![Chinese Woman scams Relatives Of Rs 14 Crore By Staging Fake Wedding With Rich Man](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/fakewedding-china.jpg.webp?itok=LZZeTUwJ)
నమ్మేవాళ్లుండాలే గానీ ఎంతటి మోసానికి పాల్పడవచ్చు. కానీ మోసం ఎంతోకాలం దాగదు. ఎప్పటికైనా చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం తప్పదు.చైనాకు చెందిన ఒక మహిళ స్టోరీలో అక్షరాలా ఇదే జరిగింది. పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారితో పెళ్లి అంటూ నాడకమాడి, బంధువులను నిలువునా ముంచేసింది. చివరికి ఆమె కుట్ర గుట్టు రట్టు అయింది. విచారించిన కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించింది. ఇంతకీ ఆమె వలలో బంధువులు ఎలా పడ్డారు? ఈ స్కామ్ వెలుగులోకి ఎలా వచ్చింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే మీరీ స్టోరీ చదవాల్సిందే!
చైనాకు చెందిన మంగ్ (40) అనే మహిళ పెద్ద ప్లానే వేసింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం ఆమె ఒక చిన్న రియల్ ఎస్టేట్ ఏజెన్సీ నిర్వహించేది. కానీ అందులో నష్టాలు రావడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసింది. బిలియనీర్, రియల్ ఎస్టేట్ వ్యాపారితో పెళ్లి అంటూ బంధువులను నమ్మించింది. ఫ్యామిలీని సైతం మోసం చేయాలనుకుంది. మందస్తు పథకం ప్రకారం డ్రైవర్ జియాంగ్‌ను పావుగా ఎంచుకుంది. ఈ విషయంలో జియాంగ్‌ను కూడా బాగానే బుట్టలో వేసుకుంది. ప్రేమిస్తున్నట్టు నమ్మిచింది. తన వయస్సు కారణంగా వివాహం చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారని అందుకే పెళ్లి చేసుకుందామంటూ ఒప్పించింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది.
ఇక ఆ తరువాత తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేసింది. అనేక పెద్ద ప్రాజెక్టుల వెనుక రియల్టర్ అయిన తన భర్త జియాంగ్ ఉన్నాడని బంధువులను నమ్మించింది. తక్కువ ధరకే, అతి చౌకగా విలువైన ఆస్తులను దక్కించుకోవచ్చని ఆశపెట్టింది. అంతేకాదు మెంగ్ రూ.1.2 కోట్ల విలువైన ఒక చిన్న ఫ్లాట్‌ను కూడా కొనుగోలు చేసి, దానిని సగం ధరకు బంధువుకు విక్రయించింది.
తనకు గొప్ప ధర వచ్చిందని బంధువులకు అబద్ధం చెప్పమని జియాంగ్‌ను కోరింది. మరో అడుగు ముందుకేసి, కొత్త నివాస భవనాల షోరూమ్‌లకు తీసుకెళ్లి, చదరపు మీటరుకు రూ. 61వేలవరకు తగ్గుతుందని ఆశచూపిచింది. దీంతో ఆమె మోసానని పసిగట్టలేని బంధువులు రూ.14 కోట్ల (1.6 మిలియన్ డాలర్లు) మేర డబ్బులను ముట్ట చెప్పారు.కనీసం ఐదుగురు బంధువులు ఫ్లాట్‌లను కొనడానికి ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చారు. కొందరు మంచి ఆస్తికి మారాలనే ఆశతో ఉన్న ఫ్లాట్‌లను కూడా అమ్మేశారు.ఇక్కడే సమస్య మొదలైంది. సంవత్సరాలు గడుస్తున్నా, ప్రాపర్టీ బంధువులకు స్వాధీనం చేయలేదు మంగ్.
ఇదీ చదవండి: అదానీ చిన్న కొడుకు పెళ్లికి, షాదీ డాట్ కామ్ అనుపమ్ మిట్టల్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
డిస్కౌంట్‌లో ఇవ్వడంలో ఇబ్బందులు ఉన్నాయని చెబుతూ దాట వేస్తూ వచ్చింది. ఆ తరువాత కొన్ని ఫ్లాట్‌లను అద్దెకు తీసుకుని, ఇవి మనవే అని వారికి చూపించింది. ఇలా కాలం గడుస్తున్నకొద్దీ, సాకులుచెబుతోంది తప్ప ఆస్తి తమ చేతికి రాకపోవడంతో ఏదో తప్పు జరిగిందని గ్రహించిన బంధువులలో ఒకరు, అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారిని సంప్రదించాడు. దీంతో ఆమె అసలు స్కాం బైటపడింది. అవి అసలువి కాదని తేలిపోయింది. మెంగ్ నివసిస్తున్న ఫ్లాట్ ఆమెది కాదని వెల్లడైంది.దీంతో బాధితులంతా పోలీసులు ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన కోర్టు మోసం చేసినందుకు మంగ్‌కు 12 సంవత్సరాల ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఫ్లాట్ల విషయంలో లీజు ఒప్పందాలపై సంతకం చేసినందుకు నకిలీ భర్త జియాంగ్‌కు కూడా ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే ఇతర బంధువుల ముందు అబద్ధం చెప్పిన మరో బంధువుకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. (ఎండలు పెరుగుతున్నాయి... జర జాగ్రత్త)
Comments
Please login to add a commentAdd a comment