Kuala lumpur airport
-
చెన్నై తిరుచ్చి విమానాశ్రయంలో కొండచిలువల కలకలం
చెన్నై: మలేషియా ఎయిర్ లైన్స్ విమానంలో తిరుచ్చి విమానశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడి సూట్‌కేసులో ప్రమాదకరమైన కొండచిలువలు, పాములు, బల్లులు ఉండటాన్ని చూసి విస్తుపోయారు తిరుచ్చి కస్టమ్స్ సిబ్బంది. వాటిని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేశారు కస్టమ్స్ అధికారులు. సినిమాల ప్రభావమో ఏమోగానీ స్మగ్లింగ్ పేరిట ఏది పెడితే అది విమానాల్లో రవాణా చేసే స్థాయికి ఎదిగిపోయారు స్మగ్లర్లు. తాజాగా మొహమ్మద్ మొయిద్దీన్ అనే ఓ ప్రయాణికుడు కౌలాలంపూర్ నుండి వస్తూ తనతోపాటు సూట్‌కేసులో కొండచిలువ పిల్లలు, బంగారు బల్లుల్ని వెంట తీసుకొచ్చాడు. ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు ఆతడి సూట్‌కేసును తనిఖీ చేయగా అందులో 47 కొండచిలువ పిల్లలు, 2 బంగారు బల్లులను కనుగొన్నారు. అవి ప్రాణాలతో ఉండటాన్ని చూసి కంగారుపడ్డ కస్టమ్స్ అధికారులు వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించి అతడిని మాత్రం విచారణ నిమిత్తం కస్టడీకి తరలించారు. విమానంలో సజీవంగా ఉన్న కొండచిలువలను, బల్లులను ఎలా తీసుకువచ్చి ఉంటాడన్నదే కస్టమ్స్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతను మలేషియాలో సెక్యూరిటీ వాళ్ళ కళ్ళుగప్పి ఎలా రాగలిగాడు, అక్కడి ఎయిర్‌పోర్టు సిబ్బంది సరిగ్గా తనిఖీలు నిర్వహించలేదా ఏంటన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అతనెవరు? అసలెందుకు చెన్నై వచ్చాడు? ఈ స్మగ్లింగ్ ముఠాలో ఇంకా ఎవరెవరున్నారన్న వివరాలపై ఆరా తీస్తున్నారు కస్టమ్స్ అధికారులు. #TamilNadu- Customs officials caught a Malaysian passenger with 47 exotic pythons and two lizards at #Trichy airport on Sunday. pic.twitter.com/kVggJIP08C — Suresh (@isureshofficial) July 30, 2023 ఇది కూడా చదవండి: ఒకే వేదికపై ప్రధాని మోదీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్? -
క్రిమినల్‌గా ట్రీట్ చేయలేదు కానీ...
చెన్నై : మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లోని విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదుర్కొన్న తమిళ నేత, ఎండీఎంకే అధినేత వైగో శనివారం వేకువ జామున చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనను ఓ క్రిమినల్‌గా ట్రీట్ చేయకపోయినప్పటికీ... సాధారణ మర్యాదలు ఏమీ లేవని, ఇతర దేశాల్లా వ్యవహరించలేదని అన్నారు. తనను భద్రతా ముప్పుగా భావించడం వల్లే మలేషియా ఈ చర్యకు పాల్పడి ఉంటుందని వైగో అన్నారు. కాగా వైగోను శుక్రవారం కౌలాలంపూర్‌లోని విమానాశ్రయంలోనే అధికారులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఎల్టీటీఈతో సంబంధాలపై అక్కడే చాలాసేపు ప్రశ్నించిన అధికారులు.. ఆయన్ను దేశంలోకి అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. ‘మలేసియాకు ప్రమాదకారుల’ జాబితాలో వైగో పేరు ఉండడమే అందుకు కారణమన్నారు. ఎల్‌టీటీఈలకు మద్దతుదారుగా ఉన్న వైగో మీద శ్రీలంకలో అనేక కేసులు ఉన్నాయని, తమిళనాడులో రెండుసార్లు జైలుకు వెళ్లొచ్చినట్టుగా అక్కడి అధికారులు పేర్కొనడంతో ఆయనకు చేదు అనుభవం తప్పలేదు. రోజంతా ఒంటరిగా ఉంచడమే కాకుండా, శుక్రవారం రాత్రి వైగోను మలేసియా ఎయిర్‌లైన్స్ విమానంలో తిరిగి చెన్నైకి పంపించారు. కాగా మలేసియాలోని పెనాంగ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పి.రామస్వామి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవడానికి వైగో మలేసియా వెళ్లారు. కౌలాలంపూర్‌లో దిగగానే ఆయనను విమానాశ్రయానికే అధికారులు పరిమితం చేశారు. ఇమ్మిగ్రేషన్ వర్గాల పరిశీలనలో వైగో పాస్‌పోర్టు, వీసా పరిశీలన అనంతరం సీజ్ చేశారు. వైగోను అనుమతించకుండా ఇమ్మిగ్రేషన్ వర్గాలు అడ్డుకున్న సమాచారంతో పినాంగ్ సీఎం లింకు యాంగ్ మంగ్, డిప్యూటీ సీఎం రామస్వామి ఇమిగ్రేషన్, దౌత్య కార్యాలయ వర్గాలకు సమాచారం ఇచ్చారు. అయితే, ఏ ఒక్క అధికారి స్పందించలేదు. మలేషియా ఉప ప్రధాని ఆదేశాలు తమకు ఉన్నాయని, వైగోను వెనక్కు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సూచించడంతో రామస్వామి వెనక్కు తగ్గాల్సి వచ్చింది. రోజంతా వైగోను ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో ఓ గదిలో ఉంచారు. ఆయన్ను బయటకు ఎక్కడ పంపించలేదు. ఆయన కార్యదర్శి అరుణగిరికి మాత్రం అనుమతించారు. వైగో అక్కడే ఉండడంతో ఆయన కూడా బయటకు వెళ్లడానికి నిరాకరించారు. ఎవ్వరితోనూ మాట్లాడకుండా వైగో మౌనం అనుసరించడంతో రామస్వామి అతికష్టం మీద ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. ఏమైనా వేధింపులకు గురి చేశారా అని ఆయన ప్రశ్నించగా, అందుకు వైగో, ఒంటరిగా ఉన్నానంటూ ఫోన్ కట్ చేయడం గమనార్హం. -
ఎండీఎంకే చీఫ్ వైగోకు చేదు అనుభవం
కౌలాలంపూర్: ఎండీఎంకే చీఫ్ వైగోకు మలేషియాలో చేదు అనుభవం ఎదురైంది. ఎల్టీటీఈతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఆయనను శుక్రవారం కౌలాలంపూర్ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. కొన్ని గంటల పాటు వైగోను అధికారులు ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా 2001లో ఎల్‌టీటీఈలకు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వేలూరు కేంద్ర కారాగారంలో 19 నెలల పాటుగా జైలు జీవితాన్ని అనుభవించారు. 2009లో శ్రీలంకలో యుద్ధం సాగుతున్న సమయంలో వైగో స్పందించిన తీరు, మాటల తూటాలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఆయన మీద దేశద్రోహం కేసు కూడా నమోదు అయింది. తొమ్మిది సంవత్సరాలుగా ఈ కేసు విచారణను వైగో ఎదుర్కొంటూ వస్తున్నారు. ఎగ్మూర్ మేజిస్ట్రేట్ కోర్టులో సాగుతున్న విచారణకు స్వయంగా హాజరై వాదనల్ని వినిపిస్తూ వస్తున్నారు.