World Music Day
-
సంగీతానికి ఆ శక్తి ఉందా?
సంగీతానికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. ఇది మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని నయం చేయడమే గాక ఉల్లాసంగా ఉండేలా చేస్తుందని చెబుతుంటారు. ఇవాళ ప్రపంచ సంగీత దినోత్సవం(జూన్ 21న) పురస్కరించుకుని దీని ప్రాముఖ్యత గురించి, ఆరోగ్య ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.శ్రావ్యమైన సంగీతం విభిన్న సంస్కృతులను, సరిహద్దులను దాటి భాషలకు అతీతంగా అందర్నీ ఒక్కటి చేస్తుంది. దాని మాధుర్యానికి ఎవ్వరైన పరవశించిపోవాల్సిందే. మంచి రమ్యమైన సంగీతం మనసు స్వాంతన చేకూర్చి.. శాంతిని అందించగలదు కూడా. అలాంటి ఈ సంగీతం మన అనారోగ్య సమస్యలను నయం చేసే శక్తి ఉందని చెబుతున్నారు నిపుణులు. ప్రతి రోజు మంచి సంగీతం వినడం వల్ల జ్ఞాపకశక్తి, హీలింగ్ రేటు పెరుగుతుందట. ఇదెలా నయం చేస్తుందంటే..సంగీతం ప్లే చేసినప్పుడూ ఆ తరంగాలు మన చెవిని తాకగానే మన శరీరం ఒక విధమైన విశ్రాంతి మూడ్‌లోకి వెళ్లిపోతుంది. దీంతో రక్తం సులభంగా శరీరం మంతట ప్రసరిసించి..హృదయస్పందన రేటు, రక్తపోటు స్థాయిలు తగ్గడమే గాక కార్డిసాల్ స్టాయిలు కూడా తగ్గడం జరుగుతుంది. అలాగే రక్తంలోని సెరోటోనిన్ ఎండార్ఫిన్ స్థాయిలను పెంచుతుంది. మానసిక స్థితిని పెంచుతుంది. డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. సంగీతం మెదుడలో డోపమైన హార్మోన్ ఉత్పత్తిని పెంచి ఆందోళన, డిప్రెషన్ వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. నిద్రపోయేముందు సంగీతం మంచి ఓదార్పునిచ్చి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. శారీరీక అసౌకర్యం, నొప్పి వంటి వాటిని దూరం చేసే శక్తి సంగీతానికి ఉంది. సంగీతం వల్ల మెదడు ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. పలు అధ్యయనాల్లో మన మనసు, శరీరాలపై ప్రశాంతమైన ప్రభావాన్ని చూపించాయి. ఇది హృదయ స్పందన రేటు, బీపీని, ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేగాదు సంగీతాన్ని వినడం వల్ల ప్రతికూల ఆలోచనలు దూరమై సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. అంతేగాదు పరధ్యానాన్ని అడ్డుకుని అటెన్షన్‌తో ఉండేలా చేస్తుంది.(చదవండి: పాశ్చాత్యులకు యోగాను పరిచయం చేసింది ఈయనే..! ఏకంగా 60 దేశాలకు..) -
Arpan Kumar Chandel: తొలి ఆల్బమ్‌తోనే.. రాగాల రారాజుగా..
తొలి ఆల్బమ్‌తోనే వేలాది అభిమానులను సంపాదించుకున్నాడు దిల్లీకి చెందిన అర్పణ్ కుమార్ చందెల్. మల్టీపుల్ సూపర్–హిట్ ఆల్బమ్‌లతో అభిమానుల చేత ‘కింగ్’ అనిపించుకున్నాడు. స్వరరచనలోనే కాదు పాటల రచనలోనూ భేష్ అనిపించుకున్నాడు. చిన్న వయసులోనే పెద్ద మ్యూజిక్ కంపెనీలతో కలిసి పని చేసిన ‘కింగ్’ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా’ జాబితాలో చోటు సంపాదించాడు....పాపులర్ ర్యాప్ రియాలిటీ షో ‘హసల్’తో తొలి గుర్తింపు పొందాడు అర్పణ్ కుమార్ చందెల్. ‘టాప్ 5’లో ఒకరిగా చోటు సంపాదించాడు. ఆ తరువాత ‘హసల్ 2.వో’లో స్క్వాడ్ బాస్‌గా మరింత పేరు తెచ్చుకున్నాడు.‘వివిధ రంగాలలో విజేతలుగా నిలిచిన వ్యక్తుల గురించి తెలుసుకోవడం నాకు ఇష్టం. వారి గురించి చదివినప్పుడల్లా ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది. ఎప్పటికప్పడు కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే నాకు ఇష్టం’ అంటున్న అర్పణ్ దిల్లీలోని సాధారణ కుటుంబనేపథ్యం నుంచి వచ్చాడు.మొదట్లో ఫుట్‌బాల్ ఆటను బాగా ఆడేవాడు. ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. అయితే ‘ఆట’ నుంచి ‘పాట’ వైపు అతని మనసు మళ్లింది. సంగీతంపై ఆసక్తి అంతకంతకూ పెరగడం మొదలైంది. మ్యూజిక్ పట్ల తన ఆసక్తి, ప్రయోగాలకు యూట్యూబ్ వేదిక అయింది. పాటలు రాయడం మొదలు పెట్టాడు.‘చిన్నప్పటి నుంచి నాకు రకరకాల సందేహాలు ఉండేవి. ఆ సందేహాలు, నాలోని ఊహాలతో పాటలు రాయడం మొదలుపెట్టాను’ అంటాడు అర్పణ్. ‘ది కార్నివాల్’ ‘షాంపైన్ టాక్’ ‘న్యూ లైఫ్’లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లతో సంగీత ప్రపంచంలో సందడి చేసి ‘కింగ్’గా పేరు తెచ్చుకున్నాడు అర్పణ్. ‘మేరీ జాన్’ పాట బిల్బోర్డ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.ప్రేమ, భావోద్వేగాలు, జ్ఞాపకాలతో కూడిన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శ్రోతలను ఆకట్టుకుంది. ‘ప్రతి జెనరేషన్ కనెక్ట్ అయ్యేలా మేరీ జాన్ పాటను రూపొందించాను. ఈ పాటలోని ఒక వాక్యం....నీ నీడలా ఎప్పుడూ నీతో ఉంటాను అనేది యువతరానికి బాగా నచ్చింది’ అంటాడు అర్పణ్.చార్ట్‌బస్టర్ ‘తూ ఆఖే దేఖ్లే’ తనను సంగీతకారుడిగా మరో మెట్టు పైకి ఎక్కించింది. ‘నేను చేసిన మంచి పని ఏమిటంటే నాలోని భావాలను కాగితంపై పెట్టడం. వాటికి బాణీ కట్టడం. నాకు తోచినది నేను రాస్తాను. అది శ్రోతలకు నచ్చింది. అందుకే వారు నన్ను కింగ్ అనిపిలుస్తున్నారు. తమ భావాలకు ప్రతినిధిగా చూస్తున్నారు’ అంటాడు అర్పణ్.అర్పణ్ సక్సెస్ మంత్రా ఏమిటి? ఆయన మాటల్లోనే... ‘ఓపికగా ఎలా ఉండాలో, ఇతరులతో ఎలా వ్యవహరించాలో....ఇలా ఎన్నో విషయాలను నా ప్రయాణంలో నేర్చుకున్నాను. నేర్చుకున్నది ఏదీ వృథా పోదు’ నాన్–బాలీవుడ్ హిప్–హప్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న అర్పణ్ కుమార్ చందెల్ ఇప్పుడు బాలీవుడ్ పాటలతోనూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.సింపుల్‌గా స్పీడ్‌గా...‘సింపుల్‌గా ఉండాలి, అందరూ కనెక్ట్ అయ్యేలా ఉండాలి’ అనుకొని పాట ప్రయాణం మొదలుపెడతాను. నా పాటలు శ్రోతలను ఆకట్టుకోవడానికి ఇదొక కారణం. ఈ పాట ఎవరి గురించో అనుకోవడం కంటే, ఈ పాట నా గురించే అనుకోవడంలో విజయం ఆధారపడి ఉంటుంది. పాట అనేది గాలిలో నుంచి పుట్టదు. దాని వెనుక ఏదో ఒక ప్రేరణ ఉంటుంది. నా పాటల నుంచి ఇతరులు స్ఫూర్తి పొందితే అంత కంటే కావల్సింది ఏముంది! – అర్పణ్ కుమార్ చందెల్ -
వరల్డ్ మ్యూజిక్ డే.. టాప్ 10 పాటల్ని గుర్తుచేసుకుందామా
ఎండలు మండితే పాటలు ఓదార్పు. తొలకరి కురిస్తే పాటలు కాఫీకి తోడు.చలి చక్కిలిగిలి పెడితే పాటే కదా వెచ్చటి రగ్గు.సంగీతమూ సినిమా పాట లేకుండా జీవితం సాగేది ఎలా. నేడు వరల్డ్ మ్యూజిక్ డే. రావు బాల సరస్వతి, పి.లీల, జిక్కి,భానుమతి రామకృష్ణ, పి.సుశీల, ఎస్.జానకి,ఎల్.ఆర్.ఈశ్వరి, వాణి జయరాం, శైలజ, చిత్ర...వీరంతా మన సినీ కోయిలలుగా మన జీవన సందర్భాలను సంగీతమయం చేశారు.నేడు వీరి పాటలను తలుచుకోవడం మన విధి.వీరికి చేరేలా కృతజ్ఞత ప్రకటించడం మన సంతోషం. నేడు వరల్డ్ మ్యూజిక్ డే తానే మారెనా గుణమ్మే మారెనా దారీ తెన్ను లేనే లేక ఈ తీరాయెనా... రావు బాలసరస్వతి గొంతు మంచురాలిన దారిలో హంస నడకలా ఉంటుంది. నటీనటులే పాటలు పాడుకోవాలి అనుకునే రోజుల్లో ఆమె దాదాపుగా మన తొలి ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్. సాలూరి రాజేశ్వరరావు సంగీతంలో ఆమె పాటలు రెక్కలు విప్పాయి. సువాసనలు చిమ్మాయి. ఆమె తన సినిమా కెరీర్‌ను కొనసాగించి ఉంటే లతా అంతటి గాయనిగా గుర్తింపు పొందేది. ఆమె మనకు పంచిన అమృతం తక్కువ. కాని దాని రుచి ఎంతో మక్కువ. తెల్లవార వచ్చె తెలియక నాసామీ మళ్లీ పరుండేవు లేరా... అప్రయత్నంగా వీచే గాలిలా, అనాయాసంగా తాకే ‘మళయ’మారుతంలా ఉంటుంది పి.లీల గొంతు. తెలుగు ఆమె మాతృభాష కాదు. కాని ప్రతి తెలుగు గృహిణి నాలుక మీద ఆమె పాట చర్విత చరణం అయ్యింది.‘సడిచేయకోగాలి సడి చేయబోకే’, ‘ఓహో మేఘమాల.. నీలాల మేఘ మాల’, ‘కలనైనా నీ వలపే... కలవరమందైన నీ తలపే’... పి.లీల సంగీతలీల అద్భుతం. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరెనురో రన్నో చిన్నన్న తెలుగు పాటల్లో తన ఏరువాకతో కొత్త నారును వేసి సమృద్ధికర పైరును శ్రోతలకు అందించిన గాయని జిక్కి. పిట్ట కొంచమే. కూత పది వర్ణాల పింఛమే. అల్లరి పాటైనా ఆర్ద్ర గీతమైనా జిక్కి చేత చిక్కిందంటే హిట్. ‘ఛాంగురే బంగారు రాజా’, ‘పులకించని మది పులకించు’... ఆమెకు శ్రీలంకలో కూడా ఫ్యాన్స్ ఉండేవారు. అందమైన పాటలు పాడి ‘జీవితమే సఫలము’ చేసుకున్న ప్రియమైన గాయని జిక్కి. ఓహోహోహో పావురమా ఓ... ఓహోహో పావురమా వెరపేలే పావురమా ఓహోహో ఓహో పావురమా ఈ పావురం డేగల్ని కూడా వేటాడగలదు. భానుమతి రామకృష్ణ సకల కళావల్లభురాలు. నాటి తెలుగు మహిళలకు పెద్ద ధైర్యం. ఇండస్ట్రీలో గొప్ప తెగువ. అలాంటి గొంతు, ఆ పాట తీరు రిపీట్ కాలేవు. కాబోవు. ‘ఎందుకే నీకింత తొందర’, ‘నేనే రాధనోయి’, ‘సావిరహే తవదీన’... ఎన్ని పాటలని. ఇక ‘మల్లీశ్వరి’ ఆమె ప్రతి పాట గండుమల్లె, రెక్కమల్లె. ‘మనసున మల్లెల మాలలూగెనే’.. ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయ ముత్తయిదు కుంకుమ బతుకెంతొ ఛాయ తెలుగు పాటకు వంద సంవత్సరాల ఛాయను తెచ్చింది సుశీల. ఆమె రాకతో నటిని, గాయనిని దృష్టిలో పెట్టుకోకుండా ΄ాటకు అవసరమైన రేంజ్‌తో బాణీ కట్టడం మొదలెట్టారు సంగీత దర్శకులు. సుశీల ΄ాటలో నిష్ఠ ఉంటుంది. క్రమశిక్షణ ఉంటుంది. శ్రేష్టమైన ఉచ్చారణ. నూరుశాతం కచ్చితత్వం. ‘ఆకులో ఆకునై పూవులో పూవునై’, ‘జోరుమీదున్నావు తుమ్మెదా’, ‘ఇది మల్లెల వేళయనీ’... ఈ కెరటాలకు అంతులేదు. ఈ గాన సముద్రానికి ఉప్పదనం లేదు. అమృత సాగరం. నీలిమేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునేవేళా నూనె రాసి గట్టిగా బిగించి కట్టిన జడది అందమే. అది సుశీలమ్మ పౠటది. తల స్నానం చేసి వదులుగా వదిలన ముంగురులదీ అందమే. అది జానకమ్మ పౠటది. తెలుగు ΄ాట ఊపిరి పీల్చుకోవడానికి తెరిచిన పెద్ద గవాక్షం జానకి. తల్లిదండ్రులను చనువుగా ఒకమాటనగల చిన్న కూతురిలా ఉంటుందామె పాట. సరదా. హుషారు. అద్దంలో ఇమడగల కొండంత ప్రతిభ. ‘పగలే వెన్నెల’, ‘మనసా తుళ్లి పడకే’, ‘అందమైన లోకమని రంగురంగులున్నాయనీ’... ఇక నాదస్వరం ఎదుట పడగ ఎత్తి నిలిచిన పాట ‘నీలీల పాడెద దేవా’... మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు మాగమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడు ఆగేదెట్టాగ అందాక ఏగేదెట్టాగ గజ్జె కట్టి, బిగుతు దుస్తులు ధరించి, స్టేజ్ ఎక్కి జానపద శృంగారం ఒలికించిన ΄ాట ఎల్.ఆర్. ఈశ్వరిది. ఊరంటే గుళ్లు, ఇళ్లు మాత్రమే కాదు.. పొలాలుంటాయి.. మంచెలూ ఉంటాయి. ‘మసక మసక చీకటిలో’, ‘నందామయా గురుడ నందామయా’, ‘తీస్కో కోకకోలా’... ప్రతి పాటా సంపెంగ పొదలో పూసిన పువ్వు.అది మగాళ్లని ‘బలేబలే మగాడివోయ్’ చేసింది. విధి చేయు వింతలన్ని మతిలేని చేతలేనని విరహాన వేగిపోయి విలపించే కథలు ఎన్నో వాణి జయరామ్‌ది పక్కింట్లో నుంచి వినిపించే పరిచిత గీతంలా ఉంటుంది. అదే సమయంలో దానికో వ్యక్తిత్వం ఉంటుంది. వాణి జయరామ్ పాటల మీద జోకులేయలేం. గౌరవించడం ప్రేమించడం తప్ప. ‘పూజలు సేయ పూలు తెచ్చాను’, ‘నేనా పాడనా పాట... మీరా అన్నదా మాట’, ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదీ’... అద్భుతం. లాలు దర్వాజ్ లష్కర్ బోనాల్కొస్తనని రాకపోతివి లక్డీకాపూలు పోరికి రబ్బరు గాజులు తెస్తనని తేకపోతివి ఎస్.పి.శైలజ పాటను ఒక పల్లవి ఒక చరణం వరకే అనుమతించింది తెలుగు పరిశ్రమ. ప్రతిసారి మైక్ అందలేదు. అందినప్పుడు ఆమె గొంతులో అందం దాగలేదు. ‘మాటే మంత్రము’, ‘నాంపల్లి టేషన్కాడి’, ‘కొబ్బరినీళ్ల జలకాలాడి’... ఆమె పాట, మాట రెండూ మృదురమే. రానేల వసంతాలె శృతి కానెల సరాగాలే నీవే జీవన రాగం... స్వరాల బంధం చిత్ర రాకతో మళ్లీ తెలుగు పాటకు టీనేజ్ వచ్చింది. కొత్త తరానికి ΄ాటను అందించింది చిత్ర. కాలేజీకెళ్లే అమ్మాయిలు ‘తెలుసా మనసా’ అని... ‘కన్నానులే కలలు’ అని... ‘ఎన్నెన్నో అందాలు’ అని పాడుకున్నారు. ‘మనసున ఉన్నది చె΄్పాలనున్నది’ అని కూనిరాగం తీసుకున్నారు. మన గాయనులు మనకు బుట్టల కొద్ది పాటలు పంచినందుకు కృతజ్ఞతలు. -
World Music Day: సంగీతానికి ప్రత్యేకంగా ఓ రోజు ఎందుకు కేటాయించారంటే!
సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, ఇలా లలిత కళలు ఐదు. కానీ మిగతా వాటికి భిన్నమైన దారి సంగీతానిది. సంగీతానిది ఎలాంటి ఎల్లలూ, హద్దులూ లేని విశ్వభాష. సంగీతం మనసుకు హాయిని కలిగిస్తుంది. కొన్ని రకాల అనారోగ్యాలను తొలగిస్తుంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి సంగీతంతో చికిత్స చేయవచ్చు. జూన్ 21న ప్రపంచ సంగీతం దినోత్సవం. ఈ సందర్భంగా సంగీతం మనిషి జీవితంతో ఎంతగా పెనవేసుకుని పోయిందో, అన్ని రోజులూ మన వీనులకు విందు గావించే సంగీతానికి ప్రత్యేకంగా ఓ రోజంటూ ఎందుకు కేటాయించారో తెలుసుకుందాం... మనకు నచ్చిన పాట లేదా మనసుకు హత్తుకునే సంగీతం విన్నపుడు విన్నపుడు మనకు తెలీకుండానే ఒక రకమైన తన్మయత్వం కలుగుతుంది. ఎప్పుడైనా కాస్త డీలా పడినట్లు, ఒత్తిడికి లోనైనట్లు అనిపించినప్పుడు ఒక మంచిపాట, వీనులవిందైన సంగీతం వింటే ఆ ఒత్తిడి మొత్తం ఎగిరిపోతుంది. ఎంతో సాంత్వన లభిస్తుంది. నూతనోత్తేజం కలుగుతుంది. ఇక సంతోష సమయాలలో ఐతే చెప్పనక్కర్లేదు. పెళ్లి వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో ఉరకలెత్తించే, హుషారు కలిగించే సంగీతం, పాటలు వాతావరణాన్ని మరింత సందడిగా ఆహ్లాదంగా మారుస్తాయి. మొత్తంగా సంగీతాన్ని ఇష్టపడని సంగీతానికి పరవశించని వారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో! సంగీతం... సార్వజనీనం పొత్తిళ్లలోని పాపాయి ఉంగా ఉంగా అని చేసే శబ్దంలో ఉంది సంగీతం, తల్లి తన బిడ్డను ఊయలలూపుతూ పాడే లాలిపాటల్లో ఉంది సంగీతం, ఏడుస్తున్న పసిబిడ్డ ఆ ఏడుపు ఆపి హాయిగా కేరింతలు కొట్టేటట్లు చేయగల అమ్మమ్మలు, బామ్మల జోలపాటల్లో ఉంది సంగీతం, శ్రమైక జీవులు తమకు అలుపు తెలీకుండా పాడుకునే పాటల్లో ఉంది సంగీతం. ఇవన్నీ కూడా ఎలాంటి శాస్త్రీయ పద్ధతిని పాటించకపోయినప్పటికీ ఒక సొగసైన తాళం, రమ్యమైన లయతో సాగుతుంటాయి. మనుషులే కాదు ఇతర ప్రాణులకూ ఉంది సంగీత జ్ఞానం. నాగస్వరం విన్న సర్పాలు సొగసుగా నాట్యమాడటం, చైత్రమాసాన లేత మామిడి చివుళ్లు తిన్న కోయిలమ్మ కుహుకుహు రాగమాలపించటం, సంగీతం వింటూ ఆవులు పాలు సమృద్ధిగా ఇవ్వడం మనకు తెలిసిందే. అందుగలడిందులేడని...అన్న చందాన ప్రపంచమంతటా నిండి ఉంది సంగీతం. అందుకే అన్నారు శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః అని. వాగ్గేయకారులైన అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య వంటివారు తమ ఆరాధ్యదైవాలపైన సంకీర్తనలు రచించారు. పాటలు పాడుకున్నారు. తమ జీవితంలోని విషాదాలను, విరహాలను తొలగించుకున్నారు. నైరాశ్యాన్ని సంగీతంతోనే జయించారు. అంతకంటే ముందు అశోకవనంలో సీతాదేవి ఒకానొక దశలో తీవ్ర నైరాశ్యానికి లోనై, పొడవైన తన కేశాలతో గొంతుకు ఉరి బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడబోతుండగా.. చెట్టు మీదున్న ఓ పక్షి ఏదో వింత వింత శబ్దాలతో వీనులవిందైన రాగాన్ని ఆలపించింది. అప్రయత్నంగా ఆ రాగాలను ఆలకించిన సీతమ్మలోని నైరాశ్యం, కుంగుబాటు తొలగిపోయాయి. జీవితంపై తిరిగి ఆశలు చిగురించాయి. ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకుని రాముడి కోసం ఓపిగ్గా నిరీక్షించింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. మెదడుకు, హృదయానికి సంబంధించిన కొన్ని వ్యాధులకు చేసే చికిత్సలో రోగికి ఇష్టమైన సంగీతాన్ని వినిపించడం ద్వారా వైద్యులు సత్ఫలితాలను సాధించిన దాఖలాలెన్నో మనకు తెలుసు. బీపీ, తలనొప్పి వంటి వాటిని సంగీత చికిత్సతో నయం చేయవచ్చని వైద్యులు నిరూపించారు కూడా. బాత్రూమ్లో కూనిరాగాలు తీసే వారు, బరువు పనులు చేసేవారు, రేవుల్లో బట్టలు ఉతికే రజకులు.. ఒకరేమిటి... శ్రమ తెలియకుండా తమకు తోచిన పాటలు పాడుకోవడం అందరికీ తెలిసిందే. ఐక్యరాజ్యసమితి ప్రకటన ప్రజల మనస్సుల్లో, ఆలోచనల్లో సంగీతాన్ని నిత్యనూతనంగా ఉంచాలన్న ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి జూన్ 21ని ప్రపంచ సంగీత దినోత్సవంగా నిర్వహించాలని ప్రతిపాదించింది. దీని ప్రకారం ప్రతి ఏడాది ప్రపంచమంతటా జూన్ 21ని వరల్డ్ మ్యూజిక్ డేగా పాటించాలని ప్రకటించింది. ఇది క్రమంగా అన్ని దేశాలకు, నగరాలకు వ్యాపించి వరల్డ్మ్యూజిక్ డేకు ప్రాచుర్యం లభించింది. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ‘ఫెటె డె లా మ్యూసిక్’ అని ‘మేక్ మ్యూజిక్ డే’ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో, 1000 నగరాల్లో వరల్డ్ మ్యూజిక్ డే సంబరాలను జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో సంగీతం పట్ల అభిమానం, ఆసక్తి ఉన్నవారెవరైనా పాల్గొనవచ్చు. ఎవరైనా, ఎక్కడైనా సంగీత ప్రదర్శనలు ఇవ్వవచ్చు. పార్కులు, వీధులు, గార్డెన్లు, ఇతర పబ్లిక్ ప్లేసులలో గానంతో లేదా వాద్యపరికరాలతో తమ సంగీత నైపుణాన్ని ప్రదర్శించవచ్చు. ఈరోజు జరిగే ప్రదర్శనలన్నీ అందరికీ పూర్తిగా ఉచితమే. నిబంధనలేమీ లేని రోజే సంగీత దినోత్సవం ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా కార్యక్రమంలో పాల్గొనాలంటే, ఏదైనా పని చేయాలంటే వాటికి సంబంధించి కొన్ని పరిమితులు ఉంటాయి. ఇలాగే పాల్గొనాలి, ఇంత వయసు వారే పాల్గొనాలి, ఇంత అనుభవం కావాలి....ఇలాంటివి. కానీ వరల్డ్ మ్యూజిక్ డే విషయంలో అలాంటి నిబంధనలేమీ లేవు. సంగీతం పట్ల అనురక్తి, ఆసక్తి ఉన్నవారైవరైనా ఇందులో భాగస్వాములు కావచ్చు. ఉద్దండులు, సాధారణమైన వారు అన్న తారతమ్యాలేవీ ఉండవు. సంగీత రంగంలో గొప్పవారనదగ్గ వారి నుంచి ఇప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న వారి దాకా, పిల్లల నుంచి వృద్ధుల దాకా ఎవరైనా నిరభ్యంతరంగా పాల్గొన వచ్చు. మీ మీ ఆసక్తులను బట్టి ఒక సమూహంగా ఏర్పడవచ్చు. అంతా కలిసి ఒక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. ప్రదర్శనలు ఇవ్వవచ్చు లేదా మీరే ఆ ప్రదర్శనలో పొల్గొని సంగీత ప్రపంచంలో కాసేపు ఆనందంగా, హాయిగా విహరించవచ్చు. కాబట్టి మీకు మీరే మీకు నచ్చిన అంశం మీద సరదాగా ఓ ప్యారడీ పాట రాయండి. దానిని మీరే పాడండి. పదిమందితోనూ పంచుకోండి. సంగీత సముద్రంలో ఓలలాడండి. జీవితంలో ఆనందాన్ని నింపుకోండి. (జూన్ 21న ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా) చదవండి: అంతర్జాతీయ యోగా దినోత్సవం: యోగా ఒక విస్మయ శక్తి -
జగమంతా రాగమయం..
‘అంతా రామమయం– జగమంతా రామమయం’ అన్నాడు భక్త రామదాసు. తూర్పు పడమరల ఎల్లలు చెరిగిపోతున్న నేటి సంగీత ప్రపంచాన్ని గమనిస్తుంటే ‘అంతా రాగమయం– జగమంతా రాగమయం’ అని తన్మయంగా పాడుకోవచ్చు సంగీతాభిమానులు. ఇటు కర్ణాటక అటు హిందుస్తానీ సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు ఒకే వేదికపై కూర్చుని జుగల్బందీ కచేరీలతో శ్రోతలను అలరించిన సందర్భాలు నిన్నటితరం సంగీతాభిమానులకు తెలిసిన ముచ్చటే! ఇప్పటికీ తరచుగా జుగల్బందీ కచేరీలు దేశ విదేశాల్లో విరివిగా జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఇటీవలి కాలంలో దేశంలోని భిన్న సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు మాత్రమే కాదు, విదేశీ విద్వాంసులతో కలసి చేసే ఫ్యూజన్ కచేరీలు కూడా పెరుగుతున్నాయి. ఫ్యూజన్ ఆల్బమ్స్‌కు అన్ని ప్రాంతాల్లోనూ శ్రోతల ఆదరణ పెరుగుతోంది. ఫ్యూజన్ ప్రయోగాలు సంగీతం విశ్వజనీనమని చాటుతున్నాయి. జూన్ 21 ప్రపంచ సంగీత దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం... మనుషులకు మాటల కంటే ముందే సంగీతం తెలుసు. దాదాపు లక్షన్నర ఏళ్ల కిందట భాషల పుట్టుక జరిగితే, దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల ఏళ్ల కిందటే పాతరాతి యుగం మానవులకు సంగీతం తెలుసుననడానికి ఆధారాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో దొరికిన ఎముకలతో చేసిన వేణువులు, తాళవాద్య పరికరాలే ఇందుకు నిదర్శనమని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. భాషలు, లిపులు ఏర్పడిన తర్వాత ప్రపంచం నలుమూలలా సంగీతాన్ని లిపిబద్ధం చేసే ప్రక్రియ కూడా మొదలైంది. ప్రపంచంలోని ఏ సంప్రదాయానికి చెందిన సంగీతంలోనైనా ఉండేవి ఆ సప్తస్వరాలే! ప్రకృతిలోని ధ్వనులే సప్తస్వరాలకు, రకరకాల తాళాలకు మూలం. మన దేశంలో సంగీతం చిరకాలంగా ఉంది. ప్రణవనాదమైన ఓంకారమే అనాదినాదమని పురాణాలు చెబుతాయి. భారతీయ సంప్రదాయ సంగీతానికి మూలాలు సామవేదంలో ఉన్నాయి. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్ది నుంచి క్రీస్తుశకం ఏడో శతాబ్ది మధ్యకాలంలో భారతీయ సంగీతం శాస్త్రీయతను సంతరించుకుంది. ఆ కాలంలోనే సంస్కృతంలో సంగీతానికి సంబంధించిన పలు గ్రంథాలు వెలువడ్డాయి. క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది తర్వాత ఉత్తర భారత, దక్షిణ భారత ప్రాంతాల్లో సంగీత శైలీభేదాలు ప్రస్ఫుటంగా ఏర్పడుతూ వచ్చాయి. ఉత్తరాది సంగీతం హిందుస్తానీ సంగీతంగా, దక్షిణాది సంగీతం కర్ణాటక సంగీతంగా అవతరించాయి. బ్రిటిష్‌కాలంలో పాశ్చాత్య సంగీతం ఇక్కడి ప్రజలకు చేరువైంది. పలు పాశ్చాత్య వాద్య పరికరాలు మన సంగీతకారులను ఆకట్టుకున్నాయి. క్లారినెట్, వయోలిన్, గిటార్, మాండోలిన్, పియానో వంటి పాశ్చాత్య వాద్య పరికరాలను భారతీయ సంప్రదాయ సంగీతకారులు అక్కున చేర్చుకున్నారు. హిందుస్తానీ, కర్ణాటక సంగీత శైలీ సంప్రదాయాలు వేర్వేరుగా ఏర్పడిన తర్వాత చాలాకాలం పాటు సంగీతకారులు ఎవరికి వారు గిరిగీసుకుని, తమ తమ శైలీ సంప్రదాయాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇరవయ్యో శతాబ్దిలో పాశ్చాత్య సంగీతం కూడా పరిచయమయ్యాక సంగీతం విశ్వజనీనమైనదనే ఎరుక కలిగి, వేర్వేరు సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు ఒకే వేదికపై జుగల్బందీలు నిర్వహించే స్థాయిలో సామరస్యాన్ని పెంపొందించుకున్నారు. ఇటీవలి కాలంలోనైతే పాశ్చాత్య విద్వాంసులతోనూ కలసి ఫ్యూజన్ కచేరీలతో మన సంగీతకారులు శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నారు. నిజానికి ఫ్యూజన్ ప్రయోగాలు నిన్న మొన్నటివి కావు. హిందుస్తానీ సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అలీ అక్బర్‌ఖాన్ 1955లోనే పాశ్చాత్య సంగీతకారులతో కలసి అమెరికాలో తొలి ఫ్యూజన్ కచేరీ చేశారు. ఆ తర్వాత 1960లలో కొందరు భారతీయ విద్వాంసులు రాక్ ఎన్ రోల్ బృందాలతో కలసి ఫ్యూజన్ కచేరీలు చేశారు. సంప్రదాయ సంగీతంపై పాశ్చాత్య ప్రభావం భారతీయ సంగీతంలో హిందుస్తానీ, కర్ణాటక సంగీత సంప్రదాయాలు వేర్వేరుగా ఏర్పడ్డాయి. హిందుస్తానీ సంగీతంపై పర్షియన్, అరబిక్ సంగీత శైలుల ప్రభావం ఉంటే, కర్ణాటక సంగీతంపై యూరోపియన్ సంగీత ప్రభావం కనిపిస్తుంది. పదహారో శతాబ్దికి చెందిన పురందరదాసు కర్ణాటక సంగీత పితామహుడు. ఆయన తర్వాత పద్దెనిమిది పంతొమ్మిదో శతబ్దాలకు చెందిన శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్లు కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులుగా ప్రఖ్యాతి పొందారు. కర్ణాటక సంగీత త్రిమూర్తుల కాలంలోనే కర్ణాటక సంగీతంపై పాశ్చాత్య ప్రభావం మొదలైంది. ముత్తుస్వామి దీక్షితార్ శంకరాభరణ రాగంలో రచించిన ‘నోట్టు స్వరాలు’ పాశ్చాత్య సంగీతానికి దగ్గరగా ఉంటాయి. ముత్తుస్వామి దీక్షితార్ వంటి కర్ణాటక సంగీత విద్వాంసులను ఆదరించిన తంజావూరు సంస్థానంలో పాశ్చాత్య బ్యాండ్ బృందం కూడా ఉండేది. అప్పట్లో తంజావూరు సంస్థానానికి చెందిన కర్ణాటక సంగీతకారుల్లో వరాహప్ప దీక్షిత పండితుల వంటివారు పాశ్చాత్య బ్యాండ్ బృందం వద్ద పాశ్చాత్య సంగీతం నేర్చుకుని, అందులోనూ ప్రావీణ్యం సాధించారు. తంజావూరు ఆస్థానంలో వయోలిన్‌పై పూర్తిస్థాయి పాశ్చాత్య సంగీత కచేరీ చేసిన ఘతన వరాహప్ప దీక్షిత పండితులకే దక్కుతుంది. ఆయనకు పియానో వాయించడంలోనూ అద్భుతమైన నైపుణ్యం ఉండేది. తెలుగువాడైన త్యాగరాజు శంకరాభరణం, సుపోషిణి వంటి రాగాల్లో కొన్ని కీర్తనలకు చేసిన స్వరకల్పనలు పాశ్చాత్య సంగీత శైలికి దగ్గరగా ఉంటాయి. ఫ్యూజన్ ప్రయోగాలు హిందుస్తానీ, కర్ణాటక సంగీత విద్వాంసుల జుగల్బందీ కచేరీలు ఒకరకంగా ఫ్యూజన్ కచేరీలుగానే చెప్పుకోవచ్చు. ఈ జుగల్‌బందీలకు భిన్నంగా పూర్తిగా పాశ్చాత్య సంగీతకారులతో కలసి చేసే ఫ్యూజన్ కచేరీలకు గత శతాబ్ది ద్వితీయార్ధంలో పునాదులు పడ్డాయి. ఇంగ్లిష్ రాక్‌బ్యాండ్ ‘బీటిల్స్’ బృందానికి చెందిన గిటారిస్ట్ జార్జ్ హారిసన్, అమెరికన్ వయోలినిస్ట్ యెహుది మెనుహిన్ వంటి వారితో కలసి పండిట్ రవిశంకర్ 1960 దశకంలోనే ఫ్యూజన్ కచేరీలు చేశారు. అప్పటి నుంచే భారతీయ సంగీతకారుల్లో ఫ్యూజన్ ప్రయోగాలపై ఆసక్తి పెరిగింది. పాశ్చాత్య సంగీతకారుల్లోనూ భారతీయ సంగీతంపై ఆసక్తి మొదలైంది. జార్జ్ హారిసన్ స్వయంగా పండిట్ రవిశంకర్ వద్ద సితార్ నేర్చుకుని, ‘బీటిల్స్’ పాట ‘నార్వేజియన్ వుడ్’లో సితార్ స్వరాలను పలికించాడు. పండిట్ రవిశంకర్ కృషి ఫలితంగా ప్రాక్ పాశ్చాత్య సంగీతాల మధ్య వారధి ఏర్పడింది. తర్వాతి కాలంలో హరిహరన్, లెస్లీ లెవిస్‌లు కలసి ‘కలోనియల్ కజిన్స్’ పేరుతో ఫ్యూజన్ కచేరీలు చేయడమే కాకుండా, ఆల్బమ్స్ కూడా విడుదల చేశారు. మన దేశంలో ఇప్పుడు పలు ఫ్యూజన్ బ్యాండ్స్ క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. దేశ విదేశాల్లో పర్యటిస్తూ శ్రోతలను అలరిస్తున్నాయి. శాస్త్రీయ సంగీతంలో సుస్థిరస్థానం సాధించి, ఫ్యూజన్ ప్రయోగాలతో అలరించిన వారిలో ఎల్.సుబ్రమణ్యం, ఎల్.శంకర్, మాండోలిన్ శ్రీనివాస్, రాజేష్ వైద్య, విక్కు వినాయకరామ్, ఉస్తాద్ షాహిద్ పర్వేజ్, సితారా దేవి, జాకీర్ హుస్సేన్ వంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఎన్ని రకాల శైలీ భేదాలు, మరెన్ని రకాల సంప్రదాయాలు ఉన్నా సంగీతమంతా ఒక్కటేనని ఫ్యూజన్ కళాకారులు తమ కార్యక్రమాల ద్వారా నిరూపిస్తున్నారు. ప్రపంచ దేశాల నడుమ సాంస్కృతిక సామరస్యాన్ని పెంపొందించడంలో ఫ్యూజన్ కళాకారులు సాగిస్తున్న కృషి నిరుపమానం. కూత ఘనం పిట్ట కొంచెం కూత ఘనం అనే రీతిలో పసితనం వీడని కొందరు బాలలు శాస్త్రీయ సంగీతంలో అద్భుతంగా రాణిస్తూ, అంతర్జాతీయ స్థాయిలోనూ మన్ననలు పొందుతున్నారు. గురుగ్రామ్‌కు చెందిన గౌరీ మిశ్రా అతి పిన్నవయస్కురాలైన పియానిస్టుగా రికార్డులకెక్కింది. తొమ్మిదేళ్ల వయసులోనే 2015లో తొలి సోలో కచేరీ చేసి ఈ అరుదైన ఘనత సాధించింది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంతో పాటు పాశ్చాత్య స్వరాలను పియానోపై అలవోకగా పలికించే గౌరీ మిశ్రా ప్రతిభకు ఎ.ఆర్.రెహమాన్, అద్నాన్ సమీ వంటి దిగ్గజాలు సైతం ముగ్ధులవడం విశేషం. అతి పిన్నవయస్కుడైన తబలా వాద్యకారుడిగా గిన్నిస్ రికార్డు సాధించిన తృప్త్‌రాజ్ పాండ్య అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. పాండ్య తన మూడేళ్ల వయసులోనే ఆలిండియా రేడియో ద్వారా తన వాద్యనైపుణ్యాన్ని ప్రదర్శించి, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, హరిప్రసాద్ చౌరాసియా వంటి దిగ్గజాల ప్రశంసలు పొందాడు. చెన్నైకి చెందిన లిడియన్ నాదస్వరం పియానో వాద్యకారుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు. నాలుగేళ్ల వయసులోనే శాస్త్రీయ సంగీతాభ్యాసం మొదలుపెట్టిన లిడియన్ నాదస్వరం తన పదమూడేళ్ల వయసులోనే ఒక సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. కేరళకు చెందిన శ్రేయా జయదీప్ శాస్త్రీయ సంగీతం అభ్యసించి, రియాలిటీ షోలలోను, సినిమాల్లోనూ రాణిస్తోంది. ఆమె ఇప్పటికే రెండువందలకు పైగా ఆల్బమ్స్ కూడా విడుదల చేసింది. కేరళలో పుట్టి చెన్నైలో స్థిరపడిన కులదీప్ పాయ్ ఎందరో బాలలను సంగీతంలో తీర్చిదిద్దుతున్నారు. ఆయన వద్ద శిష్యరికం పొందుతున్న వారిలో రాహుల్ వెల్లాల్, సూర్యగాయత్రి, సూర్యనారాయణన్, రఘురామ్ మణికంఠన్, భవ్య గణపతి తదితరులు విశేషంగా రాణిస్తున్నారు. ‘యూట్యూబ్’ను మాధ్యమంగా చేసుకున్న తొలి శాస్త్రీయ సంగీతకారుడైన కులదీప్ పాయ్ తన శిష్యులను కూడా ఇదే మాధ్యమం ద్వారా శ్రోతలకు చేరువ చేస్తున్నారు. పాయ్ శిష్యుల్లో కొందరు అంతర్జాతీయ వేదికలపైనా మెరుపులు మెరిపిస్తుండటం విశేషం. ఇటీవలి కాలంలో సంగీతంలో రాణిస్తున్న బాల కళాకారులు సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకుంటున్నా, ఏదో ఒకే సంప్రదాయానికి పరిమితమైపోకుండా, వేర్వేరు సంప్రదాయ శైలులనూ ఆకళింపు చేసుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలతో సంగీతానికి గల విశ్వజనీనతను చాటుతున్నారు. మన సంగీతంలో పాశ్చాత్యవాద్యాలు మన సంగీత కచేరీల్లోకి పాశ్చాత్యవాద్య పరికరాలు బ్రిటిష్ హయాంలోనే ప్రవేశించాయి. కర్ణాటక సంగీత కచేరీలకు క్లారినెట్ను తొలిసారిగా మహాదేవ నట్టువనార్ పరిచయం చేశారు. తర్వాతి కాలంలో ఎ.కె.సి. నటరాజన్ వంటివారు క్లారినెట్ను కర్ణాటక సంగీతానికి మరింతగా చేరువ చేశారు. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మహాదేవ నట్టువనార్ తంజావూరు మరాఠా రాజుల ఆస్థాన విద్వాంసుడిగా ఉండేవారు. అప్పట్లోనే ఆయన పాశ్చాత్య పరికరమైన క్లారినెట్‌పై ఆయన అద్భుతమైన స్వరవిన్యాసాలు చేసి, పండిత పామరులను అలరించారు. తర్వాతి కాలంలో క్లారినెట్ కర్ణాటక సంగీతానికి మరింతగా చేరువైంది. తంజావూరు ఆస్థానానికి చెందిన వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితార్ సోదరుడు బాలస్వామి దీక్షితార్ పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో కర్ణాటక సంగీతానికి వయోలిన్‌ను పరిచయం చేశారు. ద్వారం వెంకటస్వామినాయుడు వయోలిన్‌ను కర్ణాటక సంగీతంలో అవిభాజ్య వాద్యం స్థాయికి చేర్చారు. ద్వారం వెంకటస్వామినాయుడు ప్రభావంతో కర్ణాటక సంగీత కచేరీలలో వయోలిన్ ఒక తప్పనిసరి పక్కవాద్యం స్థాయికి చేరుకుంది. అంతేకాదు, వయోలిన్‌తో సోలో కచేరీలిచ్చే ఉద్దండులు కర్ణాటక సంగీతంలో చాలామందే ఉన్నారు. కదిరి గోపాలనాథ్ తొలిసారిగా శాక్సోఫోన్‌ను కర్ణాటక సంగీతానికి పరిచయం చేశారు. ఇరవయ్యో శతాబ్దంలో మరికొన్ని పాశ్చాత్య వాద్యపరికరాలు కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీలకు పరిచయమయ్యాయి. పాశ్చాత్య వాద్యపరికరమైన శాక్సోఫోన్‌కు కొద్దిపాటి మార్పులు చేసి, దానిని కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోని గమకాలన్నీ పలికేలా తీర్చిదిద్దారు. మాండోలిన్‌ను శ్రీనివాస్ బాలుడిగా ఉన్నప్పుడే కర్ణాటక సంగీతానికి పరిచయం చేసి, ‘మాండోలిన్ శ్రీనివాస్’గా ప్రఖ్యాతి పొందారు. సుకుమార్ ప్రసాద్ తొలిసారిగా గిటార్‌ను కర్ణాటక సంగీత కచేరీలకు పరిచయం చేశారు. అనిల్ శ్రీనివాసన్ పియానోను కర్ణాటక సంగీతానికి పరిచయం చేశారు. పాశ్చాత్య వాద్యపరికరమైన హార్మోనియం పంతొమ్మిదో శతాబ్దం నాటికి మన దేశంలో బాగా జనాదరణ పొందింది. పరిమాణంలో కొన్ని మార్పులకు లోనై, హిందుస్తానీ గాత్ర కచేరీలకు పక్కవాద్యంగా చక్కగా ఇమిడిపోయింది. పాశ్చాత్య వాద్యపరికాలు మన సంప్రదాయ సంగీతంలోని నిశితమైన గమకాలను, సంగతులను పలికించలేవనే విమర్శలు ఉన్నా, వాటిని తమవిగా చేసుకుని కచేరీలు చేసిన కళాకారులు ఆ విమర్శలన్నింటినీ వమ్ము చేశారు. ఆధునిక కాలంలో మన భారతీయ సంగీత విద్వాంసులు పలువురు ప్రపంచ స్థాయిలో మన్ననలు అందుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై కచేరీలు చేసి, శ్రోతలను ఉర్రూతలూపారు. అంతర్జాతీయ వేదికలపై మెరిసిన వారిలో అటు హిందుస్తానీ, ఇటు కర్ణాటక సంగీత విద్వాంసులు ఉన్నారు. శైలీ సంప్రదాయాలు వేర్వేరు అయినా, సంగీతం అంతా ఒక్కటేననే భావనతో భిన్న సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు జుగల్బందీ కచేరీలతో భారతీయ సంగీత రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. భీమ్సేన్ జోషి, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, పండిట్ జస్రాజ్, ఎల్.సుబ్రమణ్యం తదితరుల జుగల్బందీలు భారతీయ సంగీతానికే వన్నె తెచ్చేవిగా నిలుస్తాయి. హిందుస్తానీ సంగీతకారుల్లో సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్, షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా, సంతూర్ విద్వాంసుడు శివకుమార్ శర్మ, తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ తదితరులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆధునిక కర్ణాటక సంగీతకారుల్లో చెంబై వైద్యనాథ భాగవతార్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మహారాజపురం సంతానం, శెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, మధురై మణి అయ్యర్, డాక్టర్ శ్రీపాద పినాకపాణి, జి.ఎన్.బాలసుబ్రమణ్యం, టి.ఎన్.శేషగోపాలన్ తదితర గాయకులు చెరగని ముద్ర వేశారు. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్, ఎం.ఎల్.వసంతకుమారి కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తులుగా గుర్తింపు పొందారు. ద్వారంవారి తర్వాత వయొలినిస్టుల్లో లాల్గుడి జయరామన్, కన్నకుడి వైద్యనాథన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్, అన్నవరపు రామస్వామి, ఎల్.వైద్యనాథన్, ఎల్.సుబ్రమణ్యం, ఎల్. శంకర్, అవసరాల కన్యాకుమారి, వైణికుల్లో ఈమని శంకరశాస్త్రి, చిట్టిబాబు, దొరైస్వామి అయ్యంగార్, ఇ.గాయత్రి, జయంతి కుమరేశ్, వేణుగానంలో టి.ఆర్.మహాలింగం, ఎన్.రమణి, ప్రపంచం సీతారాం, నాదస్వరంలో షేక్ చినమౌలానా, టి.ఎన్.రాజరత్నం పిళ్లె తదితరులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించిన వారిలో ప్రముఖులు. ఇప్పటి తరంలో టి.ఎం.కృష్ణ, సిక్కిల్ గురుచరణ్, పాల్ఘాట్ రామ్‌ప్రసాద్, అక్కారయ్ శుభలక్ష్మి, అమృతా మురళి, విద్యా కళ్యాణరామన్ తదితరులు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో రాణిస్తున్నారు. మనుషులకు మాటల కంటే ముందే సంగీతం తెలుసు. దాదాపు లక్షన్నర ఏళ్ల కిందట భాషల పుట్టుక జరిగితే, దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల ఏళ్ల కిందటే పాతరాతి యుగం మానవులకు సంగీతం తెలుసుననడానికి ఆధారాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో దొరికిన ఎముకలతో చేసిన వేణువులు, తాళవాద్య పరికరాలే ఇందుకు నిదర్శనమని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. భాషలు, లిపులు ఏర్పడిన తర్వాత ప్రపంచం నలుమూలలా సంగీతాన్ని లిపిబద్ధం చేసే ప్రక్రియ కూడా మొదలైంది. ప్రపంచంలోని ఏ సంప్రదాయానికి చెందిన సంగీతంలోనైనా ఉండేవి ఆ సప్తస్వరాలే! ప్రకృతిలోని ధ్వనులే సప్తస్వరాలకు, రకరకాల తాళాలకు మూలం. మన దేశంలో సంగీతం చిరకాలంగా ఉంది. ప్రణవనాదమైన ఓంకారమే అనాదినాదమని పురాణాలు చెబుతాయి. భారతీయ సంప్రదాయ సంగీతానికి మూలాలు సామవేదంలో ఉన్నాయి. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్ది నుంచి క్రీస్తుశకం ఏడో శతాబ్ది మధ్యకాలంలో భారతీయ సంగీతం శాస్త్రీయతను సంతరించుకుంది. ఆ కాలంలోనే సంస్కృతంలో సంగీతానికి సంబంధించిన పలు గ్రంథాలు వెలువడ్డాయి. క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది తర్వాత ఉత్తర భారత, దక్షిణ భారత ప్రాంతాల్లో సంగీత శైలీభేదాలు ప్రస్ఫుటంగా ఏర్పడుతూ వచ్చాయి. ఉత్తరాది సంగీతం హిందుస్తానీ సంగీతంగా, దక్షిణాది సంగీతం కర్ణాటక సంగీతంగా అవతరించాయి. బ్రిటిష్‌కాలంలో పాశ్చాత్య సంగీతం ఇక్కడి ప్రజలకు చేరువైంది. పలు పాశ్చాత్య వాద్య పరికరాలు మన సంగీతకారులను ఆకట్టుకున్నాయి. క్లారినెట్, వయోలిన్, గిటార్, మాండోలిన్, పియానో వంటి పాశ్చాత్య వాద్య పరికరాలను భారతీయ సంప్రదాయ సంగీతకారులు అక్కున చేర్చుకున్నారు. హిందుస్తానీ, కర్ణాటక సంగీత శైలీ సంప్రదాయాలు వేర్వేరుగా ఏర్పడిన తర్వాత చాలాకాలం పాటు సంగీతకారులు ఎవరికి వారు గిరిగీసుకుని, తమ తమ శైలీ సంప్రదాయాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇరవయ్యో శతాబ్దిలో పాశ్చాత్య సంగీతం కూడా పరిచయమయ్యాక సంగీతం విశ్వజనీనమైనదనే ఎరుక కలిగి, వేర్వేరు సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు ఒకే వేదికపై జుగల్బందీలు నిర్వహించే స్థాయిలో సామరస్యాన్ని పెంపొందించుకున్నారు. ఇటీవలి కాలంలోనైతే పాశ్చాత్య విద్వాంసులతోనూ కలసి ఫ్యూజన్ కచేరీలతో మన సంగీతకారులు శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నారు. నిజానికి ఫ్యూజన్ ప్రయోగాలు నిన్న మొన్నటివి కావు. హిందుస్తానీ సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అలీ అక్బర్‌ఖాన్ 1955లోనే పాశ్చాత్య సంగీతకారులతో కలసి అమెరికాలో తొలి ఫ్యూజన్ కచేరీ చేశారు. ఆ తర్వాత 1960లలో కొందరు భారతీయ విద్వాంసులు రాక్ ఎన్ రోల్ బృందాలతో కలసి ఫ్యూజన్ కచేరీలు చేశారు. సంప్రదాయ సంగీతంపై పాశ్చాత్య ప్రభావం భారతీయ సంగీతంలో హిందుస్తానీ, కర్ణాటక సంగీత సంప్రదాయాలు వేర్వేరుగా ఏర్పడ్డాయి. హిందుస్తానీ సంగీతంపై పర్షియన్, అరబిక్ సంగీత శైలుల ప్రభావం ఉంటే, కర్ణాటక సంగీతంపై యూరోపియన్ సంగీత ప్రభావం కనిపిస్తుంది. పదహారో శతాబ్దికి చెందిన పురందరదాసు కర్ణాటక సంగీత పితామహుడు. ఆయన తర్వాత పద్దెనిమిది పంతొమ్మిదో శతబ్దాలకు చెందిన శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్లు కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులుగా ప్రఖ్యాతి పొందారు. కర్ణాటక సంగీత త్రిమూర్తుల కాలంలోనే కర్ణాటక సంగీతంపై పాశ్చాత్య ప్రభావం మొదలైంది. ముత్తుస్వామి దీక్షితార్ శంకరాభరణ రాగంలో రచించిన ‘నోట్టు స్వరాలు’ పాశ్చాత్య సంగీతానికి దగ్గరగా ఉంటాయి. ముత్తుస్వామి దీక్షితార్ వంటి కర్ణాటక సంగీత విద్వాంసులను ఆదరించిన తంజావూరు సంస్థానంలో పాశ్చాత్య బ్యాండ్ బృందం కూడా ఉండేది. అప్పట్లో తంజావూరు సంస్థానానికి చెందిన కర్ణాటక సంగీతకారుల్లో వరాహప్ప దీక్షిత పండితుల వంటివారు పాశ్చాత్య బ్యాండ్ బృందం వద్ద పాశ్చాత్య సంగీతం నేర్చుకుని, అందులోనూ ప్రావీణ్యం సాధించారు. తంజావూరు ఆస్థానంలో వయోలిన్‌పై పూర్తిస్థాయి పాశ్చాత్య సంగీత కచేరీ చేసిన ఘతన వరాహప్ప దీక్షిత పండితులకే దక్కుతుంది. ఆయనకు పియానో వాయించడంలోనూ అద్భుతమైన నైపుణ్యం ఉండేది. తెలుగువాడైన త్యాగరాజు శంకరాభరణం, సుపోషిణి వంటి రాగాల్లో కొన్ని కీర్తనలకు చేసిన స్వరకల్పనలు పాశ్చాత్య సంగీత శైలికి దగ్గరగా ఉంటాయి. ఫ్యూజన్ ప్రయోగాలు హిందుస్తానీ, కర్ణాటక సంగీత విద్వాంసుల జుగల్బందీ కచేరీలు ఒకరకంగా ఫ్యూజన్ కచేరీలుగానే చెప్పుకోవచ్చు. ఈ జుగల్‌బందీలకు భిన్నంగా పూర్తిగా పాశ్చాత్య సంగీతకారులతో కలసి చేసే ఫ్యూజన్ కచేరీలకు గత శతాబ్ది ద్వితీయార్ధంలో పునాదులు పడ్డాయి. ఇంగ్లిష్ రాక్‌బ్యాండ్ ‘బీటిల్స్’ బృందానికి చెందిన గిటారిస్ట్ జార్జ్ హారిసన్, అమెరికన్ వయోలినిస్ట్ యెహుది మెనుహిన్ వంటి వారితో కలసి పండిట్ రవిశంకర్ 1960 దశకంలోనే ఫ్యూజన్ కచేరీలు చేశారు. అప్పటి నుంచే భారతీయ సంగీతకారుల్లో ఫ్యూజన్ ప్రయోగాలపై ఆసక్తి పెరిగింది. పాశ్చాత్య సంగీతకారుల్లోనూ భారతీయ సంగీతంపై ఆసక్తి మొదలైంది. జార్జ్ హారిసన్ స్వయంగా పండిట్ రవిశంకర్ వద్ద సితార్ నేర్చుకుని, ‘బీటిల్స్’ పాట ‘నార్వేజియన్ వుడ్’లో సితార్ స్వరాలను పలికించాడు. పండిట్ రవిశంకర్ కృషి ఫలితంగా ప్రాక్ పాశ్చాత్య సంగీతాల మధ్య వారధి ఏర్పడింది. తర్వాతి కాలంలో హరిహరన్, లెస్లీ లెవిస్‌లు కలసి ‘కలోనియల్ కజిన్స్’ పేరుతో ఫ్యూజన్ కచేరీలు చేయడమే కాకుండా, ఆల్బమ్స్ కూడా విడుదల చేశారు. మన దేశంలో ఇప్పుడు పలు ఫ్యూజన్ బ్యాండ్స్ క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. దేశ విదేశాల్లో పర్యటిస్తూ శ్రోతలను అలరిస్తున్నాయి. శాస్త్రీయ సంగీతంలో సుస్థిరస్థానం సాధించి, ఫ్యూజన్ ప్రయోగాలతో అలరించిన వారిలో ఎల్.సుబ్రమణ్యం, ఎల్.శంకర్, మాండోలిన్ శ్రీనివాస్, రాజేష్ వైద్య, విక్కు వినాయకరామ్, ఉస్తాద్ షాహిద్ పర్వేజ్, సితారా దేవి, జాకీర్ హుస్సేన్ వంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఎన్ని రకాల శైలీ భేదాలు, మరెన్ని రకాల సంప్రదాయాలు ఉన్నా సంగీతమంతా ఒక్కటేనని ఫ్యూజన్ కళాకారులు తమ కార్యక్రమాల ద్వారా నిరూపిస్తున్నారు. ప్రపంచ దేశాల నడుమ సాంస్కృతిక సామరస్యాన్ని పెంపొందించడంలో ఫ్యూజన్ కళాకారులు సాగిస్తున్న కృషి నిరుపమానం. కూత ఘనం పిట్ట కొంచెం కూత ఘనం అనే రీతిలో పసితనం వీడని కొందరు బాలలు శాస్త్రీయ సంగీతంలో అద్భుతంగా రాణిస్తూ, అంతర్జాతీయ స్థాయిలోనూ మన్ననలు పొందుతున్నారు. గురుగ్రామ్‌కు చెందిన గౌరీ మిశ్రా అతి పిన్నవయస్కురాలైన పియానిస్టుగా రికార్డులకెక్కింది. తొమ్మిదేళ్ల వయసులోనే 2015లో తొలి సోలో కచేరీ చేసి ఈ అరుదైన ఘనత సాధించింది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంతో పాటు పాశ్చాత్య స్వరాలను పియానోపై అలవోకగా పలికించే గౌరీ మిశ్రా ప్రతిభకు ఎ.ఆర్.రెహమాన్, అద్నాన్ సమీ వంటి దిగ్గజాలు సైతం ముగ్ధులవడం విశేషం. అతి పిన్నవయస్కుడైన తబలా వాద్యకారుడిగా గిన్నిస్ రికార్డు సాధించిన తృప్త్‌రాజ్ పాండ్య అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. పాండ్య తన మూడేళ్ల వయసులోనే ఆలిండియా రేడియో ద్వారా తన వాద్యనైపుణ్యాన్ని ప్రదర్శించి, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, హరిప్రసాద్ చౌరాసియా వంటి దిగ్గజాల ప్రశంసలు పొందాడు. చెన్నైకి చెందిన లిడియన్ నాదస్వరం పియానో వాద్యకారుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు. నాలుగేళ్ల వయసులోనే శాస్త్రీయ సంగీతాభ్యాసం మొదలుపెట్టిన లిడియన్ నాదస్వరం తన పదమూడేళ్ల వయసులోనే ఒక సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. కేరళకు చెందిన శ్రేయా జయదీప్ శాస్త్రీయ సంగీతం అభ్యసించి, రియాలిటీ షోలలోను, సినిమాల్లోనూ రాణిస్తోంది. ఆమె ఇప్పటికే రెండువందలకు పైగా ఆల్బమ్స్ కూడా విడుదల చేసింది. కేరళలో పుట్టి చెన్నైలో స్థిరపడిన కులదీప్ పాయ్ ఎందరో బాలలను సంగీతంలో తీర్చిదిద్దుతున్నారు. ఆయన వద్ద శిష్యరికం పొందుతున్న వారిలో రాహుల్ వెల్లాల్, సూర్యగాయత్రి, సూర్యనారాయణన్, రఘురామ్ మణికంఠన్, భవ్య గణపతి తదితరులు విశేషంగా రాణిస్తున్నారు. ‘యూట్యూబ్’ను మాధ్యమంగా చేసుకున్న తొలి శాస్త్రీయ సంగీతకారుడైన కులదీప్ పాయ్ తన శిష్యులను కూడా ఇదే మాధ్యమం ద్వారా శ్రోతలకు చేరువ చేస్తున్నారు. పాయ్ శిష్యుల్లో కొందరు అంతర్జాతీయ వేదికలపైనా మెరుపులు మెరిపిస్తుండటం విశేషం. ఇటీవలి కాలంలో సంగీతంలో రాణిస్తున్న బాల కళాకారులు సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకుంటున్నా, ఏదో ఒకే సంప్రదాయానికి పరిమితమైపోకుండా, వేర్వేరు సంప్రదాయ శైలులనూ ఆకళింపు చేసుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలతో సంగీతానికి గల విశ్వజనీనతను చాటుతున్నారు. -
మంచు లక్ష్మీ మాస్ డ్యాన్స్.. వీడియో వైరల్
మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. వ్యక్తిగత విషయాలతో పాటు ప్రొఫెషనల్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు ఫన్నీ వీడియోలు, డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌కి వినోదాన్ని అందిస్తుంది కూడా. ఆమె చేసిన ఫన్నీ వీడియోలో వైరల్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆమె చేసిన ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సోమవారం(జూన్ 21) యోగా డే పాటు మ్యూజిక్ డే కూడా. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ చీరకట్టులో కూతురు విద్యా నిర్వాణతో కలిసి మాస్ స్టెప్పులేస్తూ ఉర్రూతలూగించింది. ఈ వీడియోని తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘ఎవరూ చూడటం లేదని తెలిసినప్పుడు.. డాన్స్ చేస్తే పిచ్చ క్రేజ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) చదవండి: అనుష్క, సమంత ప్రేక్షకుల అభిప్రాయాన్ని మార్చేశారు! -
అందుకే దేవిశ్రీని రాక్‌స్టార్ అనేది!
హైదరాబాద్: అంతర్జాతీయ సంగీత దినోత్సవం సందర్భంగా సంగీత అభిమానులకు రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. అంతేకాకుండా ఈ వీడియోను ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి సత్యమూర్తికి, సంగీత పాఠాలు నేర్పిన తన గురువుకు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సంగీత ప్రియుల్ని, ముఖ్యంగా మాస్ అండ్ ఫాస్ట్ బీట్ సాంగ్స్‌ను అభిమానించే వారికి బాగా నచ్చుతోంది. (‘హేయ్..సత్తి నా పాట విన్నావా?') ఎలాంటి సంగీత వాయిద్య పరికరాలు ఉపయోగించకుండా తన బృందంతో కలసి ప్లాస్టిక్ కుర్చీలు, ట్రంకు పెట్టెలనే డ్రమ్స్‌గా ఉపయోగించుకొని అందరినీ ఉర్రూతలూగించే సూపర్బ్ ప్రదర్శన చేశారు. అయితే ఈ ప్రదర్శన తాజాగా చేసింది కాదు. గతంలో యూఎస్ఏలో జరిగిన ఓ మ్యూజికల్ షోలో చేసిన పర్ఫార్మెన్స్కు సంబంధించిన వీడియోను తాజాగా తన ట్విటర్లో షేర్ చేశారు. ఇక ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిభకు, క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. (‘మా నాన్న నవ్వు.. మా బిడ్డ చిరునవ్వు’) రాళ్లు రప్పలతో కూడా సంగీతాన్ని అందించొచ్చని దేవిశ్రీ మరోసారి నిరూపించాడని అందుకే అతడిని రాక్‌స్టార్ అంటారని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ఇక లాక్డౌన్ సమయంలో తన పాత షోలకు సంబంధించిన వీడియోలను ఒక్కొక్కటి విడుదల చేస్తూ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నాడు దేవిశ్రీ. గతంలో తన తండ్రి సత్యమూర్తి జయంతి సందర్బంగా మ్యూజికల్ విషెస్ తెలుపుతూ విడుదల చేసిన వీడియో అందరినీ తెగ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. (సీతు పాప సింపుల్ యోగాసనాలు) On #WorldMusicDay2020 tomorrow, Since MUSIC HAS NO LANGUAGE, Hope U all wud like 2 watch this FULL PERFORMANCE, When I, along wit my RHYTHM PLAYERS, turned these LIFELESS OBJECTS into DRUMS filled wit LIFE 💟🥁🎶 FULL VIDEO-9AM..21ST JUNE Subscribe to https://t.co/zuPJJrmU6I pic.twitter.com/D855136wpU — DEVI SRI PRASAD (@ThisIsDSP) June 20, 2020 -
సినీ సంగీత ప్రపంచంలో.. మహానుభావులు ఎందరో
సంగీతానికి రాళ్లు కరుగుగతాయంటారు.. రాళ్లేమో కానీ మన మనసును మాత్రం ఇట్టే కరుగుతుంది. సంగీతానికి ఉండే శక్తి అటువంటింది. మనిషి మూడ్‌ను మార్చేసే శక్తి సంగీతానికి ఉందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. మనసు బాగోలేకపోయినా.. మనకు ప్రశాంతత కరువైన నచ్చిన పాటలు వింటూ కొద్ది సేపు వింటే కిక్కే వేరప్ప. ఇక అందరికీ అన్ని పాటలు నచ్చకపోవచ్చు. కొందరికి మెలొడి సాంగ్స్, మరికొందరికి విప్లవ పాటలు, ఇంకొందరికి మాంచి ఫాస్ట్ బీట్ మాస్ సాంగ్‌లు అంటే ఇష్టం. అయితే.. కొన్ని పాటలు వింటూ ఉంటే లోకాన్ని మైమరిచిపోతూ ఉంటాం. మరికొన్నింటిని వింటే రక్తం ఉడికిపోయేలా ఉంటుంది. భారతీయ సంగీత శాస్త్రంలో ఉన్న గొప్పతనం మరెక్కడా లేదేమో అనిపిస్తుంది. అందులోనూ తెలుగు సాహిత్యంతో మెళవించిన సంగీతలోకం గురించి ఎంత అభివర్ణించినా తక్కువే అవుతుంది. అలనాటి ఆపాతమధురాలు వింటూ ఉంటే.. ఆకాశయానం చేస్తున్నట్లు ఉంటుంది. తెలుగు సినీ ప్రపంచంలో ఎంతో మంది సంగీత విద్వాంసులు ఈ సంగీతపూదోటలో ఎన్నో రకాల పుష్పాలను, ఇంకెన్నో కొత్త రకాల ప్రక్రియలను సృష్టించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి,థూ కొసరాజు, ఆత్రేయ, సాలూరి రాజేశ్వర్‌రావు, ఆరుద్ర, శ్రీశ్రీ, సినారె, వేటూరి, సిరివెన్నెల, చంద్రబోస్ వారి సాహిత్యంతో పదాలు కొత్త పుంతలు తొక్కుతుంటే.. కెవి మహదేవన్, ఘంటసాల, రమేష్‌నాయుడు, చక్రవర్తి, ఇళయరాజా, కీరవాణి ఇలా ఆనాటి నుంచి నేటి వరకు ఈ సంగీత ప్రపంచాన్ని తమ సృజనతో ఎప్పటికప్పుడు మలుపులు తిప్పుతూనే ఉన్నారు. నాటి పాటలు వింటూ ఉంటే.. అవి ఎప్పటికీ చెరిగిపోవు అనేట్టు ఉంటాయి. ఇప్పటికి ఆ పాటలు ఈతరం నోటివెంట వస్తుంటాయంటేనే వాటి గొప్పదనం ఏంటో తెలుస్తోంది. పగలే వెన్నెల జగమే ఊయలా అంటూ ఘంటసాల సృష్టించిన పాట వింటూ ఉంటే నిజంగానే ఆ అనుభూతి కలుగుతుంది. రావోయి చందమామ ఈ వింత గాథ వినుమా.. అంటూ సావిత్రి, ఎన్టీఆర్‌లు పాడుకుంటూ ఉంటే తెలుగు ప్రేక్షకులు వారికి నీరాజనం పట్టారు. అంతా బ్రాంతియేనా.. దేవదాస్ చిత్రంలో పారు ఏడుస్తుంటే.. అందరీ కళ్లు చెమ్మగిల్లాయి. నా పాట నీ నోట పలకలా చిలకా.. అని నాగేశ్వర్రావు మూగమనుసులు సినిమాలో సావిత్రికి నేర్పిస్తుంటే.. ప్రేక్షకలోకం కూడా వంతపాడింది. నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది అంటూ ఏఎన్నార్ పాడితే.. కుర్రలోకం మత్తులో మునిగిపోయింది. జానకీ కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు.. అంటూ జయసుధ, శోభన్ బాబు పాడుకున్న ఈ పాట తరాలు మారినా దానిలోని స్వచ్చత ఎప్పటికీ నిలిచే ఉంటుంది. సందర్భానుసారంగా వచ్చే కొన్ని పాటలు మనిషి జీవితంలో భాగమైపోయాయి. మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టం పెళ్లి. ఈ పెళ్లి తంతులో కొన్ని పాటలను ప్లే చేయాల్సిందే అన్నట్లు అదొక రివాజుగా మారింది. పెళ్లిపుస్తకం చిత్రంలోని శ్రీరస్తు.. శుభమస్తు, మురారి సినిమాలోని అలనాటి రామచంద్రుడు అనే గీతాలు పెళ్లి మండపంలో మార్మోగాల్సిందే. ఇలా మనిషి పుట్టినప్పటి నుంచీ పోయేవరకు ఉండే ప్రతిఘట్టాన్ని పాటల రూపంలో మన చిత్రసీమ అందించింది. ఒక్కపాట ఓ జాతి మొత్తాన్ని కదిలించింది అంటే.. అది ఎంతటిప్రభంజాన్ని సృష్టించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు చిత్రంలో నిద్రాణమై ఉన్న జాతిని మేల్కొలిపేందుకు తెలుగు వీర లేవరా.. అంటూ గొంతెత్తితే వెండితెర దద్దరిల్లింది. మళ్లీ ప్రేక్షకుల నాడీ వేగాన్ని, రక్తపు ప్రవాహవేగాన్ని పెంచిన పాటలెన్నో చిత్రప్రపంచంలో వచ్చాయి. అందులో అందరికీ సుపరిచితమైనవి, ఇప్పటికీ అవి అక్షరసత్యంగా నిలిచినవి సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించినవవే. సిందూరంలో సినిమాలోని అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.., గాయం చిత్రంలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అనే రెండు పాటలు అప్పటి సమాజాన్నే కాదు ఇప్పటి సమాజాన్నీ ప్రశ్నిస్తూనే ఉన్నాయి. బందాలు, బంధుత్వాలు, ప్రేమజంట, విరాహవేదన, ఇలా ప్రతీఒక్క అంశంపై ఎన్నో పాటలు, మనసుపై చెరగని ముద్ర వేసిన పాటలు ఉన్నాయి. ముఖ్యంగా అమ్మపై వచ్చిన పాటలన్నీ ప్రేక్షకుల మనసులో నాటుకుపోయాయి. ఏఆర్ రెహమాన్, కీరవాణి, కోటి, మణిశర్మ, ఆర్పీ పట్నాయక్ లాంటి దిగ్గజాలు ఎన్నో మరుపురాని అద్భుతమైన పాటలు అందించగా.. యువ సంగీత దర్శకులు కూడా తమ సత్తా చాటుతూ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ సంగీతం, పాటలు అనే కాన్సెప్ట్ మహాసముద్రం లాంటింది. ఇలా పాటలు, సంగీతం గురించి చెప్పుకుంటూ, రాసుకుంటూ పోతే ఎప్పటికీ ఆది అంతం ఉండదు. ఈ సంగీత ప్రపంచంలో ఎన్నో కొత్త స్వరాలను ప్రేక్షకులకు అందించిన, ప్రస్తుతం అందిస్తున్న ఎంతో మంది సంగీత దర్శకులకు, పాటల రచయితలకు ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. -
పాటల పల్లకీకి కొత్త బోయీలు
తెలుగు సినీరంగంలో పాటల పల్లకిని మోస్తన్న బోయీలు ఎందరెందరో! అలనాటి బోయీలలో ఎందరో మహానుభావులు! పాటల పల్లకిని భుజానికందుకున్నారు నవతరం బోయీలు! వారి అనుభవాలూ అనుభూతులూ మీకోసం... జూన్ 21 ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా... ఏ ఆర్ రెహ్మాన్ రియల్‌హీరో నేను పుట్టింది చెన్నైలో. నాకు సంవత్సరం వయసు ఉన్నప్పుడే అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకి వెళ్లిపోయాము. మా అమ్మ గారి నాన్న కర్ణాటక సంగీత విద్వాంసులు. ఇంట్లో సంగీత వారసత్వముంది. ఆ విద్య మా అమ్మకు వారసత్వంగా వచ్చింది. అమెరికాలో అమ్మ ‘శ్రీ లలిత గాన విద్యాలయ’ పేరుతో కర్ణాటక సంగీత పాఠశాల పెట్టారు. నేను, అక్క మేమిద్దరమే ఆ స్కూల్లో ఫస్ట్ స్టూడెంట్స్. నాకు మూడేళ్ల వయస్సు వచ్చే సరికే సభల్లో, కచేరీల్లో పాడటానికి అమ్మ స్టేజ్ ఎక్కించేది. అలా చాలా అవకాశాలు అమ్మ ద్వారా వచ్చాయి. నాకు పదమూడేళ్లు వచ్చే వరకు రోజూ ఉదయం రెండు గంటలు సాధన చేయటం, స్కూల్‌కి వెళ్లటం, మళ్లీ స్కూల్ నుంచి రాగానే సాధన చేయటం ఇదే నా పని. ఏ ఆర్ రెహమాన్‌గారు అమెరికా వచ్చినçప్పుడు అందరిలాగానే నేను కూడా లైన్లో నిల్చొని ఆయన కోసం ఎదురు చూశాను. అప్పుడు ఎంతో కష్టపడి ఆయన మెయిల్ ఐడీ సంపాదించాను. ఆ తర్వాత నేను పాడిన పాటలను ఆయనకు పంపించాను. అవన్నీ చూసిన రెహమాన్‌గారు ఓ ఆర్నెల్ల తర్వాత మెయిల్లో ‘నీ వాయిస్ చాలా వెరైటీగా ఉంది. అవకాశం వస్తే కలిసి పనిచేద్డాం’ అన్నారు. అన్నట్టుగానే ఓ రోజు కాల్ చేసి స్కైప్లోకి రమ్మన్నారు. సరే అని వచ్చాను. ఆయన నాతో ఇలా పాడు అలా పాడు అని చెప్తూ ఉంటే ఓ నాలుగు గంటల పాటు పాడాను. రెహ్మాన్ సార్ ఓ నెల తర్వాత ఫోన్‌చేసి ‘మీ వాయిస్ మణిరత్నంగారికి నచ్చింది’ అని చెప్పారు. ‘అవునా! చాలా థ్యాంక్స్. రికార్డింగ్ ఎప్పుడు?’ అని అడిగాను. ‘అదేంటి ఆ రోజు నువ్వు స్కైప్‌లో పాడావు కదా’ అన్నారు. ఒక్కసారిగా ఆశ్చర్య పోవటం నా వంతు అయ్యింది. అలా నాకు మొదటి సినిమా పాట పాడే అవకాశం రెహ్మన్ సార్ వల్ల వచ్చింది . ఆయన నా లైఫ్‌లో రియల్ హీరో. ఇక తెలుగు పాటల విషయానికొస్తే 2017లో కోన వెంకట్‌గారు ఓ పాట పాడాలి అని చెప్పారు. నాని హీరోగా నటించిన ‘నిన్నుకోరి’ చిత్రంలోని ‘అడిగా అడిగా...’ అనే పాటతో తెలుగుకు పరిచయం అయ్యాను. ఆ తర్వాత పరశురాం గారు ఓ పాట పాడించారు. ఆ పాటే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీతగోవిందం’ చిత్రంలోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...చాల్లే.. ఇది చాల్లే...’ పాటతో నా లైఫ్ టర్న్ తీసుకుంది. తెలుగువారే కాకుండా భారతదేశం మొత్తం ఈ పాట మార్మోగిపోయింది. అమెరికాలో కూడా ఈ పాట పాడకుండా నా షో ఉండదంటే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. కొత్తగా పాడాలనే ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చెయ్యాలి. రోజూ సంగీతానికి సంబంధించిన ఏ విషయంలోనైనా ఎదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. మీరు ఉదాహరణకి గమనిస్తే బాలు గారు గత 50 ఏళ్లుగా పాడుతూనే ఉన్నారు. ఆయన ఈ ప్లానెట్‌లో ఉండాల్సిన వ్యక్తి కాదు. ఆయన టాలెంట్‌కి ఈ ప్లానెట్ సరిపోదు. వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా అందరూ చక్కగా పాడుతూనే ఉండాలి అన్నారు. దగా... భలే కిక్ ‘‘దగా.. దగా.. దగా.. కుట్ర, మోసం...’ ఈ పాట ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలోనిది. ఈ పాట ప్రేక్షకుల్లో ఎంత సంచలనం సృష్టించిందో రెండు రాష్ట్రాల్లోని తెలుగువారందరికీ తెలుసు. అసలు ఈ పాట ఎలా పుట్టింది? ఆ పాట వెనక జరిగిన విశేషాలేంటి? చిత్ర సంగీతదర్శకుడు, ‘దగా.. దగా..’ పాట పాడిన కళ్యాణీ మాలిక్ మాట్లాడుతూ– ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి మొదట నేను సంగీత దర్శకుడిని అని లిరిక్ రైటర్ సిరాశ్రీ చెబితే నమ్మలేదు. కారణం నాకు రామ్‌గోపాల్ వర్మ గారు అసలు పరిచయం లేదు. ఇండస్ట్రీలో ఇద్దరు వ్యక్తులు కలిసి పని చేయాలంటే ఎంతో కొంత పరిచయం అవసరం. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో ఫస్ట్ రికార్డ్ చేసిన పాట ‘దగా..’. సాంగ్. ‘దగా’ అన్న ఒక్క మాటను పట్టుకొని ఆ పాట ట్యూన్‌ను రెడీ చేశాను. ముందుగా నాకు ఆర్జీవీ (రామ్‌గోపాల్ వర్మ)గారు ఆ పాటలో కోపం, కసి, పగ ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో కూడిన వేరియేషన్స్ ఉండాలన్నారు. పాట వినగానే ఆడియన్స్ గుండెల్లోకి వెళ్లిపోవాలి అని చెప్పారు. సాంగ్ రెడీ అవ్వగానే రఫ్‌గా నేను ఒక వెర్షన్ పాడి ఆయనకు పంపాను. ఆయన చిన్న పిల్లాడిలా సంబరపడిపోయి ఈ పాటను ఎవరితో పాడిస్తున్నారు? అని అడిగారు. నేను కొన్ని పేర్లు చెప్పాను. ఎవరూ అవసరం లేదు.. అదే ఇంటెన్సిటీతో ఈ పాటను మీరే పాడండి అన్నారు. నేనా! అని ఆశ్చర్యానికి లోనయ్యాను. సరే అనుకొని రెండు వెర్షన్స్‌లో పాడి వినిపించాను. మొదటి వెర్షన్ ఆయనకు నచ్చలేదు, రాముగారు చిన్నపిల్లాడిలాంటి వాడు, నచ్చితే ఎంత బాగా ఉంది అని చెప్తారో, నచ్చకపోతే అంతే నిర్మొహమాటంగా బాగాలేదు అని మొహం మీదే చెప్పేస్తారు. మొదటిసారి పాడిన పాట విని నచ్చలేదు అని మెసేజ్ పెట్టారు. సరే.. అనుకొని ఇంకో వెర్షన్ పాడి మెసేజ్ పెట్టాను. శభాష్ అంటూ ఆనందంతో గంతులేసినంత పనిచేశారాయన. హమ్మయ్య అనుకున్నాను. ఆ సినిమా జరుగుతున్నప్పుడు అందరూ అనుకున్నట్లుగానే నాకు ఓ సందేహం ఉండేది. రాముగారు సినిమా తీస్తున్నారా లేక మాటలు చెప్తున్నారా అనుకునేవాణ్ని. నా సందేశాలకు బ్రేక్ వేస్తూ సినిమాలో 11 పాటలు ఉంటే నేను పాడిన పాటను మొదట రిలీజ్ చేశారు. ఆ పాట ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆయన ఆ పాటను వైస్రాయ్ సంఘటన తర్వాత వాడుకుంటారు అనుకున్నాను. కానీ ఆయన చాలా తెలివిగా సినిమా అంతా వాడుకున్నారు. ఆ పాట విడుదలైన కొన్ని రోజులకు తారక్ (ఎన్టీఆర్) కలిసి పాట చాలా బాగా చేశారు అని అప్రిషియేట్ చేశారు. రాజకీయాలకు సంబంధం లేకుండా ఆయన మెచ్చుకోవటం నా పనికి దక్కిన గౌరవంగా భావించాను. ఓ రోజు నేను, రాజమౌళి, ప్రభాస్ అందరం కలిసి చిన్న పార్టీలో ఉన్నప్పుడు తారక్‌తో జరిగిన సంభాషణ ఇది. ఆయనకు నేను చేసిన సినిమాల్లో ‘ఆంధ్రుడు’ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఆ సినిమాలోని అన్ని సాంగ్స్‌ను ట్యూన్ లేకపోయినా అలవోకగా పాడతారు తారక్. ఆ సంగతలా ఉంచితే.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చేసినప్పుడు నేను గమనించిన విషయం ఏమిటంటే పని చేసినవారికి ఆర్జీవీ డబ్బులు సరిగా ఇవ్వరని, పాటలు చేసేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌ను ఆయన ఒళ్లో కూర్చోపెట్టుకొని పాటలు ట్యూన్ చేయిస్తాడని చాలామంది చెప్పారు. ఆయన నాతో మీరు చాలా ఫ్రీడమ్ తీసుకొని కథకు తగ్గట్లుగా మంచి ట్యూన్స్ ఇవ్వమని మాత్రమే అడిగారు. ఆయన గురించి బయట విన్నవన్నీ అబద్ధం అని చిన్న ఉదాహరణతో మీకు చెప్తాను. ఈ సినిమాలోని ఐదు పాటలను సింగర్స్‌లో టాప్ సింగరైన యస్పీ బాలసుబ్రహ్మణ్యంగారితో పాడించారు. డబ్బు కోసం నేను ఏ విధంగానూ ఇబ్బంది పడలేదు. అప్పుడు నేను అనుకున్నాను ఏ మనిషి గురించైనా ఒక అంచనాకు వచ్చే ముందు వాళ్ల మాటలు వీళ్ల మాటలు వినకూడదు అని. మనకు మనంగా చూసి అభిప్రాయానికి రావాలి. మొత్తానికి నేను ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా రానంత తృప్తి ఈ సినిమా ద్వారా, ఈ పాట ద్వారా పచ్చింది. సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కోసం నేను రాముగారితో, ఆ టీమ్‌తో పని చేసిన ఆరు నెలల టైమ్ నా కెరీర్లో బెస్ట్ టైమ్. ఈ సంవత్సరం వరల్డ్ మ్యూజిక్ డేకు నాకొచ్చిన కిక్ మాటల్లో చెప్పలేనిది’’ అన్నారు. వై నాట్.. బాధ్యతగా ఉంటే విజయమే పీవీయన్‌యస్ రోహిత్ అనే పేరు రెండేళ్ల కింద భారతదేశం అంతా మార్మోగిపోయింది. 2017లో ‘ఇండియన్ ఐడల్’లో రన్నరప్‌గా నిలిచిన తెలుగువాడిగా అందరికీ తెలుసు. 2018లో నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన ‘సవ్యసాచి’ చిత్రం కోసం రోహిత్ ‘వై నాట్...’ అంటూ గొంతువిప్పారు. ఆ పాట ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ పాట గురించి రోహిత్ మాట్లాడుతూ– ‘‘యం.యం. కీరవాణిగారు ఆ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఆ పాట కోసం కీరవాణిగారు రెండు మూడు ట్యూన్స్‌ను రెడీ చేశారు. ఆయన ఆ ట్యూన్‌ను వాళ్ల టీమ్ అందరికీ పంపారు. టీమ్‌లోని అందరూ ఈ ట్యూన్‌కి కనెక్ట్ అయ్యారు. అప్పుడు ‘వై నాట్..’ సాంగ్‌ను సినిమాలోని సన్నివేశాలకు కనెక్ట్ చేశారు. సింగర్‌గా నాకు మంచి పేరు వచ్చింది. కొత్తగా పాటలు పాడుతూ పైకి రావాలనే వాళ్ల కోసం వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా నేను చెప్పేదేంటంటే మనం ఒక పాట పాడుతున్నాం అంటే ఆ పాటకు ఎన్ని క్లిక్కులు వస్తాయి అనేది ఆలోచించకూడదు. ఒక పాటకి విలువ ఇంత అని చెప్పలేం. దాన్ని కొలవడానికి ఏ మెషిన్ లేదు. మ్యూజిక్‌ను ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. దానికోసం కష్టపడుతూ, ప్యాషనేట్‌గా ఉండాలి. అదో నిరంతర ప్రక్రియ. పాట ఎలాంటిదైనా చాలా బాధ్యతగా ఉండాలి. అప్పుడే అది ప్రేక్షకుల దగ్గరికి పరిపూర్ణంగా వెళుతుంది అని నేను నమ్ముతాను. నేను ఇప్పుడు హిందీలో, తెలుగులో పెద్ద హీరోలకు పాటలు పాడుతున్నాను. కానీ వాటి వివరాలు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నందుకు సారీ. కారణం నేను ఇండియన్ ఐడల్ వాళ్లకి మూడేళ్లు అగ్రిమెంట్లో ఉన్నాను. దేవుడి దయవల్ల భవిష్యతులో చాలా మంచి పాటలు పాడతాను. నాకు ఎన్నో పాటలు పాడే అవకాశం ఇచ్చిన, ఇస్తున్న సంగీత దర్శకులకు ఈ వర ల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారూ వీరూ... అభినందిస్తే ఆనందమే ‘‘సంగీతమంటే ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మనకు ప్రతి ఎమోషన్ చాలా ఇంపార్టెంట్. సంగీతం ద్వారా ఆ ఎమోషన్స్‌ను సులువుగా వ్యక్తపరచవచ్చు. సంగీతానికి రాళ్లు సైతం కరుగుతాయి అంటారు. నిజంగా వాటిని కదిలించకపోయినా నా గొంతుతో ప్రేక్షకుల హృదయాల్ని కదిలించాలన్నది నా ముఖ్య ఉద్దేశం. కళాకారుడి ముఖ్య ఉద్దేశం కూడా అదే’’ అని సింగర్ అనురాగ్ కులకర్ణి తెలిపారు. గత ఏడాది ‘ఆర్ఎక్స్ 100’లో పిల్లా రా..., ఆశా పాశం, వారూ వీరు వంటి సూపర్ హిట్ సాంగ్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. సింగర్‌గా తన ప్రయాణం గురించి అనురాగ్ కులకర్ణి చెబుతూ– ‘‘ప్రస్తుతం జర్నీ చాలా బావుంది. ఒక సింగర్‌కు వర్సెటాలిటీ చూపించడానికి మించిన అదృష్టం ఉండదు. గత కొన్ని నెలల్లోనే ‘ఆర్ఎక్స్ 100’లో ‘పిల్లా రా..’, ‘కేరాఫ్ కంచరపాలెం’లో ‘ఆశా పాశం’ ఫిలాసఫికల్‌గా ఉంటుంది. ‘దేవదాస్’లో ‘వారూ వీరు’ పెప్పీ నంబర్. వీటన్నింటినీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేయడం సంతోషం. ఈ పాటలన్నీ పాడటాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఒక పాట పాడేప్పుడు హిట్ అవుతుందా? లేదా? అనేది మనం ఊహించలేం. నిజంగా ఊహించలేం. నా వరకైతే ఇప్పటి వరకూ ఎంతమంది ఏయే పాటలు బాగా వింటున్నారన్న సంగతి కూడా తెలియదు. దాని మీద ప్రత్యేకించి ఎఫర్ట్ కూడా పెట్టను. ఎవరైనా చెప్పినప్పుడు ఓహో ఇది హిట్ అయిందా? దీనికి బాగా రీచ్ ఉందా? అనుకుంటాను. ఈ పాట బాగా రీచ్ అవుతుంది అనుకున్నవి అవ్వలేదు. ఈ ట్యూన్‌ని వింటారా? వినరా? అని సందేహించిన వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో.. ఏ సాంగ్ అయినా ఒకటే యాటిట్యూడ్‌తో అప్రోచ్ అవుతాను. నేను కొంచెం ఓల్డ్ స్కూల్ టైప్. సోషల్ మీడియాను అంత సీరియస్‌గా తీసుకునే టైప్ కాదు. జెన్యూన్ రెస్పాన్స్ కోరుకుంటాను. సోషల్ మీడియాలో ఉన్నదానికంటే ఎక్కువ చేసి చూపిస్తారు. అందుకే వాటిని పెద్దగా పట్టించుకోను. మన పని మనం బాగా చేశామా? లేదా? అన్నదే ముఖ్యం. ప్రత్యేకంగా ఈ సంగీత దర్శకుడికి పాడాలని ఎప్పుడూ అనుకోలేదు. మనం ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కు పాడాలని కోరుకోవడం కంటే.. మన టాలెంట్‌ను బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే వాళ్లే మనల్ని అప్రోచ్ అవుతారు అనే పద్ధతిని ఫాలో అవుతాను. అందుకే మ్యూజిక్ డైరెక్టర్స్ అందర్నీ ఒకేలా గౌరవిస్తాను. ‘పిల్లా రా..’ అప్పుడు చైతన్య భరద్వాజ్ కొత్త సంగీతదర్శకుడు. అప్పటికి మణిశర్మగారికి పాడుతూ ఉన్నాను. అందరికీ ఒకేలా కష్టపడతాను. ఇంకా నా గొంతులో ట్యాప్ చేయని ఏరియాలు చాలా ఉన్నాయి. వాటిని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. అలాగే నా పాట నలుగుర్నీ నయం చేయగలగాలి. పూర్వం కులాసా వాతావరణం ఉండేది. ప్రస్తుతం అంతా ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్‌లో మ్యూజిక్ మాత్రమే ఒక ఫ్రెండ్‌గా మనల్ని గైడ్ చేస్తుంది. సంగీతం ద్వారా ఒక ఆరోగ్యవంతమైన సొసైటీని నిర్మించుకోగలం. అది తయారవడానికి నా గొంతు ఉపయోగపడుతుందంటే చాలా సంతోషం. చాలా డిప్రెస్డ్గా ఉన్నప్పుడు ఫలానా పాట మా మైండ్‌ని ఫ్రెష్‌గా చేసింది అని ఎవరైనా చెబితే చాలా సంతోషిస్తాను. పాట బావుంది అని చెప్పడం కంటే కూడా మీ పాట వల్ల మేం ప్రభావితం అయ్యాం అని చెబుతున్నప్పుడు ఇంకా సంతోషంగా ఉంటుంది. ఆర్టిస్ట్‌కి అదే నిజమైన ఆనందం’’ అన్నారు. రెడ్డమ్మ తల్లీ... ఓ ఊహించని మలుపు ‘రెడ్డమ్మ తల్లీ’... ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలోని హిట్ సాంగ్స్‌లో ఇదొకటి. ఈ పాటను మోహనా బోగరాజు పాడారు. ‘‘ఇది నా జీవితంలో మరచిపోలేని పాట’’ అని మోహనా భోగరాజు చెబుతూ – ‘‘రెడ్డమ్మ తల్లి...’ పాట పాడిన తర్వాత నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. ఇప్పటివరకు 90 పాటలు పైనే పాడాను. కానీ, ఈ పాట మాత్రం నా జీవితానికి ఊహించని మలుపు. ఈ పాట నా దగ్గరికి ఎలా వచ్చిందో చెప్తాను. నేను యాక్చువల్‌గా ‘అరవింద సమేత’ చిత్రానికి రీ–రికార్డింగ్‌కి పాడటానికి వెళ్లాను. పాడి వచ్చేశాను. సినిమా రిలీజయ్యే కొద్దిరోజుల ముందు ఓ పెద్ద వయసున్న ఆడమనిషి గొంతు అయితే ఈ పాటకు న్యాయం జరుగుతుందని అందరూ అనుకున్నారట. అప్పుడు సింగర్ శ్రీకృష్ణ అన్న ‘ఇటువంటి సాంగ్ మోహన పాడుతుంది పిలవమంటారా తమన్‌గారు’ అని అడిగారట. సరే అనుకొని రికార్డింగ్‌కి పిలిచారు. నేను వెళ్లి పాడి వచ్చేశాను. సినిమా రిలీజ్ తర్వాత ఆ పాటకు వచ్చిన రెస్పాన్స్ చూసి నేను నమ్మలేకపోయాను. ఓ మై గాడ్.. నేను పాడిన పాటేనా ఇది అనుకున్నాను. ఎందుకు ఇలా అంటున్నానంటే గతంలో నేను తమన్ గారి దగ్గర కొన్ని సినిమాలకు పాడాను. అప్పుడు కూడా నా దగ్గర ఇలాంటి గొంతు ఉంది అని ఆయన అనుకోలేదు, నాకు తెలియదు. అప్పటివరకు నేను అలాంటి పాట పాడగలనని నాకూ తెలియదు. ఇదే నా మొదటి పాట. నాకు ఆయన మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఆయనతో పాటు ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ త్రివిక్రమ్ గారు, హీరో తారక్‌గారు వీళ్లందరికీ నేను వ్యక్తిగతంగా పెద్ద ఫ్యాన్‌ని. వాళ్లందరూ నేను పాడిన పాటను పొగుడుతూ ఉంటే ఇంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి. ఆ రోజు నేను పాడుతుంటే అక్కడ టీమ్ అందరూ ఉన్నారు. నేను అభిమానించే తమన్ గారు వెరీగుడ్, వెల్డన్ అని, చాలా బాగా పాడావమ్మా అని త్రివిక్రమ్ గారు అన్నారు. అక్కడ రచయిత పెంచల్దాస్ గారు కూడా ఉన్నారు. పాటలో ఓ చోట దువ్వెన అని పాడాను. పెంచల్దాస్ గారు దువెయన అని పాడమన్నారు. సరే అని పాడేశాను. నాకు జీవితంలో ఇంత మంచి అవకాశం వచ్చినందుకు ఈ వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా తమన్ గారికి, నా నిజమైన అన్నయ్య శ్రీకృష్ణకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అల్లుడు చూడే... పాపులరే ‘‘కొన్నిసార్లు మనకు ఎవరో అవకాశం ఇస్తారు అని ఎదురుచూసే కంటే మనమే అవకాశం కల్పించుకోవాలి. అందుకే ప్రైవేట్ ఆల్బమ్స్ పాడటం మొదలు పెట్టాను. తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి’’ అని మంగ్లీ అన్నారు. గత ఏడాది విడుదలైన ‘శైలాజారెడ్డి అల్లుడు’ సినిమాలో ‘శైలజారెడ్డి అల్లుడు చూడే...’ పాట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాటను పాడింది మంగ్లీ. రేలారే రేలా, బతుకమ్మ పండగ మీద ప్రైవేట్ పాటల ద్వారా పాపులర్ అయ్యారు మంగ్లీ. ‘నీదీ నాదీ ఒకే కథ, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బీ, శైలజా రెడ్డి అల్లుడు, వేర్‌ఈజ్ ద వెంకటలక్ష్మీ. లచ్చి’ వంటి సినిమాల్లో ఇప్పటి వరకూ పాడారామె. ‘శైలాజారెడ్డి అల్లుడు చూడే..’ పాట పాపులర్ అవడం గురించి మంగ్లీ మాట్లాడుతూ – ‘‘ముందుగా ఇంత మంచి గొంతునిచ్చిన మా అమ్మానాన్నలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. కొన్నిసార్లు ట్యూన్ వినగానే ఆ పాట ఎక్కడి వరకూ పోతుందో ఊహించగలం. ఈ పాట బాగా పేలుతుంది అనుకున్నాం, అనుకున్నట్టుగానే బాగా పేలింది. రచయిత కాస్లర శ్యామ్ చెప్పగా, దర్శకుడు మారుతిగారు దగ్గరుండి ఈ పాటను పాడించుకున్నారు. గోపీ సుందర్ సంగీతంలో పాడటం అదృష్టం అని చాలా మంది నాతో చెప్పారు. నేను పాడిన సినిమా పాటల్లో నా ఫేవరెట్ పాట అంటే ‘నీది నాదీ ఒకే కథ’లో ‘జిమ్మేదారి కోయిల..’. అది ఎంత రీచ్ అయిందో తెలియదు కానీ నాకు పర్సనల్‌గా ఇష్టం. ఇంకో విషయం ఏంటంటే.. ఆంధ్రా, రాయలసీమ ఆ ప్రాంతాల వైపు వెళ్లినప్పుడు రేలారే రేలా పాట పాడమని అడుగుతుంటారు. ‘ఓరి నాయనా అది ఆ ప్రాంతం పాట కదా?’ అని అనుకుంటాను. కళకు ప్రాంతాలతో సంబంధం ఉండదు. మనమే పేర్లు పెట్టి విభజిస్తుంటాం. ఓ మంచి పాటను ఏదీ ఆపలేదు. సంగీతానికి ఉన్న పవర్ అలాంటిది. వెంకటేశ్వరస్వామి అంతటి ఆయనే అన్నమయ్యను ఇంకా బతుకు అని వరాన్ని ప్రసాదించాడు. ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఎంఎస్ సుబ్బలక్ష్మిగారి పాటలు, హిందీ పాటలు వింటుంటాను. సుబ్బలక్ష్మిగారి పాటలు విన్నప్పుడైతే కళ్లలో నీళ్లు వచ్చేస్తాయి. మణిశర్మ, కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ వంటి వారి కంపోజిషన్‌లో పాడాలనుంది. ప్రస్తుతం ‘ఆకాశవాణి’ సినిమాలో ఓ పాట పాడాను. ‘స్వేచ్ఛ’ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాను’’ అని అన్నారు. పిచ్చి పిచ్చిగా... కల నెరవేరెగా ‘‘క్లాసికల్ సాంగ్, ఐటమ్ నెంబర్, సోల్‌ఫుల్ సాంగ్ అనే తేడా లేకుండా ఏ పాటైనా పాడి శ్రోతలను అలరించగలను. అదే నా çప్లస్ పాయింట్’’ అంటున్నారు పరోమా దాస్‌గుప్తా. హిందీలో పరోమా పాడిన పాటల్లో ‘ఓకే జాను’లో ‘కారా.. ఫంకారా’, ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’లో ‘కాఫీ పీతే పీతే’ కూడా ఉన్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘మెహబూబా’ సినిమాలో ‘పిచ్చి పిచ్చిగా..’ అనే పాటతో పరోమా తన గొంతును తెలుగుకి పరిచయం చేశారు. ఇటీవల తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ సినిమాలో ‘రోల.. రోల..’ అనే సాంగ్‌తో శ్రోతలను మెప్పించారు. ఈ పాటల విశేషాల గురించి పరోమా దాస్‌గుప్తా మాట్లాడుతూ– ‘‘మెహబూబా’ సినిమాలో ‘పిచ్చి పిచ్చి..’గా సాంగ్ పాడటం అమేజింగ్ ఫీలింగ్. ఈ సినిమాకు సంగీత దర్శకుడైన సందీప్ చౌతాగారి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నతనం నుంచి ఆయన సంగీతాన్ని ఇష్టంగా వింటున్నాను. ఇక పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లోని సినిమాకు పాట పాడటం అంటే ఏ సింగర్‌కైనా కల నిజమైనట్లే. ఇంకా ఆయన సినిమాతో సింగర్‌గా నేను తెలుగు పరిశ్రమకు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇటీవల తేజగారి దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ సినిమాలో ‘రోల రోల’ అనే మరో పాట పాడాను. ఇది సర్ప్రైజింగ్గా జరిగింది. ఓ సందర్భంలో మా సిస్టర్ అనూప్ రూబెన్స్‌ను కలిశారు. ఆ సందర్భంలో ఈ స్పెషల్ సాంగ్ డిస్కషన్ వచ్చింది. డిఫరెంట్ వాయిస్‌తో పాడించాలని ఆయన మా సిస్టర్‌తో అన్నారు. అలా నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ సాంగ్‌ను బాంబేలో రికార్డ్ చేశాం. ఈ సాంగ్ జర్నీ సూపర్ ఫీలింగ్ ఇచ్చింది. ఇప్పటివరకు తెలుగులో రెండు పాటలు మాత్రమే పాడాను. మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను. బాంబేలో సింగర్‌గా బిజీగానే ఉన్నా. సౌత్‌లో నా వాయిస్ మరింత మందికి సంగీత దర్శకులకు రీచ్ అవుతుందన్న నమ్మకం ఉంది. అప్పుడు తప్పకుండా ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఆ సమయం దగ్గర్లోనే ఉందని నా నమ్మకం. మన దేశంలో బాలీవుడ్ అండ్ టాలీవుడ్ ఇండస్ట్రీలు చాలా పెద్దవి. నేను ముంబైలో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ అవకాశాల పరంగా కొంచెం కంఫర్ట్‌గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ టాలీవుడ్లో ప్రతి కొత్త సింగర్‌కు మంచి వెల్కమ్ ఉంటుంది. బాలీవుడ్, టాలీవుడ్ అని కాదు. సింగింగ్ ఆర్టిస్టుగా పెద్ద పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది మా ఫ్యామిలీది. మా అమ్మగారు క్లాసికల్ సింగర్. వ్యక్తిగతంగా ఘజల్స్ అంటే నాకు చాలా ఇష్టం’’ అన్నారు. డియో డియో కెరీర్ పీక్సయ్యో రఘురాం మల్టీ టాలెంటెడ్. పాటలు పాడటమే కాదు.. రాస్తారు కూడా. అది మాత్రమే కాదు.. మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా మారారు. గత ఏడాది బాగా వినిపించిన పెప్పీ సాంగ్స్‌లో ‘డియో డియో డిసక డిసక...’ ఒకటి. రఘురాం మాట్లాడుతూ – ‘‘‘పీయస్వీ గరుడవేగ’ చిత్రంలో పాడిన ‘డియో డియో డిసక డిసక...’ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అలాగే ‘పేపర్‌బాయ్’ చిత్రంలోని ‘బొంబాయి పోతావ రాజా బొంబై పోతావా..’ పాటతో పాటు మరో రెండు పాటలు కూడా పాడాను. ఇవేకాకుండా గత ఏడాది నితిన్ హీరోగా నటించిన ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రంలోని మెలొడీ ‘అర్థం లేని అర్థాలెన్ని..’ పాట రాశాను. శ్రీకాంత్ హీరోగా నటించిన ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’తో పాటు ‘ప్రతిక్షణం’ చిత్రానికి కూడా మ్యూజిక్ అందించాను. ప్రస్తుతం నేను ‘కళాకారుడు’ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాను. ఇప్పటివరకు దాదాపు 70 సినిమా పాటల వరకు పాడాను. ఇప్పుడు వరల్డ్‌కప్ జరుగుతుండటంతో క్రికెట్‌కి సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో ఆల్బమ్‌ను సింగర్ లిప్సికతో కలిసి రూపొందించాను. ఆ పాటకు చాలా మంచి పేరొచ్చింది. నేను సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టటానికి కారణం రెండు తెలుగు రాష్ట్రాల్లోని మ్యూజిక్ లవర్స్‌కి నా పాట గట్టిగా వినిపించాలి అని. సంగీత దర్శకుల్లో నాకు ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు, గాయకుల్లో యస్పీబీ గారు, శంకర్ మహదేవన్‌గారు చాలా స్ఫూర్తి. వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా కొత్తగా సంగీతంలోకి వచ్చే వారికి నేను రెండు సలహాలు ఇస్తాను. ఏ జాబ్‌లో అయినా ప్రాక్టీస్‌కు సబ్‌స్టిట్యూట్ లేదు. ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే అంత బాగా పాటల ప్రపంచంలో ఉంటాం. అలాగే మ్యూజిక్ ఈజ్ నాట్ ఏ బిజినెస్, మ్యూజిక్ ఈజ్ ఏ ప్యాషన్ అనుకొని ఎవరైనా ఈ ఇండస్ట్రీలోకి రావాలని మనసారా కోరుకుంటున్నాను’’ అన్నారు. – సినిమా డెస్క్ -
వీణాపాణీతో స్పెషల్ ఇంటర్వ్యూ
-
సంగీత్ సాగర్
-
మెల్లమెల్లగ వచ్చిండే... పాటల బిస్కెట్ ఏసిండే...
మీరు యూతా? అంటే వయసులో కాదు. ఆలోచనల్లో, ఆచరణల్లో, జీవితాన్ని అందంగా జీవించడంలో... మీరు యూతా? అయితే ఇది మీకోసమే! 2000 – 2018 వరకు వచ్చిన కొన్ని వేల పాటల్లో మిమ్మల్ని ఉర్రూతలూగించి, ఉత్సాహపరిచి, ఉల్లాసాన్నిచ్చిన కొన్ని సూపర్‌హిట్ పాటలను వరల్డ్ మ్యూజిక్ డే (జూన్ 21) సందర్భంగా మీకు అందిస్తున్నాం. ఈ లిరిక్స్ చూడగానే మీరు ట్యూన్ పట్టేశారా... అంటే మీరు తప్పకుండా యూత్ అన్నట్టే! ఇందులో చాలా పాటలను మీరు విని ఉంటారు. చాలా పాటలను ఒక యుఫోరియాలా పాడుకొని ఉంటారు. ఇవే అత్యుత్తమం అని చెప్పడం మా ఉద్దేశం కాదు. ఇది అసలు ఒక ర్యాంకింగ్ అని, సెలెక్షన్ అనీ మేం భావించట్లేదు. సరదాగా మేం ఎంపికచేసిన ఈ పాటలను మ్యూజిక్ డే రోజున సెలెబ్రేట్ చేసుకొని పాడుకుంటారని మాత్రమే..! కవర్‌ఫొటో చూడగానే మీకొక ట్యూన్ వచ్చేసింది కదా.. యూతెక్కించే పాటకు ట్యూన్ కట్టేస్కోండి!! వచ్చిండే.. మెల్ల మెల్లగ వచ్చిండే.. పాటల బిస్కెట్ ఏసిండే... సదా నన్ను చిత్రం: మహానటి సంగీతం: మిక్కీ జె. మేయర్ గానం: చారులత మణి సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి సదా నన్ను నడిపే నీ చెలిమే.. పూదారై నిలిచే / ప్రతీ మలుపు ఇకపై స్వాగతమై.. నా పేరే పిలిచే / ఇదే కోరుకున్న.. ఇదే కోరుకున్న.. అని నేడే తెలిసెలే / కాలం నర్తించదా నీతో జతై.. ప్రాణం సుమించదా నీ కోసమై (2) /నదికి వరదల్లె.. మదికి పరవళ్లై / బెరుకు ఎపుడు వదిలిందో.. చురుకు ఎపుడు పెరిగిందో / తలపు తొలిజల్లై.. తనువు హరివిల్లై / వయసు ఎపుడు కదిలిందో.. సొగసు ఎపుడు కురిసిందో / గమనించే లోగా.. గమకించే రాగాన.. ఏదో వీణ.. లోన మోగేనా / కాలం నర్తించదా నీతో జతై.. ప్రాణం సుమించదా నీ కోసమై (2) / వచ్చాడయ్యో సామీ.. చిత్రం: భరత్ అనే నేను సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ గానం : కైలాశ్ ఖేర్, దివ్య కుమార్ సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి ముసలితాత ముడత ముఖం మురిసిపోయెనే.. గుడిసె పాక గుడ్డి దీపం మెరిసిపోయెనే.. రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్లో గంట.. రంగ రంగ సంబరంగ మోగెనే.. వచ్చాడయ్యో సామీ.. నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి.. ఇచ్చాడయ్యో సామీ.. కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ (2) / కత్తి సుత్తి పలుగు పార తీయండి.. మన కష్టం సుక్కలు కుంకుం బొట్టుగ పెట్టండి / అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్లు.. మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి / అమ్మోరు కన్ను తెరిసిన నవరాతిరి.. ఇన్నాళ్ల చిమ్మచీకటి తెల్లారే సమయం కుదిరి / వచ్చాడయ్యో సామీ.. నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి......మట్టిగోడలు చెబుతాయి.. సీమ మనుషుల కష్టాలు / దారి గతుకులు చెబుతాయి.. పల్లె బతుకుల చిత్రాలు / పండగొస్తే ప్రతిఒక్కరి మనసూ మరి పరుగయ్యేది.. పుట్టి పెరిగిన పల్లె వైపేగా / అస్సలైన పండుగ ఎప్పుడంటే.. ఆ కన్నతల్లి కంటినీరు తుడిచిన రోజేగా.. / ఓ నాడు కళ కళ వెలిగిన రాయలోరి సీమిది.. ఈనాడు వెలవెలబోతే ప్రాణమంత సినబోతోంది / వచ్చాడయ్యో సామీ.. నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి......చేతివృత్తులు నూరారు.. చేవగలిగిన పనివారు / చెమటబొట్టు తడిలోనే.. తలుక్కుమన్నది ప్రతి ఊరు / ఎండ పొద్దుకు వెలిగిపోతారు.. ఈ అందగాళ్లు వానజల్లుకు మెరిసిపోతారు / ఎవ్వరికన్నా తక్కువ పుట్టారు? వీళ్లందరి లాగే బాగ బతికే హక్కున్నోళ్లు / పల్లెటూళ్లు పట్టుబొమ్మలని ఒట్టి జోలపాట పాడక.. తల్లడిల్లు తలరాతలకు సాయమేదో చెయ్యాలంట / వచ్చాడయ్యో సామీ.. నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి...... దారి చూడు.. చిత్రం: కృష్ణార్జున యుద్ధం సంగీతం : హిపాప్ థమిజా గానం–సాహిత్యం : పెంచల్దాస్ దారి చూడు దుమ్ము చూడు మామా.. దున్నపోతుల బేరే చూడు (2) / కమలపూడి కట్టమింద మామా.. కన్నెపిల్లల జోరే చూడు (2) / బులుగుసొక్కా ఏసిన వాడా పిలగా.. సిలక ముక్కూ చిన్నావాడా (2) / చక్కని చుక్క.. చక్కని చుక్క దక్కే చూడు మామా.. చిత్రకన్ను కొంటేవాడా / మేడలోని కుర్రాదాన్ని పిలగా.. ముగ్గులోకి దింపినావు (2) / నిన్ను కోరి.. నిన్ను కోరి వన్నెలాడి లైలా.. కోట దాటి పేట జేరే (2) / కురస కురస అడవిలోన పిలగా.. కురిసెనె గాంధారి వాన.. (2) / ఎక్కరాని.. ఎక్కరాని.. కొండలెక్కి మామా ప్రేమలోన చిక్కినావు (2) / పూల ఛత్రి పట్టుకొని పిలగా.. ఊరువాడా తోడురాగా (2) / జంటగానే.. జంటగానే.. కూడినారు మామా.. చలువ పందిరి నీడ కింద (2) / రంగమ్మా మంగమ్మా.. చిత్రం : రంగస్థలం సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ గానం : ఎం.ఎం.మానసి సాహిత్యం : చంద్రబోస్ రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ.. పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు (2) / గొల్లభామ వచ్చి.. నా గోరు గిల్లుతుంటే.. (2) పుల్లచీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే.. ఉప్ఫమ్మా ఉప్ఫమ్మా అంటూ ఊదడు.. ఉత్తమాటకైన నన్ను ఊరుకోబెట్టడు (2) / అరె పిచ్చి పిచ్చి ఊసుల్లోన మునిగితేలుతుంటే.. మరిచిపోయి మిరపకాయ కొరికినానంటే.. మంటమ్మా మంటమ్మా అంటే సూడడూ.. మంచి నీళ్లైనా సేతికియ్యడూ (2) / రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ.. పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు / హే రామ సిలకమ్మా.. రేగిపండు కొడుతుంటే.. రేగిపండు గుజ్జువచ్చి కొత్తగా సుట్టుకున్న రైక మీద పడుతుంటే.. (2) / మరకమ్మా మరకమ్మా అంటే సూడడూ.. మారురైకైనా తెచ్చి ఇయ్యడూ (2) / రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ.. పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు / నా అందమంత మూటగట్టి.. అరె కంది సేనుకే ఎళితే.. కందిరీగలొచ్చి ఆడ ఈడ గుచ్చి నన్ను సుట్టుముడుతుంటే (2) / ఉష్షమ్మా ఉష్షమ్మా అంటూ తోలడు.. ఉలకడూ పలకడూ బండరాముడూ.. రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ.. పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు (2)/ చూసి చూడంగానే చిత్రం : ఛలో సంగీతం : మహతి స్వరసాగర్ గానం : అనురాగ్ కులకర్ణి, సాగర్ సాహిత్యం : భాస్కరభట్ల చూసి చూడంగానే నచ్చేశావే.. అడిగి అడగకుండా వచ్చేశావే.. నా మనసులోకి.. అందంగా దూకి / దూరం దూరంగుంటూ ఏం చేశావే / దారం కట్టి గుండె ఎగరేశావే / ఓ చూపుతోటి.. ఓ నవ్వుతోటి / తొలిసారిగా.. నా లోపల.. ఏమయ్యిందో.. తెలిసేదెలా../ నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోనే చూశానులే / నీ వంక చూస్తుంటే అద్దంలో నన్ను నేను చూస్తున్నట్టే ఉందిలే / నీ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే / అహ ఈ జన్మకు ఇది చాలు అనిపిస్తోందే / నువు నా కంట పడకుండా.. నా వెంట పడకుండా.. ఇన్నాళ్లెక్కడ ఉన్నావే / నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే / నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తానులే / నీ చిరునవ్వుకై నేను.. గెలుపొంది వస్తాను.. హామీ ఇస్తున్నానులే / ఒకటో ఎక్కం కూడా.. మరిచిపోయేలాగా.. ఒకటే గుర్తొస్తావే నిను చూడకుండా ఉండగలనా / నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోనూ చూశానులే / నీవంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే / బయటికొచ్చి చూస్తే.. చిత్రం : అజ్ఞాతవాసి సంగీతం – గానం : అనిరు«ద్ రవిచందర్ సాహిత్యం : శ్రీమణి బయటికొచ్చి చూస్తే టైమేమో త్రీ ఓ క్లాక్ / ఇంటికెళ్లే ట్వెల్వ్ బీ రూటు మొత్తం రోడ్డు బ్లాక్ (2)/ ఓయ్! నీ చేతికున్న బ్యాంగిల్సే.. తాళమేసె నా సాండిల్సే / వాకు వేలో చూస్తే.. పువ్వుల రెక్కలు ఫుల్లుగా కప్పేసే / కార్నర్లో కాఫీ షాప్.. వేడివేడిగా విజిలేసే / బస్సు కిటికీ దగ్గర కాలేజ్ స్టూడెంట్ ఫోన్లో మోగే.. ఎఫ్ఎంలో ఎవరో పాడితే ఒళ్లంతా ఎందుకో ఊగెనే / ఆపిల్ పండులా సూర్యుడే.. ఎయిరోప్లేనులో నా గుండె.. తేలిందే గాలిలో మబ్బులా.. జారిందే నేలపై నీడలా / ఒళ్లే గుచ్చెలే సడెన్‌గా.. చల్లగాలే విలన్లా / బయటికొచ్చి చూస్తే టైమేమో త్రీ ఓ క్లాక్ / ఇంటికెళ్లే ట్వెల్వ్ బీ రూటు మొత్తం రోడ్డు బ్లాక్ (2)/ నీ పక్కనున్న వేళ.. కారు హార్న్ కూడా.. క్లాసికల్లు మ్యూజిక్కా / ఈ మండుటెండ కూడా ఏసీ జల్లుతోంది.. నీ నవ్వులోని మ్యాజిక్కా / ట్యాక్సీ హైరు చేసి నువ్వు.. బేరమాడుతుంటే.. క్యూటుగుంది బేసిగ్గా /బ్రేక్సు వేసినప్పుడల్లా.. నీ బుగ్గ నన్ను తాకి సారీ చెప్పే నాజూగ్గా / నువ్వున్న కిటికీ.. ఏ వైపో వెతికీ.. వాట్సాపు చేస్తావా / మబ్బుల్ని కదిపి మొహమాట పెట్టి చంద్రుణ్ని తెస్తాగా / బయటికొచ్చి చూస్తే టైమేమో త్రీ ఓ క్లాక్ / ఇంటికెళ్లే ట్వెల్వ్ బీ రూటు మొత్తం రోడ్డు బ్లాక్ (2)/ ఎఫ్ఎంలో ఎవరో పాడితే ఒళ్లంతా ఎందుకో ఊగెనే / ఆపిల్ పండులా సూర్యుడే.. ఎయిరోప్లేనులో నా గుండె / తేలిందే గాలిలో మబ్బులా.. జారిందే నేలపై నీడలా / ఒళ్లే గుచ్చెలే సడెన్‌గా.. చల్లగాలే విలన్లా / వచ్చిండే.. చిత్రం : ఫిదా సంగీతం : శక్తికాంత్ కార్తీక్ గానం : మధుప్రియ, రాంకీ సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ వచ్చిండే.. మెల్ల మెల్లగ వచ్చిండే / క్రీము బిస్కెట్ ఏశిండే / గమ్మున కూసోనియ్యడే / కుదురుగ నిల్సోనియ్యడే / సన్న సన్నగ నవ్విండే / కునుకే గాయబ్ చేశిండే / ముద్ద నోటికి పోకుండా.. మస్త్ డిస్టర్బ్ చేశిండే / పిల్లా రేణుకే.. పిలగాడొచ్చిండే / డిన్నరన్నాడే.. డేటు అన్నాడే / ఏలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా చేశిండే / వచ్చిండే.. మెల్ల మెల్లగ వచ్చిండే.... మగవాళ్లు మస్తు చాలూ.. మగవాళ్లు మస్తు చాలూ.. మస్కలుగొడతా ఉంటరే / నువు ఎన్నపూసలెక్క కరిగితె అంతే సంగతే / ఓసారీ సరే అంటూ ఓసారి సారీ అంటూ మెయింటెయినూ నువు జేస్తే లైఫంతా పడుంటాడే / వచ్చిండే.. మెల్ల మెల్లగ వచ్చిండే.... అయిబాబోయ్ ఎంత పొడుగో.. (3) / ముద్దులెట్టా ఇచ్చుడే / తనముందు నిచ్చెనేసి ఎక్కితే గానీ అందడే / పరువాలే నడుం పట్టి.. పైకెత్తి ముద్దేపెట్టే.. టెక్నిక్లే నాకున్నయిలే.. పరేషానే నీకక్కర్లే / వచ్చిండే.. మెల్ల మెల్లగ వచ్చిండే.... పిల్లా రేణుకే.. పిలగాడొచ్చిండే / డిన్నరన్నాడే.. డేటు అన్నాడే / ఏలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా చేశిండే / అరే ఓ పిల్ల ఇంక నువ్వు నేలనిడిచి గాలి మోటర్లో / వచ్చిండే.. మెల్ల మెల్లగ వచ్చిండే.... మధురమే.. చిత్రం : అర్జున్ రెడ్డి సంగీతం : రాధన్ గానం : సమీరా భరద్వాజ్ సాహిత్యం : శ్రేష్ట మధురమే ఈ క్షణమే.. ఓ చెలీ.. మధురమే ఈ క్షణమే / మధురమే వీక్షణమే.. ఓ చెలీ.. మధురమే వీక్షణమే / మధురమే లాలసయే / మధురం లాలనయే / మధురమే లాహిరిలే / మధురం లలితమే / మధు పవనం వీచి.. మధు పవనం వీచి.. పరువమై మైమరచిందిలే / కాలం పరుగులు ఆపి వీక్షించే అందాలే / మోహం తన్మయమొంది శ్వాసించే గంధాలే / ఊరించే రుచులని మరిగి ఉడికించే తాపాలే / ఉప్పొంగే ఊపిరి సెగలో కవ్వించే దాహాలే / మౌనంగా మధువుల జడిలోన.. పులకించే ప్రాణాలే / మధురమే ఈ క్షణమే.. ఓ చెలీ.. మధురమే ఈ క్షణమే /వీచే గాలులు దాగి.. చెప్పేనే గుసగుసలే / చూసే ముసిముసి నవ్వులు.. చేసే బాసలనే / వశమై ఆనందపు లోగిట.. అరుదెంచి ఆకాశం.. సగమై ఈ సాగరమందే.. అగుపించే ఆసాంతం / తీరం ముడివేసిన దారం తీర్చే ఎద బారాలే / మధురమే ఈ క్షణమే.. ఓ చెలీ.. మధురమే ఈ క్షణమే...... దండాలయ్యా.. చిత్రం : బాహుబలి 2 సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి గానం : కాలభైరవ సాహిత్యం : ఎమ్.ఎమ్.కీరవాణి పడమర కొండల్లో.. వాలిన సూరీడా.. పగిలిన కోటలనే వదిలిన మారేడా (2) / తడిసిన కన్నుల్లో.. మళ్లీ ఉదయించి.. కలలో దేవుడిలా కాపై ఉంటావా / నీ అడుగులకే మడుగులు ఒత్తేవాళ్లం.. నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్లం మేమయ్యా / దండాలయ్యా.. దండాలయ్యా.. మాతోనే నువు ఉండాలయ్యా (2) / తమనేలే రాజును మోసే భాగ్యం కలిగిందనుకుంటూ.. ఈ బండల గుండెలు పొంగి పండగ అయిపోదా / తను చిందించె చెమటను తడిసే పుణ్యం దొరికిందనుకుంటూ.. పులకించిన ఈ నేలంతా పచ్చగ అయిపోదా / నీ మాటే మా మాటయ్యా / నీ చూపే శాసనమయ్యా / మా రాజు నువ్వే.. తండ్రి నువ్వే.. కొడుకు నువ్వే.. మా ఆయువు కూడా నీదయ్యా / దండాలయ్యా.. దండాలయ్యా.. మారాజై నువ్వుండాలయ్యా / అరెరె ఎక్కడ ఎక్కడ.. చిత్రం : నేను లోకల్ సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ గానం : నరేశ్ అయ్యర్, మనీషా ఈరబత్తిని సాహిత్యం : శ్రీమణి అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం.. ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం / అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం.. ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం / మాటల్లే మరిచే సంతోషం.. పాటల్లే మారింది ప్రతీక్షణం / అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం......నింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా / ఓ.. దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా / మబ్బుల్లో ఓ.. చినుకులు మనమంటా / మనమే చేరే ఏ చోటైనా అయిపోదా పూదోట / అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం......ఓ... కళ్లతో ఓ చూపు ముద్దే.. ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా / పెదవితో పెదవులకి ముద్దే.. అడగడం తెలియని అలవాటు మార్చవా / కాటుకనే దిద్దే వేలవుతా.. ఆ వేలే పట్టి ఈ వేళ నీ వెంట అడుగేస్తా / అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం...... తాను నేను చిత్రం : సాహసం శ్వాసగా సాగిపో.. సంగీతం : ఏ.ఆర్. రెహమాన్ గానం : విజయ్ ప్రకాశ్ సాహిత్యం : అనంత శ్రీరామ్ తాను నేను.. మొయిలు మిన్ను / తాను నేను.. కలువ కొలను / తాను నేను.. పైరు చేను / తాను నేను.. వేరు మాను / శశి తానైతే.. నిశినే నేను / కుసుమం తావి.. తాను నేను / వెలుగు దివ్వె తెలుగు తీపి / తాను నేను.. మనసు మేను / దారి నేను.. తీరం తాను / దారం నేను.. హారం తాను / దాహం నేను.. నీరం తాను / కావ్యం నేను.. సారం తాను / నేను తాను.. రెప్పా కన్ను.. వేరై పోని పుడమీ మన్ను (2)/ తాను నేను.. మొయిలు మిన్ను / తాను నేను.. కలువ కొలను / తాను నేను.. గానం గమకం / తాను నేను.. ప్రాయం తమకం / తాను నేను.. మొయిలు మిన్ను / తాను నేను.. కలువ కొలను / తాను నేను.. పైరు చేను / తాను నేను.. వేరు మాను / శశి తానైతే.. నిశినే నేను / కుసుమం తావి.. తాను నేను / వెలుగు దివ్వె తెలుగు తీపి / తాను నేను.. మనసు మాను / ఎవరే.. చిత్రం : ప్రేమమ్ సంగీతం : రాజేశ్ మురుగేశన్ గానం : విజయ్ యేసుదాసు సాహిత్యం : శ్రీమణి తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే.. నా గుప్పెడు గుండెల్లో చిరుచప్పుడు నువ్వే / పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే.. నీ పేరే పలకడం పెదవులకు అలవాటే / వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే.. వేకువలా చూస్తోందే నువు నడిచిన బాటే / ప్రాణాలే తీస్తోందే నీ ఊహల తోటే.. నా మనసే నీదయ్యే.. వినదే నా మాటే / ఎవరే.. ఎవరే ప్రేమను మాయందీ.. ఎవరే.. ఈ హాయికి హృదయము చాలందీ / ఎవరే నిన్నే నా వైపు నడిపే / నా ఊహల మధురోహల హరివిల్లు నింపే / తియతీయని నిమిషాలే నీలోన ఒంపే / నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే / ఆ దైవమే నాకు చెప్పింది ఎప్పుడో.. నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటూ / నా ప్రాణమే నీకు చెబుతోంది ఇపుడు.. నువు లేక నే లేననీ / గదిలాంటి మదిలో.. నదిలాంటి నిన్నే.. దాచెయ్యాలనుకుంటే అది నా అత్యాశే / అడుగంత దూరం.. నువు దూరమైనా నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే / వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే.. వేకువలా చూస్తోందే నువు నడిచిన బాటే / ప్రాణాలే తీస్తోందే నీ ఊహల తోటే.. నా మనసే నీదయ్యే.. వినదే నా మాటే / ఎవరే.. ఎవరే ప్రేమను మాయందీ.. ఎవరే.. ఈ హాయికి హృదయము చాలందీ / ఒక లాలన... చిత్రం : జ్యో అచ్యుతానంద సంగీతం : శ్రీ కళ్యాణ రమణ గానం: శంకర్ మహదేవన్ సాహిత్యం : భాస్కరభట్ల ఒక లాలన.. ఒక దీవెన.. సడి చేయవా.. ఎద మాటునా (2) / తియతియ్యని ప్రియ భావన.. చిగురించదా పొరపాటున / కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో / పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో / ఇంతకాలం దాచుకున్న ప్రేమని, హాయిని.. కాలమేమీ దోచుకోదు ఇమ్మనీ / పెదవంచు మీద నవ్వుని పూయించుకోడం నీ పని / నీ మౌనమే మాటాడితే దరి చేరుకోదా ఆమని / అందనంత దూరమేలే నింగికీ నేలకీ.. వానజల్లే రాయబారం వాటికి / మనసుంటే మార్గం ఉండదా.. ప్రతి మనిషి నీకే చెందడా? / ఈ బంధమే ఆనందమే నువు మోసుకెళ్లే సంపద / ఒక లాలన.. ఒక దీవెన.. సడి చేయవా.. ఎద మాటునా (2) / తియతియ్యని ప్రియ భావన.. చిగురించదా పొరపాటున / కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో / పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో / ప్రణామం ప్రణామం చిత్రం : జనతాగ్యారేజ్ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గానం : శంకర్ మహదేవన్ సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి ప్రణామం ప్రణామం ప్రణామం.. సమస్త ప్రకృతికి ప్రణామం / ప్రమోదం ప్రమోదం ప్రమోదం.. ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం / ప్రయాణం ప్రయాణం ప్రయాణం.. విశ్వంతో మమేకం ప్రయాణం మన చిరునవ్వులే పూలు.. నిట్టూర్పులే తడి మేఘాలు.. హృదయమే గగనం.. రుధిరమే సంద్రం.. ఆశే పచ్చదనం / మారే ఋతువుల వర్ణం.. మన మనసుల భావోద్వేగం.. సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం / నువ్వెంత నేనెంత రవ్వంత.. ఎన్నో ఏళ్ళదీ సృష్టి చరిత / అనుభవమే దాచిందీ కొండంత.. తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా / ఎవడికి సొంతమిదంతా.. ఇది ఎవ్వడు నాటిన పంట / ఎవడికి వాడూ నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా / తరములనాటి కథంతా.. మన తదుపరి మిగలాలంట / కదపక చెరపక పదికాలాలిది కాపాడాలంట / ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం.. ఇష్టంగా గుండెకు హత్తుకుందాం / కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం.. తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం / చలిగాలి చూద్దూ.. చిత్రం : జెంటిల్‌మేన్ సంగీతం : మణిశర్మ గానం : హరిచరణ్, పద్మలత, మాళవిక సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి చలిగాలి చూద్దూ.. తెగ తుంటరీ.. గిలిగింత పెడుతున్నదీ / పొగమంచు చూద్దూ.. మహ మంచిది.. తెరచాటు కడుతున్నదీ / నన నన్నాన నన్నాన కథ ఏమిటీ / నన నన్నాన నన్నాన తెలుసా మరీ / ఇక ఈ పైన కానున్న కథ ఏమిటీ.. అది నీకైన నాకైన తెలుసా మరీ / అయినా వయసిక ఆగేనా.. మనమిక మొహమాటపడకూడదంటున్నదీ / చలిగాలి చూద్దూ.. తెగ తుంటరీ.. గిలిగింత పెడుతున్నదీ / పొగమంచు చూద్దూ.. మహ మంచిది.. తెరచాటు కడుతున్నదీ ఎటు పోతున్నాం అని అడిగామా.. ఎదురుగ వచ్చే దారేదైనా / ఏమైపోతాం అనుకున్నామా.. జత పరుగుల్లో ఏం జరిగినా / శ్రుతిమించే సరాగం ఏమన్నదీ.. మనమిక మొహమాటపడకూడదంటున్నదీ / చలిగాలి చూద్దూ.. తెగ తుంటరీ.. గిలిగింత పెడుతున్నదీ / పొగమంచు చూద్దూ.. మహ మంచిది.. తెరచాటు కడుతున్నదీ కలతే అయినా కిలకిలమనదా.. మన నవ్వులలో తానూ చేరి / నడిరేయయినా విలవిలమనదా.. నిలువున నిమిరి ఈ దావిరి / మతిపోయేంత మైకం ఏమన్నదీ.. మనమిక మొహమాటపడకూడదంటున్నదీ / పొగమంచు చూద్దూ.. మహ మంచిది.. తెరచాటు కడుతున్నదీ / చలిగాలి చూద్దూ.. తెగ తుంటరీ.. గిలిగింత పెడుతున్నదీ.. యూ ఆర్ మై ఎమ్మెల్యే ఓ యే.. ఓసినీ ఓరచూపు గుచ్చినావే.. పోరగాని జిందగీని మార్చినావే / బోరబండ బోరులోకి తోసినావే / ఓయే.. ఓయే.. గండి మైసమ్మలాగ దొరికినావే / గండిపేట చెరువులోన ముంచినావే / సంపేత్తె సంపెయ్యె.. కుమ్మేత్తే కుమ్మెయ్యే.. అయినా నను లవ్ సెయ్యే ఓ ఎమ్మెల్యే.. నా ఎమ్మెల్యే (2) / ఏసేత్తే ఏసెయ్యే.. కోసేత్తే కోసెయ్యే.. పర్లేదే ఇటు రాయే ఓ ఎమ్మెల్యే.. నా ఎమ్మెల్యే / ఎమ్మెల్యే అంటే నువు అనుకున్నది ఏం కాదే / ఎమ్మెల్యే అంటే అరె ఇంకో మీనింగ్ ఉందే / ఎమ్ అంటే మై మై మై.. ఎల్ అంటే లవ్లీ లవ్లీ లవ్లీ.. ఏ అంటే ఏంజల్ ఏంజల్ ఏంజల్.. యూ ఆర్ మై ఎమ్మెల్యే (3) / మై లవ్లీ ఏంజల్ / మై లక్కీ యాపిల్ / ఓ యే.. ఓసినీ ఓరచూపు గుచ్చినావే.... చిత్రం : సరైనోడు సంగీతం : థమన్.ఎస్. గానం : ధనుంజయ్ సాహిత్యం : అనంత శ్రీరామ్ ఏం సక్కగుందే షేపు.. ఏం సక్కగుందె సూపు.. ఏం సక్కగుందె ఊపు.. నచ్చినాదే నాకు నీ వాపు/ జనంలో నువ్వు టాపు / నీ కంటే నేను తోపు / తగ్గించమాకే హైపు / తగ్గితే వెయ్యలేనె ట్రాపు / ఏ.. టెక్కు నీకు ఉంటే.. ట్రిక్కు నాకు ఉందే.. తిక్క తీర్సుకుందామే / బెట్టు నీకు ఉంటే.. పట్టు నాకు ఉందే.. తెలుసుకోవే ఎమ్మెల్యే../ ఎమ్ అంటే మై మై మై.. ఎల్ అంటే లవ్లీ లవ్లీ లవ్లీ.. ఏ అంటే ఏంజల్ ఏంజల్ ఏంజల్.. యూ ఆర్ మై ఎమ్మెల్యే (3) / మై లవ్లీ ఏంజల్ / మై లక్కీ యాపిల్ / ఒక లైఫ్... చిత్రం : ఊపిరి సంగీతం : గోపీ సుందర్ గానం : కార్తీక్ సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక లైఫ్.. ఒకటంటే ఒకటే లైఫ్ (2) / ఇది కాదే అనుకుంటూ వదిలేస్తే వేరే అవకాశం రాదే / ఇది ఇంతే అనుకుంటే వందేళ్లు నేడే జీవించే వీలుందే / ఒక లైఫ్.. ఒకటంటే ఒకటే లైఫ్ (2) / ఏ ఏం లేదని.. మనం చూడాలిగానీ.. ఊపిరి లేదా.. ఊహల్లేవా.. నీకోసం.. నువ్వే లేవా / చీకటికి రంగులువేసే కలలెన్నో నీ తోడై వస్తుండగా.. ఒంటరిగ లైఫ్ ఉంది.. ఆశకు కూడా ఆశని కలిగించాయి / ఆయువు అనేది ఉండేవరకూ.. ఇంకేదో లేదని అనకు / ఒక్కో క్షణమూ ఈ బ్రతుకూ.. కొత్తదే నీకు / ఒక లైఫ్.. ఒకటంటే ఒకటే లైఫ్ (2) / ఇది కాదే అనుకుంటూ వదిలేస్తే వేరే అవకాశం రాదే / ఇది ఇంతే అనుకుంటే వందేళ్లు నేడే జీవించే వీలుందే / నువ్వంటే నా నవ్వు.. నువ్వంటే నా నవ్వు.. నేనంటేనే నువ్వు.. నువ్వంటు.. నేనంటు లేమని / అవునంటూ మాటివ్వు నిజమంటూనే నువ్వు.. నే రాని దూరాలు నువు పోనని.. / ఎటు ఉన్నా నీ నడక.. వస్తాగా నీ వెనక.. దగ్గరగా రానీను దూరమే / నే వేసే ప్రతి అడుగు.. ఎక్కడికో నువ్వడుగు.. నిలిచున్న నీ వైపే చేరేనులే / నీ అడుగేమో పడి నేల గుడి అయినదే.. నీ చూపేమో సడిలేని ఉరుమయినదే / నువ్వు ఆకాశం.. నేను నీకోసం / తడిసిపోదామ ఈ వానలో..ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే.. సూర్యుడితో జతకట్టి ఒకటవుతాయే.. నీడల్లో నలుపల్లే.. మల్లెల్లో తెలుపల్లే.. ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ / (2) నే ఇటు వస్తాననుకోలేదా.. తలుపస్సలు తియ్యవు తడితే / పో పసివాడని జాలే పడితే.. బుగ్గన ముద్దిచ్చి చంపేశావే / నువ్వు నేనంటూ పలికే పదముల్లో.. అధరాలు తగిలేనా కలిసే ఉన్నా / మనమంటూ పాడు.. పెదవుల్లో చూడు.. క్షణమైన విడిపోవులే / ఇది ఓ వేదం.. పద ఋజువవుదాం.. అంతులేని ప్రేమకే మనం / నివురు తొలిగేలా.. నిజము గెలిచేలా.. మౌనమే మాట మార్చేసెనా.. నువ్ నవ్వేటి కోపానివే.. మనసతికిన ఓ రాయివే / నువ్ కలిసొచ్చే శాపానివే.. నీరల్లే మారేటి రూపానివే / నచ్చే దారుల్లో.. నడిచే నదులైనా.. కాదన్నా కలవాలి సంద్రంలోన / విడివిడిగా ఉన్నా.. విడిపోలేకున్నా.. ప్రవహించే ప్రణయం ఇదే / వద్దన్నా తిరిగేటి భువిమీదొట్టు.. నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ / నాలోనే నువ్వుంటూ.. నీతోనే నేనంటూ.. ఈ భువిలో విహరించే వెలుగే మన ప్రేమ / క్రేజీ క్రేజీ ఫీలింగ్.. చిత్రం : నేను శైలజ సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ గానం : పృథ్వీ చంద్ర సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి కాంపౌండ్ వాలెక్కి ఫోను మాట్లాడుతుంటే.. చైనా వాలెక్కి మూను తాకినట్టుందే / మార్నింగ్ లేవగానే నీ మెసేజి చూస్తుంటే.. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుందే / ఇట్స్ ఎ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్.. (4) రోడ్ సైడ్ నీతోటి పానీపూరీ తింటుంటే.. ప్లేటుకి కోటైనా చీప్ అనిపిస్తోందే / నీ షర్ట్ బాగుందని ఓ మాటే నువ్వంటే.. కుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తోందే / ఇట్స్ ఎ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్.. (4) నిన్న మొన్న దాకా సూపరున్న ఫిగరే.. నిన్ను చూసినాక సోసోగుందే / రోజు నన్ను మోసే.. నా బ్యాచిలర్ బైకే.. నువ్వు ఎక్కినాక ఐ యామ్ హ్యాపీ అందే / రాంగు రూటు అంటూ కేసు రాసే ఎస్సై.. పేరు చెప్పమంటే గంటట్టిందే / నిన్ను నాతో చూసి బాయ్స్లోన జెలసీ పెరుగుతుంటే ఆస్కార్ విన్నయినట్టుందే / సారీ హరి నో అన్న అమ్మాయిలందర్నీ.. వీకెండ్ పార్టీకి పిలవాలని ఉందే / ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మన ఇద్దరి ఫ్యూచర్‌ని ఐమాక్స్‌లో వాళ్లకు షో వెయ్యాలని ఉందే / క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్.. బేబీ నీకు నాకు మధ్య లవ్వు డీలింగ్ (2) లవ్ చెయ్యాలా వద్దా... చిత్రం : కుమారి 21 ఎఫ్ సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ గానం : నరేంద్ర సాహిత్యం : రామాంజనేయులు హే.. బారుకెళ్తుంది.. బీరు కొడ్తుంది.. పబ్బుకెళ్తుంది.. డ్యాన్సు చేస్తుంది / లవ్ చెయ్యాలా వద్దా (3) / షార్టులేస్తుంది.. హాటుగుంటుంది.. దమ్ము కొడ్తుంది.. చూయింగమ్ము వేస్తుంది / లవ్ చెయ్యాలా వద్దా (4) / హే వాట్సాప్‌లో ఎయిట్ ఓ క్లాక్‌కి గుడ్ నైట్ అంది.. కానీ లాస్ట్ సీను టుడే ట్వెల్వ్ థర్టీ ఉంది / సాటర్డే నైటు పార్టీకి రమ్మంది.. ప్రతి ఒక్కడికీ హాయ్ చెప్పి హగ్ ఇస్తుంది / లవ్ చెయ్యాలా వద్దా (4) / యో బాయ్ టెల్ మీ.. లవ్ చెయ్యాలా వద్దా / ఎవ్రీ బడీ సే నవ్.. లవ్ చెయ్యాలా వద్దా / కమాన్ కమాన్ కమాన్ పుట్ యువర్ హ్యాండ్స్ అప్.. లవ్ చెయ్యాలా వద్దా / షేక్ ఇట్ షేక్ ఇట్ షేక్ నవ్.. లవ్ చెయ్యాలా వద్దా / హే.. లాంగ్ డ్రైవ్ అంటే లైక్ అంటుంది.. ఎవడి బైకైనా మగాడిలా కూర్చుంటుంది / లవ్ చెయ్యాలా వద్దా (4) / మిడ్‌నైటు దాటాక ఇంటికొస్తుంది.. డ్రాప్ చేసిందెవడంటే ఫ్రెండంటుంది లవ్ చెయ్యాలా వద్దా (4) / ఫేస్బుక్లో ఫ్రెండ్స్లిస్ట్ ఫైవ్ కే ఉంది.. ఆ లిస్టులోన ఒక్కతైన అమ్మాయి లేకుంది / గంటకొక్క సెల్ఫీ అప్లోడు చేస్తుంది / కామెంటు పెట్టిన ప్రతోడికీ స్మైలే ఇస్తుంది / లవ్ చెయ్యాలా వద్దా (4) / ఫ్రీడమ్ అంటుంది.. ఫ్రీగా ఉంటుంది / ఫోనేమో ఆల్వేస్ బిజీగా ఉంటుంది / లవ్ చెయ్యాలా వద్దా (4) / గుండెల్లో నేనే ఉన్నానంటుంది.. కానీ ఎఫ్బీలో ప్రొఫైల్ పిక్కు బన్నీదుంటుంది / లవ్ చెయ్యాలా వద్దా (4) / ఇటు ఇటు ఇటు అని... చిత్రం : కంచె సంగీతం : చిరంతన్ భట్ గానం : అభయ్ జోద్పూర్కర్, శ్రేయా ఘోషల్ సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటు ఇటు ఇటు అని చిటికెలుఎవ్వరివో.. ఏమో / అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.. ఏమో / సడే లేని అలజడి ఏదో.. ఎలా మదికి వినిపించిందో / స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో / ఇలాంటివేం తెలియకముందే.. మనం అనే కథానిక మొదలైందో.. మనం అనే కథానిక మొదలైందో / ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో......ఒక్కొక్క రోజును ఒక్కొక్క ఘడియగ కుదించ వీలవక / చిరాకు పడి ఎటు పరారైందో సమయం కనబడక / ప్రపంచమంతా పరాభవంతో తలొంచి వెళ్లిపోదా / తనోటి ఉందని మనం ఎలాగు గమనించం గనక / కలగంటున్నా మెలకువలో ఉన్నాం కదా / మన దరికెవరు వస్తారు కదిలించగ / ఉషస్సు ఎలా ఉదయిస్తుందో.. నిశీధి ఎలా ఎటు పోతుందో / నిదుర ఎపుడు నిదురవుతుందో / మొదలు ఎపుడు మొదలవుతుందో / ఇలాంటివేం తెలియకముందే.. మనం అనే కథానిక మొదలైందో / ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో......పెదాల మీదుగా అదేమి గల గల పదాల మాదిరిగ.. సుధల్ని చిలికిన సుమాల చినుకులా అనేంత మాధురిగ / ఇలాంటి వేళకి ఇలాంటి ఊసులె ప్రపంచ భాష కదా.. ఫలానా అర్థం అనేది తెలిపే నిఘంటువు ఉండదుగా / కాబోతున్న కళ్యాణ మంత్రాలుగ / వినబోతున్న సన్నాయి మేళాలుగ / సడే లేని అలజడి ఏదో.. ఎలా మదికి వినిపించిందో / స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో / ఇలాంటివేం తెలియకముందే.. మనం అనే కథానిక మొదలైందో.. మనం అనే కథానిక మొదలైందో / ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో...... పచ్చ బొట్టేసిన.. చిత్రం : బాహుబలి సంగీతం : ఎమ్.ఎమ్. కీరవాణి గానం : కార్తీక్, దామిని సాహిత్యం : అనంత శ్రీరామ్ పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో.. పచ్చి ప్రాయాలనే పంచుకుంటాను రా / జంట కట్టేసిన తుంటరోడా నీతో.. కొంటె తంటాలనే తెచ్చుకుంటాను రా / వెయ్యి జన్మాల ఆరాటమై.. వేచి ఉన్నానే నీ ముందర / చెయ్యి నీ చేతిలో చేరగా / రెక్క విప్పిందే నా తొందర / పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో.......మాయగా నీ సోయగాలాలు వేసి.. నన్నిలా లాగింది నువ్వే అలా / కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేల.. హత్తుకుపో నను ఊపిరి ఆగేలా / బాహు బంధాల పొత్తిళ్లలో.. విచ్చుకున్నావే ఓ మల్లిక / కోడె కౌగిళ్ల పొత్తిళ్లలో.. పురివిప్పింది నా కోరిక / పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో....... పూలనే కునుకెయ్యమంటా.. చిత్రం : ఐ సంగీతం : ఎ.ఆర్. రెహమాన్ గానం : హరిచరణ్, శ్రేయాఘోషల్ సాహిత్యం : అనంత శ్రీరామ్ పూలనే కునుకెయ్యమంటా.. తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా (2) / హేయ్.. ఐ అంటే మరి నేనను అర్థము తెలుసోయ్ నిన్నా మొన్న / అరె ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా / అయ్యో నాకెదురై ఐరావతమే నేలకు పంపిన తెలికలువై తనువిచ్చెనంటా.. తను వచ్చెనంటా / పూలనే కునుకెయ్యమంటా.. తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా / అసలిపుడు నీకన్నా ఘనుడు లోకాన కనబడునా మనిషై / అది జరగదని ఇలా అడుగు వేసినా నిను వలచిన మనసై / ప్రతిక్షణము క్షణము నీ అణువు అణువులను కలగన్నది నా ఐ / ఇన్ని కలల ఫలితమున కలిసినావు నువు తీయటి ఈ నిజమై / నా చేతిని వీడని గీత నువై / నా గొంతుని వేరని పేరు నువై / తడి పెదవుల తలుకవనా.. నవ్వునవ్వనా.. ఎంత మధురం/ పూలనే కునుకెయ్యమంటా........ నీరల్లె జారేవాడే నాకోసం ఒక ఓడయ్యాడా / నీడంటు చూడని వాడే నన్నే దాచిన మేడయ్యాడా / నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా / నా రాతి గుండెను తాకుతు శిల్పం లాగా మార్చేసిందా / యుగములకైనా మగనిగ వీణ్నే పొగడాలి అంటూ ఉంది నాలో మనసివ్వాలే / ప్రతి ఉదయాన తన వదనాన్నే నయనము చూసేలాగా వరమేదైనా కావాలె / పూలనే కునుకెయ్యమంటా........ శ్రీమంతుడా... చిత్రం: శ్రీమంతుడు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గానం: యంఎల్ఆర్ కార్తికేయన్ సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి ఓ నిండు భూమి నిను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా / పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పద పదరా / గుండె దాటుకొని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా / రుణం తీర్చే తరుణమిదిరా కిరణమై పదపదరాఓ ఏమి వదిలి ఎటు కదులుతోంది మది మాటకైన మరి తలచినదా / మనిషితనమే నిజముతనమై పరులకై పద పదరా / మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వే నీకు తొలి గెలుపు కదా / మనసు వెతికే మార్గమిదిరా మంచికై పద పదరాలోకం చీకట్లు చీల్చే ధ్వేయం నీ ఇంధనం / ప్రేమై వర్షించని నీ ప్రాణం / సాయం సమాజమే నీ ధ్వేయం నిరంతం / కోరే ప్రపంచ సౌఖ్యం నీకు గాక ఎవరికి సాధ్యం / విశ్వమంతటికి పేరు పేరునా ప్రేమ పంచగల పసితనమా / ఎదురు చూసే ఎదను మీటే పవనమై పద పదరాలేనిదేదో పనిలేనిదేదో విడమరిచి చూడగల రుషిగుణమా / చిగురు మొలిసే చినుకు తడిగ పయనమై పద పదరా / పోరా శ్రీమంతుడా పో పోరా శ్రీమంతుడా / నీలో లక్ష్యానికి జై హో / పోరా శ్రీమంతుడా పో పోరా శ్రీమంతుడా / నీలో స్వప్నాలు అన్నీ సాకరమవ్వగా జై హో / గోపికమ్మా చాలునులేమ్మా... చిత్రం: ముకుందా సంగీతం: మిక్కీ జే మేయర్ గానం: చిత్ర సాహిత్యం: సిరివెన్నెల గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదరా / గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెరా / విరిసిన పూమాలగా.. వెన్నుని ఎదవాలగా.. తలపుని లేపాలిగా బాలా / పరదాలే తీయకా.. పరుపే దిగనీయకా.. పవళింపా ఇంతగా మేలా / కడవల్లో కవ్వాలు.. సడి చేస్తున్నా వినకా / గడపల్లో కిరణాలు లేలెమ్మన్నా కదలకా / కలికి ఈ కునుకేలా తెల్లవారవచ్చేనమ్మా...నీ కలలన్నీ కల్లలై రాతిరిలో కరగవనీ / నువు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి / నీ కోసమని గగనమే భువి పైకి దిగివచ్చేనని / ఆ రూపాన్ని చూపుతూ అల్లుకుపో సౌదామిని / జంకేలా జాగేలా సంకోచాలా జవ్వని / బింకాలు బిడియాలు ఆ నల్లనయ్య చేతచిక్కి పిల్లనగ్రోవై ప్రియమాల నవరాగాలే పాడనీ అంటూ.. / ఈ చిరుగాలి నిను మేలుకొలుపు సంబరానఏడే అల్లరి వనమాలి నను వీడే మనసును దయమాలీ / నందకుమారుడు మురళీలోలుడు నా గోపాలుడు ఏడే...ఏడే.. / లీలా కృష్ణ కొలమిలో కమలములా కన్నెమది / తనలో తృష్ణ తేనేలా విందిస్తానంటున్నదీ / అల్లరి కన్న దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది / అందరికన్నా ముందుగా తనవైపే రమ్మనదీ / విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపికా / చూస్తూనే చేజారీ ఈ మంచివేళ మించనీక / త్వరపడవమ్మా సుకుమారి ఏ మాత్రం ఏమారకా / వదిలావో వయ్యారీ బృందవిహారి దొరకడమ్మా.... రాకాసి రాకాసి... చిత్రం: రభస సంగీతం: థమన్ గానం: జూ.ఎన్టీఆర్ సాహిత్యం: శ్రీమణి రాకాసి రాకాసి.. నను రబ్బరు బంతిల ఎగరేసి.. పారేసి పారేసి.. నువు వెళ్లకే నవ్వులు విసిరేసి / రాకాసి రాకాసి నను రబ్బరు బంతిల ఎగరేసి../అచ్చ తెలుగు ఆడపిల్లలా.. కొత్తకొత్త ఆవకాయలా.. /జున్ను ముక్క మాటతోటి ఉక్కులాంటి పిల్లగాడిని తిప్పమాకు కుక్కపిల్లలా... అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్తకొత్త ఆవకాయలా../నువ్వులేని జీవితం రంగులేని నాటకం సప్పగున్న ఉప్పులేని చాపకూర వంటకం.../నువ్వులేని జీవితం బైకులేని యెవ్వనం..గర్ల్స్లేని పబ్బులోన క్లబ్ డ్యాన్స్ చేయడం../ గుండె బద్ధలవ్వడం అప్పడం విరిగడంలా.../రాకాసి రాకాసి నను రబ్బరు బంతిలా ఎగరేసి...పారేసి పారేసి నువు వెళ్లకే నవ్వులు విసిరేసి../హే ప్రేమలేఖ రాసుకున్న ఈ గాలిలోన నీరులోన నువ్వు వెళ్లు దారిలోన వాలుపోస్టరేసుకున్నా.../ సూసైడ్ లేఖ రాసి ఇవ్వనా నా సంబరాన్ని చూడలేక సైనేడే తాగి నీ అవసరాన్ని తెలుసుకున్న../మిలమిల నీకై ఇలా ఎంతెంత వేచినానే వేయి కనుల ఇలా ఇలా ఎన్నాళ్లైనా..ప్రేమ గుండె చప్పుడాగిపోయేలా../ నువ్వులేని జీవితం..క్లీనుబౌల్డ్ కావడం..సెంచరీకి ఒక్క రన్ ముందు ఔటు అవ్వడం.../నువ్వులేని జీవితం..డస్ట్‌బిన్ వాలకం..టేస్టుగున్న కోక్టిన్ కాలులేపి తన్నడం ఫూట్‌బాల్ తన్నడం గట్టిగా తుమ్మడంలా.../రాకాసి రాకాసి నను రబ్బరు బంతిల ఎగరేసి.. పారేసి పారేసి నువు వెళ్లకే నవ్వులు విసిరేసి../రాకాసి రాకాసి నను రబ్బరు బంతిలా.../హే గోల్డు నెవ్వడు చేయలేడే ఏ బ్రహ్మదేవుడైనా గాని నిన్ను మించి అందెగత్తెనెప్పుడైనా చెక్కలేదే.../రోల్డ్‌గోల్డ్ నేపేరే ఫైవ్ ఫీట్ తెల్లకాకి ప్యాంటు షర్టు వేసుకొచ్చి తిరుగుతుంటె ఎవడడగడే../మిలమిల నీతో ఇలా జన్మంతా ఉండిపోనీ నీకు జంటలా..నా కలే నిజం అయ్యేంతలా ఉన్నా చోట కాలమాగిపోనీ ఇలా.../నువ్వులేని జీవితం రాశిలేని జీవితం పేలబోయే మందుగుండు మీద కాలు పెట్టడం../ నువ్వులేని జీవితం ఒళ్లు మండిపోవడం... ఎండమావి బావిలోన నీళ్లు తోడుకోవడం../ఎండదెబ్బ తగలడం కాకిలా రాలడంలా../రాకాసి రాకాసి నను రబ్బరు బంతిల ఎగరేసి..పారేసి పారేసి నువ్వు వెళ్లకే నవ్వులు విసిరేసి../రాకాసి రాకాసి నను రబ్బరు బంతిలా... ఏం సందేహం లేదు... చిత్రం: ఊహలు గుసగుసలాడే సంగీతం: కళ్యాణ్ కోడూరి గానం: కళ్యాణ్ కోడూరి, సునీత సాహిత్యం: అనంత శ్రీరామ్ ఏం సందేహం లేదు / ఆ అందాల నవ్వే ఈ సందళ్లు తెచ్చింది / ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది / ఏం సందేహాం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది / నిమిషము నేల మీద నిలపని కాలిలాగ / మది నిను చేరుతోందో చిలకా / తనకొక తోడులాగ వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖా /వెన్నెల్లో ఉన్నా.. వెచ్చంగా ఉంది.. నిన్నే ఊహిస్తుంటే / ఎందర్లో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే / నా కళ్లల్లోకొచ్చి నీ కళ్ళాపి చల్లి ఓ ముగ్గేసి వెళ్లావే / నిదురిక రాదు అన్న నిజమును మోసుకుంటు మది నిను చేరుతోంది చిలకా / తనకొక తోడులాగ వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖా...నీ కొమ్మల్లో గువ్వ / ఆ గుమ్మంలోకెళ్లి కూ అంటుంది విన్నావా / నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా / ఏమౌతున్నాగాని ఏమైనా అయిపోనీ ఏం ఫరలేదన్నావా అడుగులు వేయలేక అటు ఇటు తేల్చుకోక సతమతమైన గుండె గనకా / అడిగిన దానికింక బదులిక పంపుతోంది / పదములు లేని మౌన లేఖా... టాపు లేచిపోద్ది చిత్రం : ఇద్దరమ్మాయిలతో సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ గానం : సాగర్, గీతా మాధురి సాహిత్యం : భాస్కరభట్ల అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలే పెట్టేస్తే ఏమైతదీ? మంచి బీటొస్తది.. పిచ్చ పాటొస్తది.. హొయ్ / అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతదీ? మస్త్ మాసొస్తది.. బెస్టు ఊపొస్తది.. హోయ్ / రాయే రాయే నా రాకాసి నువ్వే పైటేసి అట్టా దోపేస్తే / టాపు లేచిపోద్దె పో పో (2) / రారో రారో నా శివకాశి.. అగ్గి రాజేసి సిగ్గు పేల్చేస్తే / టాపు లేచిపోద్దె పో పో (2) / చెట్టుమీద మ్యాంగోలా.. నువ్వెంత సక్కగున్నావే.. హే చాకు లాంటి పిల్లాడే.. ఎంత షార్పుగున్నాడే / చాకొచ్చి మ్యాంగో కోస్తే / టాపు లేచిపోద్ది కన్నే కొట్టావంటే.. టాపు లేచిపోద్ది ముద్దే పెట్టావంటే.. టాపు లేచిపోద్ది చెయ్యే పట్టావంటే / టాపు టాపు టాపు లేచిపోద్దిరో / అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలే పెట్టేస్తే ఏమైతదీ? మంచి బీటొస్తది.. పిచ్చ పాటొస్తది..సమ్మర్లోన లస్సీలా.. వింటర్లోన కాఫీలా / ఊరిస్తున్నావే.. పట్టీ లాగేస్తున్నావే.. పిల్లా పొంగే పూరీలా / రాము భీము తమ్ముడిలా.. జాకీచాను అల్లుడిలా / ముద్దొస్తున్నావే.. వచ్చి గుద్దేస్తున్నావే / అమ్మో బ్రేకుల్లేని లారీలా / రాయే రాయే నా రాకాసి నువ్వే పైటేసి.....కో కో కోతికేమో కొబ్బరిలా.. పిల్లాడికి బర్గర్లా నచ్చేస్తున్నావే కల్లోకొచ్చేస్తున్నావే.. అరే కొత్త ఫిల్మ్ ట్రైలర్‌లా / పోలీసుకి రౌడీలా.. ఆడోళ్లకి కేడీలా / బుక్కైపోయావే నాకు సెట్టయిపోయావే సోడాబుడ్డిలోని గోళీలా / రాయే రాయే నా రాకాసి..... కనిపెంచిన మా అమ్మకే.. చిత్రం: మనం సంగీతం: అనూప్ రూబెన్స్ గానం: భరత్ సాహిత్యం: చంద్రబోస్ కనిపెంచిన మా అమ్మకే, అమ్మయ్యానుగా/ నడిపించినా మా నాన్నకే, నాన్నయ్యానుగాఒకరిది కన్ను, ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు/ ఒకరిది మాటా, ఒకరిది భావం, ఇరువురి కలయిక కదిపిన కథ ఇది ప్రేమా ప్రేమా.. తిరిగొచ్చె తీయగా.../ఇది ప్రేమా ప్రేమా.. ఎదురొచ్చె హాయిగా.../ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా ఆఆఆ...హా.. అ../ అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా / అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా / కన్నోళ్లతో నేను చిన్నోడిలా, కలగలిసిన ఎగసిన బిగిసిన కథఇది ప్రేమా ప్రేమా.. తిరిగొచ్చె తీయగా.../ఇది ప్రేమా ప్రేమా.. ఎదురొచ్చె హాయిగా.../ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా ఆఆఆ... కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా / కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా.. /జోలలు నాకే పాడారుగ, ఆ జాలిని మరచి పోలేనుగ / మీరూపిన ఆ ఊయల నా హృదయపు లయలలో పదిలము కద ఇది ప్రేమా ప్రేమా.. తిరిగొచ్చె తీయగా... / ఇది ప్రేమా ప్రేమా.. / ఎదురొచ్చె హాయిగా... / ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా ఆఆఆ.. కళ్లు కళ్లు ప్లస్సు.. చిత్రం: 100% లవ్ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గానం: అద్నాన్ సమీ సాహిత్యం: చంద్రబోస్ కళ్లు కళ్లు ప్లస్సు వాళ్లు వీళ్లు మైనస్...ఒళ్లు ఒళ్లు ఇంటు చేసేటి ఈక్వేషన్/ఇలా ఇలా ఉంటే ఈక్వల్టు ఇన్‌ఫ్యాచ్యుయేషన్../ఎడమ భుజము కుడి భుజము కలిసి..ఇక కుదిరే కొత్త త్రిభుజం/పడుచుచదువులకు గణిత సూత్రమిది ఎంతో సహజం../సరళ రేఖలిక మెలిక తిరిగి.... పెనవేసుకున్న చిత్రం/చర్య జరిగి ప్రతిచర్య పెరిగి పుడుతుందో ఉష్ణం.../కళ్లు కళ్లు ప్లస్సు.. వాళ్లు వీళ్లు మైనస్.. ఒళ్లు ఒళ్లు ఇంటు చేసేటి ఈక్వేషన్/ ఇలా ఇలా ఉంటే ఈక్వల్టు... ఇన్‌ఫ్యాచ్యుయేషన్... ఇన్‌ఫ్యాచ్యుయేషన్... ఇన్‌ఫ్యాచ్యుయేషన్/దూరాలకి మీటర్లంట భారాలకి కేజీలంట.. కోరికలకు కొలమానం ఈ...జంట.../ సెంటిగ్రేడు సరిపోదంట.. ఫారిన్ హీట్ పని చెయదంట..వయసు వేడి కొలవాలంటే తంట.../లేతలేత ప్రాయాలలోన అంతేలేని ఆకర్షణా... అర్థం కాదు ఏ సైన్స్‌కైనా.../పైకి విసిరినది కింద పడును అని... తెలిపె గ్రావిటేషన్... పైన కింద తలకిందులవుతది ఇన్‌ఫ్యాచ్యుయేషన్.../ సౌత్ పోల్ అబ్బాయంట..నార్త్ పోల్ అమ్మాయంట.. రెండు జంట కట్టే తీరాలంట../ధనావేశం అబ్బాయంట.. రుణావేశం అమ్మాయంట..కలిస్తే కరెంటే పుట్టేనంట../ ప్రతీ స్పర్శ ప్రశ్నేనంటా.. మరో స్పర్శ జవాబంట.. ప్రాయానికే పరీక్షలంట../పుస్తకాల పురుగులు రెండంట..ఈడు కొచ్చెనంట.. అవి అక్షరాల చక్కెర తింటూ మైమరచేనంట../కళ్లు కళ్లు ప్లస్సు.. వాళ్లు వీళ్లు మైనస్.. ఒళ్లు ఒళ్లు ఇంటు చేసేటి ఈక్వేషన్../ ఇలా ఇలా ఉంటే ఈక్వల్టు ఇన్‌ఫ్యాచ్యుయేషన్.. సినిమా చూపిస్త మావా.. చిత్రం: రేసుగుర్రం సంగీతం: థమన్ సాహిత్యం: సింహ, దివ్య, గంగ రచన: వరికుప్పల యాదగిరి మామా నువ్వు గిట్ల గాబరా గీబరా... తత్తర.. దిత్తరా.. షక్కరా..గిక్కరా..వచ్చి పడిపోతే..నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగినా యాడ దొరకడే../సినిమా చూపిస్త మావా..నీకు సినిమా చూపిస్త మావా/ సీను సీనుకీ నీతో సీటీ కొట్టిస్త మామా../ గల్లవట్టి గుంజుతాంది దీని సూపే...లొల్లివెట్టి సంపుతాంది దీని నవ్వే..కత్తిలెక్క గుచ్చుతాంది దీని సోకే..డప్పుకొట్టి పిలవవట్టే ఈని తీరే..నిప్పులెక్క కాల్చవట్టే ఈని పోరే.. కొప్పు గూడా గొట్టవట్టే ఈని జోరే.../మామా దీని సూడకుంటే..మన్నుదిన్న పాములెక్క..మనసు పండవట్టే.../అయ్యయ్యయో సూడగానే పొయ్యి మీద పాలలెక్క వీని మనసు పొంగవట్టే.../దీని బుంగమూతి సూత్తే నాకు బొంగుతిన్న కోతిలెక్క సిందులేయ బుద్ధివుట్టే.../సినిమా చూపిస్త మావా..నీకు సినిమా చూపిస్త మావా.. సీను సీనుకీ నీతో సీటీ కొట్టిస్త మామా../గల్లవట్టి గుంజుతాంది దీని సూపే...లొల్లివెట్టి సంపుతాంది దీని నవ్వే..కత్తిలెక్క గుచ్చుతాంది దీని సోకే../మామా నీ బిడ్డ వచ్చి తగిలినక్కనే లవ్వు దర్వాజా నాకు తెర్సుకున్నదే../ఓ రయ్యా ఈ పోరగాడు నచ్చినంకనే నన్నీ బద్మాష్ బుద్ధి సుట్టుకున్నదే../ పట్టు వట్టేసెనే కుట్టేసెనే..సుత్తూత బొంగరాల్లా తిరగవట్టెనే.../సిటారు కొమ్మ మీద కూకవెట్టెనే..మిఠాయి తిన్నంత తీపి ఉట్టెనే.. సందులెల్ల దొంగలెక్క తిప్పవట్టెనే...దీని బుంగమూతి సూత్తే నాకు బొంగు తిన్న కోతిలెక్క సిందులేయ బుద్ధివుట్టే.../సినిమా చూపిస్త మావా..నీకు సినిమా చూపిస్త మావా సీను సీనుకీ నీతో సీటీ కొట్టిస్త మామా../ ఏక్ దో తీన్ చార్ పాంచ్ పటానా..మామా నీకు ముందు ఉందే పుంగి భజానా.. నువ్వంటే నాకు... చిత్రం : హార్ట్ ఎటాక్ గానం : జెస్సీ గిఫ్ట్ సంగీతం : అనూప్ రూబెన్స్ సాహిత్యం : భాస్కరభట్ల నువ్వంటే నాకు చాలా చాలా చాలా ఇష్టమే... అది మాటల్లోన చెప్పలేక ముద్దే అడిగానే / నే నచ్చితే ఇవ్వొచ్చుగా.. లేదంటే మానొచ్చుగా.. అంతేగానీ అందర్లోనూ చెంపమీద లాగి కొడతావా.../నువ్వంటే నాకు చాలా చాలా చాలా ఇష్టమే... అది మాటల్లోన చెప్పలేక, ముద్దడిగానే.. ముద్దడిగానే.../హెయ్.. చిరాగ్గా ఉంటున్నాదంటే.. పరాగ్గా అనిపిస్తూందంటే... సరిగ్గా తగలాల్సింది లిప్ టు లిప్ కిస్సే.../మనస్సే తడబడిపోతుంటే.. వయస్సే వెలవెలబోతుంటే.. తెలుస్సా కావలసింది మసాలా కిస్సే.../సింగిల్ గుంటే ఎట్టుంటాదే.. ఎంగిల్ పడితే బాగుంటాదే.. అర్థం అయినా కానట్టుగా ఎల్. కె. జి. ఫేస్ పెడతావా../నువ్వంటే.../ఓ.. పెదాల్లో యంత్రం ఉంటాదే.. అదేదో ఆత్రం ఉంటాదే... ఎన్నెన్నో ముద్దులనైనా అచ్చే వేస్తాదే... ఇదేదో బానే ఉందంటూ.. ఆమాంతం నీకు అనిపిస్తే... ఓసారి ప్రాక్టీస్ చెసెయ్ అలవాటయిపోద్దే../సిమ్మేలేని సెల్లెందుకే... చుమ్మాలేని జన్మెందుకే... నీ మంచికే చెబుతున్నానే.. జస్ట్ ఫర్ టేస్ట్మీ టేస్ట్మీ తొందరగా../నువ్వంటే... ఆరడుగుల బుల్లెట్టు... చిత్రం: అత్తారింటికి దారేది సంగీతం: దేవిశ్రీప్రసాద్ గానం: యం.ఎల్.ఆర్ కార్తికేయన్, విజయ్‌ప్రకాష్ సాహిత్యం: శ్రీమణి గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం.. తరలింది తనకు తానే ఆకాశం... పరదేశం / శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం.. విడిచింది చూడు నగమే.. తన వాసం.. వనవాసం....భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో / ఉక్కుతీగ లాంటి ఒంటి నైజం / వీడు మెరుపులన్ని ఒక్కటైన తేజం / రక్షకుడో దక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో / శత్రువంటి లేని వింత యుద్ధం... ఎన్ని గుండెల్లోతు గాయమయిన సిద్ధం / నడిచొచ్చే నర్తనశౌరీ / పరుగెత్తే పరాక్రమ శైలి / హలాహలం ధరించిన దత్తహృదయుడో / వీడు ఆరడుగుల బుల్లెట్టు... వీడు ధైర్యం విసిరిన రాకెట్టు.. దివి నుంచి భువిపైకి.. భగభగమని కురిసేటి / వినిపించని కిరణం చప్పుడు వీడు / వడి వడిగా వడగళ్లై.. దడదడమని జారేటి.. కనిపించని జడివానేగా వీడు / శంఖంలో తాగేటి, పోటెత్తిన సంద్రం హోరితడు / శోకాన్నే తాగేసే అశోకుడు వీడురో....తన మొదలే వదులుకొని.. పైకెదిగిన కొమ్మలకి.. చిగురించిన చోటుని చూపిస్తాడు / తన దిశనే మార్చుకొని ప్రభవించే సూర్యుడికి.. తన తూరుపు పరిచయమే చేస్తాడు / రావణుడో రాఘవుడో మనసుని దోచే మానవుడో / సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో.... పండగలా దిగివచ్చావు చిత్రం: మిర్చి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గానం: కైలాష్ ఖేర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి పండగలా దిగివచ్చావు.. ప్రాణాలకు వెలుగిచ్చావు.. రక్తాన్నే ఎరుపెక్కించావు / మా తోడుకు తోడయ్యావు.. మా నీడకు నీడయ్యావు.. మా అయ్యకు అండై నిలిచావు / అయ్యంటే ఆనందం.. అయ్యంటే సంతోషం.. మా అయ్యకు అయ్యన్నీ నువ్వు / కలిసొచ్చిన ఈ కాలం.. వరమిచ్చిన ఉల్లాసం.. ఇట్టాగే పదికాలాలు ఉండనివ్వు....ఓ... జోలాలి అనలేదే చిననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలా / ఓ... నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నేల ఇయ్యాల / మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా / ఓ... మా పిల్లా పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా / గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకువుగా / వేరు మూలము వెదికి మా జత చేరినావు ఇలా...ఓ... పెదవుల్లో వెన్నెల్లు గుండెల్లో కన్నీళ్లు ఇన్నాళ్లు ఇన్నేళ్లు / ఓ... అచ్చంగా నీవల్లే మా సామి కళ్లల్లో చూసామీ తిరునాళ్లు / ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్లు / మా పుణ్యం పండేలా ఈ పైనా మేమంతా మీ వాళ్లు ఐనోళ్లు / అడుగు మోపిన నిన్ను చూసి అదిరె పలనాడు / ఇక కలుగు దాటి బయట పడగా బెదరడా పగవాడు.... ఉయ్యాలైనా జంపాలైనా చిత్రం: ఉయ్యాలా జంపాలా సంగీతం: సన్నీ ఎంఆర్ గానం: అనుదీప్, హర్షిక సాహిత్యం: వాసు వలబోజు ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ / మళ్లీ మనలా పుట్టించాడు సీతారాములని / ఇదో రకం స్వయంవరం అనేట్టుగా ఇలా / నీ చూపులే నాపై పడే ఓ పూలమాలలా / హరివిల్లు దారాలా బంగారు ఉయ్యాల వెన్నెల్లో ఊగలిలా / ఓహో...నీవేగా నాలో నా గుండెలో శ్రుతి లయ / ఓహో...నీవేగా నాకు నా ఊహలో çసఖీప్రియా /చెయ్యే చాస్తే అందేటంత దగ్గర్లో ఉంది / చందమామ నీలా మారి నా పక్కనుంది / నీకోసం నాకోసం ఇవ్వాళే ఇలా / గుమ్మంలోకొచ్చింది ఉగాదే కదా / ఒక్కో క్షణం పోతే పోనీ పోయేదేముంది / కాలాన్నిలా ఆపే బలం ఇద్దర్లో ఉంది / రేపంటు మాపంటు లేనే లేని లోకములో ఇద్దరినే ఊహించని / ఎటువైపు చూస్తున్న నీ రూపు కనిపించి చిరునవ్వు నవ్వే ఎలాఎదురైతే రాలేను ఎటు వైపు పోలేను నీ పక్కకొచ్చేదెలా / ఓహో...నా జానకల్లే ఉండాలిగా నువ్వే ఇలా / ఓహో...వనవాసమైన నీ జంటలో సుఖం కదా...నా పాదమే పదే పదే నీ వైపుకే పడే / జోలాలి పాట ఈడునే పడింది ఈ ముడే / ఓహో...ఎన్నాళ్లుగానో నా కళ్లలో కనే కల / ఓహో... ఈ ఇంద్రజాలం నీదేనయా మహాశయాగుండెకే చిల్లు పడేలా జింకలా నువ్వే గెంతాలా / ఇద్దరం చెరో సగం సగం సగం సగం / ఎందుకో ఏమో ఈవేళా నేనే సొంతం అయ్యేలా / నువ్వు నా చెంత చేరి చేయి నిజం కొంచెం... ఆరడుగులుంటాడా.. చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సంగీతం: మిక్కీ జె మేయర్ గానం: కళ్యాణి సాహిత్యం: అనంత శ్రీరామ్ ఆరడుగులుంటాడా.. ఏడడుగులేస్తాడా.. ఏమడిగినా ఇచ్చే వాడా / ఆశ పెడుతుంటాడా.. ఆట పడుతుంటాడా.. అందరికి నచ్చేసేవాడా / సరిగ్గా సరిగ్గా సరిగ్గా నిలవవెందుకే.. బెరుగ్గా బెరుగ్గా అయిపోకే / బదులేది ఇవ్వకుండా వెళ్లిపోకేఅడిగిన సమయంలో తను అలవోకగా నన్ను మోయాలి / సొగసును పొగడడమే తనకలవాటైపోవాలి / పనులని పంచుకునే మనసుంటే ఇంకేం కావాలి / అలకని తెలుసుకొని అందంగా బ్రతిమాలాలి / కోరికేదైనాగానీ తీర్చి తీరాలని / అతన్ని అతన్ని అతన్ని చూడడానికి / వయస్సే తపిస్తు ఉంటుందే / అప్పుడింక వాడు నన్ను చేరుతాడే..... బంతిపూల జానకి... చిత్రం : బాద్షా గానం : దలేర్మెహందీ, రైనా రెడ్డి సంగీతం : థమన్ ఎస్ సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి కొట్టిన తిట్టినా తాళిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రోయ్.../రాం జై.. రాం జై.. రాం జై..రాం జై.. రాం జై.. రాం జై../హే బంతిపూల జానకి జానకి, నీకంత సిగ్గు దేనికి దేనికి.. ఛలో ఛలో నాతో వచ్చెయ్ అత్తారింటికి/రాం జై.. రాం జై../హే బంతిపూల/హే... ఆకు వక్కా సున్నముంది నొరుపండటానికి, హే.. ఆడ ఈడు ముందరుంది నీకు చెందడానికి/హే, ఉట్టె మీద తేనెపట్టు నోటిలోకి జారినట్టు సోకులన్ని పిండుకుంటానే.../కొట్టినా తిట్టినా/చాపకింద నీరులాగ చల్లగ.. చల్లగా,చెంతకొచ్చినావు చెంప గిల్లగ గిల్లగా../చేప ముల్లు గుచ్చినావే మెల్లగా.. పాతికెళ్ల గుండె పొంగి పొర్లగా పొర్లగా../చూపులో ఫిరంగి గుళ్ల జల్లుగా.. సిగ్గులన్ని పేల్చినావు ఫుల్‌గా ఫుల్‌గా../సంకురాత్రి కోడి సుర్రకత్తె కట్టి, దూకు దూకు దూకుతాదే కారంగ/షంక్ మర్కు లుంగి పైకి ఎత్తి కట్టి,ఎత్తుకెళ్లిపోరా నన్ను ఏకంగ/హే ఆనకట్టు తేల్చినట్టు దూసుకొస్తా మీదికి, ఆ మందుగుండు పెట్టినట్టు మాయదారి గుట్టు మొత్తం నిన్ను చూసి ఫట్టుమందిరో../ఆ.. అంతలేసి తొందరేంది పిల్లడా.. పిల్లడా.. అందమంతా పట్టినావు జల్లెడా.. జల్లెడా../అందుబాటులోని పాల మీగడ... ఆకలేస్తే నంజుకోనా అక్కడా అక్కడా/మేకు లాంటి పిల్లగాడ్ని ఎక్కడా చూడలేదె కంచిపట్టు పావడ.. పావడ../చెక్కు రాసినట్టూ.. లెక్క తీరినట్టూ హక్కులన్ని ఇచ్చుకోవే మందారం/నీకు ముళ్ల పట్టు తొక్క తీసినట్టు మూతి ముద్దులిచ్చుకోరా బంగారం/హే.. అగ్గిపెట్టి చెప్పమాకే కుర్రకళ్ల కుంపటి,హే.. మత్తులోన లవ్వు లారి స్పీడుగా వచ్చి గుద్దినట్టు కౌగిలిస్తే మెచ్చుకుంటాలే.../కొట్టినా.. ఆటగదరా శివ... చిత్రం: మిథునం సంగీతం: స్వరవీణాపాణి గానం: యేసుదాస్ సాహిత్యం: తనికెళ్ల భరణి ఆటగదరా శివ.. ఆటగద కేశవ.. (2) / ఆటగదరా నీకు అమ్మ తోడు / ఆటగదరా శివ.. ఆటగద కేశవ / ఆటగద జననాలు.. ఆటగద మరణాలు.. మధ్యలో ప్రణయాలు ఆటగద నీకు / ఆటగద సొంతాలు.. ఆటగద పంతాలు.. ఆటగద సొంతాలు... ఆటగద పంతాలు.. ఆటగద అంతాలు ఆట నీకు.. ఆటగదరా శివ.. ఆటగదరా నలుపు.. ఆటగదరా తెలుపు.. నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు / ఆటగదరా మన్ను.. ఆటగదరా మిన్ను (2) / మిధ్యలో ఉంచి ఆడేవు నన్ను / ఆటగదరా శివ.. ఆటగద కేశవ.. ఏం మంత్రమో.. చిత్రం: అందాల రాక్షసి సంగీతం: రాధన్ సాహిత్యం: వశిష్ఠశర్మ గానం: బోబో శశి ఏం మంత్రమో.. అల్లేసిందిలా.. ఎదకే వేసే సంకెలా / భూమెందుకో వణికిందే ఇలా.. బహుశా తనలో తపనకా / ఆకాశం రూపం మారిందా.. నాకోసం వానై జారిందా.. గుండెల్లో ప్రేమై చేరిందా.. ఆ ప్రేమే నిన్నే కోరిందా / మబ్బుల్లో ఎండమావే.. ఎండంతా వెన్నెలాయే.. మనసంతా మాయమాయే.. అయినా హాయే /క్షణము ఒక రుతువుగా మారే.. ఉరుము ప్రతి నరమును తరిమే / పరుగులిక వరదలే పోయే కొత్తగా / ఉన్నట్లు ఉండి అడుగులు ఎగిరే / పగలు వల విసిరె ఊహలే / మనసు మతి చెదరగా శిలగా నిలిచెగా /కళ్లలో కదిలిందా కలగా కరిగిపోకలా / ఎదురయ్యే వేళల్లో నువ్వు ఎగిరిపోకలా / ఓ మాయలా ఇంకో మాయలా.. నన్నంత మార్చేంతలా / ఓ మాయలా ఇంకో మాయలా.. నువ్వే నేనయ్యేంతలా / వెన్నెలాలాలా... ఆకాశం అమ్మాౖయెతే... చిత్రం: గబ్బర్‌సింగ్ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గానం: శంకర్ మహదేవన్, గోపిక పూర్ణిమ సాహిత్యం: చంద్రబోస్ ఏం చక్కని మందారం..ఇది ఎనిమిది దిక్కుల సిందూరం..ఏం మెత్తని బంగారం...ఇది మనసున రేపెను కంగారం..ఏం కమ్మని కర్పూరం..ఇది కన్నెగ మారిన కశ్మీరం...ఏం వన్నెల వయ్యారం.. ఇక తియ్యని ప్రేమకు తయ్యారం.../ఆకాశం అమ్మాౖయెతే నీలా ఉంటుందే నీలా ఉంటుందే.../ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే.../వానల్లే నువ్వు జారగా నీళ్లల్లే నేను మారగా... వాగల్లే నువ్వు నేను చేరగా.. అది వరదై పొంగి సాగరం అవుతుందే../హోలా..హోలా.హోలా..హోలా...నీ కళ్లల్లో నే చిక్కానే పిల్లా../హోలా..హోలా.హోలా..హోలా..ఇక చాలాచాలా జరిగే నీ వల్లా.../ఏం చక్కని మందారం..ఇది ఎనిమిది దిక్కుల సిందూరం..ఏం మెత్తని బంగారం...ఇది మనసున రేపెను కంగారం.. /ఏం కమ్మని కర్పూరం..ఇది కన్నెగ మారిన కశ్మీరం... ఏం వన్నెల వయ్యారం.. ఇక తియ్యని ప్రేమకు తయ్యారం... /అల్లేసి.. నను గిల్లేసి.. తెగ నవ్వినావే సుగుణాల రాక్షసి..శత్రువంటి ప్రేయసి.. /పట్టేసి..కనికట్టేసి.. దడ పెంచినావే దయలేని ఊర్వశి..దేవతంటి రూపసి../గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే..నిద్దర పుచ్చేనే.../ఒహో లోకంలో అందాలన్నీ నీలో చేరేనే..నిద్దుర లేపేనే../హోలా..హోలా.హోలా..హోలా.. నీ కళ్లల్లోనే చిక్కానే పిల్లా../ఆనందం ఆనందం..ఆనందం అంటే అర్థం..ఈనాడే తెలిసింది కొత్త పదం../ఆనందం ఆనందం నీ వల్లే ఇంతానందం...గుండెల్లో కదిలింది పూలరథం.../వచ్చేసి బతికిచ్చేసి..మసి చేసినావె రుషిలాంటి నా రుచి..మార్చినావె అభిరుచి.../సిగ్గేసి చలి ముగ్గేసి...ఉసిగొల్పినావె స..రి గమల పదనిసి..చేర్చినావె ఓ కసి../స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే..ప్రాణం పోసేనే..ఒహో నరకంలో నానా హింసలు నీలో సొగసేనే ప్రాణం పోసేనే../హోలా..హోలా.హోలా..హోలా...నీ కళ్లల్లో నే చిక్కానే పిల్లా.. హోలా..హోలా.హోలా..హోలా..ఇక చాలాచాలా జరిగే నీ వల్లా.../ఏం చక్కని మందారం..ఇది ఎనిమిది దిక్కుల సిందూరం..ఏం మెత్తని బంగారం...ఇది మనసున రేపెను కంగారం../ఏం కమ్మని కర్పూరం..ఇది కన్నెగ మారిన కశ్మీరం...ఏం వన్నెల వయ్యారం.. ఇక తియ్యని ప్రేమకు తయ్యారం... నేనే నానీనే చిత్రం: ఈగ సంగీతం, సాహిత్యం: కీరవాణి గానం: దీపు, సాహితి నేనే నానినే నేనే నానినే / పోనే పోనీనే నీడై ఉన్నానే / అరె అరె అరె ఓ (2) / కళ్లకు ఒత్తులు వెలిగించి / కలలకు రెక్కలు తొడిగించి / గాలిని తేలుతు ఉంటున్నాకనబడినా ఓకే... కనుమరుగవుతున్నా ఓకే (2) / మాటలు ముత్యాలై దాచేసినా.. చిరునవ్వు కాస్తయినా వొలికించవా / కోపం ఐనా కోరుకున్నా అన్నీ నాకు నువ్వని / కనబడినా ఓకే... కనుమరుగవుతున్నా ఓకే (2) నా భాషలో రెండే వర్ణాలని / నాకింక నీ పేరే జపమవునని / బిందు అంటే.. గుండె ఆగి.. దిక్కులన్నీ చూడనా / కనబడినా ఓకే.. కనుమరుగవుతున్నా ఓకే (2) / అరె అరె అరె వో (2) చిన్నదాన నీకోసం.. చిత్రం: ఇష్క్ సంగీతం: అనూప్ రూబెన్స్ గానం: అనూప్ రూబెన్స్, రాజ్హసన్, శ్రావణి రచన: కృష్ణచైతన్య హో తెరెబిన్ జానా..కుచుబి నహీ మై..ఇష్క్ మే మై దీవానా / అయిలెబ్బా.. అయిలెబ్బా..అయిలె..అయిలె..అయిలె.. అయిలెబ్బా.. నన్నాన్నాన్నా అయిలెబ్బా... నన్నానాన్ననా.. తందానతననా.. /ఓ అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్లదిరే...అదిరే అదిరే నా మనసే ఎదురే చూసే చిన్నదాన నీకోసం ఓ చిన్నదాన నీకోసం..../చిన్నదాన నీకోసం..ఓ చిన్నదాన నీకోసం.../ నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం..ఏదైనా..ఏమైనా..వేచున్నా నేను చిన్నవాడా నీకోసం../చిన్నవాడా నీకోసం..మాటలన్నీ నీకోసం..మౌనం అంతా నీకోసం.../ఓ కూవనే కోయిలా ఉండదే రాయినా కొత్త పాట పాడుతా... తీయనీ హాయిలో తేలనీ గాలిలో పెళ్లిదాకా పరిచయం ఇలా../హే ఎటువైపెళ్లినా.. నే నిన్నే చేరనా...మెలిపెడుతూ ఎలా ముడిపడిపోనా...ఓ జాజి కొమ్మే నా చెలి జావళీలే పాడెనురో../ప్రేమ అంటే అంతేరో అన్ని వింతేరో../వేకువంతా నీకోసం..వెన్నెలంతా నీకోసం...ఊసులన్నీ నీకోసం..ఊపిరంతా నీకోసం../ఓ ప్రేమ పుస్తకాలలో లేనే లేని పోలిక రాయటం కాదు తేలిక../మాటలే రావుగా మౌనవే హాయిగా భావమైతే బోలెడుందిగా.../నీ నవ్వే సూటిగా.. తెలిపిందే రాయికా...చాల్లే తికమకా అల్లుకు పోవే../హో గాలిలోనే రాసిన మన ప్రేమ అయితే చెదరదులే..అలలా అడుగున మునిగిన తీరం చేరునులే../కాదల్ అయిన నీకోసం..నీకోసం../ప్రేమ అయిన నీకోసం..నీకోసం../లవ్ యూ అయిన నీకోసం..నీకోసం.../ఇష్క్ అయిన నీకోసం...నీకోసం... గురువారం మార్చి ఒకటి.. చిత్రం : దూకుడు సంగీతం : ఎస్.థమన్ గానం : రాహుల్ నంబియార్ సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి గురువారం మార్చి ఒకటి, సాయంత్రం ఫైవ్‌ఫార్టీ, తొలిసారిగ చూశానే నిన్ను/చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి/నిదరేపోనందే నా కన్ను/రోజంతా నీ మాటే, ధ్యాసంతా నీ మీదే,అనుకుంటే కనిపిస్తావు నువ్వే/మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏం మాయో చేశావే/ఓం శాంతి శాంతి అనిపించావేజర జరా సున్‌తో జర జానే జానా/దిల్సే తుఝ్కో ప్యార్ కియా ఏ దీవానా/నీపై చాలా ప్రేమ ఉంది గుండెల్లోన/సోచో జరా ప్యార్ సే దిల్‌కో సమ్‌ఝానా/ఐ లవ్ యూ బోలోనా హసీనానువ్వాడే పెర్ఫ్యూమ్ గుర్తొస్తే చాలే/మనసంతా ఏదో గిలిగింతే కలిగిందే పెరిగిందే/నా చుట్టూ లోకం నీతో నిండిందే ఓ నిమిషం/నీ రూపం నన్నొదిలి పోనందే/క్లైమేట్ అంతా నాలాగే లవ్లోపడిపోయిందేమో అన్నట్టుందే క్రేజీగా ఉందే/నింగినేల తలకిందై కనిపించే జాదూ/ఏదో చేసేశావే/గడియారం ముల్లై తిరిగేస్తున్నానే ఏ నిమిషం...నువ్వు ఐ లవ్ యూ అంటావో అనుకుంటూ...క్యాలెండర్ కన్నా ముందే ఉన్నానే నువు నాతో కలిసుండే ఆరోజే ఎపుడంటూ డైలీ రొటీన్ టోటల్‌గా నీ వల్లే ఛేంజయ్యిందే/చూస్తూ చూస్తూ నిన్ను ఫాలో చేస్తూ/అంతో ఇంతో డీసెంట్ కుర్రాణ్ణి ఆవారాలా మార్చేశావే/ ఓంశాంతి / ఓంశాంతిజర జర ప్రేమలోకి అడుగేస్తున్నా/చెలియలా చేరిపోనా నీలోన/ఏదేమైనా నీకు నేను సొంతం కానా/నన్నే నేను నీకు కానుకిస్తున్నా సారొస్తారొస్తారా.. చిత్రం: బిజినెస్‌మేన్ సంగీతం: థమన్. ఎస్. గానం: థమన్ ఎస్., సుచిత్ర సాహిత్యం: భాస్కరభట్ల సారొస్తారొస్తారా రత్త రత్త రత్తారే.. దావత్తే ఇస్తారా రత్తా రత్తారే../ఒంటిగంట కొట్టినాక ఓరినాయనో.. వేడి పుట్టె వంటిలోన ఏటి సెయ్యనో.. సారొస్తారొస్తారె సారొస్తారొస్తారె/కోరికేదో రేపుతుంటే ఏడ దాచనో.. లంగరేసి లాగుతుంటే ఎట్టా ఆగనో../వాలు కళ్ళకే నచ్చినావు తెగ, లోపలేక్కడో అంటుకుంది సెగ, నీ చూపు కందిరీగ, కొరికి తినగా.. తుర్nు పే ఫిదా హోగా.../సారొస్తారొస్తారా.../మాతిరెమూసా సాయీఆయీఆయి.../ముద్ద బంతి, రావే రావే...ముద్ధు గుమ్మ, రావే రావే... ముస్తాబయ్యి, రావే రావే.. ముద్దులిచ్చి, పోవే పోవే.... ఏహే వస్తారే వస్తారే వస్తారే.../రామ సిలకో రాను అనకో.. మేరే దిల్ కో ఫరక్ లేదు గిల్లుకో... బెంగ తీరి పోతే అల్లుకో.. ఇది ఉడుకో లేక దుడుకో.. అగ్గి రాజుకుంటే సుప్పనాతి ఇనకో.. సిగ్గు పానకంలో జర జర పుడకో... తేరి నజరోంకా ఏక్ ఇషారా, యారా.. మై ఛోడ్ చలూన్ జగ్సారా, జారా.. తేరి బాహోంకా సహారా, ఆ, మాంగో దూబారా జరా, ఎ, తాంలే ఆరా.. సారొస్తారొస్తారే... /మాతిరెమూసా మత్తిరెమొసా సాయీఆయి ఆఅయిదె మూసా సొరె మాఈ సాయీ....సారొస్తా, సారొస్తా, సారొస్తారొస్తారా... ఎందుకో ఏమో... చిత్రం: రంగం సంగీతం: హారిస్ జయరాజ్ గానం: ఆలాప్ రాజు సాహిత్యం: వనమాలి ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే..పిచ్చి పరుగులు తీసే.. వెల్లివిరిసెను వయసే/ఎందుకో ఏమో గుండె దరువులు వేసే.. కొంటె తలపులు తోచే.. పొంగి పొరలెను ఆశే/ఏదో గజిబిజిగా.. గజిబిజిగా కనిపించే రూపం/రేపో దరి కనని దరి కనని తీరం..ఏదో గజిబిజిగా గజిబిజిగా..కనిపించే రూపం/రోజూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం/ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే...చెలి దూరమయ్యె వరసే.. రేయి కలలుగా విరిసే/ఎందుకో ఏమో రెక్కలెదలకు మొలిచే..చిన్ని గుండెనేదో తొలిచే.. ఒంటరిగ నను విడిచే/ఏదో గజిబిజిగా...గజిబిజిగా కనిపించే రూపం/రేపో దరి కనని దరి కనని తీరం.. ఏమో ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం/రోజూ తడబడుతూ వెలిగే ఉదయం../నువ్వు నేను ఒక యంత్రమా...కాలం నడిపే ఓ మహిమా ప్రేమా/ముద్దులిడిన ఊపిరి సెగలు తగిలి రగిలి చెడిపోతున్నా/చెంత నువ్వు నిలబడగానే.. నిన్ను విడిచి పరిగెడుతున్నా/సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే...అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే/నవ్వుల్తో చంపే మాయే చాల్లే...ఏమో తుళ్ళి తిరిగెను మనసే/పిచ్చి పరుగులు తీసే...వెల్లివిరిసెను వయసే/ఎందుకో ఏమో గుండె దరువులు వేసే...కొంటె తలపులు తోచే...పొంగి పొరలెను ఆశే/నువ్వు నేను ఒక యంత్రమా...కాలం నడిపే ఓ మహిమా ప్రేమా/నిలవనీక నిను తెగ వెతికే... కనులకిన్ని తపనలు ఏంటో/ఎన్ని సడులు వినపడుతున్నా వీడిపోదు నీ పలుకేంటో/కలల్లోన నిన్నే కనగా కన్నుల్నే పొందాను/కలే కల్లలయ్యే వేళ కన్నీరై పోతాను/నీడనే దోచే పాపే నేను/ఏమో తుళ్ళి తిరిగెను మనసే/పిచ్చి పరుగులు తీసే... వెల్లివిరిసెను వయసే/ఒహో.. ఏమో గుండె దరువులు వేసే...కొంటె తలపులు తోచే... పొంగి పొరలెను ఆశే/ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం...రేపో దరి కనని దరి కనని తీరం.. ఏమో/ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం...రోజూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం../ ఏమో... చలి చలిగా.. చిత్రం : మిష్టర్ పర్ఫెక్ట్ సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ గానం : శ్రేయా ఘోషల్ సాహిత్యం : అనంత శ్రీరామ్ చలిచలిగా అల్లింది.. గిలిగిలిగా గిల్లింది.. నీవైపే మళ్లిందీ మనసు / చిటపట చిందేస్తోంది.. అటు ఇటు దూకేస్తోంది.. సతమతమైపోతోంది వయసూ / చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో.. గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయి / చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయి / నువ్వు నాతోనే ఉన్నట్టు.. నా నీడవైనట్టు.. నన్నే చూస్తున్నట్టు ఊహలు.. నువ్వు నా ఊపిరైనట్టు.. నా లోపలున్నట్టు.. ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు / చలిచలిగా.....గొడవలతో మొదలై.. తగువులతో బిగువై.. పెరిగిన పరిచయమే నీదీ నాది / తలపులు వేరైనా.. కలవని తీరైనా / బలపడి పోతోందే ఉండే కొద్దీ / లోయలోకి పడిపోతున్నట్టు.. ఆకాశం పైకి వెళుతున్నట్టు.. తారలన్నీ తారసపడినట్టు.. అనిపిస్తోందే నాకేమైనట్టు / నువ్వు నాతోనే ఉన్నట్టు......నీపై కోపాన్ని.. ఎందరి ముందైనా.. బెదురే లేకుండా తెలిపే నేను / నీపై ఇష్టాన్ని.. నేరుగ నీకైనా తెలపాలనుకుంటే తడబడుతున్నాను / నాకు నేనే దూరం అవుతున్నా.. నీ అల్లర్లన్నీ గుర్తొస్తుంటే / నన్ను నేనే చేరాలనుకున్నా.. నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే / నువ్వు నాతోనే ఉన్నట్టు....... ఏదో అనుకుంటే... చిత్రం: అలా మొదలైంది సంగీతం: కళ్యాణ్ కోడూరి సాహిత్యం: లక్ష్మీ భూపాల్ గానం: దీపు, నిత్య మీనన్ ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే / నాకే అనుకుంటే అది నీకూ జరిగిందే / సర్లే గగ్గోలు పెట్టకే అంతా మన లైఫు మంచికే / మందుంది మనసు బాధకి.. వదిలేద్దాం కథని కంచికే / అసలీ ప్రేమ దోమ ఎందుకు టెల్మీ వై / ఎవరిష్టం వాళ్లది మనకెందుకు వదిలేయ్ / ఏయ్ ప్రేమ దోమ ఎందుకు టెల్ మీ వై / ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే / నాకే అనుకుంటే అది నీకూ జరిగిందే...ప్రేమించినా పెళ్ళాడకు వైఫ్ ఒక్కటే తోడెందుకు / మగవాళ్ళని టైంపాసని అని అనుకుంటు వెంట తిరగనీ / మన ఖర్చే వాళ్ళు పెట్టనీ ఆపై వాళ్ళ ఖర్మ పోనీ / మరి పెళ్ళి గిల్లి ఎందుకు టెల్ మీ వై / అది బుర్రే లేని వాళ్ళకి వదిలేసేయ్ / మరి పెళ్ళి గిల్లి ఎందుకు టెల్ మీ వైనువ్వొక్కడివే పుట్టావురా నువ్వొక్కడివే పోతావురా / ఆ మధ్యలో బతకాలిగా / ఆరడుగుల పెళ్ళి గొయ్యికి ఏడడుగుల తొందరెందుకు / సూసైడు నేరం వద్దు మనకి / మరి లైఫూ గీఫూ ఎందుకు టెల్ మీ వై పొడుస్తున్న పొద్దు మీద... చిత్రం:జైబోలో తెలంగాణ సంగీతం: చక్రి గానం, సాహిత్యం: గద్దర్ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా...పోరు తెలంగాణమా... కోట్లాది ప్రాణమా (2)అదిగో ఆ కొండల నడుమ తొంగి చూసే ఎర్రని భగవంతుడెవడు.. సూర్యుడు / ఆ ఉదయించే సూర్యునితో పొడుస్తున్న పొద్దుతో పోటీ పడి నడుస్తుంది కాలం / అలా కాలంతో నడిచినవాడే కదిలిపోతాడు / ఓ.. పొడుస్తున్న పొద్దు వందనం వందనంభూతల్లి.. సూర్యుడిని ముద్దాడిన భూతల్లి.. అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది.. అమ్మా.. నీవు త్యాగాల తల్లివి.. త్యాగాల గుర్తువు / భూతల్లి బిడ్డలు, చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు హా / మా భూములు మాకేనని భలే భలే భలే భలే హా / మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా / తిరగబడ్డ రాగమా / పోరు తెలంగాణమా / కోట్లాది ప్రాణమా / భలే భలే భలే భలే...అమ్మా గోదావరి.. నీ ఒడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం / అమ్మా కృష్ణమ్మా.. కిల కిల నవ్వే కృష్ణమ్మా.. అమ్మా మీకు వందనం / గోదావరి అలల మీద కోటి కళల గానమా / కృష్ణమ్మా పరుగులకు నురుగులా హారమా హా / మా నీళ్లు భలే భలే భలే భలే హా / మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి గానమా / కత్తుల కోలాటమా కన్నీటి గానమా / పోరు తెలంగాణమా / కోట్లాది ప్రాణమా...అదిగో ఆ ప్రకృతిని చూడు.. అలా అలుముకుంటుంది / ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి / ఆ పువ్వులు అలా ఆడుతాయి / అదిగో పావురాల జంట మేమెప్పుడు విడిపోమంటాయి / విడిపోయిన బంధమా చెదిరిపోయిన స్నేహమా / ఎడబాసిన గీతమా ఎదల నిండ గాయమా హా / పువ్వులు పుప్పొడిలా పవిత్రబంధమా పరమాత్ముని రూపమా / పోరు తెలంగాణమా / కోట్లాది ప్రాణమా / భలే భలే భలే...అదిగో రాజులు దొరలు వలసదొరలు.. భూమిని నీళ్లని ప్రాణుల్ని సర్వస్వాన్ని చెరబట్టారు..రాజుల ఖడ్గాల కింద తెగిపోయిన శిరసులు / రాచరికం కత్తి మీద నెత్తుర్లా గాయమా / దొరవారి గడులల్లో భలే భలే భలే / దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా/ ఆంధ్రవలస తూటాలకు ఆరిపోయిన దీపమా / మా పాలన మాకేనని మండుతున్న గోలమా అమరవీరుల స్వప్నమా / ఇనుములో హృదయం మొలిచెనే.. చిత్రం: రోబో సంగీతం: ఎఆర్. రెహమాన్ గానం: ఎ.ఆర్.రెహమాన్, సుజేన్ సాహిత్యం: సుద్దాల అశోక తేజ ఇనుములో ఓ హృదయం మొలిచెనే/ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే/పూజించే యంత్రుడు పూవాసన కొచ్చాడు/మరమనిషి వింతోడు మన్మ«థుడై వచ్చాడు / గూగుల్‌కే అందని అందం చుడాలనుకున్నాడు/కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు/ఐ రోబో నీ చెవిలో ఐ లవ్ యు కోరేదఐ యామ్ ఏ సూపర్ గర్ల్.. ప్రేమించే రాపర్ గర్ల్ (2)వెన్నెల్లో అందాలే నీవే లే నీవే లే/నీ నీలి కన్నులో విద్యుత్తే దొంగలిస్తా/నా నీలి కన్నులతో నీతోనే నవ్విస్తా/నా ఏంజెల్ గుండెల్ని నీ సేవకి అర్పిస్తా/నీ నిద్ర రాత్రిలో నా సృష్టి ఆపేస్తా/ఏనాడూ ఏ పొద్దు నీ వాడే బొమ్మేనవుతవాచ్ మీ రోబో షేక్ ఇట్.. ఐ నో యూ వానా బ్రేక్ ఇట్.. గట్టి మాటగన... నువ్వే షాక్ కొడితే ప్రేమే బూడిదేరా/వొట్టి వేగమైతే కౌగిలి రాత్రి బ్యాటరీ అయిపోతే/మెమరీలో నీ సుకుమారం విడిగా దాచుకుంటానే/ షట్‌డౌనే చేయను పో రోజంతా చూస్తానే ఓ..ఒ రోబో/ సెన్సార్లన్ని అరిగే దాకా నీలో అన్ని చదివానే/నీ వల్లే నా నియమం హద్దులన్ని మరిచానే/ఎంగిలి లేని దొంగముద్దు వద్దనకుండ తీసుకోవా/రక్తం లేని నా హంగులనే వద్దు పోరా అంటావా జీవశాస్త్ర భాషలోన్న యంత్రాన్నే ఓహ్ చెలి/తారాలోకం భాషలోన్న చంద్రుడినే నా సఖి/చావే లేని శాపం పొంది భువి పైకి వచాన్నే/నా ప్రేమ పువ్వు వల్లే వాడిపోదు అంటానే/హే రోబో మసకొద్దు.... నువ్వు కాళ్ళకు బంధం వేయకు ఫో.../ప్రేమ కోరే రోబో.../నీ అవసరం లేదు పో.. పో.... ఇనుములో ఓ హృదయం మొలిచెనే/ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే/ పూజించే యంత్రుడు పూవాసన కొచ్చాడు/మరమనిషి వింతోడు మన్మథుడై వచ్చాడు, గూగుల్‌కే అందని అందం చూడాలనుకున్నాడు/కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు...ఐ రోబో నీ చెవిలో ఐ లవ్ యు కోరేదా/ ఐ యామ్ ఏ సూపర్ గర్ల్.. ప్రేమించే రాపర్ గర్ల్ / ఐ రోబో నీ చెవిలో ఐ లవ్ యు కోరేదా/ ఐ యామ్ ఏ సూపర్ గర్ల్.. ప్రేమించే రాపర్ గర్ల్ రూబా రూబా... చిత్రం: ఆరెంజ్ సంగీతం: హారిస్ జైరాజ్ గానం: శాహిల్ హదా సాహిత్యం: వనమాలి రూబా రూబా.. హే రూబా రూబా.. రూపం చూస్తే హాయ్ రబ్బా / తౌబా తౌబా.. హే తౌబా తౌబా.. తు హై మేరీ మెహబూబా / అయ్యయ్యయ్యో యే మాయో నీ వెంట తరుముతోంది / ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోంది / సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టు ఉందే ఇంచు దూరమే అడ్డున్నా ఎలా ఉండగలమంటున్నా.. నిన్ను తాకమని తొందర చేసే నా మదే / కొంటె చేష్టలే చేస్తున్న.. తనేం చేసినా కాదనదే.. ఎంతసేపు కలిసున్నా ఆశే తీరదే / ఈ ఆనందంలో సదా ఉండాలనుందే / ఆ మైకంలోనే మదే ఊరేగుతోందే / నీతో సాగే ఈ పయనం.. ఆగేనా ఇక ఏ నిమిషం / రెక్కలొచ్చినట్టు ఉందే.. మదే తేలిపోతుందే / రేయి పగలు మాట్లాడేస్తున్నా చాలదే / నవ్వు నాకు తెగ నచ్చిందే / నడుస్తున్న కల నచ్చిందే / నిన్ను వీడి ఏ వైపుకు అడుగే సాగదే / నువ్వేమంటున్నా వినాలనిపిస్తు ఉందే / రోజూ నీ ఊసే కలల్లే పంచుతోందే / నీతో ఉంటే సంతోషం.. కాదా నిత్యం నా సొంతం / సదా శివా సన్యాసి... చిత్రం: ఖలేజా సంగీతం: మణిశర్మ గానం: కారుణ్య, రమేష్ వినయగం సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి ఓం నమో శివ రుద్రాయ, ఓం నమో శితి కంఠాయ, ఓం నమో హర నాగాభరణాయ, ప్రణవాయ, ఢమ ఢమ ఢమరుక నాదానందాయ, ఓం నమో నిటలాక్ష్యాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ, ప్రమధాయ, ధిమి ధిమి తాండవకేళీ లోలాయ!!సదాశివా సన్యాసి, తాపసి కైలాసవాసి/నీ పాదముద్రలు మోసి, పొంగి పోయినాదె పల్లె కాశి./ఏయ్ సూపుల సుక్కాని దారిగా, సుక్కల తివాసీ మీదిగా/సూడ సక్కని సామి దిగినాడురా, ఏసైరా ఊరు వాడా దండోరా/ఏ రంగుల హంగుల పొడ లేదురా, ఈడు జంగమ శంకర శివుడేనురా, నిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగా, నీ తాపం, శాపం తీర్చేవాడేరా/పైపైకలా, బైరాగిలా, ఉంటాదిరా ఆ లీల/లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడూ/ఏయ్. నీలోనె కొలువున్నోడు, నిన్ను దాటి పోనే పోడు/సదాశివా సన్యాసి, తాపసి కైలాసవాసి/నీ పాదముద్రలు మోసి, పొంగి పోయినాదె పల్లె కాశి/ఏయ్.ఎక్కడ వీడుంటే నిండుగా, అక్కడ నేలంతా పండగ/సుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా, అడుగేశాడంటా కాచే దొరలాగా/మంచును, మంటను ఒక్క తీరుగా, లెక్కసెయ్యనే సెయ్యని శంకరయ్యగా/ఉక్కు కంచెగ ఊపిరి నిలిపాడురా. మనకండ దండ వీడే నికరంగా/సామీ అంటే హామీ తనై ఉంటాడురా చివరంటా/లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడూ/ఏయ్. నీలోనె కొలువున్నోడు, నిన్ను దాటి పోనే పోడు వింటున్నావా... చిత్రం: ఏ మాయ చేసావె సంగీతం: ఎ.ఆర్. రెహమాన్ గానం: కార్తీక్, శ్రేయా ఘోషల్ సాహిత్యం: అనంత శ్రీరామ్ పలుకులు నీ పేరే తలుచుకున్నా / పెదవుల అంచుల్లో అణుచుకున్నా / మౌనముతో నీ మదిని బంధించా మన్నించు ప్రియా / తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా/విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు/నాగుండెల్లో ఇప్పుడే వింటున్నా/తొలిసారి నీ మాటల్లో పులకింతలా పదనిసలు విన్నా/చాలు చాలే చెలియా చెలియా బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా/ఓ బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా..... ఏమోఏమో ఏమవుతుందో/ఏ..దేమైనా నువ్వే చూసుకో/విడువను నిన్నే ఇకపైనా వింటున్నావా...ప్రియా/గాలిలో తెల్ల కాగితంలా నేనలా తేలి ఆడుతుంటే/నన్నే ఆపీ నువ్వే రాసినా, ఆ పాటలనే వింటున్నా.తరిమే వరమా తడిమే స్వరమా/ఇదిగో ఈ జన్మ నీదని అటున్నా.. వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా..వింటున్నావా.... ఆద్యంతం ఏదో ఏదో అనుభూతి/ఆద్యంతం ఏదో ఆనుభూతి అనవరతం ఇలా అందించేది.. గగనం కన్నా మునుపటిది.. భూతలం కన్నా ఇది వెనుకటిది.. కాలంతోన పుట్టింది కాలం లా మారే.. మనసే లేనిది ప్రేమ../ రా ఇలా కౌగిళ్లల్లో నిన్ను దాచుకుంటా.. నీ దానినై నిన్నే దారిచేసుకుంటా.. ఎవరిని కలువని చోటులలోన.. ఎవరిని తలువని వేళలలోన.. తరిమే వరమా.../వింటున్నావా../విన్నా వేవేల... ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ... గుండె గుబులుని గంగకు వదిలి, ముందు వెనకలు ముంగిట వదిలి, ఊరి సంగతి ఊరికి వదిలి, దారి సంగతి దారికి వదిలి, తప్పు ఒప్పులు తాతలకొదిలి, సిగ్గు ఎగ్గులు చీకటికొదిలి, తెరలను వదిలి, పొరలను వదిలి, తొలి తొలి విరహపు చెరలను వదిలి, గడులుని వదిలి ముడులని వదిలి, గడబిడలన్నీ గాలికి వదిలేసి.... ఎగిరిపోతే ఎంత బాగుంటుంది... ఎగిరిపోతే ఎంత బాగుంటుంది... ఎగిరిపోతే ఎంత బాగుంటుంది... ఎగిరిపోతే ఎంత బాగుంటుంది/ గుండె గుబులుని.. గంగకు వదిలి, ముందు వెనకలు.. ముంగిట వదిలి, ఊరి సంగతి, ఊరికి వదిలి.. దారి సంగతి, దారికి వదిలి.. తప్పు ఒప్పులు, తాతలకొదిలి.. సిగ్గు ఎగ్గులు, చీకటికొదిలి.. తెరలను వదిలి.. పొరలను వదిలి.. తొలి తొలి విరహపు చెరలను వదిలి.. గడులుని వదిలి ముడులని వదిలి, గడబిడలన్నీ గాలికి వదిలేసి... హా ..ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది../ లోకం రంగుల సంత.. హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్/ప్రతిదీ ఇక్కడ వింత.. హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్/అందాలకు వెల ఎంత.. కొందరికే తెలిసేటంత/పాతివ్రత్యం, పై పై వేషం.. ప్రేమ త్యాగం, పక్కా మోసం/మానం శీలం, వేసే వేలం.. మన బతుకుంతా, మాయాజాలం/ఎగబడి ఎగబడి దిగబడి దిగబడి జతబడి కలపడి త్వరపడి ఎక్కడికో...(శివ..శివ)/ఎగిరిపోతే.... పంచదార బొమ్మ చిత్రం: మగధీర సంగీతం: ఎమ్.ఎమ్. కీరవాణి గానం: అనూజ్ గుర్వారా, రీతా సాహిత్యం: చంద్రబోస్ పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ/ మంచుపూల కొమ్మ కొమ్మ ముట్టుకోవదనకమ్మా/చేతినే తాకొద్దంటే.. చంతకేరావొద్దంటే ఏమౌతానమ్మా/నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ/నువ్వు అందకపోతే వృథా ఈ జన్మపువ్వుపైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే/పసిడిపువ్వు నువ్వని పంపిందే/నువ్వు రాకు నా వెంట పూల చుట్టు ముళ్లంటా/అంటుకుంటే మండే వళ్లంతాతీగ పైన చెయ్యేస్తే తిట్టినన్ను నెట్టిందే/మెరుపు తీగ నువ్వని పంపిందే/మెరుపు వెంట ఉరుమంటా/ఉరుము వెంట వరదంట/నీ వరదలాగ మారితె ముప్పంటవరదైనా వరమని భరిస్తానమ్మా/మునకైనా సుఖమని మునకేస్తానమ్మా గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది/నేను నిన్ను తాకితే తప్పా/గాలి ఊపిరయ్యింది, నేల నన్ను నడిపింది/ఏమింటంట నీలోని గొప్పావెలుగు నిన్ను తాకింది చినుకు కూడా తాకింది/పక్షపాతమెందుకు నాపైనా/వెలుగు దారి చూపిందే/చినుకు లాల పోసిందే/వాటితోటి పోలిక నీకేలా/ అవి బతికున్నప్పుడే తోడుంటాయమ్మా/నీ చితిలో తోడై నేనొస్తానమ్మా హృదయం ఎక్కడున్నదీ... చిత్రం: గజిని సంగీతం: çహారీస్ జయరాజ్ సాహిత్యం: వెన్నెలకంటి గానం: హరీష్ రాఘవేంద్ర, బొంబే జయశ్రీ హృదయం ఎక్కడున్నదీ... హృదయం ఎక్కడున్నది../నీ చుట్టూనే తిరుగుతున్నదీ.../అందమైన అబద్ధం.. ఆడుకున్న వయసే../నాలో విరహం పెంచుతున్నదీ../చూపులకై వెతికా.. చూపుల్లోనే బతికా .../కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా తొలిసారీ .. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా...అందమైన అబద్ధం.. ఆడుకున్న వయసే../నాలో విరహం పెంచుతున్నదీ../చూపులకై వెతికా.. చూపుల్లోనే బతికా .../కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా... తొలిసారీ .. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా...కుందనం మెరుపు కన్నా... బంధనం వయసుకున్నా ../చెలి అందం నేడే అందుకున్నా.../గుండెలో కొసరుతున్నా... కోరికే తెలుపుకున్నా.../చూపే వేసీ బతికిస్తావనుకున్నా...ఆ..కంటిపాపలా.. పూవులనే నీ కనులలో కన్నా../నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా.... నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా...అందమైన అబద్ధం.. ఆడుకున్న వయసే../నాలో విరహం పెంచుతున్నదీ.. /చూపులకై వెతికా.. చూపుల్లోనే బతికా .../కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా ...తొలిసారీ .. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా...మనసులో నిన్ను కన్నా... మనసుతో పోల్చుకున్న.../తలపుల పిలుపులు విన్నా../సెగలలో కాలుతున్నా .. చలికి నే వణుకుతున్నా../నీడే లేని జాడే తెలుసుకున్నా...ఆ../మంచు చల్లనా.. ఎండ చల్లనా.. తాపంలోనా మంచు చల్లనా ../కన్నా..నీ కోపంలోనా ఎండ చల్లనా... కన్నా.. నీ కోపంలోనా ఎండ చల్లనా... రబ్బరు గాజులు... చిత్రం: యమదొంగ సంగీతం: ఎమ్.ఎమ్. కీరవాణి గానం: దలేర్ మెహందీ సాహిత్యం: అనంత శ్రీరామ్ రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే/రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే/అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని అత్తిరి నీదరి కొచ్చావే/నువ్వంటె పడిపడి నువ్వంటె పడిపడి నువ్వంటె పడిపడి చస్తానే/నీవెంటె పడిపడీ వస్తానే/చల్లనిగాలిని చల్లనిగాలిని చెప్పినచోటికి తెచ్చేరో/వెన్నెల కొండలు వెన్నెల కొండలు వెచ్చని వేళకు పట్టెయ్రో/మెత్తని దిండుగ పట్టెను నిన్నుగ గమ్మున పట్టుకొచ్చెయ్రో/నువ్వంటే పడి పడి..రాజుగారి ఏనుగుమీద రైరై రఫ్రై రై రై రఫ్ రై అని ఊరిగిస్తానే పిల్లా/రాణిగారి పానుపు మీద దాయిదాయి అమ్మదాయి హాయి హాయి అమ్మాహాయి అని బజ్జోపెడతానే పిల్లాఅట్టాగంటే ఐస్ అవుతానా/ఇట్టాగొస్తే క్లోజ్ అవుతానా/ అంతందంగా అలుసవుతానా/ కీ అని నువ్వంటే కీలుగుర్రం ఎక్కించి, జూం అని జాం అని చుక్కలు దిక్కులు చుట్టుకు వస్తానే.. రోజు రోజూ తోటకి వెళ్లి ఢీఢీ ఢీక్కంఢీ డీఢీఢీక్కంఢీ అని లవ్వాడేద్దామే పిల్లా/ఢీ ఢీ ఢీక్కంఢీ ఢీ ఢీ ఢీక్కంఢి/ఏదో రోజు పేటకు వెళ్ళి పీపీడుండుంపి పిపిడుండుండుండుంపి అని పెళ్లాడేద్దామే పిల్లా అట్టా చెపుతే సెట్ అయిపోతా/పుస్తె కడితే జటై్టపోతా/ఆకుల్లోన వక్కైపోతాఅ అని నువ్వంటే తాళిబొట్టు తెచ్చేస్తా/ఢూం అని ఢం అని డప్పులు తప్పలు తగిలిచ్చేస్తానే.... నిజంగా నేనేనా... చిత్రం: కొత్త బంగారు లోకం సంగీతం: మిక్కీ జె మేయర్ గానం: కార్తీక్ సాహిత్యం: అనంత∙శ్రీరామ్ నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా / ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా / యెదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా / వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా / హరే హరే హరే హరే హరేరామా మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా/ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోనా ఏమ్మా/హరే హరే హరే హరే హరేరామా/మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోనా ఏమ్మా/నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా/ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా.. ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం/నా మనస్సుకే ప్రతీక్షణం నువ్వే ప్రపంచం/ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం/అడుగులలోనా అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా/అలసట రాదు గడచిన కాలం ఇంతని నమ్మనుగా/నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా/ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా... నా కలే ఇలా నిజాలుగా నిలుస్తు ఉంటే/నా గతాలనే కవ్వింతలై పిలుస్తు ఉంటే/ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తు ఉంటే/పెదవికి చెంప తగిలిన చోట పరవశమేదో తోడవుతుంటే/పగలే అయినా గగనములోనా తారలు చేరెనుగా/నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా/ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా/ యెదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా/వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా... గాల్లో తేలినట్టుందే... చిత్రం: జల్సా సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గానం: టిప్పు, గోపికా పూర్ణిమ సాహిత్యం: భాస్కరభట్ల గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే/తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే/వొళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే/ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే/ఊర్వశివో, నువ్వు రాక్షసివో, నువ్వు ప్రేయసివో, నువ్వు నా కళ్లకి.. ఊపిరివో, నువ్వు ఊహలవో, నువ్వు ఊయలవో, నువ్వు నా మనసుకి/హే నిదుర దాటి కలలే పొంగే/పెదవి దాటి పిలుపే పొంగే/అదుపు దాటి మనసే పొంగే... నాలో గడపదాటి వలపే పొంగే/చెంపదాటి ఎరుపే పొంగే/నన్ను దాటి నేనే పొంగే....నీ కొంటె ఊసుల్లో రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు/దిక్కులవో నువ్వు నా ఆశకి తుమ్మెదవో, నువ్వు తుంటరివో నువ్వు, తొందరవో నువ్వు, నా ఈడుకి/తలపుదాటి తనువే పొంగే/సిగ్గుదాటి చనువే పొంగే/గట్టుదాటి వయసే పొంగే లోలో.. కనులుదాటి చూపే పొంగే/అడుగుదాటి పరుగే పొంగే/హద్దు దాటి హాయే పొంగే.. నీ చిలిపి నవ్వుల్లో తూరుపువో నువ్వు, వేకువవో నువ్వు, సూర్యుడివో నువ్వు నా నింగికి../జాబిలివో నువ్వు, వెన్నెలవో నువ్వు, తారకవో నువ్వు నా రాత్రికి.. ఎంతవరకు.. ఎందుకొరకు... చిత్రం: గమ్యం సంగీతం: ఈఎస్ మూర్తి, అనీల్ గానం: రంజిత్ సాహిత్యం: సిరివెన్నెల ఎంతవరకు ఎందుకొరకు వింత పరుగు అని అడక్కు/గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు/ప్రశ్నలోనే బదులు ఉందే గురుతు పట్టే గుండెనడుగు/ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా/తెలిస్తే ప్రతి చోట నిను నువ్వే కలుసుకుని పలకరించుకోవా/ కనపడవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు/అడగరే ఒక్కొక్క అల పేరు/మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు/పలకరే మనిషి అంటే ఎవరు../సరిగా చూస్తున్నదా నీ మది, గదిలో నువ్వే కదా ఉన్నది/ చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది/నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా/మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా, కాదా... మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై/నీడలు నిజాల సాక్ష్యాలే/శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే/ఋతువులు నీ భావ చిత్రాలే/ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం/మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యము/పుటక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ/జీవిత కాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ... అరెరె.. అరెరే.. చిత్రం: హ్యాపీ డేస్ సంగీతం: మిక్కీ జె మేయర్ గానం: కార్తీక్ సాహిత్యం: వనమాలి అరరే అరరే మనసే జారే అరరే అరరే వరసే మారే/ ఇదివరకెప్పుడూ లేదే, ఇది నా మనసే కాదే/ఎవరేమన్నా వినదే, తన దారేదో తనదేఅంతా నీ మాయలోనే, రోజూ నీ నామస్మరణే/ప్రేమా ఈ ఇంతలన్నీ నీ వల్లనేస్నేహమేరా జీవితం అనుకున్నా/ఆజ్మేరా ఆశలే కనుగొన్నా/మలుపులు ఎన్నైనా/ముడిపడిపోతున్నా/ఇక సెకనుకెన్ని నిమిషాలో, అనుకుంటు రోజు గడపాలా/మది కోరుకున్న మధుబాలా, చాల్లే నీ గోలాచిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే/చెంత చేరి, చిత్రమే చూస్తున్నా/చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మా/తెలుగింటి లోని తోరణమా, కనుగొంటి గుండె కలవరమా/ అలవాటు లేని పరవశమా వరమా హాయ్ రామా నాలో ఊహలకు... చిత్రం: చందమామ సంగీతం: కె.ఎం.రాధాకృష్ణన్ గానం: ఆశా భోంస్లే సాహిత్యం: అనంత శ్రీరామ్ నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ/నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావూ/పరుగులుగా... పరుగులుగా.../అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయీ/నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూకళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే/పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే/శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమవుతుంది ఇలామౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ/మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ/నిన్ను చూస్తూ... ఆవిరవుతూ... అంతమవ్వాలనేపరుగులుగా... పరుగులుగా... అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయీ/నాలో ఊహలకు... నాలో ఊసులకు... అడుగులు నేర్పావూ.... అపుడో ఇపుడో ఎపుడో... చిత్రం: బొమ్మరిల్లు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గానం: సిద్ధార్థ్ సాహిత్యం: అనంత శ్రీరామ్ అపుడో ఇపుడో ఎపుడో కలగన్ననే చెలి/అకడో ఇకడో ఎకడో మనసిచ్చానే మరి/కలవో అలవో వలవో నా ఊహల హాసిని/మదిలో కధలా మెదిలే నా కలల సుహాసిని/ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేననితీపికన్నా ఇంకా తీయనైన పేరే ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే/హాయికన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే/నీలాల ఆకాశం ఆ నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానేనన్ను నేనే చాల తిట్టుకుంటా నీతో సూటిగా ఈ మాటలేవి చెప్పక పొతుంటే/నన్ను నేనే బాగా మెచ్చుకుంటా ఎదో చిన్నమాటే నువ్వు నాతో మాటాడావంటే/నాతోనే నేనుంటా నీ తోడే నాకుంటే ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే.... వాజీ వాజీ వాజీ... చిత్రం: శివాజీ సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ గానం: హరిహరన్, మధుశ్రీ సాహిత్యం: సుద్దాల అశోక్‌తేజ పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్..లవ్వల్లే మువ్వల్ మువ్వల్../నా తీయని ఆశల పూల తడీ..నీ లావణ్యానికి మొక్కుబడి../నీ కాటుక కళ్ళకు జారిపడీ..పని బడీ ఇటు చేరితి పైనబడీ/వాజీ..వాజీ..వాజీ..రారాజే నా శివాజీ... /వాజీ..వాజీ..వాజీ..రేరాజే నా శివాజీ.../చూపే కత్తి కదూ..అది నా సొత్తు కదూ..నీలో ఆశలు నా తనువంతా పూజల్లు../ఎద గుత్తుల తోనే గట్టిగ ఇప్పుడే ..గుండె ముట్టి వెళ్ళు../వాహ్ జీ..వాహ్ జీ..వాహ్ జీ.. రారాజే నా శివాజీ...ఉవాహ్ జీ..వాహ్ జీ..వాహ్ జీ.. రేరాజే నా శివాజీ.../సిరివెన్నెలవె..మెలిక మల్లికవే..విరితేనియవే..ఇక ఊ అనవే..నా కౌగిలిలో ఇలా ఇలా కరగా../పుత్తడి బొమ్మ ఇదీ..సుందరిని పొందులో నలిపెయ్ రా..ఆ..ఆ../పుత్తడి బొమ్మ ఇదీ..సుందరిని పొందులో నలిపెయ్ రా/విధికి తలవంచని రణధీరా..ఎదకు ఎద సరసన కలిపెయ్ రా../ఓ..మాటలతో ఎందుకే చెలియా..చేతలతోనే..(రతీమగని) ధీటునే../వాహ్ జీ..వాహ్ జీ..వాహ్ జీ.. రారాజే నా శివాజీ.../వాహ్ జీ..వాహ్ జీ..వాహ్ జీ.. రేరాజే నా శివాజీ.../పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్..లవ్వల్లే మువ్వల్ మువ్వల్../పసి జాణ ఇదీ..తన వూసులతో..కసి తళుకులతో నను లాగెనులే..అది పొంగులుగా సుఖంసుఖం ఇంకా../ఆనంద సందడిలో చందురిని మోముగా మలచుకోనా..ఆ..ఆ../తారలిక జతులతో ఆడే..వెన్నెలను వేదిక చేసేనా..ఆ..ఆ../అరెరె అల్లరి చేసే ..చిన్నది చూస్తే పాలరాతి బొమ్మరో../వాజీ..వాజీ..వాజీ..రారాజే నా శివాజీ.../వాజీ..వాజీ..వాజీ..రేరాజే నా శివాజీ.../పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్..లవ్వల్లే మువ్వల్ మువ్వల్.. /నా తీయని ఆశల పూల తడీ..నీ లావణ్యానికి మొక్కుబడి../నీ కాటుక కళ్ళకు జారిపడీ..పనిబడీ ఇటు చేరితి పైనబడీ... ఉప్పొంగెలే గోదావరి... చిత్రం: గోదావరి సంగీతం: కెఎమ్. రాధకృష్ణ గానం: ఎస్.పి. బాలసుబ్రమణ్యం సాహిత్యం: వేటూరి ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి/భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి/వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి/శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి/వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా/చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా/ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి/భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరిసావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం/వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం/ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం/ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం/ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ/నది ఊరేగింపులో పడవ మీదలాగా/ప్రభువు తాను కాగాగోదారమ్మ కుంకంబొట్టు దిద్ది మిరప ఎరుపు/లంకానాథుడింక ఆగనంటూ పండు కొరుకు/చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి/సందేహాల మబ్బే పట్టే చూసే కంటికి/లోకంకాని లోకంలోన ఏకాంతాల వలపు/అల పాపికొండల నలుపు కడగలేక/నవ్వు తనకు రాగా వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి/శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి/వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా/చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా గల గల పారుతున్న.. చిత్రం: పోకిరి సంగీతం: మణిశర్మ గానం: నిహాల్ సాహిత్యం: కందికొండ గల గల పారుతున్న గోదారిలా.. జల జల జారుతుంటే కన్నీరలా (2) / నాకోసమై నువ్వలా.. కన్నీరులా మారగా.. నాకెందుకో ఉన్నదీ.. హాయిగా (2) / గల గల పారుతున్న గోదారిలా.....వయ్యారి వానలా.. వాన నీటిలా ధారగా.. వర్షించి నేరుగా వాలినావిలా నాపైన / వెళ్లేటి దారుల వేచి నువ్విలా చాటుగా.. పొమ్మన్న పోవెలా చేరుతావిలా నాలోనా / ఓ ఓ.. ఈ అల్లరి.. ఓ.. ఓ.. బాగున్నదీ / గల గల పారుతున్న గోదారిలా.. జల జల జారుతుంటే కన్నీరలా (2)చామంతి రూపమా.. తాలలేవుమా రాకుమా / ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా / హిందోళ రాగమా మేళ తాళమా గీతమా / కన్నీటి సవ్వడీ హాయిగున్నదీ ఏమైనా / ఓ.. ఓ.. ఈ లాహిరి.. ఓ.. ఓ.. నీ ప్రేమది.. / గల గల పారుతున్న గోదారిలా..... పిలిచినా రానంటావా... చిత్రం: అతడు సంగీతం: మణిశర్మ గానం : కార్తీక్, కవితా సుబ్రమణ్యం సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి పిలిచినా రానంటావా/కలుసుకోలేనంటావా /నలుగురూ ఉన్నారంటావా ఓ ఓ ఓ .. చిలిపిగా చెంతకు రాలేవా/తెలివిగా చేరే తోవా.. తెలియనే లేదా బావా/అటు ఇటూ చూస్తూ ఉంటావా ఓ ఓ ఓ .. తటపటాయిస్తూ ఉంటావా/సమయం కాదంటావా/సరదా లేదంటావా/సరసం చేదంటావా బావా/చనువే తగదంటావా/మనవే విననంటావా వరసై ఇటు రమ్మంటే నా మాట మన్నించవా/ డోలుబాజాలా ఇలా నా వెంట పడతావా/చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా/హేయ్ .. డోలుబాజాలా ఇలా నా వెంట పడతావా/చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా/కనులుంటే సొగసే కనపడదా/మనసుంటే తగు మార్గం దొరకదా/రాననకా .. రాననకా .. రాననకా/అనుకుంటే సరిపోదే వనితా/అటుపై ఏ పొరబాటో జరగదా రమ్మనకా .. రమ్మనకా .. రమ్మనకా../పెరిగిన దాహం తరగదే పెదవుల తాకందే తరిమిన తాపం తాళదే మదనుడి బాణం తగిలితే/చాల్లే బడాయి నాతో లడాయి తగ్గించవోయీ అబ్బాయీ హవ్వా హవ్వాయీ అమ్మో అమ్మాయీ విన్నానులే/బ్రేక్ ఇట్ డౌన్/హవ్వా హవ్వాయీ అమ్మో అమ్మాయీ విన్నాం కదా నీ సన్నాయీ/హవ్వా హవ్వాయీ అమ్మో అమ్మాయీ విన్నాం కదా నీ సన్నాయీ/పిలిచినా రానంటవా కలుసుకోలేనంటావా/నలుగురూ ఉన్నారంటావా ఓ ఓ ఓ .. చిలిపిగా చెంతకు రాలేవా/మొహమాటం పడతావా అతిగా సుకుమారం చిటికేస్తే చొరవగా చేరవుగా .. చేరవుగా .. చేరవుగా../ఇరకాటం పెడతావె ఇదిగా అబలా నీ గుబులేంటే కుదురుగా ఆగవుగా .. ఆగవుగా .. ఆగవుగా../దర్శనమిస్తే సులువుగా అలుసుగ చూస్తావా సరసకు వస్తే దురుసుగా మతిచెడిపోదా మరదలా/వరాల బాలా వరించువేళా వరించనంటూ తగువేలా నిగారమిట్టా జిగేలనాలా జనం చెడేలా/ఎవ్రిబడీ ../నిగారమిట్టా జిగేలనాలా జనం చెడేలా జవరాలా నిగారమిట్టా జిగేలనాలా జనం చెడేలా జవరాలా... రా రా.. చిత్రం: చంద్రముఖి సంగీతం: విద్యాసాగర్ గానం: నిత్యశ్రీ, శంకర్ మహదేవన్ రచన: భువనచంద్ర రారా... రారా...రారా..రారా.. రారా... సరసకు రారా రారా..చెంతకు చేరా...ప్రాణమే నీదిరా... ఏలుకో రా దొరా.. శ్వాసలో శ్వాసవై రారా../తోంతోంతోం...తోంతోంతోం... ఆఆఆఆఆ...దిరనన దిరనన దిరనన దిరనన... ఆఆఆఆ/దిరనన దిరనన దిరనన దిరనన....... ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ....ఆఆఆఆఆఆఆఆఆ...నీ పొందు నే కోరి అభిసారికై నేను వేచాను సుమనోహరా../ఆఆఆఆ... కాలాన మరుగైన ఆనంద/రాగాలు...వినిపించ నిలిచానురా.../తనన ధీంత ధీంత ధీంతన...తనన ధీంత ధీంత ధీంతన... తనన ధీంత ధీంత ధీంతన..ధీంతనా../వయసు జాలమోపలేదురా.. మరులుగొన్న చిన్న దాన్నిరా.. తనువు బాధ తీర్చ రావెర.. రావెరా../సలసలసలసల రగిలిన పరువపు సొద ఇది.. తడి బుడి తడి బుడి తపనల స్వరమిది...రారా.../లకలక లకలక లకలక లకలక/ఏ బంధమో ఇది ఏ బంధమో.. ఏ జన్మ బంధాల సుమగంధమో.../ఏ స్వప్నమో ఇది ఏ స్వప్నమో.. నయనాల నడయాడు తొలి స్వప్నమో../విరహపు వ్యథలను వినవా.. ఈ తడబడు తనువును తరవా../మగువల మనసులు తెలిసి.. నీ వలపును మరుచుట సులువా../ఇది కనివిని ఎరుగని.. మనుసుల కలయిక... సరసకు పిలిచితి.. నిరసన తగదిక/ జిగిబిగి జిగిబిగి సొగసుల మొరవిని..మిలమిల మొగసిరి మెరుపు మెరియగ రారా..రారా..ఉలకలక లకలక లకలక లకలక... తాం తరికిట ..ధీం తరికిట..తోం తరికిట..నం తరికిట...తత్తత్తరికిట ధిత్తిత్తిరికిట నం తరికిట... తళాంగు తకజోం..తదింత నకజోం.. తళాంగు తకజోం.. తదింత నకజోం.. తళాంగు తకజోం.. తదింత నకజోం... జగమంత కుటుంబం... చిత్రం: చక్రం సంగీతం: చక్రి గానం: శ్రీ సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది/సంసార సాగరం నాదే.. సన్యాసం శూన్యం నావే/కవినై, కవితనై, భార్యనై, భర్తనై/మల్లెల దారిలో మంచు ఎడారిలో/పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల/నాతో నేను అనుగమిస్తూ.. నాతో నేనే రమిస్తూ/ఒంటరినై అనవరతం/కంటున్నాను నిరంతరం కలల్ని, కథల్ని, మాటల్ని, పాటల్ని, రంగుల్ని, రంగవల్లుల్ని, కావ్యకన్యల్ని, ఆడపిల్లల్ని/ మింటికి కంటిని నేనై.. కంటను మంటను నేనై/మంటల మాటున వెన్నెల నేనై/వెన్నెల పూతల మంటను నేనై/రవినై, శశినై, దివమై, నిశినై.. నాతో నేను సహగమిస్తూ.. నాతో నేనే రమిస్తూ.. ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం... కిరణాల్ని, కిరణాల హరిణాల్ని, హరిణాల చరణాల్ని, చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని, ఇంద్రజాలాన్ని/ గాలి పల్లకిలోన తరలి నాపాట పాప ఊరేగివెడలె/గొంతువాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండెమిగిలే, నా హృదయమే నా లోగిలి/నా హృదయమే నా పాటకి తల్లి/నా హృదయమే నాకు ఆలి/నా హృదయములో ఇది సినీవాలి చంద్రుడిలో ఉండే కుందేలు... చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా! సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గానం: శంకర్ మహదేవన్ సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి చంద్రుడిలో ఉండే కుందేలు కిందికొచ్చిందా/ కిందికొచ్చి నీలా మారిందా/తందానా.. తందానా/ చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా/నిన్ను మెచ్చి నీలో చేరిందా/నువ్వలా సాగే తోవంతా/నావలా తూగే నీవెంట..నీవెంట/నువ్వెల్లే దారే మారిందా/నీవల్లే తీరే మారి ఏరై పారిందోమే నేలంతా...గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా.. తెలుసా ఎక్కడ వాలాలో../నవ్వులే తీసుకువచ్చావే ఈడు సంబరమా... తెలుసా ఎవ్వరికివ్వాలో... కూచుపూడి అన్నపదం కొత్త ఆట నేర్చిందా/పాటలాంటి లేత పదం పాఠశాలగా../కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా/జావలీల జాన తనం బాట చూపగా/కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేనా/అంతటా ఎన్నో వర్ణాలు.. /మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా/ఇంతలో ఏవో రాగాలు/ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా/ సాగుతున్న ఈ పయనం ఎంతవరకో/ రేపు వైపు ముందడుగా లేనిపోని దుందుడుకా/రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో/మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెం తంటే.. లెక్కలే మాయమైపోయే/ రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే.. దిక్కులే తత్తర పడిపోవా కన్నుల బాసలు.. చిత్రం: 7/జి బృందావన కాలని సంగీతం: యువన్ శంకర్ రాజా గానం: కార్తీక్ సాహిత్యం: శివ గణేష్, ఎ.ఎమ్. రత్నం కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే/ఒకవైపు చూపి మరువైపు దాచగఅద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే/ఇది అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మోయలేవులే/గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే/దెబ్బలెన్ని తిన్న గాని మనసు మాత్రం మారదులే/ఒకపరి మగువ చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే/అనుదినము ఇక తపియించే యువకుల మనసులు తెలియవులేఅడవిలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరులే/ కన్నుల అనుమతి పొందీ ప్రేమ చెంతకు చేరదులే/దూరాన కనపడు వెలుగు దారికే చెందదులే/మెరుపుల వెలుగును పట్టగ మిణుగురు పురుగుకి తెలియదులే../కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు సొంతమట/ అల కడలిదాటగానే నురుగులిక ఒడ్డుకు సొంతమట/లోకాన పడుచులు ఎందరున్నను మనసొకరిని మాత్రమే వరియించులే/ఒకపరి దీవించ ఆశించగా అది ప్రాణంతోనే ఆటాడులే/మంచు బిందువొచ్చి ఢీకొనగా ఈ ముల్లే ముక్కలు అయిపోయెలే/భువిలో ఉన్న అబద్ధాలే అరె చీరను కట్టి స్త్రీ ఆయెలే/ఉప్పెనొచ్చిన కొండ మిగులును చెట్లు చామలు మాయవునులే/నవ్వు వచ్చులే ఏడుపొచ్చులే ప్రేమలో రెండూ కలిసివచ్చులే/ఒకపరి మగువ చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే/అనుదినము ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే/గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే/దెబ్బలెన్ని తిన్న గాని మనసు మాత్రం మారదులే యమునా తీరం... చిత్రం: ఆనంద్ సంగీతం: కె.ఎమ్. రాధకృష్ణ గానం: హరిహరన్, చిత్ర సాహిత్యం: వేటూరి యమునా తీరం సంధ్యా రాగం/యమునా తీరం సంధ్యా రాగం/నిజమైనాయి కలలు/నీలా రెండు కనులలో/నిలువగనే తేనెల్లో పూదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో/మరువకుమా ఆనందమానందమాందమాయేటి మనసు కథా/ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం/చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం/శిశిరంలో చలి మంటై రగిలేదే ప్రేమా/చిగురించే ఋతువల్లే విరబూసే ప్రేమా/ ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా/ పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా/శి«థిలంగా విధినైనా చేసేదే ప్రేమా/హృదయంలా తనదైనా మరిచేదే ప్రేమా/ మరువకుమా ఆనందమానందమాందమాయేటి మనసు కథా మౌనంగానే ఎదగమని... చిత్రం: నా ఆటోగ్రాఫ్ స్వీట్‌మెమొరీస్ సంగీతం: ఎమ్.ఎమ్ కీరవాణి గానం: చిత్ర సాహిత్యం: చంద్రబోస్ మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది.. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది/ అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది/ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది/మౌనం../దూరమెంతో ఉందని, దిగులు పడకు నేస్తమా.. దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా.. భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా.. బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా../సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది/అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుంది.. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది/చెమటనీరు చిందగా నుదుటి రాత మార్చుకో.. మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో.. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో.. మారిపోని కథలే లేవని గమనించుకో/తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి/మా ధైర్యాన్ని దర్శించి, దైవాలే తలదించగా.. మా ధైర్యాన్ని దర్శించి, దైవాలే తల దించగా.. నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి/అంతులేని చరితలకి.. ఆది నువ్వు కావాలి/మౌనంగానే.. పెదవే పలికిన... చిత్రం: నాని సంగీతం: ఎఆర్. రెహమాన్ గానం: ఉన్నికృష్ణన్, సాధన సర్గం సాహిత్యం: చంద్రబోస్ పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా.. కదిలే దేవత అమ్మా.. కంటికి వెలుగమ్మా/తనలోని మమతే కలిపి పెడుతుంది ముద్దగా/తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ/మనలోని ప్రాణం అమ్మ.. మనదైన రూపం అమ్మ.. ఎనలేని జాలి గుణమే అమ్మ/నడిపించే దీపం అమ్మ.. కరుణించే కోపం అమ్మ/వరమిచ్చే తీపి శాపం అమ్మ/నా ఆలి అమ్మగా అవుతుండగా.. జో లాలి పాడనా కమ్మగా కమ్మగా/పెదవే../పొత్తిల్లో ఎదిగే బాబు.. నా ఒళ్లో వదిగే బాబు..ఇరువురికి నేను అమ్మవ్వనా/నా కొంగు పట్టేవాడు.. నా కడుపున పుట్టేవాడు.. ఇద్దరికి ప్రేమ అందించనా../నా చిన్ని నాన్నని, వాడి నాన్నని, నూరేళ్లు సాకన చల్లగా చల్లగా/ఎదిగి ఎదగని ఓ పసికూన ముద్దుల కన్నా జోజో, బంగరు తండ్రి జో జో.. బొజ్జో లాలి జో/పలికే పదమే వినక కనులారా నిదురపో.. కలలోకి నేను చేరి పంచుతాను తదుపరి ప్రేమమాధురి/ఎదిగి ఎదగని చెలియ చెలియా... చిత్రం: ఘర్షణ సంగీతం: హారిస్ జయరాజ్ గానం: కె.కె., సుచిత్ర సాహిత్యం: కులశేఖర్ చెలియ చెలియా చెలియా చెలియా.. అలల ఒడిలో ఎదురు చూస్తున్నా/తనువు నదిలో మునిగి ఉన్నా, చెమట జడిలో తడిసిపోతున్నా/చిగురు ఎదలో చితిగామారినది, విరహ జ్వాలే సెగలు రేపినది, మంచు కురిసింది చిలిపి నీ ఊహలో/కాలమంతా మనది కాదు అని, జ్ఞాపకాలే చెలిమి కానుకని, వదిలిపోయావు న్యాయమా ప్రియతమా../చెలియా/శ్వాస నీవే తెలుసుకోవె, స్వాతి చినుకై తరలిరావే, నీ జతే లేనిదే నరకమే ఈ లోకం/జాలి నాపై కలగదేమే, జాడ అయినా తెలియదేమే, ప్రతిక్షణం మనసిలా వెతికినే నీకోసం/ఎందుకమ్మా నీకీ మౌనం, తెలిసి కూడా ఇంకా దూరం, పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా../గుండెలోన వలపు గాయం, మంట రేపే పిదప కాలం, ప్రణయమా.. ప్రణయమా.. తెలుసునా నీకైనా/దూరమైన చెలిమి దీపం, భారమైన బతుకు శాపం, ప్రియతమా.. హృదయమా.. తరలిరా నేడైనా/కలవు కావా నా కనుల్లో.. నిముషమైనా నీ కౌగిలిలో.. సేదతీరాలి, చేరవా నేస్తమా/చెలియా.. నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా.. చిత్రం: వర్షం సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గానం: చిత్ర, రకీబ్ అలమ్ సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి చినుకురవ్వలో... చినుకురవ్వలో.. చిన్నదాని సంబరాల చిలిపినవ్వులో... /పంచవన్నె చిలకలల్లె వజ్రాల తునకలల్లె వయసు మీద వాలుతున్న వాన గువ్వలో.../ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన/ఎన్నాళ్లని దాక్కుంటావే పైనా/చుట్టంలా వస్తావే/చూసెళ్లిపోతావే/ అచ్చంగా నాతోనే నిచ్చం ఉంటానంటే చెయ్యారా చేరదీసుకోనా/నువ్వొస్తానంటే నేనొద్దంటానా/ ముద్దులొలికే ముక్కుపుడకై ఉండిపోవే ముత్యపు చినుకా/చెవులకు సన్నా జూకాల్లా్లగా చేరుకోవే జిలుగుల చుక్క/ చేతికి రవ్వల గాజుల్లాగా.. కాలికి మువ్వల పట్టీల్లాగా.. మెడలో పచ్చల పతకంలాగా.. వదలకు నిగనిగ నిగలను తొడిగేలా.. /నువ్వొస్తానంటే నేనొద్దంటానా/చిన్ననాటి తాయిలంలా నిన్ను నాలో దాచుకోనా/కన్నెయీటి సోయగంలా నన్ను నీలా పోల్చుకోనా/పెదవులు పాడే ∙కిలకిలలోనా.. పదములు ఆడే కథకళిలోనా.. కనులను తడిపే కలతలలోనా.. నా అణువణువున నువు కనిపించేలా../నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఫీల్ మై లవ్ చిత్రం: ఆర్య సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గానం: కె.కె. సాహిత్యం: చంద్రబోస్ ఫీల్ మై లవ్/నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను శాపంగానో, చెలియా ఫీల్ మై లవ్/నా ప్రేమను భారంగానో, నా ప్రేమను దూరంగానో, నా ప్రేమను నేరంగానో... సఖియా ఫీల్ మై లవ్/నా ప్రేమను మౌనంగానో, నా ప్రేమను హీనంగానో, నా ప్రేమను శూన్యంగానో కాదో లేదో ఏదో గానో... ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్/హే... నేనిచ్చే లేఖలన్నీ చించేస్తు ఫీల్ మై లవ్/నే పంపే పువ్వులనే విసిరేస్తు ఫీల్ మై లవ్/నే చెప్పే కవితలన్నీ ఛీ కొడుతు ఫీల్ మై లవ్/నా చిలిపి చేష్టలకే విసుగొస్తే ఫీల్ మై లవ్/నా ఉనికే నచ్చదంటూ నా ఊహే రాదని, నేనంటే గిట్టదంటు నా మాటే చేదని, నా చెంతే చేరనంటు అంటూ అంటూ అనుకుంటూనే.. ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్/ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా ఫీల్ మై లవ్/ఏదోటి తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్/విదిలించి కొడుతూనే చెయ్యారా ఫీల్ మై లవ్/వదిలేసి వెళుతూనే అడుగారా ఫీల్ మై లవ్/అడుగులకే అలసటొస్తే, చేతికి శ్రమ పెరిగితే, కన్నులకే కునుకు వస్తే, పెదవుల పలుకాగితే/ఆ పైన ఒక్కసారి హృదయం అంటు నీకొకటుంటే.... ఫీల్ మై లవ్... ఫీల్ మై లవ్... ఓ మగువా నీతో... చిత్రం: సత్యం సంగీతం– గానం: చక్రి సాహిత్యం: భాస్కరభట్ల ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా.. కాళిదాసులాగమారి కవితే రాసేశా/ఫుడ్డు లేకపోయినా, బెడ్డు లేకపోయినా, పగలు రాత్రి వెతికీ వెతికీ నీకే లైనేశా/ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా... దేవదాసులాగమారి గడ్దం పెంచేశా/ఫుడ్డు లేకపోయినా, బెడ్డు లేకపోయినా, పగలు రాత్రి వెతికీ వెతికీ నీకే లైనేశా/ట్రిపుల్ ఎక్స్ రమ్ములోన కిక్కులేదు హల్లో మైనా.. నీ లుక్సే చూడబోతే మత్తులోకి దించేనా/సన్‌లైట్ వేళ నుంచి మూన్లైట్ వేళ్లేదాకా.. ఫుల్ టైమ్ నా గుండెల్లో హార్టులన్ని నీవేగా.. ఓ లలనా ఇది నీ జాలమా.. నీ వలన మనసే గాయమా.. కుదురేమో లేదాయే నువ్వు నమ్మవుగానీ కలవరమాయే/ఓ మగువా../కో అంటే కోటి మంది అందగత్తెలున్నా గానీ.. నీ జంటే కోరుతుంటే దంచుతావె కారాన్ని/క్రేజీగా ఉంటే చాలు ప్రేమలోన పడతారండి, ట్రూ లవ్వే చూపుతుంటే పెంచుతారు దూరాన్ని/ఓ మగువా నీకే న్యాయమా.. ఎదలో ప్రేమే శాపమా../మనసేమో బరువాయే.. నీ మాటలు లేక మోడైపోయే/ఓ మగువా.... రామా రామా.. చిత్రం: శివమణి సంగీతం: చక్రి గానం: కౌసల్య సాహిత్యం: కందికొండ రామా రామా రామా నీలి మేఘ శ్యామా/రావా రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ/మా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే/కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే/నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా/రెప్పలు మూయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా/రామా.. రామా.... నువ్వే నా శ్వాస... చిత్రం: ఒకరికి ఒకరు సంగీతం: ఎమ్.ఎమ్. కీరవాణి గానం: శ్రేయా ఘోషల్ సాహిత్యం: చంద్రబోస్ నువ్వే నా శ్వాస.. మనసున నీకై అభిలాష/బ్రతుకైన నీతోనే.. చితికైన నీతోనే/వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ/ఓ ప్రియతమా.. ఓ ప్రియతమా../పువ్వుల్లో పరిమళాన్ని పరిచయమే చేసావు/తారల్లో మెరుపులన్ని దోసిలిలో నింపావు/మబ్బుల్లో చినుకులన్ని మనసులోన కురిపించావు/నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా/నీ జ్ఞాపకాలన్నీ ఏ జన్మలోనైనా నే మరువలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ/ఓ ప్రియతమా.. ఓ ప్రియతమా../సూర్యునితో పంపుతున్నా అనురాగపు కిరణాన్ని/గాలులతో పంపుతున్నా ఆరాధన రాగాన్ని/ఏరులతో పంపుతున్నా ఆరాటపు ప్రవాహన్ని/దారులతో పంపిస్తున్నా అలుపెరుగని హృదయలయలని/ఏ చోట నువ్వున్నా నీ కొరకు చూస్తున్నా/నా ప్రేమ సందేశం విని వస్తావని, చిన్ని ఆశ... ఓ ప్రియతమా.. ఓ ప్రియతమా.. కొడితే కొట్టాలిరా... చిత్రం: ఠాగూర్ సంగీతం: మణిశర్మ గానం: శంకర్ మహదేవన్ సాహిత్యం: చంద్రబోస్ కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలి../బాటేదైనా గాని మునుముందుకెళ్లాలి.. పోటీ ఉన్నా గాని గెలుపొంది తీరాలి/ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి/చిందే వెయ్యాలి నటరాజులాగ.. నవ్వే చిందాలీ నెలరాజులా/మనసే ఉండాలీ మహారాజులాగ... ముగిసీపోవాలి రాజు పేద తేడాలన్నీ/కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలి/చెయ్యి ఉంది నీకు చెయ్ కలిపేటందుకే.. చూపున్నది ఇంకొకరికి దారి చూపేటందుకే/మాట ఉంది నీకు మాటిచ్చేటందుకే మనసున్నది ఆ మాటను నెరవేర్చేటందుకే/ఆరాటం నీకుందీ ఏ పనైనా చెయ్యడానికే/అభిమానం తోడుందీ ఎందాకైనా నడపడానికే/ఆ ప్రాణం దేహం జీవం ఉంది పరుల సేవకే/చేసే కష్టాన్నీ నువ్వే చెయ్యాలి..పొందే ఫలాన్నీ పంచివ్వాలి/అందరి సుఖాన్నీ నువ్వే చూడాలి... ఆ విధి రాతనీ చెమటతోనే చెరిపెయ్యాలి/పెద్ద వాళ్లకెప్పుడు నువ్వు శిరస్సు వంచరా..అరె చిన్నవాళ్లనెప్పుడు ఆశీర్వదించరా/లేనివాళ్లనెప్పుడు నువ్వు ఆదరించరా...ప్రతిభ ఉన్న వాళ్లనెప్పుడు నువ్వు ప్రోత్సహించరా/శరణంటూ వచ్చేసే..శత్రువు నైనా ప్రేమించరా/సంఘాన్నే పీడించే...చీడను మాత్రం తుంచెయ్యరా/ఈ ఆశాజీవీ చిరంజీవి సూత్రమిదేరా/దేవుడు పంపిన తమ్ముళ్లే మీరు రక్తం పంచినా బంధం మీరు/చుట్టూ నిలిచినా చుట్టాలే మీరు నన్నే చూపినా అద్దాలంటే మీరే మీరే... ఎగిరి దుమికితే... చిత్రం: బాయ్స్ సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ గానం: చిత్ర, కార్తిక్ సాహిత్యం: ఎ.ఎం.రత్నం ఎగిరి దుమికితే నింగి తగిలెను.. పదములు రెండూ పక్షులాయెను.. వేళ్ల చివర పూలు పూచెను..కనుబొమ్మలే దిగి మీసమాయెను.. అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె/హే.. ఆనంద బాష్పాల్లో మునిగా... ఒక్కొక్క పంటితో నవ్వా...కలకండ మోసుకుంటూ నడిచా ఒక చీమై... నే నీళ్ళల్లో పైపైనే నడిచా ఒక ఆకై...అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె/అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె/ప్రేమను చెప్పిన క్షణమే.. అది దేవున్ని కన్న క్షణమేగాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ...(2) ఎగిరి దుమికితే../నరములలో మెరుపురికెనులే.. తనువంతా వెన్నెలాయెనులే../చందురుని నువు తాకగనే.. తారకలా నే చెదిరితినే.../మనసున మొలకే మొలిచెను.. అది కరువై తలనే దాటలే.. అలె.. అలె../నే చలనం లేని కొలనుని, ఒక కప్ప దూకగా ఎండితిని/ప్రేమను చెప్పిన క్షణమే.. అది దేవున్ని కన్న క్షణమే... గాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ.../ఎగిరి దుమికితే.../ఇసకంతా ఇక చక్కెరయా.. కడలంతా మరి మంచినీరా../ తీరమంతా నీ కాలిగుర్తులా.. అలలన్నీ నీ చిరునవ్వులా../కాగితం నాపై ఎగరగ అది కవితల పుస్తకమాయెనులే.. అలె.. అలె../హరివిల్లు తగులుతూ ఎగరగ... ఈ కాకి కూడా నెమలిగా మారెనులే../ప్రేమను చెప్పిన క్షణమే... నువ్వు నేను కలిసుంటేనే.. చిత్రం: గంగోత్రి సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి గానం: బాలు, మాళవిక సాహిత్యం: చంద్రబోస్ నువ్వునేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం..నువ్వునేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం/నువ్వునన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిశాకా../నువ్విక్కడుండి నేనక్కడుంటే నువ్విక్కడుండీ నేనక్కడుంటే ఎంతో కష్టం../ఎగరేసిన గాలిపటాలే ఎదలోతుకు చేరుతాయని..రుచి చూసిన కాకి ఎంగిళ్లే అభిరుచులను కలుపుతాయని/తెగతిరిగిన కాలవగట్లే కథ మలుపులు తిప్పుతాయని.. మనమాడిన గుజ్జనగూళ్లే ఒక గూటికి చేర్చుతాయని/లాలించి పెంచినవాడే ఇకపై నన్ను పరిపాలిస్తాడని తెలిశాకా.../నువ్విక్కడుండి నేనక్కడుంటే నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం../ఆ బడిలో పాఠాలే మన ప్రేమని దిద్దుతాయని..ఆ రైలు పట్టాలే పల్లకిని పంపుతాయని../రాళ్లల్లో మన పేర్లే శుభలేఖలు చూపుతాయనీ../ఆ బొమ్మల పెళ్లిళ్లే ఆశీస్సులు తెలుపుతాయని../తనకే నే నేర్పిన నడకలు ఏడడుగులుగా ఎదిగొస్తాయని తెలిశాకా../నువ్వునేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం..నువ్వునేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం/నువ్వునన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిశాకా../నువ్విక్కడుండి నేనక్కడుంటే నువ్విక్కడుండీ నేనక్కడుంటే ఎంతో కష్టం.. నువ్వు నువ్వు... చిత్రం: ఖడ్గం సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గానం: సుమంగళి సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి నువ్వు నువ్వు నువ్వు.. నువ్వు నువ్వు../నువ్వు.. నువ్వు... నువ్వు../నాలోనే నువ్వు నాతోనే నువ్వు నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు/నా పెదవిపైన నువ్వు నా మెడవంపున నువ్వు..నా గుండె మీద నువ్వు... నా ఒళ్లంతా నువ్వు/బుగ్గల్లో నువ్వూ... మొగ్గల్లే నువ్వు... ముద్దేసే నువ్వూ../నిద్దర్లో నువ్వూ... పొద్దుల్లో నువ్వు ప్రతినిమిషం నువ్వూ.../నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు..నా మనసును లాలించే చల్లదనం నువ్వు/పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు..బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు/నా ప్రతి యుద్ధ నువ్వూ నా సైన్యం నువ్వు/నా ప్రియ శత్రువు నువ్వూ.. నువ్వూ../మెత్తని ముల్లై గిల్లే తొలిచినుకే నువ్వు/నచ్చే కష్టం నువ్వూ.. నువ్వూ.../నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు... నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు/ముని పంటితో నను గిచ్చే నేరానివి నువ్వు... నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు/తీరం దాహం నువ్వు నా మోహం నువ్వు/తప్పని స్నేహం నువ్వు... నువ్వూ.../తీయని గాయం చేసే అన్యాయం నువ్వు/అయినా ఇష్టం నువ్వూ.. నువ్వూ../మైమరిపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు..నే కోరుకునే నా మరోజన్మ నువ్వు/కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు../నాకే తెలియని నా కొత్తపేరు నువ్వు/నా అందం నువ్వు ఆనందం నువ్వు/నేనంటే నువ్వూ../ నా పంతం నువ్వు.. నా సొంతం నువ్వు నా అంతం నువ్వూ... నీవే నీవే.. చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సంగీతం –గానం: చక్రి సాహిత్యం: పెద్దాడ మూర్తి నీవే నీవే నీవే నేనంటా / నీవే లేక నేనే లేనంటా / వరమల్లే అందిందేమో ఈ బంధం / వెలలేని సంతోషాలే నీ సొంతం / నీవే నీవే నీవే నేనంటా / నీవేలేక నేనే లేనంటానా కలలని కన్నది నీవే / నా మెలకువ వేకువ నీవే / ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా / నా కష్టం ఇష్టం నీవే /చిరునవ్వు దిగులు నీవే / ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా / కనిపించకపోతే బెంగై వెతికావే / కన్నీరే వస్తే కొంగై తుడిచావే / నీవే నీవే నీవే నేనంటా / నీవేలేక నేనే లేనంటానే గెలిచిన విజయం నీదే / నే ఓడిన క్షణం ఓదార్పే / నా అలసట తీరే దారే నీవేగా / అడుగడుగున నడిపిన దీపమా / ఇరువురికే తెలిసిన స్నేహమా / మది మురిసే ఆనందాలే నీవేగా / జన్మిస్తే మళ్లీ నీవై పుడతాలే / ధన్యోస్మి అంటూ దణ్ణం పెడతాలే / నీవే నీవే నీవే నేనంటా / నీవే లేక నేనే లేనంటా / వరమల్లే అందిందేమో ఈ బంధం / వెలలేని సంతోషాలే నీ సొంతం చెప్పవే చిరుగాలి... చిత్రం: ఒక్కడు సంగీతం: మణిశర్మ గానం: ఉదిత్ నారాయణ్, సుజాత సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి...ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్లి/చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి..ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్లి/ఆశా దీపికలై మెరిసే తారకలు... చూసే తీపికలై విరిసే కోరికలు/మనతో జతై సాగుతుంటే...ఓ అడుగే అలై పొంగుతుంది/ చుట్టూ ఇంకా రేయున్నా.. అంతా కాంతే చూస్తున్నా/ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ...రెక్కలు విప్పుకు ఎగిరే కళ్లు..దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే/ఆపగలవా చీకట్లు.. కురిసే సుగంధాల హోలీ ఓ చూపదా వసంతాలా కేళి..చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి/యమునా తీరాల కథ వినిపించేలా..రాధా మాధవులా జత కనిపించేలా పాడని వెన్నెల్లో ఈ వేళ/ఓ చెవిలో సన్నాయి రాగంలా../కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఉయ్యాలా/లాహిరి లాహిరి లాహిరి తరంగాలా రాత్రి ఏటిని ఈదే వేళా..జాజిరి జాజిరి జాజిరి జానపదంలా పొద్దే పలకరించాలి/ఊపిరే ఉల్లాసంగా తుల్లి ఓ చూపదా వసంతాల కేళి..ఊపిరే ఉల్లాసంగా తుల్లి/చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి...ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్లి... ఉదయించిన సూర్యుడినడిగా.. చిత్రం:కలుసుకోవాలని సంగీతం – గానం – సాహిత్యం: దేవిశ్రీ ప్రసాద్ హే.. ఉదయించిన సూర్యుడినడిగా.. కనిపించని దేవుడినడిగా.. నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ / చలిపెంచిన చీకటినడిగా.. చిగురించిన చంద్రుడినడిగా.. విరబూసిన వెన్నెలనడిగా.. నువ్వెక్కడనీ / చిక్కవే హే ఓ చెలి.. నువ్వెక్కడే నా జాబిలి / ఇక్కడే హే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే / వెచ్చని నీ కౌగిలి.. చిత్రాలు చేసెనే చెక్కిలి.. ఇప్పుడు ఓ ఎప్పుడూ నే మరువలేని తీపి గురుతులే / మనసు అంతా నీ రూపం.. నా ప్రాణమంతా నీకోసం / నువ్వెక్కడెక్కడని వెతికి వెతికి అలిసిపోయే పాపం / నీ జాడ తెలిసిన ఆ నిమిషం.. అహ అంతులేని సంతోషం / ఈ లోకం అంత నా సొంతమిది ఇది ప్రేమ ఇంద్రజాలం / అడుగు అడుగునా నువ్వే నువ్వే నన్ను తాకెనే నీ చిరునవ్వే / కలల నుండి ఓ నిజమై రావే.. నన్ను చేరవే / హోయ్.. ప్రేమ పాటకు పల్లవి నువ్వే.. గుండె చప్పుడికి తాళం నువ్వే.. ఎదను మీటి సుస్వరమైనావే నన్ను చేరవే / ఉదయించిన సూర్యుడినడిగా......నువ్వు లేక చిరుగాలి నా వైపు రాను అంటోంది / నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్లే మండుతోందే / కాస్త దూరమే కదా మన మధ్య వచ్చి వాలింది.. దూరాన్ని తరిమివేసే ఘడియ మన దరికి చేరుకుంది / ఏమి మాయవో ఏమో కానీ.. నువ్వు మాత్రమే నా ప్రాణమనీ.. నువ్వు ఉన్న నా మనసంటోందే నిన్ను రమ్మనీ / హేయ్ నువు ఎక్కడున్నావోగానీ నన్ను కాస్త నీ చెంతకు రానీ నువ్వు లేక నేను లేను అని నీకు తెలుపనీ / ఉదయించిన సూర్యుడినడిగా...... చూపుల్తో గుచ్చి గుచ్చి... చిత్రం: ఇడియట్ సంగీతం: చక్రి గానం: శంకర్ మహదేవన్ సాహిత్యం: కందికొండ చూపుల్తో గుచ్చిగుచ్చి చంపకే మెరేహాయ్.. /గుండెల్ని గుల్ల చేసి జారకే మెరేహాయ్/నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్నైపోయానే/నీ కళ్లు పేలిపోను చూడవే మెరేహాయ్/నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే/ఏదోలా కొత్తగా ఉంది లోకమే హయ్ లోకమే/నిలువెల్లా నీరైపోయే దేహమే çహాయ్ దేహమే/లైఫంతా అయిపోయింది భారమే హాయ్/నీ అందం అడవైపోను..చూడవే మెరేహాయ్ /ఓలల్లా.../నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే/ నిను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే/సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే/ఛీ అంటే జిందగి మొత్తం నరకమే హాయ్/ నీ ఈడు బీడైపోను చూడవే మెరేహాయ్/ఓలల్లా ../చూపుల్తో గుచ్చిగుచ్చి చంపకే మెరేహాయ్/గుండెల్ని గుల్ల చేసి జారకే మెరేహాయ్... వెన్నెల్లో హాయ్ హాయ్... చిత్రం: ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సంగీతం– గానం: చక్రి సాహిత్యం: సాయి శ్రీహర్ష వెన్నెల్లో హాయ్ హాయ్..మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే/తప్పెట్లో హాయ్ హాయ్..ట్రంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే/మే నెల్లో ఎండ హాయ్... ఆగస్ట్‌లో వాన హాయ్/జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్/హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి/కనుల ఎదుట కలల ఫలము నిలిచినది తందానా..సుధ చిందేనా/కనులు కనని వనిత ఎవరో మనకు ఇక తెలిసేనా మది మురిసేనా/తనను ఇక ఎల్లాగైనా కళ్లారా నే చూడాలి/పగలు మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలి/మధుర లలన మదన కొలనా కమల వదన అమల సదన/వదల తరమా మదికి వశమా చిలిపి తనమా/చిత్రమైన బంధమాయె అంతలోన../అంతులేని చింతన అంతమంటు ఉన్నదేనా/వెన్నెల్లో హాయ్ హాయ్.../మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే/తప్పెట్లో హాయ్ హాయ్..ట్రంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే/మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్‌లో వాన హాయ్/జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్/హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి/గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి/మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలి ఏం చేయాలి/అసలు తను ఎల్లావుందో ఏమి చేస్తుందో ఏమోలే/స్పెషలు మనిషైనా కూడా మనకేముంది మామూలే/కళలు తెలుసా ఏమో బహుశా కవిత మనిషా కలల హంస/మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగా/మంచి పద్ధతంటూ ఉంది మదిని లాగుతున్నది.. ఎంత ఎంత వింతగున్నదీ/మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే/తప్పెట్లో హాయ్ హాయ్..ట్రంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే/మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్‌లో వాన హాయ్/జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్/హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి... దాయి దాయి దామ్మా... చిత్రం: ఇంద్ర సంగీతం: మణిశర్మ గానం: కె.కె, మహాలక్ష్మి అయ్యర్ సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ/నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ/దాయి దాయి దామ్మా పలికే గండు కోయిలమ్మ/నీపై మనసైందమ్మా నా నిండు చందమామ/ఒహూ..ఒహూ.. ఒళ్లో వాలుమా...ఒహూ..ఒహూ.. వయసే ఏలుమా/నిలువెల్లా విరబూసే నవ యవ్వనాల కొమ్మ/తొలిజల్లై తడిమేసే సరసాల కొంటెతనమా/హే దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ/నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ/దాయి దాయి దామ్మా పలికే గండు కోయిలమ్మ/నీపై మనసైందమ్మా నా నిండు చందమామ/టకటకమంటూ తలపును తట్టితికమకపెట్టే... లకుముకి పిట్ట నినువదిలితే ఎట్టా/నిలబడమంటూ నడుముని పట్ట కితకితపెట్టే... మగసిరి పిట్ట కథ ముదిరితే ఎట్టా/కేరింతలాడుతు కవ్వించలేదా.. కాదంటే ఇప్పుడు తప్పేదెలా.. అరె కాదంటే ఇప్పుడు తప్పేదెలా/నీ కౌగిలింతకు జాలంటూ లేదా ఏం దుడుకు బాబూ ఆపేదెలా..అయ్యో ఏం దుడుకు బాబూ ఆపేదెలా/ఒహూ..ఒహూ.. కోరిందే కదాఒహూ..ఒహూ.. మరే ఇందిర/మరికొంచెం అనిపించే ఈ ముచ్చటంతా చేదా/వ్యవహారం శ్రుతిమించే సుకుమారి బెదిరిపోదా/హాయి హాయి హాయే అరెరే పైట జారిపోయే.. పాప గమనించవే మా కొంప మునిగిపోయే/ పురుషుడినిట్టా ఇరుకున పెట్టే పరుగుల పరువా... సొగసుల బరువా ఓ తుంటరి మగువా/నునుపులు ఇట్ట ఎదురుగ పెట్ట ఎగబడలేవా..తగు జతకావ నా వరసై పోవా /అల్లాడిపోకే పిల్లా మరీ ఆ కళ్యాణ ఘడియా రానీయవా..ఆ కళ్యాణ ఘడియా రానీయవా/అది అందాక ఆగదు ఈ అల్లరి నీ హితబోధలాపి శ్రుతిమించవా..నీ హితబోధలాపి శ్రుతిమించవా/ఒహూ..ఒహూ.. వాటం వారెవా ఒహూ..ఒహూ.. ఒళ్లోవాలవా/అనుమానం కలిగింది నువ్వు ఆడపిల్లవేనా..సందేహం లేదయ్యో నీ పడుచు పదును పైన/హే దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ/నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ/హే హే హే హాయి హాయి హాయే కొరికే కళ్లు చెదిరిపోయే/అయినా అది కూడా ఏదో కొత్త కొంటె హాయే.. రాను రానంటూనే... చిత్రం: జయం సంగీతం: ఆర్.పి.పట్నాయక్ గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష సాహిత్యం: కులశేఖర్ ఏమైందిరా.. బాధగా ఉంది..నాకు లేని బాధ నీకెందుకురా/నీ బాధ.. నా బాధ కాదా..ఎహె రాయే.../హబ్బబ్బబా... రాను రాను ..నాను రాను కుదరదయో../వద్దు వద్దు మీద మీదా పడకురయ్యో../ సిగ్గు సిగ్గు.. సిన్నకోకా లాగకయ్యో../రాను రానంటూనే సిన్నదో సిన్నదో..రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది/కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో..తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది/పచ్చిపచ్చివంటూనే పిల్లదో పిల్లదో..పల్లట్టుకొచ్చిందో పిల్లదో పిల్లది/రాను రానంటూనే సిన్నదో సిన్నదో...రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది/ఏం పండు.. తీసుకొచ్చిందిరా అబ్బాయ్../యాపిలు పండు.. నారింజ పండు..బత్తాయి పండు.. బొప్పాయి పండు..అనస పండు.. పనస పండు..నిమ్మ పండు... దానిమ్మ పండు..మామిడి పండు... అరటి పండు../రాను అని, కాదు అని అంతలెసీ మాటలనీ..సంతకొచ్చే సూడవయ్యో సిన్నది/కాదనంటే అవుననిలే లేదనంటే ఉందనిలే..ఆడవారి మాట తీరు వేరులే/అవునా.. మైనా.. మాతో చిందెయ్ చిందెయ్ బాబోయ్.. రానోయ్.. నాకసలే సిగ్గోయ్ సిగ్గోయ్/సిగ్గు సిగ్గంటూనే సిన్నదో సిన్నదో...సీరంతా జార్చిందా సిన్నదో సిన్నది/కస్సుబుస్సంటూనే కుర్రదో కుర్రదో...కౌగిట్లో వాలిందా కుర్రదో కుర్రది/హరిలో రంగ హరి.. స్వామి రంగా హరి హరీ/ఏంటో ఎవరూ పట్టించుకోట్లేదేంటి...గాజువాక పిల్లా మేం గాజులోళ్లం కాదా..చెయ్యి చాపలేదా మా గాజు తొడగలేదా.../తప్పు అని, గిప్పు అని అందరిలో ముందరనీ..సాటుకొచ్చీ సిందులేసే సిన్నది/తప్పనంటే ఒప్పనిలే ఒప్పనంటే తప్పనిలే..సూటిగానూ సెప్పదయ్యో ఆడదీ/రావే.. పిల్లా.. ఎందుకు మళ్లాగిల్లా..ఎల్లోయ్.. ఎల్లోయ్.. ఎల్లోయ్.. ఎల్లోఎల్లోయ్/రాను రానంటూనే సిన్నదో సిన్నదో..రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది/కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో...తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది/పచ్చిపచ్చివంటూనే పిల్లదో పిల్లదో..పల్లట్టుకొచ్చిందో పిల్లదో పిల్లది... దేవుడే దిగివచ్చినా... చిత్రం: సంతోషం సంగీతం: ఆర్.పి.పట్నాయక్ గానం: కె.కె, ఉష సాహిత్యం:కులశేఖర్ దేవుడే దిగివచ్చినా స్వర్గమే నాకిచ్చినా/షాజహాన్ తిరిగొచ్చినా తాజ్‌మహల్ రాసిచ్చినా/ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా/లోలోన మనసంతా సంతోషమే/ఈ ప్రేమ పులకింత సంతోషమే/లోలోన మనసంతా సంతోషమే/ఈ ప్రేమ పులకింత సంతోషమే/వెన్నెలా చూడు నన్నిలా ఎంత హాయిగా ఉంది ఈ దినం/నమ్మవా నన్ను నమ్మవా చేతికందుతూ ఉంది ఆకాశం/ఇప్పుడే పుట్టినట్టుగా ఎంత బుజ్జిగా ఉంది భూతలం/ఎప్పుడూ ముందరెప్పుడూ చూడలేదిలా దీని వాలకం/ప్రేమొస్తే ఇంతేనేమో పాపం/దాసోహం అంటుందేమో వంగీవంగీ ఈ లోకం/కోయిలా నేర్చుకో ఇలా ఆమె నవ్వులో తేనె సంతకం/హాయిగా పీల్చు కోయిలా చల్లగాలిలో ఆమె పరిమళం/నీటిపై చందమామలా నేడు తేలుతూ ఉంది నా మది/చీటికీ మాటిమాటికీ కొత్తకొత్తగా ఉంది ఏమది/అణువంతే ఉంటుందమ్మా ప్రేమా అణచాలి అనుకున్నామా చేస్తుందమ్మా హంగామా/దేవుడే దిగివచ్చినా స్వర్గమే నాకిచ్చినా.. షాజహాన్ తిరిగొచ్చినా తాజ్‌మహల్ రాసిచ్చినా/ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా/లోలోన మనసంతా సంతోషమే...ఈ ప్రేమ పులకింత సంతోషమే... పాటకు ప్రాణం చిత్రం: వాసు సంగీతం: ఆర్.పి.పట్నాయక్ గానం: స్వర్ణలత, కృష్ణ కుమార్ సాహిత్యం: పోతుల రవికిరణ్ పాటకు ప్రాణం పల్లవి అయితే... ఓ..ఓ..ఓ.. పల్లవి అయితే../ ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ.. .ఓ.. ఓ.. ఓ..ప్రేయసి కాదా../బ బహామ.. బ బహామ../ ఎవరేమనుకున్న వినదీ ప్రేమా.. బహామ ఎదురేమవుతున్నా కనదీ ప్రేమా.. బహామ/కనులే తెరిచున్నా కల ఈ ప్రేమా... బహామ...నిదురే రాకున్నా నిజమో ప్రేమా... ఓ చెలీ.. సఖీ/ప్రియా యూ లౌ మీ నౌ.. నౌ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ప్రియా.. నన్నే/వయసాగక నిను తలచిన... నను మరచిన పదే పదే పరాకులే../నీ ఆశలు నీ ధ్యాసలు చిగురించగా అదే అదే ఇదాయెలే/ప్రేమించే మనసుంటే ప్రేమంటే తెలుస్తుందే... అది ప్రేమించిందో ఏమో నిన్నే/నువ్వంటే చాలా ఇష్టం లవ్వుంటే ఎంతో ఇష్టం... ఇన్నాళ్లూ నాలో నాకే తెలియని ఆనందాలా ప్రేమే ఇష్టం/ఓ అనుకున్నదే నిజమైనదే ఎదురైనదీ ఇలా.../అనుకోకులే అలవాటులో పొరపాటుగా.. అలా నీ తీరులోనా వెంటే నీవుంటే నీడెల్లే తోడుంటే/పెదవి విప్పాలన్నా చెప్పాలన్నా కిస్సే యస్సౌనేమో/కుట్టిందే తేనెటీగా పుట్టిందే తీపి బెంగా/కిల్లాడి ఈడే ఆడీ పాడీ కోడై కూసిందేమో బాబూ/పాటకు ప్రాణం పల్లవి అయితే...ఓ..ఓ..ఓ.. పల్లవి అయితే../ ప్రేమకు ప్రాణం ప్రేమికుడేలే... ప్రేమికుడులే... / ఎవరేమనుకున్నా.../ పాటకు ప్రాణం నలుగురికి నచ్చినది.. చిత్రం: టక్కరి దొంగ సంగీతం: మణిశర్మ గానం: శంకర్ మహదేవన్ సాహిత్యం: చంద్రబోస్ నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో/నరులెవరూ నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో/పొగరని అందరు అన్నా... అది మాత్రం నా నైజం/తెగువని కొందరు అన్నా... అది నాలో మేనరిజం/నిండు చందురుడు ఒకవైపు... చుక్కలు ఒకవైపు/నేను ఒక్కడిని ఒకవైçపు.. లోకం ఒకవైపు/నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో/నరులెవరూ నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో/నువ్వు నిలబడి నీళ్లు తాగడం నథింగ్ స్పెషల్/పరుగులెత్తుతూ పాలు తాగడం సమ్‌థింగ్ స్పెషల్/నిన్ను అడిగితే నిజం చెప్పడం నథింగ్ స్పెషల్/అప్పుడప్పుడు తప్పు చెప్పడం సమ్‌థింగ్ స్పెషల్/లేనివాడికి దానమివ్వడం నథింగ్ స్పెషల్/ఓ లేనివాడికి దానమివ్వడం నథింగ్ స్పెషల్/ఉన్నవాడిది దోచుకెళ్లడం సమ్‌థింగ్ స్పెషల్/నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో/నరులెవరూ నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో/బుద్ధిమంతుడి బ్రాండు దక్కడం నథింగ్ స్పెషల్...పోకిరోడిలా పేరుకెక్కడం సమ్‌థింగ్ స్పెషల్/రాజమార్గమున ముందుకెళ్లడం నథింగ్ స్పెషల్...దొడ్డిదారిలో దూసుకెళ్లడం సమ్‌థింగ్ స్పెషల్/హాయి కలిగితే నవ్వు చిందడం నథింగ్ స్పెషల్..బాధ కలిగినా నవ్వుతుండడం సమ్‌థింగ్ స్పెషల్/నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో..నరులెవరూ నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో/పొగరని అందరు అన్నా అది మాత్రం నా నైజం..తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం/నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు..నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు తూనీగ తూనీగ... చిత్రం: మనసంతా నువ్వే సంగీతం: ఆర్.పి.పట్నాయక్ గానం: ఉష, సంజీవని సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి తూనీగ తూనీగ... ఎందాకా పరిగెడతావే రావే నా వంకా/ దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రానీ సాయంగా/ఆ వంకా ఈ వంకా.. తిరిగావే ఎంచక్కా/ ఇంకానా చాలింకా.. ఇంతేగా నీ రెక్క/ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా/తూనీగ తూనీగ... ఎందాకా పరిగెడతావే రావే నా వంకా/దోసిట్లో ఒక్కో చుక్కా.. పోగేసి ఇస్తున్నాగా వదిలేయకు సీతాకోక చిలకలుగా/వామ్మో బాగుందే చిట్కా నాకు నేర్పిస్తే చక్కా/ సూర్యుణ్నే కరిగిస్తాగా చినుకులుగా...సూర్చుడు ఏడి నీతో ఆడి...చందమామ అయిపోయాడుగా/ఆ కొంగలు ఎగిరి ఎగిరి సాయంత్రం గూటికి మళ్లి...తిరిగొచ్చే దారిని ఎప్పుడూ మరిచిపోవెలా/ఓసారి అటు వైపెళ్తుంది... మళ్లీ ఇటు వైపొస్తుంది/ఈ రైలుకి సొంతూరేదో గురుతు రాదెలా/కూ కూ బండి మా ఊరుంది... ఉండిపోవె మాతోపాటుగా.../తూనీగ తూనీగ... ఎందాకా పరిగెడతావే రావే నా వంకా/ దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రానీ సాయంగా/ఆ వంకా ఈ వంకా.. తిరిగావే ఎంచక్కా/ ఇంకానా చాలింకా.. ఇంతేగా నీ రెక్క/ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా/తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా... కనులు తెరిచినా... చిత్రం: ఆనందం సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గానం: మల్లికార్జున్, సుమంగళి సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా/నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా/ఎదుటే ఎప్పుడో తిరిగే వెలుగా... ఇదిగో ఇప్పుడే చూశా సరిగా/ఇన్నాళ్లూ నేనున్నది నడి రేయి నిదురలోన/అయితే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసిందా కొత్తగా/కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా/నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా/పెదవుల్లో ఈ దరహాసం... నీకోసం పూసింది/నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది/ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది/అయితేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది/దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది... కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది/ నీలో నా ప్రాణం ఉందని ఇప్పుడేగా తెలిసింది.. నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని/ కనులు తెరిచినా కనులు మూసినీ కలలు ఆగవేలా/ నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా/ ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది/ ఎవరైనా కనిపెడతారని కంగారుగా ఉంటోంది/నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది/ నాక్కూడా ఈ కలవరమిప్పుడే పరిచయమయ్యింది/ అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావె.. నేనే ఇక లేనట్టు నీలో కరిగించావె/ప్రేమ ఈ కొత్తస్వరం అని అనుమానం కలిగింది... నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువియ్యమంది మది/కనులు తెరిచినా కనులు మూసినీ కలలు ఆగవేలా/నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా/ఎదుటే ఎప్పుడు తిరిగే వెలుగా.. ఇదిగో ఇప్పుడో చూశా సరిగా/ఇన్నాళ్లూ నేనున్నది నడి రేయి నిదురలోన/అయితే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసిందా కొత్తగా... ఎక్కడో పుట్టి... చిత్రం: స్టూడెంట్ నెం.1 సంగీతం – గానం: ఎమ్.ఎమ్. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ ఓ మై డియర్ గర్ల్స్ డియర్ బాయ్స్/డియర్ మేడమ్స్ గురుబ్రహ్మలారా/ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిశాము/చదువులమ్మ చెట్టునీడలో/వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్లిపోతున్నామూ... చిలిపితనపు చివరి మలపులో/వి మిస్ ఆల్ ది ఫన్/వి మిస్ ఆల్ ది జాయ్/వి మిస్ యూ/నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమలేఖలు...సైన్స్ ల్యాబ్లోన షీలాపై చల్లిన ఇంకు చుక్కలు/ఫస్ట్ బెంచీలోన మున్నీపై వేసిన పేపరు ఫ్లైటులు...రాధ జడలో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు/రాజేశు ఇచ్చిన రోజాపువ్వులు.. శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు/కైలాసు కూసిన కాకి కూతలు.. కల్యాణి పేల్చిన లెంపకాయలు/మరపురాని తిరిగిరాని గుర్తులండి.. మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి/అంత పెద్ద మాటలొద్దు ఊరుకొండి.. ఆ అల్లరంటే మాక్కూడా సరదాలెండి/వి మిస్ ఆల్ ది ఫన్/వి మిస్ ఆల్ ది జాయ్/వి మిస్ యూ/బోటనీ మాస్టారి బోడిగుండుపైన బోలెడు జోకులు/రాగిని మేడమ్ రూపురేఖపైన గ్రూపు సాంగులు/సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు/టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు/బ్లాక్బోర్డుపైన గ్రీకు బొమ్మలు సెల్ఫోనుల్లోన సిల్లీ న్యూసులు/బాతురూముల్లోన భావ కవితలు... క్లాసురూముల్లోన కుప్పి గంతులు/మరపురాని తిరిగిరాని గుర్తులండి... మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి/మనకు మనకు క్షమాపణలు ఎందుకండి... మీ వయసులోన మేం కూడా ఇంతేనండి/వి మిస్ ఆల్ ది ఫన్/వి మిస్ ఆల్ ది జాయ్/వి మిస్ యూ గాజువాక పిల్లా... చిత్రం: నువ్వు నేను సంగీతం–గానం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గాజువాక పిల్లా.. మేం గాజులోళ్లం గాదా/ గాజువాక పిల్లా మేం గాజులోళ్లం గాదా/ నీ చెయ్యి చాపలేదా మా గాజు తొడగలేదా/ గాజువాకే పిల్లా మాది గాజులోళ్లమే పిల్లా మేము/ సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్లం గాదా/ సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్లం గాదా/ నీ వీపు సూపలేదా... మా సబ్బు రుద్ద లేదా/ సబ్బవరమే పిల్లా మాది... సబ్బులోళ్లమే పిల్లా మేము/సిరిపురం పిల్లా మేం సీరలోళ్లం గాదా/ సిరిపురం పిల్లా మేం సీరలోళ్లం గాదా/ నీ సీర ఇప్పలేదా...మా సీర సుట్టలేదా/ సిరిపురమే పిల్లా మాది... సీరలోళ్లమే పిల్లా మేము/మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్లం కాదా/ మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్లం గాదా/ నీ కాలు సాపలేదా...మా మువ్వ కట్టలేదా/ మువ్వలపాలెమే పిల్లా మాది... మువ్వలోళ్లమే పిల్లా మేము... దేవుడు వరమందిస్తే... చిత్రం: 6 టీన్స్ సంగీతం: ఘంటాడి కృష్ణ గానం: కుమార్ సాను సాహిత్యం: సుద్దాల అశోక్‌తేజ దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే... నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే (2)/ కాశ్మీరులో కనబడుతుందా.. నీ నడకల్లోని అందం / తాజుమహలుకైనా ఉందా.. నీ నగవుల్లోని చందం / నా ఊపిరి చిరునామా నువ్వే / దేవుడు వరమందిస్తే...మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే.. మాటైనా వినకుండా నిన్ను చేరమంటోందే (2)/ నిను మేఘాన ఒక బొమ్మ గావించగా.. నే మలిచాను హరివిల్లునే కుంచెగా / ఈ చిరుగాలితో చెప్పనా.. నీ మది నిండా నేనుండగా / దేవుడు వరమందిస్తే...ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా.. కొంగు ముడిని వేయాలంటూ నిన్ను వేడుకుంటున్నా (2) / నా కలలన్నీ నీ కనులు చూడాలని.. బతిమాలాను నీ కంటిలో పాపని / మన్నించేసి నా మనసుని ప్రసాదించు నీ ప్రేమని / దేవుడు వరమందిస్తే... అమ్మాయే సన్నగా... చిత్రం: ఖుషి సంగీతం: మణిశర్మ గానం: ఉదిత్ నారాయణ్, కవిత కృష్ణమూర్తి సాహిత్యం: చంద్రబోస్ అమ్మాయే సన్నగా...అర నవ్వే నవ్వగా..మతి తప్పి కుర్రాల్లే మంచాన పడ్డారే/అబ్బాయే సూటిగా.. కన్నెత్తీ చూడగా... ఆ వాడి చూపులకీ మంచైన మరిగేలే/ఆ నవ్వులు ఈ చూపులు... ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే/అమ్మాయే సన్నగా... అర నవ్వే నవ్వగా... మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే/ప్రేమలు పుట్టే వేళ... పగలంతా రేయేలే/ ప్రేమలు పండే వేళ... జగమంతా జాతరలే/ప్రేమే తోడుంటే... పామైనా తాడేలే/ప్రేమే వెంటుంటే... రాౖయెనా పరుపేలే/ నీ ఒంట్లో ముచ్చెమటైనా... నా పాలిట పన్నీరే/ నువ్విచ్చే పచ్చిమిర్చైనా...నా నోటికి నారింజే/ ఈ వయసులో ఈ వరసలో... ఈ వయసులో ఈ వరసలో నిప్పైనా నీరేలే/నేనొక పుస్తకమైతే నీ రూపే ముఖచిత్రం... నేనొక అక్షరమైతే నువ్వేలే దానర్థం/ఎగిరే నీ పైటే కలిగించే సంచలనం... ఒలికే నీ వలపే చేయించే తలస్నానం/ ఎండల్లో నీరెండల్లో నీ చెలిమే చలివేంద్రం/ మంచుల్లో పొగ మంచుల్లో నీ తలపే రవికిరణం/ పులకింతలే మొలకెత్తగా... పులకింతలే మొలకెత్తగా... ఇది వలపుల వ్యవసాయం/అమ్మాయే సన్నగా... అర నవ్వే నవ్వగా... మతి తప్పి కుర్రాల్లే మంచాన పడ్డారే/అబ్బాయే సూటిగా... కన్నెత్తీ చూడగా... ఆ వాడి చూపులకీ మంచైన మరిగేలే/ఆ నవ్వులు ఈ చూపులు... ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే అలనాటి రామచంద్రుడు... చిత్రం: మురారి సంగీతం: మణిశర్మ గానం: జిక్కి, సునీత, సంధ్య సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి అలనాటి రామచంద్రుడి కన్నింటా సాటి/ఆ పలనాటి బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి/అనిపించే అరుదైనా అబ్బాయికి మనువండి/తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన/శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన/అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి/చందమామ చందమామ/ కిందికి చూడమ్మా/ఈ నేలమీద నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా/వెన్నెలమ్మా వెన్నెలమ్మా/ వన్నెలు చాలమ్మా/మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెల బోవమ్మా/పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్లు/పచ్చని మెడపై వెచ్చగా రాసెను చిలిపి రహస్యాలు/ నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు/ ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు/ అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన/కలలకు దొరకని కళగల జంటని పది మంది చూడండి/ తళతళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి/సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా/ విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మండపాన/గౌరీ శంకరులేకమైన సుముహుర్తమల్లే ఉన్నా/ మరగలేదు మన్మథుని ఒళ్లు ఈ చల్లని సమయాన/ దేవుళ్ల పెళ్లి వేడుకలైనా/ ఇంత ఘనంగా జరిగేనా/ ఆ.. ఆ../ ఆ.. ఆ.. ఆ../ దేవుళ్ల పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా/ అనుకుని కనివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి/తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి అనగనగా ఆకాశం ఉందీ... చిత్రం: నువ్వే కావాలి సంగీతం: కోటి గానం: చిత్ర, జయచంద్రన్ సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది/ మేఘం వెనుక రాగం ఉంది...రాగం నింగిని కరిగించింది/ కరిగే నింగి చినుకయ్యింది... చినుకే చిటపట పాటైయ్యింది/ చిటపట పాటే తాకే నేల.. చిలకలు వాలే చెటై్టయ్యింది/నా చిలక నువ్వే కావాలి... నా రా చిలక నవ్వే కావాలి/రాగాల పువ్వై రావాలి... అనురాగాల మువ్వై మోగాలి/ఊగే కొమ్మల్లోన... చిరుగాలి కవ్వాలి.. పాడి కచ్చేరి చేసే వేళల్లో/గుండెల గుమ్మంలోన... సరదాలే సయ్యాటలు ఆడి తాలాలే వేసే వేళల్లో/కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా... కవ్వింతగా ... /ఆఆ..ఆఆ../నీ చెలిమే చిటికేసి... నను పిలిచెయ్ నీకేసి/నీ చెలిమే చిటికేసి... నను పిలిచెయ్ నీకేసి/నువ్వు చెవిలో చెప్పే ఊసుల కోసం నేనొచ్చేశా పరుగులు తీసి/నా చిలక నువ్వే కావాలి... నా రా చిలక నవ్వే కావాలి/రాగాల పువ్వై రావాలి... అనురాగాల మువ్వై మోగాలి/చుక్కల లోకం చుట్టూ... తిరగాలి అనుకుంటూ... ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో/నేనున్నా రమ్మంటూ... ఓ తార నా కోసం వేచి.. సావాసం పంచే సమయంలో/నూరేళ్లకీ సరిపోయే ఆశల్ని పండించగా... ఆ.. ఆ../ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి...అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తూ ఉంటే/ నా చిలక నువ్వే కావాలి... నా రా చిలక నవ్వే కావాలి/ రాగాల పువ్వై రావాలి... అనురాగాల మువ్వై మోగాలి కలిసుంటే కలదు సుఖం... చిత్రం:కలిసుందాం రా సంగీతం: ఎస్.ఎ.రాజ్‌కుమార్ సాహిత్యం: వేటూరి గానం: రాజేశ్ కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం / అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం / గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే / కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిసే / వస్తారా మా ఇంటికి ప్రతిరోజూ సంక్రాంతికీ / గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే / కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిసేఖుషీ తోటలో గులాబీలు పూయిస్తుంటే / హలో ఆమని చలో ప్రేమనీ / వసంతాలిలా ప్రతీరోజు వస్తూ ఉంటే చలీ కేకలా చెలే కోకిలా / నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమ వనం / వెన్నెలలే వెల్లువలై పొంగిన సంతోషం / ప్రేమలన్ని ఒకసారే పెనేసాయి ఈ ఇంటా / గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే / కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిసే / కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం / అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటంఒకే ఈడుగా ఎదే జోడుకడుతూ ఉంటే / అదే ముచ్చటా కథే ముద్దటా / తరం మారినా స్వరం మారనీ ప్రేమ / స్వరాగానికే వరం ఐనదీ / పాటలకే అందనిది పడుచుల పల్లవిలే / చాటులలో మాటులలో సాగిన అల్లరిలే / పాల పొంగు కోపాలో / పైట చెంగు తాపాలో / గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే / కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిసే / కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం / అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం / గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే / కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిసే / వస్తారా మా ఇంటికి ప్రతిరోజూ సంక్రాంతికి -
మోదీ ఆసనం.. నితీశ్ గానం!
ప్రపంచమంతా మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడానికి సిద్ధమవుతుండగా బిహార్ మాత్రం అందుకు భిన్నమైన రాగాన్ని ఎత్తుకుంటోంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించవద్దని నిర్ణయించారు. దేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి పూనుకోవాలని తాను ఇచ్చిన పిలుపును కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ పట్టించుకోకపోవడంతో అందుకు ప్రతిగా యోగా దినోత్సవానికి దూరంగా ఉండాలని నితీశ్ భావిస్తున్నారట. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సహా ప్రపంచమంతా యోగాసనాలు వేస్తుండగా మరీ నితీశ్ ఏం చేయబోతున్నారంటే.. సంగీత రాగాలాపన చేయాలని ఆయన నిర్ణయించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంతోపాటు అంతగా ప్రాచుర్యంలేని ప్రపంచ సంగీత దినోత్సవాన్ని కూడా జరపుకొంటారు. కాబట్టి మంగళవారం బిహార్ లో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నితీశ్ సర్కార్ నిర్ణయించింది. మోదీకి, నితీశ్ కి రాజకీయ బద్ధవైరం ఉన్న సంగతి తెలిసిందే. మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి రంగం సిద్ధం చేయడంతో 2014లో ఆ పార్టీతో ఉన్న పొత్తును నితీశ్ తెగదెంపులు చేసిన సంగతి తెలిసిందే. -
మోదీ ఆసనాలకు భిన్నంగా నితీశ్ రాగాలాపన!
ప్రపంచమంతా మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడానికి సిద్ధమవుతుండగా బిహార్ మాత్రం అందుకు భిన్నమైన రాగాన్ని ఎత్తుకుంటోంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించవద్దని నిర్ణయించారు. దేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి పూనుకోవాలని తాను ఇచ్చిన పిలుపును కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ పట్టించుకోకపోవడంతో అందుకు ప్రతిగా యోగా దినోత్సవానికి దూరంగా ఉండాలని నితీశ్ భావిస్తున్నారట. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సహా ప్రపంచమంతా యోగాసనాలు వేస్తుండగా మరీ నితీశ్ ఏం చేయబోతున్నారంటే.. సంగీత రాగాలాపన చేయాలని ఆయన నిర్ణయించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంతోపాటు అంతగా ప్రాచుర్యంలేని ప్రపంచ సంగీత దినోత్సవాన్ని కూడా జరపుకొంటారు. కాబట్టి మంగళవారం బిహార్ లో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నితీశ్ సర్కార్ నిర్ణయించింది. మోదీకి, నితీశ్ కి రాజకీయ బద్ధవైరం ఉన్న సంగతి తెలిసిందే. మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి రంగం సిద్ధం చేయడంతో 2014లో ఆ పార్టీతో ఉన్న పొత్తును నితీశ్ తెగదెంపులు చేసిన సంగతి తెలిసిందే. -
'సాంగ్'రే బంగారు రాజా
‘కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది..’ అనే పల్లవిని మొదట యథాలాపంగా రాశారు ఆరుద్ర. ఆ తరువాత ఇది పాటగా రూపుదిద్దుకుని ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ పాట పల్లవికి ప్రేరణ ఒక మోటు జానపదగీతం. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మజన్మాల పుణ్యాల పంటల్లె నిన్ను దర్శించినామయ్యా / మేము తరియించినామయ్యా శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం సినిమా షిర్డీ సాయిబాబాను తెలుగువారికి మరింత చేరువ చేసింది. సినిమాతో పాటు ఆ పాటలు భక్తులకు మరింత ప్రియమయ్యాయి. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించాలని దర్శక నిర్మాతలు అనుకోవడం విశేషం. ఎందుకంటే అప్పటికి ఇళయరాజా పీక్‌లో ఉన్నారు. చిన్న సినిమా భరించలేనంత పారితోషికం అడిగే స్థాయిలో ఉన్నారు. అయినా సాయిబాబా సినిమా అనగానే ఎంతో మనసు పెట్టి ఆరాధనతో పాటలు చేశారు. ‘దైవం మానవ రూపంలో’, ‘బాబా... సాయి బాబా’, ‘సాయి శరణం బాబా శరణం శరణం’... పాటలన్నీ పెద్ద హిట్. ‘మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా’... పాట సాయి లీలలను గానం చేస్తుంది. మనకు ఆయనపై మనసు మళ్లిస్తుంది. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా... సంగీత దర్శకుడు శివ శంకర్ ఈ పాటతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘ప్రియమైన నీకు’ విడుదలైనప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే. ప్రతి సంగీత పోటీల్లో ఎవరో ఒకరు ఈ పాట పాడాల్సిందే. బాణి, టెక్స్ట్, చిత్ర గానం... ఈ పాటను శ్రోతలకు చేరువ చేశాయి. ఇప్పటికీ రేడియో అండ్ టీవీల్లో మనసున ఉన్నది శ్రోతల అభిమాన గీతంగా కొనసాగుతోంది. అయితే శివ శంకర్‌కు వెంటవెంటనే అవకాశాలు రాలేదు. కొంత విరామం తర్వాత ఇప్పుడు హరిహరన్ పేరుతో పేరు మార్చుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది... అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది... వేమన సులభంగా చెప్పాడు. వంగపండు సులభంగా చెప్పాడు. గోరటి వెంకన్న కూడా సులభంగా చెప్తాడు. పాటను సులభంగా చెప్తే జనం సులభంగా గుర్తు పెట్టుకుంటారు. చేరన్ తమిళంలో ‘ఆటోగ్రాఫ్’ తీశాడు. తెలుగులో ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’గా రీమేక్ చేశారు. నిరుద్యోగం వల్ల దారీ తెన్ను లేకుండా తిరుగుతున్న హీరోని ఉత్తేజపరచాలి. అందుకు ఈ పాట. అంధులై ఉండి కూడా సంగీతం నేర్చుకుని కచ్చేరీలు ఇస్తూ జీవిక వెతుక్కునే వాళ్లు ఉన్నప్పుడు అన్నీ బాగుండి కూడా నిరర్థకంగా ఉండటం ఏం సమంజసం? అందువల్ల నిరాశ చెందక ముందుకు సాగమని ఈ పాట చెప్తుంది. ‘అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది... ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది’ అని చెప్పిన ఈ పాట తమిళంలోని మూలం కంటే ట్యూన్ రీత్యా భావం రీత్యా తెలుగులోనే బెటర్ పాట అనిపిస్తుంది. చంద్రబోస్, కీరవాణిలకు నూటొక్క మార్కులు. ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం ఆ రోజులు మునుముందిక రావేమిరా.... వయసు మళ్లిందంటే అర్థం కేవలం వయసు మళ్లిందనే. అంతే తప్ప జీవితం అంతమైందని కాదు. ఇక మరేమీ లేదనీ కాదు. జ్ఞాపకాలుంటాయి. కథలు ఉంటాయి. తల పండిన అనుభవాలుంటాయి. కొత్తతరాలకు వినిపించాల్సినవి ఉంటాయి. తెలుగులో ఇద్దరు వయసు మళ్లిన స్నేహితులు తమ గత రోజులను తలుచుకుంటూ పాడుకునే పాట ఇదొకటేనేమో. అనుబంధంలో అక్కినేని, ప్రభాకర్‌రెడ్డిల మీద చిత్రీకరించిన ఈ పాట చూడటానికే కాదు వినడానికి కూడా చాలా బాగుంటుంది. గతం అనగానే జ్ఞాపకం అనగానే ఆత్రేయ కలం ఉరకలు వేస్తుంది. ‘నేను- మారలేదు... నువ్వు- మారలేదు... కాలం మారిపోతే- నేరం మనదేమి కాదు’ అనే పాట పెద్దల ఉనికికి విలువనివ్వమంటుంది. ‘ఈ గాలి మోస్తున్న వీరి కథ’లను వినమంటుంది. నీ స్నేహం.... ఇక రాను అనీ కరిగే కలగా అయినా ఈ దూరం... నువ్వు రాకు అనీ నను వెలి వేస్తూ ఉన్నా మనసంతా నువ్వే... నా మనసంతా నువ్వే... రీ రికార్డింగ్‌లో ఫీల్ కోసం చేసిన ఒక బిట్ సాంగ్ ఆ సినిమాకు ఒక ప్లస్ పాయింట్‌గా మారడం విశేషం. ‘మనసంతా నువ్వే’ సినిమాలో ‘నీ స్నేహం’... అని ఆర్.పి.పట్నాయక్ చేసిన ఈ సాంగ్ ముందు అనుకున్నది కాదు. ఆర్.ఆర్ చేస్తుండగా స్ఫురించింది. ఏదో ఒక బరువైన భావనను గాఢంగా ముద్ర వేసేలా ఈ ట్యూన్ ఉంటుంది. ఆర్.పి. గానం కూడా. ఎప్పటికైనా ఇది ఆర్.పి.కి ఐడెంటిటీ కార్డ్. దురలవాట్ల మీద సూపర్‌హిట్ పాటలు రాశారు కొసరాజు. (సరదా సరదా సిగరెట్టు, అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే...మొదలైనవి). ఇన్ని పాటలు రాసిన కొసరాజుకు పదేపదే కాఫీ తాగడం తప్ప మరే వ్యసనం లేదు. బండి కాదు మొండి ఇది సాయం పట్టండి / పెట్రోల్ ధర మండుతోంది ఎడ్లు కట్టండి... / గోపాలా... గోవిందా... నాయికా నాయికలు బండెక్కి పాడే పాటలు చాలానే ఉన్నాయి. కాని బండి మీద కంప్లయింట్ చేస్తూ వచ్చిన ఈ పాట ఫేమస్. హిందీలో ‘ఖట్టా మీఠా’ సినిమా ఆధారంగా బాలచందర్ పర్యవేక్షణలో తమిళంలో సినిమా తీశారు. దాని రైట్స్ కొనుక్కుని మురళీమోహన్ తెలుగులో ‘రామదండు’గా తీశారు. సినిమా ఉల్లాసంగా ఉంటుంది. ఆత్రేయ రాసిన ఈ పాట కూడా. ‘ఎక్కడికి వెళ్లాలయ్యా... వెళ్లినాక చెప్తానయ్యా చెప్పకుంటే ఎలాగయ్యా... చెప్పినాక తంటాలయ్యా’.... తెల్లారింది లెగండో... కొక్కరొక్కో / మంచాలింక దిగండో... కొక్కరొక్కో.... ఒక కవి తన పాటను తానే సినిమాలో పాడుకోవడం తెలుగులో ఇంతకు ముందు ఉందా? సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఆ అవకాశం దక్కింది. గొల్లపూడి మారుతీరావు నాటకం ‘కళ్లు’ను సినిమాటోగ్రాఫర్ రఘు అంతే సమర్థంగా సినిమాగా మలచగలిగారు. నలుగురు అంధ భిక్షువుల కథ ఇది. అందరూ కలిసి ఒకరికి చూపు రప్పిస్తే ఆ వచ్చినవాడు కళ్లున్న వాళ్లు చూపే పాడుబుద్ధులన్నీ చూపిస్తాడు. చివరకు అందరూ కలిసి వాడి గుడ్లు పీకేసి దారికి తెస్తారు. ఆ సినిమాలో ఒక విశాఖ ఉదయాన్ని వర్ణించే పాట ఇది. ‘పాము లాంటి సీకటి పడగ దించి పోయింది... సావు లాంటి రాతిరి సూరు దాటి పోయింది’ అని చెప్పి చీకటి వదిలి వెలుగులోకి వెళ్లమని చెప్పే పాట ఇది. చెడును కాదు మంచిని చూడమని చెప్పే పాట. బాలసుబ్రహ్మణ్యం సంగీతం సుందరం. సుమధురం. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... తోటమాలి నీ తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే... లోకమెన్నడో చీకటాయెలే చివరి ఆశ ఎప్పుడూ బీభత్సంగా ఉంటుంది. మరి కొద్ది క్షణాల్లో కొడిగడుతుందనుకున్న దీపపు వెలుగు ప్రజ్వలంగా ఉంటుంది. నెమ్మదించబోయే ముందు తుఫాన్ వేగం... ఆఖరు శ్వాస వదిలే ముందు అయినవారి వర్చస్సు... చాలా బీభత్సంగానే ఉంటాయి. ఈ దేశంలో ప్రతి కులం, మతం ఏదో ఒక మేరకు తమ హక్కును అడుగుతాయి. కాని ఈ దేశంలో ఏ కుల పెద్ద లేని కులం, ఏ దేవుడూ లేని మతం ఒకటి ఉంది. ఏమిటో తెలుసా? అనాథ. తల్లిదండ్రీ లేనివాళ్లు, ఉన్నా వదిలిపెట్టవేయబడినవారు, అభాగ్యులు, దీనులు... ఎవరూ లేని అనాథలు... వారు ఏ హక్కూ అడగరు. ఏ రిజర్వేషన్ కోసమూ పోరాడరు. పూస్తుంటారు. రాలి పోతుంటారు. కాసింత నీలిమను వెతుక్కుంటూ వాలే పొద్దులైపోతుంటారు. మాతృదేవోభవ అనాథలు కాబోతున్న పిల్లల కోసం తల్లి పడే వేదన. చివరి దీపావళిని తన పిల్లలతో చేసుకోవాలనుకుంటుందా తల్లి. అప్పటికే విడివిడిగా పరాయి పంచన చేరిన పిల్లలను వెతుక్కుంటూ తిరుగుతున్నప్పుడు ఈ పాట వస్తుంది. పాటలో ఆ తల్లిని వేటూరి ‘పగిలే ఆకాశం’తో ‘మిగిలే ఆలాపన’తో పోలుస్తారు. కీరవాణి స్వరం హార్మోనియం మీదా మైక్ ముందూ ఆర్ద్రతను నింపుకుంది. తాకే పాట ఇది. చిత్రం: మాతృదేవోభవ (1993) రచన: వేటూరి గానం, సంగీతం: కీరవాణి పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ / కదిలే దేవత అమ్మా... కంటికి వెలుగమ్మా ఏఆర్ రెహమాన్ తండ్రి రహెమాన్ చిన్న వయసులోనే చనిపోయాడు. తల్లే సర్వస్వంగా పెంచింది. ఎవరూ చెప్పకుండానే దేశమాతకు కృతజ్ఞతగా వందేమాతరం ఆల్బమ్ చేసేవాడు ఎవరైనా చెప్తే అమ్మ మీద పాట ఎంత మనసు పెట్టి చేస్తాడు. మహేశ్‌బాబు సొంత సినిమా అయిన ‘నాని’లో అలాంటి సందర్భం వచ్చింది. తల్లి తనను తిడుతోంది అని భావించే కొడుకు నిజానికి అది తిట్టడం కాదని తల్లి మనసు నిండా ఎప్పుడూ ఉండేది ప్రేమే అని గ్రహించినప్పుడు వచ్చే పాట ఇది. ఒక్కోసారి పాండిత్యాన్ని పరిహరిస్తే మామూలు మాటల్లోనే మంచి పాట పుడుతుంది. ‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ’ అన్న వెంటనే అవును కదా మనకెందుకు అనిపించలేదూ అనిపిస్తుంది. పాటతో కనెక్టివిటీ వచ్చేస్తుంది. ‘ఎనలేని జాలి గుణమే అమ్మ... కరుణించే కోపం అమ్మ... వరమిచ్చే తీపి శాపం అమ్మ’... అనడం అమ్మ గొప్పదనాన్ని కవి తిరగేసి చెప్పడమే. పాడిన ఉన్ని కృష్ణన్ ధన్యుడు. రాసిన చంద్రబోస్ ధన్యుడు. ఏం... వింటున్న మనం మాత్రం ధన్యులం కామా? ఉప్పొంగెలే గోదావరి... / ఊగిందిలే చేలో వరి/ భూదారిలో నీలాంబరి / మా సీమకే చీనాంబరి అమ్మ గోదావరి... తల్లి గోదావరి... తెలుగు జాతిని వొడిన కూచోబెట్టుకుని నాలుగు ముద్దలు కుడిపే గోదావరి... అన్నం పెట్టే గోదావరి... గొంతున నాలుగు గుక్కలు పోసే గోదావరి.... గోదావరి మీద పాట గోదావరి ఒడ్డున పాట... గోదావరితో పాటుగా పాట... తెలుగువారికి దక్కిన వరం. శేఖర్ కమ్ముల ‘గోదావరి’ మెల్లగా ఎక్కువమందికి నచ్చిన సినిమా. అప్పుడెప్పుడో బాపు ‘అందాల రాముడు’ సినిమాను మొత్తం గోదావరి మీద తీశారు. ఇంత కాలానికి శేఖర్ కమ్ముల అదే పని అంతే అందంగా చేయగలిగాడు. ‘ఏసెయ్ చాప జోర్సెయ్ నావ వార్సెయ్ వాలుగా.... చుక్కానే చూపుగా’.... ఇలా ప్రవాహోద్వేగంతో పాడటం బాలూకే సాధ్యం. ‘ఆరేసిన మిరపలు గోదారమ్మకు కుంకుమ బొట్టు దిద్దాయని’ అనడం వేటూరికే సాధ్యం. రాధాకృష్ణన్ చాలా మంచి పాటలు ఇవ్వగల సంగీత దర్శకుడు. ఈ పాట అతడికి పుష్కర స్నాన పుణ్యం ఇచ్చి ఉంటుంది. గ్యారంటీ. కొసరాజు పాటలు రాసే విధానం చిత్రంగా ఉండేది. ఆయన ఎక్కువగా నడిచేవారు. జేబులో ఎప్పుడూ స్లిప్పులు ఉండేవి. అలా నడిచివెళుతున్నప్పుడు ఏదైనా ఆలోచన వస్తే స్లిప్పుల్లో రాసుకునేవారు. జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది / సంసారసాగరం నాదే... సన్యాసం శూన్యం నాదే... నాటి హిందీ సూపర్‌స్టార్ రాజ్‌కపూర్, దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ ప్రాణ స్నేహితులు. రాజ్‌కపూర్ మిగిలిన హీరోల్లా కాకుండా నచ్చింది తింటూ కోరింది తాగుతూ మెచ్చింది చేస్తూ ఉండేవాడు. ఇది హృషికేశ్‌కు ఆందోళన కలిగించేది. ‘ఇలా ఉంటే ఎలా... నీకేమైనా అయితే?’ అనేవాడు. ‘అయితే ఏమవుతుంది? హాయిగా పోతాం. అంతేకదా. అంతవరకూ మనం హ్యాపీగా ఉంటూ నలుగురినీ హ్యాపీగా ఉంచడానికి మించి కావలసిందేముంది’ అనేవాడు రాజ్‌కపూర్. ఆ మాటల స్ఫూర్తితోనే హృషికేశ్ హిందీలో ‘ఆనంద్’ సినిమా తీశాడు. మరో ఆరునెలల్లో కేన్సర్ వల్ల చనిపోబోతున్న రాజేష్ ఖన్నా ఆ ఆరునెలల్లో అందరికీ ఆనందం పంచడం కథ. ఇది ఎందరినో ప్రభావితం చేసి ఎన్నో సినిమాలకు మూలం అయ్యింది. తెలుగులో ‘చక్రం’కు కూడా. అయితే తెలుగుకు దక్కిన మేలిమి చేర్పు ఈ పాట. ప్రకృతిలో ఉండే ‘యాక్సెప్టెన్స్’ను అన్యాపదేశంగా బోధిస్తుంది ఈ పాట. చెట్టు వాన కావాలని తుఫాన్ వద్దని అనదు. నేల పైరు కావాలని క్షామం వద్దని అనదు. నది ప్రవాహం కావాలని సంగమం వద్దని అనదు. వాటికి రెండూ సమానమే. మనిషి మాత్రం జీవం కావాలని మృత్యువు వద్దని సంతోషం కావాలని దుఃఖం వద్దని ఘటన కావలని దుర్ఘటన వద్దని అంటాడు. అది ఉన్నప్పుడు ఇదీ ఉంటుంది. ఇదీ సూత్రం. కాని చివరి గడియలకు అది తెలుస్తుంది. అప్పటికే సమయం మించిపోయి ఉంటుంది. ‘నాకు రేపు లేదు... ఇవాళే’ అనుకున్నవారికి ఈ జగతి ఎంతో సుందరంగా కనిపిస్తుంది. అందరూ ప్రేమాస్పదులుగా కనిపిస్తుంది. ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ వంటి అల్పమైన విషయాలన్నీ కరిగిపోయి ఉత్త ప్రేమే మిగులుతుంది. జరామరణాల చక్రాన్ని ఎవరూ తప్పించుకోలేరు. ఈ వృత్తాన్ని వీలైనంత ఆహ్లాదంగా సంతోషంగా మలుచుకో అని చెబుతుంది ఈ సినిమాలో ఈ పాట. ‘సంసార సాగరం నీదేననుకో సన్యాసం శూన్యం కూడా నీదేననుకో’ అంటుందీ పాట. సంగీత దర్శకుడు శ్రీ దీనిని పాడాడు. చక్రి ట్యూన్ చేశాడు. ఇద్దరూ తమ జీవితకాలంలో మనకు నాలుగు పాటలు మిగిల్చి దివ్యసంగీతంలోకి మరలిపోయారు. చిత్రం: చక్రం (2005) రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి సంగీతం: చక్రి గానం: శ్రీ కొమ్మినేని పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా...(2) కోట్లాది ప్రాణమా... ప్రజా ఉద్యమంలో పాట కూడా దండే. అది సైన్యం. అది ఆయుధం. అది కవాతు. అదే మిలీనియం మార్చ్. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ప్రజల ఆకాంక్షను బలంగా వ్యక్తం చేసింది. కళలు దానిని అందుకున్నాయి. దానిని అందించాయి. ఒకరొక మాట. ఒకరొక పాట. పాటల యుద్ధనౌక గద్దర్ ఈ హోరుకు మరో హోరు అవుదామను కున్నాడు. ఈ పోరుకు పాటను ‘వేరు’ చేద్దామనుకున్నాడు. వాగ్గేయకారుడు, అనుకున్నంతలోనే పాటను అందుకో గలిగినవాడు, దార్శనికుడు పాట అందుకున్నాడు. ‘మా భూమూలు మాకేనని మర్లబడ్డ గానమా.. తిరగబడ్డ రాగమా’... లక్ష గొంతులు దీనికి వంత పాడాయి. కోటి స్వరాలు దీనిని ప్రతిధ్వనించాయి. ‘మా నీళ్లు మాకేనని కత్తుల కోలాటమా... కన్నీటి గానమా’... అని గద్దర్ పాడుతుంటే ఉద్వేగంతో కంఠనాళాలు పొంగించాయి. ఉద్రేకంతో కంటి ధారలు కురిపించాయి. ఈ పాట ఇక్కడ ఒక ప్రాతినిధ్యం మాత్రమే. ఇంకా వందలాది గాయకులు ఉన్నారు... వందలాది పాటలు ఉన్నాయి. ఉద్యమం సాఫల్యమై తెలంగాణ సాకారమయ్యాక ప్రతి పువ్వుకు ప్రతి పుప్పొడికి ఈ జాతి కృతజ్ఞత ప్రకటిస్తోంది! ‘మా పాలన మాకేనని మండుతున్న గోళమా అమరవీరుల స్వప్నమా... అమర వీరుల స్వప్నమా...’ చిత్రం: జై బోలో తెలంగాణ (2011) సంగీతం: చక్రి రచన- గానం: గద్దర్ నీలపురి గాజుల ఓ నీలవేణి నిలుసుంటె కృష్ణవేణి / లంగఓణి వేసుకుని నడుస్తువుంటే నిలవలేనె బాలామణి... నడుము చూస్తె కందిరీగ నడక చూస్తె హంసనడక ప్రియురాలిని మెచ్చే ప్రియుడు ఇప్పటి వరకూ చాలా ఎక్స్‌ప్రెషన్సే వెతికాడు కాని- ‘నీ కళ్లు చూసి నీ పళ్లు చూసి కలిగెనమ్మ ఏదో కోరిక’ అని చెప్పడం జనానికి నచ్చింది. ‘మహాత్మ’ సినిమాలో ఈ పాట హిట్. తను రాసిన పాటను తనే పాడే లక్కీ చాన్స్‌ను కాసర్ల శ్యామ్ కొట్టేశాడు. ఎఫ్ఎమ్లో బాగా మోగిన పాట ఇది. గోపికమ్మా... చాలునులేమ్మా నీ నిదర / గోపికమ్మా... నిను విడనీమ్మా మంచుతెర ఇటీవలి కాలంలో అత్యధికులు తమ రింగ్ టోన్గా పెట్టిన పాట ఇది. ‘ముకుందా’ బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా మ్యూజికల్‌గా ఈ పాటతో నిలబడిపోయింది. మిక్కీ జె మేయర్ స్వరానికి సిరివెన్నెల పదం మేలిమి జతైంది. ‘కడవల్లో కవ్వాలు సడి చేస్తున్నా వినకా... గడపల్లో కిరణాలు లేలెమ్మన్నా కదలకా’... ఆ గోపికమ్మ నిదుర పోతుంటే నిదుర లేపే ఈ పాట శ్రోతల ఆహ్లాదాన్ని కూడా తట్టి లేపుతుంది. ఎందరు కొత్తవాళ్లు వచ్చినా చిత్ర చిత్రే అని నిరూపించిన పాట ఇది. గోపికమ్మా చాలును లేమ్మా... ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో... ఏమో... / అటు అటు అటు అని నడకలు ఎక్కడికో... ఏమో... మనుషుల మధ్య, దేశాల మధ్య, జాతుల మధ్య, ప్రేమించే రెండు మనసుల మధ్య కంచె ఉండకూడదు అని తీసిన ఈ సినిమాలో ఈ పాట కూడా చాలా కంచెలను తీసేసింది. సంగీత దర్శకుడు చిరంతన్ భట్ గుజరాతీ. పాడినవాళ్లలో శ్రేయా ఘోషాల్ బెంగాలీ, అభయ్ జోధ్‌పుర్కర్ మధ్యప్రదేశీ. తీసిన దర్శకుడు తెలుగువాడు. వీళ్లందరూ కలిసి చేసిన పాట ఇది. కాని ఒక మార్కు ఎక్కువ సిరివెన్నెలకు పడుతుంది. ‘ఉషస్సెలా ఉదయిస్తుందో నిశీథెలా ఎటు పోతుందో నిదుర ఎపుడు నిదరోతుందో మొదలు ఎలా మొదలవుతుందో ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కథానిక మొదలైందో’ అని రాసి కొత్త ప్రేమికుల అవస్థను అవస్థ లేకుండా వివరించినందుకు ఒకటి చాలదంటే రెండు కూడా వేయవచ్చు. -
'సాంగ్'రే బంగారు రాజా
ఘంటసాల కర్ణాటక సాంప్రదాయ సంగీతం అభ్యసించినప్పటికీ, హిందూస్తానీ సంగీతం అంటే కూడా ఆయనకు అభిమానం. తాను సంగీతదర్శకత్వం వహించిన సినిమాల్లో పహాడి, దేశ్... మొదలైన హిందూస్థానీ రాగాలను ఉపయోగించారు ఘంటసాల. చినుకులా రాలి... నదులుగా సాగి... వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమా... నా ప్రేమా... నీ పేరే నా ప్రేమా..నదివి నీవూ కడలి నేనూ... మరచిపోబోకుమా... మమత నీవే సుమా... ప్రేమలో ఎవరైనా గెలవడానికి ఇష్టపడతారు. కాని మృత్యువుతో ఎవరు పోటీ పడతారు? ఇద్దరబ్బాయిలు ఇద్దరమ్మాయిలు. వారిలో ఒకబ్బాయి ఒకమ్మాయి తొందరపడ్డారు. అమ్మాయి నెల తప్పింది. పెళ్లి జరిగే వీలు లేదు. పెళ్లి చేసుకునే వీలున్న రెండో అబ్బాయి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తొందరపడ్డ అబ్బాయి గత్యంతరం లేని పరిస్థితుల్లో రెండో అమ్మాయిని చేసుకున్నాడు. చాలా క్లిష్టమైన ఆట మొదలైంది. ఇలాంటి ఆట ప్రమాదకరంగా మారి తొందరపడ్డ అమ్మాయి ప్రాణం తీసింది. టీనేజ్ తికమకలు తొందరపాట్లు చూపించ డానికి జంధ్యాల తీసిన ‘నాలుగు స్థంభాలాట’ పెద్ద హిట్. అంత కంటే పెద్ద హిట్ అందులో రాజన్ నాగేంద్ర చేసిన ఈ పాట. దాని కంటే పెద్ద హిట్ దానికి వేటూరి అందుకున్న పద ప్రవాహం. ‘ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే... కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే’... షీర్ పొయెట్రీ. ‘హిమములా రాలి సుమములై పూసి రుతువులై నవ్వి మధువులై పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ’... బాలూ సుశీల ఈ పాటను టీనేజ్‌లో ఉన్నవాళ్ల వలే ఉత్తేజంతో పాడారు. రేడియో ఈ పాట మీద చాలా మైలేజ్ గెయిన్ చేసింది. ఇప్పటికీ ఆకాశవాణి వివిధభారతికి రోజూ ఒక కార్డు ముక్క ఈ పాట కోసమే వస్తూ ఉంటుంది. తెలుగు యువతీ యువకులు ప్రేమలో పడ్డాక తెలుగులో పాడుకోదగ్గ పాటల్లో ఇది ఒకటి. ఇదే ఒకటి.చిత్రం: నాలుగు స్థంభాలాట (1982) సంగీతం: రాజన్-నాగేంద్ర రచన: వేటూరి గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల మౌనమేలనోయి... మౌనమేలనోయి ఈ మరపురాని రేయి... ఎదలో వెన్నెల వెలిగే కన్నుల... తారాడే హాయిలో... చెప్పినవాటి కంటే చెప్పనివే బాగుంటాయి. అర్థం అయిన వాటి కంటే అర్థం కానివే బాగుంటాయి. తెలిసిపోయిన వాటి కంటే తెలుస్తూ ఉన్నవే బాగుంటాయి. ఆమె పరిణతి కలిగిన స్త్రీ. అతడు సున్నితమైన మనసు కలిగిన కళాకారుడు. రోజూ ఇద్దరూ కలుస్తారు. వేరే ఏవేవో మాట్లాడుకుంటారు. కాని లోపల వేరేదేదో జరుగుతుంటుంది. పైకి ఏమిటో చేస్తుంటారు. లోన వేరేది చేయాలని ఉంటుంది. మనసు ఉన్నప్పుడు ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్నప్పుడు కోరిక పుడుతుంది. ఒక స్త్రీలోని కోరిక ఈ పాట. ఆ రాత్రి అతడి తలపులు ఆమెను బాధిస్తాయి. కాలి బొటనవేలిని మరొక బొటనవేలితో అదిమి పెట్టమంటాయి. ‘పలికే పెదవి ఒణికినప్పుడు’, ‘ఒణికే పెదవి వెనుకాల’ వేరేదేదో ఉన్నప్పుడు ఆ భావనను తెర మీద చూపించాలనుకోవడం దర్శకుడి భావ స్వేచ్ఛ. తాను ఇష్టపడ్డ మగవాడి గురించి ఆమె స్నానం చేస్తూ ఏకాంతంలో ఆలోచించడం చాలా లలితంగా చూపిస్తాడు. కాని సినిమా చూసి కొందరు అశ్లీలం అన్నారు. ‘మీరూ అదే చేస్తారు గమనించండి’ అని కె.విశ్వనాథ్ సమాధానం ఇచ్చారు. ఏమైనా సాగర సంగమంలో ఈ పాట, ఆ రాత్రి, ఆ ఏకాంతం, అంతే ఏకాంతాన్ని పలికించిన బాలూ, జానకిల కంఠాలు, ఇళయరాజా స్వరం, వేటూరి గీతం... తెలుగులో సున్నితమైన శృంగార ప్రకటనకు ఒక మేలిమి నమూనా. జయప్రద కోసం ఈ పాటను చూడాలి. ఈ పాట కోసం జయప్రదను చూడాలి. జయప్రద కోసం జయప్రదను చూడాలి. జయప్రదమైన పాట ఇది.చిత్రం: సాగర సంగమం (1983) సంగీతం: ఇళయరాజా రచన: వేటూరి గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి వందేమాతరం... వందేమాతరం... వందేమాతర గీతం వరుస మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తెలుగు సినీ విశ్వవిద్యాలయం కింద చాలా స్కూళ్లు ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కో స్కూల్. కె.వి.రెడ్డిది ఒక స్కూలు. విఠలాచార్యది ఒక స్కూలు. దాసరిది ఒక స్కూలు. రాఘవేంద్రరావుది, కె.ఎస్.ఆర్.దాస్ది ఒక స్కూలు. అలాగే మరో స్కూల్ ఉంది. అందులో మాదాల రంగారావు, వేజెళ్ల సత్యనారాయణ, ధవళ సత్యం ఆ తర్వాత కాలంలో టి.కృష్ణ ఇప్పుడు ఆర్.నారాయణమూర్తి తదితరులు వస్తారు. ఒకప్పుడు దేశం బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా వందేమాతరం అని నినదించింది. తెల్లదొరలను తరిమికొట్టింది. కాని నల్లదొరల చేత చిక్కింది. ఈ నల్లదొరల బండారం బయటపెట్టడానికి వీళ్లంతా సినిమాలు తీశారు. టి.కృష్ణ దీనిని తన ‘నేటి భారతం’, ‘వందేమాతరం’, ‘దేశంలో దొంగలు పడ్డారు’, ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ సినిమాలతో బలంగా చూపించారు. ‘వందేమాతరం’లోని ఈ పాటను స్కూల్ మాస్టర్ అయిన హీరో రాజశేఖర్ ఆలపిస్తాడు. ఊరి పెద్దలే పల్లెల్ని నాశనం చేస్తున్నారని బాధ పడతాడు. వందేమాతరం శ్రీనివాస్ ఈ పాటతోనే వెలుగులోకి వచ్చాడు. సినారె నాటి వందేమాతరం గీతంలోని ప్రతి పంక్తిని తీసుకొని నేటి పరిస్థితిని చురకలా వేసుకుంటూ వెళతారు. ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది’ అనేది ఇందులో ఒక పంక్తి. పని మొదలవని పథకాలు చూస్తున్న రెండు రాష్ట్రాల ప్రజలకు ఇది సరిపోయేలా ఉంది కదూ?చిత్రం: వందేమాతరం (1985) రచన: సినారె గానం, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ హిజ్ మాస్టర్స్ వాయిస్ గ్రామ్‌ఫోన్ కంపెనీలో 16 ఏళ్ల వయసులోనే హార్మోనిస్ట్‌గా పనిచేశారు సి.ఆర్.సుబ్బురామన్. ఆయనకు కర్ణాటక సంగీతం మీద ఎంత పట్టు ఉందో పాశ్చాత్య సంగీతం మీద కూడా అంతే పట్టు ఉండేది. ఈ తూరుపు.. ఆ పశ్చిమం... సంగమించిన ఈ శుభవేళ... పడమటి సంధ్యారాగాలేవో... పారాణి పూసెనులే... యూ ఆవకాయ్... మీ ఐస్‌క్రీమ్... దిజ్ ఈజ్ ద హాట్ అండ్ స్వీట్ లవ్స్ డ్రీమ్స్ ఇవాళ తెలుగు నేలలోని ప్రతి వీధి నుంచి ఒక అబ్బాయో, అమ్మాయో అమెరికాలో చదువుకుంటున్నారు. ప్రతి వాడ నుంచి ఒక జంట అమెరికాలో కాపురం ఉంటున్నారు. ఇక్కడ పుట్టే పిల్లలకు తోబుట్టువులుగా అమెరికాలో కూడా ఎంతో మంది తెలుగు పిల్లలు ఊపిరి పోసుకుంటున్నారు. ఆ పడమర, ఈ తూర్పు విడిపోవడం సాధ్యం కాదు. ఒకరిని వదిలి మరొకరు మనలేని పరిస్థితి వచ్చేసింది. అయితే దీనిని 30 ఏళ్ల క్రితమే కనిపెట్టి సినిమాగా తీసినవాడు జంధ్యాల. సంస్కృతుల సంగమమే కాదు, వైవాహిక అనుబంధాలు కూడా తప్పవని ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించుకోవడమే దీనికి మార్గమని ఆయన ఆ కథలో సూచిస్తాడు. ‘పడమటి సంధ్యా రాగాలేవో... పారాణి పూసెనులే’... అనడంలో ఒక కవితాత్మక భావం ఉంది. సినిమా కూడా అంతే కవితాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా విజయశాంతి ఈ సినిమాలో ఉన్నంత చక్కగా ఏ సినిమాలోనూ లేదేమో అనిపిస్తుంది. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాకు సంగీతం అందించడమే కాదు, దీనికి టైటిల్ కూడా ఆయనే పెట్టారు. ‘ఏ దేశమైనా ఆకాశం ఒకటే’ అంటారు వేటూరి ఈ పాటలో. అది అర్థం చేసుకుంటే పాస్‌పోర్ట్‌ల అడ్డంకులెరగని విశ్వమానవతత్వం అందరికీ అలవడుతుంది. ప్రపంచం ఒక ఇష్ట కుటుంబంగా మారుతుంది.చిత్రం: పడమటి సంధ్యారాగం (1987) సంగీతం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రచన: వేటూరి గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి జీవితం సప్తసాగర గీతం/ వెలుగు నీడల వేదం... సాగనీ పయనం కల... ఇల... కౌగిలించే చోట (2) ఆర్.డి.బర్మన్ తెలుగులోకి రావడం ఒక వింత. అప్పుడెప్పుడో ఒకసారి పాడినా తిరిగి ఆశా భోంస్లే గొంతు విప్పడం మరో వింత. జంధ్యాల తీసిన ‘చిన్ని కృష్ణుడు’... పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు కాని ఈ పాటను మాత్రం తెలుగువారికి మిగిల్చింది. హీరో కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్, హీరోయిన్ ఖుష్బూ అమెరికాలో అలా షికార్లు కొడుతుంటే జంధ్యాల అద్భుతమైన మాంటేజ్‌ను రన్ చేస్తూ ఈ పాటను చూపిస్తారు. దానికి ఆశా గొంతు, బాలూ తోడ్పాటు చాలా వినబుద్ధేసేలా ఉంటాయి. ‘ఈ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్ఛా జ్యోతులు.. ఐక్యరాజ్య సమితిలోన కలిసే జాతులూ’ అని అమెరికా విశేషాలను పాటలో వేటూరి పొదుగుతూనే ఈ అగ్రరాజ్యం దానికదే ఊడిపడలేదని ‘కృషి ఖుషి సంగమించే చోటు’ కనుకనే సాధ్యమైందని అంటారు. ఆర్.డి.బర్మన్, ఆశా భోంస్లే సహజీవనం చేశారనే సంగతి సంగీతాభిమానులకు తెలుసు. బర్మన్ తెలుగులో మొదటిసారి చేస్తున్నాడు కనుక ఆమెతో పాడించడం సులువయ్యింది. ఇదే సినిమాలో ‘మౌనమే ప్రియా గానమై’ అనే పాట టిపికల్ ఉత్తరాది తరహాలో ఉంటుంది. పాడింది మన జానకి. వింటుంటే లతా, ఆశా... సరేనయ్యా మన జానకమ్మకు ఏం తక్కువయ్యా అని అనబుద్ధేస్తుంది.చిత్రం: చిన్నికృష్ణుడు (1988) సంగీతం: రాహుల్ దేవ్ బర్మన్ రచన: వేటూరి గానం: ఆశాబోంస్లే, ఎస్.పి.బాలు లాలూదర్వాజ లస్కరు బోనాల పండుగకు వస్తనని రాకపోతివి.. లక్డీకాపూలు పోరికి లబ్బరు గాజులు తెస్తనని తేకపోతివి... పాత రోజుల్లో శోభనం గదిలో పెళ్లికొడుకు పెళ్లికూతురితో ‘ఏదైనా పాట పాడు’ అనంటే ఆ అమాయక పెళ్లి కూతురు ఏ చోటులో ఎటువంటి పాట పాడాలో కూడా తెలియక చాలా హుషారుగా తన పల్లె స్వభావంతో ‘పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులోయమ్మ తుమ్మెదా’ అని అందుకుంటుంది. తెలుగువారికి ఆ పాట ఒక హుషారైన నవ్వులు చిందే జ్ఞాపకం. తమిళం వాళ్లు దీనిని పట్టుకున్నారు. క్షత్రియ పుత్రుడు సినిమాలో పెళ్లి కూతురిని పాడమంటే ‘సన్నజాజి పడకా మంచె కాడ పడకా’ అని నోటి దరువుతో అందుకుంటుంది. ఏ సంస్కృతి మీద దృష్టి పెడితే ఆ సంస్కృతి నుంచి ఒక మంచి పాట తన్నుకు రావడానికి ఏ అడ్డంకీ ఉండదు. ‘మొండిమొగుడు పెంకిపెళ్లాం’ సినిమాలో విజయశాంతి తెలంగాణ ప్రాంతం నుంచి వస్తుంది. పెద్ద ఆఫీసర్ల పార్టీలో ఎవరో ఆమెను పాట పాడమంటారు. ఇంకేముంది? తెలంగాణ సొగసు నుంచి ఈ పదం అందుకుంటుంది. ‘యాడికో ఉర్కుతాడని యేసినా ముక్కుతాడుని’ అని మొగుణ్ణి కవ్విస్తూ పాడుతుంటే ఆ మజా వేరుగా ఉంటుంది. తెలంగాణ గ్రామీణ సౌందర్యం ఉండేలా పాటలు రాయడంలో సాహితి సిద్ధహస్తుడు. బోనాల పండుగకు ఒక కవిగా అతడల్లిన పూల పేర్పు ఈ పాట... లాలూ దర్వాజ్ లష్కర్...చిత్రం: మొండిమొగుడు పెంకిపెళ్లాం (1992) సంగీతం: కీరవాణి రచన: సాహితి గానం: ఎస్.పి.శైలజ -
'సాంగ్'రే బంగారు రాజా
‘మాయాబజార్’లోని ‘వివాహభోజనంబు వింతైన వంటకంబు’ పాట ‘లాఫింగ్ పోలిస్‌మ్యాన్’ అనే పాత ఇంగ్లిష్ పాటకు అనుకరణ. ఆ పాటలోని పోలిస్ నవ్వు ఘటోత్కజుడుకి షిప్ట్ అయిందన్న మాట! దేశమ్ము మారిందోయ్... కాలమ్ము మారిందోయ్ కష్టాలు తీరేనోయ్... సుఖాలు నీవేనోయ్... ఆనకట్టలు మన ఆధునిక దేవాలయాలు అన్నాడు నెహ్రూ. స్వాతంత్య్రం వచ్చాక దేశ నిర్మాణాన్ని అందులో ప్రజలు పాల్గొనవలసిన అవసరాన్ని బోధిస్తూ హిందీలో ‘జాగ్తే రహో’, ‘దో ఆంఖే బారా హాత్’ వంటి సినిమాలు అనేకం వచ్చాయి. తెలుగులో రాముడు-భీముడు సినిమాలో కొంత ఆ స్పర్శను చూపిస్తూ ఈ పాటను కల్పించారు దర్శకుడు తాపీ చాణక్య. కొసరాజు గ్రామీణ సొగసును రాసే కొసరాజు తన శైలికి భిన్నంగా లభించిన ఈ అవకాశాన్ని అవలీలగా సక్సెస్ చేశారు. ‘కండల్ని కరగదీయి బండల్ని విసరి వేయి నీదేలే పై చేయి’ అని చెప్పే ఈ పాట తప్పనిసరిగా ప్రస్తావించదగ్గ మంచి పాట. అన్నట్టు ఎల్.విజయలక్ష్మి ఈ పాటకు ముద్దుచుక్క. తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా... దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా అల్లూరి సీతారామరాజు తెలుగుజాతికి నిత్య స్ఫూర్తి. ‘ఎవడు వాడు ఎచటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు’ అని తెల్లవాడిని ప్రశ్నించిన ధీశాలి. సాధారణ ప్రజలు నిజానికి బ్రిటిష్ అగత్యాలను నేరుగా భరించలేదు. ఆ కష్టాలు పడిందంటే గిరిజనులే. వీరి కోసం మొదటగా గెరిల్లా పోరు సలిపినవాడు అల్లూరి. ఆ వీరుడి మీద సినిమా తీసి నటుడు కృష్ణ చిరకీర్తిని పొందాడు. అతడి తేజాన్ని పాటగా మార్చి శ్రీశ్రీ జాతీయ అవార్డు పొందాడు. సంగీతం ఆదినారాయణరావు. అయితే పాటలో విశేషం ఉంది. అప్పటికే ఘంటసాల అనారోగ్యం బారిన పడ్డారు. శ్రీశ్రీ అన్ని చరణాలు ఆయన పాడలేకపోయారు. సహాయకునిగా రామకృష్ణ రంగప్రవేశం చేసి పాటను పూర్తి చేశారు. చాలా మంది ఈ పాటను ఘంటసాల ఒక్కరే పాడారని అనుకుంటారు. కాని రామకృష్ణ తోడ్పాటు ఉంది. ఇద్దరూ కలిసి ‘ప్రతి మనిషి సింహాలై గర్జించాలి’ అని తెలుగు వారి గర్జనను వినిపించిన పాట ఇది. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక / ఒక రాధిక అందించెను నవరాగ మాలిక సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో... నవ మల్లిక చినబోయెను చిరునవ్వు సొగసులో... జి. ఆనంద్ తెలుగు సినిమాల్లో తక్కువ పాడినా ఆ కొద్ది పాటలతోనే తన ప్రభావం వేయగలిగాడు. మొదట కోరస్ గాయకుడిగా మొదలైతే సంగీత దర్శకుడు జి.కె. వెంకటేశ్ ‘అమెరికా అమ్మాయి’లో ఈ పాట పాడే అవకాశం ఇచ్చి నలుగురి దృష్టిలో పడేలా చేశాడు. ‘సిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులో’.... అని ఆనంద్ పాడుతుంటే వినబుద్ధేస్తుంది. జి.ఆనంద్ మరో సినిమాలో జి.ఆనంద్ పాడిన ‘దూరాన దూరాన తారాతీరం’ కూడా హిట్టే. ‘దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ’ డ్యూయెట్ కూడా హిట్టే. అన్నట్టు 1975లో ‘చుప్ కే చుప్కే’ విడుదలైంది. అందులోని ‘చుప్ కే చుప్కే చల్ రే ఫుర్వయ్యా’ పాట ఆ 1976లో వచ్చిన ‘ఒక వేణువు వినిపించెను’ పాటకు ఇన్స్పిరేషన్. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో... రవి చూడని... పాడని నవ్యనాదానివో... ఏ రాగమో తీగదాటి ఒంటిగానిలిచే ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే ఏ మూగ భావాలో అనురాగ యోగాలై... రవి చూడనిది కవి చూస్తాడని అంటారు. ప్రఖ్యాత చిత్రకారుడు రవి వర్మ, పైన నిత్యం తేజస్సును వెదజల్లే సూర్యభగవానుడు వీరిద్దరూ చూడని తాను మాత్రమే చూస్తున్న అందమని తన ప్రియురాలిని ఈ ప్రియుడు బుట్టలో వేసుకుంటున్నాడు. ‘రావణుడే రాముడైతే’ పెద్దగా జనాకర్షణ పొందలేదు కాని ఈ పాట పెద్ద హిట్ అయ్యి నిలిచింది. ‘ఏ గగనమో కురుల జారి నీలమై పోయే... ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే’... వేటూరి భావుకత్వం జి.కె.వెంకటేశ్ కంపోజింగ్ సౌందర్యం... వెరసి ఈ పాట.బాలు నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి... నా దాహం తీరనిది... నీ హృదయం కదలనిది దీనిని రాసిన ఆత్రేయకు ఈ పాటంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం పాడటం ఇష్టం. ‘బాలూ ఫీలవుతూ పాడతాడు. వేరేవాళ్లు పాడటానికి ఫీలవుతారు’ అని ఆత్రేయ జోక్. ‘ఇంద్రధనుస్సు’ సినిమాను అందరూ మర్చిపోయారు. కాని ఈ పాటను ఎప్పటికీ మర్చిపోలేకున్నారు. ఇందులో ప్రేమికుడి దుఃఖమేదో ఉంది. వేడుకోలు ఉంది. ఎవరికీ చెప్పుకోలేని జీర ఉంది. ‘నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది’... అంటుంటే ఎప్పుడో ఒకసారి ప్రేమలో పడినవాళ్లంతా ఐడెంటిఫై అవుతారు. కె.వి. మహదేవన్ను ప్రత్యేకంగా పొగడాల్సిన పని లేదు. ప్రతిసారీ పొగడాలంటే మన వల్ల కూడా ఎక్కడవుతుంది చెప్పండి. -
'సాంగ్'రే బంగారు రాజా
‘శంకరాభరణం’ సినిమాలో సంగీత, సాహిత్యాల గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఈ సినిమా విజయం తరువాత నిర్మాత ఏడిద నాగేశ్వరరావు (చెన్నై), డిస్ట్రిబ్యూటర్ కె.ఆర్.ప్రభు (బెంగళూరు)లు కట్టుకున్న ఇళ్లకు ‘శంకరాభరణం’ అని పేరు పెట్టుకున్నారు. శంకరా నాద శరీరా పరా... వేద విహారా హరా జీవేశ్వరా... శంకరా... శంకరా నాద శరీరా పరా... వేద విహారా హరా జీవేశ్వరా... శంకరా... పాశ్చాత్య సంగీతపు పెను తుఫాను మొదలయ్యింది. దమ్మారో దమ్... మిట్ జాయే గమ్... మోగిపోతు న్నాయి. త్యాగయ్య, క్షేత్రయ్య పాత చింతకాయ పచ్చడి. సరిగమ పదనిస... అదో పెద్ద నస. ఇలాంటి టైములో ముక్కు ముఖం తెలియని ఒక శాస్త్రిగారు, నామాలు పెట్టుకుని, ధోవతి చుట్టుకుని, గోదారి ఒడ్డున తిరుగుతూ సంగీతం.. సంగీతం అంటూ ఉంటే ఎవరు చూస్తారు? ప్రజలే చూస్తారు. చూశారు. చూస్తూ చెప్పుకుంటూనే ఉన్నారు. అమ్మను నాన్నను పుట్టిన ప్రాంతాన్ని ఈ మట్టి ఇచ్చిన సంస్కృతిని స్వీకరించడానికి ఎవరు మాత్రం సిద్ధంగా ఉండరు? మధ్యలో వచ్చిన భ్రాంతిని తొలగించుకోవడానికి ఎవరు మాత్రం అడ్డు చెప్తారు? ‘ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలాగ అంటాడు. ఎదురుదెబ్బ తగలిన బిడ్డ అమ్మా అని మరొకలాగ అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం ఉంది. శ్రుతి ఉంది. స్వరం ఉంది’ అన్న శంకరశాస్త్రి తాను నమ్మినదానిని ఎంత గట్టిగా ఆచరిస్తాడో తనను నమ్మి వచ్చిన ఆమెకు కూడా అంత గట్టిగా రక్షణ ఇద్దామనుకుంటాడు. కాని లోకం అనుమానించింది. ఆయనను పరాభవించింది. తన ఆత్మలో దోషం లేదు. అది నిప్పు. తన అర్చనలో దోషం లేదు. అది లావా. అందుకే కుండపోతలో స్వరం కదలాడింది. పరమేశ్వరుడి ఎదుట పెనుగులాడింది. ‘నాదోపాసన చేసినవాడను నీవాడను నేనైతే’... ‘నిర్నిద్రగానం’ వినిపిస్తాను విను అంటాడు శంకరశాస్త్రి. ‘పరవశాన శిరసూగంగా ధరకు జారెనా శివగంగా’ ఆ వాన ఆ మెరుపులకు మనం కూడా భయపడిపోతాము. వెండితెరపై గొప్ప గాన సృష్టి ఇది. ఆనందవృష్టి.శంకరాభరణం (1980) సంగీతం: కె.వి.మహదేవన్ రచన: వేటూరి గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా... పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ... అందమైన రంగవల్లులై... ఎండలన్ని పూల జల్లులై... ముద్దుకే పొద్దు పొడిచె... అబ్బాయి సద్బ్రాహ్మణుడు. అమ్మాయి నియమాలు పాటించే క్రిస్టియన్. కాని హార్మోనియం పెట్టెకు జంధ్యం లేదు. పోనీ అది బాప్టిజం తీసుకోలేదు. స..ప..స... ఏ మతం వాడైనా పలకొచ్చు. అదే స్వరం. ప్రేమను ఏ కులం వారైనా ప్రకటించవచ్చు. అదే జ్వరం. పాట వాళ్లిద్దరినీ కలిపింది. పాటే వారిని కోనేట్లో తామరల్లా విప్పారేలా కూడా చేసింది. అంతవరకూ లేని ఒక దృశ్యం అంతవరకూ సాధ్యం కాని ఒక గమనం తెర మీదకు తీసుకొచ్చి చూపినవాడు భారతీరాజా. సీతాకోక చిలుక కోసం తన చిన్ననాటి స్నేహితుడు ఇళయరాజాను పాటలు అడిగి నప్పుడు వేరే దర్శకులైతే ఏవో అబ్జెక్షన్స్ చెప్పొచ్చు... కాని ఈ స్నేహితుడి ముందు స్వేచ్ఛగా తాననుకుంటున్నది చూపవచ్చు. ఇంకేముంది... ఇళయరాజా ఏడు మెట్ల కోనేట్లోకి దిగాడు. తోడు వేటూరినీ దింపాడు. ఆ భావుకుల ముఖాన తొలి ఎండ పడింది. పల్లవి కోరస్‌తో మొదలైంది. ‘అందమైన రంగవల్లులై... ఎండలన్ని పూల జల్లులై.. ముద్దుకే పొద్దు పొడిచె’... ఒకే మాటను వేరువేరు భావాలతో పలికించడం వేటూరి సరదా. ‘ఓ... చుక్కా నవ్వవే నావకు చుక్కానవ్వవే’... అనడంలో చమక్కు ‘దప్పికంటే తీర్చడానికిన్ని తంటాలా’ అనడంలో మనకే దప్పిక వేయించగల చమత్కారం.. భేషో. అన్నట్టు ఈ పాటలో కోనేట్లో కంఠం వరకూ దిగిన కార్తిక్, ముచ్చర్ల అరుణ చుట్టూ తామరలు చకచకా పరుగులు తీస్తుంటాయి. నీళ్లల్లో పూర్తిగా మునిగి అలా తామర్లను కదిలించింది ఎవరో తెలుసా? ఇటీవల మరణించిన ప్రసిద్ధ నటుడు మణివణ్ణన్, ఇప్పటి తమిళ కమెడియన్ మనోబాల. వీళ్లిద్దరూ భారతీరాజా శిష్యులు. చిత్రం ఏమిటంటే షాట్ అయ్యాక కూడా వీళ్లు నీళ్లలోనే ఉంటే యూనిట్ వీళ్లను వదిలి వెళ్లిపోయిందట. వారి కష్టం... మనకు ఈ పాట మిగిల్చిన సౌందర్యం. పొందు ఆరాటాల... పొంగు పోరాటాలా...చిత్రం: సీతాకోకచిలుక (1981) సంగీతం: ఇళయరాజా రచన: వేటూరి గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్ చిన్న నవ్వు నవ్వి వన్నెలెన్నొ రువ్వి ఎన్నెన్ని కలలు తెప్పించావే పొన్నారీ... కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి... హంగ్రీ సెవంటీస్. ఎక్కడ చూసినా ఆకలి. నిరుద్యోగం. ఇళ్లల్లో వయసుకొచ్చి చేతిలో పట్టాలు పుచ్చుకొని తండ్రి సంపాదన తినలేక స్వశక్తితో సంపాదించలేక అస్థిమితంతో రగులుతున్న యువత. నో వేకన్సీతో తిప్పలు. దీనిని చూపున్నవాడు పసిగడతాడు. బాలచందర్ ‘ఆకలి రాజ్యం’ తీశాడు. కాని జీవితం అంటే ఉత్త ఆకలే కాదు ప్రేమ ఉంటుంది. కొంచెం ఇష్టం ఉంటుంది. మంచి పాట కూడా ఉంటుంది. అందరూ పాటలు పెడతారు. బాలచందర్ కొత్త తరహాగా పెడదామనుకున్నాడు. హీరోయిన్ స్వరం ఇస్తూ ఉంటుంది హీరో ఆ స్వరానికి తగ్గ పదం పాడాలి. ‘తననా తననా అన్నా తానా అన్న రాగం ఒకటే కదా’... శ్రీదేవి, కమలహాసన్ ఈ పాటలోనే ఒకరికి మరొకరి మీదున్న ఇష్టాన్ని కనుగొంటారు. ‘నీవు... నేను.. అని అన్నా... మనమే కాదా’ అనడం చేతులు కలుపుకోవడం గుడ్డిలో మెల్ల. గుడ్డి ఎందుకంటే నిరుద్యోగం. అందులో మెల్ల ఈ ప్రేమ. మనుషులు ఎంత నిరాశలో కూడా ఏదో ఒక ఆశను వెతుక్కుంటారు. ఎప్పుడైనా మూడ్ బాగాలేనప్పుడు వింటే ఈ పాట కొంచెం సరదా పుట్టిస్తుంది. ఆమె స్వరానికి మనం పాడుతున్న ఫీలింగ్ ఇచ్చి సరి చేస్తుంది. పాడండి... ‘సంగీతం... నువ్వైతే... సాహిత్యం నేనవుతా’...చిత్రం: ఆకలి రాజ్యం (1981) సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్ రచన: ఆత్రేయ గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి -
'సాంగ్'రే బంగారు రాజా
కదలింది కరుణరథం / సాగింది క్షమా యుగం మనిషి కొరకు దైవమే / కరిగి వెలిగే కాంతిపథం తెలుగులో పౌరాణికాలు అనేకానేకం. అసలు భారతీయ సినిమానే హరిశ్చంద్రుని కథతో మొదలయ్యింది. శకుంతల, దుష్యంతుడు, రాముడు, శ్రీకృష్ణుడు... వీళ్లందరి మీద సినిమాలు తీయడానికి తీసిన సినిమాలు చూడటానికి ఏ ఇబ్బందీ లేదు. కాని ఏసుక్రీస్తు మీద అంతవరకు ఎవరూ సినిమా తీయలేదు. తీస్తే చూస్తారో లేదో తెలియదు. కాని నటుడు విజయచందర్ ఈ ఒక్క సినిమా తీయడానికే పుట్టినట్టున్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా ఎవరు ఎన్ని అడ్డంకులు వేసినా ఆగకుండా ‘ప్రేమ, కరుణ, సేవ’లను బోధించిన ఏసుక్రీస్తును ప్రజలకు చేరువ చేయాలని ప్రవక్తల జీవితానికి కులం, మతం, ప్రాంతం వంటి అడ్డంకులు ఏమీ లేవని ఒక మతంగా కాకపోయినా కనీసం ఒక చరిత్రగా అయినా ఈ కథను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భావించి ఆయన ఈ సినిమా తీశాడు. సినిమా అంతా ఒకెత్తయితే క్లయిమాక్స్ ఒకెత్తు. అంతటి కరుణామయునికి శత్రువుని కూడా ప్రేమించగలిగిన మహోన్నతునికి శిలువ వేసి ఊరేగిస్తుంటే చూసిన ప్రతి కన్నూ చెమ్మగిల్లుతుంది. మరి ఆ సందర్భానికి కలం ఎన్ని వెక్కిళ్లు పెడుతుంది? ‘కదిలింది కరుణరథం సాగింది క్షమాయుగం మనిషి కొరకు దైవమే’.... హిందీలో గొప్ప వైష్ణవ భక్తి గీతాన్ని నౌషాద్ సంగీత దర్శకత్వంలో రఫీ పాడాడు. ఇక్కడ ఏసుక్రీస్తు పాత్రను విజయచందర్ పోషిస్తుంటే బాలూ అద్భుతమైన విషాదంతో ఆ వీడ్కోలు గీతాన్ని పాడుతున్నాడు. ఎంత గొప్ప విషయం ఇది. మతం- మనిషి పైకి పెట్టుకున్న జీవిత విధానం. లోలోన అందరిది ఒకటే మతం. అది మానవతా మతం. మోదుకూరి జాన్సన్ రాసిన ఈ సుదీర్ఘమైన పాటను బాలు పాడిన తీరు ఎన్నిసార్లు విన్నా శ్రోతను కళ్లనీళ్ల పర్యంతం చేస్తుంది. మనుషుల్లో కరుణ అడుగంటిన ప్రతి సందర్భంలోనూ వారిని కరిగించే పాట ఇది. కనికరం కలిగించే పాట.చిత్రం: కరుణామయుడు (1978) సంగీతం: జోసెఫ్ ఫెర్నాండేజ్, బి.గోపాలం రచన: మోదుకూరి జాన్సన్ గానం: ఎస్పీ బాలసుబ్రమణ్యం జోరు మీదున్నావు తుమ్మెదా.. నీ జోరెవరి కోసమే తుమ్మెదా.. ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా.. నీ ఒళ్లు జాగరతె తుమ్మెదా సినిమా వాళ్ల మీద సినిమాలు తీయడం తమిళంలో ఎక్కువ. తెలుగులో హీరో హీరోగా మారడం హీరోయిన్గా మారడం కథలో భాగంగా చూపించినా అసలు కథే ఒక హీరోయిన్ జీవితాన్ని చర్చించడం ‘శివరంజని’లో కనిపిస్తుంది. దీనికి దాదాపు ఆరేళ్ల తర్వాత వంశీ ‘సితార’ వచ్చింది. గాత్రం, లావణ్యం ఉన్న పల్లెటూరి అమ్మాయి మోసగాడి వలలో చిక్కి మద్రాసు చేరి సినీ తారగా గొప్ప స్థానం సంపాదించినా బంధువుల చేతిలో నానా బాధలు పడుతూ భర్త చేతిలో కష్టాలు పడుతూ ఓదార్పుగా ఒక స్నేహితుణ్ణి వెతుక్కుందామనుకుంటే అక్కడా అడ్డంకులు ఏర్పడి- తెర మీద కష్టాలు ఎదుర్కోవడం చేతనవుతున్నది కాని నిజజీవితంలో ఈ కష్టాన్ని ఎదుర్కోవడం చేత కాక ప్రాణాలు విడిచే దురదృష్టవంతురాలి కథ ఇది. ఫ్లాష్ బ్యాక్‌లో ఏక్తారా మోగించుకుంటూ జయసుధ పాడే ఈ పాట రమేశ్‌నాయుడి మేలిమి సృజనాత్మకతల్లో ఒకటి. దానికి సినారె పల్లెపదాలు జతపడటం మరింత అందం తెచ్చింది. ‘ముస్తాబు అయ్యావు తుమ్మెదా... కస్తూరి రాశావు తుమ్మెదా...’ పల్లెల్లో పెరిగినవాళ్లకే ఈ కస్తూరి పరిమళం అబ్బుతుంది. సుశీల గానంలో క్రాఫ్ట్ తెలియాలంటే ఈ పాట వినాలి. ఫ్లా లెస్.చిత్రం: శివరంజని (1978) సంగీతం: పి.రమేశ్ నాయుడు రచన: సి.నారాయణరెడ్డి గానం: పి.సుశీల మౌనమె నీ భాష ఓ మూగ మనసా... ఓ మూగ మనసా తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు... కల్లలు కాగానే కన్నీరౌతావు హృదయం గుండె కాదు. మనసు మెదడు కాదు. కొన్ని స్పందనలు హృదయం చేస్తుంది. కొన్ని మాయలకు మనసు లోనవుతుంది. మనసు- ఇది పిచ్చిది. వెర్రిది. పసిది. ఇదే ఒక్కోసారి జడల దయ్యం. మరోసారి కదలని మెదలని బండరాయి. దీని ధాటికి పతాకంలా ఎగిరినవారు ఉన్నారు. దీని దెబ్బకు పండులా రాలినవారు ఉన్నారు. ముఖ్యంగా ప్రేమ, కోరిక- స్త్రీ పట్ల పురుషుడికి, పురుషుడి పట్ల స్త్రీ- ఈ విషయంలో మనసు వెయ్యి గొంతులతో ఊళ వేసే తుఫానుగాలిలా మారుతుంది. అంతలోనే కామరూపిగా మారి వేణువులో సన్నిటి శ్వాసలా ఇమిడిపోతుంది. ‘గుప్పెడు మనసు’ సినిమాలో శరత్‌బాబు, సుజాత, సరితల మధ్య చోటు చేసుకునే ఆకర్షణ వికర్షణలకు మనసే హేతువు. ఆ సందర్భానికి పాట కావాలి. ఎమ్మెస్ విశ్వనాథన్ రెడీ. ఆత్రేయ రెడీ. పాటకు మాత్రం మనసంత లోతైన గళం కావాలి. మనసంత ఉన్నతాలకు చేరే స్వరం కావాలి. జవాబు తోచింది. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ. ఆయన పాటకు అంగీకరించాడు. మైక్రోఫోన్ ఎదుట గొంతు సవరించుకున్నాడు... అంత పెద్ద భూతం చిన్న సీసాలో దూరినట్టుగా అనంత భావాల అగాథమైన మనసూ ఒక చిన్న పాటలాగా అమరిపోయింది. ‘లేనిది కోరేవు ఉన్నది వదిలేవు... ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు’.... మనసును తేల్చి చెప్పడానికి ఇంతకు మించిన పంక్తి ఏముంది... పదం ఏముంది? ఎల్లకాలమూ మనసులు గెలిచే పాట ఇది.చిత్రం: గుప్పెడు మనసు (1979) సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్ రచన: ఆత్రేయ గానం: మంగళంపల్లి బాలమురళీకృష్ణ -
'సాంగ్'రే బంగారు రాజా
ఆ రోజుల్లో రైల్వేస్టేషన్లలో రైలు ఆగినప్పుడు పెట్టె పెట్టె తిరిగి గ్రాంఫోన్ రికార్డ్‌లు అమ్మేవారు. వాటికి మంచి ఆదరణ ఉండేది. శ్రోతల దగ్గరికే సంగీతం నడిచివచ్చేదన్నమాట! పాడనా తెనుగు పాట... పాడనా తెనుగు పాట... పరవశమై మీ ఎదుట మీ పాట... పాడనా తెనుగు పాట... కోవెల గంటల గణగణలో... గోదావరి తరగల గలగలలో... ఇవాళ్టి పాటల్లో అప్పుడప్పుడు తెలుగు కూడా వాడుతున్నారు. ఒకప్పుడైతే అంతా తెలుగే వాడేవారు. జోరుగా హుషారుగా షికారు పోదమా అనడంలో ఎంతో అందం ఉంది. షాంఘై పిల్లో... స్లీపింగ్ బ్యూటో... థండర్ బుల్లో... వెల్డన్ జిల్లో... అని రాస్తే డోకొస్తుంది తప్ప పాట రాదు. డెబ్బైలలో అందరూ పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులు కావడం మనదేశంలో ఏముందండీ బొంద అనడం ఫ్యాషనైపోయింది. దానిని నిరోధించడానికి హిందీలో మనోజ్ కుమార్లాంటివాళ్లు సినిమాలు తీశారు. తెలుగులో అమెరికా అమ్మాయి, శంకరాభరణం లాంటి సినిమాలు వచ్చాయి. అమెరికా నుంచి వచ్చిన ఒకమ్మాయి తెలుగింటి కోడలుగా మారి, ఇక్కడి వేష భాషలకు గౌరవం ఇచ్చి, ఇక్కడి తెలుగుకు విలువ ఇచ్చి ఇక్కడి వారి భేషజాన్ని దూరం చేస్తుంది ‘అమెరికా అమ్మాయి’ సినిమాలో. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఆలోచనకు జి.కె.వెంకటేశ్ సంగీతం కుదిరింది. ఇటువంటి సందర్భానికి కృష్ణశాస్త్రి కలం తెలుగు నుడిలో ఈతలు కొట్టి అవలీలగా ఒడ్డుకు చేరుతుంది. ‘ఒక పాట... పాడనా తెనుగు పాట’ అని సుశీల పాడుతుంటే శరీరం రోమాంచితం అవుతుంది. ‘మావుల తోపుల మూపుల పైన మసలే గాలుల గుసగుసలో’ తేలియాడి వచ్చే ఆ తెలుగు పాటకు నమస్కరించిన ఈ సినిమాకు వందనం. ఇద్దరు తల్లుల పెట్టని కోట- తెలుగు రాష్ట్రాల ప్రతినోట- ఒక పాట- పాడనా తెలుగు పాట....చిత్రం: అమెరికా అమ్మాయి (1976) సంగీతం: జి.కె.వెంకటేశ్ రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం: పి.సుశీల చిత్రం భళారే విచిత్రం... చిత్రం అయ్యారే విచిత్రం... / నీ రాచనగరకు రారాజును రప్పించుటే విచిత్రం... /పిలువకనే ప్రియవిభుడే విచ్చేయుటే విచిత్రం సుయోధనుడు ఈర్ష్యాపరుడు. జిత్తులమారి. దుష్టచతుష్టయంలో ఒకడు. ఇది నిజమే కావచ్చు. లేదంటే పాండవుల ప్రచారం కావచ్చు. కాని అతడు ఒక సంపూర్ణమైన పురుషుడు. తన పట్టమహిషికి మానస వల్లభుడు. అతడికీ లతలంటే ఇష్టం ఉండొచ్చు. పుష్పోద్యానవనాలంటే కుతూహలం ఉండొచ్చు. మంచి రసభరితమైన రాత్రి భార్య వేళ్లకు చుట్టిన తమలపాకు చిలకలను మునిపంట కొరకాలనే కోరిక కలిగి ఉండవచ్చు. అది ఎందుకు చూపించకూడదు అనుకున్నారు ఎన్.టి.రామారావు. అది విని హవ్వ అని నోరు నొక్కుకున్నారు. కవి సి.నారాయణ రెడ్డి మాత్రం భళా అని కలం అందుకున్నారు. పాట సిద్ధమైంది. చిత్రం... అయ్యారే విచిత్రం... భళారే విచిత్రం.... ఎన్.టి.ఆర్, ప్రభల మీద ఆ పాట తెర మీద వస్తూ ఉంటే విమర్శిద్దామనుకున్నవాళ్లు నోళ్లు వెళ్లబట్టారు. అందులోని రాజసంతో నిండిన శృంగారానికి సలాం కొట్టారు. ‘ఎంతటి మహరాజైనా ఎపుడో ఏకాంతంలో... ఎంతో కొంత తన కాంతను స్మరించడమే సృష్టిలోని చిత్రం’ అనంటే ఆ మాట నిజమే కదా అని చప్పట్లు కొట్టారు. పెండ్యాల ట్యూన్‌ను వింటే ఒరిజినల్ సుయోధనుడు కూడా భేష్ అనాల్సిందే. పాట పాడేటప్పుడు ఎన్టీఆర్ బాలూను పూనడం చూడొచ్చు. ఇక సుశీలమ్మ అంటారా... మాయూరే- కోయిల కూడా ఈర్ష్య పడే గళం.చిత్రం: దాన వీర శూరకర్ణ (1977) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు రచన: సి.నారాయణరెడ్డి గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల యాతమేసి తోడినా ఏరు ఎండదు... పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు దేవుడి గుడిలోదైనా... పూరిగుడిసెలోదైనా... గాలి యిసిరికొడితే ఆ దీపముండదు ‘ప్రాణం ఖరీదు’ ఎంత అని డెబ్బైలలో నాటక రచయిత సి.ఎస్.రావు ప్రశ్నించారు. దానికి జనం ఇప్పటికీ సమాధానం వింటూనే ఉన్నారు. కల్తీ మద్యం తాగితే ఇంత, గేట్లు లేని క్రాసింగ్ దగ్గర రైలు కింద పడి చచ్చిపోతే ఇంత, వేగం అదుపు చేయకపోవడం వల్ల ప్రైవేటు బస్సు బోల్తా పడితే ఇంత, ఆడపిల్లను అర్ధరాత్రి తోడేళ్ల వలే కమ్మేస్తే ఆ రేటు కొంచెం చూసుకుని మరీ ఇంత, క్వారీలో మనిషి కూలిపోతే ఇంత, కల్తీ సిమెంటు వంతెన విరిగి పడితే ఇంత... ప్రభుత్వాలు, వ్యవస్థ మనిషి ప్రాణానికి రేటు కడుతూనే ఉన్నాయి. అన్నీ పేదవాళ్ల ప్రాణాలే. నోరు లేని వాళ్ల ప్రాణాలే. అమాయకుల ప్రాణాలే. పెద్ద ధనవంతుడెవరైనా ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్లో పోయినట్టుగా వినం. ఎక్స్‌గ్రేషియా తీసుకున్నట్టుగా కూడా వినం. గతిలేని వాళ్లకే ఎక్స్‌గ్రేషియా పడేస్తారు. కాని వీరంతా నిజంగా వేరు వేరా? వీరు ఎక్కువా? వారు తక్కువా? ‘అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే సీము నెత్తురులు పారే తూము ఒక్కటే’ అని కవి అంటాడు. అది పుట్టుక ఒకటే అయినప్పుడు ఈ హెచ్చుతగ్గులు ఎందుకు. ‘మేడ మిద్దెలో ఉన్నా సెట్టు నీడ తొంగున్నా నిదర ముదర పడినాక పాడె ఒక్కటే వల్లకాడు ఒక్కటే’... వాడూ ఏం పట్టుకెళ్లడు. వీడూ ఏం పట్టుకెళ్లడు. మరి ఎందుకు ఈ పీడన? బీదోడికి దండన? మహాకవి జాలాది రాసిన ఈ పాటకు మరణం లేదు. కనీసం పేదరికం ఉన్నంతకాలమైనా లేదు. నాటకం ఆధారంగా తీసిన ఈ సినిమా చిరంజీవికి పెద్ద గుర్తింపు.చిత్రం: ప్రాణం ఖరీదు (1978) సంగీతం: కె.చక్రవర్తి రచన: జాలాది గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం -
'సాంగ్'రే బంగారు రాజా
ఉర్రూతలూగించే సినిమా పాటలే కాదు ‘ఇళయరాజా క్లాసికల్స్ ఆన్ మాండోలిన్’ ఆల్బమ్‌లో కొన్ని కృతులను కర్ణాటక సంప్రదాయంలో స్వరపరిచారు ఇళయరాజా. పూజలు చేయ పూలు తెచ్చాను / నీ గుడి ముందే నిలిచాను... తీయరా తలుపులను రామా... ఇయ్యరా దర్శనము... రామా... దొరికిన దేవతను పూజించు. కరుణించని దేవతను వదిలిపెట్టు. వశమైన ప్రభువునే సేవించు. జారిపోయిన విభుడిని వదిలిపెట్టు. వివాహానికి ముందు మనసు అనే అద్దంలో ఎన్నో ప్రతిబింబాలు కనపడుతూ ఉంటాయి. కవ్విస్తూ ఉంటాయి. ఉలికులికి పడేలా చేస్తుంటాయి. కాని వివాహం అయ్యాక ఒకే ప్రతిబింబం స్థిరపడిపోతుంది. అదే చిత్తరువులా మారి గోడకు వేలాడుతుంది. ‘పూజ’లో హీరో రామకృష్ణ వేరొకరిని ప్రేమిస్తాడు. కాని వాణిశ్రీని పెళ్లి చేసుకుంటాడు. ఇది కుండ అని ఈ నీరు చల్లనైనవని గ్రహించడు. ప్రవాహం కోసం అర్రులు చాస్తుంటాడు. ఆ ప్రవాహం తన మానాన తాను ప్రవహించిపోయిందని తెలుసుకున్నాక తాను ఇంతకాలం ఏం కోల్పోయాడో తెలుసుకుని లెంపలేసుకుంటాడు. వాణీ జయరామ్ ఈ పాటను తన లగ్న పరిచిన గానంతో పవిత్రం చేస్తుంది. దాశరథి రచన అందుకు కావలసిన తులసి పదాలను అందిస్తుంది. ఇక రాజన్ - నాగేంద్ర శ్రద్ధ తెలుస్తూనే ఉంటుంది. 1971లో హిందీలో ‘గుడ్డీ’ వచ్చింది. అందులో వాణీ జయరామ్ పాడిన ‘బోల్ రే పపీహరా’ పాట పెద్ద హిట్. దానిని కొంచెం సులభం చేసుకుంటే ‘పూజలు చేయ పూలు తెచ్చాను’...చిత్రం: పూజ (1975) సంగీతం: రాజన్-నాగేంద్ర రచన: దాశరథి గానం: వాణీ జయరామ్ దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి... ఇక ఊరేల? సొంత ఇల్లేల? ఓ చెల్లెలా / ఏల ఈ స్వార్థం..? ఏది పరమార్థం...? నన్నడిగి తలిదండ్రి కన్నారా..? నా పిల్లలే నన్నడిగి పుట్టారా? / పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా... ఈ దేశంలో మధ్య తరగతి ఒక పెద్ద బజార్. అక్కడే సరుకులుంటాయి. కొనలేము. అక్కడే మనుషులుంటారు. అమ్మలేము. సరుకులు కావాలంటే డబ్బులు కావాలి. పెళ్లి కావాలంటే కట్నం ఇవ్వాలి. ఆడపిల్లలున్న తండ్రి పరారవుతుంటాడు. బాధ్యత మోయాల్సిన అన్న తాగుబోతు అవుతుంటాడు. ఉన్న చెల్లెలికి ఎప్పటికీ పెళ్లి కాదు. తల్లికి జబ్బు అసలే తగ్గదు. ఒక తమ్ముడికి పోలియోనో చూపు ఉండదో. ఇక బజారు ఎలా నడవాలి? ఈ ఇంట్లో కనీసం అరవై కాండిళ్ల బల్పు ఎలా వెలగాలి? అలాంటప్పుడే ఎవరో ఒకరు మోస్తారు. అన్నీ తలకెత్తుకుంటారు. పంటి బిగువున బాధ దిగమింగుతూ ఇంటిని ఒంటి చేత్తో లాగుతారు. ‘అంతులేని కథ’లో జయప్రద లాంటి అక్క అప్పుడే కాదు ఇప్పుడూ ఉంది. ఎప్పుడూ ఉంటుంది ఈ దేశంలో. ఏమో... అందరం బాగుపడతామేమో... ఎప్పటికైనా మంచి జరుగుతుందేమో... కాని మర్యాదల మధ్యతరగతి తెగించలేదు. అలాగని పతనమూ కాలేదు. ‘ముళ్ల చెట్టుకు చుట్టూ కంచె ఎందుకు పిచ్చమ్మా... కళ్లు లేని కబోది చేతి దీపం నువ్వమ్మా’... అవును అది నిజం. అందుకే తాగుబోతైనా నిజం చెప్పాడు ‘నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలును పోవమ్మా’... కాని ఆమె తన స్వార్థం తాను చూసుకోదు. కథంతా అయిపోయాక మళ్లీ అదే బస్‌స్టాప్ దగ్గర నిలబడుతుంది. అదే టికెట్‌ను మళ్లీ తీసుకుంటుంది. తెలుగు శ్రోతలు దశాబ్దాలుగా ఈ పాట వింటున్నారు. ఇప్పటికీ హాంట్ చేస్తూనే ఉంది. కె.జె.ఏసుదాస్, ఆత్రేయ, ఎం.ఎస్.విశ్వనాథన్... అందరివీ మధ్యతరగతి ఆత్మలు. అందుకే ఈ పాట మాయని ఆత్మతో రింగుమంటూనే ఉంటుంది.చిత్రం: అంతులేని కథ (1976) సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్ రచన: ఆత్రేయ గానం: కె.జె.ఏసుదాస్ ఓ ప్రియతమా... ప్రియతమా... ప్రియతమా... నా మది నిన్ను పిలిచింది గానమై... వేణుగానమై నా ప్రాణమై... ముఖేశ్‌ను తెలుగులో వినే భాగ్యం రాలేదు. కిశోర్‌నూ రాలేదు. కాని రఫీతో భాగ్యం వచ్చింది. అంతా నిర్మాత పుండరీకాక్షయ్య పట్టుదల, పుణ్యం. ‘భలే తమ్ముడు’లో ‘ఎంతవారు కాని వేదాంతులైన కాని’ అని రఫీ పాడితే తెలుగువారు విని తబ్బిబ్బయ్యారు. ఉత్నా బడా సింగర్ తెలుగులో పాడతాడా అని మురిసిపోయారు. ఆ తర్వాత ఆ చెన్నై-ముంబై బంధం కొనసాగింది. ఎన్టీఆర్- రఫీల బంధం... నిమ్మకూరు కాయ- ఉత్తరాది ఉప్పులాగా కలగలసిపోవాలని తిరుమలేశుడు నిర్ణయిస్తే చేసేదేముంది? ‘నా మది నిన్ను పిలిచింది గానమై’... అని పాడుకోవడం తప్ప. హిందీలో రామానంద్ సాగర్ తీసిన ‘జీత్’ పెద్ద హిట్ అయితే తెలుగులో రీమేక్ చేశారు. అందులో కల్యాణ్‌జీ-ఆనంద్ జీ చేసిన బాణీలను తెలుగులో సాలూరు హనుమంతరావు యథాతథంగా వాడారు. ఉర్దూలో పండితుడైన సినారెకు ఆ హిందీ బాణీకి తగిన తెలుగు వరస రాయడం చిటికెలో పని. ‘తలపులలోనే నిలిచేవు నీవే తొలకరి మెరపుల రూపమై’... అని చేతిలో పిల్లనగ్రోవితో కులూ లోయ ప్రవాహం అంచున కూచుని ఎన్టీఆర్ పాడటం... మెరుపు తీగలా ఉన్న వాణిశ్రీ అతణ్ణి వెతుక్కుంటూ ఆ సానువుల్లో కుతూహలపడటం... ఒక తాజా ఆపిల్బుట్టలాంటి జ్ఞాపకం. రఫీ... నీ పాటకు మేం ఆల్వేస్ హ్యాపీ.చిత్రం: ఆరాధన (1976) సంగీతం: సాలూరి హనుమంతరావు రచన: సి.నారాయణరెడ్డి గానం: రఫీ, ఎస్.జానకి -
మైండ్ మ్యూజిక్
‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణి’ అన్నారు పెద్దలు. జోలపాటల సంగీతానికి శిశువులు ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటారు. చక్కని సంగీతానికి పశువులు పరవశిస్తాయి. అంతేనా..? శ్రావ్యమైన సంగీతానికి పాములు కూడా తలలూపుతాయట! మాటల పుట్టుకకు ముందు నుంచే నాదం ఉంది. ఏ భాషా ఎరుగని పశుపక్ష్యాదుల ధ్వనులే సప్తస్వరాలకు మూలం అంటారు. ప్రపంచవ్యాప్తంగా సంగీతంలో రకరకాల సంప్రదాయాలు ఉన్నా, వాటన్నింటికీ సప్తస్వరాలే ఆధారం. సంగీతానికి స్పందించని మనుషులు ఉండరు. మనుషులే కాదు, లోకంలో సంగీతానికి స్పందించని జీవులే ఉండవు. కర్ణపేయమైన సంగీతాన్ని ఆలపించినా, ఆలకించినా కలిగే లాభాలు లెక్కలేనన్ని ఉన్నాయి. మచ్చుకు వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం. 1. జ్ఞాపకశక్తికి దివ్యౌషధం జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఎన్ని మందులు, మూలికలు అందుబాటులో ఉన్నా, అవన్నీ వీనులవిందు చేసే సంగీతం ముందు బలాదూర్. మతిమరపు జబ్బు బారిన పడిన వయోవృద్ధుల్లో సైతం జ్ఞాపకాల తేనెతుట్టెను కదిలించడం సంగీతానికి మాత్రమే సాధ్యం. కుటుంబ సభ్యుల పేర్లు సైతం గుర్తులేని స్థితికి చేరుకున్న వారు కూడా తమ చిన్ననాటి పాటలకు వెంటనే స్పందిస్తారు. మరుగునపడిన జ్ఞాపకాలను వెలికి తీయడంలో సంగీతానికి మించిన సాధనమేదీ లేదని పలు ఆధునిక పరిశోధనలు నిరూపిస్తున్నాయి. 2. ఏకాగ్రతకు సాధనం మనసు కళ్లెంలేని గుర్రంలాంటిది. అదుపు చేసే సాధనమేదీ లేకపోతే పరుగులు తీస్తూనే ఉంటుంది. కాస్త కూడా కుదురుగా ఉండదు. దేని మీదా ఏకాగ్రత ఉండదు. చదువు సంధ్యలు సజావుగా సాగాలంటే ఏకాగ్రత తప్పదు. కాని ఒకపట్టాన కుదిరి చావదే! అలాంటి పరిస్థితుల్లో జ్ఞాన సముపార్జనపై గురి కుదరాలంటే ‘సంగీత జ్ఞానము’ వినా శరణ్యం లేదు. ఆహ్లాదభరితమైన సంగీతం వింటూ కాసేపు సేదదీరితే మనసు తేలిక పడుతుంది. మనోవీధిలో దౌడుతీసే ఆలోచనల గుర్రాల దూకుడు క్రమంగా నెమ్మదిస్తుంది. వీనులను సోకే స్వర తాళాలపైనే దృష్టి కేంద్రీకృతమవుతుంది. ఏమాత్రం శ్రమ లేకుండానే, చెమట చిందించకుండానే తిరుగులేని ఏకాగ్రత తప్పకుండా కుదురుతుంది. 3. సాంత్వనామృతం కష్టాల్ నష్టాల్ వస్తే రానీ అనేంత దమ్ము ధైర్యం మనుషుల్లో చాలామందికి ఉండదు. చిన్నా చితకా కష్టాలకు కూడా కుంగి కుదేలైపోతూ ఉంటారు. బతుకుపోరులో ఓటమి ఎదురైనప్పుడల్లా జీవితం మీద బెంగటిల్లిపోతుంటారు. మనసుకు తగిలిన గాయాలకు విలవిలలాడి విలపిస్తూ ఉంటారు. అలాంటి వారికి సాంత్వన కలిగించే శక్తి సంగీతానికే ఉంది. 4. ఉత్సాహానికి ఊపిరి నిదానంగా వినిపించేటప్పుడు లాలనగా ఊరట కలిగిస్తుంది స్వరమాధురి. అయితే, వేగం పుంజుకుని ఉరకలేసే స్వరఝరి ఉత్సాహానికి ఊపిరిపోస్తుంది. నీరవ నిశ్శబ్దంలో కఠిన వ్యాయామాలు చేస్తే త్వరగా అలసిసొలసి నీరసిస్తారు. ‘జిమ్మంది’నాదం అంటూ జోరైన సంగీతం వినిపిస్తే ఉత్సాహంగా వ్యాయామం చేసేస్తారు. 5. సృజనకు పునాది ఎవరికైనా అమ్మపాడే జోలపాటలతో సంగీతంతో పరిచయం మొదలవుతుంది. వయసు పెరిగే కొద్దీ రకరకాల పాటలు చెవినపడుతూ ఉంటాయి. కొన్ని అప్పటికప్పుడు ఆకట్టుకుంటాయి. ఇంకొన్ని అదేపనిగా వెంటాడుతూ ఉంటాయి. మరికొన్ని మనోఫలకంలో చెరగని ముద్రవేస్తాయి. సంగీత సాహిత్యాల మేలిమి సమ్మేళనమైన పాటలు శ్రోతల స్మృతిపథంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. స్మృతిపథంలో చిరస్థాయిగా నిలిచిపోయే పాటలు సృజనకు పునాదిగా నిలుస్తాయి. వీనుల విందు చేసే ఒక పాట చూడచక్కని ఒక చిత్రానికి ప్రేరణనిస్తుంది. ఉరకలేయించే ఒక పాట సరికొత్త కవనకుతూహలానికి ఉత్ప్రేరకంగా నిలుస్తుంది. అబ్బురపరచే స్వరకల్పనలు శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలకు ఆలంబనగా నిలుస్తాయి. 6. ఆరోగ్య సిద్ధికి సోపానం ‘అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము’ అని శంకరశాస్త్రి చేత అనిపించారు వేటూరి. సంగీతంతో అద్వైత సిద్ధి, అమరత్వ లబ్ధి కలుగుతాయో లేదో చెప్పలేం గాని, ఆరోగ్య సిద్ధి మాత్రం తథ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడైతే దీనికి ‘మ్యూజిక్ థెరపీ’ అని పేరు పెట్టారు గాని, అప్పట్లో ముత్తుస్వామి దీక్షితార్ సంగీతానికి గల ఈ మహిమను స్వయంగా నిరూపించారు. ముత్తుస్వామి దీక్షితార్ శిష్యుల్లో ఒకరు కడుపునొప్పితో విలవిలలాడుతూ ఉండేవాడు. ఎన్ని మందులు వాడినా అతడి కడుపునొప్పి నయం కాలేదు. జ్యోతిషవేత్త కూడా అయిన దీక్షితార్ అతడి జాతకాన్ని పరిశీలించారు. గురుగ్రహ దోషం వల్లనే తన శిష్యుడికి కడుపునొప్పి వచ్చిందని గ్రహించారు. అతడికి ఉపశమనం కలిగించాలనుకున్నారు. అంతే... ‘బృహస్పతే తారాపతే’ అంటూ అఠాణారాగంలో ఆశువుగా కీర్తన అందుకున్నారు. శిష్యుడికి బాధా విముక్తి కలిగించారు. ఆ తర్వాత మిగిలిన గ్రహాలపైనా కీర్తనలు రచించారు. 7. అధ్యయన శక్తికి ఆలంబన సుస్వరభరితమైన సంగీతం అధ్యయన శక్తికి ఆలంబనగా నిలుస్తుంది. వీనుల విందైన స్వరఝరిని కొన్ని నిమిషాలే ఆలకించినా, మెదడుపై ఆ ప్రభావం చాలాకాలమే ఉంటుంది. అద్భుతమైన స్వరకల్పనలు, లయ విన్యాసాలు జిజ్ఞాసను రేకెత్తిస్తాయని, ఫలితంగా అధ్యయన శక్తిని మెరుగుపరుస్తాయని పలు ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. తరచుగా సంగీతం వినే విద్యార్థులు త్వరగా కొత్త విషయాలను నేర్చుకోగలుగుతారని, ప్రయోగాలపై ఆసక్తి కలిగి ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సంగీతం నేర్చుకునే పిల్లలు మిగిలిన వారి కంటే నిలకడగా, క్రమశిక్షణతో ఉంటారని కూడా అంటున్నారు. 8. ప్రగతికి ప్రేరణ ఎగుడుదిగుడు జీవితంలో ఎదగడానికి తగిన ప్రేరణ ఇచ్చే శక్తి సంగీతానికి మాత్రమే ఉంది. పరాభవాలు, పరాజయాలు ఎదురైనా, నిర్దేశించుకున్న లక్ష్యం వైపు పట్టువీడకుండా ముందుకు సాగడానికి తగిన బలం ఇవ్వడానికి ఒక స్ఫూర్తిమంతమైన పాట చాలు. ఎవరేమన్నను... తోడు రాకున్నను... గమ్యం చేరుకునే దాకా ముందుకు సాగడానికి... బతుకుబాటలో పురోగతి సాధించడానికి... 9. శ్రమైక జీవనానికి సౌందర్యం శ్రమైక జీవనానికి సౌందర్యం ఇచ్చేది సంగీతమే. పనితో పాటే పుట్టిన పాట జానపదుల నోట దిద్దుకున్న సొబగులెన్నెన్నో! కాయకష్టాన్ని మరపించే శక్తి హుషారైన పాటలకు మాత్రమే ఉంది. అందుకే, ‘ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపేమున్నది...’ అన్నాడు సినీకవి. అలసట తెలియనివ్వని జీవామృతం కదా సంగీతం! 10. ఉత్పాదకతకు ఉత్ప్రేరకం సంగీతం ఉత్పాదకతకు ఉత్ప్రేరకంగా నిలుస్తుంది. మౌనం మంచిదే కావచ్చు గాని, నిశ్శబ్ద వాతావరణంలో గంటల తరబడి పనిచేస్తూ ఉంటే, ఉత్సాహం అడుగంటుతుంది. ఉత్సాహం అడుగంటినప్పుడు ఉత్పాదకత పడిపోతుంది. అలాగని రణగొణ ధ్వనులు వినిపిస్తుంటే ఏకాగ్రత కుదరదు. కర్ణకఠోరమైన శబ్దకాలుష్యం కూడా ఉత్పాదకతకు చేటు చేస్తుంది. అటు నిశ్శబ్దం, ఇటు రణగొణలు కాకుండా, శ్రావ్యమైన సంగీతం వింటూ పనిచేస్తుంటే ఉత్సాహం ఉరకలేస్తుంది. పని వేగంగా సాగుతుంది. మంచి సంగీతాన్ని వినిపిస్తే పశువులు కూడా ఎక్కువ పాలిస్తాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. మ్యూజిక్ చేసే మ్యాజిక్ ఎలాంటిదో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలదూ! -
'సాంగ్'రే బంగారు రాజా
రాజాజీ నవల ఆధారంగా సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ‘దిక్కట్ర పార్వతి’ (1974) తమిళ చిత్రానికి సుప్రసిద్ధ వైణికుడు చిట్టిబాబు సంగీత దర్శకత్వం వహించారు. ఇంకో విశేషం ఏమిటంటే ఆయన ‘లైలామజ్నూ’ (1949) చిత్రంలో బాల మజ్నూ పాత్ర కూడా పోషించారు. స్నేహబంధము ఎంత మధురము చెరిగిపోదు తరగిపోదు / జీవితాంతమూ.... కొన్ని సినిమాలు ఎటు పోతాయో తెలియదు. 1973లో విడుదలైన స్నేహబంధం సినిమా కూడా ఎటు పోయిందో ఎవరికీ తెలియదు. పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం. దాసరి నారాయణరావు మాటలు. కృష్ణ, కృష్ణంరాజు, సత్యనారాయణ, జమున తారాగణం. ఆ రోజుల్లో యాభై రోజులు ఆడినట్టుగా ఆంధ్రపత్రికలో యాడ్ వచ్చింది. కాని అందులోని ఈ పాట మాత్రం ఇప్పటికీ ఆడుతోంది. ‘స్నేహబంధమూ... ఎంత మధురము... చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము’... బహుశా స్నేహం అంటే అందరికీ ఇష్టం కావడం వల్ల, స్నేహితుడు లేని మనిషి లేకపోవడం వల్ల, ప్రతి ఒక్కరి బాల్యంలో ఎవరో ఒకరు గాఢంగా స్నేహం చేసి ఉన్నందువల్ల, దానిని అంతే నమ్మకంతో ఆత్రేయ రాయడం వల్ల, ఎంతో మధురంగా సత్యం బాణీ కట్టడం వల్ల ఈ పాట నిలిచింది. ‘మల్లెపూవు నల్లగా మాయవచ్చును... మంచు కూడా వేడి సెగలు ఎగయవచ్చును’... కాని స్నేహం మాత్రం చెక్కు చెదరదు అంటారు ఆత్రేయ ఈ పాటలో. బాలు, సుశీల, ఆనంద్, రామకృష్ణ పాడిన ఈ పాట నిత్య మధురం. ముస్తాఫా.. ముస్తాఫా... డోన్ట్ వర్రీ ముస్తాఫా జనరేషన్‌కు ఈ పాట వినిపించాలి. ‘డోన్ట్ వర్రీ పాట’ను తక్కువ చేసేది ఏమీ లేదు కాని ఇలాంటి మంచి తెలుగు పాటను ఆ పాట చెప్పే బంధాన్ని పిల్లలకు వినిపించకపోతే మాత్రం నిజంగానే వర్రీ.చిత్రం: స్నేహబంధం (1973) సంగీతం: సత్యం; రచన: ఆత్రేయ గానం: రామకృష్ణ, బాలు, పి.సుశీల, జి.ఆనంద్ స్నేహమే నా జీవితం / స్నేహమేరా శాశ్వతం స్నేహమే నాకున్నది / స్నేహమే నా పెన్నిధి ‘జంజీర్’ స్క్రిప్ట్ సలీమ్-జావెద్లో సలీమ్ రాశాడు. దానిని ముందు ధర్మేంద్రకు అమ్మాడు. ఆ తర్వాత దేవ్ ఆనంద్ యాక్ట్ చేయాల్సింది. చివరకు దాని నొసటన అమితాబ్ బచ్చన్ పేరు రాసి ఉంది. అమితాబ్ కెరీర్‌ని, హిందీలో హీరో క్యారెక్టర్ని మార్చిన సినిమా అది. తెలుగులో అంత రౌద్రంగా, పవర్‌ఫుల్‌గా నటించడానికి కొత్త హీరో అక్కర్లేదు. నిప్పులాంటి మనిషి ఎన్టీ రామారావు ఉండనే ఉన్నాడు. అలా రీమేక్ అయ్యింది ‘నిప్పులాంటి మనిషి’. జంజీర్లో ‘యారీ హై ఈమాన్ మేరా’ ఖవ్వాలీ పెద్ద హిట్. గుల్షన్ బావ్రా రాసిన ఈ ఖవ్వాలీని మన్నా డే పాడాడు. విధి నిర్వహణలో పడి ఒత్తిడికి లోనవుతున్న అమితాబ్‌ను అతని స్నేహితుడైన పఠాన్ పాత్రధారి ప్రాణ్ పిలిచి విందు ఇస్తాడు. ఆ సందర్భంలో నీకు నేనున్నాను నా స్నేహం ఉంది అని పాట ద్వారా చెప్తాడు. తెలుగులో ప్రాణ్ పాత్రను సత్యనారాయణ వేశాడు. రాసే పని సహజంగానే సినారెకు వచ్చింది. ‘అల్లాయే దిగి వచ్చి ఆయ్ మియా ఏమి కావాలంటే’.. అని సాకీ రాసి ‘స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం’ అని అద్భుతమైన పల్లవి రాశారు సినారె. పఠాన్లు స్నేహం చేస్తే ఖయామత్ తక్ అంటే కలియుగాంతం వరకూ స్నేహమే చేస్తారు. బహుశా స్నేహం పాటలను తెలుగులో ఎంచాలంటే ఖయామత్ తక్ ఈ పాట కూడా ఎంచబడుతూనే ఉంటుంది.చిత్రం: నిప్పులాంటి మనిషి (1974) సంగీతం: సత్యం రచన: డా.సి. నారాయణరెడ్డి గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుశలమా నీకు కుశలమేనా... మనసు నిలుపుకోలేక... మరీమరీ అడిగాను... అంతే అంతే అంతే... కుశలమా నీకు కుశలమేనా... ఒక అగ్రహారం అమ్మాయి ఒక దళితుడిని వివాహం చేసుకోవలసి వస్తుంది విధివశాత్తు. తాళి కట్టే సమయం కాసేపే కావచ్చు. కాని ఆ తర్వాత ఏళ్ల తరబడి కాపురం చేయాలి. ఇంట్లో భర్త ఒక్కడే ఉండడు. అత్త ఉంటుంది. మామ ఉంటాడు. ఇంకా వచ్చేవాళ్లు పోయేవాళ్లు ఉంటారు. ‘మీ పద్ధతులు నాకు నచ్చట్లేదు’ అంటే ఎలా? వచ్చింది నువ్వు. వాళ్లు కాదు. అడ్జస్ట్ కావాల్సింది నువ్వే. వాళ్లు కాదు. కాని ఆమె వెళ్లిపోయింది. భర్తను చులకన చేసి అత్తింటిని పలుచన చేసి... ఆమె నిర్ణయం ఒక బలిపీఠం. అది ఎందరిని బలి కోరింది? మొదటైతే వారి ప్రేమను బలి కోరింది. ఎడబాటుకు ముందు ఆ జంట ఎలా ఉండేది? ఒకరిని మరొకరు చూసి మురిసిపోతూ... ఒక్క క్షణం ఎడబాటు వచ్చినా ఏమో ఎలా ఉన్నారో అంటూ కుశలం తెలుసుకోవాలని ఉబలాట పడుతూ... చేయీ చేయీ పట్టుకుని పాడుతూ... ‘మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే... అంతే.. అంతే’.... చక్రవర్తి, కృష్ణశాస్త్రి కలిసి పని చేయడం కొంచెం విడ్డూరమే. కాని చక్రవర్తి తాను చేసిన పాటల్లో ఈ పాటను ఎంతో లలితంగా మెరిపిస్తాడు. కృష్ణశాస్త్రి మాటకు ఇంతకు మించి ఎవరూ న్యాయం చేయలేరన్నట్టుగా బాణీ కడతాడు. ‘అంతేనా’... అని ఎవరైనా అంటే ‘అంతేలే’.... అనక తప్పదు. బాలూ స్వేచ్ఛ సుశీల సామర్థ్యం మనకు తెలుస్తుంది. శోభన్‌బాబు, శారద కలిసి ‘పూలగాలి రెక్కల పైన నీలిమబ్బు పాయల పైనా’ ఈ పాటను ఎగురవేస్తూ గుర్తుండి ఇలా గుర్తొస్తూనే ఉంటారు.చిత్రం: బలిపీఠం (1975) సంగీతం: చక్రవర్తి రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల -
'సాంగ్'రే బంగారు రాజా
‘సిరివెన్నెల’ సినిమాలో పాటలన్నీ సంగీత ప్రియులను ఓలలాడించేవే. ఇందులో అంధుడైన కథానాయకుడు వేణువు వాయిస్తూ ఉంటాడు. సుప్రసిద్ధ హిందుస్తానీ వేణువాద్య విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా తెరవెనుక వినిపించిన వేణువే ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. కురిసింది వానా... నా గుండెలోనా... నీ చూపులే జల్లుగా... ముసిరే మేఘాలు... కొసరే రాగాలు... కురిసింది వానా... నా గుండెలోనా వాన అనగానే తెలుగులో రెండు పాటలు ఫేమస్. ఒకటి చిటపట చినుకులు పడుతూ ఉంటే. దానిని రాసింది ఆత్రేయ. పాట కట్టింది మహదేవన్. మహామహులు. మంచిదే. కాని ఆపిల్ పండు వీలుగాని చోట సలీసుగా దొరికిన సీతాఫలం కూడా మేజిక్ చేస్తుంది. బుల్లెమ్మ-బుల్లోడు కోసం సత్యం, రాజశ్రీ అలా మేజిక్ చేసినవారే. తెర మీద కూడా సూపర్‌స్టార్స్ ఏమీ కాదు. చలం, విజయలలిత. కాని పాట నిలబడింది. అమీర్‌పేట్ మీద కొంచెం మబ్బు పట్టినా సీతమ్మధారలో జల్లు కురిసినా రాయల చెరువు మీద కుమ్మరించి పోసినా ఈ పాటే గుర్తుకొస్తుంది. ‘కురిసింది వాన.. నా గుండెలోన... నీ చూపులే జల్లుగా’.... పెద్ద వాన కాదు. అలాగని జల్లు కూడా కాదు. స్థిరంగా నెమ్మదిగా తడవబుద్ధేసే వాన ఎలా ఉంటుందో అలా ఉంటుంది పల్లవి. సత్యం కన్నడ, తెలుగు రంగాలలో స్టార్‌గా ఉన్నాడు. రాజశ్రీ మంచి పాటలు, మాటలు రాయగలిగినా డబ్బింగ్ కింగ్‌గా కొనసాగాడు. చలం మట్టిలో మాణిక్యం. వీళ్లందరూ కలిసి ప్రతివానలో ఈ గొడుగును అందించేసి వెళ్లారు.చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972) సంగీతం: సత్యం రచన: రాజశ్రీ గానం: బాలు, సుశీల బూచాడమ్మా బూచాడు... బుల్లిపెట్టెలో ఉన్నాడు... కళ్లకెపుడు కనపడడు... కబురులెన్నో చెబుతాడు... బూచాడమ్మా బూచాడు... బుల్లిపెట్టెలో ఉన్నాడు... ‘మేడ మీద చూడమంట... ఒక లవ్ జంట లవ్ జంట’ అని ముదిరిపోయిన మణిరత్నం పిల్లలు ఇంకా సినిమాల్లోకి రాని రోజులు అవి. పిల్లలు ఎంత తెలివి కలిగి ఉండాలో అంత తెలివితోటి ఎంత అమాయకత్వం నిండి ఉండాలో అంత అమాయకత్వం తోటి తెలుగు సినిమాల్లో పాడారు. ‘పిల్లలూ దేవుడూ చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే’, ‘తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగ కరుణించే దైవము నీవే’... వాళ్లు ఇలాంటి పాటలే పాడారు. పాత్రౌచిత్యం అని ఒకటుంటుంది. దానిని పాటించేవారు కవులు, రచయితలు. ఆత్రేయ ఈ విషయంలో ఇంకా నిష్ఠను పాటించేవారు. బడిపంతులు సినిమాలో బేబీ శ్రీదేవిగా నేటి శ్రీదేవి ఒక పాట పాడాలంటే టెలిఫోన్‌కు మించిన సాధనం ఏముంది? పిల్లలందరూ అందులో బూచాడున్నాడనే అనుకుంటారు. అందుకే ఆత్రేయ ‘బూచాడమ్మా బూచాడు’ అని చాలా సులభమైన పల్లవితో మొదలెడతారు. ‘గురుగురుమని సొద పెడతాడు... హల్లో అని మొదలెడతాడు’ అని అంటుందా చిన్నారి కంప్లయినింగ్గా. కాని పిల్లలకు బోధించాల్సిన మంచిమాట ఆత్రేయ ఆ పొన్నారి నోటి నుంచి చెప్పిస్తాడు. ‘ఢిల్లీ మద్రాస్ హైదరాబాద్ రష్యా లండన్ జపాన్... ఎక్కడికైనా వెళుతుంటాడు.. ఎల్లలు మనసుకు లేవంటాడు... ఒకే తీగపై నడిపిస్తాడు... ఒకే ప్రపంచం అనిపిస్తాడు’.... ఈ పాటలు ఇప్పుడు ఎవరు చెప్తున్నారు. ఏ పిల్లలు ఇప్పుడు వింటున్నారు?చిత్రం: బడి పంతులు (1972) సంగీతం: కె.వి.మహదేవన్ రచన: ఆత్రేయ గానం: పి.సుశీల ఈ జీవన తరంగాలలో... ఆ దేవుని చదరంగంలో... / ఎవరికి ఎవరు సొంతము... ఎంత వరకీ బంధము... కడుపు చించుకు పుట్టిందొకరు... కాటికి నిన్ను మోసేదొకరు... తలకు కొరివి పెట్టేదొకరు... ఆపై నీతో వచ్చేదెవరు..? భవ సాగరం అన్నారు పండితులు. బతుకు సంద్రం అన్నారు పల్లీయులు. జీవన తరంగాలు అన్నది ఒక రచయిత్రి. దేవుని చదరంగం అన్నాడొక కవి. ఎవరు ఎన్ని చెప్పినా అనూహ్యమైన మలుపులను దాచుకుని మెలికలు తిరుగుతూ పోయే జీవన రహదారిని చూసి ప్రతి ఒక్కరూ జాగురూకత చెప్పినవారే. భద్రం భద్రం... అంటూ హెచ్చరికలు చేసినవారే. అన్నీ సజావుగా ఉంటేనే జీవితం కూడా సజావుగా ఉంటుంది. చదరంగంలో గడి మారితే విధి ఒక ఎత్తు పన్నితే అది అతలాకుతలం అవుతుంది. మళ్లీ గడులన్నీ సర్దుకోవడానికి సమయం పడుతుంది. సహనం కావాల్సి వస్తుంది. యద్దనపూడి సులోచనరాణి రాసిన జీవన తరంగాలు నవల పెద్ద హిట్. దాని ఆధారంగా తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా పెద్ద హిట్. కన్నతల్లి చనిపోతే కన్నకొడుకు దొంగలా పారిపోతుండగా ఆమె శవయాత్రలో ఈ పాట వస్తుంది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కొడుకు ఆ శవయాత్రలో కలుస్తాడు. ఆ పాడె తన తల్లిదే అని తెలియక భుజం ఇస్తాడు. ‘తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది’... అని ఆత్రేయ ఆ సన్నివేశాన్ని తన పాటలో వెలిగిస్తాడు. జె.వి.రాఘవులు విద్వత్తు ఉన్న సంగీతకారుడు. ఘంటసాలకు శిష్యుడు. ఆయన కెరీర్లో ది బెస్ట్.... మన జీవన తరంగాలలో తారసపడే ఈ జీవన తరంగాలలో... ఆ దేవుని చదరంగంలో...చిత్రం: జీవనతరంగాలు (1973) సంగీతం: జె.వి.రాఘవులు రచన: ఆత్రేయ గానం: ఘంటసాల -
'సాంగ్'రే బంగారు రాజా
సంగీత ప్రపంచంలో ‘భారతరత్న’ అందుకున్న తొలి వ్యక్తి కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి. ఆమె కొన్ని చిత్రాల్లో నటించారు కూడా. తమిళంలో ‘సేవాసదనం’ (1938) ఆమె తొలిచిత్రం కాగా, హిందీలో ‘మీరాబాయి’ (1947) ఆమెను యావద్దేశానికీ చేరువ చేసిన చిత్రం. పట్నంలో శాలిబండ... పేరైనా గోలకొండ... చూపించు చూపునిండా పిసల్ పిసల్... బండ... పట్నంలో శాలిబండ... పేరైనా గోలకొండ... ‘చికిలింత చిగురు సంపెంగె గుబురు చినదాని మనసు చినదాని మీద మనసు’ అని రాశారు మల్లాది రామకృష్ణశాస్త్రి. ‘మనసున మల్లెల మాలలూగెనె’ అన్నారు కృష్ణశాస్త్రి. ‘పడుచుదనం రైలు బండి పోతున్నది’ అన్నారు ఆరుద్ర. ప్రాంతాన్నిబట్టి భాష. భాషను బట్టి నుడి వస్తాయి. అయితే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన కలం తాలూకు సౌరభం తెలియాలంటే దాశరథి రావాల్సి వచ్చింది. ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ’ హైదరాబాదీ ఉర్దూ ప్రభావాన్ని ఆయన చూపించాడు. ‘రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్’ అని రాయాలంటే ఆ ప్రాంతంలో పెరిగిన సినారెకు తప్ప వేరెవరికి సాధ్యమైంది.? అన్ని ప్రాంతాల కవులూ తెలుగు పాటనూ తెలుగు సినీ బాటనూ ప్రభావితం చేశారు. ఈ ప్రయాణంలో ఒక సర్ప్రైజ్ ‘పట్నంలో శాలిబండ’. శాలిబండ, పిసల్‌బండ, బోరబండ... ఇవి హైదరాబాద్ వారికే తెలుస్తాయి. దక్కన్ ప్రాంతానికి చెందిన వేణుగోపాలాచార్యులు ఈ పాట రాసే అవకాశం రావడంతోటే ఆ పేర్లను గమ్మత్తుగా పరిచారు. సంగీతం అందించిన బి.శంకర్ కూడా హైదరాబాదీనే కావడంతో ట్యూన్ బ్రహ్మాండంగా కుదిరింది. ఎల్.ఆర్.ఈశ్వరి గొంతు యథావిధి. ఇలా ఇప్పటికీ చిటికెలు వేయించే పాటల్లో ఒకటిగా నిలిచింది.చిత్రం: అమాయకుడు (1968) సంగీతం: బి.శంకర్ రచన: వేణుగోపాలాచార్యులు గానం: ఎల్.ఆర్.ఈశ్వరి ఓ నాన్నా... నీ మనసే వెన్న అమృతం కన్నా... అది ఎంతో మిన్నా... అమ్మ మీద పాటలకు దిగులు లేదు కాని నాన్న మీద పాటలు తక్కువ. నాన్నంటే అధికారం, దర్పం, పెత్తనం, అజమాయిషీ... అమ్మతో ముడిపడ్డ సెంటిమెంట్, అమ్మ అనగానే వచ్చే ఎమోషన్ నాన్న విషయంలో రాదు. కాని నాన్న ఏం పాపం చేశాడు కనుక? కష్టపడతాడు. మాటలు పడతాడు. సంపాదన కోసం ఆందోళన చెందుతాడు. చివరకు ఎలాగోలా తన కుటుంబాన్ని రెక్కల కింద సాదుకుంటాడు. అయినప్పటికీ పిల్లల చేతిలో భంగపడ్డ తండ్రులు అప్పుడూ ఉన్నారు ఇప్పుడూ ఉన్నారు. ‘ధర్మదాత’లో ఉండేది అలాంటి తండ్రే. ఇది తమిళంలో శివాజీ గణేశన్ నటించిన ‘ఎంగ ఊర్ రాజా’కు రీమేక్. అక్కినేని ఆ పాత్ర పోషించారు. అన్నీ బాగుంటే తండ్రిని పొగిడి కాస్త చెడితే తండ్రిని వదిలిపెట్టి అప్పుడూ తండ్రే ఇప్పుడూ తండ్రే... తేడా వచ్చింది పిల్లల్లో తప్ప తండ్రిలో కాదు. నాన్నను పొగిడే ఈ పాటను సినారె రాశారు. అంత్యప్రాసలతో పాటను రాయడం ఆయనకు వచ్చు. నాన్న.. వెన్న... మిన్న... పల్లవి కంటే చరణం బాగుంటుంది. ‘ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో పరమాణ్ణం మాకు దాచి ఉంచావు’.... నాన్న కష్టం మీద ఇంకా వందల పాటలు రాయాల్సి ఉంది. వేల భారతాలు రచించాల్సి ఉంది. అసలు సిసలు వెన్నమనిషి నాన్న. ఎన్నదగిన మనిషి నాన్న.చిత్రం: ధర్మదాత (1970) సంగీతం: టి.చలపతి రావు రచన: డా.సి.నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల మాయదారి సిన్నోడు... నా మనసే లాగేసిండు... లగ్గమెప్పుడురా మావా అంటే... మాఘమాసం యెల్లేదాక మంచిరోజు లేదన్నాడే... ఆగేదెట్టాగా... అందాకా ఏగేదెట్టగా... హిట్ పెయిర్ అంటే అక్కినేని, సావిత్రి అనంటారు. ఎన్టీఆర్, జయలలిత అని కూడా అంటారు. హిట్ పెయిర్ అంటే జ్యోతిలక్ష్మి, ఎల్.ఆర్.ఈశ్వరి కూడా. స్క్రీన్ మీద స్ట్రిప్ టీజ్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. గళంలో వలువలు వదిలేయాంటే ఎంతో దమ్ము కావాలి. ఈ పని వీళ్లిద్దరూ చేశారు. ఒకరికి మరొకరు భుక్తిగా మిగిలారు. ఇద్దరు స్త్రీల విజయం ఇది. మనుగడలో మునిగిపోకుండా నిలబడగలిగిన విజయం. ‘మరి లగ్గమెప్పుడ్రా మామా’ అని ఎల్.ఆర్.ఈశ్వరి కవ్విస్తే జ్యోతిలక్షి అందమైన కొప్పు పెట్టుకొని వేదిక మీద చకాలున లంఘిస్తుంది. తప్పెట మోగి జానపదం ఝల్లుమంటుంది. ‘అమ్మ మాట’ సినిమా కోసం గీత రచయిత సి.నారాయణరెడ్డి, సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు కూర్చునప్పుడు ఎంతకీ పాట సెట్ కాలేదట. లంచ్ కోసం సినారె బయటకెళితే రమేశ్ నాయుడు ఏం చేయాలో తోచక సినారె ప్యాడ్ మీద ఆయన రాసుకున్న రఫ్ నోట్స్‌నే పల్లవి అనుకుని ఈ పాట కట్టారట. సినారె అది విని అబ్బురపడి చరణాలు రాశారు. ‘సింతచెట్టెక్కి సిగురులు కోస్తుంటే సిట్టి సిట్టి గాజుల్లు తాళం యేస్తుంటే’... చూసేవాడు చెలరేగి ఇప్పటికిప్పుడు తీసుకెళ్లి లగ్గం చేసుకోవాలి. కాని వీడేమిట్రా బాబూ మొద్దులా ఉన్నాడు బుద్ధావతారంలా వంకలు పెడుతున్నాడు అని కంప్లయింట్ చేసే ఈ పాట మగవాళ్లకు ఆడవాళ్ల దూకుడు తెలియజేసే హైడోస్ శాంపిల్. వాళ్ల కవ్వింపుకు రిటన్ ఎగ్జాంపుల్. కావాలంటే మల్లమ్మనడగండి... కావమ్మనడగండి... రత్తమ్మనడగండి... అదే మాట చెప్తారు.చిత్రం: అమ్మమాట (1972) సంగీతం: రమేశ్‌నాయుడు రచన: సినారె గానం: ఎల్.ఆర్.ఈశ్వరి