
సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): బాలికల అసభ్య వీడియోలను తీస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చి జిల్లా మనప్పారై పూమాలైపట్టికి చెందిన విశ్రాంత ఆరోగ్యశాఖ కార్యాలయ ఉద్యోగి సుబ్రహ్మణ్యం కుమారుడు రాజా (45) లండన్‌లో కొన్నేళ్ల పాటు ఉండి వచ్చాడు. ప్రస్తుతం తిరుపూర్‌లో జౌళి దుకాణం నడుపుతున్నాడు.
ఇతను బాలికలను మభ్యపెట్టి అసభ్య చిత్రాలను వీడియోలుగా తీసి లండన్‌తో పాటు విదేశాలలో నిర్వహించే వెబ్‌సైట్‌లకు పంపుతున్నాడు. దీని ద్వారా అతను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలిసింది. దీనిపై సీబీఐకి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు సీబీఐ జరిపిన రహస్య విచారణలో రాజా బాలికల అసభ్య ఫొటోలను, వీడియోలను రికార్డు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన నలుగురికి చెందిన సీబీఐ అధికారులు మణప్పారై పూమాలైపట్టిలో ఉన్న రాజా ఇంటిలో ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో రాజా సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా, అందులో బాలికలకు సంబంధించిన వీడియోలను చూసి అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇతను పెద్ద నెట్‌వర్క్ కలిగి ఉన్నట్టు తేలింది. అతన్ని పోలీసులు అరెస్టు చేసి తిరుచ్చి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
చదవండి: (కటకటాల్లోకి నిత్య పెళ్లికూతురు.. నాలుగు పెళ్లిళ్లు చేసుకొని..)
Comments
Please login to add a commentAdd a comment