Tiruvottiyuru
-
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపిన ఎస్ఐ
సాక్షి, చెన్నై: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మాజీ పోలీసు కానిస్టేబుల్‌ను కిరాయి గూండాలతో హత్య చేయించిన అతని భార్య (ఎస్ఐ) చిత్ర, కిరాయి రౌడీలను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణగిరి జిల్లా ఊత్తంకరై జిల్లా కల్లాలికి చెందిన సెంథిల్ కుమారు (48) పోలీస్ కానిస్టేబుల్. ఇతని భార్య చిత్ర (44) సింగారపేట పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఈ ఏడాది సెపె్టంబర్ 16వ తేదీ సెంథిల్ కుమార్ అదృష్టమయ్యాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేయగా సెంథిల్ కుమార్‌ను వివాహత సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అతని భార్య చిత్రా కిరాయి ముఠాతో హత్య చేయించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి మహిళా ఎస్ఐ చిత్ర, ఆమెకు సహరించిన మహిళా మంత్రగత్తే సరోజ (32), రౌడీలు విజయ్ కుమార్ (21), రాజ పాండ్యన్ (21)లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చదవండి: (Anusha: ఇప్పటికే మూడు సర్జరీలు.. బాధను తట్టుకోలేక..) -
ప్రేమపేరుతో టీవీ యాంకర్‌కు దగ్గర.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, హోటల్‌కు తీసుకెళ్లి..
సాక్షి, చెన్నై: ఓ టీవీ యాంకర్‌ను వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి పాల్పడిన ఓ యువకుడికి పది సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 5,000 జరిమానా విధిస్తూ ఈరోడ్ మహిళా కోర్టు తీర్పు ఇచ్చింది. వివరాలు.. ఈరోడ్‌కు చెందిన 26 ఏళ్ల యువతి లోకల్ టీవీలో యాంకర్‌గా పనిచేస్తోంది. ఈమెకు ఈరోడ్ ముత్తంపాలయానికి చెందిన రాహుల్ (29)తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. 2018 కోవైలో ఓ ప్రోగ్రాంకి వెళ్లిన సమయంలో హోటల్‌కు తీసుకెళ్లిన రాహుల్ తనను వివాహం చేసుకుంటానని చెప్పి బలాత్కారం చేశాడని, అలాగే తన వద్ద 750 గ్రాముల సవర్ల బంగారు నగలు మోసం చేశాడని ఆరోపించింది. ఈ మేరకు ఆగస్టులో ఈరోడ్ మహిళాపోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో రాహుల్ మోసానికి పాల్పడినట్లు తేలడంతో పదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి మాలతి తీర్పు ఇచ్చారు. చదవండి: (పచ్చని సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు.. పిల్లలకు విషమిచ్చి..) -
అసభ్య చిత్రాలను వీడియోలుగా తీసి.. కోట్ల రూపాయల సంపాదన
సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): బాలికల అసభ్య వీడియోలను తీస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చి జిల్లా మనప్పారై పూమాలైపట్టికి చెందిన విశ్రాంత ఆరోగ్యశాఖ కార్యాలయ ఉద్యోగి సుబ్రహ్మణ్యం కుమారుడు రాజా (45) లండన్‌లో కొన్నేళ్ల పాటు ఉండి వచ్చాడు. ప్రస్తుతం తిరుపూర్‌లో జౌళి దుకాణం నడుపుతున్నాడు. ఇతను బాలికలను మభ్యపెట్టి అసభ్య చిత్రాలను వీడియోలుగా తీసి లండన్‌తో పాటు విదేశాలలో నిర్వహించే వెబ్సైట్లకు పంపుతున్నాడు. దీని ద్వారా అతను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలిసింది. దీనిపై సీబీఐకి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు సీబీఐ జరిపిన రహస్య విచారణలో రాజా బాలికల అసభ్య ఫొటోలను, వీడియోలను రికార్డు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన నలుగురికి చెందిన సీబీఐ అధికారులు మణప్పారై పూమాలైపట్టిలో ఉన్న రాజా ఇంటిలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో రాజా సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా, అందులో బాలికలకు సంబంధించిన వీడియోలను చూసి అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇతను పెద్ద నెట్వర్క్ కలిగి ఉన్నట్టు తేలింది. అతన్ని పోలీసులు అరెస్టు చేసి తిరుచ్చి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. చదవండి: (కటకటాల్లోకి నిత్య పెళ్లికూతురు.. నాలుగు పెళ్లిళ్లు చేసుకొని..) -
భర్త వివాహేతర సంబంధం.. భార్యకు తెలిసి..
సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం కలిగి ఉండడంతో భార్య ఆవేదకు గురైంది. బిడ్డకు ఉరివేసి హత్య చేసి తరువాత తానూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. నైలై జిల్లా వెంకటాచలపురానికి చెందిన మహేంద్రన్ భార్య ప్రవీణ (25) ఉంది. అహిమా అనే ఏడాదిన్నర వయసున్న ఆడబిడ్డ కూడా ఉంది. కూలీ పనులు చేసుకునే.. మహేంద్రన్‌కు మరో యువతితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి ఘర్షణ జరిగింది. ఆ తర్వాత మహేంద్రన్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రవీణ బిడ్డను హత్య చేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడింది. దేవరకులం పోలీసులు మృతదేహాలను స్వాధీనం పోస్టుమార్టం కోసం నెలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (కుమార్తె ప్రేమవివాహం.. ఆటోతో ఢీకొట్టి.. చనిపోయాడనుకొని..) -
వివాహేతర సంబంధం.. రోజూ కవిత ఇంటికి వచ్చి వెళ్తూ..
చెన్నై: వివాహేతర ప్రియురాలి బిడ్డలకు ఇద్దరికి విషం ఇచ్చి హత్య చేసి అనంతరం ప్రియుడు కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. చెన్నై కొరుక్కుపేట భారతీ నగర్ స్లమ్ క్లియరెన్స్ కాలనీకి చెందిన కవిత భర్త రాహుల్. వీరికి స్టీఫన్ (9), ఆల్బర్ట్ (7) ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ప్రవర్తనపై సందేహం రావడంతో రాహుల్ భార్యను విడిచి దూరంగా వెళ్లిపోయాడు. ఈ క్రమంలో కవితకు రెడ్‌హిల్స్‌కు చెందిన రాజేష్ (31)తో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో రాజేష్ కవిత ఇంటికి వచ్చి వెళుతున్నట్లు తెలిసింది. ఇటీవల కొంత కాలంగా రాజేష్‌తో కవిత మాట్లాడడం మానేసింది. దీంతో ఆగ్రహించిన రాజేష్ బుధవారం రాత్రి కవిత ఇంటికి వచ్చి విషం కలిపిన కూల్‌డ్రింక్స్‌ను కవిత ఇద్దరు కుమారులకు ఇచ్చాడు. తరువాత రాజేష్ కూడా అదే కూల్‌డ్రింక్‌ను తాగాడు. దీంతో ముగ్గురు మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. చదవండి: (న్యాయస్థానంపై తీవ్రవ్యాఖ్యలు.. యూట్యూబర్ శంకర్‌కు 6 నెలల జైలు) -
సుమతితో వివాహేతర సంబంధం.. బయటకు తెలిసి..
తిరువొత్తియూరు (చెన్నై): కోత్తగిరిలో 45 రోజులకు ముందు అదృశ్యమైన వివాహేతర జంట అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతదేహాలుగా కనిపించారు. వివరాలు.. నీలగిరి జిల్లా కోత్తగిరి సమీపంలోని వెల్లెరి కొల్లంకు చెందిన శరవణన్ (25). అతనికి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. అయితే పొన్నూరు సాపంకరై గ్రామానికి చెందిన సుమతి (23)తో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి సంబంధం బయటకు తెలియడంతో దీనిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీంతో గత 45 రోజులకు ముందు ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. బంధువులు వారి కోసం గాలించినప్పటికీ ఆచూకీ తెలియ రాలేదు. ఈ క్రమంలో ఆదివారం వెల్లేరికొల్లం అటవీ ప్రాంతంలో ప్రజలు వెళుతున్న సమయంలో కుళ్ళిపోయిన స్థితిలో రెండు మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. వారి ఆధార్ కార్డు, ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేశారు. మృతదేహాల వద్ద లభించిన చీటీలో ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని.. పేర్కొనబడి ఉంది. అనంతరం మృతదేహాలను కోత్తగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణలో మృతదేహాలు శరవనన్, సుమతివి అని నిర్ధారించారు. చదవండి: (చిత్ర పరిశ్రమలో కలకలం.. సినీ దర్శకుడిపై ఫిర్యాదు) -
తనయుడిని హత్య చేసి దంపతుల ఆత్మహత్య
తిరువొత్తియూరు: అప్పుల బాధ కారణంగా కుమారుడిని హత్య చేసి భార్య, భర్త ఇద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్త చాకలిపేటలో సంచలనం కలిగించింది. విల్లుపురం జిల్లాకు చెందిన శివాజీ (45), అతని భార్య వనిత (32). వీరికి వెట్రివేల్ (10) అనే కుమారుడు ఉన్నాడు. శివాజీ చాకలిపేటలో వెంకటేశం వీధిలో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో పని చేస్తున్నారు. ఇతను కుటుంబ ఖర్చుల కోసం పలువురి వద్ద అప్పు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అందరూ భోజనం చేసి పడుకున్నారు. బుధవారం ఉదయం చాలా సమయం అయినప్పటికీ శివాజీ కుటుంబ సభ్యులు బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు వెళ్లి చూశారు. ఆ సమయంలో శివాజి, వనిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కొత్తచాకలిపేట ఇన్స్పెక్టర్ చిదంబర భారతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సృహ తప్పి పడి వున్న బాలుడిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మరో ఘటనలో సహకార సంఘం కార్యదర్శి ఆత్మహత్య పుదుకోట్టై జిల్లా కీరానూరుకు చెందిన నీలకంఠన్ (52). కీరనూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకులో కార్యదర్శిగా పని చేస్తున్నా డు. ఇతను నగలపై రుణాలు ఇవ్వడంలో 1.08 కోట్లు మోసం చేసినట్లు గుర్తించారు. అధికారులు నీలకంఠను అతనికి సహాయపడిన బ్యాంకు సూపర్వైజర్ శక్తివేల్‌ను తాత్కాలికంగా పని నుంచి తొలగించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న ఈ క్రమంలో కీరనూరులో నివాసం వుంటున్న నీలకంఠన్ ఇంటిలో బుధవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చదవండి: Punjab: ఫోన్ సంభాషణల ఆధారంగా విడాకులు మంజూరు చేయడం కుదరదు! -
భారీ నగదుతో పరుగులు తీసిన డీఎస్పీ.. విషయం ఏంటంటే..
తిరువొత్తియూర్: తిరుచ్చి విమానాశ్రయం సమీపంలో వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో ఓ కారు నుంచి రూ.11 లక్షల నగదుతో డీఎస్పీ పరుగులు తీయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తిరుచి పుదుక్కొట్టై ప్రధాన రోడ్డు అయిన ఎయిర్పోర్ట్ సమీపంలో వాహనాల తనిఖీ కేంద్రం ఉంది. ఇక్కడ గురువారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన ఓ కారును నిలిపి తనిఖీ చేస్తుండగా, కారులో నుంచి కిందకు దిగిన ఓ వ్యక్తి వేగంగా పరిగెత్తాడు. ఇది చూసిన పోలీసులు అతన్ని వెంబడించి.. పట్టుకున్నారు. విచారణలో పరిగెత్తిన వ్యక్తి డీఎస్పీ అని స్నేహితులతో కలిసి రూ. 11 లక్షల నగదును తీసుకొని తిరుచ్చికి వచ్చినట్లు తెలిసింది. అనంతరం అతను మాట్లాడుతూ... తనిఖీ కేంద్రంలో మఫ్టీలో ఉన్న పోలీసులను చూసి.. విజిలెన్స్ అధికారులు అనుకొని నగదుకు తగిన ఆధారాలు లేకపోవడంతో పరిగెత్తినట్లుగా తెలిపాడు. దీంతో డీఎస్పీ తో పాటు.. అతని స్నేహితులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: శునకం నోటిలో పసికందు తల -
తల్లి, కుమార్తెపై లైంగిక వేధింపులు
తిరువొత్తియూరు: చెన్నై కొడుంగయూరులో తల్లి, కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడిన పెరంబూరు వెస్ట్ మండల బీజేపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చెన్నై కొడుంగయూరు ప్రాంతానికి చెందిన పార్థసారథి (56). ఇతను పెరంబూరు మండల బీజేపీ నేత. ఇతను తన ఇంటికి సమీపంలో ఉన్న తల్లి, కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు అందింది. కొడుంగయూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో పార్థసారథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో స్నేహితుడి ఇంటిలో ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు బుధవారం రాత్రి నిందితుడిన అరెస్టు చేశారు. వ్యాయామ ఉపాధ్యాయుడికి 14 ఏళ్లు జైలు నెల్లై జిల్లా రాధాపురం తాలూకా శివజ్ఞానపురంలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న తమిళ్‌సెల్వన్ (48). ఇతను 2018 సంవత్సరం కబడ్డీ పోటీలకు వచ్చిన ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో రాజపాళయం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ కేసుపై విచారణ శ్రీ వల్లిపుత్తూరు జిల్లా ఫోక్సోకోర్టులో గురువారం జరిగింది. నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి ధనశేఖర్ నిందితుడికి 14 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
వివాహేతర సంబంధం.. కన్నబిడ్డ దారుణహత్య
తిరువొత్తియూరు: వివాహేతరసంబంధానికి అడ్డుగా వున్నాడని కుమారుడిని తల్లి, ఆమె ప్రియుడు హత్య చేశారు. తంజై మేల్వంజూరుకు చెందిన కార్తీక్ అరవింద్ (31), అపర్ణ (22) దంపతులు. వీరి కుమారుడు సువిత్రన్ (04). ప్రస్తుతం నాగై, తామరకులంలో నివాసముంటున్నారు. తామరకులం ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ సురేష్ (24)తో అపర్ణకు వివాహేతర సంబంధం ఏర్పడింది. గత 26వ తేదీ అపర్ణ, సురేష్ చనువుగా కలిసి వున్న ఉన్న సమయంలో బాలుడు అడ్డుగా ఉండడంతో ఆగ్రహించిన సురేష్ సువిత్రన్పై దాడి చేశాడు. బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. అపర్ణ చున్నీతో కుమారుడి గొంతు బిగించడంతో బాలుడు మృతిచెందాడు. కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పరారీలో వున్న అపర్ణ, సురేష్‌ను గురువారం అరెస్టు చేశారు. -
ఆషాఢమాసంలో భార్య పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్య
తిరువొత్తియూరు(తమిళనాడు): ఆషాఢమాషం ఓ సర్వేయర్ ప్రాణాన్ని బలికొంది. ఆషాడమాసం(ఆడి నెల)లో భార్యను పుట్టింటికి పంపడంలో ఏర్పడిన గొడవలో ఓ భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జోలార్‌పేట సమీపంలో చోటుచేసుకుంది. తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట తామలేరి ముత్తూర్‌కు చెందిన దిలీపన్(33). తిరుపత్తూరు తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్. ఇతను అదే ప్రాంతానికి చెందిన దివ్యను ఏడు నెలల ముందు ప్రేమ వివాహం చేసుకున్నాడు. దివ్య ఎంబీబీఎస్ పూర్తి చేసి జోలార్‌పేటలోని మినీక్లినిక్‌లో వైద్యురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో గత 15వ తేదీ ఆషాఢమాసం నెల కావడంతో దివ్య పుట్టింటికి వెళ్లింది. దీంతో దిలీపన్ కుటుంబసభ్యులు దివ్యను పంపించాలని ఆమె తల్లిదండ్రులను అడిగారు. కానీ వారు తిరస్కరించడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు ఏర్పడ్డాయి. దీంతో విరక్తితో చెందిన దిలీపన్ బుధవారం ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జోలార్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమకు పెద్దల అడ్డు.. పార్కుకు వచ్చి ఆత్మహత్య
తిరువొత్తియూరు: ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరువణ్ణామలై జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వందవాసి కొత్త బస్టాండ్ వద్దనున్న పార్కులో వాకింగ్ వెళ్లిన కొందరు యువతీ యువకుడి మృతదేహాలను గుర్తించారు. పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. సమీపంలో విషం బాటిల్ ఉండడంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావించారు. యువకుడి సెల్‌ఫోన్ నుంచి చివరిగా వెళ్లిన నంబర్‌కు కాల్ చేసి మాట్లాడారు. అతనిచ్చిన సమాచారం మేరకు చెంగల్పట్టు జిల్లా మధురాంతకం తాలూకా కాట్టు కూడలూరు గ్రామానికి చెందిన శంకర్ కుమారుడు భరత్.. రామాపురం గ్రామానికి చెందిన షణ్ముగం కుమార్తె అక్షయ (19)ని గుర్తించారు. వీరి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో పార్కుకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. -
తిరుచ్చి ఎయిర్‌పోర్టులో 8.5 కిలోల బంగారం పట్టివేత
తిరువొత్తియూరు (తమిళనాడు): తిరుచ్చి విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలోని ప్రయాణికుల వద్ద 4.25 కోట్ల విలువైన 8.5 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. అలాగే చెన్నై ఎయిర్‌పోర్టులో రూ.19.75 లక్షల విలువైన 465 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి తిరుచ్చి ఎయిర్‌పోర్టుకు బుధవారం తెల్లవారుజామున ఇండిగో, ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రయాణికులను సెంట్రల్ విభాగం డిప్యూటీ డైరక్టర్ సతీష్ నేతృత్వంలో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో ఒక మహిళతో సహా 8 మంది ప్రయాణికుల వద్ద 8.5 కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ 4.25 కోట్లుగా అధికారులు వెల్లడించారు. అలాగే చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన జైనుల్లా అబద్ధీన్(60) నుంచి 465 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చదవండి: సరిహద్దు వద్ద రూ.135 కోట్ల డ్రగ్స్ రవాణా యత్నం! -
అవినీతి కేసులో ఆర్ఐ అరెస్ట్
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: పాఠశాల భవనం గుర్తింపు రెన్యువల్ సర్టిఫికేట్ ఇవ్వడానికి రూ.2 వేలు లంచం తీసుకున్న కీళంబాక్కం ఆర్ఐని పోలీసులు అరెస్టు చేశారు. కాంచీపురం జిల్లా మామల్లపురానికి చెందిన కన్నన్, మామల్లపురం సమీపంలో పుదుఎడయూర్ కుప్పంలో జీకే నర్సరీ పాఠశాలను నడుపుతున్నాడు. పాఠశాల భవ నం రిజిస్ట్రేషన్, గుర్తింపును ప్రతి ఏటా రెన్యువల్ చేయవలసి ఉంది. ఈ మేరకు తన పాఠశాల భవనం నాణ్యత, గుర్తింపు రెన్యువల్ సర్టిఫికేట్ పొందడానికి కేళంబాక్కం రెవెన్యూ ఇన్స్పెక్టర్ మణివన్నన్(56)కు దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ నిర్ధారణ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఆర్ఐ రూ.2వేలు లంచం కోరాడు. డబ్బులు ఇవ్వక పోవడంతో కన్నన్ను కార్యాలయానికి పలుమార్లు తిప్పించుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో చెన్నైలో ఉన్న అవినీతి నిరోధక విభాగం అధికారులకు కన్నన్ ఫిర్యాదు చేశారు. డీఎస్పీ జీవానందం, ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసన్ మంగళవారం ఉదయం కీళంబాక్కం వచ్చారు. అధికారులు ఇచ్చిన సలహా మేరకు రూ.2 వేలును కన్నన్, ఆర్ఐకి ఇచ్చారు. ఆ నగదును తీసుకుంటున్న సమయంలో అక్కడే మాటు వేసి ఉన్న అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా రెవెన్యూ ఇన్స్పెక్టర్ మణివన్నన్‌ను పట్టుకుని అరెస్టు చేశారు. తర్వాత కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.