బెస్ట్ ఫ్రెండేగా అని ఫేక్ భర్తగా తీసుకెళితే.. | Cops book woman friend for rape | Sakshi
Sakshi News home page

బెస్ట్ ఫ్రెండేగా అని ఫేక్ భర్తగా తీసుకెళితే..

Published Mon, Aug 22 2016 9:44 AM | Last Updated on Sat, Jul 28 2018 8:44 PM

బెస్ట్ ఫ్రెండేగా అని ఫేక్ భర్తగా తీసుకెళితే.. - Sakshi

బెస్ట్ ఫ్రెండేగా అని ఫేక్ భర్తగా తీసుకెళితే..

పుణె: నమ్మిన స్నేహితుడు ఘరానా మోసం చేశాడు. మంచివాడనుకొని కాస్త చనువుగా ఉన్నట్లు నటించినందుకు దుర్మార్గంగా వ్యవహరించాడు. జీవితంలో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆ అమ్మాయి తన తల్లిదండ్రులు చేసే పెళ్లి ప్రయత్నాలు ఆపించేందుకు అతడిని తీసుకెళ్లి భర్తగా పరిచయం చేయగా అదే అదునుగా చూసుకున్న అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇక తనతో ఉండిపోకుంటే ఆమె తల్లిదండ్రులను చంపేస్తానంటూ బెదరించాడు.

అతడు ఈ దారుణాలకు ఈ ఏడాది ఏప్రిల్, జూలై నెలల్లో పాల్పడగా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిది అహ్మద్ నగర్ గా గుర్తించిన పోలీసులు కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 22 ఏళ్ల బాధితురాలు చదువుకుంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. ఇటీవల ఆమెకు పెళ్లి చేయాలని తండ్రి ప్రయత్నాలు చేస్తుండగా ఈ విషయాన్ని తన స్నేహితులతో చర్చించింది. వారిలో బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న యువకుడు ఆమెకు ఫేక్ పెళ్లి ఐడియా ఇచ్చి ట్రాప్ చేశాడు.

ఆ యువతి కూడా అతడి మాటలు నమ్మి ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు తన భర్త అని పరిచయం చేసింది. కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ చూపించడంతో వారు నిజమే అనుకున్నారు. ఆ తర్వాత వారిద్దిరి తిరిగి పుణెకు రాగా.. అప్పటి నుంచి ఆ ఫ్రెండ్ నిజమైన భర్తలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమెకు తెలియకుండా పెళ్లిని అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత వేధింపులు ప్రారంభించాడు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులకు వద్దకు వెళ్లగా వారిని చంపేస్తానని హెచ్చరించాడు. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement