
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఏ పెళ్లి ఇంట్లో చూసిన పెద్ద ఎత్తున హడావిడీ కనిపిస్తోంది. సంగీత్‌లు, మెహిందీ, హల్దీ ఫంక్షన్లతో కళకళలాడుతున్నాయి. పెళ్లిలో వధువు లేదా వరుడు, వారి స్నేహితులు, బంధువులు డ్యాన్స్ చేయడం సాధారణమే. ఈ మధ్యకాలంలో ఇలాంటి వేడుకలు మరీ ఎక్కువయ్యాయి కూడా. అయితే తాజాగా ఓ సంగీత్ ఫంక్షన్‌లో తోడి పెళ్లి కూతురు డ్యాన్స్ అదరగొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫేమస్ పంజాబీ జానపద గీతం చిట్ట కుక్కడ్ పాటకు ఉత్సాహంగా స్టెప్పులేసింది. లైట్ కలర్ లెహంగాతో ముస్తాబయి అందమైన చిరునవ్వుతో అంతకంగా అందంగా డ్యాన్స్ చేసింది. సూపర్ స్టెప్పులతో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరిని మంత్ర ముగ్దులను చేసేసింది. తన పక్కన మరో ఇద్దరు యువతులు డ్యాన్స్ చేస్తున్నప్పటికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. యువతి డ్యాన్స్ చేస్తుంటే ఆమె చుట్టూ ఉన్న అతిథులు ఉత్సాహపరిచారు. ఈ వీడియోను ఫ్యాబ్ వెడ్డింగ్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోను మీరు కూడా చూడండి.
చదవండి: Viral Video: ఎయిర్‌పోర్టు అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన శునకం
Comments
Please login to add a commentAdd a comment