
శిశువుకు జన్మనిచ్చిన వైనం
ఉత్తర కన్నడ జిల్లాలో ఉదంతం
యశవంతపుర(కర్ణాటక): చెల్లెలితో అన్న శారీరకంగా కలవటంతో( sister) బిడ్డకు జన్మనిచ్చిన ఘటన ఉత్తర కన్నడ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ముండగోడ తాలూకా కుందర్గి గ్రామంలో ఈ ఘటన జరిగింది. అదే గ్రామానికి చెందిన 19 సంవత్సరాల వయసున్న యువకుడు 10వ తరగతి చదువుతున్న చెల్లెలు యల్లాపురలోని బంధువుల ఇంటికి వెళ్లారు.
ఆ సమయంలో యువకుడు తన చెల్లిని రెచ్చగొట్టి శారీరకంగా కలిసినట్లు పోలీసు విచారణలో బయట పడింది. అన్నతో 9 నెలల క్రితం శారీరకంగా కలిసినట్లు బాధితురాలు వైద్యులకు సమాచారం ఇచ్చింది. బడికి వెళుతున్న కూతురు ఒక్కసారిగా ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. జన్మనిచ్చిన శిశువులో ఆరోగ్య సమస్యలు ఉన్న కారణంగా మెరుగైన చికిత్స కోసం కారవార జిల్లా ఆస్పత్రికి తరలించారు.
10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
యశవంతపుర: పదో తరగతి చదువుతున్న విద్యార్థిని అత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరకన్నడ జిల్లా కారవారలో జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతూ బాలికల హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థిని అక్కడే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి లేని కారణంగా బాలిక బాలమందిరంలో చదువుకుంటోంది. ఆమె గదిలో ఒక్కరే ఉన్నప్పుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలాన్ని కారవార పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.