Mouni Roy Birthday Wish For Her Bestie And Shares Bold Pictures Went Viral - Sakshi
Sakshi News home page

Mouni Roy: 'అలా ఉండాలనుకుంటా.. కానీ ఒక్క గంట కూడా ఉండలేను'

May 14 2022 9:52 AM | Updated on May 14 2022 10:46 AM

Mouni Roy Birthday Wish For Her Bestie And Shares Bold Pictures - Sakshi

బుల్లితెరపై నటి మౌనీరాయ్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌లో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆమె నటించిన నాగిని సీరియల్‌ ఎంతో పాపులర్‌ అయ్యింది. ఇటీవలో వ్యాపారవేత్త, ప్రియుడు సూర‌జ్ నంబియార్‌ను పెళ్లి చేసుకున్న మౌనీరాయ్‌ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా సోషల్‌ మీడియాలో ఆమె షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట వైరల్ అవుతుంది.

తన బెస్ట్‌ఫ్రెండ్‌ రూపాలి బర్త్‌డే సందర్భంగా కొన్ని బ్యూటిఫుల్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. 'నువ్వు నన్ను 50వ అంతస్తు నుంచి దూకమని అడిగినా దూకేస్తాను. నువ్వు నాతో గొడవ పడినప్పుడు కొన్ని నెలల వరకు నీతో మాట్లాడకూడదనుకుంటాను. కానీ ఒక్క గంట కూడా అలా ఉండలేను. నువ్వు ఇప్పటికీ, ఎప్పటికీ నా బెస్ట్‌ఫ్రెండ్‌వి.

హ్యాపీ బర్త్‌డే రూప్సీ. మనం ఇలాగే ఎన్నో న్యూ ఇయర్‌, వాలెంటైన్స్‌ డే, హోలీ సహా ఎన్నో హాలీడేస్‌ను కలసి సెలబ్రేట్‌ చేసుకుందాం. నువ్వు నా దానివి. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తుంటాను' అంటూ మౌనీ రాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు వావ్‌, సో క్యూట్‌ మీరు ఎప్పటికీ ఇలానే కలిసుండండి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement