Obscene Videos
-
డైరెక్టర్‌పై కోపంతో సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు.. కేసు నమోదు!
బంజారాహిల్స్: అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడమే కాకుండా అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ దర్శకుడు, నిర్మాత షేక్ నాగుల్ షరీఫ్ పాన్ ఇండియా సినిమాను నిర్మించేందుకు సాగర్ సొసైటీలో కార్యాలయం తెరిచి నటీనటుల కోసం ఆడిషన్స్ సైతం మొదలు పెట్టారు. అంతే కాకుండా సినీ ప్రొడక్షన్లకు సంబంధించి ఇన్‌స్టా పేజ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాడు. ఈ పేజీ అడ్మిన్ బాధ్యతలను తన వద్ద పనిచేస్తున్న టి సృజన్‌కు అప్పగించాడు. కానీ సృజన్ ఇన్‌స్టా ద్వారా కొంత మందిని రకరకాలుగా వేధించడం మొదలు పెట్టాడు. (చదవండి: త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా? నిర్మాతపై పూనమ్ కౌర్ ఫైర్)విషయం తెలిసిన నాగుల్ అతన్ని విధుల్లో నుంచి తొలగించాడు. ఈ నెల 6న సృజన్ కార్యాలయానికి వచ్చి నాగుల్‌ను కలిసి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని కోరాడు. దీనికి నాగుల్ ఒప్పుకోలేదు. దీంతో సృజన్ సినీ ప్రొడక్షన్‌కు చెందిన ఇన్‌స్టా పేజీలో సినిమాకు సంబంధించిన విషయాలు తొలగించి అశ్లీల వీడియోలు, ఫొటోలను అప్లోడ్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆ చిత్రాలను కొంత మంది మహిళలకు పంపించాడు. విషయం తెలుసుకున్న షేక్ నాగుల్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
బెంగళూరు: లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. అసభ్య వీడియోలు సోషల్ మీడియాలో వైరలైన అనంతరం ఆయన దేశం వదిలి జర్మనీ వెళ్లిపోయారు. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.‘ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశాం. ఇంటర్‌పోల్ అన్ని దేశాలకు సమాచారం పంపించింది. ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ ఉన్నా పట్టుకోవాలని ఇంటర్‌పోల్ ఇతర దేశాల పోలీసులకు ఆదేశించింది’ అని కర్ణాటక హోం మంత్రి జీ. పరమేశ్వర ఆదివారం పేర్కొన్నారు. ప్రజ్వల్ రేవణ్ణను భారత్‌కు తీసుకురావడానికి సిట్ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసు పంపాలని సిట్(SIT)సీబీఐకి విజ్ఞప్తి చేసింది.ఇప్పటికే సిట్.. ప్రజ్వల్ రేవణ్ణపై రెండుసార్లు లుక్ అవుట్ నోటీసుల జారీచేసింది. మరోవైపు.. మహిళా కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ తండ్రి హెడ్డీ రేవణ్ణను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవి వైరల్ అయిన అసభ్యకర వీడియోలు, ప్రజ్వల్, ఆయన తండ్రిపై నమోదైన లైంగిక ఆరోపణల కేసు కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.బ్లూ కార్నర్ నోటీసులు అంటే?బ్లూ కార్నర్ నోటీసు ఇంటర్ పోల్ నోటీసుల్లో ఒక భాగం. ఇది ప్రపంచ వ్యాప్తంగా నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సమాచారం కోసం ఇతర దేశాలతో హెచ్చరికలు, అభ్యర్థనలకు అనుమతి ఇస్తుంది. ఇతర దేశాల్లోని పోలీసులతో సమన్వయమై.. కీలకమైన నేర సంబంధిత సమాచారాన్ని పంచుకోవడానికి అనుమతి ఇవ్వబడుతుంది. మొత్తం ఏడు రకాల నోటీసులు ఉంటాయి. రెండ్, ఎల్లో, బ్లూ, బ్లాక్, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్. నేర దర్యాప్తులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సంబంధించి అదనపు సమాచారం సేకరించడానికి, వ్యక్తి గుర్తింపు, ఎక్కడ ఉన్నాడో తెలిపే లొకేషన్ వంటి కీలకమైన విషయాలను తెలుసుకోవడానికి ‘బ్లూ కార్నర్’ నోటీసులు జారీ చేస్తారు. -
అసభ్య వీడియోల కేసు.. ప్రజ్వల్‌పై మరో లుక్అవుట్ నోటీసు
బెంగళూరు: అసభ్య వీడియోల కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ నివాసంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) శనివారం దర్యాప్తు చేట్టింది. మరోవైపు..ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణలపై రాష్ట్ర హోంమంత్రి గంగాధరయ్య పరమేశ్వర మరోసారి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు.‘ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్డీ రేవణ్ణలకు లుక్అవుట్ నోటీసులు పంపించాం. హెడ్డీ రేవణ్ణ విదేశాలను వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అందుకే రెండోసారి లుక్అవుట్ నోటీసులు జారీ చేశాం. వీటిని శుక్రవారమే జారీ చేశాం. నోటీసులకు సమాధానం ఇవ్వడానికి ఇవాళ సాయంత్రం వరకు సమయం ఉంది’ అని హోం మంత్రి గంగాధరయ్య పరమేశ్వర తెలిపారు. ఇప్పటికే ఒకసారి లుక్ అవుట్ నోటీలు జారీ చేయగా..దర్యాప్తు బృందం ముందు హాజరుకావడానికి సమయం కావాలని కోరారు. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి నోటీసులు పంపించారు.ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళపై లౌంగిక దాడులకు పాల్పడినట్లు కేసు నమోదైంది. ఆయనకు సంబంధించినగా కొన్ని అసభ్య వీడియోలు సోషల్‌మీడియాలో వైరలైన అనంతరం ప్రజ్వల్ ఇండియా విడిచి విదేశాలకు వెళ్లారు. అయితే లోక్‌సభ ఎన్నికలు జరుతున్న సమయంలో కర్ణాటక రాష్ట్రంలో అసభ్య వీడియోల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది.మరోవైపు.. ఈ వ్యవహారంలో బాధితులకు తగిన సాయం అందించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశారు. ‘ న్యాయం కోసం పోరాటం చేస్తున్న బాధిత మహిళలు సంఘీభావం తెలపటానికి అర్హులు. ఈ క్రూరమైన నేరాలకు కారణమైన పార్టీలను చట్టం ముందకు తీసుకురావటం మన సమిష్టి బాధ్యత’అని రాహుల్ గాంధీ అన్నారు. -
అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ కుమారుడు హెచ్డీ రేవణ్ణతోపాటు ఆయన మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణలపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు హోళెనరసిపుర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవిగా వైరల్ అవుతున్న అసభ్యకరమైన వీడియోల వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి ఎమ్మెల్యే హెడ్డీ రేవణ్ణ స్పందించారు. అసభ్యకరమైన వీడియోల వ్యవహారం.. పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర. ఇక ఆ వీడియోలు నాలుగైదేళ్ల కిందటివని అన్నారు.‘ఇలాంటిది ఒక కుట్ర జరుగుతుందని నాకు ముందే తెలుసు. నేను వాటికి భయపడి పారిపోయేవాడిని కాదు. మాకు వ్యతిరేకంగా విడుదల చేసిన వీడియోలు నాలుగైదేళ్ల కిందటివి. ప్రజ్వల్ విదేశానికి వెళ్లాడు. అతనికి తనపై నమోదైన ఎఫ్ఐఆర్ గురించి తెలియదు’ అని హెచ్డీ రేవణ్ణ తెలిపారు. ఈ కేసులో చట్టపరంగా చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలన్నారు. కాంగ్రెస్ హయాంలో గత 40 ఏళ్లుగా సీఐడీ, సిట్ వంటి అనేక విచారణలు తాము ధైర్యంగా ఎదుర్కొన్నామని తెలిపారు.ఇక.. ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారంలో దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ప్రజ్వల్ భారత్ వదిలి జర్మనీ వెళ్లారు. దీంతో ఈ కేసుపై సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది. -
పైశాచికత్వంపై కొరడా!
అతనో డాక్టర్. విజయవాడ నుంచి ఢిల్లీ వెళుతూ ఆన్లైన్లో ఓ బాలిక పోర్న్ వీడియో చూశాడు. అంతటితో ఆగని వైద్యుడు వీడియోను డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాలో ఉన్న తన ఫేక్ ఐడీ ద్వారా పబ్లిక్ డొమైన్లో షేర్ చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వివరాలన్నింటినీ సేకరించిన పోలీసులు.. ఆ డాక్టర్‌ను అరెస్ట్ చేసేందుకు వెళితే ఆ తప్పు తాను చేయలేదంటూ బుకాయించాడు. తీరా సాక్ష్యాలు చూపించాక తోక ముడవగా నిందితుడిని కోర్టుకు తరలించారు. చిత్తూరు అర్బన్: రాష్ట్రంలో గత నెల వరకు 1,787 మంది పిల్లల పోర్న్(అశ్లీల) వీడియోలను పలు సామాజిక మాధ్యమాల్లో, స్నేహితులకు షేర్ చేశారు. చట్ట విరుద్ధమైన ఈ నేరానికి పాల్పడిన వాళ్లపై క్రిమినల్ కేసుల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించుకుంది. ఇందులో భాగంగా నిందితుల వివరాలను 26 జిల్లాల ఎస్పీలకు అందజేయగా.. వాళ్లపై చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్(ఎన్‌సీఎంఈసీ).. అనేది అమెరికాకు చెందిన ఎలాంటి లాభాపేక్ష ఆశించని స్వచ్ఛంద సంస్థ. 2019లో ఈ సంస్థ మనదేశంతో ఒప్పందం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సహకారంతో ఇక్కడ పనిచేస్తోంది. ఈ సంస్థ తప్పిపోయిన, అక్రమ రవాణాకు గురైన పిల్లలతో పాటు లైంగిక దాడికి గురైన పిల్లల్ని సంరక్షిస్తుంది. అలాగే 18 ఏళ్లలోపు వయస్సున్న పిల్లలకు సంబంధించిన అసభ్య వీడియోలు(పోర్న్) ఇంటర్నెట్ నుంచి తీసుకుని మరొకరికి చేరవేయడం, సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేయడం వంటివి చేస్తే ఆ వీడియోలను తొలగించడంతో పాటు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది. ఇలా దేశంలోని ప్రతి రాష్ట్రంలో జిల్లాల వారీగా వివరాలు సేకరించి కేంద్ర హోంశాఖ ద్వారా ఆయా రాష్ట్రాల హోంశాఖలకు పంపుతోంది. లింగ భేదంతో సంబంధం లేకుండా పిల్లల గోప్యత, హక్కులను కాలరాసే ఈ చర్యను తీవ్రంగా పరిగణిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎస్సీఎంఈసీ పంపిన వివరాల ఆధారంగా నిందితులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అప్లోడ్ చేసినా, షేర్ చేసినా.. ఇక అంతే! ప్రతి నెలా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న నిందితుల వివరాలను టిప్‌లైన్ సాంకేతిక వ్యవస్థతో కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్ర హోంశాఖకు అందుతోంది. ఒక టిప్‌లైన్‌లో ఏ వ్యక్తి ఏ తేదీన, ఏ సమయంలో, ఏ మొబైల్/కంప్యూటర్ నుంచి ఏ పోర్న్ వీడియోను ఆప్‌లోడ్ చేశాడు? ఎందులో షేర్ చేశాడు? ఏ స్థలం నుంచి పోర్న్ వీడియో అప్లోడ్ చేశాడు? ఆ చిత్రం ఎన్ని నిమిషాలు ఉంది? ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరం ఇంటర్నెట్ ప్రొటోకాల్ అడ్రస్? అనే వివరాలను టిప్‌లైన్‌లో నిక్షిప్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సాంకేతిక సాక్ష్యాలు కేంద్రం నుంచి రాష్ట్ర పోలీస్‌కు అందుతున్నాయి. పోలీస్ శాఖ దీన్ని జిల్లాల వారీగా విభజించి ఓ ఫైల్‌ను సిద్ధం చేస్తోంది. ఇందులో ప్రతి మూడు నెలలకోసారి ఈ అశ్లీల వీడియోలు షేర్ చేసే వారి వివరాలుంటాయి. గత నెల వరకు రాష్ట్రంలో 1,787 మంది ఈ నేరానికి పాల్పడ్డట్టు నివేదిక అందింది. అత్యధికంగా గుంటూరులో 330, విశాఖ 270, ఎన్టీఆర్ విజయవాడ 238, కడప 126, నెల్లూరు 102, ప్రకాశం 94, అనంతపురం 90, తిరుపతి 77, శ్రీకాకుళం 70, చిత్తూరు 59, కాకినాడ 56, ప.గో 50, కర్నూలు 49, బాపట్ల 44, కృష్ణా 30, విజయనగరం 25, నంద్యాల 14, ఏలూరు 14, పల్నాడు 12, కోనసీమ 11, అన్నమయ్య 10, సత్యసాయి 6, అనకాపల్లి 4, పార్వతీపురం 2, రాజమండ్రి 2, అల్లూరి సీతారామరాజు 2 మంది ఈ నేరాలకు పాల్పడ్డారు. కాగా, ఇప్పటివరకు 680 మందిపై కేసులు నమోదయ్యాయి. శిక్షలు కఠినతరం ఈ కేసుల్లో కఠిన శిక్షలు విధించేలా చట్టాల్లో మార్పులు చేశారు. సాక్ష్యాధారాలు న్యాయస్థానంలో రుజువైతే మొదటిసారి ఐదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, రెండోసారి ఇదే తప్పు చేస్తే గరిష్టంగా ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 లక్షల వరకు జరిమానా విధించవచ్చని చట్టం చెబుతోంది. -
‘డర్టీపిక్చర్’లో కొత్త మలుపులు.. అసలు ఏం జరుగుతోంది?
సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘న్యూడ్‌కాల్స్’ వ్యవహారం కొత్త మలుపు తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు అసలు నిందితులను తప్పించారని.. ఈ మేరకు పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారాయని రాష్ట్రస్థాయి ఇంటెలిజెన్స్ అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. డర్టీపిక్చర్ను తలపించిన ఈ రోత పనిలో ఓ పోలీస్ అధికారి స్వీయ భాగస్వామ్యం ఉందని.. అయితే కిందిస్థాయి అధికారిపై బదిలీ వేటుతో సరిపుచ్చారని గుర్తించినట్లు తెలిసింది. ఈ క్రమంలో జిల్లా పోలీస్‌శాఖలో అసలు ఏం జరుగుతోందనే చర్చ జోరుగా సాగుతోంది. ఎటుపోయి ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే భయం ఖాకీల్లో నెలకొంది. తాజాగా రహస్య విచారణ.. న్యూడ్‌కాల్స్ వ్యవహారం వెలుగులోకి రాగా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా జిల్లాపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రస్థాయి పోలీస్ అధికారులు జిల్లాపై డేగ కన్ను వేశారు. ఇటీవల జిల్లాలో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకోగా.. అందరూ దాదాపుగా ఇతర రాష్ట్రాల వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు వారికి ఎవరు ఆశ్రయం ఇస్తున్నారు.. ఇక్కడ ఎవరి మద్దతు ఉంది.. పోలీసులు ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు అనే కోణంలో రాష్ట్రస్థాయి ఇంటెలిజెన్స్ బృందం రహస్యంగా విచారణ చేపట్టి ఆరా తీసింది. ఈ క్రమంలో న్యూడ్ కాల్స్ వ్యవహారంలో చోటుచేసుకున్న అవకతవకలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అసలు నిందితులను తప్పించే క్రమంలో సుమారు రూ.50 లక్షలు చేతులు మారాయని గ్రహించిన వారు.. ఎవరెవరికి ఎంత ముట్టాయనే లెక్కలు తీస్తున్నట్లు సమాచారం. అప్పట్లో ఏం జరిగింది.. గద్వాలకు చెందిన కొందరు కొన్నాళ్లుగా అమ్మాయిలను ట్రాప్ చేసి లోబరుచుకోవడమే కాకుండా వారితో నగ్న వీడియో కాల్స్ మాట్లాడి స్క్రీన్ రికార్డ్, స్క్రీన్ షాట్లు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ రోత పనులకు పురిగొల్పారు. పలువురి మహిళల అర్ధనగ్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ట్రాప్, బ్లాక్ మెయిలింగ్ అంశం బట్టబయలైన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ 4న ఈ ఉదంతం వెలుగులోకి రాగా.. ఇందులో ప్రధాన పారీ్టకి చెందిన యువకులు ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది. పలువురు పోలీసుల పాత్ర కూడా ఉన్నట్లు బట్టబయలు కావడం కలకలం సృష్టించింది. అయితే ఫిర్యాదు చేసేందుకు బాధితులెవరూ ముందుకు రాకపోవడంతో ‘సాక్షి’తోపాటు పలు పత్రికల్లో వచ్చిన కథనాలను పోలీసులు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టారు. తొలుత గద్వాల పట్టణానికి చెందిన తిరుమలేష్ అలియాస్ మహేశ్వర్‌రెడ్డి, ఆ తర్వాత నిఖిల్, వినోద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ తతంగంలో ఓ ప్రజాప్రతినిధికి చెందిన ముఖ్య అనుచరుడు అయిన ఓ ప్రజాసంఘం నాయకుడి కుమారుడు, ఇద్దరు కౌన్సిలర్లతోపాటు ఓ కౌన్సిలర్ భర్త ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే అరెస్టు చేసిన ఆ ముగ్గురు మాత్రమే నిందితులని.. మిగతా వారి ప్రమేయం లేదని అప్పటి జిల్లా పోలీస్ బాస్ కొట్టి పారేశాడు. దీనిపై అప్పట్లోనే దుమారం చెలరేగింది. కలవరం.. న్యూడ్‌కాల్స్ వ్యవహారానికి సంబంధించి పట్టుబడిన ముగ్గురు యువకులతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ప్రధాన పార్టీకి చెందిన యువకులే. పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురితోపాటు తప్పించిన అసలు నిందితుడు ఓ పురపాలిక ప్రజాప్రతినిధి అనుచరులే. ఈ పంచాయితీ జిల్లాకు చెందిన ముఖ్య నేత వద్దకు చేరింది. తన వైరి వర్గమైనప్పటికీ జిల్లా పరువు పోతుందనే కారణంతో ఆయన సైలెంట్‌గా ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని స్వీయ భాగస్వామ్యం ఉన్న పోలీస్ అధికారిని వదిలేసి నిందితులతో ఖరీదు దోస్తాన్ చేసిన ఓ ఎస్ఐపై బదిలీ వేటు వేసి కేసు మొత్తం క్లోజ్ చేశారని ఇంటెలిజెన్స్ అధికారులు ఆధారాలు సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేసు క్లోజ్ అయిన మూడు నెలల తర్వాత రాష్ట్ర ఇంటెలిజెన్స్ రహస్యంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టడం జిల్లా పోలీస్‌శాఖ సిబ్బందిని కలవరానికి గురిచేస్తోంది. ‘సిట్’తో విచారణ జరిపించాలి.. గద్వాలలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దాడులపై ప్రభుత్వం స్పందించాలి. ఇందులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరైనా సరే గుర్తించి శిక్ష పడేలా ప్రత్యేకంగా సిట్ బృందం ఏర్పాటు చేయాలి. ఈ కేసులో జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, వారి అనుచరులు, పోలీసుల పేర్లు వినపడుతున్నాయి. స్థానిక పోలీసులపై అనేక రకాల ఒత్తిళ్లు ఉంటాయి. వారిని జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పారదర్శకంగా జరగాలంటే సిట్‌తో విచారణ జరిపించాలి. – జ్యోతి, స్త్రీ చైతన్య సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎవరినీ ఉపేక్షించం.. జిల్లాలో న్యూడ్‌కాల్స్ వ్యవహారానికి సంబంధించి నేను బాధ్యతలు తీసుకోక ముందే విచారణ చేశారు. దానిపై ఆరోపణలు వస్తున్న మాట వాస్తవమే. పరిశీలించి మళ్లీ విచారణ చేపడతాం. తేలిన దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇందులో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదు. – సృజన, జోగుళాంబ గద్వాల ఎస్పీ -
Hyderabad: నగ్న దృశ్యాలు చిత్రీకరిస్తున్న యువకుడిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): బాత్రూమ్లో స్నానం చేస్తున్న యువతిని వెంటిలేటర్లో నుంచి ఓ యువకుడు సెల్ ఫోన్లో చిత్రీకరిస్తుండగా గుర్తించిన ఆమె జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. యూసుఫ్‌గూడకు చెందిన యువతి(30) గత నెల 31న ఉదయం తన ఇంట్లో స్నానం చేస్తుండగా అదే ఇంటి పై అంతస్తులో ఉండే అఖిల్ తన సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్నాడు. దీనిని గుర్తించి ఆమె బయటికి వచ్చేలోగా అతను అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అసభ్య చిత్రాలను వీడియోలుగా తీసి.. కోట్ల రూపాయల సంపాదన
సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): బాలికల అసభ్య వీడియోలను తీస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చి జిల్లా మనప్పారై పూమాలైపట్టికి చెందిన విశ్రాంత ఆరోగ్యశాఖ కార్యాలయ ఉద్యోగి సుబ్రహ్మణ్యం కుమారుడు రాజా (45) లండన్‌లో కొన్నేళ్ల పాటు ఉండి వచ్చాడు. ప్రస్తుతం తిరుపూర్‌లో జౌళి దుకాణం నడుపుతున్నాడు. ఇతను బాలికలను మభ్యపెట్టి అసభ్య చిత్రాలను వీడియోలుగా తీసి లండన్‌తో పాటు విదేశాలలో నిర్వహించే వెబ్సైట్లకు పంపుతున్నాడు. దీని ద్వారా అతను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలిసింది. దీనిపై సీబీఐకి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు సీబీఐ జరిపిన రహస్య విచారణలో రాజా బాలికల అసభ్య ఫొటోలను, వీడియోలను రికార్డు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన నలుగురికి చెందిన సీబీఐ అధికారులు మణప్పారై పూమాలైపట్టిలో ఉన్న రాజా ఇంటిలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో రాజా సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా, అందులో బాలికలకు సంబంధించిన వీడియోలను చూసి అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇతను పెద్ద నెట్వర్క్ కలిగి ఉన్నట్టు తేలింది. అతన్ని పోలీసులు అరెస్టు చేసి తిరుచ్చి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. చదవండి: (కటకటాల్లోకి నిత్య పెళ్లికూతురు.. నాలుగు పెళ్లిళ్లు చేసుకొని..) -
సినీ అవకాశాల పేరుతో యువతులకు వల..దర్శకుడి అరెస్ట్
సాక్షి, చెన్నై: సినిమా అనేది రంగుల ప్రపంచం. దీనిలో మోసగించేవారు, మోసాలకు గురయ్యేవారు ఎందరో. ముఖ్యంగా మగువలు సినీ అవకాశాల పేరుతో మోసపోయి ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలా సినీ అవకాశాల పేరుతో అమ్మాయిల భావాలతో ఆడుకున్న ఒక దర్శకుడు ఇప్పుడు జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. సేలంలో సినిమా కంపెనీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్న దర్శకుడు వేల్ క్షత్రియన్. అవకాశాలు పేరుతో యువతులను అశ్లీల ఫొటోలను, వీడియోలను చిత్రీకరించి వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అతనికి సహకరించిన జయజ్యోతి అనే సహాయకురాలి బండారాన్ని అదే కార్యాలయంలో పని చేసే ఇరుప్పాళ్యంకు చెందిన జననీ (పేరు మార్పు) బయటపెట్టింది. వారి అరాచకాలు గురించి సూరమంగళం మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అందులో తాను పని చేసే సినిమా కంపెనీలో వీరప్పన్ పాలమూరుకు చెందిన దర్శకుడు వేల్ క్షత్రియన్. అతని సహాయకురాలు రాజపాళ్యంకు చెందిన జయజ్యోతి సినిమా అవకాశాల పేరుతో అనేక మంది యువతులను సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలను చిత్రీకరించి వాటితో బెదిరించి వారి జీవితాలను పాడు చేస్తున్నారని పేర్కొంది. కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ సుబ్బులక్ష్మి నేతృత్వంలో పోలీసులు విచారణ జరిపారు. దీంతో దర్శకుడు వేల్ క్షత్రియన్ గుట్టురట్టు అయ్యింది. అతని కార్యాలయంలో తనిఖీలు చేసి 30కి పైగా హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌ట్యాప్, పెన్‌డ్రైవ్‌లు, కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్‌డిస్క్‌లో 300 మందికి పైగా అమ్మాయిల అశ్లీల వీడియో దృశ్యాలు ఉండటంతో పోలీసులే అవాక్కయ్యారు. దీంతో ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. చదవండి: వైరల్‌గా మోదీ, బీజేపీపై సమంత కామెంట్స్, మండిపడుతున్న నెటిజన్లు! -
ఫైనాన్స్ వ్యాపారి బ్లాక్మెయిల్.. మహిళ న్యూడ్ వీడియో వెబ్సైట్లో పెట్టి..
కొనేరుసెంటర్(మచిలీపట్నం)కృష్ణా జిల్లా: ఓ మహిళ న్యూడ్ వీడియోతో వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం మచిలీపట్నం దిశ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రికి చెందిన ఓ మహిళ తన వ్యాపార అవసరాల కోసం ఫైనాన్స్ వ్యాపారి హన్సకుమార్ని కొంత నగదు అప్పు అడగ్గా.. అతను న్యూడ్ వీడియో కాల్ చేస్తే ఇస్తానని చెప్పాడు. దీంతో ఆ మహిళ తప్పని పరిస్థితుల్లో న్యూడ్ వీడియో చాట్ చేసింది. చదవండి: వివాహిత మిస్సింగ్.. కారణం ఆ ఇద్దరేనా?.. దీన్ని స్క్రీన్ రికార్డు చేసిన హన్సకుమార్ దాన్ని విజయవాడ కానూరులోని తన బంధువు చందుకు షేర్ చేయగా అతను ఆ వీడియోని ఫోర్న్ వెబ్సైట్లో పెట్టి బ్లాక్ మెయిల్‌కు దిగాడు. దీంతో బాధిత మహిళ మచిలీపట్నం దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్టు దిశ డీఎస్పీ రాజీవ్ కుమార్ మీడియాకు తెలిపారు. -
షాప్ యజమానితో మహిళ సాన్నిహిత్యం.. మాజీ భర్తకు అశ్లీల వీడియోలు
సాక్షి, చెన్నై: మహిళ అశ్లీల వీడియోలను మాజీ భర్తకు పంపిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. చెన్నై కొళత్తూరు ఎంజీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన యువతి (28) భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. అన్నాసాలైలోని ఓ బ్రౌజింగ్ సెంటర్లో పని చేస్తోంది. దుకాణం యజమాని అరుణాచలం (28) ఆమెతో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతని దగ్గర నగదు తీసుకుంది. కొద్ది రోజులకు సదరు మహిళ భర్తతో కలిసి జీవిస్తోంది. దీంతో తనను మోసం చేసిందని గుర్తించిన అరుణాచలం.. ఆమెతో చనువుగా ఉన్న వీడియోలను భర్తకు పంపాడు. దీనిపై మహిళ విల్లివాక్కం మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇన్స్పెక్టర్ అనురాధ కేసు నమోదు చేసి మంగళవారం అరుణాచలంను అరెస్టు చేశారు. చదవండి: పెళ్లి చేసుకుందామని అడిగితే.. కడుపు మీద తన్నడంతో.. -
అరకిలో బంగారం, 15 కిలోల వెండి సరిపోలేదు.. భార్య నగ్న వీడియోలతో..
బెంగళూరు: భార్య నగ్న వీడియోలను ఇంటర్నెట్లో పెడతానని ఓ భర్త బెదిరిస్తున్నాడు. లక్కసంద్రకు చెందిన 25 ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బసవనగుడి మహిళా పోలీసులు హనుమంతనగర నివాసి ప్రగత్ పురుషోత్తమ్ పై కేసు నమోదు చేశారు. ఏడేళ్ల క్రితం పెళ్లి సమయంలో అర్ధ కేజీ బంగారు ఆభరణాలు, 15 కిలోల వెండి సామగ్రి, ఇంకా విలువైన వస్తువులను కట్నం కింద అందజేశారు. కొత్తలో వైవాహిక జీవితం సజావుగా నడిచింది. తరువాత మరింత కట్నం తీసుకురావాలని వేధింపులకు దిగాడు. దీంతో అత్తమామలు రూ.40 లక్షలు నగదు అందించారు. తరచూ మద్యం తాగి భార్యను వేధించేవాడు. సగం ఆస్తిని తన పేరుతో రాయాలని, లేదంటే నీ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని భర్త బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. చదవండి: (పేస్ట్ అనుకుని గోడపై ఉంచిన ఎలుకల మందుతో పళ్లు తోమి..) -
వెలుగులోకి మహిళా ఎమ్మెల్యే అశ్లీల వీడియో.. పోలీసులకు ఫిర్యాదు
Saniya Aashiq Viral Video, ఇస్లామాబాద్: సాంకేతికత పెరిగిన ప్రస్తుత కాలంలో సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్ మహిళా ఎమ్మెల్యే చేరారు. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన అశ్లీల వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో దీని మీద సదరు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు.. పాకిస్తాన్ పంజాబ్‌లోని తక్షిలా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)కి చెందిన సానియా ఆషిక్ అనే మహిళా ఎమ్మెల్యేకు చెందిన అశ్లీల వీడియో ఒకటి వెలుగు చూసింది. ఈ క్రమంలో ఆమె దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కంప్లైంట్ మేరకు పోలీసులు ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఈ వీడియో గురించి సానియాకు అక్టోబర్‌లో తెలిసిందని.. దీని గురించి ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసిందని పాక్ మీడియా వెల్లడించింది. (చదవండి: రేపిస్టులకు ఇక చుక్కలే.. కఠిన శిక్ష అమలుకు పార్లమెంట్ ఆమోదం) అక్టోబర్ 26న సానియా ఫెడరల్ దర్యాప్తు సంస్థకు ఈ అశ్లీల వీడియో గురించి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఓ అశ్లీల వీడియోలో తాను కనిపిస్తున్నానని... ఎవరో కావాలనే తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు వీడియోలో తనని మార్ఫ్ చేశారని తెలిపారు. వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు.. దానిలో ఉన్నది ఎమ్మెల్యే సానియానే అని తెలిపారు. కానీ ఈ వార్తలని ఆమె ఖండించింది. (చదవండి: అఫ్గాన్‌లో పాకిస్తాన్ విధ్వంసకర పాత్ర) సానియా ఫిర్యాదు తర్వాత మూడు వారాల దర్యాప్తు అనంతరం పోలీసులు ఇందుకు బాధ్యుడైన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కానీ అతడి వివరాలు బయటకు వెల్లడించలేదు. అంతేకాక వీడియోలో నటించిన స్త్రీ సానియానా లేక వేరే మహిళా అనే విషయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలు మీడియా కథనాల ప్రకారం వీడియో ప్రత్యక్షం అయిన నాటి నుంచి సానియాకు అసభ్య ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిసింది. సానియా పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియంకు స్నేహితురాలు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఆమె పలు అంశాలపై పని చేస్తున్నారు. చదవండి: ఛీ ఛీ.. అసెంబ్లీలో ఇదేం పాడుపని! -
సీబీఎన్ ఆర్మీ దుర్మార్గం:ఎంపీ విజయసాయిపై అసభ్య వీడియోలు
పట్నంబజారు (గుంటూరు): రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలంతో పలు వీడియోలు అప్లోడ్ చేసిన ఇద్దరు వ్యక్తులను గుంటూరు అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు మంగళవారం అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎంపీపై యూట్యూబ్‌లో సీబీఎన్ ఆర్మీ అనే చానల్ ద్వారా వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు, ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చేలా పలు అసభ్యకర పోస్టింగ్‌లు వచ్చాయి. వీటిని చూసిన వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా గంటావారిపాలెంకు చెందిన మద్దినేని వెంకట మహేష్‌బాబు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతను టీడీపీ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నాడు. అతనితో పాటు మచిలీపట్నానికి చెందిన ముల్పూరి శ్రీసాయికళ్యాణ్ కలిసి ఎంపీపై అసభ్యకర దూషణలు చేస్తూ వీడియోలు అప్లోడ్ చేశారు. దర్యాప్తులో సాంకేతికంగా ఈ వివరాలు సేకరించిన పోలీసు సిబ్బంది వారిని చంద్రమౌళినగర్లో అరెస్టు చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. -
ఛీ ఛీ.. అసెంబ్లీలో ఇదేం పాడుపని!
బెంగళూరు: చట్టాలు రూపొందించే చట్ట సభ. ప్రజాస్వామానికి మూలస్తంభం.. ప్రజా సమస్యలపై చర్చించే వేదిక అసెంబ్లీ. అలాంటి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ఓ ప్రజాప్రతినిధి అశ్లీల వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేశారు. ఈ దృశ్యాలు బహిర్గతమవడంతో ఆయనపై ప్రజలతో పాటు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్చలు చేయకుండా పాడుపని ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. కర్నాటక అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం శాసనమండలిలో చర్చ జరుగుతుండగా ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్ సెల్ఫోన్లో అశ్లీల వెబ్సైట్లో వీడియోలు చూస్తూ తెగ ఎంజాయ్ చేశాడు. అయితే ఈ వార్తలను ఆయన ఖండించారు. తాను ఆ వీడియోలు చూడలేదని ప్రకాశ్ రాథోడ్ చెప్పారు. తాను గ్రామీణాభివృద్ధిపై మంత్రితో మాట్లాడుతున్నానని.. దానికి సంబంధించిన ప్రశ్నల కోసం సెల్ఫోన్లో వెతుకుతున్నానని వివరణ ఇచ్చారు. సెల్ఫోన్లో డేటా నిండిపోవడంతో కొన్ని డిలీట్ చేస్తున్నట్లు రాథోడ్ తెలిపారు. రాథోడ్ చేసిన పనిని బీజేపీ తప్పుపట్టింది. వెంటనే అతడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. అయితే కర్నాటకలో అసెంబ్లీ అశ్లీల వీడియోలు చూడడం కొత్తేం కాదు. 2012లో బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పోర్న్ వీడియోలు చూస్తూ దొరికిపోయారు. ప్రస్తుతం ఆ ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉండడం గమనార్హం. -
‘అశ్లీల వీడియో పంపుతూ వేధిస్తున్నారు’
సాక్షి, హైదారాబాద్ : తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, అశ్లీల వీడియోలు పంపుతున్నారని వేధిస్తున్నారంటూ సినీ నటి కరాటే కల్యాణి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. గుర్తుతెలియన వ్యక్తులు కొద్ది రోజులుగా ఈ పనులు చేస్తున్నారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయాన్నే లేచి ఫోన్ చూడాలంటేనే భయమేస్తుందని ఆమె పోలీసులతో తన బాధను చెప్పుకున్నారు. కొన్ని నంబర్లు బ్లాక్ చేసినా.. వేరే నంబర్ల నుంచి అశ్లీల వీడియోలు పంపుతూ, తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని, వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. కల్యాణి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, విచారణ చేపట్టారు. -
అశ్లీల వీడియోల కేసులో ఇద్దరి అరెస్ట్
సాక్షి,పశ్చిమ గోదావరి : అశ్లీల వీడియోలు వాట్సాప్‌లో వైరల్ చేసిన ఆగిశెట్టి సాయి భరత్ కేసులో శుక్రవారం మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ నాగేశ్వర్రావు ప్రెస్మీట్లో తెలిపారు. సెక్స్ వీడియోలను చూపించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ఆగిశెట్టి గోపినాథ్, గుత్తుల నాగ సత్తిబాబులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారిద్దరి నుంచి రెండు సెల్ఫోన్లు, మెమోరీ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో వ్యక్తిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. -
వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల వీడియోల కలకలం
సాక్షి, సిటీబ్యూరో: ఓలా ఉబర్ క్యాబ్ డ్రైవర్స్ కమ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్న వాట్సాప్ గ్రూప్‌లలో అశ్లీల వీడియోలు, ఫొటోలు పోస్టు చేసిన ఇద్దరు డ్రైవర్లను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బొడుప్పల్కు చెందిన కందడి రఘుపాల్‌రెడ్డి, ఎంకే నగర్‌కు చెందిన సిద్దమ్ శ్రీధర్‌లను అరెస్టు చేసి, వారి నుంచి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్బీనగర్ హస్తినాపురం బ్యాంక్ కాలనీకి చెందిన . శ్రీనివాస్ తెలంగాణ కార్ డ్రైవర్ ఓనర్స్ అసోసియేషన్(టీసీడీవోఏ) పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశాడు. ఇందులో 111 మంది వాట్సాప్ సభ్యులుగా ఉన్నారు. అయితే ఇందులో సభ్యులుగా ఉన్న డ్రైవర్లు రఘుపాల్‌రెడ్డి, సిద్దమ్ శ్రీధర్ అశ్లీల వీడియోలు, ఫొటోలు పొస్టు చేయడంతో ఇతర డ్రైవర్లు వాట్సాప్ అడ్మినిస్ట్రేటర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శ్రీనివాస్ ఈ నెల 14న రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసిన ఇన్స్పెక్టర్ రియాజుద్దీన్ నేతృత్వంలోని బృందం నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వారిని పోలీసులు ప్రశ్నించగా సరదా, తమాషా కోసమే చేసినట్లు సమాధానమిచ్చారు. వాట్సాప్ గ్రూప్‌ల్లో అశ్లీల వీడియోలు, ఫొటోలు పోస్టు చేయడం నేరం కిందికి వస్తుందని, ఆయా వాట్సాప్ గ్రూప్‌ల్లోని సభ్యులు అభ్యంతరం చెబితే చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.