
అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) ఏడాదికి ఒకటీరెండు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇటీవలే 'బి హ్యాపీ' చిత్రంతో ఓటీటీ ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో కూతురి గెలుపు కోసం పాటుపడే తండ్రిగా కనిపించాడు. అయితే తండ్రయ్యాక రొమాంటిక్ సీన్లలో నటించడానికి ఇబ్బందిగా ఉందని.. దానివల్ల అలాంటి సన్నివేశాలున్న సినిమాలను వదిలేసుకుంటున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ఉత్తమ నటుడిగా తొలి అవార్డ్
ఇకపోతే 'ఐ వాంట్ టు టాక్' (I want to Talk) చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా షోషా రీల్ అవార్డు అందుకున్నాడు. ఉత్తమ నటుడిగా నేను గెల్చుకున్న తొలి అవార్డు ఇదేనంటూ అభిషేక్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇంతలో హీరో అర్జున్ కపూర్.. ఐ వాంట్ టు టాక్ (నేను నీతో మాట్లాడాలి) అని ఎవరు అన్నప్పుడు నువ్వు టెన్షన్ పడతావు? అని ప్రశ్నించాడు.
పెళ్లయితే తెలుస్తుంది
అందుకు అభిషేక్.. నీకింకా పెళ్లి కాలేదు కదా.. నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు దానికి ఆన్సరేంటో నీకే తెలుస్తుంది. నా భార్య ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అన్నప్పుడు ఒత్తిడిగా ఫీలవుతాను. ప్రత్యేకంగా మాట్లాడాలని ఫోన్ చేసిందంటే కచ్చితంగా మనం సమస్యలో ఇరుక్కున్నట్లే లెక్క అని సరదాగా చెప్పాడు. కాగా అభిషేక్, ఐశ్వర్య రాయ్ 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఆరాధ్య జన్మించింది. కాగా అభిషేక్- ఐశ్వర్య విడిపోతున్నట్లు పలుమార్లు రూమర్లు రాగా.. అవి నిజం కాదని నటుడు క్లారిటీ ఇచ్చాడు.
చదవండి: నీదీ నాది ఒకే కథ.. బంధువులే అసభ్యంగా.. ఏడ్చేసిన వరలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment