
విమానం ప్రయాణం అంటేనే ఖర్చు ఎక్కువ. విమానాశ్రయంలో మామూలు కాఫీ లేదా వాటర్ బాటిల్ కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.ఇక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది విమానాశ్రయం అయితే. బిల్లు చూసి గుడ్లు తేలేయాల్సిందే. ఇంతకీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమానాశ్రయం ఏదో తెలుసా? అక్కడ ఒక్కో అరటి పండు ఖరీదు ఎంతో తెలిస్తే షాకవుతారు.
మిర్రర్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులు ఇస్తాంబుల్ విమానాశ్రయం "ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది". ఇస్తాంబుల్ విమానాశ్రయం (Istanbul Airport) టర్కీలోని ఇస్తాంబుల్‌కు సేవలందిస్తున్న రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలలో అతిపెద్దది, ప్రధాన విమానాశ్రయం. ఐరోపాలో 2వ అత్యంత రద్దీగా ఉంటుంది. మధ్యప్రాచ్యంలో 2వ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయమిది. అంత ప్రతిష్టాత్మకమైన ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కో అరటిపండుకు రూ.565. ఒక్కో బీరుకు రూ.1,697 వసూలు చేయడం వార్తల్లో నిలిచింది. ఇటాలియన్ వార్తాపత్రిక కొరియర్ డెల్లా సెరా కూడా ఈ విషయంపై నివేదించింది, ఇటాలియన్ ప్రయాణికుడు లియోనార్డ్ బెర్బెరిని ఉటంకిస్తూ, 90 గ్రాముల లాసాగ్నా ( పాస్తాలాంటిది) రూ. 2,376 చెల్లించాడని పేర్కొంది. అయితే ఆహార నాణ్యత ఖరీదైన ధరకు సరిపోలడం లేదంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడట కూడా.
ఇదీ చదవండి: Pahalgam : ఈ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరము? గుండెల్నిపిండేసే వీడియోలు
క్రోసెంట్స్ (బ్రెడ్ లాంటిది)రూ. 1,410-1,698 మధ్య ఉంటుంది. ఇటాలియన్ చికెన్ సలాడ్‌ల ధర ఏకంగా రూ. 1,698 లియోనార్డ్ కూడా కనుగొన్నాడు. అంతేకాదు, బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్ లాంటి వాటిల్లో ప్యాకెట్ ఫుడ్ ధర చాలా ఎక్కువగాఉందని తెలిపాడు ఆయన చెప్పిన దాని ప్రకారం మెక్‌డొనాల్డ్స్ వద్ద బిగ్ మాక్ , డబుల్ క్వార్టర్ పౌండర్ ధర సుమారు రూ. 2 వేలు, 2,450గా ఉన్నాయి.ఇక నాలుగు ఫ్రైడ్ చికెన్ వింగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ,కోకా-కోలా ధర రూ. 1,698కు పై మాటేనట.
చదవండి: నీతా అంబానీ లైఫ్ స్టైల్, ఫ్యాషన్ సెన్స్ అది మరి! ఆమె టీ కప్ స్పెషల్ ఏంటో?
ఇస్తాంబుల్ విమానాశ్రయం రోజుకు 2 లక్షల 20వేల మందికంటే ఎక్కువమంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నప్పటికీ, ఇక్కడి ధరలు మాత్రం విదేశీ పర్యాటకులకు షాకిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో హై-ఎండ్ ట్రాన్సిట్ హబ్‌గా పేరొందిన ఇస్తాంబుల్ విమానాశ్రయంపై రాబోయే నెలల్లో విమర్శలు మరింత వెల్లువెత్తే అవకాశం ఉందని అంచనా.