సాంగ్‌రే బంగారు రాజా
వేటూరి రేడియో కోసం రాసిన సంగీత నాటిక ‘సిరికా కొలను చిన్నది’
అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం
పుట్టిన రోజున మీ దీవనలే వెన్నెల కన్నా చల్లదనం
మల్లెల వంటి మీ మనసులో చెల్లికి చోటుంచాలి...
ఏ మగాడికైనా స్త్రీ- ముగ్గురు స్త్రీల ద్వారా తెలియాలి. తల్లి ద్వారా, భార్య ద్వారా, చెల్లెలి ద్వారా. తల్లి మీద ఫిర్యాదులు ఉండొచ్చు. భార్య పట్ల అభ్యంతరాలుండొచ్చు. కాని చెల్లెలంటే వేరే ఏమీ ఉండవు. ప్రేమే. చిన్న పట్టీలు వేసుకున్నప్పటి నుంచి చూసి ఉంటాడు... బుజ్జి బుజ్జి గౌన్లు తొడుక్కున్నప్పటి నుంచి చూసి ఉంటాడు... తను ఎత్తుకొని బజారుకు తీసుకెళితే కళ్లు చక్రాల్లా తిప్పుతూ బజారంతా చూడటం చూసి ఉంటాడు...
ఆ చెల్లెలంటే అతడికి ప్రేమ. మురిపెం. గారాబం. ఆ చెల్లికి? అన్నయ్యే అపురూపం. నాన్నకు నివేదించలేనివి అమ్మకు చెప్పుకోలేనివి అన్నీ అన్నయ్యకు చెబుతుంది. హక్కుగా అడుగుతుంది. అధికారం చలాయిస్తుంది. అందుకే ప్రతి చెల్లికి మంచి అన్నయ్య దొరకడం ఎన్నో జన్మల పుణ్యఫలం. ‘ఆడపడుచు’ సినిమాలో చంద్రకళకు ఇద్దరన్నయ్యలు.
ఎన్టీఆర్, శోభన్‌బాబు. కాని పరిస్థితులు వికటించి తను వారికి దూరమవుతుంది. అంధురాలిగా మారుతుంది. ఆమెలో వారి పట్ల ఉన్న అనురాగమే వారితో ఆమెను తిరిగి కలుపుతుంది. దాశరథి రచనకు టి.చలపతిరావు సంగీతం మాధుర్యం తీసుకువస్తే పి.సుశీల కంఠంలోని లాలిత్యం అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని సన్నటి రాఖీదారంలా శ్రోతలతో ముడి వేసేస్తుంది. తెలుగులో ఇది తప్పనిసరిగా మిగిలే అనురాగభరితగీతం.చిత్రం: ఆడపడుచు (1967)
సంగీతం: టి.చలపతి రావు
రచన: దాశరథి
గానం: పి.సుశీల
‘భైరవద్వీపం’లోని ‘శ్రీ తుంబురనారద నాదామృతం’ పాటని కంపోజ్ చేయడానికి ఇన్‌స్పిరేషన్ ‘శివశంకరీ’ పాట. ‘దర్బారీ కానడ’ రాగంలో పెండ్యాల గారు ‘శివశంకరీ’ పాటను కంపోజ్ చేస్తే, పల్లవి, మొదటి చరణం వరకు ‘అభేరి’ రెండవ చరణంలో షడ్జమానికి హంసధ్వని, రిషభానికి కేదారగౌళ, గాంధారానికి సరస్వతి, దైవతానికి చక్రవాకం, నిషాదానికి కల్యాణిరాగాలలో ‘శ్రీతుంబుర నారద నాదామృతం’ పాటని కంపోజ్ చేశాను.
- మాధవపెద్ది సురేష్