fake marriage
-
బిలియనీర్‌తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి!
నమ్మేవాళ్లుండాలే గానీ ఎంతటి మోసానికి పాల్పడవచ్చు. కానీ మోసం ఎంతోకాలం దాగదు. ఎప్పటికైనా చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం తప్పదు.చైనాకు చెందిన ఒక మహిళ స్టోరీలో అక్షరాలా ఇదే జరిగింది. పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారితో పెళ్లి అంటూ నాడకమాడి, బంధువులను నిలువునా ముంచేసింది. చివరికి ఆమె కుట్ర గుట్టు రట్టు అయింది. విచారించిన కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించింది. ఇంతకీ ఆమె వలలో బంధువులు ఎలా పడ్డారు? ఈ స్కామ్ వెలుగులోకి ఎలా వచ్చింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే మీరీ స్టోరీ చదవాల్సిందే!చైనాకు చెందిన మంగ్ (40) అనే మహిళ పెద్ద ప్లానే వేసింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం ఆమె ఒక చిన్న రియల్ ఎస్టేట్ ఏజెన్సీ నిర్వహించేది. కానీ అందులో నష్టాలు రావడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసింది. బిలియనీర్, రియల్ ఎస్టేట్ వ్యాపారితో పెళ్లి అంటూ బంధువులను నమ్మించింది. ఫ్యామిలీని సైతం మోసం చేయాలనుకుంది. మందస్తు పథకం ప్రకారం డ్రైవర్ జియాంగ్ను పావుగా ఎంచుకుంది. ఈ విషయంలో జియాంగ్ను కూడా బాగానే బుట్టలో వేసుకుంది. ప్రేమిస్తున్నట్టు నమ్మిచింది. తన వయస్సు కారణంగా వివాహం చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారని అందుకే పెళ్లి చేసుకుందామంటూ ఒప్పించింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఇక ఆ తరువాత తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేసింది. అనేక పెద్ద ప్రాజెక్టుల వెనుక రియల్టర్ అయిన తన భర్త జియాంగ్ ఉన్నాడని బంధువులను నమ్మించింది. తక్కువ ధరకే, అతి చౌకగా విలువైన ఆస్తులను దక్కించుకోవచ్చని ఆశపెట్టింది. అంతేకాదు మెంగ్ రూ.1.2 కోట్ల విలువైన ఒక చిన్న ఫ్లాట్‌ను కూడా కొనుగోలు చేసి, దానిని సగం ధరకు బంధువుకు విక్రయించింది.తనకు గొప్ప ధర వచ్చిందని బంధువులకు అబద్ధం చెప్పమని జియాంగ్ను కోరింది. మరో అడుగు ముందుకేసి, కొత్త నివాస భవనాల షోరూమ్‌లకు తీసుకెళ్లి, చదరపు మీటరుకు రూ. 61వేలవరకు తగ్గుతుందని ఆశచూపిచింది. దీంతో ఆమె మోసానని పసిగట్టలేని బంధువులు రూ.14 కోట్ల (1.6 మిలియన్ డాలర్లు) మేర డబ్బులను ముట్ట చెప్పారు.కనీసం ఐదుగురు బంధువులు ఫ్లాట్లను కొనడానికి ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చారు. కొందరు మంచి ఆస్తికి మారాలనే ఆశతో ఉన్న ఫ్లాట్లను కూడా అమ్మేశారు.ఇక్కడే సమస్య మొదలైంది. సంవత్సరాలు గడుస్తున్నా, ప్రాపర్టీ బంధువులకు స్వాధీనం చేయలేదు మంగ్.ఇదీ చదవండి: అదానీ చిన్న కొడుకు పెళ్లికి, షాదీ డాట్ కామ్ అనుపమ్ మిట్టల్ గిఫ్ట్ ఏంటో తెలుసా?డిస్కౌంట్లో ఇవ్వడంలో ఇబ్బందులు ఉన్నాయని చెబుతూ దాట వేస్తూ వచ్చింది. ఆ తరువాత కొన్ని ఫ్లాట్లను అద్దెకు తీసుకుని, ఇవి మనవే అని వారికి చూపించింది. ఇలా కాలం గడుస్తున్నకొద్దీ, సాకులుచెబుతోంది తప్ప ఆస్తి తమ చేతికి రాకపోవడంతో ఏదో తప్పు జరిగిందని గ్రహించిన బంధువులలో ఒకరు, అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారిని సంప్రదించాడు. దీంతో ఆమె అసలు స్కాం బైటపడింది. అవి అసలువి కాదని తేలిపోయింది. మెంగ్ నివసిస్తున్న ఫ్లాట్ ఆమెది కాదని వెల్లడైంది.దీంతో బాధితులంతా పోలీసులు ఆశ్రయించారు.ఈ కేసును విచారించిన కోర్టు మోసం చేసినందుకు మంగ్‌కు 12 సంవత్సరాల ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఫ్లాట్ల విషయంలో లీజు ఒప్పందాలపై సంతకం చేసినందుకు నకిలీ భర్త జియాంగ్‌కు కూడా ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే ఇతర బంధువుల ముందు అబద్ధం చెప్పిన మరో బంధువుకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. (ఎండలు పెరుగుతున్నాయి... జర జాగ్రత్త) -
ప్రాంక్ అని చెప్పి నిజమైన పెళ్లి..
రీల్స్, ఇన్‌స్ట్రాగామ్ ప్రపంచాన్ని ఏలుతున్న కాలంలో ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలియడం లేదు. ఆ్రస్టేలియాలోని ఓ మహిళకు ఇలాంటి సమస్యే ఎదురైంది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను పెంచుకోవడానికి అతను ఏర్పాటు చేసిన ‘ఫేక్ వెడ్డింగ్’నిజమని తేలడంతో ఆమె కోర్టుకెక్కాల్సి వచ్చింది. చివరకు జడ్జి ఆ పెళ్లిని రద్దు చేశారు. వివరాల్లోకి వెళ్తే... మెల్బోర్న్లో ఉంటున్న ఓ మహిళకు 2023 సెప్టెంబర్‌లో ఆన్లైన్ డేటింగ్ వేదికపై ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. అదే ఏడాది డిసెంబర్లో ఆమెకు అతను ప్రపోజ్ చేశాడు. ఆమె అంగీకరించింది. రెండు రోజుల తర్వాత సిడ్నీలో ఓ వైట్పార్టీ ఉందని, అక్కడికి అందరూ తెలుపు రంగు దుస్తుల్లో వస్తారని చెప్పారు. ఆమె కూడా అలాగే రెడీ అయి వెళ్లింది. తీరా అక్కడికెళ్లి చూస్తే.. ఫోటోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ స్నేహితుడు తప్ప మరెవరూ లేరు. ఇదేంటని ప్రశ్నిస్తే... తన ఇన్‌స్ట్రాగామ్‌లో ఫాలోవర్స్ పెరగడం కోసం ప్రాంక్ వెడ్డింగ్ నిర్వహిస్తున్నానని, అందుకు సహకరించాలని ఆమెను కోరాడు. అప్పటికే అతనికి 17,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అతని వివరణ ఆమెకు సబబుగానే తోచింది. సాయం చేసినట్లవుతుందని ఫేక్ పెళ్లికి అంగీకరించింది. సివిల్ మ్యారేజ్ కోర్టులో జరిగితేనే పెళ్లి చెల్లుబాటవుతుందని నమ్మింది. అదే విషయాన్ని తన స్నేహితురాలితో పంచుకుంది. అదే నిజమైతే వారు ముందుగా వివాహం నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని స్నేహితురాలు కూడా చెప్పడంతో.. ఇది ఉత్తుత్తి పెళ్లే అని నమ్మింది. కట్ చేస్తే.. రెండు నెలల తరువాత, ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం కోసం ఆమె చేసిన దరఖాస్తులో తనను డిపెండెంట్‌గా చేర్చాలని అతను కోరాడు. పెళ్లి కానిది ఎలా కుదురుతుందని ఆమె ప్రశ్నించగా.. సిడ్నీలో జరిగిన వివాహ వేడుక నిజమైనదని బాంబు పేల్చాడు. వివాహ ధృవీకరణ పత్రాన్ని కూడా చూపించాడు. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి.. వివాహానికి నెలముందే అతను నోటీసులు ఇచ్చాడని అర్థమైంది. అతను మొదటినుంచి అబద్ధం చెప్పాడని, తనను మోసం చేశాడని ఆమె కోర్టుకెక్కింది. పెళ్లి వేడుకలో తాను నటించానే తప్ప.. అది నిజం కాదని కోర్టుకు తెలిపింది. మహిళ వాంగ్మూలాన్ని నమ్మిన మెల్బోర్న్ జడ్జి 2024 అక్టోబర్‌లో వీరి వివాహాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యా సైనికుల దొంగ పెళ్లిళ్లు.. ఫోన్ సంభాషణ లీక్!
మాస్కో: ఉక్రెయిన్‌లో నెలల తరబడి విసుగెత్తిపోయిన రష్యా సైనికులు యుద్ధం నుంచి తప్పించుకోవడానికి కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. సొంత దేశం చేరుకోవడానికి ఉత్తుత్తి పెళ్లిళ్లకు తెర తీస్తున్నారు. నకిలీ శుభలేఖలు సమర్పించి సెలవులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ తతంగమంతా ఓ ఫోన్ సంభాషణ ద్వారా బయటపడింది. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మంగళవారం విడుదల చేసిన ఒక ఫోన్ కాల్ ప్రకారం.. ఉక్రెయిన్‌లో ఉన్న రష్యా సైనికుడికి, అతడి స్నేహితుడి మధ్య జరిగిన సంభాషణ ద్వారా ఈ తతంగం బయటపడింది. నకిలీ పెళ్లి కోసం ప్రయత్నిస్తున్నానని, చాలామంది ఇలాగే చేశారని అతను చెప్పుకున్నాడు. ఉక్రెయిన్ నుంచి బయటపడడానికి ఇదొక్కటే మార్గమన్నాడు. చదవండి: రష్యా యుద్ధం.. ఉక్రెయిన్ దళాల వెనుకంజ! -
బోగస్ పెళ్లిళ్లు 90!
ఆదిలాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్యాణలక్ష్మి స్కాంలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు మూడేళ్లుగా వచ్చిన కల్యాణలక్ష్మి దరఖాస్తులను పరిశీలించిన తహసీల్దార్లు 90 పెళ్లిళ్లకు సంబంధించిన దరఖాస్తులు బోగస్‌గా ఉన్నాయని గుర్తించారు. ఒకసారి కల్యాణలక్ష్మి డబ్బులు తీసుకోగా మళ్లీ అవే ఫొటోలతో రెండోసారి దరఖాస్తు చేసినట్లుగా పరిశీలనలో తేలింది. మావల మండలానికి చెందిన మూడు బోగస్ దరఖాస్తులకు సంబంధించి డబ్బుల రికవరీ చేయగా, నాలుగు మండలాల పరిధిలోని 87 బోగస్ పెళ్లిళ్లకు సంబంధించి డ బ్బులు రికవరీ చేసే పనిలో అధికారులు నిగమ్నమయ్యారు. బోగస్ లబ్ధిదారులు, మధ్యవర్తుల బ్యాంకు ఖాతాలను నిలిపివేయాలని కలెక్టర్ ఇది వరకే ఎల్డీఎంను ఆదేశించారు. అయితే బోగస్దారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు అలానే ఉన్నాయా? లేక డ్రా చేశారా? డ్రా చేస్తే ఆ డబ్బులు ఎలా.. ఎప్పుడు రికవరీ చేయాలనే దానిపై అధికారులు సమాలోచన చేసి ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో యంత్రాంగం తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. (చదవండి: చిచ్చురేపిన క్రికెట్.. కాల్పుల కలకలం) ఈ ఏడాదిలోనే జరిగిందా? రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను 2016లో ప్రారంభించి మొదట రూ.50,116 ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయంగా అందించింది. దానిని 2018 ఏప్రిల్‌లో రూ.1,00,116కు పెంచింది. ఏటా వేల సంఖ్యలో వివాహాలు జరగడం, పథకానికి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడం లాంటివి జరుగుతున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా.. మూడు సెట్ల జిరాక్స్ కాపీలను తహసీల్ కార్యాలయంలో అందజేయడం తప్పనిసరి. కాని అలా జరగలేదు. అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్న వారి దరఖాస్తులు మాత్రమే మ్యానువల్‌గా తహసీల్ ఆఫీసులకు అందాయి. బోగస్ పెళ్లిళ్లకు సంబంధించిన మ్యానువల్ దరఖాస్తులు తహసీల్దార్ల కార్యాలయాలకు రాలేదని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆన్‌లైన్‌ను ఆసరాగా చేసుకొని కొందరు అక్రమార్కులు తమకు అనుకూలమైన వ్యక్తుల ఫొటోలు, బ్యాంకు ఖాతాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జతచేసి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా సంబంధిత మండల తహసీల్దార్ల లాగిన్ నుంచి నేరుగా ఆర్డీవో కార్యాలయానికి పంపుతూ వచ్చారు. ఒకసారి కల్యాణలక్ష్మి డబ్బులు పొందిన లబ్ధిదారుల ఫొటోలు మళ్లీ పెట్టి తల్లిదండ్రుల పేర్లు, బ్యాంకు ఖాతా, ధృవీకరణ పత్రాలు మార్చి రెండోసారి కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. 2019లో పెళ్లి జరిగినట్లుగా దరఖాస్తులో పొందుపర్చి డబ్బులు ఈ ఏడాదిలో దండుకున్నట్లు విచారణలో తేలినట్లుగా సమాచారం. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కాలంలోనే బోగస్ పెళ్లిళ్లకు చెందిన బిల్లులు ఎక్కువ పాసయ్యాయని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, తహసీల్దార్లు లాగిన్, పాస్‌వర్డ్‌ను ఎప్పటికప్పుడు మార్చుకునే అవకాశం ఉన్నా.. ఆ సమయంలో చేంజ్ చేద్దామనే ఆలోచన రాకపోవడం గమనార్హం. (చదవండి: అయ్యో.. ఐఫోన్ అందకపాయె..! ) కొనసాగుతున్న విచారణ.. జిల్లాలోని ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో కల్యాణలక్ష్మి పథకానికి వచ్చిన దరఖాస్తుల పరిశీలన ముగిసింది. మూడేళ్లుగా వచ్చిన దరఖాస్తులను నాలుగైదు రోజుల పాటు కుప్పలు తెప్పలుగా పోసి క్షుణ్ణంగా పరిశీలించారు. 90 దరఖాస్తులు బోగస్‌గా తేలగా, 3 దరఖాస్తుల డబ్బులు రికవరీ చేశారు. మిగతా 87 దరఖాస్తులకు సంబంధించిన లబ్ధిదారుల నివాస ప్రాంతాలు ఉట్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, బజార్హత్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల్లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్, గుడిహత్నూర్, మావల మండలాల తహసీల్దార్ల లాగిన్ల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఎవరు దరఖాస్తుదారు, చెక్ ఎవరి పేరిట మంజూరైంది? బ్యాంకు ఖాతా.. పెళ్లికి సంబంధించిన పత్రాలు, ఫొటో, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, తదితరవి వాటిపై ఆయా మండల కార్యాలయాల్లో విచారణ జరుగుతోంది. బోగస్‌గా గుర్తించినవి సరైనవేనా.? అనేది తెలుసుకునేందుకు క్షేత్రస్థాయికి వెళ్లి విచారిస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. విచారణ ముగిశాక ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెబుతున్నారు. విచారణ జరుగుతోంది కలెక్టర్ ఆదేశాల మేరకు దరఖాస్తులు పరిశీలించి బోగస్‌గా 90 దరఖాస్తులు గుర్తించాం. ఇందులో మూడు దరఖాస్తులకు చెందిన డబ్బులు రికవరీ అయ్యాయి. మిగతా 87 దరఖాస్తులపై విచారణ జరుగుతోంది. పూర్తి చేసేందుకు కొంత సమయం పడుతుంది. అనంతరం రికవరీ చేస్తాం. – జాడి రాజేశ్వర్, ఆదిలాబాద్ ఆర్డీవో -
ఆడవాళ్లను దొంగ పెళ్ళిళ్లు చేసుకున్న కి‘లేడీ’
సాక్షి, డెహ్రాడూన్ : కట్నం డబ్బులు కాజేయడం కోసం మగువలను మగవాళ్లు మోసం చేసి పలు పెళ్లిళ్లు చేసుకునే మగవాళ్లను చూశాం. అలాగే, బాగా డబ్బున్న డాబుసరి బాబుల దగ్గర డబ్బును కాజేసేందుకు మోసం చేసి మగువలే పలు పెళ్లిళ్లు చేసుకోవడం కూడా అక్కడక్కడా చూశాం. కానీ, తాజాగా మాత్రం కట్నం డబ్బుల కోసం ఓ మగవాడు కాకుండా ఓ యువతే మగరాయుడి వేషం వేసుకొని పలువురు యువతులను పెళ్లిళ్లు చేసుకుని అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఇద్దరు యువతులను కట్నం కోసం పెళ్లి చేసుకున్న కష్ణా సేన్ అలియాస్ స్వీటీ సేన్‌ను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్కు చెందిన స్వీటీ సేన్, కష్ణాసేన్గా అవతారమెత్తి ఉత్తరాఖండ్‌లోకి ప్రవేశించింది. మగరాయుడిలాగా దుస్తులు ధరించి ఖరీదైన కార్లలో తిరుగుతూ అమ్మాయిలను బుట్టలో పడేయడం, పెళ్లి చేసుకోవడం అలవాటుగా మార్చుకుంది. పెళ్లి చేసుకున్న మొదటి భార్యను వెంటనే వదిలేసి, రెండో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని కట్నకానుకల కోసం వేధించడం వల్ల వ్యవహారం పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ స్వీట్ సేన్ విచారించిన పోలీసులు ఇతర కేసుల గురించి ఆమెను విచారిస్తున్నారు. పెళ్లిళ్లకు డెకరేషన్ పేరిట, క్యాటరింగ్ పేరిట పలువురిని మోసం చేసినట్లు కూడా ఆమెపై కేసులు నమోదు చేశారు. స్వీటీ సేన్ తల్లి నిర్మలా సేన్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. దొంగ పెళ్లిళ్లలో ఆమెది కూడా ముఖ్యపాత్ర ఉన్నట్లు భావిస్తున్నారు. రెండు పెళ్లిళ్లు, ఎంగేజ్మెంట్కు స్వీటీ సేన్ బంధువులుగా, మిత్రులుగా హాజరైన వారి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం కేసు ఇంకా దర్యాప్తులో ఉందని పోలీసు అధికారి మంజూ జ్వాల తెలిపారు. -
తండ్రి అయ్యుండి మళ్లీ పెళ్ళి పీటలెక్కిన..
-
బెస్ట్ ఫ్రెండేగా అని ఫేక్ భర్తగా తీసుకెళితే..
పుణె: నమ్మిన స్నేహితుడు ఘరానా మోసం చేశాడు. మంచివాడనుకొని కాస్త చనువుగా ఉన్నట్లు నటించినందుకు దుర్మార్గంగా వ్యవహరించాడు. జీవితంలో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆ అమ్మాయి తన తల్లిదండ్రులు చేసే పెళ్లి ప్రయత్నాలు ఆపించేందుకు అతడిని తీసుకెళ్లి భర్తగా పరిచయం చేయగా అదే అదునుగా చూసుకున్న అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇక తనతో ఉండిపోకుంటే ఆమె తల్లిదండ్రులను చంపేస్తానంటూ బెదరించాడు. అతడు ఈ దారుణాలకు ఈ ఏడాది ఏప్రిల్, జూలై నెలల్లో పాల్పడగా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిది అహ్మద్ నగర్ గా గుర్తించిన పోలీసులు కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 22 ఏళ్ల బాధితురాలు చదువుకుంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. ఇటీవల ఆమెకు పెళ్లి చేయాలని తండ్రి ప్రయత్నాలు చేస్తుండగా ఈ విషయాన్ని తన స్నేహితులతో చర్చించింది. వారిలో బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న యువకుడు ఆమెకు ఫేక్ పెళ్లి ఐడియా ఇచ్చి ట్రాప్ చేశాడు. ఆ యువతి కూడా అతడి మాటలు నమ్మి ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు తన భర్త అని పరిచయం చేసింది. కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ చూపించడంతో వారు నిజమే అనుకున్నారు. ఆ తర్వాత వారిద్దిరి తిరిగి పుణెకు రాగా.. అప్పటి నుంచి ఆ ఫ్రెండ్ నిజమైన భర్తలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమెకు తెలియకుండా పెళ్లిని అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత వేధింపులు ప్రారంభించాడు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులకు వద్దకు వెళ్లగా వారిని చంపేస్తానని హెచ్చరించాడు. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది. -
రెండు పెళ్లిళ్లు చేసుకున్న యువతి అరెస్ట్
విశాఖపట్నం: ఆమెకు 26 ఏళ్లు. చేసేది టీచర్ ఉద్యోగం. చట్టంపై కనీస అవగాహన లేదంటే పోలీసులకే నమ్మకం కుదరలేదు. పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి చేసుకున్న ఆమెపై కేసు నమోదైంది. విశాఖపట్టణం సిరీపురంలో చోటుచేసుకున్న ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన రమాదేవి(26) ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. పెళ్లి సంబంధాల కోసం ఓ మ్యాట్రిమోనిలో తన వివరాలు పొందుపరిచింది. ఆ వివరాలు నచ్చడంతో విశాఖలోని సిరీపురానికి చెందిన ఎడ్ల శ్రీనివాస్(29) ఆమెతో పెళ్లికి సిద్ధమయ్యాడు. అలా 2012లో రమాదేవి- శ్రీనివాస్ ల వివాహం జరిగింది. పెళ్లైన మూడు రోజులకే రమాదేవి పుట్టింటికి వెళ్లింది. మళ్లీ అత్తారింటికి రాలేదు. ఏళ్లపాటు ఎదురుచూసి విసిగిపోయిన శ్రీనివాస్.. నేరుగా రమాదేవి సొంతూరు పెద్దాపురం వెళ్లి ఆరా తీయగా.. ఆమెకు గతంలోనే అంటే 2003లోనే మరో వ్యక్తితో పెళ్లైందని, అతనితోనూ పడక విడిపోయిందని తేలింది. దీంతో బాధితుడు శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించాడు. హిందూ వివాహచట్టం ప్రకారం మొదటి భర్తతో విడాకులు పొందిన తర్వాతే రెండో పెళ్లికి అనుమతి లభిస్తుంది. రెండు సందర్భాల్లోనూ రమాదేవి విడాకుల ఊసెత్తకపోవడాన్ని నేరంగా పరిగణించిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. రమాదేవితోపాటు ఆమె తండ్రిని కూడా బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు.