బెంగళూరు: అసభ్య వీడియోల కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ నివాసంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) శనివారం దర్యాప్తు చేట్టింది. మరోవైపు..ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణలపై రాష్ట్ర హోంమంత్రి గంగాధరయ్య పరమేశ్వర మరోసారి లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.
‘ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్‌డీ రేవణ్ణలకు లుక్‌అవుట్ నోటీసులు పంపించాం. హెడ్‌డీ రేవణ్ణ విదేశాలను వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అందుకే రెండోసారి లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశాం. వీటిని శుక్రవారమే జారీ చేశాం. నోటీసులకు సమాధానం ఇవ్వడానికి ఇవాళ సాయంత్రం వరకు సమయం ఉంది’ అని హోం మంత్రి గంగాధరయ్య పరమేశ్వర తెలిపారు. ఇప్పటికే ఒకసారి లుక్ అవుట్ నోటీలు జారీ చేయగా..దర్యాప్తు బృందం ముందు హాజరుకావడానికి సమయం కావాలని కోరారు. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి నోటీసులు పంపించారు.
ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళపై లౌంగిక దాడులకు పాల్పడినట్లు కేసు నమోదైంది. ఆయనకు సంబంధించినగా కొన్ని అసభ్య వీడియోలు సోషల్‌మీడియాలో వైరలైన అనంతరం ప్రజ్వల్ ఇండియా విడిచి విదేశాలకు వెళ్లారు. అయితే లోక్‌సభ ఎన్నికలు జరుతున్న సమయంలో కర్ణాటక రాష్ట్రంలో అసభ్య వీడియోల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది.
మరోవైపు.. ఈ వ్యవహారంలో బాధితులకు తగిన సాయం అందించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశారు. ‘ న్యాయం కోసం పోరాటం చేస్తున్న బాధిత మహిళలు సంఘీభావం తెలపటానికి అర్హులు. ఈ క్రూరమైన నేరాలకు కారణమైన పార్టీలను చట్టం ముందకు తీసుకురావటం మన సమిష్టి బాధ్యత’అని రాహుల్ గాంధీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment