సాంగ్‌రే బంగారు రాజా
మాధవపెద్ది సత్యం పేరు వినగానే వెంటనే ‘మాయాబజార్’లో ఆయన పాడిన ‘వివాహభోజనంబు’ పాట గుర్తుకొస్తుంది. నిజానికి ఆయన నటుడిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. రామదాసు (1946) చిత్రంలో కబీర్ పాత్ర పోషించారు. అయితే, ఆ తర్వాత గాయకుడిగా రాణించారు.
సిపాయి సిపాయి.... సిపాయి సిపాయి....
నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో...
ఈ వాలు కనులనడుగు అడుగు చెబుతాయి
సిపాయి ఓ సిపాయి...
సంగీత దర్శకుడు సి.రామచంద్ర అంటే సూపర్‌స్టార్. ఆయన పేరు
చెప్తే మహామహా గాయకులే భయపడేవారు. హిందీలో ఆ రోజుల్లోనే ‘మేరీజాన్ మేరీజాన్ సండే కె సండే’ వంటి సూపర్‌హిట్స్ ఇచ్చాడాయన. ఆయనే హిందీలో ‘అనార్కలీ’ సినిమాకు ‘ఏ జిందగీ ఉసీకి హై’... పాట ఇచ్చి పెద్ద హిట్ చేశాడు.
అలాంటి సి.రామచంద్ర తెలుగులో ‘అక్బర్ సలీం అనార్కలి’కి పని చేయడం పాటలు చేయడం చెప్పాల్సిన విశేషం. సినారె రచన, సుశీల-రఫీల గానం సుమధుర అనుభవం. తన తరం హీరోలలో ఎవరికీ దక్కని అదృష్టం నటించిన బాలకృష్ణ పొందారు. రఫీ గొంతుకు లిప్ మూవ్‌మెంట్ ఇవ్వడం మరి గొప్పే కదా.చిత్రం: అక్బర్ సలీమ్ అనార్కలీ (1978)
సంగీతం: సి.రామచంద్ర
రచన: సినారె; గానం: రఫీ, సుశీల
ఛాంగురే బంగారు రాజా... ఛాంగు ఛాంగురే బంగారు రాజా...
మజ్జారే మగరేడా... మత్తై వగకాడా.. అయ్యారే... నీకే మనసియ్యాలని ఉందిరా...
రాక్షస కన్యలకు కూడా మనసుంటుంది. మరులుంటాయి. నచ్చినవాడిని వలచడానికి సర్వహక్కులు ఉంటాయి. హిడింబి రాక్షస కన్యే. ఆ పేరు వింటేనే మనకు బలం, ధీమా స్ఫురణకొస్తాయి. అలాంటి కన్యకు భీముడు కాకుండా ఇంకెవరు నచ్చుతారు. హిడింబి తాను వలచిన భీముడిని ఆకర్షిస్తూ పాట రాయాలి.
ఇది దర్శకుడు ఎన్టీఆర్ కోరిక. రచయిత సినారె దానిని అందుకున్నారు. కొత్త కొత్త పదాలతో పాటను మెరిపించారు. ‘కైపున్న మచ్చకంటి చూపు... అది చూపు కాదు పచ్చల పిడిబాకు’... వింటుంటే గుండెల్లో తియ్యగా దిగబడినట్టుంటుంది. జిక్కి, టి.వి.రాజు చేసిన స్కోర్ ఇది.చిత్రం : శ్రీకృష్ణ పాండవీయం (1966)
నయనాలు కలిసె తొలిసారి...
హృదయాలు కరిగె మలిసారి...
తలపే తరంగాలూరి...
పులకించె మేను ప్రతిసారి...
సలిల్ చౌధురి సంగీతం చేసిన తెలుగు సినిమా ఇది. సలిల్ చౌధురి అంటే హిందీలో మధుమతి, ఆనంద్ వంటి సినిమాలు గుర్తుకు రావాలి. అలాగే ముకేశ్‌కు జాతీయ అవార్డు తెచ్చి పెట్టిన ‘రజనీ గంధ’లోని పాట ‘కహి బార్ యూహీ దేఖాహై’ కూడా గుర్తుకు రావాలి. ఆ పాటనే కొంచెం మార్చి డ్యూయెట్‌గా చేసి ‘నయనాలు కలిసె తొలిసారి’గా అందించాడాయన. తెర మీద విజయలలిత, చలం నటించారు. మంచి యుగళగీతాలలో ఇది ఒకటి.చిత్రం: చైర్మన్ చలమయ్య (1974)
సంగీతం: సలిల్ చౌధురి; రచన: ఆరుద్ర
గానం: బాలు, సుశీల,
స్వరరాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే
ప్రాప్తే వసంతే త్రికాలికే
పలికే కుహు గీతిక
గాన సరసీ రుహమాలిక...
రవిని దక్షిణాదిన బాంబే రవి అనేవారు. సంగీత దర్శకుడిగా హిందీలో ‘బార్‌బార్ దేఖో హజార్ బార్ దేఖో’ వంటి పెద్ద హిట్స్ ఎన్నో ఇచ్చాడు. యశ్ చోప్రా, బి.ఆర్.చోప్రా సినిమాలకు పాటలు ఈయనే చేశాడు. హిందీ నిర్మాత దర్శకులతో పడలేక కేరళ చేరి అక్కడ మలయాళ సినిమాలు చాలావాటికి సంగీతం ఇచ్చాడు.
అక్కడ హిట్ అయిన ఒక సినిమాను క్రాంతి కుమార్ తెలుగులో ‘సరిగమలు’గా తీస్తే సంగీతం రవే అందించాడు. సరిగమలు సరిగ్గా ఆడలేదు. కాని సంగీతాభిమానులందరికీ ఈ పాట ఇష్టం. ఏసుదాస్ గానం పాటకు బలం. వేటూరి కలం కమర్షియల్ పాటలకు మాత్రమే కాదు ఇలాంటి ఉన్నత సందర్భాల గీతానికి కూడా అని ఈ పాట నిరూపిస్తుంది.చిత్రం: సరిగమలు (1994)
సంగీతం: రవి
రచన: వేటూరి ; గానం: ఏసుదాస్
ప్రేమలేఖ రాశా నీకంది ఉంటది
పూలబాణమేశా ఎద కంది ఉంటది...
నీటి వెన్నెల వేడెక్కుతున్నది...
పిల్లగాలికే పిచ్చెక్కుతున్నది...
మాఘమాసమా వేడెక్కుతున్నది...
మల్లెగాలికే... వెర్రెక్కుతున్నది...
హంసలేఖ కన్నడలో టాప్ మ్యూజిక్ డెరైక్టర్. ఆయన మ్యూజిక్ ఇచ్చిన ‘ప్రేమలోక’ కన్నడ సినిమా తెలుగులో ‘ప్రేమలోకం’గా విడుదలైతే పాటలు పెద్ద హిట్ అయ్యాయి. తెలుగులో నేరుగా కొద్ది సినిమాలే చేసినా హిట్ పాటలు ఇచ్చాడు. ‘ముత్యమంత ముద్దు’ యండమూరి రాసిన నవల. దానిని రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో కె.ఎస్.రామారావు సినిమాగా తీశారు. హంసలేఖ పాటలన్నీ ఆకట్టుకున్నాయి. ప్రేమలేఖ రాశా... ఇంకా హిట్.చిత్రం: ముత్యమంత ముద్దు (1989)
సంగీతం: హంసలేఖ
గానం: బాలు, జానకి రచన: వేటూరి