బాలీవుడ్ అత్యంత క్రేజ్ ఉన్న జంటల్లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ ఒకరు. ఇవాళ అభిషేక్ తన 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తాజాగా తన భర్తకు బర్త్ డే విషెస్ తెలిపింది. అభిషేక్ బచ్చన్ చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. మీకు ఎల్లప్పుడు ఆనందం, ఆరోగ్యం, ప్రేమతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
సినిమాల విషయానికొస్తే అభిషేక్ బచ్చన్.. గతేడాది ఐ వాంట్ టూ టాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. షూజిత్ సర్కార్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీలో అభిషేక్ విభిన్నమైన పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది.ఐశ్వర్య రాయ్ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రాల్లో నటించింది. ఇందులో చియాన్ విక్రమ్, రవి మోహన్, శోభితా ధూళిపాల, త్రిష కృష్ణన్, కార్తీ, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రల్లో నటించారు.
ఐశ్వర్య- అభిషేక్‌పై రూమర్స్..
కాగా.. గతేడాది అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహ వేడుకల్లో జంటగా కనిపించారు. ఇద్దరూ విడివిడిగా వేడుకలో కనిపించడంతో ఈ జంట విడిపోతున్నారంటూ పెద్దఎత్తున రూమర్స్ వినిపించాయి. అంతకుముందు కూతురు ఆరాధ్య పుట్టిన రోజు వేడుకల్లో అభిషేక్ కనిపించకపోవడంతో డివోర్స్ తీసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ ఈ జంట ఈ వార్తలపై స్పందించలేదు.
జంటగా పార్టీకి హాజరు
బాలీవుడ్ జంట ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారని ఏళ్ల తరబడి నుంచి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. గతేడాదిలో మరింత బలపడ్డాయి. కానీ వీరిద్దరు ఓ పార్టీలో ఫ్రెండ్స్‌తో కలిసి సెల్ఫీలు దిగారు. అందులో అభిషేక్, ఐశ్వర్యతో పాటు ఐష్ తల్లి బృంద్య రాయ్ కూడా ఉన్నారు. దీంతో విడాకుల రూమర్స్‌కు చెక్ పడింది.
Comments
Please login to add a commentAdd a comment