best friend
-
బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న సింగర్ దర్శన్ (ఫోటోలు)
-
సానియా మీర్జా బెస్ట్ ఫ్రెండ్.. టీమిండియా మాజీ క్రికెటర్ భార్య.. ‘మాయచేసే’ విద్య (ఫొటోలు)
-
స్నేహం అజరామరం.. చరిత్రాత్మకం
యే దోస్తీ హమ్ నహీ తోడేంగే తోడేంగే దమ్ మగర్ తేరా సాత్ నా చోడేంగే.. అంటూ నాటి షోలే సినిమాలో ఆనంద్ బక్షి..రచించిన ఈ పాట మొదలుకొని.. ఆ మధ్య కాలంలో వచి్చన.. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం నిదరలో ఇద్దరమూ ఒకేలా కలగంటం నిజంలో ప్రతి క్షణం కళలకే కల అవుతాం.. అంటూ భువన చంద్ర రచించిన ఈ పాట వరకూ స్నేహం గొప్పతనాన్ని తెలిపేవే.. ఇలాంటి అనేక పాటలు స్నేహంలోని మాధుర్యాన్ని తెలియజేస్తాయి.. నిజమే మరి నాటి నుంచి నేటి తరం వరకూ లవర్స్ లేని వాళ్లు ఉంటారేమో గానీ.. స్నేహితులు లేని వాళ్లు దాదాపు ఉండరనే చెప్పొచ్చు.. ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత మంది ప్రాణ స్నేహితులు ఉంటారు. వీరికి కులం, మతం, ప్రాంతం, భాష, ఆస్తి, అంతస్తు, పేద ధనిక వంటి బేధాలు అడ్డురావు.. మనం ఫోన్ చెయ్యగానే..‘అరేయ్ చెప్పరా మామా’ అనేంత క్లోజ్ నెస్ వారి మధ్య ఉంటుంది. స్నేహాన్ని పంచుకుంటూ, పెంచుకుంటూ.. కష్టాలు, కన్నీళ్లు, ఆనందాలు, సరదాలూ అన్నీ వారితో పంచుకునే వాళ్లే నిజమైన ఫ్రెండ్స్. నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా.. అలాంటి కొందరు దోస్తులకు సంబంధించిన కొన్ని ప్రేరణాత్మక విషయాలు..విడదీయరాని స్నేహ బంధం..గోల్కొండ: రాజకీయాల్లో ఒకేసారి ప్రవేశించి అంచలంచలుగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగామని కార్వాన్, బహదూర్‌పురా ఎమ్మెల్యేలు కౌసర్ మోహియుద్దీన్, మహ్మద్ ముబీన్ అంటున్నారు. రోజు రోజుకు తమ స్నేహ బంధం బలపడుతుందని ‘ఫ్రెండ్షిప్ డే’ సందర్భంగా ‘సాక్షి’తో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. 40 ఏళ్ల క్రితం మజ్లీస్ కార్యకర్తలుగా కార్వాన్ నుంచి కౌసర్ మోహియుద్దీన్ తన రాజకీయ జీవితం ప్రారంభించారు. అదే సమయంలో పాత నగరం ఆగాపూరా నుంచి మహ్మద్ ముబీన్ రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ సమయంలో ఇద్దరూ చురుకైన యువ కార్యకర్తలుగా పార్టీ అధిష్టానం మెప్పుపొందారు. దివంగత మజ్లీస్ అధినేత సలావుద్దీన్ ఓవైసీతో పాటు ప్రస్తుత అధినేత అసదుద్దీన్ ఓవైసీకి నమ్మిన బంటులుగా మారారు. అయితే ముందుగా ఎమ్మెల్యే పదవి వరించింది మాత్రం కౌసర్ మోహియుద్దీన్‌కు. వరుసగా మూడోసారి కౌసర్ ఎమ్మెల్యేగా విజయం సాధించగా ముబీన్ మొదటిసారి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మెహియుద్దీన్ సతీమణి గోల్కొండ వెస్ట్, నానల్‌నగర్ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించగా ముబీన్ మాత్రం ఆగాపూరా నుంచి రెండుసార్లు, శాస్త్రీపురం నుంచి ఒకసారి కార్పొరేటర్‌గా గెలిచారు. ప్రస్తుత అసెంబ్లీలో గెలిచిన ఇద్దరూ ఒకే రోజు ఒకే సారి ఒకే సమయంలో ఆప్తమిత్రులుగా అసెంబ్లీలో అడుగు పెట్టడం విశేషం. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ తాము ప్రాధాన్యం ఇస్తామంటారు. 40 ఏళ్ల తమ స్నేహ బంధంలో ఏనాడూ పొరపచ్చాలు రాలేదని వారు స్పష్టం చేశారు. -
స్నేహితుడితో ఓ సెల్ఫీ
‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా’ ఈ ప్రపంచంలో ఎవ్వరైనా ఈ మాటల్ని వింటే పులకించి పోవాల్సిందే. అదీ స్నేహం గొప్పతనం. స్నేహానికి కులం, మతం, ప్రాంతం, భాష, లింగ భేదాలేవీ వుండవు. ఉన్నదంతా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడమే. దోస్త్ అంటే వీడేరా అనిపించేంత బంధం. మరి ‘దోస్త్ మేరా దోస్త్ తుహై మేరీ జాన్.. స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం’’ అనుకునేంత గొప్ప దోస్తులు మీ జీవితంలో ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం అలాంటి నిజమైన స్నేహితుడితో సంతోష క్షణాలను మళ్లీ గుర్తు చేసుకోండి. ఆగష్టు ఫస్ట్ సండే..(4వ తేదీ) స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ దోస్తుతో సెల్పీ దిగి సాక్షి. కామ్‌కు పంపించండి. ‘దోస్త్ మేరా దోస్త్’ సెల్పీ 9182729310 నెంబరుకు వాట్సాప్ చేయండి. ఆ ఫొటోలను సాక్షి డాట్ కామ్‌లో ప్రచురిస్తాం. ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకోవడమే కాదు.. ఈ జ్ఞాపకాన్ని కలకాలం పదిల పర్చుకోండి. ఫ్రెండ్షిప్ డే గురించి ఇవి మీకు తెలుసా?అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ ప్రతిపాదన 1958 జూలై 30న పరాగ్వేలో మొదలైంది. వరల్డ్ ఫ్రెండ్షిప్ డే ఆలోచనను తొలిసారి 1958, జూలై 20న పరాగ్వేలో స్నేహితులతో విందు సందర్భంగా డాక్టర్ ఆర్టెమియో బ్రాచో ప్రతిపాదించారు.ఐక్యరాజ్యసమితి 2011లో జూలై 30ని అధికారిక అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించింది. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని వివిధ దేశాలలో వేర్వేరు రోజులలో జరుపుకుంటారు. భారతదేశంలో ఆగస్టు నెలలోని తొలి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. -
ఇందూరుకు పుంగనూరు ఆవులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరానికి చెందిన మంచాల జ్ఞానేందర్ గుప్తా బుధవారం పుంగనూరు నుంచి రెండడుగుల ఎత్తు మాత్రమే ఉండే పుంగనూరు ఆవులను తీసుకొచ్చారు. గోమాతలకు మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. కొత్త వస్త్రాలు, పూలమాలలతో గోమాతలను అలంకరించారు. బ్రాహ్మణుడితో ప్రత్యేకంగా గోపూజ వైభవంగా చేశారు. ఇంట్లో తమతో సమానంగా కలియతిరిగే విధంగా ఉండేందుకు తీసుకొచ్చిన ఈ ఆవులకు లక్ష్మి, నారాయణులుగా పేర్లు పెట్టుకున్నట్లు జ్ఞానేందర్, శ్రీలక్ష్మి దంపతులు తెలిపారు. ఆవులను ఎందుకు ఆదరించాలి? గోవులు.. మనుషులకు ఎంతో మచ్చికైన జంతువులు. భారతీయ సంస్కృతిలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. పూర్వ అఖండ భారతదేశంలో 302 జాతుల ఆవులు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 32కు పరిమితమైంది. పొట్టి జాతి ఆవుల విషయానికి వస్తే మల్నాడ్ గిడ్డ (కర్ణాటక), వేచూరు (కేరళ), మన్యం (ఆంధ్రప్రదేశ్), బోనీ (బెంగాల్), మినీ మౌస్ (నేపాల్) జాతులు ఉన్నాయి. మన్యం–ఒంగోలు బ్రీడ్స్ నుంచి అభివృద్ధి చేసినవే పుంగనూరు ఆవులు. ఇవి 3నుంచి 5 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. పుంగనూరు స్పెషాలిటీ ఏంటీ? పుంగనూరు జాతిలోనే అత్యంత బుల్లి ఆవు ఇది. 12 అంగుళాల (అడుగు) ఎత్తు.. 36 అంగుళాల (3 అడుగుల) పొడవుండే ఈ ఆవులను ‘మైక్రో మినీయేచర్ పుంగనూరు’గా పిలుస్తున్నారు. మనుషులకు ఇట్టే మచ్చికయ్యే ఈ ఆవులు ఇళ్లు, అపార్ట్మెంట్లు అనే తేడా లేకుండా.. ఏ వాతావరణంలో అయినా.. ఎక్కడైనా పెరుగుతాయి. వీటి నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. నట్టింట్లో గంతులేస్తూ.. చిన్నపిల్లల మాదిరిగా మారాం చేస్తూ.. యజమానుల చుట్టూనే ఇవి తిరుగుతున్నాయి. గతంలో పెరటికి మాత్రమే పరిమితమైన ఈ బుజ్జి గోవులు ఇప్పుడు బెడ్ రూముల్లోనూ సందడి చేస్తున్నాయి. ఇంటిల్లిపాదికీ ఆనందాన్ని పంచుతున్నాయి. ఈ ఆవులు ఎంతో ఫ్రెండ్లీ పశుగ్రాసంతోపాటు ఎలాంటి ఆహారన్నయినా జీర్ణించుకోగలుగుతాయి. పెద్దలకే కాకుండా పిల్లలకు సైతం కూడా ఇట్టే మచ్చికవుతాయి. ఇప్పటివరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 60 మందికి వీటిని అందించారు. మైక్రో మినీయేచర్ సహా వివిధ జాతులతో అభివృద్ధి చేసిన 500 వరకు పొట్టి జాతుల ఆవులు నాడీపతి గోశాలలో సందడి చేస్తున్నాయి. నిత్యం గో ప్రేమికులు ఈ గోశాలను సందర్శిస్తూ చెంగుచెంగున గంతులేసే పొట్టి గోవుల మధ్య పుట్టిన రోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటూ మురిసిపోతున్నారు. -
సింగర్ సునీత.. బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోయిందిగా!
సింగర్ సునీత టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మధురమైన స్వరంతో సినీ ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్లో స్టార్ సింగర్‌గా పేరు సంపాదించుకున్నారు. పలు చిత్రాలకు పాటలు పాడిన సునీత తెలుగు వారి గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. సునీత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: హీరోగా సింగర్ సునీత కొడుకు.. ఫస్ట్ లుక్ రిలీజ్) ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పేసింది. స్టార్ యాంకర్ సుమతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తన బెస్ట్ ఫ్రెండ్ యాంకర్ సుమ అంటూ ఆమెతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. సింగర్ సునీత కూమారుడు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. 'సర్కారు నౌకరి' పేరుతో తీస్తున్న ఈ సినిమాతో ఆకాశ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. భావన అనే అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. (ఇది చదవండి: లైవ్‌లో సిగరెట్ తాగిన స్టార్ హీరో.. మండిపడుతున్న నెటిజన్స్!) -
నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతా వందనాలు
నీ గుండె నా లేత పాదాలకు పరిచిన తొలి మెత్తటి రహదారి... నీ చిటికెన వేలు నా చిట్టి గుండెకు దొరికిన తొలి దిలాసా... నీ వీపు నేనధిరోహించిన తొలి ఐరావతం... నా మూడు చక్రాల బండితో పరుగెత్తి నిను ఓడించినదే నేను గెలిచిన తొలి రేస్... నీ కావలింత నా కన్నీళ్లకు స్టాప్బటన్... నువ్వే నా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. నాన్నా... నా గురించి తప్ప నీ గురించిన చింత నీకు లేదు. ఏడ్పించే లోకాన్ని గుమ్మం బయటే వదిలి గడపలో విజేతగా నా కోసం అడుగుపెడతావు. నువ్వే కదా నా ఫస్ట్ సూపర్‌స్టార్. నాన్నా... గుర్తుకొస్తున్నావు. నాన్నా... నిను చూడాలని ఉంది. నాన్నా... నీ పాదాలు తాకి నీతో కాసేపు కబుర్లు చెప్పాలని ఉంది. నాన్నా... నీ గొప్పతనం గురించి గొంతు పెగుల్చుకుని నాలుగు ముక్కలు మాట్లాడాలని ఉంది. నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతావందనాలు. నాన్నా... నేను పుట్టినప్పుడు నువ్వు పడ్డ ఆరాటం గురించి అమ్మ చాలాసార్లు చెప్పింది. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌ను తోడు పిలుచుకున్నావట. సులభంగా కాన్పు జరుగుతుందన్నా సిజేరియన్ అవసరం అవుతుందేమోని తెగ అప్పు చేసి డబ్బు పెట్టుకున్నావట. తొలికాన్పు మా బాధ్యత నాయనా అని తాతయ్య చెప్పినా, కాదు... నాకు పాప పుట్టినా బాబు పుట్టినా నా రెక్కల కష్టంతోటే భూమ్మీదకు రావాలని పుట్టింటికి పంపకుండా వాళ్లనే అమ్మ దగ్గరకు రప్పించావట. నాన్నా... ఆ కంగారులో నువ్వేం చేశావో తెలుసా. మార్చి నెల ఎండల్లో నేను పుడితే ఆ వెంటనే బజారుకు వెళ్లి ఉన్ని టవలు, ఉన్ని స్వెటరు తీసుకొచ్చావ్. అందరూ భలే నవ్వారటలే. అవి ఇంకా నా దగ్గర ఉన్నాయి. నీ లీలలు ఇంకా విన్నాను. నాకు టీకాలు వేస్తే నువ్వు ఏడ్చేవాడివట. జ్వరం వస్తే అమ్మను అస్సలు నమ్మకుండా సిరప్‌ను నువ్వే కొలత పెట్టి తాపించేవాడివట. ‘నువ్వు పడుకో’ అని అమ్మకు చెప్పి రాత్రంతా మేలుకునేవాడివట. ‘దొంగముఖమా... అన్నీ ఆయన చేత చేయించుకుని మాటలు వచ్చిన వెంటనే మొదటిమాటగా నాన్నా అనే పిలిచావు’ అని అమ్మ ఇప్పటికీ భలే ఉడుక్కుంటుందిలే. అమెరికాలో ఉన్నా కదా. నువ్వు ఊళ్లో ఉన్నావు. అందుకే నువ్వు ఉన్నట్టుగానే ‘నాన్నా’ అని చిన్నప్పుడు పిలిచినట్టు పిలుస్తుంటాను. నీ మనవడు పరిగెత్తుకొని వస్తాడు.. అచ్చు నీ పోలికలతో. నాన్నా... నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు నిజంగా తెలుసా. ఈ కూతురు ఎప్పుడూ నాన్న కూతురే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా. నాన్నా... ఐదో క్లాసులో మొదటిసారి నువ్వు నా మీద కోప్పడ్డావు. యూనిట్ టెస్ట్‌లో మార్కులు సరిగా రాలేదని ‘ఏంట్రా ఈ మార్కులు’ అన్నావ్. నాలుగు దెబ్బలు వేసినా బాగుండేది. కాని నేను గెలిచి డబ్బాలో దాచిన గోలీలన్నీ విసురుగా లాక్కుని బయటకెళ్లిపోయావ్. ఏడ్చి ఏడ్చి నిద్రపోయాను. తెల్లారి అమ్మను అడిగితే ‘ఆ గోలీలన్నీ మీ నాన్న పారేసి వచ్చాడు’ అని చెప్పింది. మళ్లీ ఏడ్చాను. వాటిలో గోధుమ రంగు గోలీలంటే నాకు ఇష్టం. నీతో నేను మాట్లాడలేదు. అలిగాను. నువు పలకరించినా ముఖం తిప్పుకున్నాను. నన్ను తిడతావా అని నీ మీద కోపంతో చదివాను. రోజూ ఎక్కువ ఎక్కువ చదువుతుంటే నువ్వు చాల్లే పడుకో అన్నా వినలేదు. వారం తర్వాత నువ్వు ఒకరోజు ఆఫీసు నుంచి తొందరగా వచ్చావ్. నన్ను సైకిల్ మీద కూచోబెట్టుకుని స్వీట్స్టాల్కు తీసుకెళ్లి గులాబ్ జామూన్ తినిపించావ్. ‘చాలా బాగా చదువుతున్నావ్’ అని ముద్దు పెట్టి పెన్ను కొనిచ్చావ్. ‘ఆడుకో. వద్దనను. కాని చదువును మర్చిపోయి కాదు’ అని ఇంటికి తీసుకు వచ్చావ్. ఆ తర్వాత నువ్వు చేసిన పని ఇవాళ్టికీ తలుచుకుంటా తెలుసా. అటక దగ్గర కుర్చీ వేసుకుని పైన దాచిన నా గోలీల డబ్బా తీసి ఇచ్చావ్. ఆటలో గోలీలతో పాటు చదువులో మార్కులు గెలవడం నేను నేర్చానంటే నీ వల్లే నాన్నా. ఇవాళ ఇంత పెద్ద ఉద్యోగం నీ వల్లే. నా అకౌంట్లో లక్షలు ఉన్నాయి. కాని నీ డబ్బులతో ఇవాళ మళ్లీ గులాబ్ జామూన్ తినాలని ఉంది. బయట కారులో వెయిట్ చేస్తున్నా. షర్ట్ వేసుకుని రా. హ్యాపీ ఫాదర్స్ డే. డాడీ... నేను ఇంటర్లో ఉన్నప్పుడు కాలేజీ నుంచి ఇంటికొస్తుంటే ఎవడో కుర్రాడు ఏదో కాయితం చేతిలో పెట్టి పారిపోయాడు. అదేమిటో కూడా చూడకుండా, వణికిపోయి, ఏడ్చుకుంటూ ఇంటికొస్తే అప్పుడే నువ్వు బయటి నుంచి వచ్చి ముఖం కడుక్కుంటున్నావు. ‘ఏంటమ్మా... ఏంటమ్మా’ అని దగ్గరకు తీసుకున్నావు. అమ్మ కంగారు పడుతుంటే అరిచి కూల్‌గా విషయం తెలుసుకున్నావు. నా చేతిలోని లెటర్ చూసి ‘ఇదా... లవ్ లెటర్’ అన్నావు. ‘కాలేజీల్లో ఇలాంటివి జరుగుతుంటాయమ్మా. పట్టించుకోకూడదు’ అని ఎంత కూల్‌గా అన్నావో తెలుసా. ఆ తర్వాత ఆ అబ్బాయిని కలిసి ఫ్రెండ్లీగా మాట్లాడావని, ఆ అబ్బాయి సారీ చెప్పాడని నువ్వు చెప్పినప్పుడు పెద్ద రిలీఫ్. అమ్మ నాకు అన్నింటిలో గైడ్ చేస్తున్నా నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పేవాడివి. ఫిజికల్‌గా, మెంటల్‌గా వచ్చే మార్పుల గురించి, ఆపోజిట్ సెక్స్‌ను చూసినప్పుడు వచ్చే అట్రాక్షన్ గురించి, ఎమోషన్స్ గురించి ఎంతో వివరించేవాడివి. మెచ్యూర్డ్ వయసు, చదువు వచ్చే వరకు వీటిని ఫేస్ చేస్తూ తప్పులు, పొరపాట్లు చేయకుండా ఉండాలని చెప్పావ్. మగవారితో ఏమైనా సమస్యలు వస్తే ముందే నీకు చెప్పేంత స్నేహం, చనువు నాకు ఇచ్చావు. నా పెళ్లి నా చాయిస్‌కే వదిలి కేవలం సలహాలు ఇచ్చావు తప్ప బలవంతం చేయలేదు. నువ్వు నా చేతిలో ఎప్పుడూ కంపాస్బాక్స్లా ఉన్నావు డాడీ. ఐ హానెస్టీ›్ల లవ్ యూ. హ్యాపీ ఫాదర్స్ డే. అబ్బా... నా జీవితంలో చాలా రోజుల పాటు నాదే మార్గమో తెలుసుకోలేదు. కానీ మీకు మాత్రం తెలుసు– మీది మీ కొడుకును సపోర్ట్ చేసే మార్గం అని. ఇంటర్ ఫెయిల్ అయ్యాను. పర్లేదు నేనున్నాగా అన్నారు. బిఎస్సీ చేరి ఒక సంవత్సరం చదివి బి.కామ్‌కు మారేను. పర్లేదు సరే అన్నారు. ఎం.బి.ఏ చేస్తానంటే ఫీజు కట్టారు. కాదు సి.ఏ చేస్తానన్నాను. ఆ ఫీజు వదిలి మళ్లీ దీని ఫీజు కట్టారు. ఒక్కరోజు తిట్టలేదు. కొట్టలేదు. హర్ట్ చేయలేదు. నేను కూడా మీరున్నారన్న ధైర్యంతోనే ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశాను. ‘నేనున్నాగా’ అనే మీ మాట. ఒక తండ్రి నుంచి పిల్లల మంచి కోసం వచ్చే ఆ మాట పిల్లలకు ఎంత బలం ఇస్తుందో. నేను డిగ్రీ పాసైనప్పుడు నాకు ఇష్టమైన హీరో సినిమా ఊళ్లో ఉందని అమ్మీతో పాటుగా మీరు మొదటిసారి నాతో సినిమాకు వచ్చారు. ‘ఎవర్రా ఆ హీరో’ అని హీరోను మెచ్చుకున్నారు. మొన్న ఆ హీరో నా ఆఫీస్‌కు వచ్చాడు అబ్బా... నాకు ఆడిటర్‌గా ఉంటారా అని. నువ్వే గుర్తుకొచ్చావు. లెక్కా, జమా చూడటంలో నన్ను మించినవాడు లేడు అబ్బా. కానీ నీ ప్రేమ లెక్కా జమాను మాత్రం చూడలేకపోతున్నాను. ఐ లవ్ యూ అబ్బా. నాన్నా... ‘ఒరేయ్.. ఒక చిన్న గదిలో ఉండి మీ నలుగురిని సాకానురా’ అని నువ్వు అనేవాడివి. నాకేం పట్టేది కాదు. నా లోకం నాది. నా చదువు నాది. నువ్వు పాకెట్ మనీ ఇస్తే దానిని దాచుకుని, నా దగ్గర ఉన్నా, నువ్వు ఒక్కోసారి చిల్లర కోసం అవస్థ పడుతుంటే నీకివ్వకుండా చోద్యం చూస్తుండేవాడిని. అంత స్వార్థం నాది. పెళ్లి చేసుకుని మళ్లీ ఇంటి వైపు చూళ్లేదు. అమ్మను, నిన్ను నా దగ్గర నాలుగు రోజులు ఉంచుకోలేదు. నేనే చుట్టపు చూపుగా వచ్చి వెళ్లేవాణ్ణి. నాతో కలిపి నీ నలుగురు పిల్లలు మా వల్ల కాదంటే మా వల్ల కాదంటూ మిమ్మల్ని ఇవాళ ఓల్డ్ ఏజ్ హోమ్‌కు పంపారు. ప్రేమ పంచడం మీ బాధ్యత. పొందడం మా హక్కు అన్నట్టు ఉండేవాణ్ణి. కాని ఇంటర్‌కు వచ్చిన నా కొడుక్కి అచ్చు నా పోలిక వచ్చింది నాన్నా. నాకు భయంగా ఉంది. నా కొడుకు నన్ను ఉత్త ఏటిఎం మిషన్లా చూస్తున్నాడు. మీరు మా ఇంటికి వచ్చి, నాతో ఉండిపోయి, నన్ను నిజమైన నాన్నను చేయండి. నేను నిజమైన కొడుకులా మారనివ్వండి. ఈ ఫాదర్స్ డే రోజున ఈ వేడుకోలు ఇదే నాన్నా. -
నీకోసం 50వ అంతస్తు నుంచి దూకేస్తా: నటి
బుల్లితెరపై నటి మౌనీరాయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోయిన్ రేంజ్లో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆమె నటించిన నాగిని సీరియల్ ఎంతో పాపులర్ అయ్యింది. ఇటీవలో వ్యాపారవేత్త, ప్రియుడు సూరజ్ నంబియార్‌ను పెళ్లి చేసుకున్న మౌనీరాయ్ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. తన బెస్ట్‌ఫ్రెండ్ రూపాలి బర్త్‌డే సందర్భంగా కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేస్తూ తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. 'నువ్వు నన్ను 50వ అంతస్తు నుంచి దూకమని అడిగినా దూకేస్తాను. నువ్వు నాతో గొడవ పడినప్పుడు కొన్ని నెలల వరకు నీతో మాట్లాడకూడదనుకుంటాను. కానీ ఒక్క గంట కూడా అలా ఉండలేను. నువ్వు ఇప్పటికీ, ఎప్పటికీ నా బెస్ట్ఫ్రెండ్వి. హ్యాపీ బర్త్‌డే రూప్సీ. మనం ఇలాగే ఎన్నో న్యూ ఇయర్, వాలెంటైన్స్ డే, హోలీ సహా ఎన్నో హాలీడేస్‌ను కలసి సెలబ్రేట్ చేసుకుందాం. నువ్వు నా దానివి. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తుంటాను' అంటూ మౌనీ రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు వావ్, సో క్యూట్ మీరు ఎప్పటికీ ఇలానే కలిసుండండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
పెళ్లి కుమార్తెను చూసి పడి పడి నవ్విన వరుడు
వివాహం జరగబోయే ఇల్లు ఎంత సండిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బంధువుల హడావుడి, బావ మరదళ్ల సరసాలు.. మనవలు, మనవరాళ్ల అల్లరితో సరదగా సాగిపోతుంటుంది. ఇక పెళ్లింట్లో ప్రాంక్ చేస్తే ఆ మాజానే వేరు. జీవితాంతం ఆ సరదా సన్నివేశం అలా గుర్తుండిపోతుంది. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజనులు కడుపుబ్బ నవ్వించారు.. బెస్ట్‌ఫ్రెండ్‌కి.. బెస్ట్ గిఫ్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. రఫి పినెడా రోజాస్ అనే యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో పెళ్లి కుమారుడు గోడవైపు తిరిగి వధువు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటాడు. ఇంతలో పెళ్లి దుస్తులు ధరించి.. అందంగా ముస్తాబైన వధువు అక్కడకు వస్తుంది. వెనక్కి తిరిగిన పెళ్లి కుమారుడు... వధువు మేలి ముసుగు తొలగించి.. ఆమె ముఖం చూసి ఒక్కసారిగా షాకవుతాడు. ఆ వెంటనే తేరుకుని పడి పడి నవ్వుతాడు. అతడు అంతలా నవ్వడానికి కారణం ఏంటంటే పెళ్లి కుమార్తె గెటప్‌లో వచ్చింది అమ్మాయి కాదు.. అబ్బాయి. వరుడి బెస్ట్ ఫ్రెండ్ అతడిని ఆటపట్టించడం కోసం ఇలా పెళ్లి కుమార్తెలా తయారయి వచ్చి.. విజయవంతంగా ప్రాంక్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. చదవండి: గడ్డకట్టే చలిలో.. బికినీ ధరించి బాల్కనీలో View this post on Instagram A post shared by Raphi Pineda Rojas🤍 (@raphirojas) -
‘సుశాంత్‌కు క్యాంప్‌లు అవసరం లేదు’
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిభ, బంధుప్రీతి వంటి అంశాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. ఇండస్ట్రీ సుశాంత్‌ను పట్టించుకోలేదని.. అతడిని నిర్లక్ష్యం చేసిందని.. ఆ బాధ తట్టుకోలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ ఆప్త మిత్రురాలు రోహిణి అయ్యర్ చేసిన సోషల్ మీడయా పోస్టింగ్ తెగ వైరలవుతోంది. సుశాంత్ మరణాన్ని కొందరు తమ ఎజెండాగా మార్చుకుని.. ఫేమస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. సుశాంత్ మరణాన్ని ఇలాంటి పోస్టింగులతో తక్కువ చేయవద్దని కోరారు. తన స్నేహితుడు డబ్బు, కీర్తి గురించి పట్టించుకోలేదని.. స్టార్స్‌తో గడపాలని కోరుకోలేదన్నారు. తనకు ఎలాంటి క్యాంప్‌లు అవసరం లేదని.. తన సొంత రాజ్యం తనకు ఉందని ఆమె తెలిపారు. ‘మీ అభిప్రాయాలతో, మీ గుర్తింపుతో అతడికి పని లేదు. తనతో కాంటాక్ట్‌లో లేకున్నా అతడి గురించి పోస్టింగులు చేసినా ఎప్పడు పట్టించుకోలేదు. నకిలీ స్నేహితులు, ఫోన్ కాల్స్‌ను అతడు అసహ్యించుకునేవాడు. మీ పార్టీలను అతడు తిరస్కరించేవాడు. అతనెప్పుడు బయటివాడే.. మీలో ఒకడు కావాలని అతను ఎప్పుడు ఆశించలేదు. 100 కోట్ల క్లబ్బు గురించి అతడు పట్టించుకోలేదు. ఎలాంటి కేటగిరిల గురించి అతడికి పట్టింపు లేదు. అవార్డ్ ఫంక్షన్లంటే అతడికి విసుగు. తనను ఉత్తమ నటుడిగా ప్రకటించే లోపే బోర్ కొట్టి ఓ ఫంక్షన్ నుంచి బయటకు వెళ్లాడు. సినిమాలు కాకుండా అతడికి చాలా ఆసక్తులు ఉన్నాయి. ఆస్ట్రానమీ, సైన్స్ అంటే తనకు చాలా ఇష్టం. తను చారిటీల్లో, సైన్స్ ప్రాజెక్ట్స్‌లో, కొత్త ఆవిష్కరణల్లో పెట్టుబడి పెట్టాడు. దయచేసి అతడిని అర్థం చేసుకోవాడనికి ప్రయత్నించకండి. మీ ఎంజెడా కోసం అతడి ప్రతిభను తగ్గించకండి’ అని కోరారు. (సుశాంత్ మామూ బతికే ఉన్నాడు!) అంతేకాక ‘కోట్ల విలువైన చెక్కులను అతను తిరిగి ఇవ్వడం నేను చూశాను. అతని వరకు పనిలో నాణ్యత చాలా ముఖ్యం. ఫోన్ ఆఫ్ చేసి చేపలు పట్టడానికి, వ్యవసాయం చేయడానికి కూడా వెళ్లేవాడు. అన్ని నియమాలను అతిక్రమించగల తెగువ అతని సొంతం. తనో వజ్రం, ప్లాస్టిక్‌ను మాత్రమే ఉపయోగించే పరిశ్రమ ఆ వజ్రాన్ని గుర్తించలేదు. మీరు కూడా అతడిని గుర్తించలేదు.. ఎందుకంటే మీరూ ప్లాస్టిక్‌నే వాడతారు. కనుక నేను కోరిది ఒక్కటే. ప్రతి ఒక్కరు వాస్తవంగా అతడు ఏంటో గుర్తించుకోవాలని కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే మీ అభిప్రాయాలను అతడు అస్సలు పట్టించుకోడు. నా వరకు అతడి వారసత్వాన్ని కాపాడటం చాలా ముఖ్యం. మరోసారి రికార్డులను సరి చూసుకోండి’ అని రాసుకొచ్చారు రోహిణి అయ్యర్.(సుశాంత్ చావును అవమానిస్తున్నారు: హీరో) -
కుక్కలే ఎందుకు మనిషికి బెస్ట్‌ఫ్రెండ్?
కుక్కలు, నక్కలు ఒకేజాతి జంతువులు. కుక్కేమో మనిషికి బెస్ట్‌ఫ్రెండ్. నక్క మాత్రం కాదు. ఎందుకిలా? మానవులతో స్నేహం చేయాలన్న లక్షణం కుక్కల జన్యువుల్లోనే ఉండటం దీనికి కారణమంటున్నారు ఒరెగాన్ స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. మనుషుల్లో కొందరికి విలియమ్స్ బారెన్ సిండ్రోమ్ అనే ఓ సమస్య ఉంటుందట. ఈ సమస్య ఉన్న వారు పరిచయమైతే చాలు విపరీతమైన స్నేహభావాన్ని చూపుతుంటారు. వీరిలో ఎదుగుదల చాలా ఆలస్యంగా జరుగుతుంటుంది. ఇలాంటి వారిలో, కుక్కల్లో జన్యుపరమైన సారూప్యత ఉన్నట్లు శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. కొన్ని కుక్కలు, నక్కలతో కొన్ని ప్రయోగాలు నిర్వహించారు. మనుషుల సమక్షంలో ఒక డబ్బా మూత తీయమని పురమాయిస్తే.. కుక్కలు మనుషుల అనుమతి కోసం ఎదురుచూస్తే.. నక్కలు మాత్రం నేరుగా పనిలో పడిపోయాయి. అలాగే పేరుపెట్టి పిలిచినప్పుడు రెండు జంతువులూ మనుషుల వద్దకు ఎగబడి వచ్చినా.. కుక్కలు మనిషిని ఆకర్షించేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తే.. నక్కలు సెకన్ల వ్యవధిలో వెనుదిరిగి వెళ్లిపోయాయి. జన్యుపరీక్షల్లో విలియమ్స్ బారెన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తుల్లో మాదిరిగానే కుక్కల్లో కూడా జన్యుపరమైన మార్పులు కనిపించాయి. వీటిని బట్టి మనుషులతో కుక్కలకు ఉన్న దోస్తీకి జన్యుపరమైన మార్పులే కారణమన్న అంచనాకు వచ్చారు శాస్త్రవేత్తలు. -
భార్య, బాల్యమిత్రుడి చేతిలో ఎన్ఆర్ఐ హతం
షహజాన్‌పూర్: సెలవులను హాయిగా గడుపుదామని భారత్‌కు వచ్చిన ఓ ఎన్ఆర్ఐ దారుణంగా హత్యకు గురైన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. సెప్టెంబర్ 1న జరిగిన ఈ హత్యపై విచారణ చేపట్టిన పోలీసులు ఎన్ఆర్ఐ మృతికి అతడి భార్య, బాల్య మిత్రుడు కారణమని తేల్చారు. పోలీసులు వెల్లడించిన వివరాలు.. బ్రిటన్‌లో స్థిరపడిన సుఖ్జిత్ సింగ్(34)కు రమణ్‌దీప్ కౌర్(31)తో 2005లో వివాహం జరిగింది. గత సంవత్సరం ఫ్యామిలీ హాలిడేకు భారత్‌కు వచ్చిన సమయంలో సుఖ్జీత్ సింగ్ బాల్య మిత్రుడు గురుప్రీత్ సింగ్‌తో రమణ్‌దీప్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన రమణ్‌దీప్.. గురుప్రీత్‌తో కలిసి హత్యకు పాల్పడింది. సెప్టెంబర్ 1న నిద్రమాత్రలు కలిపిన అహారాన్ని భర్తకు ఇచ్చిన ఆమె.. గురుప్రీత్‌ను ఆహ్వానించింది. నిద్రలో ఉన్న సుఖ్జిత్ సింగ్ తలపై గురుప్రీత్ సుత్తితో మోదాడు. రమణ్‌దీప్ దిండుతో ఊపిరాడకుండా చేసి భర్తను అంతం చేసింది. అయినా.. మరణించాడో లేదో అన్న అనుమానంతో పదునైన కత్తితో సుఖ్జిత్ సింగ్ గొంతు కోశారు. హత్య అనంతరం దుబాయ్‌కు పారిపోయే ప్రయత్నంలో ఉన్న గురుప్రీత్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రమణ్‌దీప్ పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించింది. సుఖ్జీత్ సింగ్, గురుప్రీత్ స్కూల్ ఫ్రెండ్స్ అని పోలీసులు వెల్లడించారు. -
బెస్ట్ ఫ్రెండేగా అని ఫేక్ భర్తగా తీసుకెళితే..
పుణె: నమ్మిన స్నేహితుడు ఘరానా మోసం చేశాడు. మంచివాడనుకొని కాస్త చనువుగా ఉన్నట్లు నటించినందుకు దుర్మార్గంగా వ్యవహరించాడు. జీవితంలో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆ అమ్మాయి తన తల్లిదండ్రులు చేసే పెళ్లి ప్రయత్నాలు ఆపించేందుకు అతడిని తీసుకెళ్లి భర్తగా పరిచయం చేయగా అదే అదునుగా చూసుకున్న అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇక తనతో ఉండిపోకుంటే ఆమె తల్లిదండ్రులను చంపేస్తానంటూ బెదరించాడు. అతడు ఈ దారుణాలకు ఈ ఏడాది ఏప్రిల్, జూలై నెలల్లో పాల్పడగా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిది అహ్మద్ నగర్ గా గుర్తించిన పోలీసులు కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 22 ఏళ్ల బాధితురాలు చదువుకుంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. ఇటీవల ఆమెకు పెళ్లి చేయాలని తండ్రి ప్రయత్నాలు చేస్తుండగా ఈ విషయాన్ని తన స్నేహితులతో చర్చించింది. వారిలో బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న యువకుడు ఆమెకు ఫేక్ పెళ్లి ఐడియా ఇచ్చి ట్రాప్ చేశాడు. ఆ యువతి కూడా అతడి మాటలు నమ్మి ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు తన భర్త అని పరిచయం చేసింది. కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ చూపించడంతో వారు నిజమే అనుకున్నారు. ఆ తర్వాత వారిద్దిరి తిరిగి పుణెకు రాగా.. అప్పటి నుంచి ఆ ఫ్రెండ్ నిజమైన భర్తలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమెకు తెలియకుండా పెళ్లిని అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత వేధింపులు ప్రారంభించాడు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులకు వద్దకు వెళ్లగా వారిని చంపేస్తానని హెచ్చరించాడు. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది. -
ఆమె నా బెస్ట్ ఫ్రెండ్
టెన్సిస్ స్టార్స్ సానియా మీర్జా, ఆమె డబుల్స్ పార్ట్నర్ మార్టినా హింగిస్ యూఎస్ ఓపెన్ లో దూసుకు పోతుంటే.. వాళ్ల ఆటను చూసేందుకు శ్రియా ఏకంగా న్యూయార్క్ వెళ్లిందట. స్టేడియం కి వెళ్లి మ్యాచ్ ను దగ్గరగా చూశానని.. సానియా గెలిచినందుకు ఆందంగా ఉందని చెబుతోందీ అమ్మడు. సానియా, శ్రియా తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాదు సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో సానియాతో ఆఫ్టర్ మ్యాచ్ ఫోటో ఒకటి పోస్ట్ చేసింది. -
ఇలా ఎగబడడం దారుణం!
ఇది సెల్ఫీల ట్రెండ్. బెస్ట్ ఫ్రెండ్‌తో సెల్ఫీ... ముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్లతో సెల్ఫీ... పిచ్చి పిచ్చి హావభావాలిస్తూ సెల్ఫీ... ఇలా కాదేదీ సెల్ఫీకి అనర్హం అన్నట్లుగా ఉంది. అంతమటుకు ఫర్వాలేదు కానీ.. అంతకుమించి చేస్తేనే పిచ్చి ముదిరింది అనాలనిపిస్తుంటుంది. అమితాబ్ బచ్చన్ ఆ మాటే అంటున్నారు. ఇటీవల ఫ్రెండ్ చనిపోతే, అంతిమక్రియల్లో పాలుపంచుకోవడానికి అమితాబ్ ఢిల్లీ వెళ్లారు. ఇది హఠాన్మరణం అని, అస్సలు ఊహించలేదని ఈ సందర్భంగా బిగ్ బి పేర్కొన్నారు. ఫ్రెండ్ పోయిన బాధలో ఉన్న ఆయన్ను మరో విషయం విపరీతంగా బాధపెట్టింది. అంతిమక్రియల్లో పాలుపంచుకోవడానికి వెళ్లిన అమితాబ్‌తో సెల్ఫీలు దిగడానికి చాలామంది ఎగబడ్డారట. ‘‘మరణించినవారికీ మర్యాద ఇవ్వడం లేదు.. వాళ్ల చివరి క్రియలను దగ్గరుండి చేయడానికి హాజరయ్యే బతికున్నవాళ్లకీ మర్యాద లేదు. సమయం, సందర్భం కూడా పట్టించుకోకుండా సెల్ఫీల కోసం ఎగబడటం దారుణం’’ అని అమితాబ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
కనీసం మీరైనా అర్థం చేసుకోరూ..!
అమ్మానాన్నలతో కలిసి మా పెదనాన్న కూతురి పెళ్లికి వెళ్లానో రోజు. పెళ్లికొడుకుతో పాటు ఒక అబ్బాయి వచ్చాడు. అతను పెళ్లికొడుక్కి బెస్ట్ ఫ్రెండ్ అట. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం. బాగా సంపాదిస్తున్నాడు. మనిషి కూడా బావున్నాడు. ఆ రోజు అతను స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. కానీ అతను మాత్రం నాకు అట్రాక్ట్ అయ్యాడు. నేనెక్కడుంటే అక్కడికి వచ్చేవాడు. ఇబ్బందిగా అనిపించేది. పెళ్లికొడుకు తరఫువాడు కాబట్టి ఏమీ అనలేను. దాంతో అతడు మరింత చనువు తీసుకున్నాడు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా దగ్గరికొచ్చి నన్ను ఇష్టపడుతున్నానని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. ముక్కూ ముఖం తెలియనివాడితో పెళ్లేంటి! అందుకే ‘నో’ చెప్పి వెళ్లిపోయాను. అక్కడితో వదిలేస్తాడనుకున్నాను. కానీ విషయాన్ని మా అమ్మానాన్నల వరకూ తీసుకెళ్లాడు. అమ్మా నాన్నా ఎగిరి గంతేశారు. ఓకే అనేశారు. కనీసం నా ఇష్టం తెలుసుకోకుండా, ముహూర్తాలు కూడా పెట్టించేశారు. నన్ను ఆయన చేతిలో పెట్టేశారు. మొదటిరాత్రి ఆయన తనకున్న సరదా అఫైర్ల గురించి చెప్పారు. నన్నూ చెప్పమని బలవంతపెట్టారు. దాంతో నేను మా క్లాస్మేట్ని ఇష్టపడిన విషయం, అతడికి నా మనసులో మాట చెప్పేలోపే నాకు పెళ్లి కుదిరిపోయిన విషయం చెప్పాను. అతనేదో సరదాగాతీసుకుంటాడనుకున్నాను. అయితే అంతెత్తున లేచారు. మోసం చేశావన్నారు. నిందలు వేశారు. నిప్పులు కక్కారు. నన్ను దోషిని చేసి పదిమందిలో నిలబెట్టారు. అమ్మానాన్నలు కూడా నన్ను సపోర్ట్ చేయలేదు సరికదా, నీ ప్రేమకథలన్నీ ఎవడు చెప్పమన్నాడు అంటూ విరుచుకుపడ్డారు. నేనతన్ని ఇష్టపడ్డానే కానీ, కనీసం అతనికి చెప్పనైనా చెప్పలేదు అని ఎంత మొత్తుకున్నా ఎవరికీ బుర్రకెక్కలేదు. మా వారయితే... మనసులో మరొకరిని పెట్టుకున్న నీతో కాపురం చేస్తే వ్యభిచారంతో సమానం అన్నారు. ఆ మాట నా మనసును విరిచేసింది. ప్రేమించానంటూ వెంటపడి, అందరినీ ఒప్పించి పెళ్లాడిన వ్యక్తి చిన్న విషయానికే అంతగా రియాక్ట్ అవ్వడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాంటివాడు ముందు ముందు ఎంత నరకాన్ని చూపిస్తాడో! అందుకే విడాకులు ఇవ్వమంటే మారు మాట్లాడకుండా ఇచ్చేశాను. ఎంత వేగంగా పెళ్లి జరిగిందో... అంతే వేగంగా మా బంధం విచ్ఛిన్నమైపోయింది. ఆ తర్వాత ఆయన మరో పెళ్లి చేసుకున్నాడు. కానీ నాకు మాత్రం మరో మగాడికి నా మనసులో కానీ, జీవితంలో కానీ చోటివ్వాలనిపించలేదు. అమ్మానాన్నలు కూడా నన్ను చేరదీయకపోవడంతో తెలిసినవారి సాయంతో బెంగళూరు వెళ్లిపోయాను. కష్టపడి బోలెడు సంపాదించాను. అమ్మ చనిపోయినప్పుడు కనీసం కబురైనా చెప్పలేదు నాన్న. కానీ నాన్న చనిపోయినప్పుడు మాత్రం బంధువులు కబురు పెట్టారు. దాంతో తిరిగొచ్చేశాను. అన్ని కార్యాలూ జరిపించి, ఆపైన ఇక్కడే ఉండిపోయాను. మొదట్లో నాకంటూ ఎవరూ లేరే అన్న బాధ తొలిచేసేది. కానీ ఓ పాపను దత్తత తీసుకున్నాను. దాంతో ఒంటరిదాన్ని అన్న భావన తొలగిపోయింది. ఇప్పటికీ చాలామంది నావైపు అదోలా చూస్తుంటారు. జరిగినదాంట్లో నా తప్పు లేదన్న విషయం వాళ్లెవరికీ అర్థం కాదు చెప్పినా. కన్న తల్లిదండ్రులే నన్ను అర్థం చేసుకోనప్పుడు బయటివాళ్లెలా అర్థం చేసుకుంటారు! అర్థం చేసుకోలేని వ్యక్తితో జీవితాన్ని పంచుకోకపోవడమే మంచిది. నా నిర్ణయాన్ని మీరైనా సమర్థిస్తారని నమ్ముతున్నాను. - దమయంతి, ఆముదాలవలస -
ఫేస్బుక్ వివాదం.. 65 కత్తిపోట్లతో స్నేహితురాలి హత్య
లండన్: ఫేస్బుక్ వివాదం అత్యంత సన్నిహితంగా ఉండే ఇద్దరి స్నేహితుల జీవితాల్లో చిచ్చు పెట్టింది. వీరిద్దరి మధ్య ఏర్పడిన ద్వేషం హత్యకు దారితీసి చివరకు విషాదాన్ని మిగిల్చింది. అంతకుముందు వరకు కలసిమెలసి తిరిగిన స్నేహితురాలిని మరో ఫ్రెండ్ ఏకంగా 65 సార్లు కత్తితో పొడించి చంపేసింది. ఇద్దరి వయసు దాదాపు 16 ఏళ్లే. ఈ విషాదకర సంఘటన మెక్సికోలో జరిగింది. ఎరాండీ ఎలిజబెత్, అనెల్ బేజ్ ఇద్దరూ స్నేహితులు.కాగా అనెల్ ఇద్దరి నగ్న ఫొటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేసింది. ఈ విషయం ఎలిజబెత్‌కు తెలియడంతో తీవ్ర ఆగ్రహానికి గురైంది. 'నేను ప్రశాంతంగా ఉన్నానని అనుకుంటున్నావు. నా దృష్టిలో నిన్ను మూడు సార్లు హత్య చేశాను' అంటూ ఎలిజబెత్.. అనెల్ను ఉద్దేశించి ట్వీట్ చేసింది. అయినా అనెల్ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంది. ఓ రోజు ఎలిజబెత్‌ను అనెల్ తన ఇంటికి ఆహ్వానించింది. ఆ సమయంలో ఇంట్లో ఇద్దరే ఉన్నారు. స్నేహితురాలిపై విద్వేషం పెంచుకున్న ఎలిజబెత్ కత్తితో తీసుకుని ఆమె వీపు భాగంగాపై విచక్షణ రహితంగా పొడిచింది. అనెల్ అక్కడికక్కడే మరణించింది. ఎలిజబెత్ తన దుస్తులు, కత్తిపై రక్తపు మరకలను కడిగేసి సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితురాలిని అరెస్ట్ చేశారు. -
న్యూఇయర్ వేడుకల్లో విషాదం