
డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇటీవలె (మార్చి 19)న 69వ పుట్టిన రోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది లానే ఈసారి కూడా తన సొంత విద్యాసంస్థ అయిన విద్యానికేతన్‌లో మోహన్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో అక్కడి ప్రాంగణమంతా పండుగను తలపించింది. ఈ సందర్భంగా మంచువారమ్మాయి, మోహన్‌బాబు ముద్దుల తనయ మంచు లక్ష్మీ తన డ్యాన్స్ స్టెప్పులతో మరింత హుషారెత్తించింది. తీన్మార్ స్టెప్పులతో ఇరగదీసేసింది. దీనికి సంబంధించిన వీడియోను మంచు లక్ష్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
కాగా మోహన్‌బాబు బర్త్‌డే వేడుకల్లో కుటుంబం అంతా ఎంతో సంబరంగా పాలు పంచుకోగా, మంచు మనోజ్ మాత్రం కనబడలేదు. దీంతో మనోజ్ ఎక్కడ కొందరు నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవలె మనోజ్ మరో పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మోహన్‌బాబు దగ్గరి బంధువు కుమార్తెతోనే మనోజ్ వివాహం జరగనుందని, ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని రూమర్స్ వినింపించాయి. అయితే దీనిపై మంచు ఫ్యామిలీ స్పందిచకపోవడంతో ఈ వార్తలు నిజమేనంట్నునారు నెటిజన్లు. ప్రణతి అనే అమ్మాయిని మనోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాల విడిపోతున్నట్లు గతంలో మనోజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
చదవండి : నాన్న.. మీరు లేకుండా నేను లేను: మంచు లక్ష్మీ
మరోసారి తొందరపడ్డ చిరంజీవి..షాక్‌లో ఫ్యాన్స్!
Comments
Please login to add a commentAdd a comment