
మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. వ్యక్తిగత విషయాలతో పాటు ప్రొఫెషనల్ అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు ఫన్నీ వీడియోలు, డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌కి వినోదాన్ని అందిస్తుంది కూడా. ఆమె చేసిన ఫన్నీ వీడియోలో వైరల్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆమె చేసిన ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సోమవారం(జూన్ 21) యోగా డే పాటు మ్యూజిక్ డే కూడా. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ చీరకట్టులో కూతురు విద్యా నిర్వాణతో కలిసి మాస్ స్టెప్పులేస్తూ ఉర్రూతలూగించింది. ఈ వీడియోని తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘ఎవరూ చూడటం లేదని తెలిసినప్పుడు.. డాన్స్ చేస్తే పిచ్చ క్రేజ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment