అందుకే దేవిశ్రీని రాక్‌స్టార్‌ అనేది! | World Music Day 2020: Devi Sri Prasad Post A Special Video | Sakshi
Sakshi News home page

మ్యూజిక్‌ డే: దేవిశ్రీ సూపర్బ్‌ షో

Published Sun, Jun 21 2020 12:28 PM | Last Updated on Sun, Jun 21 2020 12:46 PM

World Music Day 2020: Devi Sri Prasad Post A Special Video - Sakshi

హైదరాబాద్‌: అంతర్జాతీయ సంగీత దినోత్సవం సందర్భంగా సంగీత అభిమానులకు రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్‌ వీడియోను విడుదల చేశారు. అంతేకాకుండా ఈ వీడియోను ఫాదర్స్‌ డే సందర్భంగా తన తండ్రి సత్యమూర్తికి, సంగీత పాఠాలు నేర్పిన తన గురువుకు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సంగీత ప్రియుల్ని, ముఖ్యంగా మాస్‌ అండ్‌ ఫాస్ట్‌ బీట్‌ సాంగ్స్‌ను అభిమానించే వారికి బాగా నచ్చుతోంది. (‘హేయ్‌..సత్తి నా పాట విన్నావా?')

ఎలాంటి సంగీత వాయిద్య పరికరాలు ఉపయోగించకుండా తన బృందంతో కలసి ప్లాస్టిక్‌ కుర్చీలు, ట్రంకు పెట్టెలనే డ్రమ్స్‌గా ఉపయోగించుకొని అందరినీ ఉర్రూతలూగించే సూపర్బ్‌ ప్రదర్శన చేశారు. అయితే ఈ ప్రదర్శన తాజాగా చేసింది కాదు. గతంలో యూఎస్‌ఏలో జరిగిన ఓ మ్యూజికల్‌ షోలో చేసిన పర్ఫార్మెన్స్‌కు సంబంధించిన వీడియోను తాజాగా తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇక ఈ క్రేజీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రతిభకు, క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. (‘మా నాన్న నవ్వు.. మా బిడ్డ చిరునవ్వు’)

రాళ్లు రప్పలతో కూడా సంగీతాన్ని అందించొచ్చని దేవిశ్రీ మరోసారి నిరూపించాడని అందుకే అతడిని రాక్‌స్టార్‌ అంటారని ఓ అభిమాని కామెంట్‌ చేశాడు. ఇక లాక్‌డౌన్‌ సమయంలో తన పాత షోలకు సంబంధించిన వీడియోలను ఒక్కొక్కటి విడుదల చేస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు దేవిశ్రీ. గతంలో తన తండ్రి సత్యమూర్తి జయంతి సందర్బంగా మ్యూజికల్‌ విషెస్‌ తెలుపుతూ విడుదల చేసిన వీడియో అందరినీ తెగ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. (సీతు పాప సింపుల్‌ యోగాసనాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement