Aishwarya Rai Bachchan
-
వీడియోలు తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ఆరాధ్య
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు, అభిషేక్-ఐశ్వర్యరాయ్‌ల ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్ (Aaradhya Bachchan) మరోసారి ఢిల్లీ హైకోర్టుని(Delhi High Court) ఆశ్రయించింది. గతేడాదిలో తన ఆరోగ్యంపై తప్పుడు కథనాలను ప్రసారం చేసిన యూట్యూబ్ చానళ్లపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ కథనాలను తొలగించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆరాధ్య పిటిషన్‌పై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో గూగుల్‌కు నోటీసులు జారీ చేసింది. గతంలో ఆమె ఫిర్యాదు చేసినప్పుడు ఆ వీడియోలను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా, కొన్ని వెబ్సైట్లతో పాటు పలు సోషల్‌మీడియా ఖాతాలు వాటిని పాటించలేదు. దీంతో ఆమె మరోసారి కోర్టును ఆశ్రయించింది. (ఇదీ చదవండి: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్)గతేడాదిలో ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యంపై తప్పుదోవ పట్టించే వార్తలను యూట్యూబ్ వేదికగా ప్రసారం చేశారు. ఆరాధ్య బచ్చన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆరాధ్య ఇక లేరంటూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ప్రచారం చేశాయి. దీంతో ఆమె తండ్రి అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) వ్యాజ్యం వేశారు. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు తీవ్రంగా స్పందించింది. పిల్లల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం చాలా తప్పు అని, ఇలాంటి చర్యలు సమాజంలో అనారోగ్యకరమైన వక్రబుద్ధిని ప్రతిబింబిస్తుందని కోర్టు తెలిపింది. సమాజంలోని ప్రతి చిన్నారిని గౌరవంగా చూడటంతో పాటు వారి ఆరోగ్యానికి సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి చేయడాన్ని చట్టం ఎట్టిపరిస్థితిల్లోనూ సహించదని కోర్టు పేర్కొంది. ఇలాంటి వీడియోలు గూగుల్ దృష్టికి వచ్చినప్పుడు వాటిని తక్షణమే తొలగించాలని న్యాయస్థానం తెలిపింది. అయితే, కొన్ని ఇంకా నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో తన తండ్రితో పాటు ఆరాధ్య నేరుగా హైకోర్టుని ఆశ్రయించడంతో గూగుల్‌కు మరోసారి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత పిటిషన్‌పై విచారణ మార్చి 17న జరగనుందని తెలిపింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరికి 2011 నవంబర్ 6న ఆరాధ్య జన్మించింది. -
క్వీన్ ఐశ్వర్య ‘ఐకానిక్ లెహంగా' ఆస్కార్ మ్యూజియానికి
అద్భుతమైన ఒక డిజైనర్ లెహంగా మరో అద్భుతాన్ని సాధించడం ఎక్కడైనా విన్నారా? నీతా లుల్లా రూపొందించిన లెహంగా అలాంటి ప్రత్యేకతను సంతరించుకుంది. బాలీవుడ్ జోధా అక్బర్ మూవీలో, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai) పాత్ర కోసం నీతా లుల్లా డిజైన్ చేశారు. దీన్ని ఇపుడు ప్రపంచం మొత్తం ప్రత్యక్షంగా చూడగలిగేలా ప్రతిష్టాత్మక ఆస్కార్ మ్యూజియంలో కొలువు దీరింది. ఈ విషయాన్ని అకాడమీ తన అధికారిక ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించింది. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) అకాడమీ మ్యూజియం కలర్ ఇన్ మోషన్ ఎగ్జిబిషన్లో సినిమాలో క్వీన్ ఐశ్వర్య ధరించిన దుస్తులే కాకుండా ఆమె ఆభరణాలు కూడా బొమ్మపై రూపొందించారు. ఈ విషయాన్ని అకాడమీ తన అధికారిక ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించింది.దీంతో ఈ లెహెంగాను రూపొందించిన నీతా లుల్లా నైపుణ్యం పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.A lehenga fit for a queen, designed for the silver screen.In JODHA AKBAR (2008), Aishwarya Rai Bachchan’s red wedding lehenga is a feast for the eyes: vibrant zardozi embroidery, centuries-old craftsmanship, and a hidden gem—quite literally. Look closely and you’ll spot a… pic.twitter.com/UfUYxTeP22— The Academy (@TheAcademy) December 24, 2024 > ఐకానిక్ రెడ్ లెహెంగా,నగల విశేషాలివేజర్దోజీ ఎంబ్రాయిడరీ , శతాబ్దాల నాటి హస్తకళా నైపుణ్యం ఈ లెహెంగాలో దాగి ఉంది. ఇదే విషయాన్ని అకాడమీ తన పోస్ట్‌లో పేర్కొంటూ, ప్రశంసింయింది. నటి ధరించిన ఆభరణాలు మరింత ఆకర్షణగా ఉన్నాయి. ఆమె ధరించిన నెక్లెస్ మధ్యలో నీలం రాళ్లతో భారతదేశ జాతీయ పక్షి నెమలి మరో ఎట్రాక్షన్.జోధా అక్బర్ (Jodha Akbar) "రాణికి సరిపోయే లెహంగా, వెండితెరపై ఎంతోమందిని ఆకర్షించింది ఇకపై ఆస్కార్ మ్యూజియంలో కొలువు దీరనుంది అని అకాడమీ తెలిపింది. కాగా 2008లో అశుతోష్ గోవార్కర్ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్న చిత్రం ‘జోధా అక్బర్’. ఐశ్వర్య 'జోధా బాయి' పాత్రలో అందర్నీ ఆకట్టుకుంది. ఈ మూవీలో హీరోగా హృతిక్ రోషన్ నటించారు. వీరి రాయల్ లుక్‌కోసం రాజస్తానీ, మొఘల సంస్కృతుల మేళవింపుతో అసలు సిసలు బంగారం, విలువైన రాళ్లతో మొత్తం 400 కిలోల ఆభరణాలను తయారు చేయించారన. ఇందులో 200 కిలోల ఐశ్వర్య ప్రాతకోసం. ఈ మొత్తం ఆభరణాల తయారీకి 70 మంది కళాకారులు రెండేళ్ల పాటు శ్రమించారని చెబుతారు. -
భర్తతో పార్టీకి వెళ్లిన ఐశ్వర్యరాయ్.. అభిషేక్‌తో సెల్ఫీలు
బాలీవుడ్ జంట ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారని ఏళ్ల తరబడి నుంచి పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాదైతే ఈ పుకార్లు మరింత బలపడ్డాయి. వాళ్లు కలిసి ఉండట్లేదని, విడాకులు తీసుకోవడం ఒక్కటే మిగిలిందని ప్రచారం జరిగింది. అయితే ఇదంతా ట్రాష్.. అందులో నిజమే లేదని ఫోటోలతో సమాధానం చెప్పారు ఐష్- అభిషేక్.భర్తతో పార్టీకి వెళ్లిన ఐశ్వర్యవీరిద్దరూ తాజాగా ఓ పార్టీకి కలిసి వెళ్లారు. ఇద్దరూ నలుపు రంగు దుస్తులే వేసుకున్నారు. పార్టీలో ఫ్రెండ్స్‌తో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ మేరకు ఓ ఫోటోను ఎంటర్ప్రెన్యూర్ అను రంజన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో అభిషేక్, ఐశ్వర్యతో పాటు ఐష్ తల్లి బృంద్య రాయ్ కూడా ఉన్నారు. అందరూ కెమెరా వైపు చూస్తూ నవ్వులు చిందించారు. నటి ఆయేషా జుల్క సైతం ఐష్ దంపతులతో దిగిన సెల్ఫీలు షేర్ చేసింది.ఐష్ చేస్తోందదేఇది చూసిన నెటిజన్లు చాలా బాగుంది.. ఈ ఒక్క ఫోటోతో చాలామంది మెదళ్లలో ఉన్న అనుమానాన్ని పటాపంచలు చేశావు, ధైర్యవంతులైన వారు సమస్య నుంచి తప్పించుకోవడానికి విడాకులు ఎంచుకోరు. ఆ సమస్య నుంచి బయటపడే పరిష్కారం కోసం ఆలోచిస్తారు. ఈ దంపతులు కూడా అదే చేస్తున్నారు. ఐష్, తన తల్లితోపాటు భర్తతో కలిసి ఓ పార్టీకి వెళ్లడమే అందుకు నిదర్శనం అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Anu Ranjan (@anuranjan1010) చదవండి: నీలాంటి భర్త దొరకడం చాలా అదృష్టం.. అమలాపాల్ -
ఐశ్వర్య- అభిషేక్ విడాకుల రూమర్స్.. ఆ వీడియోలతో చెక్ పెట్టిన దంపతులు!
సినీ సెలబ్రిటీలపై రూమర్స్ రావడం ఈ రోజుల్లో అయితే సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా డేటింగ్, డివోర్స్ గురించి ఎక్కువగా వింటుంటాం. ఈ సోషల్ మీడియా యుగంలో రూమర్స్ రాకెట్ వేగంతో నెట్టింట వైరలవుతున్నాయి. అలా గత కొన్ని నెలలుగా పలువురు సినీతారలపై కూడా ఏదో ఒక సందర్భంలో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అలా ఈ ఏడాది ప్రముఖ బాలీవుడ్ జంట ఐశ్వర్వరాయ్- అభిషేక్ బచ్చన్ కూడా ఒకరు.వీరిద్దరిపై గత కొన్ని నెలలుగా విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలొచ్చాయి. పెళ్లి, బర్త్ డే వేడుకల్లో ఐశ్వర్య సింగిల్‌గా కనిపించడంతో అవీ మరింత బలపడ్డాయి. కానీ వాటిపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు. తమపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ కూడా ఇవ్వలేదు.అయితే గతనెల ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ ముద్దుల కూతురు 13వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీలో ఆమె తండ్రి అభిషేక్ బచ్చన్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ పార్టీకి డెకరేషన్ చేసిన జతిన్, నీలంలకు కృతజ్ఞతలు చెబుతూ కనిపించార ఐశ్వర్య-అభిషేక్. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఆరాధ్య పుట్టిన రోజు వేడుకలో అభిషేక్ కనిపించడంతో వీరిద్దరి విడాకుల వార్తలకు ఇక చెక్ పడినట్లైంది. కాగా.. అభిషేక్ ఇటీవల ఐ వాంట్ టు టాక్ అనే చిత్రంలో కనిపించారు.భార్య మాట వినాలంటూ సలహా..తాజాగా ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల ఈవెంట్‌కు హాజరైన అభిషేక్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెళ్లి చేసుకున్న పురుషులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పెళ్లి అయిన ప్రతి వ్యక్తి తన భార్య మాటే వినాలని గుర్తు చేశారు. ఇంట్లో నేను ఇదే ఫార్ములా వాడుతుంటా.. నా భార్య ఏం చెప్పినా వింటా అంటూ ముంబయిలో జరిగిన ఓటీటీ అవార్డుల కార్యక్రమంలో సరదాగా కామెంట్స్ చేశారు.అంతేకాకుండా తన కూతురు ఆరాధ్యను సంతోషంగా పెంచినందుకు ఐశ్వర్యకు అభిషేక్ ధన్యవాదాలు తెలిపారు. నేను బయటకు వెళ్లి సినిమాలు చేయడం కూడా నా అదృష్టం.. ఎందుకంటే ఆరాధ్యతో పాటు ఇంట్లోనే ఉండి ఐశ్వర్య చూసుకుంటుందని నాకు తెలుసని అన్నారు. ఈ విషయంలో ఐశ్వర్యకు నా కృతజ్ఞతలు.. మన పిల్లలు ఎప్పటికీ మనల్ని వారి జీవితంలో మొదటి వ్యక్తిగానే చూస్తారని అభిషేక్ తెలిపారు. View this post on Instagram A post shared by Play Time - Jatin Bhimani (@playtimeindia) View this post on Instagram A post shared by Play Time - Jatin Bhimani (@playtimeindia) -
మహిళల మీద వేధింపులపై 'ఐశ్వర్యరాయ్' ఆసక్తికర వ్యాఖ్యలు
సమాజంలో చాలామంది మహిళలు వేధింపులకు గురౌతూనే ఉంటారు. వాటిని ఎలా ఎదుర్కొవాలో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ పలు సూచనలు చేశారు. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక బ్యూటీ ప్రొడక్ట్ ప్రచారంలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇప్పటికే ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.మహిళలపై జరుగుతున్న హింసను ఆమె ఖండించారు. 'సమాజంలో చాలామంది నిత్యం వేధింపులకు గురవుతూనే ఉన్నారు. సమస్య ఎదురు అయినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితిలు ఎదురైనప్పుడు నేరుగా వారి కళ్లలోకి చూడాలి. మన శరీరం మనకు చాలా విలువైనది. దాని విషయంలో ఎలాంటి రాజీపడకండి. దానిని కాపాడుకునేందుకు ఎట్టి పరిస్థితిల్లోనూ తగ్గకండి. మీ శక్తిని తక్కువ అంచనా వేయకండి.' అని ఐశ్వర్యరాయ్ పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి. చాలామందిలో స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పినందుకు ఆమెను అభినందిస్తున్నారు.ఐశ్వర్య చివరిగా మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ 2లో కనిపించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దుబాయ్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2024లో ఆమె ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డును ఆమె గెలుచుకున్నారు. అయితే, ఆమె తదుపరి సినిమాను ఇంకా ప్రకటించలేదు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
ఐశ్వర్యారాయ్ ముద్దుల కూతురు ఆరాధ్య బర్త్ డే స్పెషల్.. అరుదైన ఫోటోలు
-
అందాల రాణి ఐశ్వర్య రాయ్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ అందానికే ఐకానిక్‌గా ఉండే సౌందర్యం ఆమె సొంతం. ఎంతమంది అందగత్తలైన ఆమెకు సాటి రారు. అలాంటి అద్భుతమైన అందం ఆమెది. ఐదుపదుల వయసులో కూడా అంతే గ్లామర్‌గా ఉండటం విశేషం. ఎక్కడ ఐశ్వర్యరాయ కనిపించినా..అందాల రాణి వస్తుందని ఆత్రంగా చూస్తారు. అంతటి ఆకర్షణీయమైన అందాన్ని మెయింటైన్ చేసేందుకు ఐశ్వర్య ఏంచేస్తుందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కూడా. అంతేగాదు ప్రతి మహిళ చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలో కూడా చెప్పారామె. ఇంతకీ అవేంటో చూద్దామా..!.మాజీ మిస్ ఇండియా ఐశ్వర్య రాయ్ ఇప్పటికి అంతే ఫిట్‌గా అందంగా కనిపిస్తారు. ఎక్కడ మచ్చ్చుకైనా..వృద్ధాప్య ఛాయలు కానరావు. అంతలా మేని ఛాయ మెరుస్తూ ఉండేందుకు ఐశ్వర్య ఎంతో కేర్ తీసుకుంటానని చెప్పారు. ఆరోగ్యం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే చర్మ సంరక్షణ కూడా అంతే ముఖ్యమని అంటోంది ఐశ్వర్య రాయ్. తాను కూడా ప్రతి భారతీయ మహిళ ఎలా ఉంటుందో తాను అలానే ఉంటానన్నారు. "అయితే ఆత్మగౌరవంతో, సరైన వ్యక్తిత్వంతో బతకాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రతి స్త్రీ తన ఆత్మగౌరవాన్ని చంపుకుని జీవించాల్సిన పనిలేదు. అదీగాక మహిళలు నిద్ర లేచిన దగ్గర నుంచి గడియారంలోని ముల్లుకంటే వేగంగా ఆగకుండా పనిచేస్తూనే ఉంటారని అన్నారు. అందువల్ల కనీసం కొద్దిసేపైనా మీ కోసం సమయం కేటాయించడం అత్యంత ముఖ్యం. హైడ్రేటెడ్‌గా పరిశుభ్రంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ గౌరవాన్ని ఇనుమడింప చేసే అందంపై దృష్టి పెట్టండి. అందులో ఎలాంటి తప్పు లేదు. తప్పసరిగా మొటిమలు, అలెర్జీలు వంటి బారిన పడకుండా స్కిన్కేర్లు వాడలన్నారు. తప్పనసరిగా మాయిశ్చరైజర్లను వాడమని సూచించింది. వంటపనులతో సతమతమయ్యే మహిళలు తమ చర్మ ఆరోగ్యం కోసం మాయిశ్చరైజర్లు వాడాలని అన్నారు." ఐశ్వర్యరాయ్.(చదవండి: 'తుప్పా దోస విత్ చమ్మంతి పొడి' గురించి విన్నారా?) -
క్రికెట్ అంటే పిచ్చి.. నెదర్లాండ్‌లోని ఓ ఫ్లవర్‌కి ఈమె పేరు.. ఐశ్వర్య గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
మామయ్య కోసం మెసేజ్.. రూమర్స్‌కు ఫుల్స్టాప్ పెట్టిన ఐశ్వర్య
లెజండరీ యాక్టర్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11న 82వ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎందరో ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వయసు మీద పడుతున్నా ఇప్పటికీ అదే ఉత్సాహంతో నటిస్తూ యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. అందుకే చాలామంది నటీనటులకు బచ్చన్ ఆదర్శం. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కూడా సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. అయితే, అమితాబ్ ఫ్యాన్స్ అందరూ ఐశ్వర్య రాయ్ చెప్పే విషెష్ కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆమె నుంచి అమితాబ్‌కు మెసేజ్ వెళ్లింది. దీంతో వారి అభిమానులు సంతోషిస్తున్నారు.అమితాబ్ బచ్చన్ కుటుంబంలో పలు విభేదాలు ఉన్నాయని చాలా రూమర్స్ వచ్చాయి. అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్‌కు ఐశ్వర్య, ఆరాధ్య విడివిడిగా రావడంతో విభేదాలు తీవ్రమయ్యాయి. దీంతో బచ్చన్ కుటుంబంతో ఆమెకు మాటలు లేవని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే, తన మామయ్య అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పి అలాంటి పుకార్లకు ఐశ్వర్య ఫుల్స్టాప్ పెట్టింది. ఈమేరకు సోషల్‌మీడియాలో ఆరాధ్యతో అమితాబ్ దిగిన పాత ఫొటోను నిన్న రాత్రి 11:30 గంటలకు ఆమె పోస్ట్ చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు దాదాజీ అంటూ.. ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె పంచుకుంది. దీంతో అభిమానులు చాలా సంతోషించారు. ఒక్క మెసేజ్‌తో రూమర్స్‌కు ఫుల్స్టాప్ పెట్టిందంటూ ఐశ్వర్యను ప్రశంసిస్తున్నారు. ఐశ్వర్య చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
తెల్లవారితే షూటింగ్.. రిహార్సల్స్ చేయకుండానే ఐశ్వర్యతో డ్యాన్స్ చేశా: అనిల్ కపూర్
ఐశ్వర్యా రాయ్, అక్షయ్ ఖన్నా, అనిల్ కపూర్ లీడ్ రోల్స్‌లో నటించిన హిందీ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ‘తాల్’ (1999). సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో పాటు అవార్డులు, రివార్డులను సాధించింది. ఈ చిత్రం విడుదలై పాతికేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అనిల్ కపూర్. ‘‘తాల్’ గురించి ప్రేక్షకులు ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. విక్రాంత్ కపూర్ (‘తాల్’లో అనిల్ కపూర్ పాత్ర) రోల్ నా కెరీర్లో ఓ మర్చిపోలేని జ్ఞాపకం. ఈ పాత్రను నాకు ఇచ్చిన సుభాష్‌ను గుర్తుపెట్టుకుంటాను. ‘రమ్తా జోగి..’ నా ఫేవరెట్ సాంగ్. అయితే ఈ పాట నా ఫెవరెట్‌గా మారడం వెనక పెద్ద కథ ఉంది. నిజానికి ఈ పాటకు ఫరా ఖాన్ కొరియోగ్రఫీ చేయాలి. కానీ చివరి నిమిషంలో ఆమె తప్పుకున్నారు. దీంతో ఈ పాటను రేపు చిత్రీకరిస్తామనగా, ముందు రోజు రాత్రి ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వచ్చారు. నేను ఎటువంటి రిహార్సల్స్ లేకుండానే ఈ పాటను పూర్తి చేశాను. అదీ... ఐశ్వర్యా రాయ్ వంటి అద్భుతమైన డ్యాన్సర్ సరసన డ్యాన్స్ చేశాను. చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇంకో విశేషం ఏంటంటే...ఫిల్మ్‌ఫేర్, జీ, ఐఎఫ్ఎఫ్ఏ, స్క్రీన్ అవార్డ్స్... ఇలాంటి అవార్డ్స్ ఫంక్షన్స్‌లో ఉత్తమ సహాయనటుడి విభాగం (‘తాల్’లో నటనకు గాను...)లో నాకు మేజర్ అవార్డులు వచ్చాయి. ఇలా అన్ని రకాలుగా ‘తాల్’ మర్చిపోలేని అనుభూతిని మిగిల్చింది’’ అంటూ ఇన్‌స్టా వేదికగా పేర్కొన్నారు అనిల్ కపూర్. 12 పాటలు ఉన్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. -
ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ఐశ్వర్యరాయ్ బచ్చన్
అందాల ఐశ్వర్యం, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన లేటెస్ట్ లుక్‌తో ఇంటర్నెట్లో సంచలనం రేపుతోంది. తాజాగా కొన్ని అద్భుతమైన చిత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి ట్రోలర్స్‌కు షాకిచ్చింది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన లుక్స్‌పై విపరీతంగా ట్రోల్ చేసినవాళ్లకు లేటెస్ట్ ఫోటోస్‌తో తగిన సమాధానం చెప్పింది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb)కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ప్రతిష్టాత్మక కేన్స్ చలన చిత్రోత్సవానికి హాజరైన ఐషూ రెడ్ కార్పెట్ లుక్‌తో వార్తల్లో నిలిచింది. అయితే కొంతమంది నెటిజన్లు ఆమె లుక్‌పై దారుణంగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో కేన్స్ 2024 కోసం సిద్ధమవుతున్నప్పటి ఫోటోలతో ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేసింది. తన కొత్త హెయిర్‌స్టైల్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. తన అందమైన లుక్‌తో అందరినీ మంత్రముగ్దులను చేసింది. దీంతో ఫ్యాన్స్ కమెంట్స్ ఒక రేంజ్లో సాగాయి. "రెడ్ కార్పెట్‌పై ఇలా దర్శనమిచ్చి ఉండి ఉంటే ఉచకోతే’’ అని ఒకరు, "కేన్స్ సమయంలో మీరు ఈ రకమైన హెయిర్‌స్టైల్ ఎంచుకుంటే భలే ఉండేది’’ మరొకరు కమెంట్ చేశారు. "భూమిపై అత్యంత అందమైన మహిళ" అని మరో యూజర్ బాలీవుడ్ దియాపై తన ప్రేమను ప్రకటించాడు. -
ఐశ్వర్య రాయ్ చేతికి సర్జరీ.. డాక్టర్స్ సూచనతోనే కేన్స్‌లో మెరిసిందా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసింది. తాజాగా ఆమె తన కూమార్తెతో ఫ్రాన్స్ నుంచి ముంబైకి తిరిగొచ్చింది. గత 20 ఏళ్లుగా కేన్స్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై ఆమె మెరుస్తూనే ఉంది. అయితే ఈసారి తన చేతికి గాయం అయింది. దానిని ఏమాత్రం లెక్కచేయని ఐశ్వర్య నూతన డిజైనర్ దుస్తుల్లో కార్పెట్‌పై హొయలుపోతూ కనిపించింది.యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చిత్రోత్సవాల్లో పాల్గొనడం అంటే ఆ హీరోయిన్లకు దక్కిన గౌరం అని అందరూ అంటారు. కానీ, ఐశ్వర్య గ్లామర్‌తో ఆ ఫెస్టివల్‌కు మరింత అందాన్ని ఇచ్చిందని ఆమె అభిమానులు అంటారు. ఐశ్వర్య చేతికి గాయం కావడంతో ఆమె అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. అయితే, తన కుమార్తె ఆరాధ్య సాయంతో ఆమె కేన్స్‌లో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఐశ్వర్యరాయ్ గత వారాంతంలో మణికట్టుకు గాయమైంది, గాయం ఉన్నప్పటికీ, ఆమె ఈ సంవత్సరం కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. నిపుణులు, వైద్యులతో చర్చించిన తర్వాతే ఆమె ఫ్రాన్స్ వెళ్లారు. త్వరలో ఆమె చేతికి చిన్నపాటి సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. వచ్చే వారంలో ఆమె చేతికి శస్త్రచికిత్స చేయించుకుంటుందని వార్తలు వస్తున్నాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
77వ కేన్స్ చిత్రోత్సవాల్లో ఐశ్వర్య రాయ్ అందాలు (ఫోటోలు)
-
చేతికట్టు తొలగించి కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్
ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సినీ తారలు, సెలిబ్రిటీస్ సరికొత్త డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్‌పై మెరిశారు. కేన్స్‌లో ఎంతమంది కనిపించినా సరే.. అందరి చూపులు ఐశ్వర్య రాయ్ మీదే ఉంటాయి. ఈ క్రమంలో ఆమె చేతికి గాయం ఉండటంతో ఫ్యాన్స్ షాకయ్యారు. అయినా సరే గాయంతోనే ఈ వేడుకకు తన కుమార్తెతో ఐశ్వర్య వెళ్లారు. కానీ, రెడ్ కార్పెట్‌పై ఆమె ఎలా కనిపించనున్నారో అని లక్షలాది మంది అభిమానులు ఎదురుచూశారు. ఏది ఏమైనా నెటిజన్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐశ్వర్య తన గ్లామర్‌ను జోడించింది. డిఫరెంట్ ఫ్యాషన్ సెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో ఆమె మరొసారి సక్సెస్ అయ్యారు. ఐశ్వర్యను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. 77వ ఫిల్మ్ ఫెస్టివల్లో బ్లాక్, వైట్, గోల్డెన్ కాంబినేషన్లో ఉండే గౌనులో ఐశ్వర్య కనిపించారు. ప్రముఖ డిజైనర్ 'ఫల్గుణి షేన్ పీకాక్' వారు డిజైన్ చేసిన డ్రెస్‌ను ఆమె ధరించారు. గాయం వల్ల తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి కనిపించిన ఐశ్వర్య ప్రస్తుతానికి తొలగించింది. కానీ, ఆదే చేతికి తెల్లని కట్టు కనిపిస్తుంది. వాస్తవంగా ఆమె చేతిక తీవ్రమైన గాయమే అయినట్లు తెలుస్తోంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గత 20 ఏళ్ల నుంచి ఆమె పాల్గొంటుంది. అందుకే ఆమె ఈసారి కూడా అక్కడ అడుగుపెట్టింది. దీంతో చాలా మంది అభిమానులు ఐశ్వర్యను ప్రశంసిస్తున్నారు. ఆమెలో ఉన్న డెడికేషన్‌కు చాలామంది ఫిదా అవుతున్నారు.Breathtaking Beauty ✨ Her Walk 🔥#AishwaryaRai #AishwaryaRaiBachchan #AishwaryaAtCannes #Cannes2024 #CannesQueenAishwarya #Cannes pic.twitter.com/KxgxW1GyQs— Aishwarya Rai Fan (@Ram_TamilNadu_) May 16, 2024 -
ఇంట్లో కూర్చొని కెరీర్ నాశనం చేసుకుంటున్నావ్
అందమే అసూయపడేంత సొగసు హీరోయిన్ ఐశ్యర్యరాయ్ సొంతం. 1994లో ప్రపంచ సుందరి పోటీల్లో కీరీటాన్ని పొందిన ఐశ్వర్యరాయ్‌ని ఆ తరువాత సినీ అవకాశాలు వరించాయి. దర్శకుడు మణిరత్నం ఇరువర్ చిత్రం ద్వారా ఈమెను కథానాయికగా పరిచయం చేశారు. ఆ చిత్రం విజయంతో ఐశ్వర్యరాయ్‌కు అవకాశాలు వరుసకట్టాయి. అలా హిందీ, తమిళం, బెంగాలీ, ఆంగ్లం భాషల్లో పలు చిత్రాల్లో నటించి బహుళ ప్రాచుర్యం పొందారు. పులి కడుపున పిల్లి పడుతుందా? అగ్ర కథానాయికగా కొనసాగుతున్న సమయంలోనే బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వారసుడు, నటుడు అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి 2007లో జరిగింది. ఈ క్రేజీ జంటకు ఆరాధ్య అనే కూతురు పుట్టింది. ఇప్పుడు అసలు విషయం ఈ అమ్మాయి గురించే. పులి కడుపున పిల్లి పుడుతుందా? అన్న సామెతలా అందానికి పుట్టిన చంద్రం ఈ ఆరాధ్య. ఈ చిన్నారికి పట్టుమని 15 ఏళ్లు కూడా లేవు. అంబానీ పెళ్లిలో హైలైట్ అయితే అచ్చం తల్లి అందాలను పుణికి పుచ్చుకుంది. మొన్నటి వరకూ చిట్టి చిన్నారిగా కనిపించిన ఆరాధ్య ఇప్పుడు యవ్వనవతిగా మారింది. ఈ చిన్నదాని ఫొటో చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఇటీవల ప్రముఖ పారిశ్రామిక వేత్త అంబానీ కొడుకు వివాహ వేడుకకు ఆరాధ్య తన తల్లితో పాటు హాజరై అందరి కంట్లో పడింది. ఆ తరువాత ఐశ్వర్య తన తండ్రి కృష్ణరాజ్‌ను స్మరించుకుంటూ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోల్లోనూ ఆరాధ్య చిరునవ్వుతో దర్శనమిచ్చింది. కెరీర్ నాశనం చేసుకుంటున్నావ్ ఈ ఫోటోల్లో తల్లిలానే ఆరాధ్య కూడా అందంగా ఉందంటూ నెటిజన్లు పొగుడుతున్నారు. ఓ వ్యక్తి మాత్రం ఐశ్వర్యను తిట్టిపోశాడు. నువ్వు ఇంట్లో కూర్చోని కెరీర్ నాశనం చేసుకుంటున్నావు.. మాలాంటి అభిమానులను అసలు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యాడు. ఇది చూసిన ఇతర అభిమానులు మొన్నే కదా పొన్నియన్ సెల్వన్‌లో యాక్ట్ చేసింది.. అయినా తన జీవితం.. తనిష్టం.. ఎప్పుడెలా మాట్లాడాలో తెలీదా అని సదరు నెటిజన్ను ఏకిపారేస్తున్నారు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) చదవండి: మా అక్కను కాపాడండి.. మరోసారి సాయం కోరిన హీరోయిన్ సోదరి -
మిస్ వరల్డ్: ఈ స్టన్నింగ్ ఇండియన్ బ్యూటీల గురించి తెలుసా?
అందరమూ కలలు కంటాం. వాటిల్లో కొన్ని చాలా పెద్దవి,చాలా చిన్నవి. చిన్నదైనా పెద్దదైనా ఆ కలను నేర్చుకునే పట్టుదల మాత్రం కొందరికే ఉంటుంది. కలలను సాకారం చేసుకునే అదృష్టం కొంతమందికే సాధ్యం. అందులోనే చాలా ప్రత్యేకమైంది అయితే ఆ జర్నీ చాలా కష్టం. ఇక, బ్యూటీ, మోడలింగ్ రంగంలో అమ్మాయిలు రాణించాలంటే నిజంతా అది కత్తి మీద సామే. అలాంటి ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రపంచ సుందరీమణులుగా,విజేతలుగా నిలిచారు. ప్రపంచ వేదికల మీద మన దేశాన్ని అత్యున్నతంగా నిలబెట్టారు. తాజాగా మిస్ వరల్డ్ 2023 సంబరాలకు ఇండియా వేదిక కానుంది. బ్యూటీ విత్ పర్పస్ థీమ్‌తో ఈ పోటీలు ఘనంగా నిర్వహించనుంది. ప్రతీ ఏడాది వివిధ దేశాల్లో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఈసారి భారత్ ఆతిథ్యమివ్వనుంది. దీంతో మిస్ వరల్డ్ ఈవెంట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు ఎపుడు నిర్వహించారో తెలుసా? యునైటెడ్ కింగ్డమ్లో ఎరిక్ మోర్లీ 1951లో ఈ పోటీలకు నాంది పలికారు. ఇంగ్లీషు టెలివిజన్ వ్యాఖ్యాత ఎరిక్ డగ్లస్ మోర్లీ మిస్ వరల్డ్ పోటీ , కమ్ డ్యాన్సింగ్ ప్రోగ్రామ్‌ను మొదలు పెట్టారు. 1978ల ఆయన నిష్క్రమించడంతో అతని భార్య బ్యూటీ క్వీన్ జూలియా మిస్ వరల్డ్ పోటీలను కొనసాగించింది. 82 ఏళ్ల వయసులో మోర్లీ 2000లో మరణించాడు. అతని భార్య, జూలియా మోర్లీ ఛైర్మన్‌గా ఉండగా కుమారుడు స్టీవ్ డగ్లస్ దాని సమర్పకులలో ఒకరుగా ఉన్నారు. లండన్‌లోని లైసియం బాల్రూమ్లో తొలి మిస్ వరల్డ్ టైటిల్‌ను మిస్ స్వీడన్, కికీ హాకోన్సన్ కైవసం చేసుకుంది. మన ముద్దుగుమ్మలు తమ అందానికి, సంకల్పాన్ని, తెలివితేటల్ని, జోడించి ఆరు సార్లు జగజ్జేతలుగా నిలిచారు. రీటా ఫారియా రీటా ఫారియా పావెల్ ఒక డాక్టర్. మోడలింగ్ రంగంలో రాణిస్తూ 1966లో మిస్ వరల్డ్ పోటీల్లో చరిత్ర సృష్టించింది. తొలి ఆసియా , భారతీయ మిస్ వరల్డ్ విజేతగా నిలిచి బ్యూటీ రంగంలో ఇండియాలో పేరును సమున్నతంగా నిలిపింది. మరియు ముంబైలో గోవా తల్లిదండ్రులకు జన్మించింది. వైద్య శిక్షణ పొందిన తొలి మిస్ వరల్డ్ విజేత ఆమె. ఏడాది పాటు మిస్ వరల్డ్‌గా ఉన్న ఆమె సినిమా ఆఫర్లను తిరస్కరించి వైద్య వృత్తికి అంకితమైంది. 1971లో, తన గురువు డేవిడ్ పావెల్‌ను వివాహం చేసుకుంది. ఐశ్వర్య రాయ్: ప్రపంచంలోనే అందాలరాణిగా నిలిచిన ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. 1994 మిస్ వరల్డ్ టైటిల్ గెల్చుకుని యూత్ కలల రాణిగా అవతరించింది. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. రెండు ఫిల్మ్‌ఫేర్ నామినేషన్లతో సహా వివిధ అవార్డులును దక్కించుకుంది. అలాగే 2009లో భారత ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారాన్ని ,2012లో ఫ్రెంచ్ ప్రభుత్వం ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్ లెటర్స్‌ను గెల్చుకుంది. డయానా హేడెన్: మోడల్, నటి డయానా హేడెన్ 1997లో మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది.మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మూడో భారతీయ మహిళ. అంతేకాదు ఈ పోటీల్లో మూడు సబ్ టైటిల్స్‌ను గెల్చుకున్న ఏకైక మిస్ వరల్డ్ కూడా యుక్తా ముఖి: మిస్ ఇండియాగా నిలిచిన నాల్గో భామ యుక్తా ఇంద్రలాల్ ముఖి. 1999లో మిస్ వరల్డ్ టైటిల్‌తోపాటు 1999లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని కూడా సొంతం చేసుకుంది. మోడల్‌గాను, కొన్ని హిందీ సినిమాల్లోనూ కనిపించింది. ప్రియాంక చోప్రా : 2000లో మిస్ వరల్డ్ 2000 విజేత ప్రియాంక చోప్రా, మోడల్‌గా, హీరోయిన్గా రాణిస్తోంది. అంతేకాదు ఇండియాలో అత్యధిక పారితోషికం పొందుతున్న హీరోయిన్లలో ఒకరిగా తన సత్తాను చాటుకుంటోంది. రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు , ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా పలు గౌరవాలను గెలుచుకుంది. 2016లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు వరించింది. అలాగే ఫోర్బ్స్ ఆమెను ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చేర్చింది. మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ 2017 టైటిల్‌ను నటి , మోడల్ మానుషి చిల్లర్ గెలుచుకున్నారు. ఫెమినా మిస్ ఇండియా 2017 పోటీలో ఆమె తన సొంత రాష్ట్రం హర్యానాకు ప్రతినిధిగా పోటీ పడి, గెలిచింది. ఆ తర్వాత మిస్ వరల్డ్ కిరీటం పొందిన ఆరో భారతీయురాలిగా నిలిచింది. చారిత్రాత్మక నాటకం సామ్రాట్ పృథ్వీరాజ్లో సంయోగిత పాత్రతో ఆమె తొలిసారిగా నటించింది. -
ఒకే ఫ్రేమ్‌లో ఐశ్వర్య రాయ్ కుటుంబం.. ఆ ఒక్కరు మాత్రం లేరు
బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వారి కుటుంబం నుంచి ఎన్నో ఊహాగానాలు వచ్చినా వారు మరింత రెట్టింపుతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ముంబైలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కబడ్డీ మ్యాచ్‌కు జయ బచ్చన్ మినహా ఆ కుటుంబం మొత్తం హాజరయ్యారు. ముంబైలో జరిగిన ఈ కబడ్డీ మ్యాచ్‌లో ఐశ్వర్యరాయ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ ఉన్నారు. వీరంతా అభిషేక్ బచ్చన్‌కు చెందిన జైపూర్ పింక్ పాంథర్స్ జట్టును ఉత్సాహపరిచేందుకు అక్కడికి వచ్చారు. ప్రొ కబడ్డీ లీగ్ (పికెఎల్) సీజన్ 10 మ్యాచ్‌లో ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఆ జట్టు యు ముంబాను ఓడించింది. ఆ మ్యాచ్‌లో సందడిగా కనిపించిన బచ్చన్ కుటుంబాన్ని స్టార్ స్పోర్ట్స్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో బచ్చన్ కుటుంబ సభ్యులు అందరూ జైపూర్ పింక్ పాంథర్స్ షర్టులు ధరించి వచ్చారు. యు ముంబా జట్టుతో జైపూర్ పింక్ పాంథర్స్ గట్టి పోటీనిచ్చింది. యు ముంబా జట్టును ఓడించడంతో, బచ్చన్ కుటుంబం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ కనిపించిన ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ జట్టు 2014 నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌లో పోటీ చేయడం ప్రారంభించింది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో యు ముంబా జట్టుపై జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది. అభిషేక్, ఐశ్వర్యల మధ్య మనస్పర్థలు వచ్చాయని వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం కొద్దిరోజులుగా బాలీవుడ్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే బచ్చన్ కుటుంబ సభ్యులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తమ పనుల్లో బిజీగా ఉన్నారు. పలు ప్రోగ్రామ్స్‌లో కలిసి కనిపిస్తూ రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అమితాబ్ ఇంటి నుంచి ఐశ్వర్య బయటకు వచ్చేసిందని దీనంతటికి కారణం తన అత్తగారు జయా బజ్చన్, అమితాబ్ బచ్చన్ అంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం బచ్చన్ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఒకే చోట కూర్చొని ఆనందంగా గడిపారు. ఇకనైన ఈ వార్తలకు చెక్ పడుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. .@SrBachchan, @juniorbachchan & #AishwaryaRaiBachchan were all in attendance to watch the #JaipurPinkPanthers win their 1st game of the Mumbai leg! 🤩 Tune-in to #PUNvCHE in #PKLOnStarSports Tomorrow, 7:30 PM onwards | Star Sports Network#HarSaansMeinKabaddi pic.twitter.com/lUE0ksnU8r — Star Sports (@StarSportsIndia) January 6, 2024 -
Aishwarya Rai: బచ్చన్ ఫ్యామిలీతో విభేదాలు.. ట్రెండింగ్‌లో ఐశ్వర్యరాయ్ (ఫోటోలు)
-
భర్త, మామతో ఈవెంట్‌కు వెళ్లిన ఐశ్వర్య రాయ్.. కాకపోతే!
బాలీవుడ్ దంపతులు ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ ఈ మధ్య ఎక్కువగా బయట కలిసి కనిపించడం లేదు. ఐశ్వర్య పుట్టినరోజున కూడా చాలా లేట్‌గా బర్త్‌డే విషెస్ తెలిపాడు అభిషేక్. అది కూడా ఏదో పైపైనే చెప్పినట్లు కనిపించింది. దీంతో నెటిజన్లు బచ్చన్ కుటుంబంలో ఏదో జరుగుతోందని అనుమానపడ్డారు. ఈ అనుమానాలు ఈమధ్య మొదలైనవి కాదు. కొన్నేళ్ల నుంచే వీళ్లు విడిపోతున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. గతంలో సదరు పుకార్లను కొట్టిపారేశాడు అభిషేక్. ఇటీవల పొన్నియన్ సెల్వన్ 2 రిలీజైన సమయంలోనూ ఐశ్వర్యను చూసి గర్వపడుతున్నానని ట్వీట్ చేశాడు. ఇంటి నుంచి బయటకు? అయినప్పటికీ ఈ రూమర్స్ ఆగిపోలేదు. పైకి ఏదో కవరింగ్ చేస్తున్నారు కానీ అసలు విషయం వేరే ఉందని అనుమానిస్తున్నారు. ఇకపోతే ఈసారి ఏకంగా ఐశ్వర్య.. తన కూతురిని తీసుకుని బచ్చన్ ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అత్తగారు జయాబచ్చన్‌తో చాలాఏళ్లుగా మాటలు లేవని, భర్తతోనూ విభేదాలు రావడంతో ఆ కుటుంబంతో తెగదెంపులు చేసుకున్నట్లు సదరు వార్తల సారాంశం. ఈ క్రమంలో అభిషేక్- ఐశ్వర్య కలిసి కనిపించారు. వీరిద్దరూ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈవెంట్‌కు చెరో కారులో.. అయితే ఐశ్వర్య, తన తల్లి బృంద్య రాయ్‌తో కలిసి ఓ కారులో రాగా.. అభిషేక్, తన తండ్రి అమితాబ్ బచ్చన్‌తో కలిసి మరో కారులో ఈవెంట్‌కు హాజరయ్యారు. కారు దిగగానే ఐశ్వర్య.. బిగ్‌బీని పలకరించింది. అటు అభిషేక్.. భార్యపై చేయి వేసి ఆమెతో సరదాగా మాట్లాడుతూ లోనికి వెళ్లిపోయాడు. ఈవెంట్లోనూ బిగ్‌బీ, అభిషేక్, ఐశ్వర్య సరదాగా స్టెప్పులు వేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత భర్తతో పాటు అదే కారులో వెళ్లింది ఐశ్వర్య. ఇది చూసిన జనాలు ఇదేం ట్విస్టు అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by AISHVERSE 💌 (@theaishverse) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) చదవండి: అపర్ణకు కంగ్రాట్స్ చెప్పిన నయనతార.. ఎందుకో తెలుసా..? -
కూతురుతో సహా భర్త ఇంటి నుంచి బయటకొచ్చేసిన ఐశ్వర్య రాయ్
బాలీవుడ్లో అందరూ ఇష్టపడే జంటలలో ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్లు ముందు వరసలో ఉంటారు. 2007లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడీ ప్రస్తుతం తమ వివాహ విషయంలో చాలా కఠినమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇప్పటికే చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. గత కొన్ని సంవత్సరాలుగా వారిద్దరూ విడిపోతున్నారని పలుమార్లు పుకార్లు వచ్చాయి. అయినప్పటికీ, వారు దానిపై ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు. తాజాగా ఐశ్వర్య రాయ్ గురించి బాలీవుడ్ మీడియా పలు కథనాలు ప్రచురిస్తుంది. అవి నిజమేనంటూ బలంగా చెబుతున్నాయి. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ను తీసుకుని తన భర్త ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు కథనాలు వస్తున్నాయి. భర్తతో చాలా కాలంగా విభేదాలు ఉండటంతో అవి ఇక భరించలేనని ఆమె తన అమ్మగారి ఇంటికి చేరుకుందట. అత్తగారి ఇంట్లో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను తల్లి చెప్పుకుందట. ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ తన అత్తగారు అయిన జయా బచ్చన్‌తో చాలా ఏళ్లుగా కనీసం మాటలు కూడా లేవని ఐశ్వర్య చెప్పినట్లు సమాచారం. ఇదే క్రమంలో భర్త అభిషేక్ బచ్చన్‌తో కూడా విభేదాలు రోజురోజుకు పెరుగుతూ వచ్చాయని ఆమె చెప్పుకొచ్చిందట. ఇలాంటి గొడవల మధ్య తన కూతురును పెంచడం ఏమాత్రం కరెక్ట్ కాదని భావించే ఐశ్వర్య ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ వారిద్దరూ ఇప్పట్లో విడాకుల వరకు మాత్రం వెళ్లే పరిస్థితి లేదని ప్రముఖ ఆంగ్ల పత్రిక తన వెబ్సైట్లో పేర్కొంది. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కొద్దిరోజుల క్రితం ఐశ్వర్య రాయ్ తన 50వ పుట్టినరోజు వేడుక జరిగింది. ఆమె తన తల్లి, కుమార్తెతో కలిసి ఈ వేడుకను జరుపుకున్నారు. ఆ సమయంలో ఆమె అత్తమామలు ఎవరూ కూడా శుభాకాంక్షలు తెలుపలేదు. అభిషేక్ కూడా చాలా సింపుల్‌గా రెండు ముక్కల్లో ఒక పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే కాకుండా ఎంతో ఇష్టంగా ఐశ్వర్య ఇచ్చిన ఉంగరాన్ని కూడా ప్రస్తుతం తను ధరించడం లేదని తెలిసింది. దీంతో వారి అభిమానుల్లో కొంతమేరకు ఆందోళన మొదలైంది. -
విడిపోనున్న అభిషేక్, ఐశ్వర్యారాయ్...?
-
ఐశ్వర్య రాయ్‌పై అత్యాచారం చేస్తానంటే స్పందించలేదేంటి?: చిన్మయి
స్టార్ హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దూమారం రేపుతున్నాయి. లియో సినిమాలో త్రిషతో బెడ్ రూమ్ సన్నివేశాలు ఉంటాయని భావించానని, అలాంటి సీన్స్ లేకపోవడం నిరాశకలిగించిందని మన్సూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అతని వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా మండిపడింది. ఇకపై అతనితో నటించబోనని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సినీ ప్రముఖులంతా త్రిషకు మద్దతుగా నిలిచారు. ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవితో పాటు పలువురు హీరోహీరోయిన్లు త్రిషకు మద్దతు ప్రకటిస్తూ..మన్సూర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఒక అడుగు ముందుకేసి ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని మన్సూర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే మన్సూర్ మాత్రం త్రిషకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదంటున్నారు. తాను సరదాగా అన్న మాటలను కొంతమంది కావాలనే వక్రీకరించారని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ఈ వివాదంపై గాయని చిన్మయి శ్రీపాద తనదైన స్టైల్లో స్పందించింది. మన్సూర్ మాత్రమే అలాంటి వ్యాఖ్యలు చేయలేదని..గతంలో చాలా మంది హీరోయిన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. నటుడు రాధా రవికి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. (చదవండి: త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. సారీ చెప్పే ప్రసక్తే లేదన్న మన్సూర్) అందులో రాధా రవి ఓ సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ..‘నాకు హిందీ భాష రాదు. ఒకవేళ వచ్చి ఉంటే ఐశ్వర్యను రేప్ చేసే వాడ్ని. ఎందుకంటే అక్కడి వాళ్లు ఎలాగో నాకు మంచి పాత్రలు ఇచ్చేవాళ్లు కాదు. అత్యాచారం చేసే పాత్రలే ఇచ్చేవాళ్లు’ అని సరదాగా అన్నారు. రాధ రవి మాటలకు అక్కడి వారంతా నవ్వేశారు. ఈ వీడియోని చిన్మయి ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ.. రాధరవి..ఐశ్వర్య రాయ్‌ని రేప్ చేస్తానంటే అంతా జోక్‌గా తీసుకొని నవ్వేశారు. అలాంటి వ్యాఖ్యలే చేసిన మన్సూర్‌పై చర్యలు తీసుకోవాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. మరి రాధ రవి వ్యాఖ్యల మీద ఎవరూ స్పందించకపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని ఉంది’అని చిన్మయి రాసుకొచ్చింది. (చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!) చిన్మయి షేర్ చేసిన వీడియోపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. అతను రేప్ సన్నివేశాల గురించి మాత్రమే మాట్లాడరని కొంతమంది కామెంట్ చేస్తే.. మరికొంతమంది రాధరవిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు. "I have once said that if I had known Hindi, I would have had the opportunity to rape Aishwarya Rai. What I meant was I would have acted in Bollywood. Why the hell should I then act with these saniyans (idots/sinners in Tamil)." - Radha Ravi Here in this video in Tamil where you… pic.twitter.com/j9qLQwdRA7 — Chinmayi Sripaada (@Chinmayi) November 21, 2023 -
మరోసారి తెరపైకి స్టార్ కపుల్ విడాకుల రూమర్స్.. అసలేం జరుగుతోంది!
బాలీవుడ్లో మోస్ట్ బ్యూటీఫుల్ జంటల్లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ ఒకరు. ఇండస్ట్రీలో అమితాబ్ ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. గతంలో ప్రపంచ సుందరి టైటిల్ గెలుచుకున్న ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అయితే ఇటీవలే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. నవంబర్ 2న 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ మాజీ ప్రపంచ సుందరి తన పుట్టిన రోజున సియోన్‌లోని జీఎస్బీ సేవా మండల్లో క్యాన్సర్ పేషెంట్లతో కలిసి వేడుక చేసుకుంది. ఇందులో ఆమెతోపాటు కూతురు ఆరాధ్య, తల్లి బృందా రాయ్ ఉన్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. భార్య పుట్టిన రోజు వేడుకల్లో భర్త అభిషేక్ బచ్చన్ కనిపించకపోవడం ఫ్యాన్స్‌కు ఆశ్చర్య కలిగించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిషేక్‌పై నెటిజన్స్ మండిపడ్డారు. భార్య పుట్టినరోజున విషెస్ చెప్పిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా లేటుగా ఆమెకు విషెస్ చెప్పడమేంటని ప్రశ్నించారు. ఆమె 50వ పుట్టినరోజును అత్యంత ఘనంగా జరుకుంటారని భావించిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. దీంతో అభిషేక్ వ్యవహరించిన తీరుపై ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ తప్పుబడుతున్నారు. కాగా.. ఇటీవలే ముంబయిలో మనీష్ మల్హోత్రా నిర్వహించిన దీపావళి బాష్‌లో ఐశ్వర్య సింగిల్‌గానే కనిపించింది. పార్టీలో ఆమె భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్ రాలేదు. దీంతో మరోసారి ఈ జంటపై విడాకుల రూమర్స్ తెరపైకొస్తున్నాయి. ఐశ్వర్య రాయ్ పుట్టిన రోజు వేడుకలకు భర్త దూరంగా ఉండడం, అంతే కాకుండా ఎప్పుడో అర్ధరాత్రి విష్ చేయడం ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మరోసారి డైవర్స్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఈ జంటకు ఏమైందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) -
Aishwarya Rai Birthday : నీలి కళ్ల సుందరి ఐశ్వర్య రాయ్ 50వ పుట్టినరోజు.. ప్రత్యేకమైన ఫోటోలు
-
ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియిన్ సెల్వన్-2'.. కానీ కండీషన్స్ వర్తిస్తాయి
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్-2. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటించారు.కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’నవల ఆధారంగా రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించారు. అందులో మొదటి భాగం గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై భారీ విజయం సాధించగా, గత నెలలో రెండో భాగం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే ఇప్పుడీ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చారు. కానీ రెంట్ విధానంలో ‘పొన్నియిన్ సెల్వన్ 2’ స్ట్రీమింగ్ అవుతుంది. అంటే ప్రైమ్ మెంబర్ షిప్‌తో సంబంధం లేకుండా రూ. 399 చెల్లించి సినిమాను చూడొచ్చు. అయితే డబ్బులు కట్టిన 48 గంటల్లోనే సినిమాను చూడటం పూర్తిచేయాలి. మిగిలిన కండీషన్స్ కూడా వర్తిస్తాయి. తమిళంతో పాటు తెలుగు సహా అన్ని భాషల్లో స్ట్రీమింగ్కు రెడీ అయ్యింది. జూన్ రెండో వారం నుంచి మాత్రం అమెజాన్ సబ్స్క్రైబర్లకు ఉచితంగా పొన్నియన్ సెల్వన్ -2 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ప్రభు, శరత్ కుమార్, పార్దిబన్, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు నటించాారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. -
ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్
ఆర్టిఫిషియల్ ఇమేజెస్ హవా మామూలుగా లేదు. ఏఐ ద్వారా ఇప్పటికే సినిమా, క్రీడారంగానికి చెందిన సెలబ్రిటీల ఫోటోలను వివిధ రకాలుగా చిత్రించిన ఏఐ ఆర్టిస్ట్ తాజాగా మరికొన్నింటిని సృష్టించారు. మిడ్ జర్నీని టూల్‌తో ఏఐ ఆర్టిస్ట్ SK MD అబూ సాహిద్ అందమైన స్టార్లను వృద్ధులుగా మార్చేసారు. ఐశ్వర్యా రాయ్, ప్రియాంక చోప్రా తదితర విమెన్ యాక్టర్స్ సీనియర్ సిటిజెన్స్ అయితే ఎలా ఉంటారో అన్న ఊహ వీటికి ప్రాణమిచ్చింది. అంతేకాదు శ్రద్ధాకపూర్, దీపికా పదుకోన్, కత్రినా కైఫ్, అలియా భట్, కృతి సనన్, అనుష్క శర్మ లాంటి ఫోటోలను కూడా మార్చివేయడంతో ఇవి వైరల్‌గా మారాయి. అవేంటో మీరూ ఒకసారి చూసేయండి . ఇదీ చదవండి: టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు ముడతలు పడిన చర్మం, నల్లటి వలయాలతో భయంకరంగా కనిపిస్తున్నారంటూ ఫ్యాన్స్ గుండెలు బాదుకుంటున్నారు. "బాప్ రే కృతి సనన్ నా బామ్మగా కనిపిస్తుంది." ఒకరు ఆందోళన వ్యక్తం చేయగా, "శారీరక సౌందర్యం తాత్కాలికం, కానీ అంతర్గత సౌందర్యం శాశ్వతమైనది" ఇలా ఒక్కో పిక్‌పై ఒక్కో రకంగా హిల్లేరియస్ కమెంట్స్‌తో యూజర్లు సందడి చేస్తున్నారు. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) కాగా 23 వేల ఇన్‌స్టా ఫాలోయర్లతో ఏఐఆర్టిస్ట్ సాహిద్ సోషల్ మీడియాలో ఏఐ పిక్స్‌తో బాగా పాపులర్ అవుతున్నాడు. క్రికెటర్లను ముసలివాళ్లుగా, స్థూల కాయులుగా, ఫుట్‌బాల్ క్రీడాకారులుగా, బిలియనీర్లను బిచ్చగాళ్ళుగా, షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జీలను శిశువులుగా, మెట్ గాలాలో సందడి చేసిన బిలియనీర్లు, డిస్నీ సినిమాల్లో బాలీవుడ్ నటులు ఇలా ఆయన పోస్ట్ చేసిన వెంటనే ఏఐ పిక్స్ వైరల్ కావడం కామన్‌గా మారిపోయింది. (Dr.Vandana Lal Success Story: రూ. 3వేల కోట్ల నికర విలువతో రిచెస్ట్ విమెన్: ఆసక్తికర విషయాలు) View this post on Instagram A post shared by SAHID (@sahixd) -
PS 2లో జూనియర్ ఐశ్వర్యగా నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?
మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’రెండో భాగం పీఎస్ 2 ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2 చాలా బాగుందని అంటున్నారు. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమే చిన్నప్పటి ఐశ్వర్యరాయ్. ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న నందిని పాత్రలో ఐశ్వర్యరాయ్ నటించిన సంగతి తెలిసిందే. (చదవండి: విజయ్ దేవరకొండ, అఖిల్ కెరీర్‌ని దెబ్బ తీసిన ‘బామ్మర్ది’! ) పార్ట్2 లో ఆ పాత్రకు ప్లాష్‌బ్యాక్ ఉంటుంది. అందులో టీనేజ్ నందినిగా ఐశ్వర్య కంటే అందంగా, చక్కగా నటించిన ఓ చైల్డ్ ఆర్టిస్ట్. ఆమె ఎవరో కాదు.. సారా అర్జున్. ఈమె ఎవరంటారా? అదేనండి.. విక్రమ్, అనుష్క శెట్టి జంటగా నటించిన ‘నాన్న’ సినిమాలో విక్రమ్‌కు కూతురిగా నటించిన క్యూటీయే ఈ సారా అర్జున్. మతి స్థిమితం లేని నాన్న ప్రేమను అర్థం చేసుకునే కూతురిగా సారా నటన అద్భుతమని చెప్పాలి. 2011లో విడుదలైన ఈ చిత్ర మంచి విజయం సాధించింది. అప్పుడు సారా వయసు కేలవలం ఐదేళ్లు మాత్రమే. (చదవండి: సోషల్ మీడియాలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక) ఆ తర్వాత చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది సారా. ఇక పొన్నియన్ సెల్వన్‌లో చిన్నప్పటి విక్రమ్‌కు ప్రేయసిగా నటించి మెప్పించింది. సినిమాలో ఐశ్వర్యరాయ్, త్రిష,ఐశ్వర్య లక్ష్మీ, శోభిత లాంటి అందగత్తెలు ఉన్నా.. సారా అర్జున్ వారికి ఎక్కడా తగ్గకుండా తెరపై అందంగా కనిపిస్తూ.. తనదైన నటనతో మెప్పించింది. ఈ సినిమా చూసినవారికి చాలా రోజుల పాటు ఆ పాత్ర గుర్తుండిపోతుంది. అంతేకాదు ఆమె అందం, అభినయం చూస్తే.. త్వరలోనే స్టార్ హీరోయిన్ అవుతుందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Sara Arjun (@saraarjun.offical) -
PS2 Movie Review: ‘పొన్నియన్ సెల్వన్-2’ మూవీ రివ్యూ
టైటిల్: పొన్నియన్ సెల్వన్-2 నటీనటులు: చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం తదితరులు నిర్మాణ సంస్థలు: లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ దర్శకత్వం : మణిరత్నం సంగీతం: ఏఆర్ రెహమాన్ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ విడుదల తేది: ఏప్రిల్28, 2022 ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. ఈ సినిమా మొదటి భాగం గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో రెండో భాగం పొన్నియన్ సెల్వన్ 2 పై ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుగు చూస్తున్నారు. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది?రివ్యూలో చూద్దాం. కథేంటంటే... చోళ సామ్రాజ్యపు అధినేత సుందర చోళుడు(ప్రకాశ్ రాజ్) చిన్న కుమారుడు అరుళ్‌మోళి అలియాస్ పొన్నియన్ సెల్వన్(జయం రవి) నౌకలో తన రాజ్యానికి తిరిగివెళ్తుండగా శత్రువుడు దాడి చేయడం.. పోరాటం చేస్తూ ఆయన సముద్రంలో పడిపోవడం.. ఒక ముసలావిడ సముద్రంలో దూకి అతన్ని కాపాడటం. ఆ ముసలావిడకు పళవూరు రాణి నందిని (ఐశ్వర్యరాయ్) పోలికలు ఉన్నట్లు చూపించి మొదటి భాగాన్ని ముగించాడు దర్శకుడు మణిరత్నం. (చదవండి: 'ఏజెంట్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?) అసలు ఆ ముసలావిడ ఎవరు? నందినికి ఆ ముసలావిడకి ఎలాంటి సంబంధం ఉంది? అరుళ్మోళికి ఆపద వచ్చినప్పుడల్లా ఆ ముసలావిడ ఎందుకు కాపాడుతుంది? చోళరాజ్యాన్ని నాశనం చేయాలని ప్రతీజ్ఞ పూనిన పాండ్యుల లక్ష్యం నెరవేరిందా? ఆదిత్య కరికాలుడు(చియాన్ విక్రమ్)పై పగ పెంచుకున్న నందిని.. అతన్ని అంతం చేసేందుకు పన్నిన కుట్రలు ఫలించాయా? నందిని విషయంలో తప్పు చేశానని బాధపడుతున్న ఆదిత్య కరికాలుడు చివరకు ఏం చేశాడు? అసలు మందాకిని ఎవరు? ఆమెకు సుందర చోళుడుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు చోళ సామ్రాజ్యానికి రాజు ఎవరయ్యారు? అనేది తెలియాలంటే పొన్నియన్ సెల్వన్ 2 చూడాల్సిందే. ఎలా ఉందంటే.. తొలి భాగంలో చోళ రాజ్య వ్యవస్థను.. సింహాసనం కోసం సొంతమనుషులే అంతర్గత కుట్రలు చేయడం.. చోళ రాజ్యాన్ని పతనం చేసేందుకు శత్రురాజ్యాలు వేచి చూడడం చూపించారు. ఇక రెండో భాగంలో ఆ కుట్రల వెనుక ఉన్న కారణాలు తెలుపుతూ.. కథను మరింత లోతుగా చూపించాడు. ఆదిత్య కరికాలుడు, నందినిల ప్రేమ సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. నందినిని పెళ్లి చేసుకోకుండా ఎవరు అడ్డుపడ్డారనేది మొదట్లోనే చూపించారు. (చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రావణాసుర, ఎక్కడంటే?) ఆ తర్వాత అరుళ్‌మోళి ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు? అతను చనిపోయాడని భావించిన శుత్రువులు.. కరికాలుడిని, సుందర చోళుడిని చంపడానికి వేసిన కుట్రలు.. బౌద్దుల సమక్షంలో జరిగే నాటకీయ పరిణామాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెండాఫ్లో మందాకిని నేపథ్యం గురించి తెలిపే సన్నివేశాలు.. ఆదిత్య కరికాలుడు, నందిని మధ్య జరిగే సంఘర్షణలు ఆకట్టుకుంటాయి. నందిని పాత్రకి సంబంధించిన ట్విస్టులు బాగుంటాయి. రాజ్యాధికారం కోసం సొంతవాళ్లే చేసే కుట్రలు.. ప్రేమ, స్నేహం కోసం చేసే త్యాగాలు ఇందులో చూపించారు. అయితే ‘పొన్నియన్ సెల్వన్’ అనేది చోళ రాజులకు సంబంధించిన చరిత్ర. అది ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి. లేనిపోని మార్పులు చేస్తే చరిత్రకారులు విమర్శిస్తారు. అలా అని ఆసక్తికరంగా చూపించపోతే ప్రేక్షకులు మెచ్చరు. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ మణిరత్నం పీఎస్ 2ని తెరకెక్కించాడు. అయితే ఈ కథలో ఎక్కువ పాత్రలు ఉండడం.. అందులో ఒక్కో పాత్రకి రెండు,మూడు పేర్లు ఉండడం.. పైగా చరిత్రపై అందరికి పట్టుఉండకపోవడం ఈ సినిమాకు మైనస్. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు చోళుల చరిత్రపై అంతగా అవగాహన ఉండకపోవచ్చు. అందుకే పీఎస్1 టాలీవుడ్లో పెద్దగా ఆడలేదు. పీఎస్ 2 విషయంలో ప్లస్ పాయింట్ ఏంటంటే.. పీఎస్ 1 చూసిన ప్రేక్షకులకు చోళ రాజ్య వ్యవస్థపై కాస్త అవగాహన వస్తుంది కాబట్టి.. రెండో భాగం నచ్చే అవకాశం ఉంది. అయితే మొదటి భాగం చూసి వెళ్తేనే రెండో భాగం అర్థమవుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్కరు తమతమ పాత్రల్లో ఒదిగిపోయారు. మొదటి భాగంతో పోలిస్తే.. రెండో భాగంలో ఐశ్వర్యరాయ్ పాత్రకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంది. నందినిగా ఆమె నటన అందరిని ఆకట్టుకుంటుంది. విక్రమ్ పాత్రకు నిడివి తక్కువే అయినా.. అతను కనిపించే సన్నివేశాలన్నీ అందరికి గుర్తిండిపోతాయి. పొన్నియన్ సెల్వన్‌గా జయం రవి చక్కగా నటించాడు. కుందవైగా త్రిష తెరపై అందంగా కనిపించింది. కానీ ఆమె నిడివి కూడా చాలా తక్కువే. మొదటి భాగంలో కార్తి పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. ఇందులో అంత నిడివి ఉండదు కానీ..ఒకటి రెండు బలమైన సన్నివేశాలు ఉన్నాయి. పళవేట్టురాయర్‌గా శరత్‌కుమార్ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. సుందర చోళుడు పాత్రను ప్రకాశ్ రాజ్ అద్భుతంగా పోషించాడు. తంజావూరు కోటసేనాధిపతి చిన పళవేట్టురాయన్గా ఆర్.పార్తిబన్, పడవ నడిపే మహిళ పూంగుళలిగా ఐశ్యర్య లక్ష్మీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ అంత బాగాలేదు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రొంబ సూపర్ ఇంటర్వ్యూ విత్ కార్తీ అండ్ విక్రమ్!
-
మణిరత్నం మాటలకు ఐశ్వర్య ఎమోషనల్.. కాళ్లకు నమస్కరించి కృతజ్ఞతలు
దిగ్గజ దర్శకుడు మణితర్నం అంటే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ఎంత గౌరవమో అందరికి తెలిసిందే. అతన్ని తన గురువులా భావిస్తుంది. ఐశ్వర్యను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది మణిరత్నమే. 1997లో ఇరువన్(తెలుగులో ఇద్దరు) చిత్రంతో ఐశ్వర్య ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మణిరత్నం, ఐష్ కాంబోలో గురు, రావణ్, పొన్నియన్ సెల్వన్ 1 లాంటి చిత్రాలు వచ్చాయి. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ 2(పీఎస్ 2) విడుదలకు సిద్దం కాబోతుంది. ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇటీవల హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. తాజాగా ముంబైలో కూడా ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ అరుదైన సంఘటన జరిగింది. తన గురువులా భావించే మణిరత్నం కాళ్లకు నమస్కరించింది ఐశ్వర్య రాయ్. ప్రమోషన్ ఈవెంట్లో మణిరత్నం మాట్లాడుతూ... పొన్నియన్ సెల్వన్‌లో ‘నందిని’పాత్రకు ఐశ్వర్య అయితేనే న్యాయం చేస్తుందనిపించింది. ఆమెను అడిగిన వెంటనే ఓకే చెప్పింది’అని చెబుతుండగా.. ఐశ్వర్య ఎమోషనల్ అయింది. వెంటనే స్టేజ్‌పై నుంచి లేచి అందరి ముందు మణిరత్నం కాళ్లుకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. -
త్రిష అందానికి కార్తీ ఫిదా..
-
ఐశ్వర్య రాయ్ తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతుందో చుడండి..
-
సుమ నీకు నేను పెద్ద ఫ్యాన్ ని
-
హీరోలపై హీరోయిన్లు పంచులే పంచులు
-
బాహుబలి వల్లే పొన్నియన్ సెల్వన్...!
-
జయం రవి వెటకారం తో నవ్వులతో మోత మోగిన ఆడిటోరియమ్
-
ఐశ్వర్యరాయ్‌తో విడాకులు? అభిషేక్ బచ్చన్ ట్వీట్ వైరల్
విశ్వసుందరి ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ల వైవాహిక జీవితం గురించి కొద్దిరోజులుగా తరచూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిమధ్య మనస్పర్థలు తారాస్థాయికి చేరుకున్నాయని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు ప్రస్తుతం బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ముంబైలో జరిగిన నీతా-ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంఛ్ ఈవెంట్‌కు ఐష్ అభిషేక్ లేకుండా కూతురు ఆరాధ్యతో కలిసి వెళ్లడంతో వీరి విడాకుల అంశం మరోసారి చర్చకు వచ్చింది. కొంతకాలంగా సినిమా ఫంక్షన్లు, పార్టీలు, ఈవెంట్లకు ఐశ్వర్య ఒక్కతే హాజరవుతుంది. లేదా కూతుర్ని వెంటేసుకొని వెళ్తుంది. దీంతో ఐష్-అభిషేక్‌ల మధ్య పొసగడం లేదని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా ఈ అనుమానాలను అభిషేక్ ఖండించారు. ఓ ఈవెంట్లో ఆరాధ్యతో కలిసి ఉన్న ఐశ్వర్యరాయ్ ఫోటోను షేర్ చేస్తూ.. ఓ నెటిజన్ మై ఫేవరెట్ పీపుల్(My Fav People)అని పేర్కొనగా..దీనికి అభిషేక్ స్పందిస్తూ.. నాకు కూడా ఫేవరెట్(Mine Too) అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఐశ్వర్య-అభిషేక్ విడిపోనున్నారనే వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. కాగా 2007లో ప్రేమ వివాహం చేసుకున్న ఐష్-అభిషేక్‌లకు కూతురు ఆరాధ్య సంతానం. My fav people ❤️♥️ @juniorbachchan pic.twitter.com/hAoODtjuTD — Shruti (@Shrutibwb) April 1, 2023 -
పొన్నియిన్ సెల్వన్-2లోని ఫస్ట్ సాంగ్ విన్నారా?
ఆగనందే.. ‘ఆగనందే ఆగనందే.. మోవి నవ్వుతోందే.. మోవి నవ్వే.. మోవి నవ్వే.. మోము నవ్వుతోందే.. మోము నవ్వే.. మోము నవ్వే.. మాను నవ్వుతోందే’ అని పాడుతున్నారు యువరాణి కుందై. ప్రియుడు వల్లవరాయన్ వందియ దేవన్ కోసమే ఈ పాట. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష తదితర భారీ తారాగణంతో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘పొన్నియిన్ సెల్వన్2’లోని పాట ఇది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కుందవైగా త్రిష, వందియ దేవన్‌గా కార్తీ నటించారు. ఈ ఇద్దరి మధ్య సాగే ‘ఆగనందే ఆగనందే మోవి నవ్వుతోందే..’ పాట పూర్తి లిరికల్ వీడియోను సోమవారం విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా శక్తి శ్రీ గోపాలన్ పాడారు. ‘పొన్నియిన్‌సెల్వన్’కి సీక్వెల్‌గా రూపొందిన రెండో భాగం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 28న విడుదల కానుంది. -
విడుదల తేదీలో మార్పులేదు
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం పాతికేళ్ల కలను సాకారం చేసిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. లైకా ప్రొడక్షన్‌తో కలిసి ఈయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. నటుడు విక్రమ్, జయంరవి, కార్తీ, శరత్‌కుమార్, ప్రకాష్ రాజ్, ప్రభు, పార్థిబన్, విక్రమ్ ప్రభు, ఐశ్వర్యరాయ్, త్రిష వంటి ప్రముఖ తారాగణం నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా రెండు భాగాలుగా రూపొందించిన ఈ చిత్రం తొలిభాగం గత ఏడాది విడుదలై విశేష ప్రేక్షక ఆదరణ పొందిన విషయం తెలిసిందే. దీంతో రెండవ భాగంపై మరింత అంచనాలు నెలకొన్నాయి. రెండవ భాగం 2023 ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు తొలిభాగం విడుదల సమయంలోనే ప్రకటించారు. అయితే తాజాగా గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దీంతో చిత్ర విడదలపై క్లారిటీ ఇచ్చేవిధంగా చిత్రం మేకింగ్ వీడియోలు చిత్ర వర్గాలు విడుదల చేశారు. అందులో పొన్నియిన్ సెల్వన్–2 చిత్రం ముందుగా ప్రకటించిన విధంగానే ఏప్రిల్ 28న విడుదలవుతుందని స్పష్టం చేశారు. చిత్ర ఆడియో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని ఈనెల, 30 లేదా ఏప్రిల్ 5న స్థానిక నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పొన్నియిన్ సెల్వన్–2లో ఆరుపాటలు ఉంటాయని, ఇందులో ఆదిత్యా కరికాలన్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన శత్రు వర్గాలు కుట్రపన్ని ఆయన్ని ఘోరంగా చంపే సన్నివేశాలు, ఐశ్వర్యారాయ్ రహస్య సన్నివేశాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయని పేర్కొన్నారు. తొలిభాగం కంటే రెండవ భాగం మరింత ఉత్కంఠ భరితంగా సాగుతుంది అని అంటున్నారు. -
ఆనందంలో ఐశ్వర్యను హగ్ చేసుకున్న అభిషేక్, ఆకట్టుకుంటున్న వీడియో
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సంతోషం పట్టలేక తన భార్య, నటి ఐశ్వర్యరాయ్‌ని హగ్ చేసుకున్ను వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. కాగా రీసెంట్గా జరిగిన ప్రో కబడ్డి ఫినాలే మ్యాచ్ చూసేందుకు భార్య ఐశ్వర్య, కూతురు ఆరాధ్యతో కలిసి పాల్గొన్నాడు అభిషేక్. ఈ 9వ సీజన్లో అభిషేక్ టీం జైపూర్ పింక్ పాంథర్ గెలిచి టైటిల్ గెలుచుకుంది. తన టీం గెలవడంతో అభిషేక్ ఆనందంలో మునిగిపోయాడు. పట్టలేని సంతోషంలో ఉన్న అభిషేక్ పక్కనే ఉన్న భార్య ఐశ్వర్యను గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చదవండి: రామ్ చరణ్‌పై ‘కింగ్ ఖాన్’ ఆసక్తికర వ్యాఖ్యలు కాగా అభిషేక్, ఐశ్వర్యలు విడాకులు తీసుకోబోతున్నారని, వారి వైవాహిక జీవితంలో కలతలు వచ్చాయంటూ కొద్ది రోజులుగా తరచూ వీరి విడాకుల రూమర్స్ బి-టౌన్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సంతోషాన్ని అభిషేక్ భార్యతో షేర్ చేసుకోవడం.. ఐశ్వర్య కూడా భర్తను చీర్ చేసిన ఈ వీడియో వారి ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుంది. అంతేకాదు విడాకుల గురించి వస్తున్న పుకార్లకు ఈ వీడియోతో చెక్ పడిందంటూ ఈ జంట ఫ్యాన్స్, ఫాలోవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఐశ్వర్య రాయ్, అభిషేక్‌లు 2007లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
కూతురి పెదాలపై ముద్దు.. ఐశ్వర్యపై నెటిజన్స్ ఫైర్
బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ ముద్దుల కూతురు, లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ మనువరాలు ఆరాధ్య బచ్చన్ బర్త్‌డే నేడు(నవంబర్ 16). ఈ సందర్భంగా ఐశ్యర్య రాయ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. కుమార్తెకి ఆ విధంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడాన్ని నెటిజన్స్ తప్పుబడుతున్నారు. (చదవండి: సినిమాలకు బ్రేక్.. స్టార్ హీరో అనూహ్య నిర్ణయం) ఇంతకీ ఐష్ పెట్టిన పోస్ట్ ఏంటంటే.. కూతురు బర్త్‌డేని పురస్కరించుకొని ‘నా ప్రేమ.. నా ప్రాణం.. ఐ లవ్ యూ ఆరాధ్య’ అని పేర్కొంటూ ఆరాధ్యతో కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఆరాధ్యకి ఐశ్వర్యరాయ్ లిప్ కిస్ ఇస్తూ కనిపించింది. కూతురి బుగ్గలపై, నుదుటిపై కాకుండా పెదవులపై ముద్దు పెట్టడాన్ని కొంతమంద నెటిజన్స్ తప్పుబడుతున్నారు. ఇది మన సంస్కృతి కాదు. వెస్ట్రన్ కల్చర్ అని, పబ్లిసిటీ కోసం ఇంత నీచంగా ఫొటోలు పెట్టాలా..? అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరికొంత మంది మాత్రం ఆ ఫోటోలో తప్పే ఏముంది? అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ‘బిడ్డపై తల్లికున్న స్వచ్ఛమైన ప్రేమ అది. ప్రతి విషయాన్ని వక్రదృష్టితో చూడడం మానండి' అని కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
Aishwarya Rai Photos: అందాల ఐశ్వర్య బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - ఐశ్వర్య రాయ్
-
జీవితంలో మొదటిసారి ఆమెను చూసి అసూయ కలిగింది: మీనా
తమిళసినిమా: బాల నటి నుంచి కథానాయకిగా ఎదిగిన నటి మీనా. దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణించిన ఈమె తెలుగు, తమిళం తదితర భాషల్లో కమలహాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటే‹Ù, నాగార్జున వంటి సూపర్‌స్టార్స్‌తో జత కట్టారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. అలాంటిది మీనా జీవితంలో ఇటీవల శోక సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. భర్తను కోల్పోయిన దుఃఖం నుంచి ఈమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈమెను మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడానికి నటి కుష్భు, సంగీత, సంఘవి తదితర స్నేహితురాళ్లు చేస్తున్న ప్రయత్నం సఫలం అవుతోంది. దీంతో నటి మీనా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమా చారం. అదే విధంగా సామాజిక మాధ్యమాలపైన దృష్టి సారిస్తున్నారు. ఇటీవల స్నేహితురాలితో కలిసి విదేశీ పర్యటన చేశారు. తాజాగా తన ఇన్ స్ట్రాగామ్‌లో నటి ఐశ్వర్యారాయ్ గురించి ఓ పోస్ట్ చేశారు. తన డ్రీమ్ క్యారెక్టర్ నందిని(పొన్నియన్ సెల్వల్‌లో ఐశ్యర్యరాయ్ చేసిన పాత్ర) కొట్టేసిన ఐశ్వర్యారాయ్‌ని చూసి, అసూయ కలిగిందన్నారు. తన జీవితంలో ఒకరిని చూసి అసూయ పడడం ఇదే మొదటిసారి అని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటించిన నటీనటులందరికీ తన అభినందనలు అని నటి మీనా పేర్కొన్నారు. ఈమె ట్విట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
పొన్నియన్ సెల్వన్: ఐశ్వర్యరాయ్ పాత్రపై శరత్ కుమార్ కామెంట్స్
శరత్‌కుమార్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ప్రముఖ నటుడు, అఖిల భారత సమత్తువ పార్టీ అధ్యక్షుడు. కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు అన్ని రకాల పాత్రలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు భాషల్లో 22 చిత్రాల్లో నటిస్తున్న ఏకైక నటుడు అని చెప్పవచ్చు. మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థలతో కలిసి మెడ్రాస్ టాకీస్ సంస్థ నిర్మించిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఇందులో నటుడు శరత్‌కుమార్ పెరియపళవేట్టరైయర్ పాత్రలో నటించారు. ఈ చిత్రం తొలి భాగం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నటుడు శరత్‌కుమార్ బుధవారం ఉదయం చెన్నైలో మీడియాతో సమావేశమయ్యారు. ఈ చిత్రంలో నటించడం తన అదృష్టమని పేర్కొన్నారు. చోళరాజుల ఇతివృత్తంతో కూడిన పొన్నియిన్ సెల్వన్ చరిత్ర తెలిసిన నవల అన్నారు. దీన్ని సంపూర్ణంగా తెరకెక్కించాలంటే 10 భాగాలకు పైగా పడుతుందన్నారు. అయితే మణిరత్నం ప్రధాన పాత్రలను, ప్రధాన అంశాలను మిస్ కాకుండా తాను అనుకున్న విధంగా అద్భుతంగా మలిచారన్నారు. దీనికి లైకా సంస్థ ప్రయత్నం చాలా ఉందన్నారు. అసాధారణమైన ఈ చిత్రాన్ని మణిరత్నం తన ప్రయత్నంతో సుసాధ్యం చేశారన్నారు. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో సుందర్ చోళన్ రాజుకు మిత్రుడు పెరియ పళవేట్టరైయర్ పాత్రలో నటించానని తెలిపారు. ఇది చోళరాజ్యానికి సంరక్షణకు భద్రుడు పాత్ర అన్నారు. నందిని అనే కపటధారిణి పాత్రలో ఐశ్వర్యారాయ్ నటించారు. ఇందులో తన అందానికి వశం కావడం, ఆమెను వివాహమాడటంతో జరిగే పరిణామాలు చిత్రంలో చూడాలన్నారు. చోళరాజుల చరిత్ర తెలియని వారికి ఈ చిత్రం పలు విషయాలను తెలియజేస్తుందన్నారు. తంజావూరులో ప్రసిద్ధి గాంచిన పెరియ కోవిల్ (ఆలయం) చోళరాజు నిర్మించిన విషయం తెలిసిందే. నున్నారు సముద్రాలను దాటి రాజ్యాలను గెలిచిన చోళ సామ్రాజ్యం కథా చిత్రం పొన్నియిన్ సెల్వన్ అన్నారు. ప్రస్తుతం తాను పలు భాషల్లో 22 చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. నటుడిగా ఇది సెకెండ్ ఇన్నింగ్స్? అని అడుగుతున్నారని, అయితే తాను తొలి ఇన్నింగ్సే పూర్తి కాలేదని అన్నారు. సినిమాలతో బిజీగా ఉండడం వల్ల రాజకీయ పార్టీ పరమైన పనులకు ఆటంకం కలగడం లేదా అన్న ప్రశ్నకు ఇప్పుడు రాజకీయాలు సామాజిక మాధ్యమాల్లోనే నడుస్తున్నాయని అన్నారు. తన కార్యకర్తలతో జూమ్ మీటింగ్‌లతో టచ్‌లోనే ఉంటున్నానని, ప్రజా వ్యతిరేక విధానాలను తన గొంతు వినిపిస్తునే ఉంటున్నదని శరత్‌కుమార్ చెప్పారు. -
పొన్నియన్ సెల్వన్.. ఆసక్తి పెంచుతున్న ఐశ్వర్యారాయ్ పాత్ర
తమిళ సినిమా: ప్రస్తుతం ప్రతి నోటా వినిపిస్తున్న మాట అంతా పొన్నియన్ సెల్వన్ మూవీ గురించే. కారణం అది తమిళనాట అత్యంత ప్రాచుర్యం పొందిన నవలకు వెండితెర రూపం కావడమే. 1950లో దివంగత ప్రఖ్యాత రచయిత కల్కి చారిత్రిక నేపథ్యంలో రాసిన నవల ఇది. కల్కి అనే పత్రికలో సీరియల్‌గా ప్రచురితమైన ఈ నవల సాహితీ ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ పొందింది. దీన్ని సినిమాగా తీయడానికి దివంగత నటుడు ఎంజీఆర్ నుంచి కమల్‌హాసన్ వరకు పలువురు ప్రయత్నించారు. అయితే దర్శకుడు మణిరత్నం కూడా రెండుసార్లు ప్రయత్నించి విఫలం అయ్యాడు. ఆయన మొక్కవోని పట్టుదలతో మూడోసారి ప్రయత్నంలో పొన్నియిన్ సెల్వన్ సినిమా రెండు భాగాలుగా కార్యరపం దాల్చుతోంది. అందులో తొలిభాగం ఈ నెల 30వ తేదీన పాన్ ఇండియా చిత్రంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. నటుడు విక్రమ్, జయం రవి కార్తీ, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, పార్తీబన్, విక్రమ్ ప్రభు, ఐశ్వర్యరాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి మొదలగు ప్రముఖ తారాగణం ముఖ్య పాత్రల్లో నటింన చిత్రం ఇది. ఏఆర్ రెహమాన్ సంగీతం, రవివర్మ ఛాయాగ్రహణంను అందించారు. ప్రస్తుతం ఈ చిత్రంలో నటి ఐశ్వర్యారాయ్ పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది చోళ రాజుల కాలం నేపథ్యంలో సాగే కల్పిత అంశాలతో కూడిన చారిత్రక కథా చిత్రం. ఇందులో నందిని అనే రాజకుమారి పాత్రను పోషించారు. ఆమె పాండియన్ దేశానికి చెందిన యువతి. కళ్లు చెదిరే సౌందర్యవతి. అంతకు మించి ప్రతీకారంతో రగిలిపోయే యువతి. తన ప్రేమికుడైన వీర పాండియన్ అనే పాండ్య దేశరాజును తన కళ్ల ముందే శిరచ్ఛేదనం చేసిన చోళ దేశం రాజు ఆదిత్య కరికాలన్‌పై ప్రతీకారం తీర్చుకుని ఆ దేశాన్ని నాశనం చేయడానికి కుట్రపన్నే రాణిగా నటిస్తోంది. పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించినప్పుడే మణిరత్నం నందిని పాత్రకు ఐశ్వర్యారాయ్‌ని ఫిక్స్ అయ్యారట. -
అందాల ఐశ్వర్యను అలాంటి పాత్రలో ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?
తమిళసినిమా: అందం, అభినయానికి మారు పేరు నటి ఐశ్వర్యారాయ్. కథానాయికగా హిందీ, తెలుగు, తమిళం వంటి భాషా చిత్రాల్లో నటించి మేటి నటిగా పేరు తెచ్చుకున్నారు. దర్శకుడు మణిరత్నం కోలీవుడ్‌కు పరిచయం చేసిన నటి ఐశ్వర్యారాయ్ అన్న విషయం తెలిసిందే. ఆమె మణిరత్నంను గురువుగా భావిస్తారు. కాగా కథానాయకిగా పరిచయం చేసిన ఆయనే ఐశ్వర్యారాయ్‌ను ఇప్పుడు ప్రతినాయకిగా చూపిస్తూ ఆమెలోని నటిని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తాజా సమాచారం. మణిరత్నం ఏ చిత్రాన్ని చేసినా దాంట్లో ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. అలా తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్ సెల్వన్. ఇందులో విక్రమ్, కార్తీ, జయంరవి, జయరాం, ఐశ్వర్యారాయ్, త్రిష వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్నారు. మణిరత్నం మద్రాస్ టాకీస్ సంస్థ, లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం, రవివర్మ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం తొలి భాగాన్ని సెప్టెంబర్ 30వ తేదీన తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇందులో నటి ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు, అందులో ఒకటి ప్రతినాయిక పాత్ర అని తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పొన్నియన్ సెల్వన్ చిత్రంపై అంచనాలు, ఆసక్తి మరింత పెరుగుతున్నాయి. -
మరోసారి తల్లికాబోతున్న ఐశ్వర్య?.. వీడియో వైరల్
అందాల తార ఐశ్వర్యరాయ్ మరోసారి గర్భవతి అయ్యిందా? అంటూ కొద్ది రోజులుగా బి-టౌన్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గతంలోనూ ఐష్ రెండోసారి తల్లికాబోతుందంటూ వార్తలు వచ్చినా ఈసారి మాత్రం కాస్తా గట్టిగానే వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఇటీవల విమానాశ్రయంలో కనిపించిన ఐశ్వర్య వీడియోనే. ముంబై విమానాశ్రయంలో భర్త అభిషేక్ బచ్చన్, కూతరు ఆరాధ్యలతో కలిసి ఐశ్వర్య దర్శనం ఇచ్చింది. చదవండి: నటికి షాకిచ్చిన కొత్త బాయ్‌ఫ్రెండ్, 2 గంటల పాటు ఎయిర్ పోర్టులోనే.. ఇందులో ఐష్ కాస్తా బొద్దుగా, పొట్ట భాగంగా ముందుకు ఉన్నట్లుగా అనిపించింది. అంతేకాదు ఈ వీడియోలో ఆమె తన పొట్టను దాచే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా కనిపించడంతో అందరూ ఆమె ప్రెగ్నెంట్ అని ఫిక్స్ అయిపోయారు. దీంతో తాను మరోసారి గర్భవతి అయ్యిందని, అందుకే పొట్ట భాగాన్ని కవర్ చేసుకుంటుందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పొరపాటు పడ్డ ఈ సారి మాత్రం ఐష్ నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యిందంటూ ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. ‘బచ్చన్ ఫ్యామిలీ బుల్లి వారసుడు రావాలని, ఆరాధ్య పాపకు తమ్ముడు వస్తున్నాడు’ అంటూ ఆ వీడియోకు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తన ప్రెగ్నెన్సీ రూమర్లపై ఐష్ స్పందించకపోవడం గమనార్హం. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే బచ్చన్ ఫ్యామిలీ స్పందించేవరకు వేచి చూడక తప్పదు. కాగా 2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌లకు వివాహం కాగా.. 2011 నవంబర్ 16న వీరికి ఆరాధ్య జన్మించింది. Is Aishwarya Rai Bachchan pregnant? Viral videos, pictures spark speculations Read @ANI Story | https://t.co/jeCE6Ilkqi#AishwaryaRai #AishwaryaRaiBachachanPregnant #AbhishekBachchan #Bollywood pic.twitter.com/Lzf58ir3qE — ANI Digital (@ani_digital) July 20, 2022 -
Beauty Tips: నాలుగైదు పూటలు తింటా.. ఇంకా.. నా బ్యూటీ సీక్రెట్ అదే!
అందానికే అసూయ పుట్టించే అందం ఐశ్వర్యా రాయ్ సొంతం. పెళ్లై, ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా 48 ఏళ్ల ఐష్ తన అందాన్ని కాపాడుకుంటోంది. రోజురోజుకీ ఆమె అందం ద్విగుణీకృతం అవుతోందనడంలో సందేహం లేదు. కాగా మంగళూరులో జన్మించిన ఐశ్వర్య 1994లో ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న విషయం తెలిసిందే. ఓ తరానికి ఆరాధ్య హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఐశ్వర్యారాయ్ బచ్చన్ బ్యూటీ సీక్రెట్ గురించి ఆమె మాటల్లోనే! ‘‘నాకు జెనెటికల్‌గా అందిన వరం.. మంచి స్కిన్. దాన్ని కాపాడుకోవడానికి వంశపారంపర్యంగా అందిన సంపద .. అద్భుతమైన చిట్కాలు. అవీ హైరానా పడకుండా పాటించే సింపుల్ సూత్రాలు. ఏం లేదు.. వేయించిన, మసాలా కూరలకు చాలా దూరం నేను. ఆవిరి మీద ఉడికించిన తాజా కూరగాయలను తింటాను. రైస్ విషయానికి వస్తే బ్రౌన్ రైస్ తీసుకుంటా. మూడు పూటలు కడుపు నిండుగా తినకుండా కొంచెం కొంచెంగా నాలుగైదు పూటలు తింటాను. మంచి నీళ్లు బాగా తాగుతాను. మా అమ్మ ఇవే పాటిస్తుంది. నేనూ అదే ఫాలో అవుతున్నాను.. చిన్నప్పటి నుంచీ’’. - ఐశ్వర్య రాయ్ బచ్చన్ చదవండి: Mint Paste Face Pack: పుదీనా పొడి, ముల్తానీ మట్టి, రోజ్ వాటర్.. మొటిమలు మాయం! -
అంత లావైందేంటి? ఐశ్వర్యరాయ్ ప్రెగ్నెంటా?
ఇరవై ఏళ్లుగా కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటోంది ఐశ్వర్యరాయ్. ఇన్నేళ్లలో ఒకటీరెండు సార్లు మినహా ప్రతిసారి ఐష్ లుక్‌తో అదరగొట్టింది. ఈ సారి రంగురంగుల పువ్వులతో డిజైన్ చేసిన నలుపు రంగు పొడవాటి గౌనులో రెడ్ కార్పెడ్పై మెరిసిందామె. ఆమెను అలా చూసిన ఫ్యాన్స్ బ్యూటిఫుల్, దేవత అని కీర్తించారు. కానీ కొందరు మాత్రం ఎప్పటిలాగే ఆమెను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. 'డ్రెస్‌లో ఐశ్వర్యరాయ్ చాలా బాగుంటుంది. కానీ ఈ సారి ఎందుకో కొంత లావైనట్లు కనిపిస్తోంది. బహుశా గర్భం దాల్చడం వల్లో లేదంటే వయసు మీద పడటం వల్లో బొద్దుగా మారినట్లుంది' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 'మరీ అతిగా ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుని అందాన్ని నాశనం చేసుకున్నావ్', 'ముసలామెవైపోయావు, నీకింక తల్లి పాత్రలు మాత్రమే వస్తాయి', 'సడన్‌గా ఇంత లావైపోయిందేంటి?' అని మరికొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెను హేళన చేస్తున్నారు. కాగా కాన్స్ ఫెస్టివల్లో తళుక్కుమని మెరిసిన ఐశ్వర్య ఆదివారం నాడు భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యతో కలిసి ముంబైకి తిరిగి వచ్చేసింది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) చదవండి 👇 నటితో ఎఫైర్ పెట్టుకో, ఫేమస్ చేస్తామన్నారు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ ఎన్ని లక్షలు గెలుచుకుందో తెలుసా? -
కాన్స్ చిత్రోత్సవాల్లో ఐశ్వర్యరాయ్.. బ్యూటిఫుల్, దేవత అంటూ ప్రశంసలు
రంగు రంగుల పువ్వులతో డిజైన్ చేసిన నలుపు రంగు పొడవాటి గౌనులో ఐశ్వర్యా రాయ్ కాన్స్ రెడ్ కార్పెట్‌పై మెరిశారు. 20 ఏళ్లుగా ఈ బ్యూటీ కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఇన్నేళ్లల్లో ఒకటీ రెండు సార్లు మినహా ఐష్ ప్రతి లుక్ ఆకట్టుకుంది. ఈసారి కూడా ఆమె లుక్‌కి ప్రశంసలు లభించాయి. ‘ఆల్ టైమ్ క్వీన్, బ్యూటిఫుల్, దేవత, అదుర్స్..’ ఇలా ఐష్ లుక్‌ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్యతో కలిసి ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు ఐశ్వర్య. ఈ ఉత్సవాల్లో తన స్నేహితురాలు, హాలీవుడ్ స్టార్ ఇవా లంగోరియాని కలిశారు ఐష్. ఆరాధ్యను ఇవా హత్తుకోగా, ఇవా కుమారుడు శాంటిగోని ఉద్దేశించి ‘హ్యాండ్సమ్’ అన్నారు ఐశ్వర్యా రాయ్. ‘‘నా ఆల్‌టైమ్ ఫేవరెట్ పర్సన్’’ అంటూ ఐశ్వర్యతో తాను దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇవా లంగోరియా. ఈ నెల 17న ఆరంభమైన కాన్స్ చలన చిత్రోత్సవాలు 28 వరకూ జరుగుతాయి. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) చదవండి 👇 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పెద్ద సినిమాలు, అవేంటంటే? ఎన్టీఆర్ అభిమానులపై హైదరాబాద్ పోలీసులు లాఠీచార్జ్ -
2021లో వివాదాల్లో చిక్కుకున్న బాలీవుడ్ తారలు వీరే..
Top 6 Bollywood Celebrities Who Landed In Trouble: 2021 సంవత్సరం ఇంకో 10 రోజుల్లో ముగియనుంది. ఈ ఏడాది బాలీవుడ్ తారలు తమ చిత్రాలతో కనులవిందు చేశారు. అలాగే కొంతమంది సెలబ్రిటీలు పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచారు. కొందరైతే ఏకంగా అరెస్టయి కొన్ని రోజులు జైలులో గడపవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. వారిలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నుంచి నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా వరకు ఉన్నారు. ఇలా ఈ ఏడు వివిధ రకాల సంఘటనలతో బీటౌన్ ఆసక్తికరంగా మారింది. 2021లో పలు వివాదాల్లో చిక్కుకుని కష్టాలు కొనితెచ్చుకున్న బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరెవరో చూద్దాం. 1. ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కస్టడికీ వెళ్లడంతో బీటౌన్ షాక్ అయింది. క్రూయిజ్ షిప్లో జరిగిన పార్టీలో ఎన్సీబీ (NCB) డ్రగ్ రైడ్ తర్వాత ఈ స్టార్ కిడ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. అక్టోబర్ 2న జరిగిన ఈ దాడిలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అనంతరం ఆర్యన్‌ను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. సుమారు 20 రోజులు జైలులో గడిపిన తర్వాత ఈ స్టార్ కిడ్‌కు బెయిల్ మంజూరైంది. 2. రాజ్ కుంద్రా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను రూపొందించి మొబైల్ యాప్స్ ద్వారా ప్రచురించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ కేసు విషయంలో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. 'అశ్లీల చిత్రాలను రూపొందించడం, వాటిని కొన్ని యాప్‌లు ద్వారా ప్రచురించడంపై ఫిబ్రవరి 2021లో కేసు నమోదైంది. ఈ కేసులో రాజ్‌కుంద్రా ప్రధాన సూత్రధారిగా కనిపిస్తున్నందున జూలై 19, 2021న అరెస్టు చేశాము. దీనికి తగిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. దర్యాప్తు కొనసాగుతోంది.' అని ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన సీపీ ప్రకటించారు. సుమారు రెండు నెలలపాటు పోలీసు కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రాకు సెప్టెంబర్‌లో బెయిల్ వచ్చింది. అలాగే ఓ వ్యాపారిని మోసం చేసిన కేసులో శిల్పా శెట్టి కూడా ఆరోపణలు ఎదుర్కొంది. 3. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ కేసులో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు వినిపించడంతో ఆమె వార్తల్లో నిలిచింది. ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సమన్లు జారీ చేసిన ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. అయితే, రూ.10కోట్ల విలువైన బహుమతులు సుకేష్ నుంచి తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంది జాక్వెలిన్. సుకేష్ చంద్రశేఖర్ నుంచి పలు ఖరీదైన బహుమతులు పొందినట్లు హాట్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. 4. అనన్య పాండే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణలో బాగంగా లైగర్ బ్యూటీ అనన్య పాండేకు ఎన్సీబీ (NCB) సమన్లు జారీ చేసింది. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్స్‌లో తన పేరు బయటకు రావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది అనన్య. ఆర్యన్ ఖాన్‌కు, ఒక డెబ్యూ హీరోయిన్ మధ్య ఉన్న వాట్సాప్ చాట్‌ను కనిపెట్టినట్లు ఎన్సీబీ వారి ప్రకటనలో తెలిపింది. అయితే ఆ సమయంలో ముందుగా ఆ పేరును ఎన్సీబీ వెల్లడించలేదు. 5. కంగనా రనౌత్ ఎప్పుడూ ఆసక్తికర, విదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది కంగనా రనౌత్. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగన పర్హాన్ అక్తర్‌కు పరువుకు నష్టం కలిగించే రీతిలో మాట్లాడిందని పర్హాన్ తండ్రి జావేద్ అక్తర్ పరువు నష్టం కేసు దాఖలు చేశాడు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ కంగనా బాంబే హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం తిరస్కరించింది. అలాగే కోర్టు ఫిబ్రవరిలో కంగనాను కోర్టుకు హాజరుకావలసిందిగా నోటీసు జారీ చేసింది. కంగనా చాలాసార్లు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్‌తో హెచ్చరించింది. 6. ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఐదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పనామా పేపర్స్’ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు. అనంతరం ఈడీ ఎదుట హాజరైన ఐశ్వర్యను సుమారు ఆరు గంటలపాటు పలు ప్రశ్నలు అడిగారు అధికారులు. ఈ సందర్భంగా అధికారులకు ఐశ్వర్య పలు డాక్యుమెంట్లను అందజేశారు. ఫారెన్ ఎక్సే్చంజ్ మేనేజ్మెంట్ (ఫెమా) చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై కొనసాగుతున్న కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఐశ్వర్య వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఈ పనామా పేపర్స్ లీక్ కేసుకు సంబంధించి బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌ను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇదీ చదవండి: ఐశ్వర్య రాయ్‌కు ఈడీ సమన్లు.. ఎందుకంటే ? -
పనామా పేపర్స్ కేసులో ఈడీ ముందుకు ఐశ్వర్యా రాయ్
న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పనామా పేపర్స్’ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. ఈడీ ఆదేశాల మేరకు సోమవారం ఆమె ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. ఫారెన్ ఎక్సే్చంజ్ మేనేజ్మెంట్ (ఫెమా) చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై కొనసాగుతున్న కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఐశ్వర్య వాంగ్మూలాన్ని తీసుకున్నారు. దాదాపు ఆరు గంటలపాటు ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా అధికారులకు ఐశ్వర్య పలు డాక్యుమెంట్లను అందజేశారు. విదేశాలకు నిధుల మళ్లింపునకు సబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ 2016–17 నుంచి దర్యాప్తు చేస్తోంది. 2004లో ఆర్బీఐ సరళీకరించిన విదేశీ పెట్టుబడుల పథకం(ఎల్ఆర్ఎస్), ఫెమా చట్టాలను ఉల్లంఘించి 2005లో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌లో ఆమె తల్లిదండ్రులతో కలసి అమిక్ పార్ట్నర్స్ సంస్థను నెలకొల్పారని, దీనిపై బచ్చన్ కుటుంబం వివరణ ఇవ్వాలని ఈడీ గతంలోనే నోటీసులిచ్చింది. ఈ విషయంలో ఐశ్వర్యకు సమన్లు జారీచేయగా తనకు మరికొంత సమయం కావాలని ఆమె గతంలో రెండుసార్లు విన్నవించుకున్నారు. సోమవారం ఐశ్వర్యను ఈడీ అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. పన్నుల బాదరబందీలేని, పెట్టుబడులకు స్వర్గధామంగా భావించే బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో అనేక దేశాలకు చెందిన సంపన్నులు, నేతలు, సెలబ్రిటీలు రహస్య పెట్టుబడులు పెట్టారని, తద్వారా సొంత దేశాలకు భారీ స్థాయిలో పన్నులు ఎగ్గొట్టారని గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. పనామాకు చెందిన ఆర్థిక, కార్పోరేట్ సేవల సంస్థ మొసాక్ ఫోన్సెకా ద్వారా వీరంతా పెట్టిన పెట్టుబడులు, ఎగ్గొట్టిన పన్నుల సమగ్ర వివరాలను వాషింగ్టన్కు చెందిన ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే).. పనామా పేపర్స్ పేరిట విడుదల చేసి ప్రకంపనలు సృష్టించిన సంగతి తెల్సిందే. దాదాపు 1.15 కోట్ల డాక్యుమెంట్లతో 2016 ఏడాదిలో వెలుగుచూసిన ఈ ఉదంతంలో భారతీయులకు చెందిన 426 ఆర్థిక ఉల్లంఘనల కేసులూ బయటపడ్డాయి. వాటిలో ఐశ్వర్య డైరెక్టర్‌గా ఉన్న సంస్థా ఉంది. 2009లో ఐశ్వర్య ఆ సంస్థ నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో ఆమె మామ అమితాబ్ బచ్చన్‌నూ ఈడీ ప్రశ్నించింది. పెట్టుబడులన్నీ భారతీయ చట్టాలకు లోబడే జరిగాయని ఆయన గతంలో వివరణ ఇచ్చారు. మీకు గడ్డుకాలం మొదలవుతుంది రాజ్యసభలో బీజేపీ ఎంపీలకు జయా బచ్చన్ శాపం సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయా బచ్చన్, బీజేపీ సభ్యులకు మధ్య సోమవారం రాజ్యసభలో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఎన్డీపీఎస్ (సవరణ) బిల్లుపై జయ మాట్లాడుతూ... 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ అంశాన్ని లేవనెత్తారు. సభాపతి స్థానంలో ఉన్న భువనేశ్వర్ కలితా కూడా గతంలో వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపిన వారేనన్నారు. దీంతో బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా తనపై వ్యక్తిగత కామెంట్లు చేశారని జయ ఆరోపించారు. ఒకదశలో సహనం కోల్పోయిన ఆమె బీజేపీ ఎంపీలను ఉద్దేశిస్తూ ‘మీకు త్వరలోనే గడ్డుకాలం మొదలవుతుంది. ఇదే నా శాపం’ అని ఆగ్రహించారు. కోడలు ఐశ్వర్య ఈడీ విచారణకు హాజరైన రోజే.. ఇది చోటుచేసుకోవడం గమనార్హం. ‘సభలో నాపై వ్యక్తిగత కామెంట్లు చేశారు. నా పైనా, నా కెరీర్ పైనా వ్యాఖ్యలు చేశారు. ఇది దురదృష్టకరం. వారలా మాట్లాడాల్సింది కాదు. మీరు సదరు సభ్యుడిపై చర్యలు తీసుకోవాలి. సభాపతి స్థానంలో కూర్చున్నారు కాబట్టి మీరు ఏ పార్టీకి చెందిన వారు కాదు సార్. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి’ అని భువనేశ్వర్ కలితాను ఉద్దేశించి జయాబచ్చన్ అన్నారు. తర్వాత కూడా అధికార, విపక్షాలకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడంతో రాజ్యసభ వాయిదా పడింది. వీటికి మీ సమాధానమేంటి ? 1. 2005లో అమిక్ పార్ట్నర్స్ పేరిట నెలకొల్పిన కంపెనీతో మీకున్న సంబంధాలేంటి? 2. కంపెనీ తొలినాళ్లలో మీరు, మీ తండ్రి కె.రమణ కృష్ణ రాయ్, తల్లి కవిత, సోదరుడు ఆదిత్య తలా 12,500 డాలర్లు మొత్తంగా 50వేల డాలర్ల ప్రారంభ పెట్టుబడులు పెట్టారు. ఆ కంపెనీకి డైరెక్టర్‌గా ఎందుకున్నారు? 3. 2005 జూన్‌లో డైరెక్టర్ నుంచి షేర్‌హోల్డర్‌గా ఎందుకు మారారు? 4. 2008 నుంచి సంస్థ ఎందుకు క్రియాశీలకంగా లేదు? 5. ఆర్థిక లావాదేవీలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుమతుల వివరాలు చెప్పండి? 6. మీ సంస్థను మొసాక్ ఫోన్సెకాయే రిజిస్టర్ చేసిందని మీకు తెలుసా? -
చుట్కీ నడక చూడండి.. 'సెలబ్రిటీ కిడ్' వీడియో వైరల్
సినీ సెలబ్రిటీలు ఏం చేసిన నెటిజన్స్ ఓ కంట కనిపెడుతూ ఉంటారు. వారు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం తింటున్నారు? అంటూ వెతుకుతారు. వారిని ఎంకరేజ్ చేయడానికి అన్నట్లుగా సోషల్ మీడియా ఎలాగు ఉంది. సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీల ప్రవర్తన, విధానం, వేషధారణ కొంచెం భిన్నంగా కనిపించిన తమదైనా రీతిలో ఆడేసుకుంటున్నారు. సెలబ్రిటీలే కాకుండా వారి పిల్లలపై కూడా ఇలాగే స్పందిస్తారు నెటిజన్లు. తాజాగా బాలీవుడ్ దివా ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య నడకపై నెటిజన్స్ తమదైన శైలిలో ట్రోలింగ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఇటీవల అభిషేక్, ఐశ్వర్య బచ్చన్ దంపతుల కుమార్తె ఆరాధ్య 10వ పుట్టినరోజును మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన కూతురుతో కలిసి ముంబైకి తరిగివచ్చారు. వారు తిరిగివచ్చిన తర్వాత కొన్ని రోజులకు తన తల్లితో కలిసి నడుస్తున్న చిన్నారి ఆరాధ్య వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అంతే, నెటిజన్ల దృష్టి చిన్నారి నడకపై పడ్డాయి. ఆరాధ్య క్యాట్ వాక్‌పై ఓ నెటిజన్ 'చుట్కీ నడక చూడండి' అని నవ్వుతున్న ఎమోజీస్ పెట్టింది. 'ఆమె నడకకు ఏమైంది??' అని మరొకరు కామెంట్ పెట్టారు. ఇదిలా ఉంటే మరోవైపు, 'తనకు 10 ఏళ్లు మాత్రమే. కొంచెం దయచూపండి' అని ఒక యూజర్ స్పందించారు. 'ఆమెను ఎగతాళి చేయడంతో మనం ఎంత దిగజారిపోయామో తెలుస్తోంది' అని ఇంకొకరు ఆరాధ్యవైపు నిలబడ్డారు. చదవండి: ఆరాధ్య పదో బర్త్‌డే.. మాల్దీవుల్లో బచ్చన్ ఫ్యామిలీ చిల్లింగ్ -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - ఐశ్వర్య రాయ్
-
ఐశ్వర్య రాయ్ బచ్చన్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
ఐశ్వర్య రాయ్‌కు నవ్వు తెప్పించే సెంటిమెంట్ ఏంటంటే?
సాక్షి, హైదరాబాద్: అందం అంటే ఐశ్వర్యరాయ్. ఇన్ని పూల రెక్కలు. కొన్ని తేనె చుక్కలు రంగరించిన సొగసు ఐష్. అసలు ఐశ్వర్యరాయ్ లేకుండా బ్యూటీ అనే పదం చిన్నబోదూ. వయసు హాఫ్ సెంచరీకి దగ్గర పడుతున్నా ఆమింకా అందాల ఐశ్వర్యమే. మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుని సంవత్సరాలు గడుస్తున్నా వన్నె చెదరని శిల్పం. అందం, అభినయం కలగలసిన ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌కి హ్యపీ బర్తడే అంటోంది. సాక్షి. కామ్. చక్కటిరూపం, అభినయంతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపందించుకున్న అందమైన నటి ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యకంగా చెప్సాల్సిన అవసరం లేదు. తనదైన స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని, బాలీవుడ్లోనే కాకుండా ఇతర భాషా చిత్రల్లో కూడా వీరాభిమానులను సొంతం చేసుకుంది. 1973 నవంబర్ 1న, కృష్ణరాజ్ రాయ్ బృందారాయ్ దంపతులకు మంగళూరులో జన్మించిన ఐశ్వర్య రాయ్ 48వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువ కురుస్తోంది. మరోవైపు తనకున్న ఒక చిలిపి సెంటిమెంట్‌ను గురించి గతంలో సరదాగా ప్రస్తావించింది ఐశ్వర్య. మిస్ ఇండియా పోటీలకెళ్లేటపుడు వర్షం పడిందట. అలాగే తన డ్రెస్ జిప్ ఫెయిల్ అయిందట. దీంతో ఆమె డిజైనర్ చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. మిస్ వరల్డ్ పోటీలపుడు కూడా అచ్చం ఇలాగే జరిగిందంటూ గుర్తు చేసుకుంది. విమాన ప్రయాణంలో అనుకోకుండా తన ఫ్రాక్ జిప్ ఫెయిల్ అయిందనీ, వర్షం కూడా పడిందని చెప్పుకొచ్చింది. ఇది యాదృచ్ఛికం, బ్లైండ్ బిలీఫ్ అయినా ఈ విషయం గుర్తొస్తే.. ఇప్పటికీ నవ్వొస్తుంది అని ఐష్ తన పాతజ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. -
Aishwarya Rai Bachchan Birthday Speical: తన పిచ్చి సెంటిమెంట్‌పై ఐశ్వర్య కామెంట్స్
-
ఐశ్వర్యరాయ్ బాటలో నయనతార వివాహం!
గత కొన్నేళ్లుగా హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరి జంట వార్తల్లో నిలుస్తూ అభిమానులకు కనువిందు చేస్తూనే ఉంది. తాజాగా ఈ జంట షిర్డీతో పాటు పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అంతేకాదు తమ జాతకంలో దోషాల నివారణకై పలు పూజలు, హోమాలు కూడా నిర్వహించారు. నయనతార జాతకంలో చిన్నపాటి దోషం ఉన్నట్టు పండితులు చెబుతున్నారు. దోష నివారణకు నయనతార ముందుగా ఓ చెట్టును పెళ్లాడిన తర్వాత విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 2022వ సంవత్సరం ప్రథమార్థంలో వీరి పెళ్లి జరగడం ఖాయం అంటున్నారు కొంత మంది సన్నిహితులు. నయనతార, విఘ్నేష్ శివన్‌కు ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోనున్నట్టు సమాచారం. పెళ్లికి ముహూర్తాన్ని తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే వీరి పెళ్లికి ఇరువురికి చెందిన కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది సినీ పరిశ్రమకు చెందిన సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందినట్టు సమాచారం. గతంలో ఐశ్యర్య రాయ్ కూడా తన జాతక దోష నివారణకై ఓ చెట్టును పెళ్లాడిన తర్వాత అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అదే కోవలో ఇప్పుడు నయనతార కూడా ముందుగా ఓ చెట్టును పెళ్లాడిన తర్వాత విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకోనుంది. -
పొన్నియిన్ సెల్వన్: తొలి భాగం షూటింగ్ పూర్తి, విడుదల ఎప్పుడంటే..
స్టార్ డెరెక్టర్ మణిరత్నం దర్శకతంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ ‘పొన్నియిన్ సెల్వన్’ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఆమె యువరాణి నందిని పాత్ర పోషిస్తోంది. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్‌ను ఆదివారం (సెప్టెంబర్ 19న) ఆమె సోషల్ మీడియాలో విడుదల చేసింది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మొదటి పార్ట్ ‘పీఎస్1’ పూర్తయినట్లు, సమ్మర్ కానుకగా 2022లో విడుదల కానున్నట్లు పోస్టర్లో మూవీ టీం వెల్లడించింది. విక్రమ్, కార్తీ, త్రిష, ‘జయం’ రవి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. కల్కి కృష్ణమూర్తి నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా, గతనెల పీఎస్1 సెట్స్ నుంచి ఐశ్వర్య ఫోటో ఒకటి బయటికి వచ్చి వైరల్ అయింది. అందులో ఆమె బంగారు రంగు చీర, భారీ ఆభరణాలతో ఉంది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
అభిషేక్ బచ్చన్ లగ్జరీ అపార్ట్మెంట్ అమ్మకం.. ధర ఎంతంటే?
ముంబై: అభిషేక్ బచ్చన్ ముంబైలోని ఒబెరాయ్ 360 పడమరలో ఉన్న తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించాడు. దీని అమ్మకం ద్వారా ఆయనకు రూ. 45.75 కోట్లు వచ్చాయి. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం.. ముంబైలోని వర్లి ప్రాంతంలో ఒబెరాయ్ 360 అపార్టుమెంట్ పడమరలో ఉన్న 37వ అంతస్తులో 7,527 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. అభిషేక్ బచ్చన్ ఈ ఇంటిని 2014లో రూ. 41 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా అదే బిల్డింగ్‌లో షాహిద్ తన అపార్ట్మెంట్ కోసం రూ. 56 కోట్లు చెల్లించగా, అక్షయ్ రూ.52.5 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. అంతే కాకుండా రాణి ముఖర్జీ, దిశా పటానీ ఖార్ వెస్ట్ పరిసరాల్లో సముద్ర ముఖంగా ఉన్న గృహాలను కొనుగోలు చేశారు. రాణి ముఖర్జీ దీనికోసం రూ.7.12 కోట్లు ఖర్చు చేయగా.. దిశా పటానీ రూ.5.95 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక అభిషేక్ చివరిసారిగా ది బిగ్ బుల్లో కనిపించాడు. ఇది వివాదాస్పద స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా. అయితే ఈ సినిమా హన్సల్ మెహతా హిట్ సిరీస్‌తో పోల్చితే బాగా ఆడలేదనే చెప్పాలి. ఆయన తదుపరి రెండు చిత్రాలు నిమ్రత్ కౌర్‌తో దాస్వి, చిత్రాంగద సేన్‌తో బాబ్ బిశ్వాస్ సిమాలు విడుదల కావాల్సి ఉంది. అంతేకాకుండా ఐశ్వర్య చివరిసారిగా అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావుతో కలిసి ఫన్నీ ఖాన్ సినిమాలో కనిపించింది. ఆమె తదుపరి ప్రాజెక్ట్ మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం కల్కి కృష్ణమూర్తి తమిళ నవల ఆధారంగా తెరకెక్కనున్న పీరియడ్ ఇతిహాసం. -
మరో ఐశ్వర్య దొరికిందోచ్!
ఈ సువిశాల ప్రపంచంలో ఒక మనిషిని పోలిన వారు ఏడుగురు ఉంటారు అని చాలామంది నమ్ముతారు. ఏడుగురికి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ చూడటానికి ఒకేలా ఉండేవారు అక్కడక్కడా కనిపిస్తుండడం విశేషం. అయితే బాగా పాపులర్ అయిన సెలబ్రెటీలను పోలిన వారు ఎందరో మనకు సోషల్ మీడియాలో తారసపడుతుంటారు. తాజాగా ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను పోలిన ఓ పాకిస్థాన్ అమ్మాయి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బ్యూటీ బ్లాగర్ అయిన ఆమ్నా ఇమ్రాన్ మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్లాగా పోలికలు ఉండడంతో.. అందరూ ఆమెను డూప్లికేట్ ఐశ్వర్య అంటున్నారు. బూడిదరంగులో ఉన్న పెద్ద కళ్లు, గులాబీ రేకుల్లాంటి పెదాలుతో వైట్ షర్ట్ వేసుకుని అచ్చం ఐశ్వర్య రాయ్ చూసినట్లుగా కెమెరాకు పోజు ఇచ్చిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో ఆమె వైరల్‌గా మారింది. ఈ ఫోటో కింద ‘‘అల్లాముదల్లా ఎక్స్ ఏ మిలియన్, థ్యాంక్పుల్ ఫర్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీ సర్ప్రైజ్. థ్యాంక్యూ అల్లా’’ అని రాసింది. అంతేగాకుండా ఐశ్వర్య నటించిన సినిమాల్లోని క్యారెక్టర్ల హావభావాలతో ఆమ్నా కొన్ని వీడియోలు కూడా పోస్టు చేయడంతో నెటిజన్లు అంతా ఐశ్వర్య డూప్ అని తెగ వైరల్ చేస్తున్నారు. ఆమ్నా అందానికి సంబంధించిన బ్లాగ్ నడుపుతున్నారు. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 30 వేలమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయిలు రావడం ఇదేమీ తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా కొంతమంది అచ్చం ఐశ్వర్యలా కనిపించి వైరల్ అయ్యారు. ఇప్పుడు ఐశ్వర్య డూప్ వైరల్ అయినట్లే గతంలో షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మల డూప్‌లు వైరల్ అయ్యాయి. View this post on Instagram A post shared by Aamna Imran 🌹 (@aamna_imrann) -
ఎక్కడైనా నేర్చుకోవచ్చు: జాన్వీ
ఐశ్వరాయ్ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను హీరోయిన్ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన జాన్వీ డ్యాన్స్ స్కూలును మిస్ అవుతున్నానంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఐశ్వర్యరాయ్ నటించిన ‘ఉమ్రాన్ జాన్’ చిత్రంలోని ‘సలాం’ పాటకు జాన్వీ డ్యాన్స్ నేర్చుకుంటున్న వీడియోకు ‘క్లాస్ రూంను మిస్సవుతున్నా’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. (వైరల్.. వేదికపై డ్యాన్స్ చేసిన జాన్వి) View this post on Instagram #missing the class room. But anywhere and everywhere can be a classroom no? 🌈 A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Apr 12, 2020 at 7:53am PDT అయినా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలంటే తరగతి గదే ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా, ఎప్పుడైనా డ్యాన్స్ నేర్చుకోవచ్చు. నేను ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియో చూసిన బాలీవుడ్ ప్రముఖులు జాన్వీపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడు శరణ్ శర్మ ‘లైవ్ కథక్ డ్యాన్స్ సెషన్‌ను కూడా త్వరలో నిర్వహించాలి’ అని కామెంట్ చేశాడు. అంతేగాక నటుడు ఆకాన్ష్ రంజన్ కూడా ‘చాలా అందంగా ఉంది’ అని, ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా హర్ట్ ఎమోజీతో ఆయన స్పందనను తెలిపారు. (లాక్డౌన్: 1,270 వాహనాలు సీజ్) -
‘తన మాటలకు గర్వంగా ఉంది’
ముంబై: అభిషేక్ బచ్చన్, ఐశర్యారాయ్‌ల గారాలపట్టి ఆరాధ్యకు స్టార్ కిడ్‌గా ప్రత్యేక అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆరాధ్య ఎరుపు, పచ్చని రంగులతో ఉన్న చీరను ధరించి తాను చదివే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలో సందడి చేసింది. ఆరాధ్య ఈ వేడుకల్లో మహిళ సాధికారత, గొప్పతనం గురించి ముద్దుముద్దుగా మాట్లాడింది. దీనికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే తన మనమరాలు ఆరాధ్య మాట్లాడిన వీడియోను అమితాబ్ బచ్చన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఆరాధ్య మహిళల గొప్పతనం, సాధికారతపై మాట్లాడటం చాలా గర్వించదగిన విషయం’ అని బిగ్ బీ కామెంట్ చేశారు. మహిళల గురించి ఆరాధ్య మాట్లాడిన మాటలకు బిగ్‌బీ ఆనందంతో పొంగిపోయారు. the proudest moment and voice .. of the girl child .. of Aaradhya , my own .. https://t.co/Gsa9gBIgBA — Amitabh Bachchan (@SrBachchan) December 22, 2019 ఈ వేడుకలో అభిషేక్ బచ్చన్, ఐశర్యారాయ్లతోపాటు స్టార్ కిడ్స్ తల్లిదండ్రులు.. షారుక్‌ఖాన్, కరిష్మా కపూర్, లారాదత్తా తదితరులు పాల్గొన్నారు. స్టార్స్ కిడ్స్ చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీరంతా తిలకించారు. ఈ వేడుకలకు అమితాబ్ బచ్చన్ హాజరు కాలేకపోయారు. బిగ్ బీ తాజాగా నాగరాజ్ మంజులే చిత్ర షూటింగ్లో ఉన్నారు. పాఠశాల వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీడియో కనెక్షన్ ద్వారా అమితాబ్ ఆరాధ్య మాట్లాడిన వీడియోను తిలకించారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ ఐశ్వర్య రాయ్
-
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు, ఇంట్రస్టింగ్ అప్డేట్?
సాక్షి, ముంబై: ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న 'పొన్నియిన్ సెల్వన్' చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా చెబుతున్నఈ సినిమాలో నటించే దిగ్గజాలపై ఇప్పటికే పలు అంచనాలు అభిమానుల్లో హల్చల్ చేస్తున్నాయి. తాజా సంచలనం ఏమిటంటే హిస్టారికల్ వార్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ద్విపాత్రాభినయం చేయనున్నారట. దక్షిణాది సూపర్స్టార్లు లీడ్ రోల్స్ పోషించనున్న 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో ఐశ్యర్య తల్లీ కూతుళ్లుగా రెండు కీలక పాత్రల్లో అలరించనున్నారు. చోళరాజు పెరియా పజువేట్టరయ్యర్ భార్య నందిని, నందిని తల్లి మందాకిని దేవీ పాత్రలకు మణిరత్నం ఐషును ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. జీన్స్ సినిమాలో కవల అక్కా చెల్లెళ్లుగా ఆకట్టుకున్న ఐశ్యర్య ఈసారి తల్లీ కూతుళ్లుగా ఆకట్టుకోనున్నారన్నమాట. కార్తీ, విక్రమ్, మోహన్ బాబు, కీర్తి సురేష్ ఇప్పటికే ఈసినిమాలో ప్రధాన పాత్రలు పోషించనున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న పొన్నియన్ సెల్వన్ సినిమాని మద్రాస్ టాకీస్ అండ్ లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళంలో రాసిన కల్కి కృష్ణమూర్తి చారిత్రాత్మక నవల ఆధారంగా 'పొన్నియిన్ సెల్వన్' తెరకెక్కుతోంది. ఇది చోళ రాజు రాజరాజ చోళుని కథను చెబుతుంది. పాన్ ఇండియా ఆడియన్స్ టార్గెట్ గా రూపొందనున్న ఈ సినిమా నవంబరు నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ విషయంపై అధికారిక వివరాలను త్వరలోనే చిత్ర యూనిట్ వెల్లడించే అవకాశం ఉంది. చదవండి : అడవుల్లో వంద రోజులు! -
కేన్స్‌లో సందడి చేసిన ఐశ్వర్యరాయ్ బచ్చన్
-
ఆ ముగ్గురి హగ్.. నెటిజన్ల మనసు దోచుకుంది
సోషల్ మీడియాలో నిత్యం బాలీవుడ్ కపుల్స్ గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఐశ్వరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఆరాధ్యల హగ్ నెటిజన్ల మనసును దోచుకుంటోంది. మన సెలబ్రిటీలు ఏదో ఒక ఆట ఆడి వాటి వల్ల వచ్చిన డబ్బును చారిటీకి ఇస్తూ ఉంటారు. అలాగే బాలీవుడ్లో కూడా ఇలాంటి ఓ కార్యక్రమే ఇటీవల జరిగింది. ఓ స్వచ్చంద సంస్థ కోసం బాలీవుడ్ తారల్లో కొందరు ఫుట్‌బాల్ ఆడారు. ఈ ఆటలో అభిషేక్ బచ్చన్, ఆదిత్య రాయ్ కపూర్, ఇషాన్ ఖట్టర్, రణ్‌బీర్ కపూర్ లాంటి హీరోలు పాల్గొన్నారు. ఫుట్‌బాల్ ఆడుతుండగా.. మధ్యలో ఆరాధ్య తండ్రి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకోగా.. తనను పైకి ఎత్తుకునే సన్నివేశం.. ఆ వెనువెంటనే ఐశ్వరాయ్ కూడా రావడం ముగ్గురు కలిసి హగ్ చేసుకోవడం అందరి మనసుల్ని ఆకట్టుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఆ ముగ్గురి హగ్.. నెటిజన్ల మనసు దోచుకుంది
-
గోవాలో సెలబ్రేషన్స్
భార్య బర్త్‌డే పెట్టుకుని ఎవరైనా షూటింగ్‌తో బిజీ బిజీగా ఉంటారా? ఉండరు కదా. స్మాల్ బ్రేక్ ఇచ్చయినా సరే భార్య ముందు వాలిపోతారు. అదే చేశారు అభిషేక్ బచ్చన్. భార్య ఐశ్వర్యారాయ్ బర్త్ డే (గురువారం) సెలబ్రేషన్స్ కోసం అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ‘లైఫ్ ఇన్ ఏ మెట్రో’ సీక్వెల్ షూట్‌కు బ్రేక్ ఇచ్చి గోవాలో వాలిపోయారు అభిషేక్. అక్కడ ఐశ్వర్యారాయ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్నేహితులకు అదిరిపోయే పార్టీ కూడా ఇచ్చారట అభిషేక్. ‘‘హ్యాపీ బర్త్ డే వైఫ్. ఐలవ్యూ’’ అని ఆయన ఐశ్వర్యకు విషెశ్ చెప్పారు. తన బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఐశ్వర్య. 1994లో మిస్ వరల్డ్‌గా నిలిచిన ఐశ్వర్యారాయ్ అప్పుడు ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడూ అంతే అందంగా ఉన్నారని నెటిజన్లు ఆమెను ప్రశంసించారు. అన్నట్లు.. ఐశ్వర్య వయసు ఎంతో తెలుసా? 45లోకి అడుగుపెట్టారు. -
ఆ నటితో సినిమా చేయాలని ఉంది : విల్ స్మిత్
న్యూఢిల్లీ : హాలీవుడ్ ‘మోస్ట్ పవర్ఫుల్ యాక్టర్’ ఎవరూ అంటే ఠక్కున విల్ స్మిత్ అని చెప్పేస్తాం. నటుడిగా, నిర్మాతగా, కమెడియన్‌గా, గేయ రచయితగా స్మిత్ హాలీవుడ్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ నటుడికి, ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో సినిమా చేయాలని ఉందట. హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్‌లో నటుడు-మ్యూజిషియన్ ఫర్హాన్ అక్తర్‌తో మాట్లాడుతూ.. తన ఇష్టాన్ని విల్ స్మిత్ బయటికి చెప్పారు. దాదాపు 15 ఏళ్ల క్రిందట విల్ స్మిత్, ఐశ్వర్యను కలిశారట. ఆ సమయంలోనే ఇద్దరం కలిసి ఏదైనా చేద్దామని అనుకున్నమని, కానీ అది ఇప్పటి వరకు జరుగలేదని, బహుశా ఆమెతో కలిసి తాను సినిమా చేస్తానేమో అని తన మనసులోన మాటను బయటపెట్టారు. ఇలా ఐశ్వర్య రాయ్‌తో సినిమా చేయాలని ఉందనే ఇష్టాన్ని తెలియజేశారు. ఈ సమయంలోనే విల్ స్మిత్‌తో ఫర్హాన్ అక్తర్, భాంగ్రా స్టెపులను వేయించారు. విల్ స్మిత్‌తో సంభాషించడం చాలా సంతోషభరితంగా ఉందని, విత్ స్మిత్ వేసిన భాంగ్రా స్టెపుల వీడియోను ఫర్హాన్ అక్తర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మహమ్మద్ అలీ బయోపిక్‌లో విల్ స్మిత్, ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ‘ ఆన్‌స్క్రీన్‌లో బాక్సింగ్ ఛాంపియన్ క్యారెక్టర్లో నటించడం, నా కెరీర్లోనే ఎంతో నిర్మాణాత్మక సమయం. ఇది నన్ను పూర్తిగా మార్చేస్తుంది’ అని తెలిపారు. ఐయామ్ లెజెండ్, ఐ, రోబోట్, ఇండిపెండెన్స్ డే, మెన్ ఇన్ బ్లాక్ వంటి సినిమాల్లో విల్ స్మిత్ అద్భుతంగా నటించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. -
కంటతడి పెట్టిన ప్రపంచ మాజీ సుందరి!
-
కంటతడి పెట్టిన ఐశ్వర్యరాయ్!
ముంబై : ప్రపంచ మాజీ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కంటతడి పెట్టారు. ముంబైలో ఓ ఈవెంట్లో పాల్గొన్న ఐశ్వర్య, జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో చాలా ఉద్వేగానికి గురయ్యారు. జాతీయ గీతం పాడుతూనే, ఎంతో గర్వకారకంగా ఫీలై కంటతడి పెట్టేశారు. జాతీయ గీతం ఆలపన చివరిలో ఉబికి వస్తున్న తన కన్నీళ్లను ఎవరూ చూడకుండా తుడుచుకున్నారు. కానీ అప్పటికే ఐష్ పెట్టిన కన్నీళ్లు మీడియా కంట పడ్డాయి. ఐశ్వర్య కంటతడి పెట్టిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలో ఐసీఎం ఉమెన్ ఈవెంట్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాయ్ మాట్లాడుతూ... ఆధునిక కాల మహిళలకు, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామికవేత్తలకు ప్రాతినిధ్యం వహించేలా తనను ప్రధాన అతిథిగా ఆహ్వానించడం చాలా గర్వకారకంగా ఫీలవుతున్నట్టు తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించడానికి అత్యంత ప్రతిష్టాత్మక వేదికల్లో ఐసీఎం ఉమెన్ ఒకటి. ఈ ఈవెంట్లో షబానా అజ్మి, సోను నిగమ్, జుహి చావ్లా, రోనిత్ రాయ్‌లు కూడా పాల్గొన్నారు. -
స్త్రీలోక సంచారం
హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (త్రిపుల్ ఐటీ–హెచ్) లో మెషీన్ లెర్నింగ్ ల్యాబ్‌లో మాస్టర్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీజా కామిశెట్టి.. గూగుల్ ‘గెట్–ఎహెడ్’ ఇ.ఎం.ఇ.ఎ. (యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా రీజియన్లు) ప్రోగ్రామ్ని విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చారు. టెక్నాలజీ రంగంలో మహిళల నైపుణ్యాలకు పదును పెట్టేందుకు ఆగస్టు 7–9 తేదీలలో లండన్‌లో నిర్వహించిన ఈ ప్రోగ్రామ్‌కు ప్రపంచం మొత్తం మీద గూగుల్ 20 మందిని ఎంపిక చేయగా, భారతదేశం నుంచి శ్రీజ ఒక్కరికే ఈ అరుదైన అవకాశం లభించింది. కేంద్రంతో సంప్రదింపులు జరిపిన అనంతరం ‘నల్సా’ (నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ) రూపకల్పన చేసిన పరిహార పథకానికి అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే అక్టోబర్ 2 నుంచి అత్యాచార బాధితురాలికి రు.4 లక్షలు, సామూహిక అత్యాచార బాధితురాలికి రు. 5 లక్షలు తప్పనిసరిగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం తమ పరిహార నిధి నుండి అత్యాచార బాధితురాలికి అందిస్తున్న సహాయం పది వేల నుంచి (ఒడిశా), పది లక్షల వరకు (గోవా) ఉండగా, కొన్ని రాష్ట్రాల్లో అసలు పరిహారాన్ని చెల్లించే విధానమే లేకపోవడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దేశం మొత్తం మీద ఈ పథకం విధిగా అమలయ్యేలా చేయడం కోసం ‘నల్సా’ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని, ‘స్టేట్ లీగల్ సర్వీసెస్ అ«థారిటీ (ఎస్.ఎల్.ఎస్.ఎ) లతో సమన్వయం కలిగి ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ‘గూప్’ కంపెనీ వినూత్న ఉత్పత్తి ‘జేడ్ ఎగ్’.. ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని వస్తున్న ఫిర్యాదులకు పరిహారంగా ఆ కంపెనీ యజమాని, హాలీవుడ్ నటి, బిజినెస్ ఉమన్, లైఫ్‌స్టెయిల్ గురు, సింగర్, ఫుడ్ రైటర్ అయిన 45 ఏళ్ల గ్వినెఫ్ పాల్ట్రో కోటీ నాలుగు లక్షల రూపాయలు (1,45,000 డాలర్లు) చెల్లించేందుకు అంగీకరించారు. జేడ్ ఎగ్‌ను స్త్రీలు తమ జననాంగంలో చొప్పించుకోవడం ద్వారా అపరిమిత లైంగికశక్తిని, లైంగికేచ్ఛను పొందవచ్చని ‘గూప్’ కంపెనీ చేసిన ప్రచారాన్ని నమ్మి, వాటిని ఉపయోగించిన మహిళలు వాటి వల్ల తమకు ఆశించిన ప్రయోజనం చేకూరలేదని ఫిర్యాదు చేయడంతో కాలిఫోర్నియాలోని కోర్టు గ్వినెఫ్ పాల్ట్రోను పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇండోనేషియాలోని అచ్ ప్రావిన్స్ పరిధిలోని రెస్టారెంట్లు, హోటళ్లలో భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు అయితే తప్ప ఒక ఆడ, ఒక మగ కలిసి భోజనం చేయకూడదని ప్రభుత్వం తాజాగా నిషేధాజ్ఞలు విధించింది. ప్రస్తుతానికి అచ్‌లోని బిరుయన్ జిల్లాకు మాత్రమే పరిమితమైన ఈ నిషేధం ప్రకారం స్త్రీ తన భోజనాన్ని పురుషుడితో పంచుకోవడం కూడా జరిమానాకు దారి తీసే నేరం కాగా.. ఈ విధమైన నియంత్రణ వల్ల బహిరంగ ప్రదేశాలలో స్త్రీ, పురుషులు సభ్యతగా ఉంటారని, స్త్రీలు మరింత సౌకర్యవంతంగా ఉండగలుగుతారని స్థానిక షరియా ఏజెన్సీ అధికారి జుఫ్లివాన్ అంటున్నారు. ట్రంప్ దగ్గర తనకున్న పలుకుబడిని ఉపయోగించి, ఈ ఏడాది ఆరంభంలో మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారి ఒకరిని శిక్ష పడకుండా గట్టెక్కించిన రియాలిటీ టెలివిజన్ స్టార్ కిమ్ కర్దేషియాన్ వెస్ట్ బుధవారం నాడు అనూహ్యంగా వైట్ హౌస్‌లోని అత్యున్నతస్థాయి అధికారుల సమావేశంలో ప్రత్యక్షమయ్యారు! ‘క్షమాభిక్ష, జైలు సంస్కరణలు’ అనే అంశంపై ఏర్పాటైన ఈ సమావేశంలోని ‘లిజనింగ్ సెషన్’లో కనిపించిన కిమ్ కర్దేషియాన్.. ట్రంప్ కూతురు ఇవాంకాను, ఆమె భర్త జేరెడ్ కుష్నర్ను కలిసేందుకు వచ్చిన విషయాన్ని వైట్ హౌస్ సిబ్బంది ఒకరు బహిర్గతం చేశారు. తూర్పు ముంబైలోని ఘట్కోపర్లో ఇటీవల గోకులాష్టమి వేడుకలకు హాజరైన ఘట్కోపర్ ఎమ్మెల్యే రామ్ కడమ్.. ఒక యువకుడు తనకు వినిపించిన ప్రేమ గోడుకు స్పందిస్తూ.. ‘‘నీకు, నీ తల్లిదండ్రులకు ఇష్టమైతే చెప్పు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయించైనా సరే తెప్పించి, నీతో పెళ్లి జరిపిస్తాను’’ అని భరోసా ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణించిన ‘మహారాష్ట్ర స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్’.. ఆయన అన్న మాటలకు అర్థం ఏమిటో చెప్పాలని నోటీసు జారీ చేయడంతో.. అందుకు తిరుగు సమాధానంగా రామ్ కడమ్ క్షమాపణలు చెప్పారు. బాధ్యత గల ప్రజా ప్రతినిధులు ఆలోచించి మాట్లాడకపోతే ఆ మాటలు సమాజంపై దుష్ప్రభావం చూపించే ప్రమాదం ఉందని రామ్ కడమ్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ, కమిషన్ చైర్ పర్సన్ విజయ రహత్కర్ వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధిలో మహిళల ఆర్థిక సాధికారత ఒక ప్రాధాన్యతాంశం కావాలని ఐశ్వర్యా రాయ్ అన్నారు. ఎన్.ఎస్.సి.ఐ. (నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో బుధవారం నాడు ముంబైలో జరిగిన ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ సభలో కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ, రాజ్యసభ సభ్యురాలు పూనమ్ మహాజన్, రశ్మీ ఠాక్రే, జూహీ చావ్లా, అమృతా రాయ్చంద్ర, షబానా అజ్మీలతో పాటు పాల్గొన్న ఐశ్వర్య.. ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ, మహిళ ఆర్థిక సాధికారత దేశాభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. 80 ఏళ్ల వయసులో 2005 డిసెంబర్ 24న మరణించిన ప్రముఖ దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు భానుమతి రామకృష్ణ జయంతి నేడు. 1926 సెప్టెంబర్ 7న ప్రకాశం జిల్లా దొడ్డవరంలో జన్మించిన భానుమతి.. ‘వర విక్రయం’తో సినీ రంగ ప్రవేశం చేసి, లైలా మజ్ను, చండీరాణి, తాసీల్దారు, మల్లీశ్వరి వంటి అనేక చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందారు. -
ఆ విషయం ఇంకా గుర్తుంది!
బాలీవుడ్లో ‘గుజారీష్’ సినిమా తర్వాత దాదాపు ఐదేళ్ల గ్యాప్ తీసుకుని హీరోయిన్ ఐశ్వర్యారాయ్ ‘జజ్బా’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పైకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఐశ్వర్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచీ అలనాటి క్లాసిక్ ఫిల్మ్ ‘రాత్ ఔర్ దిన్’ రీమేక్‌లో ఆమె లీడ్ రోల్ చేయనున్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయంపై ఐశ్వర్యారాయ్ స్పందించారు. ‘‘కేవలం ‘రాత్ ఔర్ దిన్’ (1967) మూవీ మాత్రమే కాదు, ‘ఓ కౌన్ తీ’ (1964) రీమేక్‌లోనూ నేను నటించాలనుకున్నాను. రీమేక్స్ ౖరైట్స్ విషయమై చర్చలు జరుగుతున్నాయి. ‘రాత్ ఔర్ దిన్’ రీమేక్‌లో నర్గిస్ దత్ క్యారెక్టర్ భలేగా ఉంటుంది. దాదాపు 13ఏళ్ల క్రితం ‘శబ్ద్’ సినిమాలో సంజయ్ దత్తో కలిసి నటించాను. అప్పుడు ‘రాత్ ఔర్ దిన్’ రీమేక్ చేస్తే అందులోని మా అమ్మ పాత్రకు నువ్వు అయితే బాగా సూట్ అవుతావు’ అని సంజయ్‌దత్ అన్నారు. ఆ విషయం ఇంకా గుర్తు ఉంది’’ అన్నారు ఐశ్వర్యారాయ్. నెక్ట్స్ భర్త అభిషేక్ బచ్చన్‌తో కలిసి ఐశ్వర్య ‘గులాబ్ జామున్’ సినిమాలో నటించనున్నారు. -
‘ఛత్రపతి’ రీమేక్‌లో నటించాలని ఉంది!
రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ స్క్రీన్ మీదికి వస్తున్నారు అభిషేక్‌బచ్చన్!ఈ నెలలో ‘మన్మర్జియా’ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా.. అభిషేక్‌ని పలకరించింది సాక్షి. ఐశ్వర్యతో కలిసినటిస్తున్నాననీ..‘ఛత్రపతి’ రీమేక్‌లో నటించాలని ఉందనీ..ఆడియన్స్ వద్దనే వరకు నటిస్తాననీ..నాన్న స్టార్‌డమ్‌ను ఎప్పటికీ అందుకోలేనని చాలా విషయాలు చెప్పారు అభిషేక్! మీ లాస్ట్ సినిమా (‘హౌస్‌ఫుల్ 3’) 2016లో రిలీజైంది. రెండేళ్లకు ‘మన్మర్జియా’తో వస్తున్నారు. ఎందుకీ గ్యాప్? అభిషేక్: గ్యాప్ కాదు.. బ్రేక్. నేనే కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను. నేను ఓన్ చేసుకున్న నా ఫుట్‌బాల్ టీమ్‌కి సంబంధించిన మ్యాచ్‌లు, కబడ్డీ టీమ్ పనులతో కొంచెం బిజీ అయ్యాను. ఈ రెండు సంవత్సరాలు సినిమాల్లో కనిపించలేదు కానీ ఖాళీగా అయితే లేను (నవ్వుతూ). అయితే సినిమాని మిస్సయిన ఫీలింగ్ కలిగింది. ఎవరైనా మంచి కథతో వస్తే సినిమా చేయాలనుకున్నాను. ఆనంద్ ఓ కథ తీసుకువచ్చాడు. నచ్చింది. ఆనంద్‌గారు చెప్పిన కథలో అంతగా నచ్చిన పాయింట్ ఏంటి? ఈ ఏడాది జనవరిలో ఆనంద్ ఎల్. రాయ్ ఈ స్టోరీ వినిపించారు. వింటున్నంతసేపూ చాలా ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఇప్పటి వరకూ చూడని కొత్త పాయింట్‌తో వస్తున్న సినిమా అని చెప్పను కానీ లవ్‌స్టోరీలో ఓ కొత్త టేక్‌తో సాగుతుంది. కొత్తగా చెప్పడానికి ట్రై చేశాం. ఈ చిత్రదర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’, ‘బాంబే టాకీస్’ వంటి చిత్రాలు తీసిన అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన ఫస్ట్ లవ్‌స్టోరీ ఇది. అసలాయన ఎప్పుడూ గన్స్, గ్యాంగ్‌స్టర్ అంటారు మరి లవ్ బేస్డ్ మూవీ ఎందుకు తీయాలనిపించిందో? లవ్‌స్టోరీ అంటే కచ్చితంగా కామన్ ఆడియన్స్‌కి ఎగై్జటింగ్ పాయింటే. అది కొత్తగా ఉంటే బాగా చూస్తారు. ఈ సినిమా కోసం విక్కీ కౌశల్, తాప్సీలతో కలసి పని చేయడం లవ్లీ ఎక్స్పీరియన్స్. యాక్టర్‌గా మీరెలాంటి సినిమాలు ఇష్టపడతారు? లవ్‌స్టోరీలా? యాక్షన్ సినిమాలా? బేసిక్‌గా నేను యాక్షన్ సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. నేను చేసిన సినిమాల లిస్ట్ తీస్తే ఎక్కువగా యాక్షన్ మూవీసే ఉంటాయి. ఒక యాక్షన్ సినిమాల లవర్‌గా మీరు చేసిన యాక్షన్ మూవీస్ మీరు అనుకున్న స్థాయిలో సంతృప్తినిచ్చాయా? ఒక యాక్టర్‌కి సంతృప్తి అనేది ఎప్పటికీ ఉండదని నా పర్సనల్ ఫీలింగ్. షాట్ ఫినిష్ అవ్వగానే డైరెక్టర్ ఓకే అన్నా కూడా ఇంకా ఏదో చేయాలి, ఇంకా బాగా చేయాలి అనే తపన లోపల ఉంటుంది. అది లేకపోతే కచ్చితంగా యాక్టర్‌గా మనం ఇంకా పైకి ఎదగలేం అని నా అభిప్రాయం. మీ నాన్నగారికి (అమితాబ్ బచ్చన్) 75 ఏళ్లు. ఇప్పటికీ బిజీ ఆర్టిస్ట్. ఎలా అనిపిస్తోంది? నాన్నని చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆయన ఎనర్జీ లెవెల్స్ చూస్తే చాలా పాజిటివ్‌గా ఉంటుంది. పైగా సినిమా సినిమాకీ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ నటుడిగా తనను తాను ‘రీ–ఇన్వెంట్’ చేసు కుంటున్నారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీ నాన్నతో మీరెలా ఉంటారు? ఇద్దరూ సినిమాల గురించి మాట్లాడుకుంటారా? నాన్న నాకు మంచి ఫ్రెండ్. ఫాదర్ అండ్ సన్‌లా కాకుండా మంచి స్నేహితుల్లా ఉంటాం. మేం చేసే సినిమాల గురించి మాట్లాడుకోవడం చాలా తక్కువ. ఇంటి విషయాలు ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఒకవేళ నేను ఆయన సలహా తీసుకున్నాననుకోండి అదెలా వర్కవుట్ అవుతుంది? కెమెరా ముందు నేనే యాక్ట్ చేయాలి కదా. అందుకే అవసరమైతే తప్ప టిప్స్ తీసుకోను. అమ్మ (జయా బచ్చన్)తో అనుబంధం గురించి? మేం ఫ్రెండ్స్‌లా ఉండం. తల్లీ కొడుకుల్లానే ఉంటాం. కొన్ని సందర్భాల్లో కొడుకు ఏమీ చెప్పకపోయినా తల్లి అర్థం చేసుకుంటుంది. తల్లి ఏమీ చెప్పకపోయినా కొడుకు అర్థం చేసుకుంటాడు. మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలాంటిదే. తెలుగు చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ లో అమితాబ్‌గారు నటిస్తున్నారు. వేరే భాష సినిమా కాబట్టి మీతో ఏమైనా డిస్కస్ చేశారా? అస్సలు లేదు. నాన్నకి నచ్చిన సినిమాలు ఆయన చేసేస్తారు. నాకు నచ్చినవి నేను చేస్తాను. అయితే మాటల సందర్భంలో షూటింగ్ ఎలా జరుగుతోంది? అనే విషయాలు మాట్లాడుకుంటుంటాం. మీరు తెలుగు సినిమాలు చూస్తారా? ఇంతకుముందు బాగా చూసేవాణ్ని. ఇప్పుడు షూటింగ్స్‌తో బిజీ. షెడ్యూల్స్ కుదరక కొంచెం తగ్గించాను. కానీ ఎప్పటికప్పుడు ఏ భాషలో ఎలాంటి సినిమాలు వస్తున్నాయో చూస్తుంటాను. మీరు చూసిన తెలుగు సినిమాల్లో ఏ సినిమా హిందీ రీమేక్‌కి అవకాశం వస్తే చేయాలనుకుంటున్నారు? ‘ఛత్రపతి’ సినిమా. అందులో యాక్షన్‌కి యాక్షన్, సాంగ్స్, సెంటిమెంట్.. ఇలా అన్ని అంశాలు కరెక్ట్ మోతాదులో ఉంటాయి. పర్ఫెక్ట్ రీమేక్ మెటీరియల్. నెక్ట్స్ మీ సతీమణి ఐశ్వర్యా రాయ్‌తో ‘గులాబ్ జామున్’లో కలిసి యాక్ట్ చేయనున్నారు. దాని గురించి.. టైటిల్‌లాగే సినిమా కూడా చాలా స్వీట్‌గా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరం కలిసి యాక్ట్ చేస్తున్నాం. ఐష్ రీ ఎంట్రీ తర్వాత మేం ఇద్దరం కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి కరెక్ట్ స్టోరీ ఇదే అనిపించింది. అందుకే ఒప్పుకున్నాం. మీ పాప ఆరాధ్య గురించి? బావుంది. చక్కగా ఆడుకుంటుంది. స్టార్ కిడ్ కాబట్టి మీడియా అటెన్షన్ తన మీద ఉండటం మీకు ఇబ్బందిగా అనిపిస్తుందా? అది తప్పదు. అయితే ఆరాధ్య ఓ మామూలు అమ్మాయిలా పెరగాలని మాకు ఉంటుంది. ఇప్పటినుంచే ‘ఎక్స్ట్రా అటెన్షన్’ అంటే స్వేచ్ఛ పోతుంది. తల్లిదండ్రులుగా ఆ విషయం మాకు ఇబ్బందిగానే ఉంటుంది. మీరు కూడా స్టార్ కిడ్ కదా. మీ చైల్డ్ హుడ్ ఎలా ఉండేది? నా చిన్నప్పుడు ఇంత మీడియా లేదు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చేసింది. స్టార్ కిడ్స్ ప్రతి మూమెంట్‌ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేçస్తూనే ఉన్నారు. పిల్లలకి ఇవేమీ అర్థం కావు. కానీ వాళ్లను కూడా మామూలు పిల్లలలాగే వదిలేస్తే బావుంటుంది కదా అని నా ఉద్దేశం. స్కూల్లో మీకు ఎలా ఉండేది. సూపర్ స్టార్ అమితాబ్ అబ్బాయి అని ట్రీట్ చేసేవారా? నా స్కూలింగ్ ఎక్కువ శాతం బోర్డింగ్ స్కూల్లో జరిగింది. అక్కడ ఇవేమీ ఉండవు. ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. స్టార్ కిడ్స్, కామన్ కిడ్స్ అని స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ ఉండదు. అందరిలా టైమ్ ప్రకారం నిద్ర లేవడం, పనులు చేసుకోవడం, స్కూల్‌కి వెళ్లడం. అంతే. బోర్డింగ్ స్కూల్లో ఉండే పిల్లలు స్ట్రాంగ్‌గా తయారవుతారనుకుంటున్నారా? స్ట్రాంగ్.. వీక్ అని కాదు. మనల్ని మనం చూసుకోగలం. ప్రతి చిన్న విషయంకూడా అమ్మా నాన్న అని పరిగెత్తాల్సిన పని లేదు. పిల్లలు తమ పనులు తాము సొంతంగా చేసుకునేలా పెంచడం కరెక్ట్ అని నా ఫీలింగ్. బోర్డింగ్ స్కూల్‌కి వెళితే ఎలానూ అలవాటు అవుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మానాన్నలు గారం చేస్తారు కాబట్టి వాళ్ల మీద ఆధారపడతాం. డిపెండ్ అవ్వడం తప్పనడం లేదు.. మనల్ని మనం మ్యానేజ్ చేసుకునే స్కిల్ అయితే ఉండాలి. మే బీ ఇలా అనుకునే నన్ను అమ్మానాన్న బోర్డింగ్ స్కూల్‌కి పంపించారేమో. అది సరే.. సోలో హీరోగా సినిమాలు తగ్గించేశారు? కారణం? సోలో హీరోగా సినిమాలు చేయాలి, మల్టీస్టారర్ మూవీస్ చేయాలి అని పర్టిక్యులర్‌గా ఏమీ పెట్టుకోను. ఏ స్క్రిప్ట్ నన్ను ఎగై్జట్ చేస్తే అందులో యాక్ట్ చేయడమే. నెక్ట్స్ నా వైఫ్ ఐశ్వర్యతో చేస్తుంది సోలో హీరోగానే. మల్టీస్టారర్ మూవీస్ మీకు కంఫర్ట్‌గా అనిపిస్తాయా? నాకు ఏ సమస్యా లేదు. అందరితో కలిసిపోతాను. వేవ్ లెంగ్త్ మ్యాచ్ అయితే మంచి ఫ్రెండ్స్‌గా మారిపోతాం. లేకపోతే మా పని మేం చేసుకుంటాం. మల్టీస్టారర్స్ కొన్నిసార్లు ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ని ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయి. ‘మన్మర్జియా’లో నేను, విక్కీ కౌశల్ సినిమాలో గొడవపడ్డా కూడా బయట మంచి ఫ్రెండ్స్ అయ్యాం. విక్కీ వాళ్ల డాడీ (స్ట్టంట్ కో–ఆర్డినేటర్ శ్యామ్ కౌశల్), మా డాడీ కలిసి సినిమాలకు పని చేశారు. ఇప్పుడు నేను, విక్కీ కలిసి చేస్తుంటే ఆ ఫ్రెండ్షిప్ నెక్ట్స్ జనరేషన్‌కు తీసుకు వెళ్తున్నట్టుంది. ఫైనల్లీ.. మీ నాన్నగారి స్టార్ స్టేటస్ గురించి తెలియనిది కాదు. ఒక కొడుకుగా ఆ స్థాయిని అందుకోవాలనుకుంటారా? అస్సలు ఆ ఆలోచన లేదు. మా నాన్నగారి సూపర్ స్టార్‌డమ్‌ని అందుకోవాలనే ఆరాటం లేదు. నాకు తెలిసి ఎవరూ ఆలోచించరు కూడా. ఎందుకంటే ఆ స్టార్డమ్ ఎవరూ సాధించలేనిది. అమితాబ్ లాంటివాళ్లు ఒక్కరే ఉంటారు. అది యాక్సెప్ట్ చేసి, మనం ముందుకు వెళ్లడమే. ఇప్పటికి మీరు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 18 ఏళ్లు. భవిష్యత్తులోనూ ఇంతే బిజీగా ఉంటారనే గ్యారంటీ లేదు. ఏ ఆర్టిస్ట్‌కైనా అది బాధగానే ఉంటుంది కదా? మిగతా వాళ్ల గురించి నేను చెప్పలేను కానీ నా వరకు నేను పాజిటివ్ పర్సన్. ఓ 18 ఏళ్లు కంటిన్యూస్‌గా పని చేయగలిగాం అని చెప్పుకునే పొజిషన్లో ఉన్నప్పుడు భవిష్యత్తు గురించి దిగులు ఎందుకు? నేను ఎవరి కొడుకు? అనేది ఎవరికీ.. ముఖ్యంగా ప్రేక్షకులకు ముఖ్యం కాదు. నేనిక్కడ ఎన్నేళ్లు ఉండాలన్నది వాళ్లు డిసైడ్ చేస్తారు. ఆడియన్స్ ఇష్టపడినంత కాలం నేను సినిమాలు చేస్తాను. లేదంటే హ్యాపీగా తప్పుకుంటాను. లైఫ్‌లో ఏది వస్తే అది తీసుకోవడం అలవాటు చేసుకుంటే ‘నెగటివ్’ అనేది ఉండదు. అంతా పాజిటివే. అయితే ఒక్క విషయం. ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేసే ఫీల్డ్‌లో ఉన్నందుకు ఆనందపడుతున్నా. – డి.జి.భవాని -
నిజాలు దాచను!
అందాల సుందరి జీవితం అందంగానే ఉంటుందా? సమస్యలుండవా? ఉంటాయి. రోజా పువ్వు చుట్టూ ముళ్లు ఉన్నట్లు అందగత్తె చుట్టూ ఎన్నో ముళ్లు. అన్నింటినీ అధిగమించాలంటే బోలెడంత ఆత్మవిశ్వాసం కావాలి. ఐశ్వర్యారాయ్‌కి అది ఉంది. ఆర్కిటెక్చర్ స్టూడెంట్ అయిన ఆమె ‘మిస్ వరల్డ్’ కాకపోయి ఉంటే సాదాసీదాగా మిగిలిపోయేవారేమో. ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్నారు. దానికోసం ఐష్ పడినది మామూలు కష్టం కాదు. నేమ్ వచ్చేవరకూ ఎవరూ పట్టించుకోరు. వచ్చాక వదలరు. ఐష్ లైఫ్ దీనికి ఓ మంచి ఉదాహరణ. కష్టపడినప్పుడు ఎవరూ సహాయం చేయలేదు. పేరు వచ్చాక వెంటపడ్డారు. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగారు. అంతా సజావుగా సాగితే చెప్పడానికి ఏముంటుంది? ఓ పెద్ద కుదుపు. లవ్ ఫెయిల్యూర్. మీడియాలో ఏవేవో కథనాలు. లైఫ్‌లో అనుకోని డిస్ట్రబెన్సెస్. కొన్ని సినిమాలు ఫ్లాప్. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ రెండూ బాగా లేవు. ఐష్ ఓపిక పట్టారు. హీరోయిన్గా సక్సెస్ కొట్టారు. ప్రేమ అనే చేదు అనుభవాన్ని తుడిచేశారు. అభిషేక్ బచ్చన్‌ని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించారు. ఓ బిడ్డకి తల్లి అయ్యాక దాదాపు నాలుగేళ్లు స్క్రీన్‌కి దూరమయ్యారు. మళ్లీ మేకప్ వేసుకున్నారు... క్లుప్తంగా ఐష్ జీవితం ఇది. మొత్తంగా ఓ సినిమాకి కావాల్సిన మెటీరియల్ ఆమె లైఫ్‌లో ఉంది. మరి.. మీ బయోపిక్‌పై మీ అభిప్రాయం ఏంటీ? అని ఐశ్వర్యారాయ్‌ని అడిగితే...‘‘బయోపిక్ తీస్తే వాస్తవాలను దాచకూడదన్నది నా అభిప్రాయం. అది నా బయోపిక్ అయినా సరే. నా జీవితం ఓ గొప్ప కథ అవుతుంది. ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుందంటే తప్పకుండా నా బయోపిక్ తెరకెక్కాలని నేను కోరుకుంటాను. కానీ ఇప్పుడే ఈ ఆలోచన లేదు’’ అన్నారు. బయోపిక్‌లో నిజాలను దాచనంటున్నారు ఐశ్వర్య. మరి... నిజంగా ఐశ్వర్య బయోపిక్ తీస్తే అందులో ఆమె మాజీ ప్రేమికుడు సల్మాన్‌ఖాన్ పాత్రను ఎలా జస్టిఫై చేస్తారనే ఆసక్తి సినీ లవర్స్‌లో తప్పుకండా ఉంటుందని అనుకోవచ్చు. -
భారత బిగ్గెస్ట్ సీఈవోలు వారే : ఐశ్వర్య రాయ్
న్యూఢిల్లీ : 'హౌజ్ వైఫ్' అనే పదం వినడానికి ఎంత తేలికగా ఉన్నా... ఆ బాధ్యతలు నిర్వర్తించడం ఎంత కష్టమో ప్రతి ఒక్క అమ్మాయికి తెలిసే ఉంటుంది. ఇంటి బాధ్యతల్ని ఎప్పడికప్పుడూ నెరవేరుస్తూ.. పిల్లలకు, భర్తకు, అత్తామామలకు ఎలాంటి లోటు రాకుండా రేయింబవళ్లు కష్టపడాల్సి ఉంటుంది. చాలా మంది మగాళ్లు హౌజ్ వైఫేగా అంటూ తేల్చి పడేస్తూ ఉంటారు. కానీ వారే కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరించే కంటే ఎక్కువ బాధ్యతలు వ్యవహరిస్తారట. తాజాగా ఈ విషయాన్ని ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా ఒప్పుకున్నారు. భారత్‌లో అతిపెద్ద సీఈవోలు హౌజ్ వైఫ్‌లేనని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. తన తాజా సినిమా ఫన్నీ ఖాన్ ప్రమోట్ చేసుకోవడానికి ఓ డ్యాన్స్ షోలో పాల్గొన ఆమె ఈ ప్రకటన చేశారు. ‘హౌజ్ వైఫ్‌లే భారత్‌లో అతిపెద్ద సీఈవోలు. వారికి మనం అత్యంత ఉన్నతమైన గౌరవం, ప్రశంస ఇవ్వాలి. మన దేశంలో, ప్రపంచంలో ఉన్న హౌజ్ వైఫ్‌లందరికీ ఎంతో గౌరవంతో, ప్రశంసతో చేతులెత్తి నమస్కరిస్తున్నా’ అని తెలిపారు. ఐశ్వర్య రాయ్ చేసిన ఈ ప్రకటనకు, సింగర్ విశాల్ డాడ్లని కూడా మద్దతిచ్చారు. ఆ డ్యాన్స్ షోలో ఆయన కూడా జడ్జి. ఐశ్వర్య రాయ్ కూడా మిగతా హౌజ్‌వైఫ్‌ల మాదిరి ప్రపంచంలో అత్యంత సుందరమైన మహిళల్లో ఒకరు అని విశాల్ కొనియాడారు. ‘నా మ్యూజిక్ టూర్ల సమయంలో ఒకసారి అమితాబ్ జీ మమ్మల్ని డిన్నర్ పార్టీకి ఆహ్వానించారు. ప్రపంచంలో అత్యంత సుందరి అయిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఆమె స్వహస్థాలతో మాకు డిన్నర్ వడ్డించింది. ఆ పార్టీకి సిబ్బంది అంతా వెళ్లాం. ప్రతి ఒక్కరికీ ఆమెనే సర్వ్ చేసింది. మేము అందరం తిన్న తర్వాతనే, ఐశ్వర్య భోజనం చేసింది’ అని విశాల్ గుర్తు చేసుకున్నారు. ఐశ్వర్య తన వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. దీనికి నిదర్శనం ఇటీవల తన ఆరేళ్ల కూతురు ఆరాధ్యతో కలిసి పారిస్ ట్రిపులో పాల్గొనడమే. ఐశ్వర్య వర్క్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ, తన కూతురు కోసం కూడా కాస్త సమయాన్ని వెచ్చిస్తూ.. ఆరాధ్యతో కలిసి ఈఫిల్ టవర్, డిస్నీల్యాండ్ సందర్శించారు. వాటికి సంబంధించిన ఫోటోలు ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయి కూడా. 2007లో ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకున్నారు. ఏప్రిల్ 20న ఈ కపుల్ తమ 11వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. తన లేటెస్ట్ మూవీ ఫన్నీ ఖాన్ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. నెక్ట్స్ తన భర్త అభిషేక్ బచ్చన్‌తో కలసి ఐశ్వర్యా రాయ్ నటించబోతున్నారు. -
భవిష్యత్‌లో నా డైరెక్షన్ మారుతుంది
కెమెరా.. రోలింగ్.. యాక్షన్ అని డైరెక్టర్ అనగానే చేసే పాత్రలోకి ఒదిగిపోతారు కథానాయిక ఐశ్యర్యా రాయ్. కెమెరా ముందు ఎన్నో పాత్రల్లో నటిస్తూ 20 సంవత్సరాలుగా ప్రేక్షకులను మెప్పిస్తున్నారామె. కానీ ఇప్పుడు కెమెరా వెనక వర్క్ చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఐశ్వర్య డైరెక్టర్‌గా మారాలనుకుంటున్నారు. ఐశ్వర్యా రాయ్ నటించిన తాజా చిత్రం ‘ఫ్యానీఖాన్’ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఐశ్యర్య మాట్లాడుతూ– ‘‘డైరెక్షన్ వైపు ఇంట్రెస్ట్ ఉంది. భవిష్యత్‌లో తప్పకుండా డైరెక్టర్ అవుతాను. ఏదో డైరెక్షన్ చేయాలనే ఆశతో సినిమా చేయను. పూర్తి మనసు పెట్టి చేస్తాను. ఆ మాటకొస్తే.. ఏ పనినైనా నేను హార్ట్ఫుల్గానే చేస్తా. నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్న విషయాన్ని నా డైరెక్టర్స్‌కి, తోటి యాక్టర్స్‌కి చెప్పినప్పుడు ‘ఓకే ఓకే’ అని సరదాగా ఆటపట్టిస్తున్నారు. నా భర్త అభిషేక్ బచ్చన్ ‘నువ్వు చేయగలవు’ అంటున్నాడు’’ అని పేర్కొన్నారు ఐశ్వర్యా రాయ్. ఇదిలా ఉంటే.. నెక్ట్స్ తన భర్త అభిషేక్ బచ్చన్‌తో కలసి ఐశ్వర్యా రాయ్ నటించనున్న చిత్రం త్వరలో ఆరంభం కానుంది. -
జ్యోతిష్కుడి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : నగరానికి చెందిన జ్యోతిష్కుడొకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీల భవిష్యత్తుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన.. వారి భవిష్యత్ పరిస్థితులపై జోస్యం చెప్పారు. స్థానికంగా మీడియాతో మాట్లాడుతూ.. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబానికి చెందినవారు దేశ ప్రధాని అవుతారని ప్రకటన చేశారు. అభిషేక్ బచ్చన్- ఐశ్యర్యరాయ్ల కుమార్తె ఆరాధ్య బచ్చన్‌కు రాజకీయ భవిష్యత్తు పుష్కలంగా ఉందనీ.. ప్యూచర్లో ఆమె దేశ ప్రధానయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు. అయితే ఆరాధ్య ప్రధాని కావాలంటే పేరును మాత్రం రోహిణిగా మార్చుకోవాలని సూచించారు. మరికొన్ని విషయాలు.. తమిళనాడులో మధ్యంతర ఎన్నికలు వస్తాయని, ఆ ఎన్నికల్లో రజనీకాంత్ సీఎంగా ఎన్నికవుతారని వివరించారు. భారత్ పాక్‌ల భవిష్యత్తు గురించి కూడా ఙ్ఙానేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో ఇరు దేశాల మధ్య యుద్దం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి ఎన్నికవుతారన్నారు. అమెరికాలో కూడా డొనాల్డ్ ట్రంప్ మరోదఫా అధ్యక్షుడు అవుతారని ఆయన చెబుతున్నారు. దేశ కుభేరుడు ముఖేశ్ అంబానీ కుమారురు ఆకాశ్ అంబానీకి 2018 అంతగా కలిసిరాదని, అతని వివాహం 2019లో అవుతుందన్నారు. ‘గతంలో నేను చెప్పినవన్నీ జరిగాయి. 2009లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పాను. చిరంజీవి, రజనీకాంత్‌లు రాజకీయాల్లోకి వస్తారని చెప్పాను. నేనే చెప్పినట్టుగానే 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగే రజనీకాంత్ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు కూడా నేను చెప్పినవి జరిగి తీరతాయి’ అని ఙ్ఞానేశ్వర్ ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు.