌడ్‌పైనా లైంగిక దాడి కేసుఇక ప్రజ్వల్ ఎపిసోడ్లో ఊహించని మరో మలుపు చోటు చేసుకుంది. ఈ భాగోతం మొత్తం బయటపెట్టిన బీజేపీ నేత, ప్రముఖ లాయర్ దేవరాజ్ గౌడపైనా లైంగిక దాడి కేసు ఒకటి నమోదు అయ్యింది. హోలెనరసిపురా టౌన్ పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ 1వ తేదీన కేసు నమోదు అయ్యింది. అంతకు ముందురోజు ఆమె భర్త.. గౌడ తమ ఇంటికి వచ్చి బెదిరించాడనే ఫిర్యాదు చేశారు.తమకు సంబంధించిన ఆస్తుల అమ్మకాల విషయంలో సాయం చేస్తానని గౌడ నమ్మించారని, ఆ వంకతో తనపై లైంగిక దాడి చేశాడని ఆమె ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఫిర్యాదు ద్వారా పోలీసులను ఆశ్రయించారు .ప్రజ్వల్ సెక్స్ వీడియో క్లిప్‌ల పెన్ డ్రైవ్‌లను బీజేపీ అధిష్టానానికి దేవరాజ్ గౌడే అందించారని, వచ్చే లోకసభ ఎన్నికల్లో జేడీఎస్‌తో పొత్తు వద్దని వారించింది ఈయనేనని ఒక ప్రచారం ఉంది. -
జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
బెంగళూరు: మహిళ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు హెచ్డీ రేవణ్ణకు బెంగళూరు కోర్టు రిమాండ్ విధించింది. ఆరు రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డ మహిళను కిడ్నాప్ చేశారని రేవణ్ణపై కేసు నమోదైంది. ఈ కేసులో రేవణ్ణను ఇటీవలే సిట్ అరెస్టు చేసింది. తన తల్లిని కిడ్నాప్ చేయడమే కాక ఆమెపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని కిడ్నాప్‌కు గురైన మహిళ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో రేవణ్ణపై కేసు నమోదైంది. -
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
బెంగళూరు: సంచలనం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్య వీడియోలపై జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. అభ్యంతరకర వీడియోలున్న 25 వేల పెన్‌డ్రైవ్‌లను పంచడం వెనుక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారని మండిపడ్డారు. తొలుత ఏప్రిల్ 21న బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో ఒక పెన్‌డ్రైవ్‌ను రిలీజ్ చేశారన్నారు. వాట్సాప్ ఛానల్ సృష్టించి మరీ వీడియోలు కావాల్సిన వారు ఛానల్‌ను ఫాలో అవ్వాలని కోరారని చెప్పారు. దీనిపై ఏప్రిల్ 22న తమ పార్టీ పోలింగ్ ఏజెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశాడన్నారు. సిట్‌తో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదన్నారు. తప్పు చేసిన వారికి చట్టం ప్రకారం పడాల్సిందేనని స్పష్టం చేశారు. వీడియోలు పంచినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పోలీసు అధికారుల సాయంతోనే పెన్‌డ్రైవ్‌లను పంచినట్లు తమకు సమాచారం ఉందన్నారు. జేడీఎస్ ఎంపీ అభ్యర్థులు ముగ్గురు ఓడిపోతారన్న సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు గుర్తొస్తే ఇప్పడు అనుమానం వేస్తోందన్నారు. -
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ కేసులో జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజ్వల్ రేవణ్ణ కేసుపై స్పందించారు. సోమవారం కస్టడీ ముగిసిన సందర్భంగా కవితను రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద కవిత మీడియాతో మాట్లాడారు. ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వాళ్లను విడిచిపెట్టి దేశం దాటించి తనలాంటి వాళ్లను అరెస్ట్ చేశారన్నారు. ఇది అన్యాయమని, దీనిని అందరూ గమనించాలని కవిత కోరారు. లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మే 14 దాకా పొడిగించింది.కవిత కేసులో ఈడీ దూకుడు.. వారం రోజుల్లో ఛార్జ్‌షీట్ వేస్తామని వెల్లడిలిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)దూకుడు ప్రదర్శిస్తోంది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై వారంరోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు ఈడీ కోర్టుకు వెల్లడించింది. మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..
-
కిడ్నాప్ కేసులో రేవణ్ణ అరెస్ట్
సాక్షి, బెంగళూరు: మహిళ కిడ్నాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జేడీ (ఎస్) సీనియర్ నేత, పార్టీ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను సిట్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ ఆయన పెట్టుకున్న ముందస్తు బె యిల్‌ను ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ని రాకరించిన వెంటనే సిట్ రేవణ్ణను అదుపులో కి తీసుకోవడం గమనార్హం. గతంలో రేవణ్ణ ఇంట్లో పనిచేసిన బాధితురాలిని రేవణ్ణ అనుచరుడు సతీశ్ బాబన్న కిడ్నాప్ చేశాడని బాధితురాలి కుమారుడు గురువారం రాత్రి మైసూరులో ఫిర్యాదుచేయ డంతో పోలీసులు రంగంలోకి దిగారు. శనివారం బెంగళూరులోని పద్మనాభనగర్లోని మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ నివాసంలో ఉన్న రేవణ్ణను అక్కడే అరెస్ట్‌చేశారు. తర్వాత ఆయనను బౌరింగ్ ఆస్పత్రికి వైద్యపరీక్షల కోసం తీసుకెళ్లారు. ఈ కేసులో రేవణ్ణ సహచరుడు సతీశ్‌ను ఇప్పటికే అరెస్ట్‌చేశారు. ఈ కే సులో నిర్బంధంలో ఉన్న మహిళను మైసూ రు జిల్లాలోని కలెనహళ్లి గ్రామంలోని ఫామ్‌హౌజ్‌లో పోలీసులు శనివారం కాపాడారు. ప్రజ్వల్‌పై బ్లూ కార్నర్ నోటీస్!: లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్‌పై నమోదైన కేసులో విచారణను సిట్ వేగవంతంచేసింది. ఇందులోభాగంగా ప్రజ్వల్‌కు సీబీఐ బ్లూ కార్నల్ నోటీసును జారీచేసే వీలుందని తెలుస్తోంది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిట్ అధికారులతో ముఖ్యమైన సమావేశం ఏర్పాటుచేశారు. ప్రజ్వల్‌ను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకునేలా కేసు దర్యాప్తును ముమ్మరంచేయాలని ఆదేశించారు. -
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
బెంగళూరు: మహిళ కిడ్నాప్, లైంగిక ఆరోపణల కేసులో కర్ణాటక మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణను బెంగళూరు పోలీసులు శనివారం(మే4) అరెస్టు చేశారు. రేవణ్ణ తన తండ్రి మాజీ ప్రధాని దేవెగౌడ నివాసంలో ఉండగా పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. కిడ్నాప్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని రేవణ్ణ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు కోర్టు తిరస్కరించిన గంటల వ్యవధిలోనే పోలీసులు రేవణ్ణను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ సంచలనం రేపిన సెక్స్ వీడియోల స్కాండల్ కేసులో కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణతో పాటు రేవణ్ణ కూడా నిందితుడిగా ఉన్నారు. కాగా, ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. ఈయనపై సెక్స్ స్కాండల్ కేసులో పోలీసులు ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. -
అసభ్య వీడియోల కేసు.. ప్రజ్వల్‌పై మరో లుక్అవుట్ నోటీసు
బెంగళూరు: అసభ్య వీడియోల కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ నివాసంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) శనివారం దర్యాప్తు చేట్టింది. మరోవైపు..ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణలపై రాష్ట్ర హోంమంత్రి గంగాధరయ్య పరమేశ్వర మరోసారి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు.‘ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్డీ రేవణ్ణలకు లుక్అవుట్ నోటీసులు పంపించాం. హెడ్డీ రేవణ్ణ విదేశాలను వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అందుకే రెండోసారి లుక్అవుట్ నోటీసులు జారీ చేశాం. వీటిని శుక్రవారమే జారీ చేశాం. నోటీసులకు సమాధానం ఇవ్వడానికి ఇవాళ సాయంత్రం వరకు సమయం ఉంది’ అని హోం మంత్రి గంగాధరయ్య పరమేశ్వర తెలిపారు. ఇప్పటికే ఒకసారి లుక్ అవుట్ నోటీలు జారీ చేయగా..దర్యాప్తు బృందం ముందు హాజరుకావడానికి సమయం కావాలని కోరారు. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి నోటీసులు పంపించారు.ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళపై లౌంగిక దాడులకు పాల్పడినట్లు కేసు నమోదైంది. ఆయనకు సంబంధించినగా కొన్ని అసభ్య వీడియోలు సోషల్‌మీడియాలో వైరలైన అనంతరం ప్రజ్వల్ ఇండియా విడిచి విదేశాలకు వెళ్లారు. అయితే లోక్‌సభ ఎన్నికలు జరుతున్న సమయంలో కర్ణాటక రాష్ట్రంలో అసభ్య వీడియోల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది.మరోవైపు.. ఈ వ్యవహారంలో బాధితులకు తగిన సాయం అందించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశారు. ‘ న్యాయం కోసం పోరాటం చేస్తున్న బాధిత మహిళలు సంఘీభావం తెలపటానికి అర్హులు. ఈ క్రూరమైన నేరాలకు కారణమైన పార్టీలను చట్టం ముందకు తీసుకురావటం మన సమిష్టి బాధ్యత’అని రాహుల్ గాంధీ అన్నారు. -
ముందస్తు బెయిల్ ఇవ్వండి: కోర్టులో రేవణ్ణ పిటిషన్
బెంగళూరు: ఒక మహిళ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి హెచ్డి రేవణ్ణ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. బెయిల్ కోసం బెంగళూరు సెషన్స్‌కోర్టులో శుక్రవారం(మే3) పిటిషన్ వేశారు. తన తల్లిని రేవణ్ణ ఎత్తుకుపోయారని రేవణ్ణ ఫామ్‌హౌజ్‌లో పనిచేసే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని కేఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో రేవణ్ణపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల(సెక్స్ స్కాండల్) వీడియోల కేసులో రేవణ్ణ శుక్రవారం సిట్ ముందుకు రావాల్సి ఉండగా ఆయన గైర్హాజరయ్యారు. -
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు ఊహించని షాక్
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణకు మరో షాక్ తగిలింది. తాజాగా అతడిపై అత్యాచారం కేసు నమోదైంది.వివరాల ప్రకారం.. కర్ణాటకలో సంచనలంగా మారిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు విషయంలో పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ప్రజ్వల్‌పై అత్యాచారం కేసు నమోదైంది. లైంగిక వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌పై సిట్ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఐపీసీ సెక్షన్ 376 (బీ) (ఎన్), 506, 354(ఏ)(2), 354(బీ), 354(సీ), ఐటీ చట్టం కింద కేసు ఫైల్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో ప్రజ్వల్ రేవణ్ణను ఏకైక నిందితుడిగా చేర్చారు. కాగా, ఇది ప్రజ్వల్‌పై నమోదైన రెండో కేసు.ఇదిలా ఉండగా.. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ దర్యాప్తు చేపడుతోంది. ఇందులో భాగంగా విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా ఎస్పీ సీమా లాట్కార్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, తనకు సమయం కావాలని ప్రజ్వల్ రేవణ్ణ సిట్ అధికారులను కోరారు. Karnataka government's special investigation team (SIT) filed a rape case against Janata Dal (Secular)'s Hassan MP #PrajwalRevanna. This is the second #FIR against Prajwal Revanna, who is also the grandson of JDS chief and former PM HD Deve Gowda.The FIR against JDS' (cont) pic.twitter.com/A6tKUIFsYu— News Daily 24 (@nd24_news) May 3, 2024 ఈ నేపథ్యంలో ప్రజ్వల్ ట్విట్టర్ వేదికగా‘సిట్ ముందు హాజరుకావడానికి ఏడు రోజుల సమయం కావాలి. ఇప్పుడు నేను బెంగళూరులో లేను’ అంటూ ఒక పోస్టు చేశాడు. కాగా, ప్రజ్వల్ అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. ఈ మేరకు గురువారం ఉదయం మరోసారి సమన్లు పంపింది. అనంతరం కొద్దిసేపటికే ఆయనపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనపై అత్యాచారం కేసు కూడా నమోదు చేసింది.ప్రస్తుతం ప్రజ్వల్ జర్మనీలో ఉన్నట్లు తేలింది. లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రజ్వల్.. డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ఉపయోగించి ఏప్రిల్ 28న జర్మనీ పారిపోయారు. ఈ క్రమంలో మరోవైపు అతడి పాస్‌పోర్ట్ రద్దు చేసి, ప్రజ్వల్‌ను భారత్‌కు రప్పించటంలో సాయం చేయాలని ప్రధాని మోదీని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కోరారు. మరోవైపు విచారణకు హాజరు కాకపోతే దేశానికి తిరిగి వచ్చిన వెంటనే ప్రజ్వల్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. -
Rahul Gandhi: 400 మంది మహిళలపై అఘాయిత్యం
శివమొగ్గ/రాయ్‌చూర్: కర్ణాటకలో 400 మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన మాస్ రేపిస్ట్ ప్రజ్వల్ అంటూ జేడీ(ఎస్) సిట్టింగ్ ఎంపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని శివమొగ్గ, రాయ్‌చూర్ జిల్లా కేంద్రాల్లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో రాహుల్ ప్రసంగించారు. ‘‘ ఈ సెక్స్ కుంభకోణం గురించి మోదీకి ముందే తెలుసు. తలచుకుంటే సెకన్లలో ప్రజ్వల్‌ను అరెస్ట్చేసేవారు. సీబీఐ, కస్టమ్స్, ఇమిగ్రేషన్, ఈడీ అన్ని దర్యాప్తు సంస్థలు వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. అయినా కావాలనే పారిపోనిచ్చారు. ప్రజ్వల్‌ను మోదీ రక్షించాల్సిన అవసరమేంటి? ప్రజ్వల్ కోసం ప్రచారం చేస్తూ ఓట్లు అడగాల్సిన గత్యంతరమేంటి?’’ అని మోదీని రాహుల్ నిలదీశారు. కర్ణాటకను చూసి మోదీ భయపడుతున్నారు ‘‘అధికారం, కూటమి కోసం ప్రజ్వల్‌ను కాపాడుతున్నారని కర్ణాటక మహిళలు గ్రహించారు. దేశాన్ని కాపాడాల్సిన ప్రధాని, హోం మంత్రి ప్రజ్వల్‌ను రక్షిస్తున్నారు. ఇదే మాకు, బీజేపీ సిద్ధాంతాలకు మధ్య ఉన్న తేడా. అధికారం కోసం వాళ్లు ఏదైనా చేస్తారు. ఘటన తర్వాత కర్ణాటకను చూసి మోదీ భయపడుతున్నారు. రాష్ట్రంలో పాల్గొనాల్సిన అన్ని సమావేశాలు, ర్యాలీలను మోదీ రద్దుచేసుకున్నారు’’ అని అన్నారు. ‘‘ బాధితుల్లో మైనర్లూ ఉన్నారు. అంతా తెల్సి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మౌనంగా ఉన్నారు. నిజంగా ఇది నేరం. ఆయనపై కేసు నమోదుచేయాలి. రేపిస్ట్‌కు మద్దతుగా ఓట్లు అడిగినందుకు దేశంలోని తల్లులు, అక్కాచెల్లెళ్లకు మోదీ క్షమాపణలు చెప్పాలి. ప్రజ్వల్ చేసింది తెల్సి కూడా మీ ఓట్లను మోదీ అడిగారని కర్ణాటక మహిళలు గ్రహించాలి. బీజేపీ నేతలకు ప్రజ్వల్ రేపిస్ట్ అని ముందే తెలుసు. అయినాసరే ఆయనకు మద్దతు పలికి జేడీ(ఎస్)తో పొత్తు పెట్టుకున్నారు’’ అని ఆరోపించారు. సమానత్వం కోరితే నక్సలైట్లు అంటున్నారు ‘‘సమానత్వం కోరితే వారిని బీజేపీ చీఫ్ నడ్డా నక్సలైట్ అంటున్నారు. దళితులు, వెనుకబడిన వాళ్లు, గిరిజనులు సమానత్వం కావాలంటున్నారు. అంతమాత్రాన వారంతా నక్సలైట్లు అయిపోతారా? ఇలా మాట్లాడిన నడ్డా వెంటనే తన పార్టీ చీఫ్ పదవికి రాజీనామాచేయాలి. నడ్డా వ్యాఖ్యలపై మోదీ వివరణ ఇవ్వాలి’’ అని డిమాండ్‌చేశారు. -
Hasan Sex Scandal: తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హసన్ సెక్స్ వీడియోల వివాదంపై ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారిగా స్పందించారు. లైంగిక వేధింపుల వీడియోలు బయటికిరాగానే ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి రేవణ్ణ తాజాగా సోషల్ మీడియాలో ఒక లేఖ పోస్టు చేశారు.సెక్స్ స్కాండల్‌ను దర్యాప్తు చేస్తున్న సిట్ ముందు వారం రోజుల్లో హాజరవుతానని తెలిపారు. నిజమే గెలుస్తుందన్నారు. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియగానే మరుసటి రోజు ఏప్రిల్ 27న ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందే రేవణ్ణ సెక్స్ వీడియోలు హసన్ ప్రాంతంలో వైరల్ అయ్యాయి.ప్రజ్వల్ లోక్‌సభ ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి జేడీఎస్ పార్టీ తరపున బరిలోకి దిగారు. ప్రస్తుతం ఆయనే హసన్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2019 నుంచి 2022 వరకు హసన్, బెంగళూరుల్లోని ప్రజ్వల్ రేవణ్ణ ఇళ్లలో పలువురు మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తుండగా వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోలున్న పెన్‌డ్రైవ్ బయటికి రావడంతో సెక్స్ స్కాండల్ వెలుగులోకి వచ్చింది. -
PrajwalRevannavideo: త్వరలో భారత్‌కు ప్రజ్వల్ రేవణ్ణ..?
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపుల వీడియోల వ్యవహారంలో సస్పెండైన జేడీఎస్ ఎంపీ రేవణ్ణ జర్మనీ నుంచి త్వరలో ఇండియా వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మే 3-4 తేదీల మధ్య రేవణ్ణ బెంగళూరుకు చేరుకోవచ్చని కర్ణాటక పోలీసు వర్గాలు చెబుతున్నాయి.లైంగిక వేధింపుల వీడియోల వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు ఇవ్వడంతో ప్రజ్వల్ భారత్‌కు రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రజ్వల్ తండ్రి ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. కాగా, ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు గత వారం హసన్ ప్రాంతంలో వైరల్ అయ్యాయి. మొత్తం 2,976 వీడియోలున్న పెన్‌డ్రైవ్ బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలన్నీ 2019-2022 మధ్య బెంగళూరు, హసన్‌లలోని రేవణ్ణ నివాసాలలో చిత్రీకరించినవనిప్రాథమికంగా తేలింది. తనపై ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఒక మహిళ చేసిన ఫిర్యాదుతో అతడిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కిందపోలీసులు కేసు నమోదు చేశారు.లైంగిక వేధింపుల వీడియోలు వెలుగు చూసి వివాదం పెద్దదైన నేపథ్యంలో రేవణ్ణ ఏప్రిల్ 27న బెంగళూరు నుంచి జర్మనీ వెళ్లిపోయాడు. కాగా, రేవణ్ణ జేడీఎస్ తరపున హసన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీలో ఉన్నారు. ఇక్కడ ఏప్రిల్ 26న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
HD Revanna: అంతా రాజకీయ కుట్ర
బెంగళూరు/శివమొగ్గ: తనపై, తన కుమారుడు ప్రజ్వల్‌పై లైంగిక వేధింపులు, కేసులు అంతా రాజకీయ కుట్రలో భాగమని కర్ణాటక జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ వ్యా ఖ్యానించారు. సోమవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర కోణం ఉంది. ఆరోపణలపై దర్యాప్తును ఎదుర్కొంటా. ఆరోపణల్లో నిజం ఉందని దర్యాప్తులో తేలితే ఎలాంటి శిక్ష అనుభవించడానికైనా సిద్ధం. నాలుగైదేళ్లనాటి పాత అంశాలను పట్టుకుని ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. సిట్ దర్యాప్తు చేశాక నిజాలు బయటికొస్తాయిగా. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. వాళ్లనుకున్నదే చేస్తారు. ఇవన్నీ ఈనాటివి కాదు. కాంగ్రెస్ నేతలు ఆరోపించినట్లుగా ఇది పెద్ద సెక్స్ కుంభకోణమే అయితే సిట్ ఏర్పాటుచేశారుగా. సమగ్ర దర్యాప్తు చేయనివ్వండి. సాధారణంగానే ప్రజ్వల్ విదేశాలకు వెళ్తాడు. ఇప్పుడూ అలాగే వెళ్లాడు. ఎఫ్ఐఆర్ వేస్తారనిగానీ, సిట్‌తో దర్యాప్తు చేయిస్తారనిగానీ ప్రజ్వల్‌కు తెలీదు. దర్యాప్తు అధికారులు ఆదేశించినప్పుడు ప్రజ్వల్ వచ్చి వారికి సహకరిస్తాడు’’ అని రేవణ్ణ చెప్పారు.పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్!లైంగిక ఆరోపణల నేపథ్యంలో ప్రజ్వల్‌ను సస్పెండ్ చేయాలనే నిర్ణయానికొచ్చినట్లు జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి సోమ వారం చెప్పారు. ‘‘ ప్రజ్వల్‌పై ఆరోపణలు నిజమైతే ఆయనకు శిక్ష పడాల్సిందే. వివాదంలో ప్రజ్వల్‌ను వెనకేసుకొచ్చే ప్రసక్తే లేదు. తప్పు అని తేలితే కఠినచర్యలు తీసు కోవాల్సిందేనని మా కుటుంబం మొత్తం కోరుకుంటోంది. ప్రజ్వల్ సస్పెన్షన్ నిర్ణయా న్ని మంగళవారం హుబ్బళిలో పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ప్రతిపాదిస్తాం. పార్ల మెంట్‌సభ్యుడు కాబట్టి నిర్ణయం ఢిల్లీ స్థాయి లో జరగాలి. ఈ విషయాన్ని జేడీఎస్ జాతీ య అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడకు వివరించా’’ అని కుమారస్వామి అన్నారు. -
అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ కుమారుడు హెచ్డీ రేవణ్ణతోపాటు ఆయన మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణలపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు హోళెనరసిపుర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవిగా వైరల్ అవుతున్న అసభ్యకరమైన వీడియోల వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి ఎమ్మెల్యే హెడ్డీ రేవణ్ణ స్పందించారు. అసభ్యకరమైన వీడియోల వ్యవహారం.. పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర. ఇక ఆ వీడియోలు నాలుగైదేళ్ల కిందటివని అన్నారు.‘ఇలాంటిది ఒక కుట్ర జరుగుతుందని నాకు ముందే తెలుసు. నేను వాటికి భయపడి పారిపోయేవాడిని కాదు. మాకు వ్యతిరేకంగా విడుదల చేసిన వీడియోలు నాలుగైదేళ్ల కిందటివి. ప్రజ్వల్ విదేశానికి వెళ్లాడు. అతనికి తనపై నమోదైన ఎఫ్ఐఆర్ గురించి తెలియదు’ అని హెచ్డీ రేవణ్ణ తెలిపారు. ఈ కేసులో చట్టపరంగా చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలన్నారు. కాంగ్రెస్ హయాంలో గత 40 ఏళ్లుగా సీఐడీ, సిట్ వంటి అనేక విచారణలు తాము ధైర్యంగా ఎదుర్కొన్నామని తెలిపారు.ఇక.. ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారంలో దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ప్రజ్వల్ భారత్ వదిలి జర్మనీ వెళ్లారు. దీంతో ఈ కేసుపై సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది. -
దేవెగౌడ మనవడు ఎంపీ రేవణ్ణకు ఉపశమనం
న్యూఢిల్లీ: 2019 ఎన్నికల్లో హాసన్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఎన్నికైన జెడి-ఎస్ ఏకైక ఎంపి ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీం కోర్టు ఉపశమనం కలిగించింది. రేవణ్ణపై ఎన్నికల అనర్హత వేటు వేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ముగ్గురు జడ్జిలతో కూడిన ధర్మాసనం రేవణ్ణ ఎన్నిక చెల్లదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారన్న ఆరోపణలపై జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎంపిక చెల్లదంటూ ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. తాజాగా సుప్రీం కోర్టు హైకోర్టు నిర్ణయంపై స్టే విధించడంతో ప్రజ్వల రేవణ్ణకు కొంత ఉపశమనం లభించినట్టైంది. వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రేవణ్ణను అనుమతించాలని ఆయన తరపు న్యాయవాది కెకె వేణుగోపాల్ కోర్టును అభ్యర్థించగా, సుప్రీం కోర్టు అందుకు కూడా అనుమతించింది. ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ మనవడు మాజీ మంత్రి రేవణ్ణ కుమారుడు. ఇది కూడా చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం -
దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు షాక్..
సాక్షి, బెంగళూరు: జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు న్యాయస్థానంలో భారీ షాక్ తగిలింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు పొందుపరిచినందుకు ఎంపీగా రేవణ్ణ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కర్ణాటక హైకోర్టు ప్రకటించింది. అతడి ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు తీర్పులో పేర్కొంది. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణ జేడీఎస్ తరఫున హసన్ లోక్‌సభ స్థానానికి ఎంపీగా గెలిచారు. ఆ ఎన్నికల్లో జేడీఎస్ తరపున లోక్‌సభకు ఎన్నికైన ఒకే ఒక్క నేత ప్రజ్వల్. అయితే రేవణ్ణ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని, ఎన్నికల కమిషన్‌కు తన ఆస్తులను ప్రకటించలేదని ఆరోపిస్తూ ఆయనపై కర్ణాటక హైకోర్టు రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. నియోజకవర్గానికి చెందిన ఓటరు జీ దేవరాజేగౌడతోపాటు రేవర్ణ చేతిలో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఏ మంజు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై శుక్రవారం జస్టిస్ కె నటరాజన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చింది నిజమేనని తేల్చింది. ఎంపీగా అతడి ఎన్నిక చెల్లదని చెప్పింది. చదవండి: ఆదిత్య ఎల్1: సూర్యుడిపై సరికొత్త ప్రయోగం.. US, చైనాకు ధీటుగా.. అంతేగాక వచ్చే 6 సంవత్సరాల పాటు రేవణ్ణ ఏ విధమైన ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. అలాగే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందుకు ప్రజ్వల్ రేవణ్ణపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉండగానే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై హైకోర్టు అనర్హత వేటు వేయడం గమనార్హం. అయితే, రేవణ్ణ అనర్హతతో తనను ఎంపీగా ప్రకటించాలని బీజేపీ అభ్యర్థి మంజు కోరగా... ఆమె అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. మంజు పైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. ఇక లోక్‌భ ఎన్నికల్లో రేవణ్ణపై బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మంజు ఆ తరువాత జీడీఎస్‌లో చేరారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
దేవెగౌడ మనవడిపై హత్యాయత్నం కేసు
బెంగళూరు: కర్ణాటకలో గురువారం 15 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో జేడీఎస్‌కు షాక్ తగిలింది. నలుగురు బీజేపీ కార్యకర్తల మీద హత్యాయత్నం చేశారంటూ మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు సూరజ్ రేవన్నపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. హసన్ జిల్లాలోని చన్నరాయపట్న పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. జేడీఎస్ నుంచి బీజేపీలోకి మారిన కార్యకర్తల ఇళ్లపై దాదాపు 150–200 మంది వచ్చి దాడి చేశారని, ఆస్తులను ధ్వంసం చేశారని బీజేపీ ఆరోపించింది. గాయపడిన తమ కార్యకర్తలను ఆస్పత్రికి తరలించామని చెప్పారు. సరైన సమయానికి పోలీసులు రాకపోయి ఉంటే పరిస్థితి మరింత చేజారేదని అన్నారు. దీంతో సూరజ్ సహా ఆరు మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఆరోపణలను జేడీఎస్ ఖండించింది. -
బరిలో మనవళ్లు.. హసన్‌ను వదులుకుంది అందుకేనా?!
బెంగళూరు : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ తెలిపారు. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీట్ల పంపకాల విషయమై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి వేణుగోపాల్, మాజీ సీఎం సిద్ధరామయ్యతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హసన్ లోక్‌సభ స్థానం నుంచి దేవెగౌడ మనుమడు, కర్ణాటక మంత్రి రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ ఎన్నికల బరిలో దిగనున్నారనే ప్రచారం జోరందుకుంది. నిఖిల్ కుమారస్వామికి కూడా ఛాన్స్! నెల రోజుల క్రితం బెంగళూరులో జరిగిన జేడీఎస్ నేత, ఎమ్మెల్సీ బీఎం ఫరూఖ్ కూతురి పెళ్లికి ఎంపీ దేవెగౌడ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మనుమలు నిఖిల్ (కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు, కన్నడ హీరో), ప్రజ్వల్ (మంత్రి రేవణ్ణ కుమారుడు) తమ తాతయ్యతో ముచ్చటించిన దృశ్యాలు అందరినీ ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో నిఖిల్, ప్రజ్వల్‌లు త్వరలోనే రాజకీయ అరంగేట్రం ఖరారైందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పోటీ చేసే విషయమై వీరిరువురు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. హసన్‌ను వదులుకుంది అందుకేనా? జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ ప్రస్తుతం హసన్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో పార్టీకి మంచి పట్టు ఉంది. గత ఆరు పర్యాయాలుగా(ఉప ఎన్నికలు సహా) హసన్‌లో జేడీఎస్ గెలుపు జెండా ఎగురవేస్తూనే ఉంది. ఇక్కడి నుంచే దేవెగౌడ ఎంపీగా హ్యాట్రిక్ కూడా కొట్టారు. ఈ నేపథ్యంలో రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్.. తాతయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచే బరిలో నిలవాలని ఆశిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ప్రజ్వల్ పార్టీ టికెట్ ఆశించారని.. అయితే అప్పుడు కుదరకపోవడంతో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు అవకాశం కల్పించేందుకు దేవెగౌడ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన దేవెగౌడ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హసన్ నుంచి తాను పోటీచేయబోనని, తన స్థానంలో ప్రజ్వల్ పోటీ చేస్తారని తెలిపారు. ప్రస్తుతం తాను పోటీచేసే విషయమై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. దీంతో నిఖిల్ కూడా తనకు టికెట్ ఇచ్చే విషయమై దేవెగౌడపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే తండ్రి కుమారస్వామి నుంచి మాట తీసుకున్న నిఖిల్ మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు సన్నిహితులు పేర్కొన్నారు. ‘ ఒకవేళ ప్రజ్వల్ పోటీ చేయడం ఖాయమైతే, నిఖిల్ కూడా తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఇద్దరిలో ఏ ఒక్కరికి దేవెగౌడ నో చెప్పలేరు అని అభిప్రాయపడ్డారు. కాగా జేడీఎస్ నుంచి ఇప్పటికే దేవెగౌడ ఎంపీగా, కుమారస్వామి సీఎంగా, ఆయన భార్య అనితా కుమారస్వామి ఎమ్మెల్యేగా, రేవణ్ణ మంత్రి(పీడబ్ల్యూడీ)గా, ఆయన భార్య భవానీ హసన్ జిల్లా పంచాయతీ సభ్యురాలిగా వివిధ పదవుల్లో ఉన్నారు. దీంతో ఇప్పటికే కొంతమంది పార్టీ సీనియర్ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మరో ఇద్దరు వారసులు కూడా అరంగేట్రం చేయనుండటంపై వారు ఎలా స్పందిస్తారోనన్న విషయం ఆసక్తికరంగా మారింది. -
దీన్నేమంటారు ?
బొమ్మనహళ్లి : రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి రేవణ్ణ కొడగులో వరద బాధితులకు బిస్కెట్ పాకెట్లను విసిరివేయడం తప్పని చెబుతున్న బీజేపీ నాయకులు మాజీ సీఎం యడ్యూరప్ప తన పుట్టిన రోజున కేక్ కట్ చేసి చాకుతో విద్యార్థులకు కేక్ తినిపించడాన్ని ఏమనాలని జేడీఎస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు వారు సోషల్ మీడియాలో యడ్యూరప్ప చాకుతో ఓ విద్యార్థికి కేక్ తినిపిస్తున్న ఫొటో పెట్టడంతో అది వైరల్‌గా మారింది. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న యడ్యూరప్ప ఇటీవల పేదల మధ్య తన పుట్టిన రోజును జరుపుకొని వారికి కేక్ చేత్తో తినిపించకుండా చాకుతో తినిపించడాన్ని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు. -
రాష్ట్రానికి ముగ్గురు సీఎంలా?
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరో తేల్చిచెప్పాలని జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడను బీజేపీ ప్రశ్నించింది. అసలు ప్రస్తుత సీఎం ఎవరంటూ చమత్కరించింది. ఒక రాష్ట్రానికి ముగ్గురు వ్యక్తులు సీఎంగా వ్యవహరిస్తున్నారని కర్ణాటక బీజేపీ శాఖ మంగళవారం ట్వీట్ చేసింది. కుమారస్వామి సోదరుడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్(పీడబ్ల్యూడీ) మంత్రి రేవణ్ణ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ మంత్రుల శాఖల్లో ఆయన కల్పించుకుని పెత్తనం చలాయిస్తున్నారంటూ ట్విటర్లో పేర్కొంది. దేవెగౌడ కూడా రాష్ట్ర పరిపాలన వ్యవహరాల్లో తలదూరుస్తున్నారని, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సీఎంలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించింది. ‘అనేక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచుస్తున్నారు. అసలు మీలో ఎవరు సీఎం అని ప్రజలకు సందేహంగా ఉంది. ముందు నిజమైన సీఎం ఎవరో తేల్చుకోండి’ అని ట్విట్ చేసింది. దేవెగౌడ కుమారుడు కుమారస్వామి కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో సీఎంగా ఎన్నికైన విషయం తెలిసిందే. తండ్రి, ఇద్దరు కొడుకులు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని, జేడీఎస్‌ని కుటుంబ పార్టీగా బీజేపీ వర్ణించింది. బీజేపీ వ్యాఖ్యలపై జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ విశ్వనాధ్ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ నేతలు అర్థమంతంగా మాట్లాడాలని హెచ్చరించారు. -
అమ్మో.. సొంతింటిలో నిద్రపోవడమా?
సాక్షి, బెంగళూరు: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 170 కిలోమీటర్ల ప్రయాణం రోజూ చేయడమంటే మాటలా? కానీ నమ్మకం అలా చేయిస్తోంది. ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి సోదరుడు, ప్రజాపనుల శాఖ మంత్రి హెచ్డీ రేవణ్ణ జ్యోతిష్య నమ్మకాలతో రోజూ 340 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. ప్రతి రోజూ నియోజకవర్గం (హోళెనరసిపుర) నుంచి రాజధాని బెంగళూరుకు రానుపోను ప్రయాణాలు సాగిస్తున్నారు. బెంగళూరులోని బనశంకరి ఫేజ్–2లో ఆయనకు పెద్ద ఇల్లు ఉంది. దేవగౌడ కుటుంబానికి సంబంధించిన నగరంలో, ఆ చుట్టు పక్కల పదుల సంఖ్యలో ఇళ్లు కూడా ఉన్నాయి. అయినా వాటిలో ఉండేందుకు ఆయన ఏ మాత్రం సుముఖంగా లేరు. అందుకు కారణం ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటే. మంత్రిగా ఉన్నన్నాళ్లు నగరంలోని సొంత ఇంట్లో నిద్రిస్తే దురదృష్టం వెంటాడుతుందని చెప్పారట. అంతేకాదు ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించటంతో అప్పటి నుంచి ఆయన రాత్రిపూట నగరంలో ఉండేందుకు తటపటాయిస్తున్నారు. అయితే ప్రభుత్వ బంగ్లాలో ఉండొచ్చని జ్యోతిష్యుడు సూచించినట్లు తెలుస్తోంది. మంత్రి ఏమంటున్నారు? మంత్రి రేవణ్ణకు ఇంత వరకు ప్రభుత్వ బంగ్లా కేటాయింపు జరగలేదు. కుమార పార్క్ వెస్ట్‌లోని బంగ్లాలో మాజీ మంత్రి హెచ్‌సీ మహదేవప్ప ఉన్న బంగ్లాలో రేవణ్ణ చేరాల్సి ఉంది. కానీ మహదేవప్ప మూడు నెలల గడువు కోరారు. రోజూ నియోజకవర్గం నుంచి బెంగళూరుకు రాకపోకలపై మంత్రి రేవణ్ణ స్పందిస్తూ.. ‘నాకు ఇంతదాకా బంగ్లా కేటాయించలేదు. అందుకే ఇలా తిరగాల్సి వస్తోంది’ అని చెప్పారు. బెంగళూరు– హోళెనరసిపుర మధ్య దూరం 170 కిలోమీటర్లు, మూడు గంటలకు పైగానే ప్రయాణం. ఇలా మొత్తం అంతా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ వ్యవహారంపై జేడీఎస్ నేత ఒకరు స్పందిస్తూ.. ‘ఎవరి నమ్మకాలు వారివి’ అన్నారు. -
జ్యోతిష్కుడు చెప్పాడని...
మూఢనమ్మకాల జాడ్యం గురించి ప్రజల్లో అవగాహన కోసం ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ.. ప్రజాప్రతినిధి, స్వయానా సీఎం సోదరుడు వాటిని ఆచరించటం చర్చనీయాంశమే. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి సోదరుడు, మంత్రి హెచ్డీ రేవణ్ణ దురదృష్టాన్ని దూరం చేసుకునేందుకు రోజూ 340 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. ప్రతీరోజూ నియోజకవర్గం(హోలెనరసిపుర), రాజధాని బెంగళూరు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ వార్తల్లో నిలిచారు. సాక్షి, బెంగళూరు: నిజానికి బెంగళూరులోని బనశంకరి ఫేజ్-2లో ఆయనకు లంకంత కొంప ఉంది. అంతేకాదు దేవగౌడ కుటుంబానికి సంబంధించిన నగరంలో, ఆ చుట్టు పక్కల పదుల సంఖ్యలో ఇళ్లులు ఉన్నాయి. అయినా వాటిలో ఉండేందుకు ఆయన ఏ మాత్రం సుముఖంగా లేరు. అందుకు కారణం ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటే. మంత్రిగా ఉన్ననాళ్లు నగరంలోని సొంత ఇంట్లో నిద్రిస్తే దురదృష్టం వెంటాడుతుందని చెప్పాడంట. అంతేకాదు ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించటంతో అప్పటి నుంచి ఆయన రాత్రిపూట నగరంలో ఉండేందుకు తటపటాయిస్తున్నారు. అయితే ప్రభుత్వ బంగ్లా కేటాయిస్తే అందులో హాయిగా ఉండొచ్చని జ్యోతిష్యుడు సూచించాడు. దీంతో బంగ్లా కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారణం చేశాక రేవణ్ణకు ఇంత వరకు బంగ్లా కేటాయింపు జరగలేదు. కుమార పార్క్ వెస్ట్‌లోని బంగ్లాలో మాజీ మంత్రి హెచ్ సీ మహదేవప్ప ఉన్నారు. ఖాళీ చేసేందుకు మూడు నెలల గడువు కోరటంతో చేసేది లేఖ రేవణ్ణ అప్ అండ్ డౌన్ జర్నీలతో గడుపుతున్నారు. ఈ వ్యవహారంపై రేవణ్ణ స్పందిస్తూ... ‘నాకు ఇంతదాకా బంగ్లా కేటాయించలేదు. అందుకే ఇలా తిరగాల్సి వస్తుంది’ అని తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు- హోలెనరసిపుర మధ్య దూరం 170 కిలోమీటర్లు, మూడు గంటలకు పైగానే జర్నీ. కాన్వాయ్‌లోని వాహనాలు, సిబ్బంది ఖర్చులు, ఇలా మొత్తం అంతా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ వ్యవహారంపై జేడీఎస్ నేత ఒకరు స్పందిస్తూ.. ‘ఎవరి నమ్మకాలు వారివి’ అని తెలిపారు. పలువురు మాత్రం ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. కుమారస్వామికి కలిసొచ్చిన ఇల్లు... -
రేవణ్ణతో అగచాట్లు..!!
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కొత్త చిక్కుల్లో పడ్డారు. కేబినెట్ కేటాయింపుల్లో మిత్రపక్షం కాంగ్రెస్‌తో కన్నా సొంత అన్నయ్య రేవణ్ణ నుంచి ఆయనకు తలనొప్పి ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్(పీడబ్ల్యూడీ), విద్యుత్ శాఖలను తనకే కేటాయించాలని రేవణ్ణ పట్టుబట్టినట్లు సమాచారం. రేవణ్ణ అంటే మాజీ ప్రధాని దేవెగౌడకు ప్రాణం. అందుకే ఆయన కోరిక మేరకు రాహుల్‌తో దేవెగౌడ చర్చలు జరిపి ఒప్పించారు కూడా. 2004-2006ల మధ్య కాంగ్రెస్-జేడీఎస్‌ల కూటమి ప్రభుత్వంలో, 2006-2007ల మధ్య జేడీఎస్-బీజేపీ ప్రభుత్వంలో రేవణ్ణ ఈ పోర్ట్‌ఫోలియోలను చేపట్టారు. కాగా, రేవణ్ణకు రెండు శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవణ్ణపై తాను ఎలాంటి కామెంట్ చేయబోనని అన్నారు. పార్టీ తనకు ‘వాచ్‌మన్’ ఉద్యోగం ఇచ్చిందని తాను దాన్ని సక్రమంగా నిర్వహిస్తానని మీడియాతో బహిరంగంగా శివకుమార్ వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో సిద్ధారామయ్య కేబినెట్లో శివకుమార్ విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశారు. కాగా, రెండు పోర్ట్‌ఫోలియోలతో పాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హసన్ జిల్లా నుంచి మరే ఎమ్మెల్యేను మంత్రిగా చేయొద్దని రేవణ్ణ కుమారస్వామి, దేవెగౌడలను కోరినట్లు రిపోర్టులు వస్తున్నాయి. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణకు కుమారస్వామి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడంతో అతను కోపంతో ఊగిపోతున్నట్లు స్థానిక జేడీఎస్ నేతలు చెబుతున్నారు. ఈ మధ్య రేవణ్ణ ఇంటికి వెళ్లిన కుమారస్వామిని ప్రజ్వల్, రేవణ్ణ భార్య పలకరించలేదని కూడా సమాచారం. కాగా, ఎన్నికల వల్ల దేవెగౌడ కుటుంబంలో మనస్పర్దలు వచ్చినట్లు గౌడ సన్నిహితుడు ఒకరు తెలిపారు. కుటుంబం మొత్తాన్ని ఒకేతాటిపైకి తెచ్చేందుకు దేవెగౌడ తీవ్రంగా యత్నిస్తున్నట్లు వెల్లడించారు. కావాలనే ప్రజ్వల్‌ను కుమారస్వామి రాజకీయాలకు దూరంగా పెడుతున్నట్లు రేవణ్ణ భావిస్తున్నారని చెప్పారు. తన తనయుడు నిఖిల్ కుమార్‌ను ప్రమోట్ చేసుకునేందుకే కుమారస్వామి ఇలా చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కుటుంబంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు దేవెగౌడ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజ్వల్‌ను తన స్థానంలో నిలబెడతానని చెప్పినట్లు తెలిసింది. కాగా, బుధవారం కాంగ్రెస్-జేడీఎస్‌ల కూటమి కర్ణాటకలో కేబినేట్‌ను విస్తరించనుంది. -
సభలో యెడ్డీ ప్రసంగిస్తున్న వేళ...
సాక్షి, బెంగళూరు: విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం కర్ణాటక సీఎం యెడ్యూరప్ప.. అసెంబ్లీలో భావోద్వేగంగా ప్రసంగించారు. ఆ సమయంలో జేడీఎస్ చీఫ్ కుమారస్వామి సోదరుడు, జేడీఎస్ ఎమ్మెల్యే రేవణ్ణ సీరియస్‌గా కునుకు తీశారు. మరోవైపు ప్రమాణ స్వీకారం ముగిశాక భోజన విరామ సమయంలో సీఎల్పీ నేత సిద్ధరామయ్య కూడా ఆదమరిచి నిద్రపోయారు. ఓవైపు బలనిరూపణ గురించి కాంగ్రెస్-జేడీఎస్ నేతలంతా హడావుడి పడుతుంటే.. వాళ్లు కూల్‌గా కునుకు తీయటం విశేషం. ఇంకోవైపు సోషల్‌మీడియాలో వాళ్ల ఫోటోలపై జోకులు పేలుతున్నాయి. ఏదైతేనేం తమ వద్ద తగినంత బలం లేదని ఒప్పుకున్న యడ్యూరప్ప చివరకు ఓటమిని అంగీకరిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
అనూహ్యంగా తెరపైకి రేవణ్ణ..!
సాక్షి, బెంగళూరు : జేడీఎస్ సీనియర్ నేత, హెచ్డీ దేవెగౌడ రెండో తనయుడు రేవణ్ణ బుధవారం అనూహ్యంగా తెరపైకి వచ్చారు. తన తమ్ముడు కుమారస్వామిని జేడీఎస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నామని ఆయన స్వయంగా తెలిపారు. తద్వారా తాను బీజేపీతో చేతులు కలుపబోతున్నట్టు వస్తున్న ఊహాగానాలకు రేవణ్ణ చెక్ పెట్టారు. జేడీఎస్ఎల్పీ భేటీ తర్వాత కుమారస్వామితో కలిసి రేవణ్ణ విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. మ్యాజిక్ ఫిగర్‌కు ఆ పార్టీ కొద్ది దూరంలో నిలిచిపోవడంతో ఇతర పార్టీల నుంచి వలసలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా దేవెగౌడ సొంత కుటుంబంలోని వర్గపోరును ఆసరా చేసుకొని.. రేవణ్ణను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు కథనాలు వచ్చాయి. రేవణ్ణకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేయడం ద్వారా ఆయనను తమవైపు ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నించింది. రేవణ్ణకు 12 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో సులభంగా బలపరీక్ష గండాన్ని గట్టెక్కవచ్చునని బీజేపీ భావించినట్టు కథనాలు వచ్చాయి. దేవేగౌడకు నలుగురు తనయులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దేవేగౌడ మూడో కుమారుడు కుమారస్వామి. తమ్ముడు కుమారస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై రేవణ్ణకు వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం జరిగింది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప కూడా రేవణ్ణ వర్గం మద్దతు తమ పార్టీకి ఉందని గవర్నర్‌తో చెప్పినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలకు, ఊహాగానాలకు చెక్ పెడుతూ.. తాను తమ్ముడి వెంటే ఉన్నానని, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అని రేవణ్ణ స్పష్టం చేశారు. -
హెచ్డీ రేవణ్ణకు మళ్లీ పెళ్లి
హాసన్(బొమ్మనహళ్లి): జేడీఎస్ నాయకుడు, మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ మళ్లీ పెళ్ళి చేసుకున్నారు. ఆయన పెళ్ళి చేసుకుంది ఎవరినో కాదు, భార్య భవానీనే. ఇటీవలే 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన షష్టిపూర్తి వేడుకను తల్లిదండ్రులు దేవెగౌడ, చెన్నమ్మ, తనయుడు ప్రజ్వల్, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి తన భార్య భవాని మెడలో మూడుముళ్లు వేశారు. ఈ వేడుకలు హాసన్‌లోని జ్ఞానాక్షి కన్వెన్షన్ హాల్లో సందడిగా జరిగాయి. ఆదిచంచనగిరి మఠం అధిపతి శ్రీనిర్మలానందనాథ స్వామి పాల్గొని రేవణ్ణ దంపతులను ఆశీర్వదించారు. -
ప్రమాణంగా చెబుతున్నా డబ్బు తీసుకోలేదు
జేడీఎస్ నేత హెచ్.డి.రేవణ్ణ స్పష్టీకరణ బెంగళూరు: రాజ్యసభతో పాటు శాసనమండలి ఎన్నికల్లో సీట్ల కేటాయింపు కోసం అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని జేడీఎస్ నేత హెచ్.డి.రేవణ్ణ స్పష్టం చేశారు. తాను ఏ అభ్యర్థి నుంచి రూపాయి కూడా తీసుకోలేదని అన్నారు. ఈ విషయంపై దేవుడి ముందు ప్రమాణం చేసేందుకు కూడా సిద్ధమని పేర్కొన్నారు. మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసేందుకు తాము డబ్బులు తీసుకోలేదని జేడీఎస్ రెబల్ అభ్యర్థులు దేవుడి ఎదుట ప్రమాణం చేసేందుకు సిద్ధమేనా అని రేవణ్ణ ప్రశ్నించారు. ‘రెబల్ ఎమ్మెల్యేల్లో ఎవరినైనా రమ్మని చెప్పండి, ధర్మస్థల మంజునాథ స్వామి సన్నిధిలోనైనా లేదంటే మైసూరు చాముండేశ్వరి దేవి సన్నిధిలోనైనా సరే ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. గతంలో జేడీఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన విజయ్‌మాల్యా, రాజుచంద్ర శేఖర్ ఇలా ఎవరినైనా అడగండి, వారి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. రెబల్ అభ్యర్థులపై నేను ఏనాడూ విమర్శలు చేయలేదు. అయినా కూడా నాపై, పార్టీపై ఆరోపణలు, విమర్శలకు దిగుతున్నారు. పార్టీ తరఫున నిర్ణయాలు తీసుకోవడానికి నేను జాతీయ అధ్యక్షుడు కాదు, రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని కాదు’ అని రేవణ్ణ పేర్కొన్నారు. కాగా, రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఏజంట్‌గా వ్యవహరించినందున పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన వారి వివరాలను పార్టీ అధినాయకత్వానికి అందజేశానని రేవణ్ణ వెల్లడించారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్సీకి ‘డాన్’ నుంచి కాల్
రూ. 10 కోట్లు ఇవ్వాలని హుకుం కుమారుడిని చంపేస్తానని బెదిరింపు పోలీసులను ఆశ్రయించిన రేవణ్ణ కుమారుడితో పాటు ‘లక్ష్మణ’ చిత్ర దర్శకుడికి పోలీసు భద్రత బెంగళూరు: అధికార కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడు హెచ్.ఎం రేవణ్ణకు మాఫియా డాన్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. రూ.10 కోట్ల సొమ్ము ఇవ్వకపోతే అతని కుమారుడు, నటుడు అనూప్తోపాటు ‘లక్ష్మణ’ చిత్ర దర్శకుడు చంద్రను చంపుతాననేది సదరు కాల్ సారాంశం. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితులకు పోలీసు భద్రతను పెంచి కేసును దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు... జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఈనెల 11న హెచ్.ఎం రేవణ్ణ బెళగావికి వెళ్లారు. అక్కడి పనులను ముగించుకుని అదే రోజు సాయంత్రం బెంగళూరుకు రావడానికి స్థానిక విమానాశ్రయంలో వేచి ఉన్న సమయంలో సుమారు 4:40గంటలకు ఆయన సెల్‌ఫోన్‌కు ఒక కాల్ వచ్చింది. అయితే సదరు నంబర్ హెచ్.ఎం రేవణ్ణ సెల్‌ఫోన్ స్క్రీన్‌పై కనిపించలేదు. అయినా రేవణ్ణ కాల్ రిసీవ్ చేసుకున్నారు. వెంటనే...‘నేను రవి పూజారి. బాగున్నారా. మీ కుమారుడు నటిస్తున్న లక్ష్మణ సినిమాకు భారీగానే ఖర్చు పెట్టినట్లు ఉన్నారు. నాకు రూ.10 కోట్లు ఇవ్వండి. అకౌంట్ నంబర్ పంపిస్తాను. లేదంటే...’ అని బెదిరించాడు. దీంతో కోపగించుకున్న రేవణ్ణ కాల్‌ను కట్ చేశారు. అనంతరం సాయంత్రం 5:10 గంటలకు మరోసారి కాల్ చేసి నేను చెప్పినంత డబ్బు ఇవ్వక పోతే నీ కుమారుడితో పాటు చిత్రదర్శకుడి ప్రాణాలు దక్కవు.’ అని బెదిరించారు. ఫోన్లో ఏ విషయమూ చెప్పని రేవణ్ణ నేరుగా బెంగళూరు చేరుకుని నగర కమిషనర్ మేఘరిక్‌కు పరిస్థితి మొత్తం వివరించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రేవణ్ణ, అతని కుమారుడు అనూప్, లక్ష్మణ చిత్ర దర్శకుడు చంద్రకు పోలీసు భద్రత పెంచారు. ఈ బెదిరింపు కాల్ విషయమై రేవణ్ణ మాట్లాడుతూ...‘నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం లేదు. భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మిస్తుండటం వల్లే బెదిరింపు కాల్ వచ్చింది. నేను ఇలాంటి వాటికి భయపడను. పోలీసులు నాకు భద్రత పెంచడమే కాకుండా నా కుమారుడు అనూప్‌తో పాటు చిత్రదర్శకుడు చంద్రుకు పోలీసు భద్రత కల్పించారు.’ అని అన్నారు. ఇదిలా ఉండగా, రేవణ్ణ నివసిస్తున్న ప్రాంతమైన మహాలక్ష్మీలే అవుట్ పోలీస్ స్టేషన్లో బెదిరింపుకాల్ విషయమై కేసు నమోదైంది. అనంతరం ఈ కేసు సీసీబీకు బదిలీ అయ్యింది. ప్రస్తుతం సీసీబీ పోలీసులు బెళగావి పోలీసు సహకారంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.