బాలీవుడ్ జంట ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారని ఏళ్ల తరబడి నుంచి పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాదైతే ఈ పుకార్లు మరింత బలపడ్డాయి. వాళ్లు కలిసి ఉండట్లేదని, విడాకులు తీసుకోవడం ఒక్కటే మిగిలిందని ప్రచారం జరిగింది. అయితే ఇదంతా ట్రాష్.. అందులో నిజమే లేదని ఫోటోలతో సమాధానం చెప్పారు ఐష్- అభిషేక్.
భర్తతో పార్టీకి వెళ్లిన ఐశ్వర్య
వీరిద్దరూ తాజాగా ఓ పార్టీకి కలిసి వెళ్లారు. ఇద్దరూ నలుపు రంగు దుస్తులే వేసుకున్నారు. పార్టీలో ఫ్రెండ్స్‌తో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ మేరకు ఓ ఫోటోను ఎంటర్‌ప్రెన్యూర్ అను రంజన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో అభిషేక్, ఐశ్వర్యతో పాటు ఐష్ తల్లి బృంద్య రాయ్ కూడా ఉన్నారు. అందరూ కెమెరా వైపు చూస్తూ నవ్వులు చిందించారు. నటి ఆయేషా జుల్క సైతం ఐష్ దంపతులతో దిగిన సెల్ఫీలు షేర్ చేసింది.
ఐష్ చేస్తోందదే
ఇది చూసిన నెటిజన్లు చాలా బాగుంది.. ఈ ఒక్క ఫోటోతో చాలామంది మెదళ్లలో ఉన్న అనుమానాన్ని పటాపంచలు చేశావు, ధైర్యవంతులైన వారు సమస్య నుంచి తప్పించుకోవడానికి విడాకులు ఎంచుకోరు. ఆ సమస్య నుంచి బయటపడే పరిష్కారం కోసం ఆలోచిస్తారు. ఈ దంపతులు కూడా అదే చేస్తున్నారు. ఐష్, తన తల్లితోపాటు భర్తతో కలిసి ఓ పార్టీకి వెళ్లడమే అందుకు నిదర్శనం అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment