Trichy airport
-
చెన్నై తిరుచ్చి విమానాశ్రయంలో కొండచిలువల కలకలం
చెన్నై: మలేషియా ఎయిర్ లైన్స్ విమానంలో తిరుచ్చి విమానశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడి సూట్‌కేసులో ప్రమాదకరమైన కొండచిలువలు, పాములు, బల్లులు ఉండటాన్ని చూసి విస్తుపోయారు తిరుచ్చి కస్టమ్స్ సిబ్బంది. వాటిని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేశారు కస్టమ్స్ అధికారులు. సినిమాల ప్రభావమో ఏమోగానీ స్మగ్లింగ్ పేరిట ఏది పెడితే అది విమానాల్లో రవాణా చేసే స్థాయికి ఎదిగిపోయారు స్మగ్లర్లు. తాజాగా మొహమ్మద్ మొయిద్దీన్ అనే ఓ ప్రయాణికుడు కౌలాలంపూర్ నుండి వస్తూ తనతోపాటు సూట్‌కేసులో కొండచిలువ పిల్లలు, బంగారు బల్లుల్ని వెంట తీసుకొచ్చాడు. ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు ఆతడి సూట్‌కేసును తనిఖీ చేయగా అందులో 47 కొండచిలువ పిల్లలు, 2 బంగారు బల్లులను కనుగొన్నారు. అవి ప్రాణాలతో ఉండటాన్ని చూసి కంగారుపడ్డ కస్టమ్స్ అధికారులు వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించి అతడిని మాత్రం విచారణ నిమిత్తం కస్టడీకి తరలించారు. విమానంలో సజీవంగా ఉన్న కొండచిలువలను, బల్లులను ఎలా తీసుకువచ్చి ఉంటాడన్నదే కస్టమ్స్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతను మలేషియాలో సెక్యూరిటీ వాళ్ళ కళ్ళుగప్పి ఎలా రాగలిగాడు, అక్కడి ఎయిర్‌పోర్టు సిబ్బంది సరిగ్గా తనిఖీలు నిర్వహించలేదా ఏంటన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అతనెవరు? అసలెందుకు చెన్నై వచ్చాడు? ఈ స్మగ్లింగ్ ముఠాలో ఇంకా ఎవరెవరున్నారన్న వివరాలపై ఆరా తీస్తున్నారు కస్టమ్స్ అధికారులు. #TamilNadu- Customs officials caught a Malaysian passenger with 47 exotic pythons and two lizards at #Trichy airport on Sunday. pic.twitter.com/kVggJIP08C — Suresh (@isureshofficial) July 30, 2023 ఇది కూడా చదవండి: ఒకే వేదికపై ప్రధాని మోదీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్? -
తిరుచ్చి ఎయిర్‌పోర్టులో 8.5 కిలోల బంగారం పట్టివేత
తిరువొత్తియూరు (తమిళనాడు): తిరుచ్చి విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలోని ప్రయాణికుల వద్ద 4.25 కోట్ల విలువైన 8.5 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. అలాగే చెన్నై ఎయిర్‌పోర్టులో రూ.19.75 లక్షల విలువైన 465 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి తిరుచ్చి ఎయిర్‌పోర్టుకు బుధవారం తెల్లవారుజామున ఇండిగో, ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రయాణికులను సెంట్రల్ విభాగం డిప్యూటీ డైరక్టర్ సతీష్ నేతృత్వంలో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో ఒక మహిళతో సహా 8 మంది ప్రయాణికుల వద్ద 8.5 కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ 4.25 కోట్లుగా అధికారులు వెల్లడించారు. అలాగే చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన జైనుల్లా అబద్ధీన్(60) నుంచి 465 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చదవండి: సరిహద్దు వద్ద రూ.135 కోట్ల డ్రగ్స్ రవాణా యత్నం! -
తిరుచ్చి విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
సాక్షి, చెన్నై: తిరుచ్చి విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కౌలాలంపూర్ నుండి బంగారం తరలిస్తున్న మురుగేశన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మురుగేశన్ నుండి 2.96 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. -
ఎయిర్‌పోర్టులో చెల్లని నోట్లు
టీనగర్: ఎయిర్‌పోర్టులో రెండు లక్షల రూపాయల చెల్లని నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చి విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్, బాంబు స్క్వాడ్ సిబ్బంది పోలీసు జాగిలం, మెటల్ డిటెక్టర్ పరికరం ద్వారా కారు పార్కింగ్, పా ర్కుల వద్ద శుక్రవారం రాత్రి తనిఖీలు జరిపారు. ప్రయాణికుల లగేజీలను తీసుకువెళ్లే ఒక ట్రాలీలో ఎవరికీ చెందని ఒక బ్యాగ్ కనిపించింది. అందులో తనిఖీ చేయగా ఒక పక్క చిరిగిన బ్యాగులో చెల్లని రూ.500, వెయి రూపాయల నోట్లు కనిపించాయి. ఈ బ్యాగును స్వాధీనం చేసుకున్న సీఐఎస్ఎఫ్ జవాన్లు దాన్ని ఎయిర్‌పోర్టు మేనేజర్‌కు అప్పగించారు. బ్యాగ్‌ను విప్పి చూడగా చెల్లని నోట్లు రూ. 2.1 లక్షలు, మలేషియాలో విక్రయించే చాక్లెట్లు కనిపిం చాయి. బ్యాగ్‌లోని చిరునామాను బట్టి చూడగా మలేషియాకు చెందిన సయ్యద్ మహ్మద్ (38)కి చెందినదిగా వెల్లడైంది. శనివారం విమానాశ్రయానికి వచ్చిన సయ్యద్ మహ్మద్ విమానాశ్రయ మేనేజర్‌తో తన లగేజీ వ దిలి వెళ్లడం గురించి వివరించి నగదు కు సంబంధించిన పత్రాలు చూ పాడు. తిరుచ్చిలో ఉన్న బంధువు ఇం టికి వచ్చి విహారయాత్రకు వెళ్లనున్న ట్లు, ఇందుకోసం మలేషియా నుంచి భారత కరెన్సీగా మార్చుకుని తీసుకొచ్చినట్లు తెలిపాడు. దీనిపై ఎయిర్‌పోర్టు మేనేజర్ విచారణ జరిపిన అనంతరం నగదు, చాక్లెట్లను సయ్యద్ మహ్మద్‌కు అప్పగించారు. -
ఎయిర్‌పోర్టులో రూ.1.25 కోట్ల బంగారం పట్టివేత
చెన్నై : కౌలాలంపూర్ నుంచి తమిళనాడులోని తిరుచ్చి వచ్చిన ఏడుగురు ప్రయాణికుల నుంచి రూ.1.25 కోట్ల విలువ చేసే బంగారాన్ని అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి బయలుదేరిన సదరు విమానంలో తిరుచ్చికి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సెంట్రల్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులకు రహస్య సమాచారం అందింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి... సదరు విమాన ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.ఆ క్రమంలో యువతితో సహా ఏడుగురి వద్ద భారీ బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారి నుంచి మూడు కిలోల 186 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 800 గ్రామలు బంగారాన్ని విమానంలో వదలి వెళ్లారు. దానిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మొత్తం రూ.1.25 కోట్ల విలువైన మూడు కిలోల 986 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అదే విమానంలో హాంకాంగ్, సింగపూర్‌కు చెందిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.16.28 లక్షల విలువ చేసే డాలర్ల అక్రమంగా తరలిస్తుండగా వాటిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళతోసహా తొమ్మిది మందిని ఉన్నతాధికారులు చెన్నైకు తరలించారు.