ప్రచారం పిచ్చో... డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న ఆశనో తెలియదు కానీ.. ఈ మధ్యకాలంలో చాలామందికి రీల్స్ పిచ్చి పట్టుకుంది. కొన్నిసార్లు ఇది కాస్తా శ్రుతిమించి పోయి వ్యవసనంగానూ మారిపోతోంది. ఆఖరుకు ఇది దాంపత్య జీవితంలోనూ చిచ్చు పెట్టే స్థితికి చేరుకుంది. అయితే కర్ణాటకలోని ఉడుపికి సమీపంలోని కార్కడలో ఈ రీల్స్ పిచ్చి కాస్తా ఓ నిండుప్రాణం పోయేందుకు కారణమైంది. పోలీసులు చెప్పిన దాని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...
బీదర్‌లోని దోణగాపురకు చెందిన జయశ్రీ (31)కి రీల్స్ అంటే తెగ పిచ్చి. ఈమెకు కార్కడ సమీపంలోని గుండ్మిలో నివసించే కిరణ్ ఉపాధ్య (44)తో పెళ్లి అయ్యింది. కొంత కాలం సంసారం బాగానే నడిచింది కానీ.. జయశ్రీ నిత్యం రీల్స్ చేస్తూండటం కిరణ్‌కు ఏ మాత్రం నచ్చలేదు. అంతేకాదు... జయశ్రీ ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం విషయంలోనూ భార్య భర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు అవుతూండేవి. తనకు పెద్ద ఇల్లు కావాలని... లగ్జరీ కారు.. నగదు కావాలని... గుడులలో వంటలకు సాయంగా పనిచేస్తున్న భర్త కిరణ్‌ను వేధించేది. ఇది కాస్తా వారిద్దరి మధ్య వివాదం మరింత ముదిరేందుకు కారణమైంది. ఇలాగే కొన్ని రోజుల క్రితం ఇద్దరి మధ్య రీల్స్ విషయమై వాదులాట మొదలైంది.
ఈ క్రమంలోనే కిరణ్ కొడవలితో దాడి చేయడంతో జయశ్రీ మరణించింది. ఆ తరువాత బంధు మిత్రులకు ఫోన్ చేసి జయశ్రీ మొదటి అంతస్తులోంచి కిందకు పడిపోయిందని... స్పందన లేదని చెప్పాడు. వారి సలహాతో ఆంబులెన్స్‌కు ఫోన్ చేశాడు కూడా. అయితే జయశ్రీ ఆసుపత్రికి చేరే సమయానికి ప్రాణాలతో లేదని డాక్టర్లు ప్రకటించారు. అయితే... ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన తరువాత కిరణ్ ప్రవర్తన తేడాగా ఉండటాన్ని చుట్టుపక్కల వాళ్లు గమనించారు. ఇంట్లో రక్తపు మరకల్ని తొలగించే ప్రయత్నం చేశాడు. అనుమానం కొద్దీ ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు కిరణ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. కిరణ్ ముందస్తు ప్రణాళికతోనే జయశ్రీని హత్య చేశాడని, గత గురువారమే మార్కెట్‌లో కొత్త కొడవలిని కొనుగోలు చేశాడని స్థానికులు చెబుతున్నారు.
రజని హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్థగా పనిచేస్తోంది. గత కొద్దికాలంగా ఆమెకు అంతా గందరగోళంగా అనిపిస్తోంది. తాను చేస్తున్నది రైటా, తప్పా అనే సందేహం తరచూ వేధిస్తోంది. ఆమె ఆత్మవిశ్వాసం బాగా దెబ్బతింది. నిరంతరం ఒత్తిడి, ఆందోళన ఫీలవుతోంది. ఎవరితోనూ మాట్లాడాలనిపించడం లేదు. ఒంటరితనం, భయం, నిస్సహాయత. దాంతో పేషంట్లను ట్రీట్ చేయడంలో కూడా నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. చిన్న చిన్న విషయాలకు కూడా సారీ చెప్తోంది. నిద్ర పట్టడంలేదు. తలనొప్పి, కడుపు నొప్పి, ఇతర శారీరక సమస్యలు. డాక్టర్ కాబట్టి తనకు తానే వైద్యం చేసుకుంది. కానీ తగ్గడంలేదు. దాంతో ఇది శారీరకం కాదని, మానసికమని అర్థమై కౌన్సెలింగ్ కోసం వచ్చింది. తన సమస్య చెప్పింది. ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పమని అడిగాను.
అపనమ్మకం...
రజనికి పెళ్లయి ఐదేళ్లయ్యింది. తన కొలీగ్ డాక్టర్ ఆనంద్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. రజని కొంచెం కలుపుగోలు మనిషి. అది ఆనంద్ కు నచ్చదు. ‘‘నీ పని నువ్వు చూసుకోక అందరితో అలా మాట్లాడతావెందుకు?’’ అని అడిగేవాడు. తరచూ రజనిపై కోప్పడేవాడు. ‘‘అందరితో బాగా నవ్వుతూ మాట్లాడతావ్. నాతో మాట్లాడాలంటే మాత్రం మొహం ముడుచుకుంటావ్. నీకంటికి నేను చేతకాని వాడిలా కనిపిస్తున్నా’’ అని దెప్పేవాడు. ‘‘అలాంటిదేం లేదు’’ అని చెప్పినా వినేవాడు కాదు. ‘‘యు ఆర్ నాట్ రైట్. నీకేదో సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది, ఒకసారి సైకియాట్రిస్ట్ ను కలువు’’ అని తరచూ అనేవాడు. కొన్నాళ్లకు రజని కూడా తన మానసిక స్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ‘‘నిజంగానే నాకేమైనా మానసిక సమస్య ఉందేమో, లేదంటే ఆనంద్ ఎందుకలా అంటాడు’’ అని అనుకునేది.
గ్యాస్ లైటింగ్...
డాక్టర్ రజని చెప్పిందంతా విన్నాక ఆమె గ్యాస్ లైటింగ్ కు గురవుతుందని అర్థమైంది. గ్యాస్ గురించి అందరికీ తెలుసు. కానీ గ్యాస్ లైటింగ్ అంటే ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ ను వెలిగించేది కాదు. మాటలు, ప్రవర్తన ద్వారా మరోవ్యక్తి భావోద్వేగాలను కంట్రోల్ లో పెట్టుకోవడానికి కొందరు చేసే మేనిప్యులేషన్ ను ‘గ్యాస్ లైటింగ్’ అంటారు. ఇతరులపై ఆధిపత్యం చెలాయించాలనే కోరిక నుండి పుడుతుంది. తమ మాటే నెగ్గేలా, తమ దారికి అడ్డులేకుండా చేసుకోవడానికి అబద్ధాలు చెప్తారు, నిందలు వేస్తారు. తమ తప్పును కూడా భాగస్వామిపై తోసేసి తమ ప్రయోజనాలను కాపాడుకుంటారు. తనపై తనకు నమ్మకం కోల్పోయేలా చేస్తారు, చివరకు భాగస్వామి ఎమోషన్స్ పై కంట్రోల్ సాధిస్తారు. ముఖ్యంగా నార్సిసిస్టిక్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నవారిలో ఈ ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తుంది. డాక్టర్ ఆనంద్ అందులో మాస్టర్స్ డిగ్రీ సాధించాడని అర్థమైంది. కానీ తాను గ్యాస్ లైటింగ్ కు గురవుతున్న విషయాన్ని రజని గుర్తించలేకపోతోంది. అదే ఈ సమస్యలో ఉండే అసలు సమస్య. తనను మేనిప్యులేట్ చేస్తున్నారనే విషయం బాధితులకు తెలియదు, అసలా దిశగా ఆలోచించలేరు. ఎవరైనా చెప్పినా నమ్మరు.
థెరపీతో పరిష్కారం...
అందుకే మొదట రజనికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా తన ఆలోచనల్లోని లోపాలు గుర్తించేలా, వాటిని సవాల్ చేసేలా చేశాను. ఆ తర్వాత గ్యాస్ లైటింగ్ గురించి, గ్యాస్ లైటర్ వాడే స్ట్రాటజీస్ గురించి వివరించాను. ఆనంద్ అలాగే చేస్తాడని చెప్పింది. తాను గ్యాస్ లైటింగ్ కు గురవుతున్నానని అర్థం చేసుకుంది. ఆ తర్వాత తన భద్రతకు సంబంధించిన ప్రణాళికను రూపొందించాను. తన బలాలు, సానుకూల లక్షణాలను గుర్తించి ఆత్మగౌరవంతో ప్రవర్తించేందుకు ఎక్సర్ సైజ్ లు నేర్పించాను. గ్యాస్ లైటింగ్ ను ఎలా ఎదుర్కోవాలో, ఒత్తిడిని, ఆందోళనను ఎలా మేనేజ్ చేసుకోవాలో వివరించాను. స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోమని ప్రోత్సహించాను. క్రమేపీ రజని తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ఆనంద్ మాటలను పట్టించుకోవడం మానేసింది. రజని ఇంతకు ముందులా లేదన్న విషయం అర్థం చేసుకున్న ఆనంద్ కూడా తన ప్రవర్తను మార్చుకున్నాడు. మూడు నెలల్లో సమస్య పరిష్కారమైంది.
గ్యాస్ లైటర్లు తరచూ వాడే వాక్యాలు
⇒నువ్వు ప్రతిదానికీ ఓవర్ రియాక్ట్ అవుతున్నావ్.
⇒అందుకే నీకెవ్వరూ ఫ్రెండ్స్ లేరు.
⇒నీకోసమే అలా చేశాను.
⇒నీకోసం అంత చేస్తే నన్నే అనుమానిస్తావా?
⇒నేను నీకు చెప్పాను, గుర్తులేదా?
⇒అలా ఏం జరగలేదు, నువ్వే ఊహించుకుంటున్నావ్.
⇒ నీపట్ల నాకెప్పుడూ నెగెటివ్ ఒపీనియన్ లేదు. నువ్వే నన్ను నెగెటివ్ గా చూస్తున్నావ్.
వాళ్ల మాటలు నమ్మొద్దు
⇒గ్యాస్ లైటర్లతో వాదనలకు దూరంగా ఉండాలి. లేదంటే మీ మాటలే మీపై ప్రయోగిస్తారు.
⇒గ్యాస్ లైటర్లు చెప్పేదొకటి, చేసేదొకటి కాబట్టి వాళ్లు చెప్పేదానిపై కాకుండా చేసే పనులపై దృష్టి పెట్టాలి.
⇒‘‘నీకు పిచ్చి’’ అని మిమ్మల్ని మీరే అనుమానించుకునేలా చేసేవారి మాటలు పట్టించుకోకూడదు.
⇒‘‘నేను చెప్పాను, నీకే గుర్తులేదు’’ అనే మాటలు నమ్మకూడదు. మీకెంత వరకూ గుర్తుందే అదే నిజమని గుర్తించాలి.
⇒గ్యాస్ లైటర్లు ముందుగా మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను బుట్టలో వేసుకుంటారు. కాబట్టి గ్యాస్ లైటర్ కు మద్దతుగా వాళ్లు చెప్పే మాటలు పట్టించుకోకూడదు.
⇒గ్యాస్ లైటర్ తో ఉండే బంధం కన్నా మీరు సురక్షితంగా ఉండటం ముఖ్యమని గుర్తించాలి.
⇒మీ భద్రతకు ప్రమాదమని భావిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బంధం నుంచి బయటకు వచ్చేయాలి.
సైకాలజిస్ట్ విశేష్
8019 000066
www.psyvisesh.com
Comments
Please login to add a commentAdd a comment