చెన్నై: మలేషియా ఎయిర్ లైన్స్ విమానంలో తిరుచ్చి విమానశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడి సూట్‌కేసులో ప్రమాదకరమైన కొండచిలువలు, పాములు, బల్లులు ఉండటాన్ని చూసి విస్తుపోయారు తిరుచ్చి కస్టమ్స్ సిబ్బంది. వాటిని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేశారు కస్టమ్స్ అధికారులు.
సినిమాల ప్రభావమో ఏమోగానీ స్మగ్లింగ్ పేరిట ఏది పెడితే అది విమానాల్లో రవాణా చేసే స్థాయికి ఎదిగిపోయారు స్మగ్లర్లు. తాజాగా మొహమ్మద్ మొయిద్దీన్ అనే ఓ ప్రయాణికుడు కౌలాలంపూర్ నుండి వస్తూ తనతోపాటు సూట్‌కేసులో కొండచిలువ పిల్లలు, బంగారు బల్లుల్ని వెంట తీసుకొచ్చాడు. ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులు ఆతడి సూట్‌కేసును తనిఖీ చేయగా అందులో 47 కొండచిలువ పిల్లలు, 2 బంగారు బల్లులను కనుగొన్నారు. అవి ప్రాణాలతో ఉండటాన్ని చూసి కంగారుపడ్డ కస్టమ్స్ అధికారులు వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించి అతడిని మాత్రం విచారణ నిమిత్తం కస్టడీకి తరలించారు.
విమానంలో సజీవంగా ఉన్న కొండచిలువలను, బల్లులను ఎలా తీసుకువచ్చి ఉంటాడన్నదే కస్టమ్స్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతను మలేషియాలో సెక్యూరిటీ వాళ్ళ కళ్ళుగప్పి ఎలా రాగలిగాడు, అక్కడి ఎయిర్పోర్టు సిబ్బంది సరిగ్గా తనిఖీలు నిర్వహించలేదా ఏంటన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అతనెవరు? అసలెందుకు చెన్నై వచ్చాడు? ఈ స్మగ్లింగ్ ముఠాలో ఇంకా ఎవరెవరున్నారన్న వివరాలపై ఆరా తీస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
#TamilNadu- Customs officials caught a Malaysian passenger with 47 exotic pythons and two lizards at #Trichy airport on Sunday. pic.twitter.com/kVggJIP08C
— Suresh (@isureshofficial) July 30, 2023
ఇది కూడా చదవండి: ఒకే వేదికపై ప్రధాని మోదీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్?
Comments
Please login to add a commentAdd a comment