Dance video
-
Video: బాలీవుడ్ పాటకు యూఎస్ దౌత్యవేత్త హుషారైన స్టెప్పులు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో దీపావళి వేడుకలు బధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి మరోసారి తన నృత్య ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. వేడుకల్లో భాగంగా గార్సెట్టి స్టేజ్‌పై బాలీవుడ్ హిట్ పాటకు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. సంప్రదాయ దుస్తులైన కుర్తా పైజామా ధరించి విక్కీ కౌశల్ నటించిన బ్యాడ్ న్యూస్ సినిమాలోని ‘తౌబా తౌబా’ పాటకు కాలు కదిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గార్సెట్టి ఇలా తన డ్యాన్స్ స్కిల్స్‌తో ఆకట్టుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా ఆయన చాలా సందర్భాల్లో తన నృత్య ప్రదర్శనతో అందరిని మంత్రముగ్దులను చేశారు. #WATCH | US Ambassador to India, Eric Garcetti dances to the tune of the popular Hindi song 'Tauba, Tauba' during Diwali celebrations at the embassy in Delhi(Video source: US Embassy) pic.twitter.com/MLdLd8IDrH— ANI (@ANI) October 30, 2024 -
మనవరాలి పెళ్లి సంగీత్‌లో.. మల్లారెడ్డి ఊర మాస్ డ్యాన్స్
హైదరాబాద్: మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎదో విధంగా హల్చల్ చేస్తుంటారు. తాజాగా మల్లారెడ్డి మనవరాలి పెళ్లి సంగీత్ కార్యక్రమంలో డ్యాన్స్‌ని ఇరగదీశారు. మంచి కాస్ట్యూమ్‌తో, మనవళ్లను పక్కన పెట్టుకొని.. కొరియోగ్రాఫర్లతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు. మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం ఈనెల 27న జరగనుంది.మనవరాలి సంగీత్ లో డీజే టిల్లు పాటకు మల్లన్న మాస్ స్టెప్పులు 🕺👌#MallaReddy #Mallareddydance pic.twitter.com/D0tMDpBED6— Pulse News (@PulseNewsTelugu) October 21, 2024 -
మద్యం సేవిస్తూ, బార్ డ్యాన్సర్లతో అసభ్య నృత్యాలు.. స్కూల్లో ఇవేం పనులు!
పాఠశాల అంటే టీచర్లు, విద్యార్ధులు, క్లాస్‌లు, విద్యాబోధన ఇవే మనకు తెలుసు. సాయంత్రం వేళ ఆటలు, సమయం సందర్భం బట్టి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంటుంది. కానీ ఓ చోట బడికి వచ్చిన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, వారి భవిహ్యత్తుకు బాటలు వేయాల్సిన చోట కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఏకంగా స్కూల్లోనే మద్యం తాగుతూ, బార్ డ్యాన్సర్లతో కలిసి అసభ్యకరంగా డ్యాన్స్‌లు చేశారు. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లో మంగళవారం వెలుగు చూసింది.సహర్సా జిల్లా జలాయిలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పెళ్లి వేడుకల నేపథ్యంలో కొందరు వ్యక్తులు బ్యాండ్, నలుగురు బార్ డ్యాన్సర్లను తీసుకొచ్చారు. పాఠశాలలోనే మద్యం తాగుతూ ఆశ్లీల డ్యాన్స్‌లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో పలువురు మహిళలు భోజ్‌పురి పాటలకు అసభ్యకరంగా డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. ఆ మహిళల చుట్టూ కొందరు వ్యక్తులు చేరి, మద్యం తాగుతూ వారితో కలిసి డ్యాన్స్ చేయడం కూడా చూడొచ్చు. అయితే స్కూల్లో తాగి డ్యాన్సులు చేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఇలాంటి వేడుకలకు విద్యాశాఖ ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. మరోవైపుఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి మమతా కుమారి స్పందిస్తూఇలాంటి ఏ కార్యక్రమానికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు. ఈ వైరల్ వీడియో తమ దృష్టికి రాగా.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారుबिहार के सरकारी स्कूल में बार बालाओं ने लगाए ठुमकेसहरसा के जलई ओपी क्षेत्र में स्थित विरगांव पंचायत के प्राथमिक विद्यालय नया टोला में बार बालाओं ने जमकर ठुमका लगाया। विडियो 24 सितंबर की रात का बताया जा रहा है। @bihar_police @NitishKumar @BiharEducation_ pic.twitter.com/Jk9Sn0fHhp— Republican News (@RepublicanNews0) September 26, 2024 -
ఆనంద్ మహీంద్రా మెచ్చిన ట్రాఫిక్ పోలీస్.. డ్యాన్స్‌కు ఫిదా
సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. ఎన్నో ఆసక్తికర విషయాలు, ప్రేరణ కలిగించే వీడియోలను తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా పంచుకుంటుంటారు . ఆయన ఏ పోస్టునైనా అలా షేర్ చేశారో లేదో.. నిమిషాల్లో వేలల్లో లైకులు, వ్యూస్ వచ్చేస్తుంటాయి. తాజాగా ఆయన రోడ్డుపై డ్యాన్స్ చేస్తున్న ట్రాఫిక్ పోలీస్ వీడియోను షేర్ చేశారు.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రంజిత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అక్కడ అతను 16 ఏళ్లుగా ట్రాఫిక్ కానిస్టేబుల్ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. అందరూ చేతులతో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తే రంజిత్ సింగ్ మాత్రం తన డ్యాన్స్‌తో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తాడు. గంటల కొద్దీ రోడ్డుపై నిల్చొని ఎలాంటి నీరసం, విసుగు లేకుండా ట్రాఫిక్‌లో ఆగి ఉన్న జనాలకు తన స్టెప్పులతో అలరిస్తాడు. అయితే ఇటీవల రంజిత్ సింగ్ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా. తన వీడియోను షేర్ చేస్తూ మండే మోటివేషన్ అంటూ పోస్ట్ పెట్టాడు. ‘ఈ పోలీస్ బోరింగ్ పని అంటూ ఏమి ఉండదు అని నిరుపించాడు. మన పనిని మనం ఎలా చేయాలి అనేది నీ ఛాయిస్ ’అంటూ రాసుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.This cop proves that there is NO such thing as boring work.It is whatever you choose to make of it.#MondayMotivationpic.twitter.com/ItrI7yjAe2— anand mahindra (@anandmahindra) July 29, 2024 View this post on Instagram A post shared by Devanshu Gupta BUNNY (@iamdevanshugupta) View this post on Instagram A post shared by Ranjeet Singh (@thecop146) -
జాతరలో మాస్ స్టెప్పులేసిన టాలీవుడ్ హీరో.. వీడియో వైరల్
కిరణ్ అబ్బవరం.. మొన్నటి వరకు వరుస సినిమాలతో దూసుకెళ్తాడు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి హీరోగా మారడమే కాకుండా.. అతి తక్కువ సమయంలో మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద బ్యానర్లలో కూడా సినిమాలు చేశాయి. అయితే ఇటీవల ఆయన చేసిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కిరణ్ కాస్త వెనకడుగు వేశాడు. సినిమాల ఎంపిక విషయంలో కాస్త ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నాడు. అందుకే ఈ మధ్య కాలంలో కిరణ్ నుంచి ఎలాంటి సినిమా అప్డేట్స్ రాలేదు. ఖాలీ సమయం దొరకడంతో నిశ్చితార్థం కూడా చేసేసుకున్నాడు. తొలి సినిమా రాజావారు..రాణిగారు హీరోయిన్ రహస్యనే తాను పెళ్లాడబోతున్నాడు. గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఈ ఏడాది మార్చి 13న నిశ్చితార్థం చేసుకొని తమ ప్రేమ విషయాన్ని అందరికి తెలియజేశారు. ఇదిలా ఉండగా.. కిరణ్ ప్రస్తుతం తన సొంతూరు రాయచోట్లో ఉన్నాడు. అక్కడ జరుగుతున్న గంగమ్మ జాతరలో ఆయన పాల్గొన్నాడు. గుడికి వెళ్లడమే కాకుండా.. స్నేహితులతో కలిసి మాస్ డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. హీరో అయినప్పటికీ..తనకున్న ఇమేజ్‌ని పక్కకు పెట్టి గ్రామీణ యువకుడిలా వీధుల్లో చిందులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by ꧁•⊹٭𝚂𝚞𝚛𝚎𝚜𝚑٭⊹•꧂ (@suresh__rayachoti_143) -
ప్రధాని మోదీ చిందేస్తే.. ఎలా ఉంటుంది!
లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయ ప్రముఖులపై మీమ్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రచారంలో దూసుకుపోతున్నట్లు నెట్టింట వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అలా తనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ యానిమేటెడ్ డాన్స్ వీడియోపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ‘మీలాగే నేను కూడా వీడియోలో నా డాన్స్ చూసి ఎంజాయ్ చేశా. ఎన్నికల సమయంలో ఇది చాలా అద్భుతమైన క్రియేటివిటీ. నిజంగా ఆనందం కలిగిస్తోంది’ అని మోదీ తన డాన్స్ వీడియో పోస్ట్‌ను ‘ఎక్స్’ లో రీట్వీట్ చేశారు.Like all of you, I also enjoyed seeing myself dance. 😀😀😀Such creativity in peak poll season is truly a delight! #PollHumour https://t.co/QNxB6KUQ3R— Narendra Modi (@narendramodi) May 6, 2024 అయితే ఈ వీడియోను క్రిష్ణా అనే నెటిజన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి.. ‘ఈ వీడియో పోస్ట్ చేయటం వల్ల నన్న ఎవరూ అరెస్ట్ చేరని నాకు తెలుసు’ కాప్షన్ జతచేశారు. దీనికి ప్రధాని మోదీ పైవిధంగా స్పందించటం గమనార్హం. ఈ యానిమేటెడ్ వీడియోలో మోదీ ప్రజల ముందు డాన్స్ చేసినట్లు కనిపిస్తారు.దీనికి కంటే ముందు ఇదే తరహాలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. దీనిపై కోల్‌కతా పోలీసులు ఆ వీడియోను పోస్ట్ చేసిన యూజర్‌పై చర్యలు తీసుకున్నారు.Mamata Banerjee's video can get you arrested by Kolkata Police.Narendra Modi's video won't get you arrested.But, Modi is dictator. pic.twitter.com/Y42D6g2EJx— Incognito (@Incognito_qfs) May 6, 2024 దీంతో పలువురు నెటిజన్లు.. తమ వీడియోలపై ప్రధానిమోదీ, సీఎం మమత స్పందించిన తీరుపై చర్చించుకుంటున్నారు. ఇక.. ‘మోదీ కూల్ పీఎం’అని కామెంట్ చేశారు. మరో నెటిజన్ అయితే.. మోదీ, మమత యానిమేటెడ్ డాన్స్ వీడియోలను పోస్ట్ చేసి.. ‘మమత బెనర్జీ వీడియో నిన్న కోల్‌కతా పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తుంది. అదే మోదీ వీడియో అయితే అరెస్ట్ కాము’అని కామెంట్ చేశారు.ఇక.. గతేడాది పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మోదీ వాయిస్‌తో వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. వాటిని నెటిజన్లు సరదగా క్రియేట్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. -
ఐటమ్ సాంగ్ కి సాయిపల్లవి ఊరమాస్ డ్యాన్స్.. వీడియో వైరల్
సాయిపల్లవి పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఆమె డ్యాన్సులే. ఎందుకంటే స్వతహాగా డ్యాన్సర్ అయిన ఈమె.. ఊహించని విధంగా హీరోయిన్ అయ్యింది. తెలుగులో కొన్ని సినిమాలే చేసినప్పటికీ చాలా గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు సాయిపల్లవికి సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: మీరు ఎవరు అలా చెప్పడానికి? బడా నిర్మాణ సంస్థపై హీరో విశాల్ ఫైర్) తమిళ బ్యూటీ సాయిపల్లవి ఓవైపు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు జార్జియాలో ఎంబీబీఎస్ కూడా పూర్తి చేసింది. ఈ విషయం చాలామందికి తెలిసినా సరే అక్కడ చదువుతున్నప్పటి ఫొటోలు, వీడియోల్లాంటివి ఏం బయటకు రాలేదు. కానీ ఇప్పుడు ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా ఫ్రెండ్స్ తో కలిసి 'షీలా కీ జవానీ' పాటకు సాయిపల్లవి డ్యాన్స్ చేసింది. ఈ వీడియోలో సాయిపల్లవి మిగతా వాళ్లని పూర్తిగా డామినేట్ చేసేసింది. బ్లర్ గా ఉండటంతో పాటు దూరం నుంచి వీడియో తీయడం వల్ల సరిగా క్లారిటీ లేదు. కానీ సాయిపల్లవి డ్యాన్స్ మాత్రం అదరగొట్టేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్న సాయిపల్లవి.. పాన్ ఇండియా 'రామాయణ'లో సీతగా కనిపించనుంది. త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చు. (ఇదీ చదవండి: మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!) #SaiPallavi doing Sheela ki Jawani Song at her College Festpic.twitter.com/t4RaoecDmP — R a J i V (@RajivAluri) April 16, 2024 -
బ్యూటిఫుల్ లవ్లీ ఫ్యామిలీ
పెళ్లి వేడుకలో వధూవరుల తల్లిదండ్రులు క్షణం తీరిక లేకుండా ఉంటారు. పెళ్లికి వచ్చిన అతిథులను పలకరించడం, పెళ్ళి పనులు చూసుకోవడంతోనే సరిపోతుంది. ‘టైమే బంగారమాయెనే’ అనుకునే సమయం లోనూ ఒక పెళ్లిలో వధువు తల్లిదండ్రులు చేసిన డ్యాన్స్ వీడియో వీర లెవెల్లో వైరల్ అయింది. స్టైలిష్ బ్లాక్ అండ్ గోల్డెన్ చీరలో వధువు తల్లి, స్మార్ట్ త్రీ పీస్ సూట్లో తండ్రి వేదికపై వివిధ హావభావాలతో చేసిన డ్యాన్స్ ‘వావ్’ అనిపించింది. స్టేజీ బ్యాక్‌గ్రౌండ్‌లో బాల్యం నుంచి కాలేజీ స్టూడెంట్ వరకు వధువుకు సంబంధించిన రకరకాల విజువల్స్ కనిపిస్తూ కనువిందు చేస్తుంటాయి. ‘బ్యూటీఫుల్... లవ్లీ ఫ్యామిలీ’ లాంటి కామెంట్స్ ఎన్నో యూజర్ల నుంచి వెల్లువెత్తాయి. -
చెల్లి ఎంగేజ్మెంట్.. డ్యాన్స్‌తో దుమ్మురేపిన సాయిపల్లవి!
హీరోయిన్ సాయిపల్లవి డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. చాలారోజుల తర్వాత స్టెప్పులేసేసరికి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈమె అభిమానులు అయితే డ్యాన్స్ చూసి ఫిదా అయిపోతున్నారు. చెల్లి నిశ్చితార్థం సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకొచ్చాయి. (ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) 'ప్రేమమ్' అనే మలయాళ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి.. ఆ తర్వాత తెలుగు, తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ బోలెడంత ఫేమ్ సంపాదించింది. అయితే గత రెండేళ్ల నుంచి సినిమాలు ఒప్పుకోకపోయేసరికి ఈమెకి పెళ్లి ఫిక్స్ అయిందని, యాక్టింగ్ పక్కనబెట్టేసిందని రూమర్స్ వచ్చాయి. కానీ తమిళంలో ఓ మూవీ, తెలుగులో 'తండేల్' చేస్తుందనేసరికి అందరూ రిలాక్స్ అయిపోయారు. ఇకపోతే సాయిపల్లవి కంటే చెల్లి పూజా కన్నన్ పెళ్లికి రెడీ అయిపోయింది. సంక్రాంతి టైంలో ప్రియుడి వినీత్‌ని పరిచయం చేసిన ఈమె.. తాజాగా కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుంది. అయితే ఈ వేడుకలో అందరితో కలిసి సాయిపల్లవి క్రేజీగా డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయిపోయింది. దిగువనే ఉంది. మీరు కూడా ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్‌బాస్' శోభాశెట్టి) ♥️ pic.twitter.com/OKc2gqzCDg — Sai Pallavi (@Sai_PallaviFans) January 21, 2024 -
బుట్టబొమ్మలా డ్యాన్స్ చేసిన అమ్మాయిలు.. వీడియో వైరల్
తోలు బొమ్మలాట.. ప్రేక్షకుకు సినిమా పరిచయం లేని రోజుల్లో ఓ వెలుగు వెలిగింది. చాలా కథలను, పురాణ గాథలను తోలు బొమ్మలాటతో చెప్పేవారు. ఇందులో కళాకారులు బొమ్మలు ఆడిస్తూ పద్యాలు చెప్పేవారు. దీన్ని బొమ్మలాట నాటకం అంటారు. అచ్చంగా బొమ్మలు కదులుతున్నట్లుగా ఉండే నృత్యాన్ని పప్పెట్ డ్యాన్స్ అంటారు. ఇందులో మనిషి ఎక్కడా వంపులు తిరగకుండా స్థిరంగా ఉండి, అక్కడక్కడా మెరుపులు చూపిస్తూ.. అచ్చంగా బొమ్మే కదులుతున్నట్లుగా డ్యాన్స్ చేస్తారు. తాజాగా ఓ పప్పెట్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఇద్దరు ఆడవాళ్లు హిందీ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. నిజంగానే వాళ్లు బొమ్మలా, రోబోలా నృత్యం చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Puppet dance by 2 ladies. Amazing performance 👌 pic.twitter.com/vimklKC78f — Aviator Anil Chopra (@Chopsyturvey) November 26, 2023 చదవండి: ట్రోలింగ్‌తో ఆర్టిస్ట్ ఆత్మహత్య.. అదే చివరి సంభాషణ అంటూ విలపిస్తున్న తల్లి.. -
Video: ఐదేళ్ల తర్వాత ప్రియుడిని కలిసిన యువతి.. ఎయిర్‌పోర్టులో సర్ప్రైజ్
ప్రేమ ఒక అద్భుతమైన భావోద్వేగం, ప్రేమించడం మాటల్లో చెప్పలేని ఒక ప్రత్యేక అనుభూతి. ప్రేమను మాటల్లోనే కాదు.. మన భావాలు, పనుల ద్వారా గొప్పగా చెప్పవచ్చు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్లో ప్రేమ భిన్నంగా ఉంటుంది. ప్రేమించిన వారు దూరంగా ఉన్న వారి మనసులు మాత్రం దగ్గరగా ఉంటాయి. పక్కన లేకపోయినా, రోజూ కలవకపోయినా ఆప్రేమ అలాగే ఉంటుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే అయిదు సంవత్సరాల తరువాత కలవబోతున్న తన ప్రియుడికి ఓ యూవతి వినూత్నంగా స్వాగతం చెప్పాలనుకుంది. ఎంతో కాలంగా దూరంగా ఉన్న ప్రియుడి కోసం ఆలోచించి వినూత్నంగా వెల్కమ్ చెప్పింది. ఎయిర్‌పోర్టులో అతడి ముందు ఎంతో అందంగా డ్యాన్స్ చేసి తన ప్రేమను వ్యక్త పరిచింది. ఈ దృశ్య కావ్యానికి ఈ కెనడాలోని ఎయిర్‌పోర్టు వేదికగా మారింది. ఓ యువకుడు లగేజ్‌తో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవగానే కొంతమంది అతనికి గులాబి పువ్వులు ఇచ్చి స్వాగతం పలుకుతారు. కానీ అతడు మాత్రం తన ప్రేయసి ఎక్కడుందంటూ వెతుకుతూ ఉంటాడు. ఇంతలోనే యువతి ఎదురుపడి ఎవరూ ఊహించని విధంగా ప్రియుడికి వెల్కమ్ చెప్పింది. బాలీవుడ్ మూవీ షేర్షాలోని ‘రతన్ లంబియాన్’ పాటకు ఎంతో డ్యాన్స్ చేసింది. ప్రేమికుడిని దగ్గరగా చూస్తూ అయిదు సంవత్సరాలు తన కోసం వేచి ఉన్న నిరీక్షణను సాంగ్, డ్యాన్స్ రూపంలో అతడికి తెలియజేసింది. క్యూట్ స్టెప్పులతో ఆహా అనిపించింది. ప్రియురాలి సర్ప్రైజ్కు ఉబ్బితబ్బైన వ్యక్తి.. ఆమె మరో పాటకు డ్యాన్స్ చేయాల్సి ఉండగానే దగ్గరకొచ్చి గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఈ వీడియోను నిక్కి షా అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 3 మిలియన్లకు పైగా వ్యూస్వచ్చాయి. ఒకటిన్నర లక్ష మంది లైక్ చేశారు. View this post on Instagram A post shared by Niki | Toronto Content Creator (@_nikishah) -
యూట్యూబ్ ట్రెండింగ్‌లో ‘తెలుగింటి సంస్కృతి’
‘పెళ్లాం ఊరెళితే’, ‘ఇంద్ర’ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రశాంతి హారతి. ఆమె కూతురు తాన్య హారతి ప్రధాన పాత్రలో నటించిన మ్యూజిక్ వీడియో ‘తెలుగించి సంస్కృతి’. వీఎస్ ఆదిత్య కాన్సెప్ట్ అందించిన ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. 1 మిలియన్ వ్యూస్ సాధించిన సందర్భంగా ఇటీవల టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో విజయోత్సవ వేడుకను నిర్వహించారు. తమ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవడం సంతోషంగా ఉందన్నారు. ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ మరియు బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అయిన గోపాల్ పొనంగి గారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు బృందం తమ ప్రగాఢమైన అభినందనలను తెలియజేసారు.ఈ ప్రాజెక్ట్‌ను ఘన విజయంతో ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన అద్భుతమైన 1M+ వీక్షకులకు బృందం వారి ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఆల్బమ్‌కి ప్రశాంతి హారతి కొరియోగ్రఫీ అందించడంతో పాటు కీలక పాత్ర పోషించారు. -
నాగార్జున హిట్ సాంగ్‌కు అమల అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్
టాలీవుడ్ బ్యూటిఫుల్ జోడి జాబితాలో నాగార్జున-అమలది ముందుంటుంది. ఇద్దరు కలిసి శివతో పాటు పలు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని రిలయ్ లైఫ్‌లోనూ జోడీగా మారారు. పెళ్లి తర్వాత అమల సినిమాలకు దూరమైంది. చాలా కాలం తర్వాత 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ మధ్య ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో శర్వానంద్‌కు తల్లిగా నటించిది. ఇలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ.. ఎక్కువ సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తుంది. ఇదిలా ఉంటే..తాజాగా అమల నాగార్జున పాటకు స్టెప్పులేసి అలరించింది. తాజాగా అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో జరిగిన ఓ వేడుకకి ముఖ్య అతిథిగా అమల వెళ్లారు. అక్కడ స్టేజ్‌పై అందరూ ఒక్కో పాటకు డ్యాన్స్ చేశారు. ఇత అమల కూడా నాగార్జున హీరోగా నటించిన ‘హలో బ్రదర్’లోని ‘ప్రియ రాగాలే’ పాటకు ఆమె కాలు కదిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియో తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై మీరూ ఒక లుక్కేయండి. నిన్న అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజ్ లో జరిగిన NEO FIESTA 2K23 లో చాలా ఏళ్ళ తరువాత అమల గారు డాన్స్ 👌#AmalaAkkineni#Amala pic.twitter.com/NSMuAGVhzL — Lakshmi Bhavani (@iambhavani1) September 3, 2023 -
విద్యార్థిని డ్యాన్స్ అదుర్స్.. సోషల్ మీడియాలో భారీ వ్యూస్
వరంగల్: టాలెంట్ ఉండాలే గానీ దాన్ని ఆపడం ఎవరి తరం కాదు..కాకపోతే కొంచెం ఆలస్యం కావొచ్చు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఎందరో ప్రతిభావంతులు త్వరగానే వెలుగులోకి వస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక ప్రతిభ కనబర్చింది. ఓ పాటకు ఆమె చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు మూడు లక్షల మంది ఆమె వీడియోను వీక్షించారు. వివరాల్లోకి వెళ్తే.. మల్లంపల్లిలోని ప్రభుత్వ హైస్కూల్లో దాసుగూడెం తండాకు చెందిన కునుసోత్ అంజలి పదో తరగతి చదువుతోంది. గత ఫిబ్రవరిలో సదరు పాఠశాలలో బాలసభ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో అప్పుడు 9వ తరగతి చదువుతున్న అంజలి ‘కాలం నీతో నడవదు... నిన్ను అడిగి ముందుకు సాగదు’ అనే పాటకు సూపర్ డ్యాన్స్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను గత మే 21న ఓ వ్యక్తి యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. దీంతో ఆ విద్యార్థి డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఆ వీడియోకు దాదాపు 3 లక్షల వ్యూస్ వచ్చాయి. అలాగే 10 వేల మంది వరకు లైక్ చేశారు. ఇప్పుడంతా ఆ విద్యార్ధి డ్యాన్స్ గురించే మాట్లాడుతూ ఉండడం విశేషం. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుల్లా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ అంజలి డ్యాన్స్‌లో ప్రతిభావంతురాలని, ప్రోత్సాహం అందిస్తే భవిష్యత్‌లో మంచి డ్యాన్సర్‌గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
కోహ్లి డ్యాన్స్ మూమెంట్స్.. షాక్ తిన్న హార్దిక్ పాండ్యా
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఇటీవలే 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. విండీస్‌తో జరిగిన రెండో టెస్టు ద్వారా 500వ మ్యాచ్ మైలురాయిని అందుకున్న కోహ్లి సెంచరీతో మెరిసి మ్యాచ్‌ను మధురానుభూతిగా మలుచుకున్నాడు. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 76వ శతకం సాధించి మరో రికార్డు నెలకొల్పాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 5 వికెట్లతో చెలరేగాడు. దాంతో, టీమిండియా టెస్టు సిరీస్‌ను 1-0తో చేజక్కించుకుంది. అలా టెస్టు సిరీస్ ముగియగానే వన్డే సిరీస్‌కు టీమిండియా సన్నాహకాలు మొదలుపెట్టింది. గురువారం తొలి వన్డే ప్రారంభానికి ముందు నెట్ ప్రాక్టీస్‌లో కోహ్లి చేసిన పని నవ్వులు పూయించింది. విషయంలోకి వెళితే.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో సాధన చేసిన కోహ్లి ఒక బంతికి చక్కటి షాట్ ఆడి తనదైన శైలిలో సంబురాలు చేసుకున్నాడు. 'మంచి బంతి వేస్తే ఇలా కొట్టాడేంటి..?'' అన్నట్లు పాండ్యా చూస్తూంటే.. కోహ్లీ మాత్రం ఈ బంతి బౌండ్రీ దాటడం పక్కా అన్నట్లు డ్యాన్స్ చేశాడు. సాధారణంగా ఫీల్డ్ అంపైర్లు ఫోర్ సిగ్నల్ ఇస్తున్నట్లు.. తనదైన డ్యాన్సింగ్ స్టెల్లో చేతులు ఊపుతూ విచిత్ర హావభావాలు పలికించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Virat Kohli having fun in nets with Hardik Pandya. pic.twitter.com/2KQ9BHHLkK — Mufaddal Vohra (@mufaddal_vohra) July 27, 2023 చదవండి: కుల్దీప్ యాదవ్ సంచలన స్పెల్.. వెస్టిండీస్ 114 ఆలౌట్ -
పెళ్లి రిసెప్షన్లో యువకుల హల్చల్.. తుపాకీ, తల్వార్‌తో డ్యాన్స్‌లు
సాక్షి, కామారెడ్డి: పెళ్లి రిసెప్షన్లో కొందరు యువకుడు వీరంగం సృష్టించారు. తుపాకీలు, కత్తులు చేతపట్టి డ్యాన్స్ చేశారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 10వ తేదీ రాత్రి మద్నూర్ మండల కేంద్రంలో జరిగిన పెళ్లి రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకలో పెళ్లి కొడుకుతోపాటు మరికొందరు యువకులు తల్వార్, గన్లతో డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ వీడియోలను కొందరు ఫేస్బుక్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. చివరికి ఈ విషయం పోలీసులకు చేరింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవ వరుడితోపాటు స్నేహితులనుఅదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
చిత్తూరు డెయిరీకి భూమి పూజ.. జగనన్న పాటకు, విద్యార్థినుల ఆట
సాక్షి, చిత్తూరు: జగనన్న ప్రభుత్వం మరో హామీని నిలబెట్టుకుంది. చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ ఆచరణకు నోచుకుంది. ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్న రైతన్నల కల నెరవేరుతోంది. మంగళవారం రోజున సీఎం వైఎస్ జగన్ చిత్తూరు డెయిరీ వద్ద అమూల్ సంస్థ ప్రాజెక్ట్‌కు భూమిపూజ చేశారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఫొటో సెషన్, ఎగ్జిబిషన్ పరిశీలించి బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. రైతు సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిన వైఎస్సార్సీపీ తాజా ముందడుగుతో జిల్లా వ్యాప్తంగా పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనం కోసం జగన్ సర్కార్ అంటూ జగనన్నకు జయజయ ధ్వానాలు పలికారు. ఈక్రమంలోనే సభా ప్రాంగణంలో కొందరు విద్యార్థినిలు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ యాత్రను ప్రశంసిస్తూ సాగిన పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ‘పేదోళ్ల కన్నీరు తుడిచే చేయి నీవన్న.. కళ్లల్లో నిండే మా వెలుగే నీవన్న.. జగనన్న’ అనే పాట, విద్యార్థులు ఆట.. అక్కడ ఉన్నవారిని ఎంతగానో ఆకట్టుకుంది. -
సారంగ దరియా పాటకు సితార డాన్స్
-
తెలుగులోనే పూర్తి ప్రసంగం.. కళాకారులతో గవర్నర్ తమిళిసై డ్యాన్స్
సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, ప్రముఖుల మధ్య గవర్నర్ కేక్ కట్ చేశారు. వేడుకల సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ డ్యాన్స్ వేశారు. అక్కడ నృత్యకారులతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులేశారు. గవర్నర్ తమిళిసైకి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అనంతరం గవర్నర్ తొలిసారి తన ప్రసంగాన్ని మొత్తం తెలుగులో మాట్లాడారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనేక పోరాటాల వల్ల సాధించుకున్న తెలంగాణకు గవర్నర్‌గా రావడం దేవుని ఆశీర్వాదమన్నారు. 1969 తొలిదశ ఉద్యమంలో పాల్గొన్న సమరయోధులకు తమిళిసై పాదాభివందనం చేశారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో మూడు వందల మందికిపైగా ప్రాణ త్యాగం చేయడం తెలంగాణ ఆకాంక్ష ఎంత బలంగా ఉందో ఆనాడో తెలియజేస్తుందన్నారు. దశాబ్ద కాలంలో తెలంగాణ ఎన్నో ప్రత్యేకతలు చవి చూసిందని తెలిపారు. స్వరాష్ట్ర ఏర్పాటులో భాగంగా తనువు చాలించిన వారి పేర్లను స్మరించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గొప్పగా ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ అంటే స్లోగన్ కాదని, ప్రజల ఆత్మగౌరవ నినాదామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. చదవండి: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు ఆత్మహత్యాయత్నం -
యంగ్ హీరోతో కలిసి స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్
గత కొంతకాలంగా మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆమె విడాకుల గురించి సోషల్ మీడియా అంతా వార్తలు చక్కర్లు కొడుతున్నా నిహారిక మాత్రం అవేం పట్టనట్లు తన పని తాను చేసుకుంటూ పోతుంది. పెళ్లి తర్వాత యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పి కేవలం నిర్మాతగా మారిపోయిన నిహారిక ఇప్పుడు మళ్లీ స్క్రీన్‌పై కనిపించేందుకు రెడీ అయిపోయింది. చదవండి: వెనక్కి తగ్గిన ప్రశాంత్ వర్మ.. హనుమాన్ వాయిదా ఓవైపు సొంతంగా ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్‌ని స్థాపించి సినిమాలు, వెబ్‌సీరీస్‌లు నిర్మిస్తూనే, మరోవైపు సందర్భం వచ్చినప్పుడు తెరపై కనిపించేందుకు యాక్టివ్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ యంగ్ హీరోతో కలిసి డ్యాన్స్ స్టెప్పులేసింది. సంతోష్ శోభన్ హీరోగా నందినీ రెడ్డి దర్శకత్వంలో అన్నీ మంచి శకునములే అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి మెరిసే మెరిసే సాంగ్‌కు నిహారికతో కలిసి సంతోష్ శోభన్ స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: ఒక్క మూవీకే రూ.32 కోట్ల నష్టం, సినిమాలు వదిలేద్దామనుకున్నా -
ఢిల్లీ మెట్రోలో మరో యువతి డ్యాన్స్.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో ఢిల్లీ మెట్రో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. మెట్రోలో ప్రయాణికులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. వారి చర్యలు మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ.. పట్టించుకోకుండా హద్దులు మీరుతున్నారు. ముఖ్యంగా మెట్రోలో లవర్స్ శ్రుతి మించి వ్యవహరించడం, యువతీ యువకుల డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే పాపులర్ అయ్యేందుకే కొంతమంది మెట్రోను ఉపయోగించుకుంటున్నారనే సందేహం కలుగుతోంది. మెట్రోలో వీడియోలు చిత్రీకరించడంపై బ్యాన్ విధించాలంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీ మెట్రోలో ఓ యువతి తన డ్యాన్స్‌తో వైరల్‌గా మారింది. రెడ్ టాప్, గ్రే కలర్ స్కర్ట్ ధరించిన యువతి కాకా పాడిన 'షేప్' అనే పంజాబీ పాటకు డ్యాన్స్ చేసింది. మెట్రో మధ్యలో నిలబడి ఉత్సాహంగా స్టెప్పులు వేసింది. ఈ వీడియోను సదరు యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసింది. అయితే.. మెట్రోలో డ్యాన్స్ చేయడానికి అనుమతి లేదని తెలుసని, కానీ మొదటిసారి ఢిల్లీ మెట్రోలో ఇలా ట్రై చేశానని చెబుతూ మరీ యువతి తన వీడియోను పోస్టు చేసింది. ఇప్పటికే ఈ వీడియోను 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది యువతి డ్యాన్స్‌ను, ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే.. మరికొంతమంది మెట్రోలో ఇలాంటి పిచ్చి వేషాలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చదవండి: ఇంటి ఓనర్ పాడు పని.. అమ్మాయిల ఫ్లాట్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. View this post on Instagram A post shared by self taught✨🤌 (@itz__officialroy) -
ఇలియానా పాటకు అదిరిపోయిన స్టెప్పులేసిన అదితి శంకర్
ఇతర రంగాల కంటే సినీ రంగంలో వారసత్వం అనేది కాస్త ఎక్కువే అని చెప్పక తప్పదు. ఇక్కడ నటీనటుల వారసులే కాకుండా దర్శకుడు, నిర్మాతల వారసులు కూడా రంగ ప్రవేశం చేస్తున్నారు. అలా ప్రముఖ దర్శకుడు శంకర్ వారసురాలిగా ఆయన కూతురు అదితి శంకర్ కథానాయకిగా విరుమాన్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే ఈ హైటెక్ సిటీ బ్యూటీ పక్కా గ్రామీణ యువతి పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. అలా చిత్ర పరిశ్రమ దృష్టిని తన వైపుమల్లేల చేసుకుంది. ప్రస్తుతం శివకార్తికేయన్‌కు జంటగా మా వీరన్ చిత్రంలో నటిస్తోంది. (చదవండి: చైతన్య మాస్టర్ ఆత్మహత్య.. శ్రద్దా దాస్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్) విశేషం ఏంటంటే ఈ చిత్రం తెలుగులోనూ మహావీరుడు పేరుతో విడుదల కానుంది. అలా నటి ఆదితి శంకర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. తాజాగా మరికొన్ని కొత్త చిత్రాలను కమిట్ అయిన ఈమె తరచూ సోషల్ మీడియాలో కనిపించే ప్రయత్నం చేస్తోంది. అలా తాజాగా ఆమె తన తండ్రి దర్శకత్వం వహించిన చిత్రంలోని ఓ పాటకు డాన్స్ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. దర్శకుడు శంకర్ ఇంతకుముందు విజయ్, శ్రీకాంత్, జీవ హీరోలుగా నన్భన్ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అందులో నటి ఇలియానా కథానాయకి. కాగా ఆ చిత్రంలో విజయ్ ఇలియానాలపై చిత్రీకరించిన చిల్లీ టెల్లీ అనే పాట మంచి హిట్ అయ్యింది. కాగా ఆ పాటకు నటి అదితి శంకర్ చాలా ఫాస్ట్‌గా డాన్స్ చేసింది. దాన్ని వీడియోగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అది ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
చీరకట్టులో యువతి డ్యాన్స్.. ఢిల్లీ మెట్రో మరో వీడియో వైరల్..
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఓ యువతి టూ పీస్ బికినీ టైప్ డ్రెస్ ధరించి ప్రయాణించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరో ఘటనలో సీటు కోసం గొడవపడుతూ ఓ మహిళ మరో మహిళపై పెప్పర్ స్ప్రే కొట్టింది. తాజాగా ఓ యువతి చీరకట్టులో ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫాంపై డ్యాన్స్ చేసి హల్చల్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎర్ర చీర ధరించి బోజ్‌పురి పాటకు అదిరే స్టెప్పులేసి అదరగొట్టిన ఈ యువతి పేరు అవ్నీకరీశ్. ఇన్‌స్టాలో తన డ్యాన్స్ వీడియో పోస్టు చేసింది. ఇప్పటికే వేల మంది ఈ వీడియోను వీక్షించారు. View this post on Instagram A post shared by Avnikarish Avnikarish (@avnikarish) అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఢిల్లీ మెట్రో ఆవరణలో ఇలాంటి ఫొటోలు, వీడియోల చిత్రీకరణపై నిషేధం అమల్లో ఉంది కాదా.. అయినా ఎలా రికార్డు చేశారు అని కొందరు అభ్యంతరం తెలిపారు. మరికొందరేమో ఇలాంటి వాటిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకొందరు మాత్రం యువతి స్టెప్పులకు ఫిదా అయ్యారు. ఎలాంటి భయం లేకుండా మెట్రో ప్లాట్‌ఫాంపై డ్యాన్స్ చేసిన ఈమె ధైర్యవంతురాలు అని ప్రశంసలు కురిపించారు. ఈమె డ్యాన్స్‌ను తెగమెచ్చుకున్నారు. అవ్నీకరీశ్ ఢిల్లీ మెట్రోలో డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. మార్చిలోనూ సోనూ నిగమ్ పాటకు నృత్యం చేసి.. ఆ వీడియోనూ కూడా ఇన్‌స్టాలో పోస్టు చేసింది. చదవండి: తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం కాదు.. దాన్ని కూల్చేయాలి: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు -
వాట్ ఏ.. బ్యూటీ నే నువ్వు.. మిస్ వరల్డ్ కుక్కల కాంటెస్ట్ కి పంపాలి నిన్ను...
-
ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న కీర్తిసురేష్ ఊరమాస్ డ్యాన్స్
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న సినిమా దసరా. నాని, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో దిగ్విజయంగా దూసుకెళుతోంది. ఇక సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రా అండ్ రస్టిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేష్‌లు నటించారు. వీరి నటనకు ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. డీ గ్లామరస్ రోల్లో కీర్తి ఇందులో జీవించేసింది. ఈ క్రమంలో తాజాగా వెన్నెల పాత్రకు సంబంధించి ఓ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. పెళ్లి కూతురు గెటప్‌లో బరాత్‌లో వెన్నెల చేసే మాస్ డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. ఊరమాస్ స్టెప్పులతో ఇరగదీస్తుందంటూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతుంది. -
Viral Video: రైల్వే స్టేషన్లో యువతి బిత్తర స్టెప్పులు.. అయినా 10 లక్షల వ్యూస్!
సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరూ చూసినా ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్, స్నాప్చాట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. యూట్యూబ్ వీడియోలు, రీల్స్‌తో తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యేందకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అర్థవంతమైన, ప్రజలకు అవసరమైన కంటెంట్‌ను అందించి ఫేమస్ అవుతుంటే మరికొందరు జనాల దృష్టిని ఆకర్షించేందకు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పిచ్చిచేష్టలు, అర్థంపర్థం లేని డ్యాన్స్‌లతో ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి కోవకు సంబంధించిన ఓ వీడియోనే ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సీమా కనోజియా అనే యువతి రైల్వే స్టేషన్లో డ్యాన్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇందులో యువతి రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్లో అక్షయ్ ఖన్నా, ఐశ్వర్యరాయ్ నటించిన ‘ఆ అబ్ లౌత్ చలే’ సినిమాలోని ‘మేరా దిల్ తేరా దీవానా’ అనే పాటకు పిచ్చిపిచ్చిగా డ్యాన్స్ చేసింది. బ్లూ కలర్ డ్రెస్‌లో పాటకు సంబంధం లేకుండా ఆమె వేసిన స్టెప్పులు ఎవరిని ఆకట్టులేకపోకపోయాయి. అయినా యువతి అవేవి పట్టించుకోకుండా ధైర్యంగా డ్యాన్స్ చేయడం కొసమెరుపు. View this post on Instagram A post shared by Seema Kanojiya (@seemakanojiya87) దీనికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని ఇప్పటికే 10 లక్షల మంది వీక్షించారు. యువతి బిత్తర స్టెప్పులపై నెటిజన్లు కడుపుబ్బా నవ్వుతున్నారు. ఆమె డ్యాన్స్‌ను ట్రోల్చేస్తున్నారు. మరికొందరు ఇతరులకు ఇబ్బంది కలిస్తున్న ఈమెలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదికాగా సదరు యువతికి ఇన్‌స్టాలో 3లక్షలకు పైగా ష్యాన్స్ ఫాలోయింగ్ ఉండటం గమనార్హం. అయితే యువతి ఇలాంటి వీడియోలు పెట్టడం ఇదేం తొలిసారి కాదు, లోకల్ రైలు, రోడ్డు ఎలా ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది. View this post on Instagram A post shared by Seema Kanojiya (@seemakanojiya87) View this post on Instagram A post shared by Seema Kanojiya (@seemakanojiya87) View this post on Instagram A post shared by Seema Kanojiya (@seemakanojiya87) -
Viral Video: అరే వాహ్.. అద్భుత స్టెప్పులతో అదరగొట్టిన బామ్మ
మ్యూజిక్ వినిపిస్తే చాలు కొంతమంది ఆటోమెటిక్‌గా కాలు కదిపేస్తుంటారు. లోకాన్ని మర్చిపోయి ఎంతో ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంటారు. ఈ మధ్య ఏ ఫంక్షన్, కార్యక్రమం జరిగినా డ్యాన్స్ లేకుండా ఉండటం లేదు. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఉత్సాహంగా స్టెప్పులేసేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. తాజాగా ఇలాంటి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఓ బామ్మ సూపర్ ఎనర్జిటిక్ స్టెప్పులు వేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. మహిళల కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో స్టేజ్‌పై ఉన్న సింగర్స్ పాటపాడుతుంటే అక్కడున్న వారంతా డ్యాన్స్ చేశారు. వారిలో అందరికంటే ముందు వరుసలో నిల్చున్న ఓ బామ్మ.. ఇతరులతో కలిసి ఎంతో హుషారుగా డ్యాన్స్ చేసింది. మరాఠీ పాటకు అద్భుత స్టెప్పులతో అదరహో అనిపించింది. 60 ఏళ్ల పైవయసున్న బామ్మ.. చుట్టుపక్కన వారిని పట్టించుకోకుండా, పూర్తిగా పాటను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ ఇరగదీసింది. బామ్మ డ్యాన్స్‌కు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె స్టామినా చూసి అవాక్కువుతున్నారు. ఆ వయస్సులో ఉరకలేస్తున్న ఆమె ఉత్సాహం చూసి ఫిదా అవుతున్నారు. మళ్లీ బాల్యం గుర్తొచ్చిందా బామ్మ.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీరు ఆ వీడియోను చూసేయండి. aaji at the front has cured my depression 😩 pic.twitter.com/QRkVSwVSov — gordon (@gordonramashray) March 25, 2023 -
వామ్మో..! మాజీ ఎంపీ వీహెచ్ డ్యాన్స్ చూడండి
-
రంజితమే పాటకు డ్యాన్స్ ఇరగదీసిన కలెక్టర్.. వైరలవుతోన్న వీడియో
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, రష్మిక మందన నటించిన వారిసు(తెలుగులో వారసుడు) చిత్రంలోని రంజితమే పాట ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాటలోని లిరిక్స్‌కు అనేకమంది రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసి తమ టాలెంట్‌ను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. తాజాగా రంజితమే పాటకు ఏకంగా ఓ కలెక్టర్ డ్యాన్స్ చేశారు. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లాల్సిందే.. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా మహిళలు ఘనంగా జరుపుకున్నారు. తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో జిల్లా కలెక్టరేట్లో వుమెన్స్ డేను సంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో కలెక్టర్, ఇతర ఉద్యోగులతో పాటు పురుషులు కూడా పాల్గొన్నారు. అనంతరం వేదికపై ప్లే చేసిన పాటలకు పలువురు నృత్యాలు చేశారు. ఇదే క్రమంలో కలెక్టర్ కూడా డ్యాన్స్ చేయాలని కోరడంతో దళపతి విజయ్ హీరోగా నటించిన వారిసు మూవీలోని రంజితమే అనే సాంగ్‌కు అద్బుతంగా డ్యాన్స్ చేశారు. ఇతర మహిళా అధికారులతో కలిసి అచ్చం రియల్ పాటలో మాదిరిగా ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కలెక్టర్ డ్యాన్స్‌పై సూపర్ మేడమ్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. Pudukkottai collector Kavitha Ramu @kavitharamu dances to 'Ranjithame' song along with other women officials, as a part of International #WomensDay celebrations at the district collectorate on Friday. @xpresstn pic.twitter.com/qRaSW2F9Ho — Iniya Nandan (@Iniyanandan25) March 10, 2023 -
మరోసారి వైరల్ అవుతున్న రఘువీరారెడ్డి
సాక్షి, బెంగళూరు: నీలకంఠపురం రఘువీరారెడ్డి.. పీసీసీ మాజీ చీఫ్, మడకశిర మాజీ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఈయన.. వయసు మీదపడుతున్న ఛాయలతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం హల్ చల్ చేస్తుంటారు. తాజాగా.. బెంగళూరులో కుటుంబ సభ్యులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. సరదాగా చిందులు వేస్తూ అల్లరి చేసిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. -
ట్రెండింగ్ సాంగ్‌కి టీమిండియా క్రికెటర్ స్టెప్పులు.. వైరల్
Shreyas Iyer Shakes Leg For Tum Tum Song Video: టీమిండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఆటలోనే కాదు డ్యాన్స్‌లోనూ అదరగొట్టగలడు. ఇప్పటికే ఈ విషయాన్ని ఎన్నోసార్లు నిరూపించాడు కూడా! తాజాగా మరోసారి తన డాన్సింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకున్నాడీ ముంబై బ్యాటర్. తన తోబుట్టువు శ్రేష్టతో కలిసి ట్రెండింగ్ సాంగ్‌కి స్టెప్పులేశాడు. ‘‘మాల టమ్ టమ్.. మంతరం టమ్ టమ్’’ అంటూ తమిళపాటకు కాలుకదిపాడు. బాస్కెట్‌బాల్ కోర్టులో చెల్లెలితో కలిసి స్టెప్పులు అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను శ్రేయస్ సోదరి శ్రేష్ట ఇన్‌స్టాలో పంచుకోగా వైరల్ అవుతోంది. ‘ఉత్తమ పాటకు ఉత్తమ వ్యక్తితో డాన్సింగ్’ అంటూ దిష్టి తగలకూడదన్నట్లు ఎమోజీ జత చేసింది. కాగా శ్రేష్ట కొరియోగ్రాఫర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇక శ్రేయస్, శ్రేష్ట రోహిణి అయ్యర్- సంతోష్ అయ్యర్ దంపతుల సంతానం. టెస్టు సిరీస్‌తో బిజీ గాయం కారణంగా ఆస్ట్రేలియాతో మొదటి టెస్టుకు దూరమైన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ రెండో మ్యాచ్‌తో జట్టులోకి వచ్చాడు. అయితే, తన మార్కు చూపించడంలో విఫలమయ్యాడు. ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులు మాత్రమే చేసి నాథన్ లియోన్ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. రెండుసార్లు స్పిన్నర్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. ఇక మార్చి 1 నుంచి ఇండోర్ వేదికగా ఆరంభం కానున్న మూడో టెస్టుకు శ్రేయస్ అయ్యర్ సన్నద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. చదవండి: Virat Kohli: అత్యాశ లేదు! బాధపడే రకం కాదు.. ఆయనకు ఫోన్ చేస్తే 99 శాతం లిఫ్ట్ చేయడు.. అలాంటిది.. ENG vs NZ: న్యూజిలాండ్ కెప్టెన్ అరుదైన ఘనత.. ధోని రికార్డు సమం View this post on Instagram A post shared by Shresta Iyer (@shresta002) -
డ్యాన్స్ ఇరగదీసిన పెద్దాయన.. కుర్రాళ్లు అసూయపడేలా స్టెప్పులు..
ఆనందాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యక్తపరుస్తారు. కొందరు సంతోషంగా ఉన్నప్పుడు మొహం వెలిగిపోతుంది. కళ్లు మెరుస్తాయ్. మాట తీరు కూడా మారిపోతుంది. ఇక పట్టరాని ఆనందం వస్తే మరికొందరు పాటలు పాడుతారు, కాలు కదిపి డ్యాన్స్ కూడా చేస్తుంటారు. ఓ 82 ఏళ్ల వ్యక్తి కూడా సరిగ్గా ఇలానే చేశారు. పట్టలేని సంతోషంలో నృత్యం చేసి అదిరే స్టెప్పులతో అదరగొట్టారు. ఆ వయసులో ఆయన ఎనర్జీ చూస్తుంటే కూర్రాళ్లకు కూడా అసూయ పుట్టేలా ఉంది. అంతలా తనను తాను మర్చిపోయి డ్యాన్స్‌లో మునిగిపోయారు. సూటు, బూటు ధరించి నాటు స్టెప్పులతో ఇరగదీసిన ఈ పెద్దాయన డ్సాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ పార్టీలో ఆయన డ్యాన్సే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ మీరూ చూసేయండి.. View this post on Instagram A post shared by praveenyadav (@fitfoodfactory_on_runway) -
జోష్‌తో డ్యాన్స్.. విధి విచిత్రంగా ప్రాణం తీసింది
వైరల్: ఏ నిమిషానినో ఏమి జరుగునో ఎవరూహించెదరు?.. మనిషి జీవం విషయంలో ఇప్పుడు ఇలాగే జరుగుతోంది. నిన్న కళ్లెదురుగా నవ్వుతూ హుషారుగా కనిపించిన మనిషి.. ఇవాళ బతికి లేడు అని వినాల్సి వస్తున్న రోజులువి. కన్నవాళ్లను, భార్యాబిడ్డలను, అయినవాళ్లను ఉన్నట్లుండి శోకంలో ముంచెత్తి వెళ్లిపోతున్నారు. పైగా ఉన్నట్లుండి కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు..అందునా పాతిక నుంచి నలభై ఐదేళ్లలోపు వాళ్ల మరణాలే అత్యధికంగా నమోదు అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. తాజాగా.. మధ్యప్రదేశ్‌లో ఓ పెళ్లింట నెలకొన్న విషాదం తాలుకా ఘటన వీడియో తెగ వైరల్ అవుతోంది. యూపీ కాన్పూర్‌కు చెందిన 32 ఏళ్ల అభయ్ సచాన్ను విధి విచిత్రంగా మరణంతో చుట్టుకెళ్లిపోయింది. అభయ్.. సోమవారం దగ్గరి బంధువుల వివాహం కోసం మధ్యప్రదేశ్ రేవాకు వచ్చాడు. మంగళవారం రాత్రి వివాహ వేడుకలో హుషారుగా డ్యాన్స్‌లు చేశాడు. అలా గంతులేస్తూనే ఉన్నట్లుండి.. నెమ్మదిగా కిందకు వాలిపోయాడతను. అది గమనించిన బంధువుల దగ్గరికి వెళ్లి చూసేసరికి.. అతనిలో ఎలాంటి చలనం లేదు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా.. కార్డియాక్ అరెస్ట్‌తో అప్పటికే కన్నుమూశాడని వైద్యులు ప్రకటించారు. పైగా షాకింగ్ విషయం ఏంటంటే.. అతను మద్యం మత్తులో లేడట. అతను పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని వైద్యులు ప్రకటించడం. దీంతో ఆ యువకుడి మరణాన్ని ఎవరూ తట్టుకోలేకపోయారు. అలా పెళ్లింటి విషాదం నెలకొని.. అతని సంతాప సభను నిర్వహించాల్సి వచ్చింది. సెలబ్రిటీలే కాదు.. ఇలాంటి మరణాలకు ఎవరూ అతీతులు కావడం లేదు. పదుల వయసున్న పిల్లల దగ్గరి నుంచి యుక్త వయసు కుర్రకారు కూడా ఇలాంటి మరణాల బారినపడుతోంది. వైద్య నిపుణులు సైతం ఇలాంటి మరణాలకు ఒక స్పష్టత అంటూ ఇవ్వలేకపోతుండగా.. అధ్యయనాలు మాత్రం రకరకాల నివేదికలను ఇస్తూ పోతోంది. 18 Jan 2023 : 🇮🇳 : On Camera, Abhay Sachan(32) dancing at Wedding collapses and Dies due to 🫀arrest💉... He is a resident of Uttar Pradesh's Kanpur districts, had come to Rewa for the wedding.#heartattack2023 #heartattack #cardiacarrest pic.twitter.com/FQFeZA3ZNa — Anand Panna (@AnandPanna1) January 18, 2023 -
సీమంతం వేడుకలో డ్యాన్స్‌తో అదరగొట్టిన లాస్య.. వీడియో వైరల్
ప్రముఖ యాంకర్ లాస్య మంజునాథ్ మరోసారి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే తాను గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది లాస్య. తాజాగా ఆమె సీమంతం వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకలో బిగ్‌బాస్‌లో సందడి చేసిన మెహబూబా, దేత్తడి హారిక, గీతూ రాయల్ తదితరులు పాల్గొన్ని హల్ చేశారు. ఇప్పటికే లాస్య సీమంతంకు సంబంధించిన సీమంతం ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Lasya Chillale (@lasyamanjunath) తాజాగా లాస్య సీమంతంకు సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకుంది. అందులో లాస్య భర్త మంజునాథ్ ఆమెను స్టేజ్‌పైకి తీసుకెళ్లడం.. మెడలో దండేసి, తిలకం పెట్టి, నుదుటిపై ముద్దు ఇస్తున్నాడు. అలాగే మరో వీడియోలో ఓ హిందీ పాటకు స్నేహితులతో కలిసి లాస్య డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా 2017లో మంజునాథ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది లాస్య. 2019లో ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. View this post on Instagram A post shared by Lasya Chillale (@lasyamanjunath) -
యూనిఫామ్ ఉందని మరిచారా సార్! మహిళతో ఎస్సై డ్యాన్స్ వీడియో వైరల్
న్యూఢిల్లీ: డ్యూటీలో ఉన్న సమయంలో రీల్స్, డ్యాన్సులు చేస్తూ వైరల్‌గా మారిన ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సస్పెండ్ అయిన సంఘటనలు చాలానే జరిగాయి. అయినప్పటికీ కొందరిలో ఎలాంటి మార్పు రావటం లేదు. తాము డ్యూటీలో ఉన్నామని, యూనిఫామ్‌లో ఉన్నామనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఇలాగే ఓ పోలీసు అధికారి మైమరిచిపోయి మహిళతో చిందులేశారు. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో చిక్కుల్లో పడ్డారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఆ పోలీసు అధికారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు సమాచారం. నైరుతి ఢిల్లీలోని నారాయణ పోలీస్ స్టేషన్ ఇంఛార్జిగా శ్రీనివాస్ విధులు నిర్వర్తిస్తున్నారు. బంధువుల ఇంట్లో నిశ్చితార్థం వేడుకలకు పోలీసు యూనిఫామ్‌లోనే హాజరయ్యారు. ఈ క్రమంలో తమ బంధువైన ఓ మహిళతో ‘బలామ్ థనేందర్- నా ప్రేమికుడు పోలీసు’ అనే పాటకు కాలు కదిపారు. మహిళతో పాటు మైమరిచిపోయి డ్యాన్స్ చేశారు. మరోవైపు.. కొందరు పోలీసు సిబ్బంది ఆయనపై నోట్ల వర్షం కురిపించారు. అక్కడున్న వారంతా ఈ దృశ్యాలను తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. అయితే.. పోలీసు అధికారి సెలవులో ఉన్నారని సమాచారం. వీడియో వైరల్‌గా మారిన క్రమంలో పోలీసు అధికారిపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. పోలీసు యూనిఫామ్‌లో డ్యాన్సులు చేయటమేంటని ప్రశ్నిస్తున్నారు. స్టేషన్ ఇంఛార్జి తీరుపై ఉన్నతాధికారులు సైతం అసహనంతో ఉన్నారనే సమాచారం. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Video Of Delhi Cop's Dance In Uniform Goes Viral, He May Face Action https://t.co/WonuFuamws pic.twitter.com/vji8qdvtkT — NDTV (@ndtv) December 20, 2022 ఇదీ చదవండి: ‘శునకం’ వ్యాఖ్యలపై దద్దరిల్లిన రాజ్యసభ.. క్షమాపణలకు ఖర్గే ససేమిరా -
క్లాస్‌రూమ్‌లో విద్యార్థులతో టీచర్ మాస్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో సూపర్ ట్విస్ట్!
ఇటీవలి కాలంలో క్లాస్ రూమ్స్‌లో విద్యార్థులతో పాటు టీచర్లు డ్యాన్స్ చేయడం చాలా వీడియోల్లో చూశాము. తాజాగా ఓ మహిళా టీచర్ కూడా క్లాస్ రూమ్‌లో విద్యార్థులతో కలిసి స్టెప్పులు వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ టీచర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను విధుల నుంచి తొలగించాలని కామెంట్స్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఈ వీడియోలో భోజ్‌పురి సాంగ్ పత్లి కమరియ మోరికు ఏకంగా క్లాస్‌రూంలోనే టీచర్ డ్యాన్స్ చేస్తుండటం కనిపించింది. ఆపై టీచర్‌తో పాటు పిల్లలు కూడా కెమెరా వైపు చూస్తూ ఆనందంలో ఎంతో హ్యాపీగా డ్యాన్స్ చేస్తుంటారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన టీచర్ వారి ఎదుట సినిమా పాటకు ఆడిపాడటం ఏంటని కొందరు ప్రశ్నించారు. గురువులపై ఉన్న గౌరవాన్ని కోల్పోయేలా చేయవద్దని మరో యూజర్ హితవు పలికారు. స్టూడెంట్స్‌తో డ్యాన్స్ వీడియో రికార్డు చేయడం కరెక్ట్ కాదంటూ మరో నెటిజన్ ఫైరయ్యారు. టీచర్‌పై తక్షణమే వేటు వేయాలని కొందరు యూజర్లు డిమాండ్ చేశారు. बचपन में ऐसी Teacher हमें क्यों नहीं मिली 🥲❤️ pic.twitter.com/DCmx6USvD1 — ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) December 2, 2022 -
స్టేజ్‌పై మహేశ్ బాబు కొడుకు గౌతమ్ యాక్టింగ్.. వీడియో వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతల ముద్దుల కూతురు సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. డ్యాన్స్ వీడియోలు, అన్నయ్య గౌతమ్‌తో చేసే అల్లరి వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను అలరిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం అంత యాక్టివ్‌గా ఉండదు. చెల్లెలు మాదిరి అల్లరి వీడియోలను షేర్ చేయడు. సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా సైలెంట్‌గానే ఉంటాడు గౌతమ్. అయితే స్కూల్లో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటాడట. చదువు మాత్రమే కాదు ఇతర ప్రొగ్రామ్స్‌లో కూడా చురుగ్గా పాల్గొంటాడట. తాజాగా గౌతమ్ తన స్కూల్లో స్నేహితులతో కలిసి నాటకం వేశాడు. స్టేజిపైన యాక్టివ్‌గా డ్యాన్స్ చేశాడు. హైస్కూల్లో గౌతమ్ వేసిన మొదటి నాటకం వీడియోను నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. గౌతమ్ ఇప్పటికే నాన్న మహేశ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. మహేశ్-సుకుమార్ కాంబోలో వచ్చిన వన్ నేనొక్కడినే చిత్రంలో గౌతమ్ నటించాడు. ఆ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. కానీ ఈ వీడియో చూశాక.. గౌతమ్‌లో గొప్ప నటుడు ఉన్నాడని, తండ్రి మాదిరే ఆయన కూడా భవిష్యత్తులో స్టార్ హీరో అవుతాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
లతా మంగేష్కర్ పాటకు మిస్టర్ బీన్ స్టెప్పులు
అయేషా.. గత వారం రోజులుగా ఇంటర్నెట్ను ఊపేస్తున్న పేరు. లతాజీ పాడిన క్లాసిక్ సాంగ్ ‘మేరా దిల్ యే పుకారా ఆజా’ రీమిక్స్ వెర్షన్‌కు ఓ వివాహ వేడుకలో ఆ చిన్నది వేసిన చిందులకు యావత్ ఇంటర్నెట్ ప్రపంచం ఫిదా అయ్యింది. పాకిస్థాన్ లాహోర్‌కు చెందిన అయేషా.. ఓ వెడ్డింగ్ రిసెప్షన్లో భారతరత్న లతా మంగేష్కర్ ఆలపించిన మేరా దిల్ యే పుకారా ఆజా సాంగ్ రీమిక్స్‌కు లయబద్ధంగా స్టెప్పులు వేసింది. ఆ వీడియో కాస్త ఇంటర్నెట్ను షేక్ చేసింది. మన దేశంతో సహా ఎంతో మంది ఆమె స్టెప్పులకు ఫిదా అయిపోయారు. ఓవర్ నైట్‌లోనే ఫాలోవర్స్‌ను అమాంతం పెంచేసుకుని ఈ-సెలబ్రిటీ అయిపోయింది అయేషా. అయేషా స్ఫూర్తితో ఇన్‌స్టాలో రకరకాల వెర్షన్లు వచ్చేశాయి. అంతేకాదు నాగిని(1954) చిత్రంలోని ఒరిజినల్ పాట కోసం, లతాజీ గాత్రం కోసం ఎంతో మందిని వెతుక్కునేలా చేసింది. మరోవైపు ఫన్నీగా, క్రియేటివ్‌గా రీల్స్ రూపొందించే యత్నం చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చిందే మిస్టర్ బీన్ వెర్షన్. మిస్టర్ బీన్స్ హాలీడే చిత్రంలో రోవన్ అట్కిన్సన్ ఓ సీన్లో ఆయన డ్యాన్స్ చేస్తారు. ఆ వీడియోను.. మేరా దిల్ యే పుకారా ఆజాకు ముడిపెట్టిన ఫన్నీ రీల్ క్రియేట్ చేశారు. ఆ ఫన్నీ వెర్షన్‌తో పాటు అయేషా వెర్షన్‌పైనా ఓ లుక్కేయండి మరి!. View this post on Instagram A post shared by 𝐅𝐑𝐊 𝐌𝐀𝐆𝐀𝐙𝐈𝐍𝐄 𝐏𝐀𝐊𝐈𝐒𝐓𝐀𝐍 (@frk.magazine) -
ఢిల్లీలో సందడి చేసిన రామ్ చరణ్, అక్షయ్ కుమార్
-
‘రంగమ్మ.. మంగమ్మ’ పాటకు అక్షయ్‌తో రామ్ చరణ్ డ్యాన్స్.. వీడియో వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి స్టెప్పులైనా ఈజీగా వేసేస్తాడు. ఆయన డ్యాన్స్‌లో ఓ స్టైల్ ఉంటుంది. అందుకే చరణ్ స్టెప్పులేస్తే..అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. చివరకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా రామ్ చరణ్ స్టెప్పులకు ఫిదా అయ్యాడు. చరణ్‌తో కలిసి కాలు కదుపుతూ..డ్యాన్స్‌ని ఆస్వాదించాడు. ఢిల్లీలో ఓ ప్రైవేట్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వెళ్లిన రామ్‌చరణ్.. అక్షయ్‌తో కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేశాడు. బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్.. తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్.. అనే పాటకు ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి డాన్స్ చేశారు. అలాగే చరణ్ నటించిన ‘రంగస్థలం’లో ‘రంగమ్మ మంగమ్మ’ పాటకు కూడా ఇద్దరు కలిసి స్టెప్పులేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Best moment of the day... @AlwaysRamCharan dances on the tunes of Tu Cheez Badi Hai Mast Mast with @akshaykumar. #HTLS2022 #RamCharan #AkshayKumar pic.twitter.com/3oMENZ73cP — Monika Rawal (@monikarawal) November 12, 2022 చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల కాబోతుంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ తాజా షెడ్యూల్ సోమవారం నుంచి న్యూజిలాండ్‌లో జరగనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. #HTLS2022 | @AlwaysRamCharan teaches @akshaykumar some steps from the South! Check it out here: https://t.co/lZbcyiJgyv pic.twitter.com/SoRdsUmMD9 — Hindustan Times (@htTweets) November 12, 2022 -
మనవరాలితో కలిసి స్టెప్పులేసిన రఘువీరారెడ్డి..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘువీరా రెడ్డి గురించి తెలియని వారుండరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ మంత్రిగా పనిచేసిన రఘువీరారెడ్డి.. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత నెలకొన్న పరిణామాలతో పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన ఎక్కువగా కుటుంబంతో గడపడం మొదలుపెట్టారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాదాసీదా వ్యక్తిగా అందరిలో కలిసిపోయి జీవిస్తున్నారు. తాజాగా.. రఘువీరా రెడ్డి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన మనుమరాలితో సరదాగా డ్యాన్స్ వేసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. టీవీలో ఓ పాట పెట్టి.. దానికి అనుగుణంగా రఘువీరా తన మనుమరాలితో కలిసి డ్యాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
పబ్‌లో అమ్మాయిలతో చిందేసిన ఆర్జీవీ.. వీడియో వైరల్
డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనంగా మారుతోంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే ఆర్జీవీ తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో మందు తాగుతూ అమ్మాయిలతో కలిసి చిందేశారు. హాలోవీన్ కాస్టూమ్స్‌లో హెరెత్తే మ్యూజిక్‌కి అమ్మాయిలతో కలిసి స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా ఆర్జీవీ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో త్వరలోనే వ్యూహం అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ఆర్జీవీ పేర్కొన్న సంగతి తెలిసిందే. At PRISM pub last nite celebrating HALLOWEEN pic.twitter.com/CjU2l4fPam — Ram Gopal Varma (@RGVzoomin) October 31, 2022 FUN n FROLIC at PRISM PUB 💐💐💐 pic.twitter.com/C1mFuv7wf9 — Ram Gopal Varma (@RGVzoomin) October 31, 2022 -
రేయ్.. అది పెళ్లామో.. గర్ల్ ఫ్రెండో కాదు!
పుర్రెకో బుద్ధి.. మనిషి తీరు ఒక్కోసారి బహు విచిత్రంగా అనిపిస్తుంటుంది. ఏ ఉద్దేశంతో చేస్తారో తెలియదుగానీ.. కొన్ని పనులు మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంటాయి. అలాంటిదే 15 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకున్న ఓ ట్విట్టర్ వీడియో. ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి ఇలా మొసలితో రొమాంటిక్ డ్యాన్స్ చేసినట్లు విపరీతంగా వైరల్ అవుతోంది. విచిత్ర ధోరణితో ఫ్లోరిడా ప్రజలు వార్తల్లోకి ఎక్కుతారనే ప్రచారం ఒకటి సోషల్ మీడియాలో సరదాగా వైరల్ అవుతుంటుంది. ఆ కోవకు చెందిన ఓ వ్యక్తే.. అంటూ బోర్న్ఏకాంగ్ అనే ట్విట్టర్ థ్రెడ్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయ్యింది. అంతేకాదు.. ఈ వీడియో గతంలోనూ వైరల్ అయ్యింది. కాకపోతే ఇప్పుడు ఇంకా ఎక్కువ వ్యూస్ దక్కించుకుని ట్రెండింగ్‌లోకి వచ్చింది. నమ్మశక్యంగా అనిపించని ఆ సరదా వీడియోను మీరూ చూసేయండి.. Florida man strikes again pic.twitter.com/MAgGnFkymk — Lance🇱🇨 (@BornAKang) October 18, 2022 వీడియో ఒక ఎత్తయితే.. ఆ వీడియో కింద కనిపించే కామెంట్లు మరో ఎత్తు. అది పెళ్లామో .. గర్ల్‌ఫ్రెండో కాదని, మొసలికి నీళ్లలో బలం ఎక్కువని, తేడా వస్తే పని అంతేఅని కొందరు.. ఆ మొసలికి అతను బాగా నచ్చి ఉంటాడని మరికొందరు.. ఇలా కామెంట్ల పర్వం హిలేరియస్‌గా ఉంది. -
ఫ్యాన్స్‌తో తమన్నా మాస్ డాన్స్, వీడియో వైరల్
మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీ మూవీతో తెలుగు తెరపై మెరిసిన ఈ పంజాబీ భామ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక డాన్స్‌లోనూ హీరోలకు పోటీ పడుతూ స్టెప్పులేస్తుంది. ప్రస్తుతం హీరోయిన్గా పలు చిత్రాలు చేస్తూ వీలు చిక్కినపడల్లా స్పెషల్ సాంగ్స్‌తో అలరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ కార్యక్రమంలో తమన్నా ఫ్యాన్స్‌తో కలిసి డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం నెటింట వైరల్‌గా మారింది. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌కి ముఖ్య అతిథికి హాజరైన తమన్నా అక్కడ అభిమానులతో మాస్ స్టెప్పులేసింది. చదవండి: పెద్దింటి కోడలు కాబోతున్న యంగ్ హీరోయిన్ వర్ష! ఇటీవల చెన్నైలో ‘మెటా క్రియేటర్స్ డే’ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా అటెండ్ అయిన తమన్నా.. తళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలో ‘వాతీ కమింగ్’ సాంగ్ కి మాస్ స్టెప్పులేసి అదరగొట్టింది. ఆ వేడుకకు హాజరైన ఓ నెటిజన్.. తమన్నా డ్యాన్స్ వీడియోని ట్విట్టర్లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. కాగా ఇటీవల బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ చిత్రాలతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో ఆమె నటించిన గుర్తుందా సీతాకాలం మూవీ విడుదల కావాల్సి ఉంది. చదవండి: విజయ్‌తో స్వయంవరం? జాన్వీ కపూర్ షాకింగ్ రియాక్షన్ .@tamannaahspeaks Vibes for #vaathicoming at #Metacreatorday event at Chennai. pic.twitter.com/lPuZn7ON4F — Abєєѕ (@AbeesVJ) October 27, 2022 -
రద్దీ మార్కెట్లో యువతి ‘దిల్బర్’ స్టెప్పులు.. నీ కంటే అతనే బెటర్!
యువత సోషల్ మీడియాను ఓ రేంజ్లో వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పాపులర్ పాటలకు, డైలాగ్‌లకు రీల్స్ చేసి ఇన్‌స్టాలో పోస్టు చేయడం కామన్‌గా మారిపోయింది. ఈ క్రమంలో ఫేమస్ అవ్వడం కోసం కొంతమంది మితిమీరి ప్రవర్తిస్తున్నారు. ఒక్కొక్కసారి మనం ప్రవర్తించే తీరు ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. దానిని పట్టించుకోకుండా రైల్వే స్టేషన్, బస్టాండ్, మార్కెట్ వంటి రద్దీ ప్రదేశాల్లో రీల్స్, డ్యాన్స్‌లు చేస్తుంటారు. అచ్చం ఇలాగే నడిరోడ్డుమీద ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. సుస్మితా సేన్ దిల్బర్ పాటకు ఓ యువతి రద్దీగా ఉన్న మార్కెట్ మధ్యలో డ్యాన్స్ చేసింది. బ్లూ కలర్ జీన్స్, టాప్ ధరించి స్టెప్పులు వేసింది. ఆమె డ్యాన్స్ చేస్తుంటే మార్కెట్లో ఉన్న వాళ్లంతా తననే చూస్తున్నారు. అయితే ఈ వీడియో వైరల్ కావడానికి కారణం యువతి మాత్రమే కారణం కాదు. ఆమె డ్యాన్స్ చేస్తుంటే వెనకాల ఓ ఆటో డ్రైవర్ తనను అనుకరించేందుకు ప్రయత్నించాడు. యువతి ఎలాంటి స్టెప్పులు వేస్తుందో చూస్తూ అచ్చం అలాగే చేసేందుకు ట్రై చేశాడు. వీళ్లు ఇలా చేస్తుంటే మార్కెట్లోని ప్రజలు వారిని చుట్టుముట్టి ఆసక్తికరంగా చూశారు. కాగా ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. యువతితోపాటు ఆమె వెనకాల వ్యక్తి డ్యాన్స్‌ను చూసి పలువురు నవ్వుకుంటుంటే.. మరికొందరు ఇతరులకు ఇబ్బంది కలిగేలా బహిరంగ ప్రదేశాల్లో ఆ పిచ్చి గంతులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. యువతి కంటే అతనే అందంగా డ్యాన్స్ చేశాడని కామెంట్ చేస్తున్నారు. अच्छा है आजकल रोड साइड लोगों को कंपनी मिल जाती है pic.twitter.com/PoLcw8U5Vs — 24 (@Chilled_Yogi) October 6, 2022 -
కాన్వొకేషన్ సమయంలో ‘కాలా చష్మా’.. ‘దయచేసి దీన్ని ప్రయత్నించవద్దు’
కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన ‘బార్ బార్ దేఖో’ సినిమాలోని కాలా చష్మా పాట ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. 2018లో వచ్చిన సినిమాలోని ఈ పాట అప్పట్లో ఓ సెన్సేషనల్. అయితే ఇదే సాంగ్ మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతోంది. ఎవరిని చూసినా ఈ పాటపై రీల్స్ చేసి పోస్టు చేస్తున్నారు. కేవలం భారత్‌లోనే కాదు ఖండాంతరాలు దాటుకొని ఆఫ్రికన్ పిల్లలు కూడా కాలా చష్మా పాటకు డ్యాన్స్ చేశారంటే ఎంత పాపులర్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు అందరూ సరదాగా స్నేహితులతో ఫంక్షన్లు, పెళ్లిళ్లు వంటి వేడుకల్లో ఈ పాటకు రీల్స్ చేస్తుంటే తాజాగా ఓ విద్యార్ధి వెరైటీగా తన కాన్వొకేషన్ సందర్భంగా స్టేజ్‌పై డ్యాన్స్ చేశాడు. ముంబైకు చెందిన మహిర్ మల్హోత్రా అనే విద్యార్థి డిగ్రీ పూర్తి చేసుకొని గ్రాడ్యుయేషన్ పట్టాను తీసుకునేందుకు స్టేజ్ మీదకు వెళ్తుంటాడు. అందరూ చప్పట్లు కొడుతూ అతన్ని ప్రోత్సహిస్తుండగా.. స్టైలిష్‌గా స్టేజ్‌పై కాలాచష్మా స్టెప్స్ వేశాడు. అయితే ముందుగా మహిర్ నిజంగా పడిపోయాడేమోనని ఆనుకుంటారు. కానీ అతను సాంగ్‌లోని స్టెప్ వేశారని భావించి ఆశ్చర్యపోతారు. ఈ వీడియోను మహిర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘దయచేసి దీన్ని ప్రయత్నించవద్దు.. నేను దీన్ని ప్రోత్సహించను’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే 30 లక్షలకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. మహిర్ డ్యాన్స్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చదవండి: Viral: మ్యాట్రిమోనీలో యాడ్.. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాల్ చేయద్దంటూ.. View this post on Instagram A post shared by Mahir Malhotra (@mahir_malhotra) -
‘శ్రీవల్లి’ని ఫాలో అయిన చిన్నారి, పాప అడ్రస్ కావాలంటూ రష్మిక ట్వీట్
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో హీరోయిన్గా నటించిన రష్మిక రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఆమె పాన్ ఇండియా నటిగా మారిపోయింది. ఇక కలెక్షన్ల పరంగా పుష్ప బక్సాఫీసు వద్ద సృష్టించిన సునామి అంతాఇంత కాదు. పుష్పకు ఈ రేంజ్లో గుర్తింపు రావడానికి ఇందులోని పాటలు కూడా ప్రధాన పాత్ర పోషించాయి. ఇప్పటికీ ఈ పాటలు మారుమోగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రష్మిక రారా సామి పాట బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసి ఈ పాట రీల్స్‌యే దర్శనమిచ్చాయి. చదవండి: మళ్లీ బుక్కైన తమన్.. ‘ఏంటమ్మా.. ఇది’ అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ ఇక ఇందులో రారా సామి అంటూ రష్మిక నడుం వంచి వేసిన హుక్ స్టెప్‌ను ప్రతి ఒక్కరు ఫాలో అయ్యారు. తాజాగా ఇదే పాటకు ఓ చిన్నారి డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. స్కూల్లో తన స్నేహితులతో కలిసి రారా సామి అంటూ ఈ చిన్నారి డాన్స్ చేస్తూ రష్మిక హుక్ స్టెప్‌ను అనుసరించింది. ఆ చిన్నారి డాన్స్‌కు ఫిదా అయిన ఓ నెటిజన్ ఈ వీడియోను తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశాడు. దీంతో వైరల్‌గా మారిన ఈ వీడియో రష్మిక కంటపడింది. ఇక ఈ ట్వీట్‌ను రష్మిక రీట్వీట్ చేస్తూ.. ‘షి మేడ్ మై డే. ఈ రోజుకు ఇది చాలు. ఈ క్యూటీని కలవాలనుకుంటున్నా. ఎలా?’ అంటూ పాప అడ్రస్ కావాలంటూ రష్మిక ఆరా తీసింది. చదవండి: రణ్వీర్ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే.. Maaaaadddddeeeeee myyyyy daaaaaay.. I want to meet this cutie..💘 how can I? 🥹 https://t.co/RxJXWzPlsK — Rashmika Mandanna (@iamRashmika) September 14, 2022 -
వద్దన్నా నాతో బలవంతంగా డ్యాన్స్ చేయించారు
భువనేశ్వర్: ఒడిషాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కమలా పుజారి తీవ్ర అనారోగ్యంతో ఈ మధ్య ఆస్పత్రి పాలయ్యారు. ఆమె పరిస్థితి విషమించిందని, కోలుకోవడం కష్టమని వైద్యులు సైతం చేతులేత్తేశారు. అయితే 71 ఏళ్ల ఆ పెద్దావిడ అనూహ్యంగా కోలుకుని.. ఇంటికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇదిలా ఉంటే.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే ముందు.. ఐసీయూలో ఆమె డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో సదరు వీడియోపై ఆమెకు ప్రశ్నలు ఎదురుకాగా.. ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యం బాగోలేకున్నా తనతో బలవంతంగా డ్యాన్స్ చేయించారంటూ ఆమె సోషల్ వర్కర్ మమతా బెహెరాపై ఆరోపణలు గుప్పించారు. ‘డ్యాన్స్ చేయాలనే ఉద్దేశం నాకు ఎంత మాత్రం లేదు. వద్దని నేను ఆమెతో(మమతను ఉద్దేశించి) చెప్తూనే ఉన్నా. కానీ, ఆమె వినలేదు. అప్పటికే నేను అనారోగ్యంతో కుంగిపోయి ఉన్నా. ఒపిక లేదు. అయినా బలవంతంగా నాతో ఆమె డ్యాన్స్ చేయించింది’ అని కోరాపుట్‌లో తన ఆరోగ్యంపై పరామర్శించేందుకు వచ్చిన మీడియాతో కమల పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఒడిషా పజారా గిరిజన తెకు చెందిన కమలా పుజారికి వ్యవసాయ రంగంలో అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీని 2019లో అందుకున్నారు. సేంద్రీయ వ్యవసాయం, 100 రకాల పాతతరం విత్తనాల నిల్వకుగానూ ఆమె ఈ గౌరవం దక్కింది. అయితే.. కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఆమె పరిస్థితి విషమించగా.. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటున్నారు. ఇక బలవంతంగా ఆమెతో డ్యాన్స్ చేయించిన ఘటనకుగానూ.. మమతపై ఒడిషా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పజారా తెగ సంఘం నేత హరీష్ ముదులీ డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే.. ఆందోళన చేపడతాని హెచ్చరించారు. మరోవైపు ఆమె చికిత్స అందుకున్న కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఈ వ్యవహారంపై స్సందించింది. పుజారా ఐసీయూలో అడ్మిట్ కాలేదని, ఆమెకంటూ ప్రత్యేకమైన క్యాబిన్ ఒకటి కేటాయించామని, ఆ క్యాబిన్‌లోనే సదరు డ్యాన్స్ వీడియో వైరల్ అయ్యిందని ఒక ప్రకటనలో తెలిపింది. ఇక పుజారితో పాటు ఆస్పత్రిలో వెంట ఉన్న రాజీబ్ హిలాల్.. మమతా బెహెరా ఎవరో తనకు తెలియదని, అభిమానంటూ సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చి ఇదంతా చేసిందని తెలిపారు. మమతా బెహెరా మాత్రం ఆమెలో బద్ధకాన్ని పొగొట్టి.. హుషారు నింపేందుకు అలా చేయించానని చెప్తున్నారు. Video Source: OTV ఇదీ చదవండి: బస్సు ఫుట్‌బోర్డు ప్రయాణం.. చావు తప్పి.. -
అదరగొట్టిన ఆఫ్రికన్ చిన్నారులు.. కేటీఆర్ మెచ్చిన డ్యాన్స్ వీడియో
ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ తప్పక ఉంటుంది. అందుకు కావాల్సిందల్లా మనలోని టాలెంట్‌ను గుర్తించి దానిని పదును పెట్టడమే. చాలామందిలో టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్నప్పటికీ.. నిరూపించుకునేందుకు సరైన మార్గం లేక వెనకబడిపోతారు. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరగడంతో మారుమూల ప్రాంతంలోని ప్రతిభ కలిగిన వ్యక్తులు కూడా ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. రాత్రికి రాత్రే పాపులారిటీ సంపాదించి ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. అచ్చం ఇలాగే ఆఫ్రికన్ చిన్నారులు బాలీవుడ్ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసి ఔరా అనిపించారు. సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్ నటించిన బార్ బార్ దేఖో సినిమాలో కాలా చష్మా పాటకు ఎనర్జిటిక్ స్టెప్పులతో దుమ్ములేపారు. భాష రాకపోయినా, దాదాపు పది మంది ఉన్న పిల్లలు గ్రూప్‌గా ఏర్పడి ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా స్టెప్పులేశారు. కష్టమైన మూవ్‌మెంట్స్‌ను కూడా చాలా సునాయసంగా చేస్తూ అందరి మనసులు దోచుకున్నారు. తమ డ్యాన్సింగ్ స్కిల్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. చదవండి: ఆకాశంలో 175 సార్లు రివవర్స్ స్పిన్నింగ్.. తన రికార్డును తానే బ్రేక్ చేసుకొని డ్డ్యాన్స్ చేస్తున్న పిల్లలు వెనుక బ్యాగ్రౌండ్ చూస్తుంటే వారంతా గ్రామీణ నేపథ్యానికి చెందిన వారిలా కనిపిస్తున్నారు. వీరంతా మట్టిలో మాణిక్యం అనే పదానికి సరైన నిర్వచనం ఇచ్చారు. ఏవియేటర్ అనిల్ చోప్రా చేర్ చేసిన ఈ వీడియోపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. దీనిని రీట్వీట్ చేస్తూ.. పిల్లలు అద్భుతంగా డ్యాన్స్ చేశారని, ఇది తప్పకుండా మీ ముఖంలో చిరునవ్వు తీసుకొస్తుందని కామెంట్ చేశారు. This is Wow! Indian soft power. pic.twitter.com/DsGQWTsnF5 — Aviator Anil Chopra (@Chopsyturvey) August 25, 2022 -
Viral Video: గేదె ముందు యువతి కుంగ్‌ఫూ స్టెప్పులు.. దెబ్బకు చిర్రెత్తడంతో..
సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి అందరికి ఫేమస్ అయిపోవాలన్న పిచ్చి బాగా పెరిగిపోతుంది. రీల్స్, షార్ట్స్ వంటి వీడియోలు రికార్డ్ చేసి నెట్టింట్లో అప్లోడ్ చేయడానికి తెగ ఆరాటపడుతున్నారు. నలుగురిలో పాపులారిటీ తెచ్చుకోవాలన్న భ్రమలో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో తాము ఏం చేస్తున్నమన్నది తెలియకుండా లేకుండా రెచ్చిపోతున్నారు. అయితే కొందరు తమ పిచ్చి ప్రవర్తనకు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు. తాజాగా ఓ యువతి కూడా ఇలాగే చేసింది. జంతువు ముందు ఓవరాక్షన్ చేసి చివరికి ఫలితం అనుభవించింది. గులాబీ, నీలిరంగు డ్రెస్ ధరించిన ఓ యువతి తాడుతో కట్టేసిన గేదేకు దానా వేస్తూ చిందులు వేసింది. ఆకలితో ఉన్న గేదే ముందు చిత్ర విచిత్రంగా డాన్స్ చేసింది. కుంగ్ ఫూ స్టెప్పులు చేస్తూ దానికి చిరాకు తెప్పించింది.. ఇంకేముంది చిర్రెత్తిపోయిన గేదే ఒక్కసారిగా తన రెండు కొమ్ములతో యువతిని దూరంగా నెట్టిపడేసింది. దీంతో యువతి ఎగిరి పక్కన ఉన్న కంచె మీద పడింది. చదవండి: మెట్రో స్టేషన్‌పై వ్యక్తి హల్చల్.. పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా! ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. కానీ రెండు నెలల క్రితమే ఈ వీడియోను సైకో బిహారీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేయడంతో.. తాజాగా నెట్టింట్లో వైరలవుతోంది. ఆకలితో ఉన్న జంతువులను ఇబ్బంది పెట్టవద్దు. గేదేకు పాపం యువతి డ్యాన్స్ నచ్చలేదు. ఇంకొంచెం ప్రాక్టిస్ చేసుంటే బాగుండు’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 5 లక్షలకు పైగా వ్యూస్, 25 వేల లైకులు వచ్చాయి. View this post on Instagram A post shared by Psycho Bihari (@psycho_biihari) -
సంతలో స్పైడర్ మ్యాన్ మాస్ డ్యాన్స్.. మహిళల నవ్వులే నవ్వులు!
Desi Spider Man Dance.. హాలీవుడ్లో స్పెడర్ మ్యాన్ మూవీ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. స్పైడర్ మ్యాన్ సినిమా సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఇక, ఇండియాలో సైతం ఈ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కాగా, తాజాగా దేశీయ స్పెడర్ మ్యాన్.. పశ్చిమ బెంగాల్లో డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. కోల్‌కత్తాలో శాంతినికేతన్‌లోని సోనాజురిలోని మార్కెట్లో స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకున్న ఓ వ్యక్తి కిరాక్ డ్యాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మిస్టర్ స్పైడర్ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో స్పైడర్ మ్యాన్ సంతాలీ సంగీతానికి అక్కడి మహిళలతో కలిసి డ్యాన్స్ స్టెప్పులు వేశాడు. View this post on Instagram A post shared by Kolkata's illusion | Kolkata (@kolkatas.illusion) సంతాలీ సంగీతంలో ఉన్న ఓ జానపద పాటకు స్పైడర్ మ్యాన్ డ్రెస్‌లో ఉన్న వ్యక్తి స్టెప్పులు ఇరగదీశాడు. మహిళలతో కలిసి డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ ముందుకు సాగాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: నైట్‌క్లబ్ వద్ద రచ్చ.. ఐటీ యువతులతో అసభ్యకర ప్రవర్తన.. -
డ్యాన్స్ చేస్తూ జారిపడ్డ నటి.. వీడియో వైరల్
ప్రముఖ నటి రాధిక కుమారస్వామి డ్యాన్స్ చేస్తూ కిందపడ్డ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె కుట్టి రాధికగా పాపులర్ అయ్యింది. కన్నడలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె ఈ మధ్య అవకాశాల లేక తెరకు దూరమైంది. ఇటీవల కన్నడ మాజీ సీఎం హెచ్డీ కుమార్‌స్వామిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తెరకు దూరమైనప్పటికి రాధిక తరచూ తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె డాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. చదవండి: షూటింగ్స్ బంద్‌పై సుమన్ షాకింగ్ కామెంట్స్ ఈ క్రమంలో ఆమె కాలు జారి కిందపడిపోయిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఈ వీడియోలో రాధిక తన జిమ్ ట్రైనర్‌తో కలిసి స్టెప్పులేస్తూ కనిపించింది. జిమ్‌లో ఎంతో ఎనర్జీతో డ్యాన్స్ చేస్తున్న ఆమె సడెన్‌గా కాలు జారడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగా నీల మేఘ షామా(2002) మూవీతో కన్నడ పరిశ్రమ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిం స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో రాధిక మొదటి భర్త రతన్ కుమార్ ఆగస్ట్ 2002లో గుండెపోటుతో మరణించగా 2010 నవంబర్‌లో మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామిని రెండో వివాహం చేసుకుంది. చదవండి: విడాకులపై ప్రశ్న.. తొలిసారి ఘాటుగా స్పందించిన చై View this post on Instagram A post shared by Radhika kumaraswamy (@radhikakumaraswamy) -
Draupadi Murmu: సంబురంగా చిందులేసిన ద్రౌపది ముర్ము!
వైరల్: ఎక్కడో ఒడిశాలో మారుమూల పల్లెలో పుట్టి కౌన్సిలర్ స్థాయి నుంచి.. ఇవాళ దేశ ప్రథమ పౌరురాలి స్థాయికి ఎదిగి.. తొలి గిరిజన రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించారు ద్రౌపది ముర్ము(64). జులై 25న సర్వసత్తాక గణతంత్ర్య భారత్‌కు 15వ రాష్ట్రపతిగా ఆమె ప్రమాణం చేయబోతున్నారు. ఈ తరుణంలో.. ద్రౌపది ముర్ముకు సంబంధించిన అరుదైన ఫొటోలు, వీడియోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. అందునా ఆమె హుషారుగా పాట పాడుతూ.. సరదాగా చిందులు (గిరిజన సంప్రదాయ నృత్యాలను చిందులనే వ్యవహరిస్తారు) వేసిన వీడియో ఒకటి కూడా విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. అయితే ఆ వీడియో ఆమె రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు చేసింది కాదు. అసలు ఆ వీడియో ఈ మధ్యది కాదు. తన రాజకీయ ప్రస్థానంలో ప్రజానేతగా ఆమెకంటూ మంచి గుర్తింపు దక్కింది. 2018లో జార్ఖండ్ గవర్నర్‌గా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఆమె స్వగ్రామం నుంచి వెళ్లిన కొందరు మహిళలు.. రాంచీ రాజ్‌భవన్ ఎదుట గిరిజన సంప్రదాయ నృత్యాలు నిర్వహించారు. ఆ సందర్భంలో హుషారుగా ఆమె వాళ్లతో కలిసి చిందులేసి.. పాట పాడారు అంతే. ముర్ము స్వగ్రామం ఒడిశా మయూర్భంజ్ జిల్లా రాయ్‌రంగ్‌పూర్ ప్రజలు.. దీదీ అని ఆమెను ఆప్యాయంగా పిల్చుకుంటారు. అందుకే ఆమె ఏ పదవిలో ఉన్నా.. తమ ఊరికే గర్వకారణమని భావిస్తుంటారు. తాజాగా ఆమె రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన మరుక్షణమే ఆమె ఘన విజయాన్ని ఊరంతా సంబురంగా చేసుకుంది. ఇదీ చదవండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీతం ఎంతో తెలుసా? -
వావ్ వాట్ ఏ టాలెంట్.. మైకెల్ జాక్సన్ స్టెప్పులతో అదరగొట్టిన కార్మికుడు
భారత్‌లో ప్రతిభావంతులకు కొదవే లేదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కానీ అది నిరూపించుకునేందుకు సరైన సమయం కావాలి. చాలామందిలో టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్నప్పటికీ విజయం సాధించలేకపోవచ్చు. ఎన్నో కారణాల వల్ల తమలోని ప్రతిభను పక్కన పెట్టేసి చిన్నా, చితక పనులు చేస్తూ జీవించేస్తుంటారు. అయితే ఎదో ఒక సమయంలో మనలోని టాలెంట్ తప్పకుండా బయటడుతుంది. దీనికి తోడు ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరగడంతో మారుమూల ప్రాంతంలోని ప్రతిభ కలిగిన వ్యక్తులు కూడా ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. రాత్రికి రాత్రే పాపులారిటీ సంపాదించి నలుగురిలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. అచ్చం ఇలాగే భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తనలోన దాగున్న డ్యాన్స్ టాలెంట్‌తో మెస్మరైజ్ చేశాడు. తోటి కార్మికులతో కలిసి వర్క్ ప్రదేశంలో పనిచేస్తుండగా డ్యాన్స్ చేసి అబ్బుర పరిచాడు. మైకెల్ జాక్సన్ వలె అద్భుత డ్యాన్స్ స్టెప్పులతో దుమ్ములేపాడు. ఎంతో కష్టమైన డ్యాన్స్ మూమ్స్ను కూడా అలవోకగా చేస్తూ అందరిని మెప్పించాడు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ తాజాగా దీనిని ఓ యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. చదవండి: కొంపముంచిన డెలివరీ ఇన్స్ట్రక్షన్.. రూ.500 చిల్లర తీసుకురమ్మంటే! హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, అల్లు అర్జున్, మాధురీ దీక్షిత్, ప్రభుదేవా, రెమో డీసౌజా వంటి డ్యాన్సర్లు, హీరోలను ట్యాగ్ చేస్తూ పోస్టు చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు అతడి ప్రతిభను ప్రశంసిస్తున్నారు. ఎంతో అద్భుతం, గొప్ప డ్యాన్సర్, ఇంత స్మూత్ డ్యాన్స్ స్టెప్పులను ఎప్పుడూ చూడలేదంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. బాలీడు్ నటుడు షాహిద్ కపూర్ కూడా రీట్వీట్ చేస్తూ..‘చాలా బాగుంది. ప్రతిభ ఎప్పుడూ షైన్ అవుతూనే ఉంటుంది. దానిని అణచివేయలేరు. తెలివైన, ఎంతో స్ఫూర్తిదాయకం.’ అని పేర్కొన్నారు. Please,enjoy this video & respect his talent & skills of dance👍👌👌. @iHrithik @iTIGERSHROFF @aakankshalovely @RaghavJuyalOffi @alluarjun @PDdancing @shahidkapoor @MadhuriDixit @remodsouza . pic.twitter.com/XCls4DTzPv — Ajay Raturi (@AjayRaturi20) July 20, 2022 -
అంతుపట్టని డ్యాన్స్‌తో అదరగొట్టిన పాక్ బౌలర్
పాకిస్తాన్ స్టార్ బౌలర్ హసన్ అలీ అంతుపట్టని డ్యాన్స్‌తో అభిమానులను అలరించాడు. గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో లంక బ్యాటింగ్ సమయంలో ఈ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. బ్రేక్ సమయంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న హసన్ అలీ.. మ్యాచ్‌కు దూరంగా ఉన్న హారిస్ రౌఫ్‌తో మాట్లాడుతూ కనిపించాడు. ఈ క్రమంలో ఏదో విషయమై చర్చకు రాగా.. కాసేపు చేతులు ముందుకు పెడుతూ డ్యాన్స్ మూమెంట్స్ ఇచ్చాడు. అయితే హసన్ అలీ చేసిన డ్యాన్స్ కాస్త విచిత్రమైన మూమెంట్స్లాగా అనిపించాయి. ఇది గమనించిన కామెంటేటర్ డానిసన్ మోరిసన్ ఈ అంతుపట్టని డ్యాన్స్ ఏంటా అని షాక్‌కు గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో హసన్ అలీ 12 ఓవర్లలో 23 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక లంక తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ తర్వాత పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌట్ అయింది. బాబర్ ఆజం వీరోచిత సెంచరీ పాక్‌ను తక్కువ స్కోరుకు ఆలౌట్ కాకుండా కాపాడింది. నాలుగు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక రెండోరోజు ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. ఓషాడా ఫెర్నాండో 17, కాసున్ రజిత 3 పరుగులతో ఆడుతున్నారు. Hassan Ali's back!!!! pic.twitter.com/WoQjdftQmQ — Ramiya 2.0 (@yehtuhogaaa) July 16, 2022 చదవండి: Ian Chapell: 'రోజులో 90 ఓవర్లు వేయకపోతే కెప్టెన్‌ను సస్పెండ్ చేయాలి' -
నడిరోడ్డుపై యంగ్ హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్
ఓ పక్క సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే మరోపక్క సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటారు హీరోయిన్లు. సినిమా విశేషాలు, వ్యక్తిగత విషయాలు, విహార యాత్రలకు సంబంధించిన పోస్టులు, వీడియోలు పెడుతూ అభిమానులను, ఫాలోవర్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంటారు. అంతేకాకుండా ఈ పోస్టులతో మూవీ ప్రమోషన్స్ చేస్తూ కొత్త ఫాలోవర్స్, సినిమా అవకాశాలను ఆకర్షిస్తున్నారు. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ తను పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే.. 'ఎఫ్3'తో సక్సెస్ జోష్‌లో ఉన్న బ్యూటిఫుల్ మెహ్రీన్ పిర్జాదా. ఇటీవల తన దగ్గరి బంధువుల పెళ్లి వేడుకల్లో పాల్గోంది హీరోయిన్ మెహ్రీన్. ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో నిర్వహించిన బారాత్‌లో నడిరోడ్డుపై స్టెప్పులేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. మరో అమ్మాయితో కలిసి తీన్మార్ ఉత్సాహంగా చిందులేసింది. పెళ్లి బరాత్ చేసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది మెహ్రీన్. ఈ పోస్ట్‌కు 'పంజాబీ వెడ్డింగ్ సీన్స్' అనే క్యాప్షన్స్ ఇవ్వగా.. ఈ వీడియో అతి కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. కాగా 'కృష్ణగాడి వీర ప్రేమకథ' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ పంజాబీ భామ. చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ?
Rakul Preet Singh Dance Video Goes Viral Jackky Bhagnani Comment: అతికొద్ది సమయంలోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం బాలీవుడ్లో పాగా వేసిన ఈ పంజాబీ భామ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే 'రన్ వే 24', 'ఎటాక్' చిత్రాలతో బీటౌన్ ఆడియెన్స్‌ను పలకరించింది. ప్రస్తుతం రకుల్ చేతిలో థ్యాంక్ గాడ్, ఛత్రీవాలి, డాక్టర్ జీ, ఓ మై గోస్ట్, మిషన్ సిండ్రెల్లా, 31 అక్టోబర్ లేడీస్ నైట్ తదితర చిత్రాలు ఉన్నాయి. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది రకుల్. తాజాగా తన డ్యాన్స్‌తో నెటిజన్లను కట్టిపడేసింది. ఈ డ్యాన్స్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ కాగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా సెలబ్రిటీ కొరియోగ్రాఫర్ డింపుల్ వద్ద రకుల్ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంది. ఇందులో భాగంగానే 'పసూరి' (Pasoori) పాటకు స్టెప్పులేసింది. ఈ వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకుంటూ ఈ సాంగ్ తన ఫేవరెట్‌గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట గింగిరాలు కొడుతూ గంటలోనే సుమారు 3 లక్షలకుపైగా వీక్షణలు సొంతం చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన సెలబ్రిటీలు ఓ మై గాడ్, చంపేశావ్ బేబీ అని కామెంట్స్ రూపంలో పొగుడుతున్నారు. ఇక రకుల్ బాయ్‌ఫ్రెండ్, యాక్టర్ జాకీ భగ్నానీ డియర్ లవ్.. నాకు కూడా నేర్పించవా అని కామెంట్ చేశాడు. కాగా రకుల్ డ్యాన్స్ చేసిన 'పసూరి' సాంగ్ యూట్యూబ్‌లో 20 కోట్లకు పైగా వ్యూస్ సొంత చేసుకుని సెన్సేషనల్‌గా మారిన విషయం తెలిసిందే. చదవండి: జాకీతో ప్రేమ.. అది నాకిష్టం లేదు: రకుల్ ప్రీత్ సింగ్ View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
అబ్బబ్బా ఏం చేశారు!.. బాలీవుడ్ పాటకు దుమ్ములేపిన నార్వే డ్యాన్సర్లు
పుట్టినరోజు, పెళ్లి, షష్టిపూర్తి.. వేడుక ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే. ఎన్నో టెన్షన్స్, హడావిడీ మధ్య సాగే ఈ పనుల్లో కొంచెం ట్రెండ్ మార్చి ఆటపాటలతో హంగామా చేస్తున్నారు. సంగీతం, డ్యాన్స్‌లను జోడిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. విదేశాలతో పోలిస్తే ఇండియాలో జరిగే పెళ్లిళ్లకే ఎంజాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. తాజాగా నార్వేలో జరిగిన పెళ్లిల్లో ఓ డ్యాన్స్ బృందం తామేం తక్కువ కాదంటూ డ్యాన్స్‌తో దుమ్ములేపారు. ఓ వెడ్డింగ్ పార్టీలో పాల్గొన్న "క్విక్ స్టైల్" అనే బృందం పాటకు తగ్గట్టు కాలు కదుపుతూ అందర్నీ ఆకట్టుకున్నారు. అబ్బాయిలంతా గ్రూప్‌లా ఏర్పడి బాలీవుడ్ సినిమా తన వెడ్స్ మనులోని సాలి గాలి పాటకు డ్యాన్స్ చేశారు. ఎకరిని మించి ఒకరు ఎనర్జిటిక్‌గా స్టెప్పులేశారు.‘దీనిని మేము ఇంకా పూర్తి చేయలేదు’ అంటూ ఈ వీడియోను దిక్విక్స్టైల్ ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: క్లాస్‌రూమ్‌లో పిల్లలతో కలిసి స్టెప్పులేసిన టీచర్.. అదరహో! నార్వే దేశస్తుల డ్యాన్స్ స్టెప్పులు నెటిజన్ల హృదయాలను దోచుకుంటోంది. ఇప్పటి వరకు ఏడు లక్షలకు పైగా వ్యూవ్స్, దాదాపు లక్ష లైక్‌లు వచ్చి చేరాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. మీ డ్యాన్స్ చూసేందుకు మేము కూడా ఇంకా అలసి పోలేదంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ బృందం ఇంతకముందు కూడా అనేక బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేశారు. ఈ వీడియోలను తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Quick Style (@thequickstyle) -
క్లాస్‌రూమ్‌లో పిల్లలతో కలిసి స్టెప్పులేసిన టీచర్.. అదరహో!
న్యూఢిల్లీ: స్కూల్ ఫంక్షన్లు, పార్టీల్లో విద్యార్థులు డ్యాన్స్ చేయడం సాధారణమే. అప్పుడప్పుడూ టీచర్లు కూడా సందర్భాన్ని బట్టి డ్యాన్స్ చేస్తుంటారు. అదే స్టూడెంట్స్, టీచర్లు కలిసి స్టెప్పులేస్తే ఎలా ఉంటుంది. అది కూడా క్లాస్‌రూమ్‌లో చేస్తే భలే చూడ ముచ్చటగా ఉంటుంది కదూ. సరిగ్గా ఇలాంటి దృశ్యాలే ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో కనిపించాయి. మను గులాటి.. ఈ పేరు అందరికి కాకపోయినా కొంతమందికి గుర్తుండే ఉంటుంది. అదేనండి మన డ్యాన్స్ టీచర్. ఆ మధ్య ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్ధినితోపాటు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పంతులమ్మ. తాజాగా ఆమె మరోసారి ఉపాధ్యాయులు అంటే కేవలం విద్యను బోధించే వారు మాత్రమే కాదని నిరూపించారు. క్లాస్‌రూమ్‌లో పిల్లలకు డ్యాన్స్ నేర్పించడమే కాకుండా వారితో కలిసి ఆనందంగా డ్యాన్స్ చేశారు. అది కూడా కిస్మత్ చిత్రంలోని ఎవర్గ్రీన్ పాట కజ్రా మొహబ్బత్ వాలా పాటకు ఎంతో పర్ఫెక్ట్ స్టెప్పులతో వావ్ అనిపించారు. విద్యార్థినిలందరూ ఒకలైన్లో నిల్చొని ఒకరి తరువాత ఒకరు స్టెప్పులతో అదరగొట్టారు. చివర్లో టీచర్, అమ్మాయిలు అంతా కలిసి చేయడం హైలెట్‌గా నిలిచిందని చెప్పవచ్చు. దీనిని సదరు టీచర్ ‘సమ్మర్ క్యాంప్‌లో చివరి రోజున మా అసంపూర్ణ నృత్యం. ఆనందం, కలయిక తోడైతే కొన్ని కచ్చితమైన స్టెప్పులకు దారితీస్తుంది’ అంటూ ట్విటర్లో షేర్ చేశారు. చదవండి: ట్రాఫిక్ ఏసీపీ మార్నింగ్ వాక్! మండిపోయిన జనం ఏం చేశారంటే.. दिल्ली शहर का सारा मीना बाज़ार ले के।☺️ Our imperfect dance moves on the last day of summer camp...leading to some perfect moments of joy and togetherness.💕#SchoolLife #TeacherStudent pic.twitter.com/K50Zi1Qajf — Manu Gulati (@ManuGulati11) June 16, 2022 ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు మను గులాటి టీచర్‌ను పొగడ్తలతో ముంచేస్తున్నారు. నిజానికి ఆమె టీచర్ యేనా లేక ప్రొఫెషనల్ డ్యాన్సరా అనేలా నృత్యం చేశారని ప్రశంసిస్తున్నారు. కాగా ఢిల్లీ ప్రభుత్వ టీచర్ అయిన మను గులాటి డ్యాన్స్‌లోనే విద్య చెప్పడంలోనూ మను మేడమ్ తోపే. ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. 2018లో కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి అందుకున్న ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా అందుకున్నారు. -
కాలేజ్‌లో డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్..
Sai Pallavi Dance In Vignan Engineering College Video Goes Viral: బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి తాజాగా నటించిన చిత్రం విరాట పర్వం. దగ్గుబాటి రానా సరసన సాయి పల్లవి వెన్నెలగా నటించిన ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు శుక్రవారం (జూన్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్‌తో ప్రదర్శించబడుతోంది. అయితే ఈ మూవీ విడుదలకు ముందు పలు ప్రమోషన్స్లలో సాయి పల్లవి పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సాయి పల్లవి, రానా, డైరెక్టర్ వేణు ఊడుగుల విశాఖపట్నంలోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లారు. అక్కడి విద్యార్థులతో సినిమా విశేషాలను పంచుకున్నారు. తర్వాత తనకు బాగా గుర్తింపు తెచ్చిన 'ఫిదా' సినిమాలోని వచ్చిండే 'మెల్ల మెల్లగ వచ్చిండే' పాటకు డ్యాన్స్ చేసి అలరించింది సాయి పల్లవి. స్టూడెంట్స్ అంతా కేరింతలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లైక్స్, కామెంట్స్‌తో దూసుకుపోతోంది. చదవండి: డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి The Natural Performer @Sai_Pallavi92 danced to her iconic song "vachinde" at Vignan engineering college, Vizag 💥💥💥 Receiving an ocean of love from the fans and audience ❤️❤️#VirataParvam @RanaDaggubati @venuudugulafilm @SLVCinemasOffl @SureshProdns#VirataParvamOnJune17th pic.twitter.com/ZNoglOlGw3 — Shreyas Media (@shreyasgroup) June 16, 2022 -
రైల్వేస్టేషన్లో ఉత్సాహంగా స్టెప్పులేసిన ప్రయాణికులు.. ఎందుకో తెలుసా!
భోపాల్: రైలు ప్రయాణమంటే ఉండే హడావుడి అంతా ఇంత కాదు.. ఎంత ఇంటి నుంచి బయల్దేరినా అప్పుడప్పుడు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సిందే. ఏదో కష్టాలు పడి చివరికి స్టేషన్ చేరుకుంటే ట్రైన్ ఆలస్యమని అనౌన్స్ వినిపిస్తోంది. ఈ సౌండ్ చెవికి ఎంత చిరాకుగా ఉంటోందో ప్రతి ఒక్కరికి అనుభవమయ్యే ఉంటుంది. అదే ట్రైన్ రావాల్సిన సమయానికి వస్తే ఎంత ఆనందమో.. అచ్చం ఇలాగో ఓ రైలు అనుకున్న సమయం కంటే ముందే వచ్చినందుకు ప్రయాణికులందరూ తెగ సంబరపడిపోయారు. ఆ సంతోషంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకోగా దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాంద్రా-హరిద్వార్ రైలు బుధవారం రాత్రి షెడ్యూల్ సమయానికి 20 నిమిషాల ముందే రత్లాం స్టేషన్‌కి చేరుకుంది. స్టేషన్లో రైలు పది నిమిషాలు ఆగి బయల్దేరుతుంది. దీంతో 30 నిమిషాల సమయం ఉండటంతో ఓ బోగీలోని ప్రయాణికులు గర్భా డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. గుజరాత్ నుంచి కేదార్నాథ్ వెళ్తున్న దాదాపు 90 మంది కలిసి ప్లాట్‌ఫాంపై ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేశారు. చదవండి: బైక్ వెనుక కూర్చొని హెల్మెట్ పెట్టుకోవడం లేదా? ఈ వార్త మీకోసమే! గుజరాత్లో అత్యంత పాపులర్ పాటలు, బాలీవుడ్ పాటలపై స్టెప్పులేశారు. చిన్న పిల్లలనుంచి వృద్ధుల వరకు అందరూ కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. 20 నిమిషాల పాటు బోగీలో కూర్చునే కంటే ఇలా డ్యాన్స్ చేస్తే అలసట తీరిపోతుందనే తాము ఇలా చేశామని ప్రయాణికులు తెలిపారు. ఈ వీడియోను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూ యాప్‌లో షేర్ చేశారు. ఇప్పుడిది నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ట్రైన్ సమయానికి వస్తే ఇలాగే ఆనందంగా ఉంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ज़िंदगी को जिंदादिली से जियो :) रतलाम रेलवे स्टेशन पर समय से पहले पहुंच गई ट्रेन! हॉल्ट लंबा था लिहाज़ा पैसेंजर्स ने प्लेटफार्म पर गरबा कर बोरियत दूर की @RatlamDRM @RailMinIndia @AshwiniVaishnaw pic.twitter.com/zXg2mVRY1y — Ravish Pal Singh (@ReporterRavish) May 26, 2022 -
వారెవ్వా! ఏం హైబ్రిడ్ భరతనాట్యం.. ఏం స్టెప్పులు.. నెట్టింట్లో హల్చల్
కళలకు పుట్టినిల్లుగా భావించే భారతదేశంలో ఎన్నో విభిన్న నృత్యాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై లక్షలాది కళాకారులు నృత్య ప్రదర్శనలిస్తూ భారత్ గొప్పతనాన్ని చాటుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో చాలా మంది డ్యాన్స్ వైపు ఆకర్షితులవుతున్నారు. క్లాసికల్, వెస్ట్రన్ అనే తేడా లేకుండా పాటకు తగ్గట్లు స్టెప్పులేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అనేక కొత్తరకమైన డ్యాన్స్‌లు ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా భరత నాట్యం, హిప్ హాప్ రెండు కలిపి రూపొందించిన ఓ కొత్త రకం డ్యాన్స్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఓ అంగ్లో ఇండియన్ సరికొత్తగా ఆలోచించి భరత నాట్యం, హిప్ హాప్కు కొత్తదనాన్ని జోడించి వినూత్న డ్యాన్స్‌ను ప్రాణం పోశారు. ఇందులో ముగ్గురు మహిళలు సంప్రదాయ చీరకట్టులో, మల్లెపూలు పెట్టుకొని అమెరికన్ రాపర్ లిల్ వేన్ ఉప్రోయర్ పాటకు ఇండో- వెస్ట్రన్ స్టెప్పులు వేస్తూ అలరించారు. హైబ్రిడ్ భారతనాట్యం అని పేరు పెట్టిన ఈ డ్యాన్స్ వీడియోలు నెటిజన్ల హృదయాలు గెలుచుకుంటున్నాయి. What the f- though ? Where the love go ? 🧨@LilTunechi @THEREALSWIZZZ pic.twitter.com/H7kTfQXMO4 — Usha Jey (@Usha_Jey) May 22, 2022 పారిస్‌లో నివసిస్తున్న శ్రీలంకన్ ఉష జై అనే మహిళ కొరియోగ్రాఫర్ తన స్నేహితురాళ్లతో కలిసి ఈ రకమైన డ్యాన్స్ క్రియేట్ చేశారు. దీనికి హైబ్రిడ్ భరత నాట్యం పేరు పెట్టారు. ఆ వీడియోలను ఎపిసోడ్‌లా వారీగా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ పాపులర్ అయ్యారు. తాజాగా 20 సెకన్ల ఈ వీడియో షేర్ చేశారు. నిజానికి హిప్ హాప్, భరతనాట్యం రెండు భిన్నమైన నృత్యాలు వీటిని మేళవించి రూపొందించిన ఈ సృజనాత్మక డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ అద్భుతమైన వీడియో సాంస్కృతిక సరిహద్దులు దాటి పయనిస్తోందని కామెంట్ చేస్తున్నారు. దీనిని ఇప్పటికే 7 లక్షలమంది వీక్షించారు. ఈ అందమైన వీడియోను మీరూచూడండి Welcome to paradise 🌴 pic.twitter.com/5aKpcTN9nz — Usha Jey (@Usha_Jey) December 12, 2020 -
వైరల్.. సంగీత్ ఫంక్షన్.. తోడు పెళ్లికూతురు సూపర్ డ్యాన్స్..
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఏ పెళ్లి ఇంట్లో చూసిన పెద్ద ఎత్తున హడావిడీ కనిపిస్తోంది. సంగీత్‌లు, మెహిందీ, హల్దీ ఫంక్షన్లతో కళకళలాడుతున్నాయి. పెళ్లిలో వధువు లేదా వరుడు, వారి స్నేహితులు, బంధువులు డ్యాన్స్ చేయడం సాధారణమే. ఈ మధ్యకాలంలో ఇలాంటి వేడుకలు మరీ ఎక్కువయ్యాయి కూడా. అయితే తాజాగా ఓ సంగీత్ ఫంక్షన్లో తోడి పెళ్లి కూతురు డ్యాన్స్ అదరగొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫేమస్ పంజాబీ జానపద గీతం చిట్ట కుక్కడ్ పాటకు ఉత్సాహంగా స్టెప్పులేసింది. లైట్ కలర్ లెహంగాతో ముస్తాబయి అందమైన చిరునవ్వుతో అంతకంగా అందంగా డ్యాన్స్ చేసింది. సూపర్ స్టెప్పులతో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరిని మంత్ర ముగ్దులను చేసేసింది. తన పక్కన మరో ఇద్దరు యువతులు డ్యాన్స్ చేస్తున్నప్పటికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. యువతి డ్యాన్స్ చేస్తుంటే ఆమె చుట్టూ ఉన్న అతిథులు ఉత్సాహపరిచారు. ఈ వీడియోను ఫ్యాబ్ వెడ్డింగ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోను మీరు కూడా చూడండి. చదవండి: Viral Video: ఎయిర్‌పోర్టు అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన శునకం View this post on Instagram A post shared by Fab Weddings- Wedding Planning & Photography Company (@fabwedding) -
సితార చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది : మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’.పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, కళావతి సాంగ్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నాయి. మే 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్ బాబు ఈ సినిమా సహా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పెన్నీ సాంగ్‌లో కూతురు సితార పర్ఫార్మెన్స్ గురించి అడగ్గా.. మహేశ్ మాట్లాడుతూ.. అది తమన్ ఆలోచన అని, నమ్రతతో ఈ విషయం గురించి చెప్పేలోపు తమన్ నమ్రతని అడిగాడని చెప్పారు. ఇక ఈ సినిమాలో సితార డ్యాన్స్ ఎండ్ టైటిల్స్‌లో అయినా కనిపిస్తుందా అని అడగ్గా.. 'మేకింగ్ వీడియోలో అనుకున్నాం. ఇప్పటికే ప్రింట్స్ యూఎస్‌కి వెళ్లిపోయాయి. అయినా దయచేసి ఇవన్నీ అడగకండి. ఇప్పటికే సినిమాల్లో ఎందుకు లేను అని సితర అడుగుతుంది. కానీ పర్ఫార్మన్స్ పరంగా తను నన్ను చాలా గర్వపడేలా చేసింది. నాకు తెలిసి తను భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుంది' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మహేశ్. -
Viral Video: వావ్ అమేజింగ్.. విద్యార్థినితో స్టెప్పులేసిన టీచర్!
టీచర్లంటే స్ట్రిక్ట్‌గా ఉంటారు. పిల్లలకు చదువు చెప్పడం.. హోం వర్క్ చేయకుంటే దండించడం వారి విధి. టీచర్ ముందు విద్యార్ధులందరూ డిసిప్లెన్‌గా ఉండాలి. ఈ విషయాలే మనకు బాగా గుర్తొస్తాయి. కానీ ఢిల్లీలోని ఓ మహిళా ఉపాధ్యాయురాలు ఓహో టీచర్లు పిల్లలతో ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేయగా తప్పదు. ఇంతకీ విషయంలోకి వెళితే.. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినితో కలిసి ఓ మహిళా ఉపాధ్యాయురాలు తరగతి గదిలోనే డ్యాన్స్ చేసింది. పిల్లలందరిలో ఓ విద్యార్థి ముందుకు వచ్చి హర్యాన్వీ పాటకు డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ఇంతలో పక్కనే ఉన్న టీచర్ మను గులాటీ.. విద్యార్థినితో కలిసి కొన్ని స్టెప్పులు వేశారు. విద్యార్థినిని అనుకరిస్తూ చాలా అందంగా డ్యాన్స్ మూవ్స్ చేశారు. ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడంతో క్లాస్‌లోని మిగతా స్టూడెంట్స్ చప్పట్లతో వారిని ఎంకరేజ్ చేశారు. చదవండి👉బాయ్‌ఫ్రెండ్‌పై కోపం.. ఆమె చేసిన పనికి షాక్‌లో లవర్ Students love to be teachers. They love role reversal. "मैम आप भी करो। मैं सिखाऊंगी।" English lang teaching followed by some Haryanvi music- A glimpse of the fag end of our school day.☺️💕#MyStudentsMyPride #DelhiGovtSchool pic.twitter.com/JY4v7glUnr — Manu Gulati (@ManuGulati11) April 25, 2022 దీనిని స్వయంగా టీచర్ ట్విటర్లో షేర్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వావ్ అమేజింగ్. అద్భుతంగా డ్యాన్స్ చేశారు. టీచర్లు విద్యార్థులతో ఇలా కలివిడిగా ఉంటూ బోధించడం చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి టీచర్లు ఉంటే బాగుంటుంది. అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి👉 సెలవు కావాలని వైరల్ లేఖ -
హీరోయిన్ శ్రియ బేబీబంప్ డాన్స్ వీడియో చూశారా?
Shriya Saran Shares Her Baby Bump Dance Video: హీరోయిన్ శ్రియ సరన్ బేబీబంప్‌తో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇది చూసి శ్రియా మళ్లీ ప్రెగ్నెంటా? అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది తన పాత వీడియో. తన గర్భవతి అయిన విషయాన్ని సీక్రెట్‌గా ఉంచిన శ్రియా గతేడాది అక్టోబర్‌లో కూతురు పుట్టిందని ప్రకటించి ఒక్కసారిగా అందరికి షాకిచ్చింది. అక్టోబర్ 11న తొమ్మిది నెలల క్రితం తనకు ఆడపిల్ల పుట్టిందని, తన కూతురు పేరు రాధ అని వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి: ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్‌ను డిలీట్ చేశారు: బయటపెట్టిన నటుడు దీంతో జీవితంలో అంత్యంత ఆనందకరమైన విషయాన్ని గోప్యంగా ఉంచడంపై అందరు ఆమెపై మండిపడ్డారు. అంతేకాదు సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని ఆ విషయాన్ని కూడా చాలా లేటుగా ప్రకటించిందని ఆసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే రీసెంట్గా శ్రియా 2020 బ్యాక్ అంటూ బేబీబంప్‌తో నాట్యం చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఇది చూసి అంతా షాక్ అయినా.. ఆ తర్వాత ఇది పాత వీడియో అని గుర్తించారు. దీంతో ఆమె వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే మొదటి లాక్డౌన్ సమయంలో శ్రియ గర్భవతి అయిన ఆమె ఈ విషయం మీడియాకు లీక్ అవకుండా జాగ్రత్త పడింది. https://t.co/N9naSuJYSJ#ShriyaSaran Shares Her Pregnancy Time Video | Shriya Saran BABY BUMP Video | #Shriya #Tollywood #tollywoodactress — Filmylooks (@filmylooks) April 18, 2022 చదవండి: ఆ హీరోయిన్‌తో నటించాలనుంది : యశ్ ‘గమనం’ సినిమా ప్రమోషన్స్‌లో తన భర్త, పాపతో ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది. ఆమె మాతృత్వ మధురిమల్ని ఆస్వాదిస్తున్నట్లు వివరించింది. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్లో కనిపించిన శ్రియా తన తాజా చిత్రం మ్యూజిక్ స్కూల్ షూటింగ్‌తో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతుంది. కాగా 2018లో రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్‌ను సీక్రెట్‌గా పెళ్లాడిన శ్రియ.. ఈ విషయాన్ని కూడా చాలా కాలం దాచిన సంగతి తెలిసిందే. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సీతూ పాప చేసిన కూచిపూడి డ్యాన్స్ చూశారా? ఎంత బావుందో..
సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సితార సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇటీవలె కళావతి పాటతో మెస్మరైజ్ చేసిన సితార..రీసెంట్గా పెన్నీ సాంగ్‌లో తళుక్కున మెరిసింది. ఇప్పటివరకు వెస్ట్రన్ డ్యాన్స్ స్టెప్పులతో ఆకట్టుకున్న సీతూ పాప తొలిసారిగా కూచిపూడి డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను మహేశ్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. 'సితార మొదటి కూచిపూడి డ్యాన్స్ ఇది. ఈ శుభప్రదమైన శ్రీరామనవమి రోజున ఈ వీడియోను మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ శ్లోకం రాముడి గొప్పదనాన్ని తెలియజేస్తుంది. నా సీతూ పాప అంకితభావం, తన టాలెంట్ చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నువ్వు నన్ను మరింత గర్వపడేలా చేస్తున్నావు. సితారకు కూచిపడి నేర్పించిన గురువులకు ధన్యవాదాలు. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు' అంటూ మహేశ్ పేర్కొన్నారు. ఇక సితూ పాప చేసిన కూచిపూడి డ్యాన్స్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
73 ఏళ్ల వయసు.. హుషారుగా గంతులేసిన మాజీ సీఎం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి వార్తల్లో నిలిచారు. రాజకీయంతో కాదు.. ఈసారి ఆయన ఫోక్ డ్యాన్స్‌తో అదరగొట్టారు. మైసూర్ ఆలయ ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఆయన హుషారుగా స్టెప్పులేశారు. 73 ఏళ్ల సిద్ధరామయ్య తన సొంత ఊరు.. సిద్ధారామనహుండి నుంచి వచ్చిన బృందంతో కలిసి వీర కునిత అనే జానపద నృత్యానికి నృత్యం చేశారు. ఆ ఆలయ దైవం సిద్ధరామేశ్వరుడ్ని ప్రార్థిస్తూ.. గాల్లో చేతులు ఆడిస్తూ డ్యాన్సులు వేశారాయన. ఆ దైవం పేరు మీదే ఆయనకు సిద్ధరామయ్య పేరు పెట్టారు. పైగా అక్షరాభ్యాసం కంటే ముందు నుంచే ఆయన వీర కునిత నృత్యంలో ఆరితేరారు. అందుకే అంత లయబద్ధంగా వాళ్లతో కలిసి హుషారుగా గంతులేయగలిగారు. ನಮ್ಮೂರಿನ ಸಿದ್ಧರಾಮೇಶ್ವರ ದೇವರ ಜಾತ್ರೆಯಲ್ಲಿ ತಂದೆಯವರು ಸಂಗಡಿಗರೊಂದಿಗೆ ವೀರಕುಣಿತದ ಹೆಜ್ಜೆ ಹಾಕಿದ ಕ್ಷಣಗಳು pic.twitter.com/GjMv5v4oeA — Dr Yathindra Siddaramaiah (@Dr_Yathindra_S) March 24, 2022 ఈ వీడియోను ఆయన తనయుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే యతింద్ర సిద్ధరామయ్య షేర్ చేశారు. మూడేళ్లకొకసారి ఈ ఆలయ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. కానీ, ఆలయ పునర్మిర్మాణం, కరోనా కారణంగా గత ఆరేళ్లుగా ఈ వేడుకలు జరగలేదు. దీంతో ఈ దఫా వేడుకలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. సిద్ధరామయ్య డ్యాన్సింగ్ స్కిల్స్ చూపించడం ఇదే కొత్త కాదు. 2010లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘బెల్లారీ చలో’ పాదయాత్ర సందర్భంగా వీరగషే అనే జానపద నృత్యానికి హైలెవల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారాయన. -
నడిరోడ్డుపై తాత స్టెప్పులు.. అవ్వ పరేషాన్
-
Viral Video: నడిరోడ్డుపై తాత స్టెప్పులు.. అవ్వ పరేషాన్
సాక్షి, ఖమ్మం: ఓ తాత తాగినంకా తనదైనా స్టైల్లో నడిరోడ్డుపై స్టెప్పులు వేస్తూ అందరిని పరేషాన్‌కు గురిచేశాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా కట్టె పట్టుకొని రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నట్లు స్టెప్పులు వేశాడు. ఇక తన భర్తను కాపాడుకోవడానికి ఆ అవ్వ నరకయాతన అనుభవించి చివరికి ఆ తాత పోరు తట్టుకోలేక రోడ్డు పక్కనే కూర్చొని దీనంగా ఉండిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ వద్ద ఖమ్మం టూ బోనకల్ ప్రధాన రహదారిపై ఓ తాత ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారమెత్తాడు. రోడ్డు మీద వెళ్లే ప్రతి వాహనాన్ని తనదైన శైలిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మాదిరిగా చేతిలో కట్టెతో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నట్లు రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ రోడ్డు మధ్యలో కొన్ని స్టెప్పులు వేశాడు. ఆ తాత దృశ్యం చూసే వారికి కొంత ఆహ్లాదకరంగా ఉన్న కానీ వాహనాలు ఆ తాత నీ ఢీ కొంటాయోనని అక్కడ స్థానికులు ఆందోళన చెందారు. ఇంకా తన భర్తను కాపాడుకోవడానికి ఆ అవ్వ నరకయాతన అనుభవించి చివరికి రోడ్డు పక్కనే కూర్చొని దీనంగా ఉండిపోయింది. ఈ ఘటన అక్కడ స్థానికులు సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. చదవండి: ఆరు నెలల పాటు సినిమాలు, వాట్సాప్ చూడకండి: కేటీఆర్ -
Viral Video: కచ్చా బాదమ్ పాటకు చిన్నారి క్యూట్ స్టెప్పులు
పల్లీలు అమ్ముకునే వ్యక్తి పాడిన కచ్చాబాదం పాట ఏ రేంజ్లో పాపులారిటీ సంపాదించిందో అందరికి తెలిసిందే. పశ్చిమ బెంగాల్లో వీధి వీధి తిరుగుతూ పల్లీలు అమ్ముకునే భుబన్ బద్యాకర్ అనే వ్యక్తి పాడిన ఈ ఒక్క పాట అతన్ని ఓవర్‌నైట్ స్టార్‌ను చేసింది. ప్రస్తుతం ఎక్కడా చూసిన ఇదే పాట వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ కచ్చా బాదం పాట తెగ వైరలవుతోంది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కచ్చాబాదం పాటకు స్టెప్పులేస్తున్నారు. తాజాగా కచ్చా బాదమ్ పాటకు ఓ చిన్నారి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో చిన్నారి స్కూల్ యూనిఫామ్ ధరించి అంగన్వాడీ కేంద్రంలో అందరి ముందు స్టెప్పులేసింది. ముఖం మీద చిరునవ్వుతో పాప చేసిన క్యూట్ డ్యాన్స్ స్టెప్పులు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరన్ షేర్ చేశారు. కాగా ఈ వీడియో గుజరాత్లో తీసినట్లు ఓ యూజర్ తెలిపారు. చదవండి: అత్యంత వృద్ధ జంట...వాళ్లుకు ఇది ఎన్నో వివాహ వార్షికోత్సవమో తెలుసా! Cutest ‘कच्चा बादाम’ ❤️ pic.twitter.com/YRln8CNA4X — Awanish Sharan (@AwanishSharan) March 13, 2022 అదే విదంగా ఈ వీడియోను మహిళా, శిశు అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ నేహా కంఠారియా ట్విట్టర్లో వీడియోను పోస్టు చేశారు. ‘ట్రెండ్స్ పట్టణ ప్రాంతాలకు మాత్రమే కాదు.. గ్రామాల్లో కూడా వ్యాప్తి చెందుతోంది. గుజరాత్‌లోని అంగన్వాడీ కేంద్రంలో అందమైన చిన్నారి డ్యాన్స్’ అంటూ కామెంట్ చేశారు. ఇక చిన్నారి వీడియోను నెటిజన్లు బాగా ఆకర్షిస్తోంది. ఇంత చిన్న వయసులోనే అందంగా పర్ఫెక్ట్గా స్టెప్పులేసిందని ప్రశంసిస్తున్నారు. చదవండి: ఆశ్చర్యం: మనిషి నాలుకపై వెంట్రుకలు.. ఎందుకలా! Trends are not only for urban areas .. it has gone deep down in villages too .. trending #kachabadam and beautifully done #hookstep of the song by all the more beautiful cute little girl of #anganwadi center in Gujarat. ❣️❣️❣️ pic.twitter.com/A9jHyXJNgb — Neha Kantharia (@nehakantharia) March 12, 2022 -
డీజే టిల్లుతో మంచు లక్ష్మీ మాస్ డ్యాన్స్ చూశారా
Manchu Lakshmi And Dj Tillu Mass Steps: మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. వ్యక్తిగత విషయాలతో పాటు ప్రొఫెషనల్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు ఫన్నీ వీడియోలు, డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తుంటారు. తాజాగా ఆమె చేసిన ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. డీజే టిల్లు మూవీలోని ఫేమస్ మాస్ సాంగ్ టిల్లు అన్నా డీజే పెడితే.. అంటూ సాగే పాటకి అదే లెవల్లో ఊరమాస్ స్టెప్పులేసింది. ఇందులో మంచు లక్ష్మీతో కలిసి హీరో సిద్దు, అమన్ చిందులేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
'కళావతి సాంగ్'పై కళావతి స్టెప్పులు.. నెట్టింట వైరల్
Keerthi Suresh Dance On Kalavathi Song Videos Goes Viral: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇటీవలె విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ 'కళావతి పాట' యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సాంగ్ ఇప్పటికే 35 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ పాటపై ఇప్పటికే అనేకమంది నెటిజన్స్ రీల్స్ చేసి అలరించారు. అలాగే మహేశ్ బాబు గారాల పట్టి సితార 'కళావతి సాంగ్'పై అదిరిపోయేలా స్టెప్పులేసింది. తాజాగా 'కళావతి సాంగ్'పై కళావతే అంటే కీర్తి సురేష్ డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. 'సర్కారు వారి పాట' చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
హీరోయిన్ లయ డ్యాన్స్ చూశారా? చీరకట్టులో ట్రెండీగా..
Heroine Laya Kacha Badam Dance Video Goes Viral: తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ లయ ప్రస్తుతం అమెరికాలో సెటిలయ్యింది. స్వయంవరం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రేమించు, మిస్సమ్మ, హనుమాన్ జంక్షన్, స్వరాభిషేకం వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. చివరగా అమర్ అక్బర్ ఆంటోనీ సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన లయ మళ్లీ సినిమాలు చేయలేదు. చదవండి: నాగచైతన్యతో ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది : శ్రుతిహాసన్ కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇటీవలె డ్యాన్స్ వీడియోలతో సందడి చేసింది. తాజాగా సోషల్ మీడియా ట్రెండింగ్ సాంగ్ కచ్చా బాదం సాంగ్‌కి తన ఫ్రెండ్‌తో కలిసి స్టెప్పులేసింది. చీరకట్టులో ట్రెండీ స్టెప్పులేస్తూ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం లయ చేసిన ఈ డ్యాన్స్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. చదవండి: కాజల్ సరికొత్త రికార్డు.. థ్యాంక్యూ చెప్పిన చందమామ View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) -
‘ఊ అంటావా మావా.. ఊహు అంటావా’ అంటున్న వధూవరులు..వీడియో వైరల్
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బ్లాక్బాస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమాలోని బన్నీ నటన, పాటలు, డైలాగులకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. ఇక సమంత తొలిసారి ఆడిపాటిన ఐటమ్ సాంగ్ టాలీవుడ్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మార్పోగిపోతుంది. సోషల్ మీడియా, ఇన్‌స్టా రీల్స్ అన్నీంటిలోనూ ‘ఊ అంటావా మావా ఊహు అంటావా మావా’ అనే పాటనే ఊపేస్తోంది. తాజాగా ఓ పెళ్లిలో వధూవరులిద్దరూ ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో రోనక్ షిండే, ప్రాచీ మోర్ అనే నూతన దంపతులు తమ పెళ్లి వేడుకలో ‘ఊ అంటావా మావా ఊహు అంటావా’ అంటూ డ్యాన్స్ చేశారు. సంప్రదాయ మరాఠీ పెళ్లి దుస్తులు ధరించి ఎంతో అందంగా ఎనర్జిటిక్‌గా స్టెప్పులేశారు. వీరిద్దరితోపాటు చుట్టూ బంధువులు కూడా డ్యాన్స్ చేసినప్పటికీ అందరిలోనూ వధువు డ్యాన్స్ స్టెప్స్ నెటిజన్లను బాగా ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో ఇప్పటి వరకు రెండు మిలియన్లకు పైగా వ్యూవ్స్ సంపాదించింది. వధువు డ్యాన్స్‌కు ఫిదా అయిన నెటిజన్లు ఆమెను ప్రశంసలతో మంచెత్తుతున్నారు. క్యూట్ కపూల్, క్రేజీ, లవ్లీ స్టెప్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.. చదవండి: ఇలాంటి ఆధార్ కార్డును ఎప్పుడైనా చూశారా? సోషల్ మీడియా ఫిదా View this post on Instagram A post shared by Chemistry Studios (@chemistrystudios) -
తమన్నా డ్యాన్స్ ఛాలెంజ్, ఇట్స్ యువర్ టర్న్!
తమన్నా భాటియా.. టాలీవుడ్లో కొన్నేళ్లుగా తన స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటూ వస్తోన్న ఈ మిల్కీ బ్యూటీ ఈ మధ్య అవకాశాలు అందుకోవడంలో కొంత వెనకబడినట్లు కనిపిస్తోంది. అందుకే కేవలం హీరోయిన్‌గానే కాకుండా విలన్ పాత్రలు పోషిస్తూ, అటు ఐటం సాంగ్‌లోనూ ఆడిపాడుతూ సత్తా చాటుతోంది తమన్నా. ఇటీవల ఆమె గని సినిమాలో కొడ్తే అనే స్పెషల్ సాంగ్‌లో చిందులేసింది. తాజాగా సోషల్ మీడియాలో మరోమారు ఈ పాటకు స్టెప్పేస్తూ ఇక మీ వంతు (ఇట్స్ యువర్ టర్న్) అంటూ అందరికీ ఛాలెంజ్ విసురుతోంది. 'ఎన్ని అవకాశాలైనా తీసుకోండి.. మళ్లీ మళ్లీ డ్యాన్స్ చేయండి. నేను కొడ్తే పాటకు చిందేస్తున్నాను. ఇక మీ వంతే మిగిలింది' అంటూ డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వరుణ్‌తేజ్, సాయి మంజ్రేకర్‌లతో పాటు పలువురికీ ఈ ఛాలెంజ్ విసిరింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మరి కొడ్తే పాటకు ఎవరు స్టెప్పులేసి ఆకట్టుకుంటారో చూడాలి. కాగా ఈ సాంగ్ జనవరి 16న విడుదలైన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
నాగిని డ్యాన్సర్లకు ముచ్చెమటలు.. డాల్ఫిన్ డ్యాన్స్
డ్యాన్సింగ్ అంకుల్‌గా ఇండియా వైడ్‌గా పాపులరైన సంజీవ్ శ్రీవాత్సవనే మరిపించేలా మరో డ్యాన్సర్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాడు. నార్త్‌లో బాగా పాపులరైన పాప్ సింగర్ సప్నా చౌదురి పాడిన మేరి జిందగి మే ఆకే మేరా దిల్ కా చేన్ చురాయా పాటకి ఈ డ్యాన్సర్ వేసిన స్టెప్పులు నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఉన్నాయి. చూడటానికి నవ్వు తెప్పించేలా ఉన్నా ఎంతో కష్టమైన స్టెప్పుని సునాయాసంగా వేశాడీ డ్యాన్సర్. Wtf 😂😂😂 superb step pic.twitter.com/Bs0AYfWO4l — Bhola Guru (@IGiveGyaan) January 26, 2022 ఈ వీడియోలో కనిపించే ప్రోగ్రామ్ ఎక్కడ జరిగింది ? ఆ డ్యాన్సర్ ఎవరూ అనే వివరాలపై స్పష్టత ఇంకా రాలేదు. కానీ డ్యాన్స్ మాత్రం నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటోంది. నాగిని, తీన్మార్ డ్యాన్స్‌ల తరహాలో కిక్కెస్తున్న ఈ నృత్యాన్ని డాల్ఫిన్ డ్యాన్స్‌గా నెటిజన్లు పిలుచుకుంటున్నారు. -
ఆ సాంగ్ కోసం సాయి పల్లవి ఇంత కష్టపడిందా?.. రిహార్సల్స్ వీడియో వైరల్
Sai Pallavi Dance Rehearsal Video: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె డ్యాన్స్ చేస్తుంటే.. నెమలి ఆడినట్టే ఉంటుంది. అందుకే ఆమె చేసిన సాంగ్స్ యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తాయి. ‘రౌడీ బేబీ’ (మారి 2), ‘మెల్ల మెల్లగ వచ్చిండే’, (ఫిదా), ‘ఏవండోయ్ నాని గారు’ (ఎంసీఏ) పాటలతో పాటు మొన్నటి లవ్స్టోరీలోని ‘ఏవో ఏవో కలలే’ వరకు ప్రతి పాటలో తనదైన స్టెప్పులతో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ మలయాళ కుట్టి. ఇక ఇటీవల విడుదలైన నాని ‘శ్యామ్ సింగరాయ్’లో దేవదాసీ పాత్ర పోషించి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఆ మూవీలోని ‘ప్రణవాలయ’పాటకు అద్భుతమైన న్యత్యం చేసి ఔరా అనిపించింది. ఆ పాట సిల్వర్ స్క్రీన్‌పైన విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. అయితే ఆ పాట కోసం సాయి పల్లవి చాలా కష్టపడింది. View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) తాజాగా ఆ పాట రిహార్సల్స్ వీడియోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ..‘ప్రణవాలయ పాటకు డ్యాన్స్ చేస్తుంటే.. నాకు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే పర్ఫామెన్స్ల్లో ఇది ముందుంటుంది.. రూపాలి కంథారియా, కుష్బూ వాకానిలకు ఈ క్రెడిట్స్ దక్కాలి’ అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ప్రస్తుతం సాయి పల్లవి డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) -
సామీ సాంగ్‌కు వార్నర్ కూతుళ్ల డ్యాన్స్, నవ్వాపుకోలేకపోయిన బన్నీ!
ఈ మధ్య మ్యూజిక్ లవర్స్ తెగ వింటున్న సాంగ్స్‌లో 'సామీ సామీ..' సాంగ్‌ది అగ్రస్థానం.. కేవలం టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్, విదేశాల్లో సైతం జనాలు ఈ పాటకు అడిక్ట్ అయిపోయి ఎక్కడపడితే అక్కడ చిందులేస్తూ వీడియోలు చేస్తున్నారు. సెలబ్రిటీలు, సామాన్యులు అన్న తేడా లేకుండా అందరూ నా సామీ అంటూ రష్మికను మించిపోయేలా స్టెప్పులేస్తున్నారు. తాజాగా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూతుళ్లు కూడా నా సామీ అంటూ డ్యాన్స్ చేశారు. 'అమ్మానాన్నల కంటే ముందే పిల్లలు సామీ సామీ పాటకు డ్యాన్స్ చేయాలనుకున్నారు' అంటూ ఈ వీడియోను వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇది చూసిన బన్నీ సో క్యూట్ అంటూ నవ్వాపుకోలేకపోతున్న ఎమోజీని జత చేశాడు. ఇక ఇటీవల వార్నర్ కూడా పుష్పరాజ్‌గా మారిపోయి ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా, శ్రీవల్లి పాటలకు స్టెప్పులేసిన విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
కారులో జోర్దార్గా పోలీసుల చిందులు!! వైరల్ అవ్వడం ఏమోగానీ..
పనిచేసే ప్రదేశాల్లో డ్యాన్స్ చేసి పలువురు అధికారులు ఉద్యోగాల నుంచి సస్పెండ్ అయిన ఘటనలు చాలానే చూశాం. అయితే కదులుతున్న కారులో సరదాగా డ్యాన్స్ చేసిన ముగ్గురు పోలీసులు వైరల్ అయ్యారు. ఆ వీడియోతో సెలబ్రిటీలు అయ్యారు. అంతా హ్యాపీ అనుకున్న టైంలో ఊహించని ట్విస్ట్ వచ్చి పడింది. ఆ ముగ్గురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. కారులో డ్యాన్స్ చేస్తే.. సస్పెండ్ ఎలా అవుతారని అనుకుంటున్నారా?. అయితే గుజరాత్‌లోని కచ్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి చదివి తెలుసుకోవాల్సిందే. ముగ్గురు పోలీసులు కారులో ప్రయాణం చేస్తూ.. సరదాగా డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో ముఖానికి మాస్క్ ధరించలేదు. సీటు బెల్ట్ కూడా పెట్టుకోకుండా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారు. డ్యాన్స్ ఏమో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో కాస్త పోలీసు ఉన్నతాధికారుల వరకు చేరింది. పోలీసులు డ్రెస్‌లో ఉండి.. అది డ్యూటీలో డ్యాన్స్ చేయడమే కాకుండా కరోనా, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందుకు ముగ్గురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.