
ఐశ్వరాయ్ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను హీరోయిన్ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన జాన్వీ డ్యాన్స్ స్కూలును మిస్ అవుతున్నానంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఐశ్వర్యరాయ్ నటించిన ‘ఉమ్రాన్ జాన్’ చిత్రంలోని ‘సలాం’ పాటకు జాన్వీ డ్యాన్స్ నేర్చుకుంటున్న వీడియోకు ‘క్లాస్ రూంను మిస్సవుతున్నా’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. (వైరల్.. వేదికపై డ్యాన్స్ చేసిన జాన్వి)
అయినా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలంటే తరగతి గదే ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా, ఎప్పుడైనా డ్యాన్స్ నేర్చుకోవచ్చు. నేను ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియో చూసిన బాలీవుడ్ ప్రముఖులు జాన్వీపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడు శరణ్ శర్మ ‘లైవ్ కథక్ డ్యాన్స్ సెషన్‌ను కూడా త్వరలో నిర్వహించాలి’ అని కామెంట్ చేశాడు. అంతేగాక నటుడు ఆకాన్ష్ రంజన్ కూడా ‘చాలా అందంగా ఉంది’ అని, ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా హర్ట్ ఎమోజీతో ఆయన స్పందనను తెలిపారు. (లాక్‌డౌన్: 1,270 వాహనాలు సీజ్)
Comments
Please login to add a commentAdd a comment