రష్యా సైనికుల దొంగ పెళ్లిళ్లు.. ఫోన్‌ సంభాషణ లీక్‌! | Russian Soldiers Are Attempting Sham Marriages to Escape War | Sakshi
Sakshi News home page

Russia-Ukraine War: రష్యా సైనికుల దొంగ పెళ్లిళ్లు.. ఫోన్‌ సంభాషణ లీక్‌!

Published Thu, Jun 9 2022 10:13 AM | Last Updated on Thu, Jun 9 2022 2:09 PM

Russian Soldiers Are Attempting Sham Marriages to Escape War - Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌లో నెలల తరబడి విసుగెత్తిపోయిన రష్యా సైనికులు యుద్ధం నుంచి తప్పించుకోవడానికి కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. సొంత దేశం చేరుకోవడానికి ఉత్తుత్తి పెళ్లిళ్లకు తెర తీస్తున్నారు. నకిలీ శుభలేఖలు సమర్పించి సెలవులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ తతంగమంతా ఓ ఫోన్‌ సంభాషణ ద్వారా బయటపడింది.

ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ మంగళవారం విడుదల చేసిన ఒక ఫోన్ కాల్ ప్రకారం.. ఉక్రెయిన్‌లో ఉన్న రష్యా సైనికుడికి, అతడి స్నేహితుడి మధ్య జరిగిన సంభాషణ ద్వారా ఈ తతంగం బయటపడింది. నకిలీ పెళ్లి కోసం ప్రయత్నిస్తున్నానని, చాలామంది ఇలాగే చేశారని అతను చెప్పుకున్నాడు. ఉక్రెయిన్‌ నుంచి బయటపడడానికి ఇదొక్కటే మార్గమన్నాడు.
చదవండి: రష్యా యుద్ధం.. ఉక్రెయిన్‌ దళాల వెనుకంజ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement