
తిరువొత్తియూరు (తమిళనాడు): తిరుచ్చి విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలోని ప్రయాణికుల వద్ద 4.25 కోట్ల విలువైన 8.5 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. అలాగే చెన్నై ఎయిర్‌పోర్టులో రూ.19.75 లక్షల విలువైన 465 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి తిరుచ్చి ఎయిర్‌పోర్టుకు బుధవారం తెల్లవారుజామున ఇండిగో, ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రయాణికులను సెంట్రల్ విభాగం డిప్యూటీ డైరక్టర్ సతీష్ నేతృత్వంలో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
ఆ సమయంలో ఒక మహిళతో సహా 8 మంది ప్రయాణికుల వద్ద 8.5 కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ 4.25 కోట్లుగా అధికారులు వెల్లడించారు. అలాగే చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన జైనుల్లా అబద్ధీన్(60) నుంచి 465 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
చదవండి: సరిహద్దు వద్ద రూ.135 కోట్ల డ్రగ్స్ రవాణా యత్నం!
Comments
Please login to add a commentAdd a comment