సంగీతానికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. ఇది మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని నయం చేయడమే గాక ఉల్లాసంగా ఉండేలా చేస్తుందని చెబుతుంటారు. ఇవాళ ప్రపంచ సంగీత దినోత్సవం(జూన్ 21న) పురస్కరించుకుని దీని ప్రాముఖ్యత గురించి, ఆరోగ్య ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
శ్రావ్యమైన సంగీతం విభిన్న సంస్కృతులను, సరిహద్దులను దాటి భాషలకు అతీతంగా అందర్నీ ఒక్కటి చేస్తుంది. దాని మాధుర్యానికి ఎవ్వరైన పరవశించిపోవాల్సిందే. మంచి రమ్యమైన సంగీతం మనసు స్వాంతన చేకూర్చి.. శాంతిని అందించగలదు కూడా. అలాంటి ఈ సంగీతం మన అనారోగ్య సమస్యలను నయం చేసే శక్తి ఉందని చెబుతున్నారు నిపుణులు. ప్రతి రోజు మంచి సంగీతం వినడం వల్ల జ్ఞాపకశక్తి, హీలింగ్ రేటు పెరుగుతుందట. ఇదెలా నయం చేస్తుందంటే..
సంగీతం ప్లే చేసినప్పుడూ ఆ తరంగాలు మన చెవిని తాకగానే మన శరీరం ఒక విధమైన విశ్రాంతి మూడ్‌లోకి వెళ్లిపోతుంది. దీంతో రక్తం సులభంగా శరీరం మంతట ప్రసరిసించి..హృదయస్పందన రేటు, రక్తపోటు స్థాయిలు తగ్గడమే గాక కార్డిసాల్ స్టాయిలు కూడా తగ్గడం జరుగుతుంది. అలాగే రక్తంలోని సెరోటోనిన్ ఎండార్ఫిన్ స్థాయిలను పెంచుతుంది.
మానసిక స్థితిని పెంచుతుంది. డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. సంగీతం మెదుడలో డోపమైన హార్మోన్ ఉత్పత్తిని పెంచి ఆందోళన, డిప్రెషన్ వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. నిద్రపోయేముందు సంగీతం మంచి ఓదార్పునిచ్చి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
శారీరీక అసౌకర్యం, నొప్పి వంటి వాటిని దూరం చేసే శక్తి సంగీతానికి ఉంది. సంగీతం వల్ల మెదడు ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
పలు అధ్యయనాల్లో మన మనసు, శరీరాలపై ప్రశాంతమైన ప్రభావాన్ని చూపించాయి. ఇది హృదయ స్పందన రేటు, బీపీని, ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.
అంతేగాదు సంగీతాన్ని వినడం వల్ల ప్రతికూల ఆలోచనలు దూరమై సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. అంతేగాదు పరధ్యానాన్ని అడ్డుకుని అటెన్షన్‌తో ఉండేలా చేస్తుంది.
(చదవండి: పాశ్చాత్యులకు యోగాను పరిచయం చేసింది ఈయనే..! ఏకంగా 60 దేశాలకు..)
Comments
Please login to add a commentAdd a comment